తాటి.. తప్పుదోవ పట్టొద్దు
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): ‘‘ఏ నాయకుడైనా సరే.. తనపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయవద్దు. నీ గెలుపు కోసం రాత్రిబవళ్లు శ్రమించిన పార్టీ కార్యకర్తలను గాలికొదిలేసి, ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నా సరికాదు. నువ్వు తప్పుదోవ తొక్కొద్దు. పార్టీలోనే కొనసాగుతూ ప్రజ లకు చేతనైనంత సేవలందించు’’ అని, ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లును ఉద్దేశించి వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ అశ్వారావుపేట నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో శనివా రం జరిగింది. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా ఊహాగానాలు విన్పిస్తున్న నేపథ్యంలో పార్టీ మండల కన్వీనర్ సారేపల్లి శేఖర్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటైంది.
పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్షమనేది లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ పార్టీ లాక్కుంటోందని విమర్శించారు. ‘‘నిన్నటి వరకు టీఆర్‌ఎస్ నేతలపై ఒంటి కా లిపై లేచిన నీలో (తాటి వెంకటేశ్వర్లులో) ఇంతలోనే ఎంతో మార్పు రావడం దురదృష్టకరం. తాటికి చెప్పిన తరువాతనే ఈ సమావేశం ఏ ర్పాటు చేశాం. కానీ, తనకు సమాచారం లేదని ఆయనచెప్పడం బాధాకరం’’ అని అన్నారు. ‘‘నన్ను నమ్ముకున్న జిల్లా ప్రజల ఆశలను వమ్ము చేయబోను. వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా’’ అని చెప్పారు.
నేను ఎప్పటికీ వైఎస్‌ఆర్ సీపీలోనే, పొంగులేటి వెంటే : పాయం
తాను ఎప్పటికీ వైఎస్‌ఆర్ సీపీలోనే, పొంగులేటి వెంటే ఉంటానని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ‘‘నేను ఎమ్మెల్యేగా గెలిచినప్ప టి నుంచి అనేక ప్రలోభాలు చూపుతూ ఫోన్లు వస్తున్నాయి. వాటిని నేను ఏనాడూ పట్టించుకోలేదు. నేను భవిష్యత్తులో వైఎస్‌ర్ కాంగ్రెస్ పార్టీలోనే, ఎంపీ పొంగులేటి వెంటే ఉంటా’’ అని ప్రకటించారు. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు. ‘‘టీఆర్‌ఎస్ పార్టీపై, మంత్రి తుమ్మలపై నాడు తీవ్ర విమర్శలు చేసిన నువ్వు.. ఇప్పుడు మాట మార్చేయడం దారుణం. పార్టీ నాయకుడు, కార్యకర్తలు, ప్రజలు నీపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేశావ్’’ అని విమర్శించారు.
తాటిపై నాయకులు, కార్యకర్తల ఆగ్రహం
ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనపై వైఎస్‌ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, నిరంజన్‌రెడ్డి, కొదమసింహం పాండురంగాచార్యులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గుగులోతు రవిబాబు, చండ్రుగొండ మండల అధ్యక్షుడు సారేపల్లి శేఖర్, జడ్పీటీసీ సభ్యులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, అంజి, ముల్కలపల్లి ఎంపీపీ కుర్సం శాంత మ్మ, పార్టీ నాయకులు జూపల్లి రమేష్, పుష్పాల చందర్‌రావు, జూపల్లి ఉపేందర్‌రావు, సాయం వీ రభద్రం, దార యుగంధర్, బండి కొమరయ్య మాట్లాడుతూ.
‘‘తాటి.. ఇది నీకు సరికాదు. మాకష్టాన్ని అమ్మకోవద్దు’’ అని అన్నారు. పార్టీ అనుబం ధ సంఘాల నాయకుల, కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్ట ర్ మట్టా దయానంద్, నాయకులు బీమా శ్రీధర్, పర్సా వెంక ట్, భూపతి అప్పారావు, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కీసరి కిరణ్‌కుమార్ రెడ్డి, భీమిరె డ్డి వెంకట్రామిరెడ్డి, ఎస్కే హమీ ద్, ఎస్డీ సైదా, చీదళ్ళ పవన్‌బాబు, సిహెచ్.రామరాజు, జం గా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.