సుధీర్‌రెడ్డి సేవలు మరువలేం
వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి
త్వరలోనే పార్టీ అధినేత పరామర్శకు వస్తారని వెల్లడి
నివాళులర్పించిన సజ్జల రామకృష్ణారెడ్డి
నయీంనగర్ : రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెంది న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్ రెడ్డి సేవలు మరువలేనివని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక రెడ్డి కాలనీలోని సుధీర్‌రెడ్డి ఇంట్లో శుక్రవారం ఆయ న పెద్దకర్మ నిర్వహించారు. పొంగులేటి, పార్టీ అధినేత వై. ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యా రు. సుధీర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుధీర్‌రెడ్డి తల్లిదండ్రులు అరుణాదేవి, ఎల్లారెడ్డిలను, సోదరుడు సుమన్‌రెడ్డిని పరామర్శించారు.
అనంతరం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సుధీర్‌రెడ్డి మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులతో సుధీర్‌రెడ్డి అనుబంధం వెలకట్టలేనిద న్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న వైఎస్సార్ ఆశయాల సాధన కోసం సుధీర్ కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. త్వరలోనే పార్టీ అధినేత జిల్లాకు వచ్చి సుధీర్‌రెడ్డి కుటుం బాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు.
వైఎస్సాఆర్‌సీపీ జిల్లా నాయకులు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, మునిగాల విలియమ్స్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ముని గాల కల్యాణ్‌రాజు, ఎ.కిషన్, నాయకులు కాయి త రాజ్‌కుమార్, చల్లా అమరేందర్‌రెడ్డి, నాగపూ రి దయాకర్, బొడ్డు శ్రవణ్, నాగవెల్లి రజనీ కాంత్, రఘు, విజయ్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ మాక్స్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువు మైల రఘోత్తంరెడ్డిని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంతకుముందు పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు మునిగాల విలియమ్స్ ఇంటికి వెళ్లారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతంపై పలువురు నాయకులతో చర్చించారు.
ప్రముఖుల పరామర్శ..
సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పరామర్శించారు. సుధీర్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ రెడ్డి యూత్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పలు పార్టీల నాయకులు వీరగంటి రవీందర్, బోడ డిన్నా, ఎం.సోమేశ్వర్‌రావు, తక్కళ్లపల్లి రాము, వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ తదితరులు సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.