Sudhir Reddy
-
‘జయలలిత డబ్బులు కాజేసి పైకొచ్చాడు’
మేడ్చల్ రూరల్: పాలమ్మి, పూలమ్మి మంత్రి మల్లారెడ్డి ధనవంతుడు కాలేదని, తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి, ఇతరుల ఆస్తులు కాజేసి పై కొచ్చాడని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రాత్రి మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుదీర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని అందులో డైయిరీ ఫాం ఏర్పాటు చేసుకుందన్నారు. ఆ సమయంలో పాలవ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడికి వెళ్లేవాడన్నారు. ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు సమాచారం అందడంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఓ చోట దాచిపెట్టగా మల్లారెడ్డి వాటిని దొంగిలించాడన్నారు. తన ఇంటి పక్కన ఉండే క్రిస్టియన్ విద్యా సంస్థల యజమానురాలిని మోసం చేసి కుటుంబీకులకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి కాజేశాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మైసమ్మగూడలో చెరువు శిఖం స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కాలేజీలు కట్టడం వల్లే మొన్న భారీ వర్షాల కారణంగా విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నాయకులు చివరకు తమ మేనిఫెస్టోను కాఫీ కొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి పదవీ వ్యామోహం ఎక్కువన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు పంచి, బెదిరింపులకు పాల్పడి గతంలో గెలిచారని కానీ ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. మంత్రి మల్లారెడ్డి, అతని బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉండి చేసిందేమీ లేదన్నారు. తమ వ్యాపారాల కోసమే మేడ్చల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాళాల, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి వెలుగులోకి తెస్తామని తనకు మేడ్చల్ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్‌గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్, నాయకులు రమణారెడ్డి, మహేశ్‌గౌడ్, పోచయ్య, వరదారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశ్‌గౌడ్, నడికొప్పు నాగరాజు, రంజిత్, రాహుల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సుధీర్ రెడ్డిపై పోస్టర్ల కలకలం
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ తెరవాలని నియోజకవర్గం మొత్తం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దినపత్రికలలో సైతం పాంప్లెంట్లు పెట్టి ఇంటింటికి పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. పోస్టర్లలో ప్రముఖ వ్యక్తులపై దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అగంతకులు కొంతమంది ఫోటోలని కూడా వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెంపపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పేరుతో ఒక ఫోన్ నెంబర్ వేసి దుండగులు పోస్టర్లు అతికించారు. పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరొకసారి మా నాయకునిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదీ చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్ -
ఎల్బి నగర్ నియోజకవర్గంను జయించేది ఎవరు..?
ఎల్బి నగర్ నియోజకవర్గం ఎల్బినగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన డి.సుధీర్ రెడ్డి 17251 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ ప్రత్యర్ది రామ్మోహన్ గౌడ్‌పై గెలుపొందారు. సుధీర్ రెడ్డి 2009లో మొదటి సారి గెలవగా, 2018లో రెండో సారి గెలిచారు. అయితే ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికే ఆయన అదికార టిఆర్ఎస్లో చేరిపోయారు. సుధీర్ రెడ్డికి 113117 ఓట్లు రాగా, రామ్మోహన్ గౌడ్‌కు 95766 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్, పరిసరాలలో అంతా టిఆర్ఎస్ ప్రభంజనం వీస్తే ఇక్కడ మాత్రం మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ ఐ గెలిచింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన పేరాల శేఖర్ రావుకు 21500ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుదీర్ రెడ్డి గతంలో కార్పొరేటర్‌గా కూడా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఎల్బినగర్ నియోజకవర్గంలో అనూహ్య విజయం సాధించారు. కృష్ణయ్య గట్టి పోటీలో ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అయినా, ఆయన టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధిగా ఘన విజయం సాధించడం విశేషం. కృష్ణయ్య తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి రామ్మోహన్ గౌడ్‌పై 12525 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. రెండువేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రెండుసార్లు రెడ్లు, ఒకసారి బిసి నేత గెలిచారు. ఎల్బి నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నగ్నపూజల మాంత్రికుడు.. టీడీపీ నాయకుడు
రేణిగుంట: చేతబడి చేశారేమో అనే అనుమానంతో ఓ మహిళ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి చెందిన మాసారపు సుబ్బయ్య అనే మాంత్రికుణ్ణి ఆశ్రయించగా.. ఆ మాంత్రికుడు ఆమెపై బలాత్కారం చేయబోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ నాయకుడైన సుబ్బయ్య శ్రీకాళహస్తిలో మాంత్రికుడిగా చెలామణి అవుతున్నాడు. రేణిగుంట మండలం కరకంబాడికి చెందిన 35 ఏళ్ల మహిళకు చేతబడి వదిలిస్తానని చెప్పిన సుబ్బయ్య ఈ నెల 14న పూజా సామగ్రితో ఆమె ఇంటికి వెళ్లాడు. పూజలో నగ్నంగా కూర్చోవాలని మాంత్రికుడు సుబ్బయ్య కోరగా.. ఆమె నిరాకరించింది. దీంతో చేతులతో బంధించి బలాత్కారం చేయబోగా.. ఆమె తప్పించుకుని గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కామ మాంత్రికుడు సుబ్బయ్యను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. గోర్లతో రక్కి... చాకుతో పొడవబోయాడు ఆ మహిళ పూజలో నగ్నంగా కూర్చునేందుకు నిరాకరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. మాంత్రికుడు ఆమె వీపు, చేతి భాగంలో గోర్లతో రక్కి బలాత్కారం చేసేందుకు యత్నించాడని రేణిగుంట అర్బన్ సీఐ సుబ్బారెడ్డి వెల్లడించారు. అతని నుంచి విడిపించుకుని బయటకు వచ్చేందుకు ఆ మహిళ ప్రయత్నించగా.. నిమ్మకాయలు కోసిన చాకుతో ఆమెను పొడిచేందుకు ప్రయత్నించాడని తెలిపారు. దీంతో ఆమె ప్రాణభయంతో గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోగా మాంత్రికుడు కారులో పరారయ్యాడన్నారు. పదేళ్ల క్రితం ఆటో డ్రైవర్.. ఇప్పుడు టీడీపీ నేత మాంత్రికుడు మాసారపు సుబ్బయ్య పదేళ్ల క్రితం ఆటో తోలుకుంటూ జీవనం సాగించేవాడు. తనకు మంత్ర శక్తులు తెలసునని స్థానికులను నమ్మించి శ్రీకాళహస్తిలోని బహదూరుపేటలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటి వద్దే తాయెత్తులు కడుతూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నాడు. తిరుపతి జిల్లా టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సుబ్బయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల వెంకటసు«దీర్‌రెడ్డికి నమ్మిన బంటుగా చక్రం తిప్పుతున్నాడు. సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులతో వచ్చే అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి వశపర్చుకుని వారి మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా నిలదీస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడతానంటూ భయపెట్టేవాడు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్‌రెడ్డి రాజకీయ భవిష్యత్ బాగుండాలని శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో సుబ్బయ్య తాంత్రిక పూజలు చేసి నరబలులు కూడా ఇచ్చాడన్న ఆరోపణలున్నాయి. దొంగ మాంత్రికుని ముసుగులో అకృత్యాలు, ఆగడాలకు పాల్పడుతున్న సుబ్బయ్య అక్రమాల డొంకను పోలీసులు కదిలించారు. సమగ్ర విచారణ చేపడుతున్నారు. విచారణలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగుచూసే వీలుంది. -
మేడ్చల్ టికెట్ నాదేనంటున్న సుధీర్ రెడ్డి.. మంత్రి మల్లారెడ్డి పరిస్థితేంటి?
మేడ్చల్: రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యే కావాలని కొంతమంది నాయకులు, స్థానాన్ని తిరిగి నెలబెట్టుకోవాలని మరి కొంతమంది నాయకులు రాజకీయాలు మొదలు పెట్టారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలతో కలిసి ఉన్న మేడ్చల్ ప్రజలు ప్రతీ ఎన్నికలో విలక్షణ తీర్పు ఇస్తున్నారు. నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న మేడ్చల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అభ్యర్థులకు అంగబలం, అర్థబలం ఉండి తీరాల్సిందే.. అన్ని పార్టీల్లో అంతర్గత పోరే.. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో టికెట్లు ఆశించే నాయకులు ఒకరి కంటే ఎక్కువగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మేడ్చల్‌కు మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడు పార్టీల నుంచి ఎనిమిది మంది బలమైన నాయకులు ఈ ఎన్నికల్లో ప్రధాన మూడు పార్టీల్లో టికెట్ కోసం పోటీపడుతున్నారు. మూడు టికెట్ల కోసం 8మంది పోటీలో ఉన్నారు. సీజన్ ప్రారంభం నాటికి మరి కొంతమంది వలస నాయకులు, జంప్ జలానీలు జాబితాలో చేరతారు. బీఆర్ఎస్లో ముగ్గురు.. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో ఎమ్మెల్యేగా సుదీర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో మల్లారెడ్డి తన టికెట్ బలవంతంగా చివరి నిమిషంలో లాక్కున్నారని, ఈసారి టికెట్ తనదేనని ఆయన పలు సమావేశాల్లో చెబుతున్నారు. టికెట్ ఈసారి తనదేనని సీఎం కేసీఆర్ తనకు ఇప్పటికే ఖరారు చేశారని మంత్రి మల్లారెడ్డి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య టికెట్ పోరు జోరుగా సాగుతోంది. సుదీర్‌రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆయన కుమారుడు శరత్‌చంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఉండి తమ గ్రూపు రాజకీయం జోరుగా సాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి పార్టీలో 80శాతం నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని తన స్టైల్ రాజకీయం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కీలకంగా ఉండి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసి ఓటమి పాలైన నక్క ప్రభాకర్‌గౌడ్ బీఆర్ఎస్ మేడ్చల్ టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి శిష్యుడిగా పేరుపొందిన ఆయన ఈసారి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో జోరుగా.. కాంగ్రెస్ పారీ్టలో ప్రతి ఎన్నికల్లో గ్రూపు రాజకీయం కనబడటం సాధారణం. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోయాక నియోజకవర్గ రాజకీయానికి కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అయ్యా క ధిక్కార స్వరం వినిపించి కాంగ్రెస్‌లో కనుమరుగయ్యారు. ఎన్నికల సీజన్ కావడంతో తిరిగి రేస్‌లోకి వచ్చాడు. నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు హరివర్ధన్‌రెడ్డి, వజ్రేయాదవ్లు ఈ సారి ఎన్నికల్లో టికెట్ సాధించేందుకు ఇద్దరు నేతలు ఎంపీ రేవంత్‌రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఇద్దరు నేతలు నియోజకర్గంలో ఎవరికి వారుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరివర్ధన్‌రెడ్డి జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా ఉండి జోరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. బీజేపీలో ఎవరో..? బీజేపీలో మేడ్చల్ అభ్యరి్థగా నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన కొంపల్లి మోహన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డిలు ఈ సారి పార్టీ బీఫారం ఆశిస్తున్నారు. ఆ పార్టీ అధినాయకత్వం వలస నాయకులను నమ్ముకోవడంతో ఎన్నికల సమయానికి ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి వచ్చి చేరుతాడో.. టికెట్ ఎవరికి వస్తుందో ఎన్నికల వరకు సస్పెన్స్‌గానే ఉంటుంది. మిగతా పారీ్టలైన బీఎస్పీ, వామపక్షాలు పార్టీ అభ్యర్థుల వేటలో ఉన్నాయి. -
ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రోరైల్ సేవలను ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరిస్తాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను అనుసంధానిస్తాం. అంతేకాదు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోరైల్‌ను నిర్మిస్తాం’ అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ఎల్బీనగర్ చౌరస్తా నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌ను శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ.658 కోట్లతో 12 ప్రాజెక్టులు చేపడితే.. ఇప్పటివరకు తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని కేటీఆర్ చెప్పారు. బైరామల్‌గూడలో పెండింగ్‌లో ఉన్న మూడు ప్రాజెక్టులను కూడా సెపె్టంబర్లోపు పూర్తి చేస్తామని.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళతామని పేర్కొన్నారు. గతంలో ఎల్బీనగర్ చౌరస్తా దాటాలంటే కనీసం పది పదిహేను నిమిషాలు పట్టేదని.. ఇప్పుడా సమస్య తీరిందని చెప్పారు. పేదలకు పట్టాలిస్తాం.. హైదరాబాద్‌లో ఏడాదిన్నర కాలంలో వెయ్యి పడకల సామర్థ్యంతో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక 118 జీవో కింద దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెలాఖరులోగా పట్టాలు పంపిణీ చేస్తామని.. ఈ జీవో పరిధిలోకి రాని కాలనీలను కూడా త్వరలో దీని పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. జీవోలు 58, 59 కింద ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 1.28 లక్షల మందికి నివాస పట్టాలు ఇచ్చామని.. మిగతా పేదలకు కూడా పట్టాలిచ్చే బాధ్యత తమదేనని ప్రకటించారు. ఎస్ఆర్డీపీ, ఎస్‌ఎన్‌డీపీల కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు ఒకవైపు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోనే.. మరోవైపు పార్టీ లో అంతర్గత వర్గపోరు బయటపడింది. బీఆర్ఎస్కు చెందిన చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గీయులు రమణారెడ్డిపై దాడికి యత్నించగా ఆయన, ఆయన వర్గీయులు పరుగులు తీశారు. చివరికి పోలీసులు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమం అనంతరం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచి, బీఆర్ఎస్లో చేరాక.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. పా ర్టీ లోని అసలైన ఉద్యమకారులు, సీనియర్లపై ఎమ్మెల్యే పెయిడ్ ఆరి్టస్టులు, గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎల్బీనగర్ జంక్షన్‌కు శ్రీకాంతాచారి పేరు ఎల్బీనగర్ జంక్షన్‌కు తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని.. ఫ్లైఓవర్‌కు మాల్ మైసమ్మ పేరు పెడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లే కాకుండా ప్రజారవాణా బాగా మెరుగుపడాల్సి ఉందన్నారు. -
కౌశిక్‌రెడ్డి.. మధురై కోర్టుకు స్వాగతం: ఠాగూర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పరువు నష్టం దావాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీస్ పంపించిన విషయం తెలిసిందే. మాణిక్యం రూ.25 కోట్లు తీసుకొని రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. అయితే తాజాగా సోమవారం కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి కూడా రేవంత్‌కి పదవి ఇప్పించేందుకు మాణిక్యం ఠాగూర్ రూ.50 కోట్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఠాగూర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపించడం తన ప్రాథమిక కర్తవ్యం కాబట్టే సీఎం చంద్రశేఖర్‌రావుకు విధేయులైన వారు ఎప్పుడూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తారని ఠాగూర్ విమర్శించారు. ఈ వ్యవహారంలో తన న్యాయవాదులు కౌశిక్‌రెడ్డికి పరువు నష్టం నోటీసు జారీ చేస్తారని, మదురైలో ఫిర్యాదు నమోదు అవుతుందన్నారు. వారికి మదురై కోర్టుకు స్వాగతమని మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. -
నేటితో వైఎస్సార్ జిల్లా వాసుల కల నెరవేరింది..
-
‘ఆయనవి ఉత్తుత్తి దీక్షలే’
సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా వాసుల కల నేటితో నెరవేరిందని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో పాటు స్టీల్‌ప్లాంట్ ఇస్తామని మోసం చేశారని.. గత ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపనకు ముందే ముడిసరుకు కేటాయించారన్నారు. స్టీల్‌ప్లాంట్ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మడం తిప్పని నాయకుడు.. ప్రతిపక్ష నేత చంద్రబాబువి ఉత్తుత్తి దీక్షలేనని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. మాట ఇస్తే మడం తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్టీల్‌ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి 25 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. పాదయాత్రలో సీఎం జగన్ మాట ఇచ్చిన ప్రకారమే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారని తెలిపారు. వైఎస్సార్ జిల్లా వాసుల కల నేడు నెరవేరిందన్నారు. -
కాంగ్రెస్‌లోనే ఉంటాం
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో తాము చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఖండించారు. టీఆర్ఎస్లో చేరట్లేదని, చేరే ఉద్దేశం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. అరడజను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోందంటూ శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది తమ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారని టీఆర్ఎస్ నేతలు పదేపదే వ్యాఖ్యానించడం, దానికి తగ్గట్టే కొందరి పేర్లు ప్రచారంలోకి రావడం తెలిసిందే. అయితే తాము ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడటం లేదని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, పోదెం వీరయ్య స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఇలాంటి వార్తలు కేడర్‌ను అయోమయానికి గురి చేస్తాయని సబితారెడ్డి అన్నారు. తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘నేను మొదటి నుంచి కాంగ్రెస్‌వాదిని. 1986లో కార్పొరేటర్ అయిన నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఏ పరిస్థితుల్లోనూ నేను కాంగ్రెస్‌ను వీడను.. టీఆర్ఎస్లో చేరను’ అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘నేను కాంగ్రెస్‌ను వీడను. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు వెల్లడించాను. అయినా ఇంకా అలాంటి వార్తలే రావడం తీవ్ర బాధ కలిగించింది. అసలు ఇలాంటి ప్రచారం చేసేవారిని ఏమనాలో అర్థం కావట్లేదు’ అని పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను మొదటి నుంచీ కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్నానని, విలువలతో కూడిన రాజకీయాలే తనకు ప్రాణమని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పేర్కొన్నారు. -
కొత్తపేట చౌరస్తాలో కలకలం
సాక్షి, హైదరాబాద్ : కొత్తపేట చౌరస్తాలోని వీఎం హోం వద్ద శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉన్న వీఎం హోం గ్రౌండ్‌ను అధికారులు మూసివేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వీఎం హోంను తెరవాలని దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు కొత్తపేట చౌరస్తాలో బైఠాయించి, ప్రధాన రహదారిపైనే వ్యాయామాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డితోపాటూ స్థానిక ప్రజా సంఘాల నేతలు సంఘటనా స్థలానికి చేరుకొని నిరుద్యోగులకు బాసటగా నిలిచారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు నిరుద్యోగ యువతకు సర్దిచెప్పి, ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు. -
లాబీయింగ్‌లో రమేష్ నంబర్‌వన్
సాక్షి, ఎర్రగుంట్ల : టీడీపీ నేత సీఎం రమేష్ లాబీయింగ్ చేయడంలో నంబర్ వన్ అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగుంట్లలోని పార్టీ కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. 2014 ఎన్నికల మందు రిత్విక్ కంపెనీకి కేవలం 300 కోట్ల టర్నోవర్ ఉండేదని, ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే వేల కోట్లకు చేరుకుందన్నారు. దీన్ని బట్టి ఏవిధంగా ఆవినీతి సోమ్ము సంపాదించారో తెలుస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.30లక్షలు దాకా ఖర్చు పెట్టి, ప్రత్యేక విమానాల్లో తిరిగారని చెప్పారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి బీటెక్ రవిని గెలిపించారని ప్రశ్నించారు. కానీ అది గెలుపు కాదన్నారు. టీడీపీ ఆర్టీపీపీలోని 6 మెగావాట్లలో ఆవినీతి జరిగిందన్నారు. రూ.3వేల కోట్లు ఉన్న ప్రాజెక్టులో సుమారు 800 కోట్లు సంపాందించారు. పోట్లదుర్తి – మాలెపాడు, గ్రామాల మధ్య ఏ పనులైనా రిత్విక్ కంపెనీ కనుసన్నలలో జరగాలి, వైఎస్సార్ సీపీ తరుపున టెండర్‌వేస్తే రాకుండా చేస్తారు. లేక పోతే పనులు జరగనివ్వరన్నారు. లాబీయింగ్ చేయడంలో ఎంపీ రమేష్ నంబర్ వన్ అని అన్నారు. బీజేపీ కక్ష సాధింపు అనడడం సరికాదన్నారు.రమేష్ బలం చంద్రబాబు, అవినీతి సొమ్మేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్.... రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు సీఎం రమేశ్ రాజభవనం చూశారా? -
వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం
మైలవరం (వైఎస్సార్ కడప): టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగా అందడం లేదని వైఎస్సార్సీప జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ధన్నవాడ గ్రామంలో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కడప మేయర్ సురేష్‌బాబు, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అల్లె చెన్నారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నియోజకవర్గంలో గాలేరు– నగరి వరదకాలువ పనులు పూర్తి చేసి గండికోటకు, మైలవరానికి కృష్ణా జలాలు తెప్పించిన ఘనత దివంగత సీఎం వైఎస్‌కే దక్కుతుందన్నారు. పార్టీ ఫిరాయించిన మంత్రి ఆదినారాయణరెడ్డి తన స్వలాభం మాత్రమే చూసుకుంటూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల కిందట పార్టీ ఫిరాయించిన మంత్రి వందరోజుల ప్రణాళికలో భాగంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే మంత్రి, ఆయన కుమారుడు, బంధువులు మాత్రమే అభివృద్ధి చెందారని, నియోజకవర్గంలో సమస్యలన్నీ అలాగే ఉన్నాయని చెప్పారు.ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల వద్దనుంచి భూములు కొనుగోలు చేసి దాదాపు 30 సంవత్సరాలైనా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదు. దీంతో వైఎస్సార్సీపీ రైతుల తరఫున పోరాటం చేస్తే మంత్రి ఆదినారాయణరెడ్డి రైతులపైనా, వైఎస్సార్సీపీ నాయకులపైనా అక్రమ కేసులను పెట్టించారన్నారు. ఏసీసీ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన మంత్రి వారికి ఎటువంటి పరిహారం ఇప్పించలేకపోయారన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు శివగురివిరెడ్డి, వద్దిరాల రామాంజనేయల యాదవ్ జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, పోచిరెడ్డి, చిన్న కొమెర్ల రామలింగారెడ్డి, ఆయా గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి బొజ్జల తనయుడి నుంచి నాకు ప్రాణహాని!
తిరుపతి: వైఎస్ఆర్ సీపీ నేతను ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డిపై సుధీర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో సహా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆరు నెలల్లో లేపేస్తానని సుధీర్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్పీని కోరారు. టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోలేదని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గతంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. 'ఆలయంలో పాలనా వైఫల్యాలపై మాకు సూచనల వరకు ఒకే గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు' అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేయగా.. బృందమ్మ మాత్రం అదే తీరుగా వ్యవహరించడంతో ఈవో సెలవుపై వెళ్లడానికి సిద్ధం కావాల్సి వచ్చింది. తరచుగా టీడీపీ నేతలు, మంత్రులు.. వారి సన్నిహితులు మహిళలు, అధికారులపై దాడులకు పాల్పడుతూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. -
జమ్మలమడుగులో YSRCP సమావేశం
-
రాజీనామాలు చేసి.. ఎన్నికలకు రండి..
• ఆ ఇద్దరు కలిశారని చెప్పుకోవడం మానండి • వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదు • వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం సుధీర్‌రెడ్డి ఎర్రగుంట్ల: మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆది కలిశారని, ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి బలం ఉందని సమావేశాల్లో చెప్పుకోవడం మానుకోవాలని, ధైర్యం, సత్తా ఉంటే పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు రండి... దానికి మేం కూడా సిద్ధం అనివె వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఎర్రగుంట్లలో పార్టీ కార్యకర్తలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. పదవులకు రాజీనామాలు చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. ఆ ఇద్దరు కలిశారని చెప్పుకుంటున్నారని, కానీ గ్రామాల్లో వారి కోసం ప్రాణాలు ఒడ్డి ఇప్పటి వరకు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. , తర్వలోనే వారికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో గుణ పాఠం చెబుతారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాఫీలు హామీలు నెరవేర్చలేదని అన్నారు. జిల్లా స్థారుు నాయకులు గొప్పలు చెప్పడం మానాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదన్నారు. ఎర్రగుంట్లకు ఇంటర్, ఐటీఐ, డిగ్రీ కళాశాలలు మంజూరు చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధికి తేలియదా..? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. పర్సెంటేజీల కోసమే ప్రత్యేక ప్యాకేజీ జపం రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకుండా పర్సెంటేజీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రత్యేక ప్యాకేజీ జపం చేస్తున్నారని సుధీర్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగలకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుతున్నారన్నారు. ఇందుకోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి జయరామక్రిష్ణరెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్‌గఫూర్,ఎంపీటీసీ ప్రతాప్‌లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేసుగుర్రం గాడిదైందా..?
♦ నీతులు చెప్పడం కాదు ఆచరించాలి ♦ కార్యకర్తలను, నాయకులను ఫోన్ చేసి బెదిరిస్తే ఊరుకోనే ప్రసక్తేలేదు ♦ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి జమ్మలమడుగు:2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున నామినేషన్ వేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహిరంగసభలో మాట్లాడుతూ తాను రేసుగుర్రానని, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కంచర గాడిదని చెప్పారని, ప్రస్తుతం ఆ రేసుగుర్రం పార్టీ ఫిరాయించి కంచర గాడిదగా మారిందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలో 200 కుటుంబాలు ఆయన సమక్షంలో పార్టీలో చేరాయి. అనంతరం స్థానిక చిక్కాల మురళీ ఇంట్లో సమన్వయకర్త సుధీర్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలో చాలామంది ఎమ్మెల్యే వర్గం నుంచి విడిపోయి వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న వారిని సూర్యం, ఎమ్మెల్యేలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పైకి మాత్రం ‘ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు’అంటూ చేతల్లో మాత్రం మరొకటి చేస్తున్నారని మండిపడ్డారు. నైతిక విలువలు గల వ్యక్తినంటూ గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే పార్టీ మారి వందరోజులైనా ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. విలువల్లేని నాయకులు కాకుండా నిరాడంబరులైనా వారిని రాజకీయాల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డాక్టర్‌గా ఉన్న సుధీర్‌రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫ్యాక్షన్ రాజకీయాలు కాకుండా స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలని లక్ష్యంతోనే సుధీర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. అదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని, ప్రజలే బహిరంగంగా విమర్శిస్తున్నారని తెలిపారు. బాబు మాఫీ మాయజాలంతో మహిళలు, రైతులు రోడ్డున పడ్డారన్నారు. బ్యాంకర్లు ఇళ్ల వద్దకు వచ్చి ఆస్తులు జప్తు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని మహిళలు వాపోతున్నారన్నారు. నిరుద్యోగ భృతిని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పదేళ్ల పాటు అధికారం కోల్పోయి బాధలు పడ్డారు. అధికారం రాగానే తాము కూడా బాగుపడుతామని భావించారన్నారు. అయితే పందికొక్కుల్లా ఇంట్లో దూరి వారి నోట్లోనే మన్ను కొట్టారన్నారు. ఇలాంటి పందికొక్కులాంటి నాయకులు ఉంటే టీడీపీకే తీరని నష్టమన్నారు. నాడు ఎద్దుల ఈశ్వరరెడ్డి నడుచుకుంటూ గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాజకీయాలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎసీ కారుల్లో తిరుగుతున్నారని తెలిపారు. ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అనే ఎమ్మెల్యే ముందుగా తాను ప్రజల్లో కలిసిపోయి ప్రజాసేవ చేసినప్పుడే ఫ్యాక్షన్ దూరమై ఫ్యాషన్ వస్తుందన్నారు. ఎమ్మెల్యేనే ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించే విధంగా కార్యకర్తలపై, నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్లవాగు శంకర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, సుద్దపల్లె శివుడు, పట్టణ ఇన్చార్జీ పోరెడ్డి మహేశ్వరరెడ్డిలు పాల్గొన్నారు. -
హరీశ్.. అహంకారం వద్దు: సుధీర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అహంకారంతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడటం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరిం చారు. కాంగ్రెస్ నేత ఎన్.శ్రీధర్‌తో కలసి గాంధీభవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు నేతలు లేరని, భవిష్యత్తు లేదని హరీశ్‌రావు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్‌లో చేరుతానని తిరిగిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారని, అందుకోసం పైరవీలు చేసుకున్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. -
జగనన్నకు బ్రహ్మరథం
సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌కు నీరాజనం వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి వరంగల్ నగరానికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జనగామ మండలం పెంబర్తి వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియమ్స్, నాయకులు కల్యాణ్‌రాజ్, నాడెం శాంతికుమార్లు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద కాన్వాయ్ ఆపి మహిళలు, వృద్ధులను జగన్ అప్యాయంగా పలకరించారు. ధర్మసాగర్ మండలం రాంపూర్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు బైక్‌ర్యాలీతో స్వాగతం పలికాయి. మడికొండ, ఖాజీపేట, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్డు, పెద్దమ్మగడ్డ మీదుగా ప్రజలకు అభివాదం చేస్తూ భీంరెడ్డి సుధీర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పరామర్శ తర్వాత ఖాజీపేట మీదుగా మళ్లీ హైదరాబాద్‌కు బయలుదేరారు. భీంరెడ్డి సుధీర్‌రెడ్డి నివాసం వద్ద, బాల వికాస సంస్థ ఆవరణలో జగన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పోటీపడ్డారు. అందరితో అప్యాయంగా మాట్లాడుతూ జగన్ ముందుకు సాగారు. సుధీర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా.. సుధీర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సుధీర్‌రెడ్డి ఇంట్లో దాదాపు గంట సేపు ఉన్నారు. ‘సుధీర్‌రెడ్డి మరణం వైఎస్సార్ సీపీకి, వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు. అంకితమైన నాయకుడిని కోల్పోయాం. సుధీర్‌రెడ్డి మా కుటుంబానికి ఆప్తుడు’ అని వైఎస్ జగన్ అన్నారు. సుధీర్‌రెడ్డి తల్లిదండ్రులు అరుణాదేవి, ఎల్లారెడ్డి.. సోదరుడు సుమన్రెడ్డితో మాట్లాడారు. నేనున్నాంటూ జగన్, సుధీర్‌రెడ్డి తల్లిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గున్నం నాగిరెడ్డి, వి.వెంకటేశ్, జి.సూర్యనారాయణరెడ్డి, కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, సిద్దార్థరెడ్డి, మునిగాల విలియం, ఎడ్మ క్రిష్ణారెడ్డి, భీష్వ రవీందర్, ఎం.జయరాజ్, సయ్యద్ ముస్తఫా, వెల్లాల రామ్మోహన్, సాదమల్ల నరేశ్, నర్రా భిక్షపతి, పి.ప్రపుల్ల, వి.ఎల్.ఎన్.రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, ఇరుగు సునీల్‌కుమార్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, నాయుడు ప్రకాశ్, సురేశ్‌రెడ్డి, ఎస్.భాస్కర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రావు, అమిత్ఠాగూర్, మశ్రం శంకర్, జి.జైపాల్‌రెడ్డి, మునిగాల కళ్యాణ్, శివ, దయాకర్ పాల్గొన్నారు. బాల వికాస సంస్థకు.. వరంగల్‌లోని బాల వికాస స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాలయానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి మర్యాద పూర్వకంగా వెళ్లారు. బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్’ శిక్షణ కార్యక్రమానికి వచ్చిన 11 దేశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ‘బాల వికాస సంస్థ చేపట్టిన పథకాలతో చాలా గ్రామాల్లో ప్రజలు లాభపడుతున్నారు. బాల వికాస సంస్థ కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వాలకు నమూనాగా ఉండడం అభినందనీయం. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటుండడం చూస్తుంటే బాల వికాస పనితీరును అర్థం చేసుకోవచ్చు. కులమత రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా సేవలు చేస్తున్న సంస్థ వ్యవస్థాపకురాలు బాల థెరిసాకు, సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.శౌరిరెడ్డికి, సంస్థలో పని చేస్తున్నవారికి అభినందనలు. బాల వికాస సంస్థ మరింత విస్తతంగా సేవలు చేస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఆకాక్షిస్తున్నా’ అని అన్నారు. బాల వికాస స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న తెలంగాణలో 500, ఆంధ్రప్రదేశ్‌లో 100 తాగునీటి వాటర్ ప్లాంట్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేలా ప్రభుత్వాలని ఒప్పించాలని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి ఈ సందర్భంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో రెండు సార్లు తమ సంస్థకు వచ్చారని శౌరిరెడ్డి తెలిపారు. రాజశేఖరరెడ్డి దారిలోనే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ సంస్థకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. -
వెంకటాపూర్‌ను ఆదుకుంటాం
చుట్టూ గడ్డి భూములు.. కనువిందు చేసే పచ్చని పంట పొలాలు.. కోనసీమ అందాలను తలపింపజేసే రమణీయ దృశ్యాలు.. ఇవీ ఘట్కేసర్ మండలంలోని వెంకటాపూర్ పరిసరాలు.. ఈ గ్రామం హైదరాబాద్ మహా నగరానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. మూసీ మురుగు, దోమల బెడద, కాలుష్యమయమైన భూగర్భ జలాలు, తాగునీటి ఎద్దడి, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తదితర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి వెంకటాపూర్‌లో పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే: పెద్దమ్మ పింఛన్ వస్తోందా..? అనసూయమ్మ: వస్తోంది సారు. మొన్న మూడు నెలల పింఛన్ ఇచ్చిన్రు. ఈనెల ఇంకా ఈయలేద్సారు. ఎమ్మెల్యే: ఈనెల పింఛన్లు కూడా త్వరలోనే వస్తాయి. ఇంకా ఎవరికైనా పింఛన్లు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోండి. అధికారులు పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తారు. ఎమ్మెల్యే: పెదమ్మా రేషన్ వస్తోందా..?. రత్నమ్మ: కొత్త రేషన్ కార్డులు ఇంకా ఇయ్యలే సారు. ఎమ్మెల్యే: రేషన్ కార్డులు మన కొత్త సర్కారొళ్లు త్వరగానే ఇస్తరు. మునుపటి లెక్క ఒక్కరికి నాలుగు కిలోల బియ్యం కాదు.. ఆరు కిలోల బియ్యం ఇస్తున్రు. అందరూ కడుపు నిండా బువ్వ తినాలని సర్కార్ ఆలోచిస్తోంది. రత్నమ్మ: మంచిది సారు. లక్ష్మమ్మ: రేషన్ సరుకులు సరిగా ఇస్తలేడు సారు. అక్కడే ఉన్న రేషన్ డీలర్ బాలరాజ్‌ను ఎమ్మెల్యే పిలిచారు. ఎమ్మెల్యే: ఆ ముసలామెకు రేషన్ బియ్యం ఇయ్యి. రేషన్ దుకాణాల్లో ఏం చేస్తారో అవన్నీ నాకు తెలుసు. బియ్యం వస్తలేవని మళ్లీ ఆమె నా వద్దకు రావద్దు. ఎమ్మెల్యే: పెద్దమ్మా బాగున్నవా. ఏమైనా సమస్యలున్నాయా..? కట్ట రాములమ్మ: ఉన్నయి సారు. నా మనుమనికి తల్లి, తండ్రి లేరు. నేనే సాదుతున్న. వాడి మానసిక పరిస్థితి సక్కగ లేదు. వికలాంగుల పింఛన్ ఇప్పించండ్రి . ఎమ్మెల్యే:సదరమ్ కార్డు ఉంటే వికలాంగుల పింఛన్ వస్తది. పట్నంల వనస్థలిపురం దవాఖానకు నీ మనుమణ్ని తీసుకెళ్లు. అక్కడ డాక్టర్లు పరీక్షించి సదరన్ కార్డు ఇస్తరు. అప్పుడు దరఖాస్తు చేసుకో. పింఛన్ వస్తది. ఎమ్మెల్యే: అమ్మ.. ఇక్కడ ఎమైన సమస్యలున్నాయా..? సుధా (అంగన్వాడీ కార్యకర్త): సారు మా అంగన్వాడీలో నల్లా కనెక్షన్ లేదు. దీంతో నీటికి ఇబ్బంది పడుతున్నం. భోజనం వండటానికి ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే: మీ అంగన్ వాడి కేంద్రానికి వెంటనే నల్లా కనెక్షన్ ఇప్పిస్తానమ్మ అంటూ అక్కడే ఉన్న సర్పంచ్ కృష్ణవేణికి వెంటనే నల్లా కనెక్షన్ ఇయ్యవలసిందిగా ఆదేశించారు. శారద: మాకు డ్వాక్రా బిల్డింగ్ లేదు. దీంతో ఆడోళ్లు మీటింగ్‌లు పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నం. గతంలో గ్రామ పంచాయతీ వారుకొత్త గ్రామ పంచాయతీ భవనంలో పోయినంక, పాత భవనాన్ని ఇస్తామన్నారు. వారు కొత్త దాన్ల పోయిన్రు. పాతది మాత్రం ఇస్తలేరు. ఎమ్మెల్యే: (అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ బాలరాజ్‌తో) పాత పంచాయతీ భవనాన్ని డ్వాక్రా మహిళలకు ఇచ్చేందుకు తీర్మానం చేసిన్రా. బాలరాజు(మాజీ సర్పంచ్): చేసిన్రు. సారు. ఎమ్మెల్యే: తీర్మానం చేసినంక ఇంకా ఎందుకు ఇస్తలేరు. వెంటనే ఇచ్చేయున్రి. పాత పంచాయతీ భవనానికి బాత్రూమ్లు కట్టించి, నీటి వసతి, కరెంటు సౌకర్యం కల్పించి, సున్నం వేసి డ్వాక్రా మహిళలకు ఇయ్యున్రి. 10 రోజుల్లో నేనే ఒచ్చి కొబ్బరికాయ కొట్టి ఆడోళ్లకు అందజేస్త. దానయ్య: నాకు పింఛన్ ఇయ్యరంట సారు. ఎమ్మెల్యే: నువ్వు ఎన్ని ఏండ్లు ఉన్నయ్..? దానయ్య: అరవై ఉంటాయి సార్. ఎమ్మెల్యే: సర్కార్ 65 ఏండ్ల కంటే మీదున్నొళ్లకు పింఛన్ ఇయ్యలనే నిబంధన పెట్టింది. మనం గూడ సర్కార్‌ను అర్థం చేసుకోవాలే. ఆ వయస్సులో కాళ్లు రెక్కలు పనిచేయ్యయి. అప్పుడు సర్కార్ ఇచ్చే పింఛన్ ఆసరా అయితదని ఆలోచిస్తుంది. మనం జెర అర్థం చేసుకోవలే. ఎమ్మెల్యే: (రైతులను) ఏమైనా సమస్యలున్నాయా..? పెంటయ్య: బావుల కాడ కరెంటు సరిగా వస్తలేదు. సారు. ఎక్కువ సేపు వస్తే బాగుండు. ఎమ్మెల్యే: మనకాన్నె కరెంటు బాగుంది. వేరే దగ్గరైతే ఆయింత కరెంట్ కూడా వస్తలేదు. భూమయ్య: బడిలో వంటగది లేక ఇబ్బందుల పడుతున్రు. ఎమ్మెల్యే:మీ ఊరోళ్లు స్థలం సూపిస్తే వంట గది కట్టిద్దాం. ఎమ్మెల్యే: రైతన్న ఏమైనా సమస్యలున్నాయ..? అండె పోచయ్య(నాగలి దున్నతున్న రైతు): యాసంగీలో నెల్లూరి సోన సాగుచేస్తున్న. ఎకరానికి 20 నుంచి 30 బస్తాలు ధాన్యం పండుతుంది. 6 నుంచి 7 వేల లాభాలుస్తున్నయ్. కష్టానికి తగ్గ లాభాలు వస్తలేవు. ఎమ్మెల్యే: ప్రతాపసింగారం, ఏదులాబాద్‌లో ధాన్యం కొనే కేంద్రాలు ఏర్పాటు చేసినం. ఆడికి వచ్చి ఒడ్లు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. ఈసారన్న సర్కారోళ్లకు ఒడ్లు అమ్ము. పోచయ్య: సరే సారు. ఎమ్మెల్యే: ఏమమ్మ ఏమైనా సమస్యలున్నాయా..? కూలీ ఎంత ఇస్తున్రు. అంజమ్మ, నీరుడు సబిత(నాట్లు వేసే మహిళలు): పొద్దగాళ్లొస్తే రోజుకు రూ.250 కూలీ ఇస్తున్రు. కొంచెం అమ్మటాళ్లకు వస్తే రూ.200 కూలీ ఇస్తున్రు. సారు. రామారావు: గుడిని బాగు చేయాలె సారు. ఎమ్మెల్యే: దాతలు, సర్కార్ సహాయంతో గుడిని బాగు చేద్దాం. మంగమ్మ: సారు నాకు పింఛన్ వస్తలేదు. ఇంతకు మందు నాకు, మా ఆయనకూ పింఛన్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. ఎమ్మెల్యే: భార్యాభర్త ఇద్దరూ ముసలొళ్లు అయితే ఒక్కరికే పింఛన్ ఇయ్యాలనేది గవర్నమెంట్ నిర్ణయం. దాని ప్రకారం ఒక్కరికి పింఛన్ వస్తదమ్మ. నాగయ్య: సారు మాకు ఇల్లు లేదు. మేం ఇద్దరం ముసలివాళ్లం. కిరాయిఇ ంట్లో ఉంటున్నాం. మాకు ఎట్లైనా చేసి ఇళ్లు కట్టియ్యి సారు. నీ కాళ్లు మొక్కుతా. ఎమ్మెల్యే:మీ ఊర్లో ఎక్కడైనా జాగా చూసి అధికారులకు చెప్పి ఇల్లు కట్టిస్తానమ్మా. లక్ష్మమ్మ: నా పింఛన్ కొర్రెముల పక్క ఊర్లో ఇస్తున్రు. ప్రతి నెల ఆడికి పోవడం ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే: అధికారులకు చెప్పి నీపింఛన్ ఇక్కడనే వెంకటపూర్‌లో ఇచ్చేలా చూస్తా. నర్సమ్మ: గ్రామానికి కృష్ణనీరు సరిగా రావడం లేదు. ఎమ్మెల్యే: సరిగా వచ్చేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానమ్మ. కృష్ణవేణి: కొన్ని చోట్ల సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు సారు. ఎమ్మెల్యే: నిధులు కేటాయించి సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటా.ఎక్కువ నిధులు కేటాయించి త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తా. దశలవారీగా పరిష్కరిస్తా ‘సాక్షి’ ద్వారా వెంకటాపూర్‌లో సమస్యలు తెలుసుకున్నాను. నేను నివాసం ఉండే ప్రతాప్‌సింగారం గ్రామానికి పక్కనే వెంకటాపూర్ ఉండటంతో ఈ సమస్యల్లో చాలా వరకు నాకు తెలుసు. దశల వారీగా సమస్యలను పరిష్కారిస్తా. రోడ్లు, అంగన్వాడీ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తాను. గ్రామానికి సింగిల్ రోడ్డు ఉంది. దానిని అభివృద్ధి చేస్తాను. అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం. గ్రామాల్లోని సమస్యలపై ప్రజల్లో చైతన్యం వచ్చి వాటిని పరిష్కరించాలని కోరే ధైర్యం చూపాలి. అప్పుడే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. - మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. -
జగన్ పర్యటనను జయప్రదం చేయండి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి వరంగల్ : ఈ నెల 12వ తేదీన జిల్లాలో వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను జయప్రదం చేయూలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని హన్మకొండలో ఆయ న పరామర్శిస్తారని మహేందర్‌రెడ్డి తె లిపారు. హన్మకొండలోని పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణరాజ్ ఇంటి వద్ద శనివారం మహేందర్‌రెడ్డి మాట్లాడారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా నియాకమైన సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలి పారు. శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 12వ తేదీన జగన్ జిల్లాకు వస్తున్నందున పార్టీ నాయకులు, కార్యకర్త లు, వైఎస్ అభిమానాలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించి నందుకు జగన్మోహన్రెడ్డికి, పార్టీ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపే తం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తల సహకారంతో రానున్న రోజుల్లో నిర్మాణాత్మకంగా పటిష్టం చేస్తామన్నారు. కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్‌రాజ్, పార్టీ నాయకులు మహిపాల్‌రెడ్డి, అప్పని కిషన్, జీడికంటి శివ, దయాకర్, రఘు, కాగిత రాజ్‌కుమార్, రజనీకాంత్, శ్రావణ్, జలంధర్, రాము లు, బద్రూద్దీన్,ఖాన్, సంతో ష్, మాధవ్, గాంధీ, సిద్ధార్థ, ప్రశాంత్, రాజు పాల్గొన్నారు. -
12 న జగన్ పర్యటన
సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ సమావేశమైన వైఎస్సార్సీపీ నేతలు వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరి 12న వరంగల్‌కు వస్తున్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా నాయకుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో సుధీర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. పలు ప్రజా సమస్యలపై పార్టీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో చురుకైన నేతగా గుర్తింపు పొందారు. రాజకీయంగా ఒక్కోమెట్టు ఎక్కుతు న్న క్రమంలో ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దానితో భీంరెడ్డి కుటుంబాన్ని ఓదార్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ కుటుంబంలో మనోధైర్యాన్ని నింపేందుకు 12న వరంగల్‌కు వస్తున్నారు. ముఖ్యనేతల సమావేశం వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జి ల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా క మిటీ నాయకులు, సభ్యులు హన్మకొండలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భీంరెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీని జిల్లాలో బలోపే తం చేసే దిశగా చర్చించారు. ఈ సమావేశం లో పార్టీ నాయకులు మహేందర్‌రెడ్డి, ము ని గాల విలియమ్స్, నాడెం శాంతికుమార్, అ ప్పం కిషన్, శంకరాచారి, సేవాదళ్ జిల్లా అ ధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాయిత రాజ్‌కుమార్‌లతోపాటు మహిపాల్‌రెడ్డి, దయాకర్, రజనీ కాం త్,ముజాఫరుద్దీన్ఖాన్,మాధవరెడ్డి, శ్రావ ణ్, అచ్చిరెడ్డి, తాజొద్దీన్, గాంధీ, శ్రీను, సంపత్, కృష్ణా, అగస్టీన్, వెంకట్రావు, లక్ష్మయ్య, యాక య్య, హరిప్రసాద్, అమర్ పాల్గొన్నారు. నేడు నగర కమిటీ సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ సమావేశం నేటి మధ్యాహ్నం 3:00 గంటలకు సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ నివాసంలో జరుగుతుంది. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నాలని ఆ పార్టీ నాయకులు కోరారు. -
సుధీర్‌రెడ్డి సేవలు మరువలేం
వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి త్వరలోనే పార్టీ అధినేత పరామర్శకు వస్తారని వెల్లడి నివాళులర్పించిన సజ్జల రామకృష్ణారెడ్డి నయీంనగర్ : రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెంది న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్ రెడ్డి సేవలు మరువలేనివని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక రెడ్డి కాలనీలోని సుధీర్‌రెడ్డి ఇంట్లో శుక్రవారం ఆయ న పెద్దకర్మ నిర్వహించారు. పొంగులేటి, పార్టీ అధినేత వై. ఎస్. జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యా రు. సుధీర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుధీర్‌రెడ్డి తల్లిదండ్రులు అరుణాదేవి, ఎల్లారెడ్డిలను, సోదరుడు సుమన్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సుధీర్‌రెడ్డి మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులతో సుధీర్‌రెడ్డి అనుబంధం వెలకట్టలేనిద న్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న వైఎస్సార్ ఆశయాల సాధన కోసం సుధీర్ కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. త్వరలోనే పార్టీ అధినేత జిల్లాకు వచ్చి సుధీర్‌రెడ్డి కుటుం బాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు. వైఎస్సాఆర్సీపీ జిల్లా నాయకులు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, మునిగాల విలియమ్స్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ముని గాల కల్యాణ్‌రాజు, ఎ.కిషన్, నాయకులు కాయి త రాజ్‌కుమార్, చల్లా అమరేందర్‌రెడ్డి, నాగపూ రి దయాకర్, బొడ్డు శ్రవణ్, నాగవెల్లి రజనీ కాంత్, రఘు, విజయ్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ మాక్స్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువు మైల రఘోత్తంరెడ్డిని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంతకుముందు పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకుడు మునిగాల విలియమ్స్ ఇంటికి వెళ్లారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతంపై పలువురు నాయకులతో చర్చించారు. ప్రముఖుల పరామర్శ.. సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పరామర్శించారు. సుధీర్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ రెడ్డి యూత్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పలు పార్టీల నాయకులు వీరగంటి రవీందర్, బోడ డిన్నా, ఎం.సోమేశ్వర్రావు, తక్కళ్లపల్లి రాము, వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ తదితరులు సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. -
సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం
వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి భీంరెడ్డికి నివాళులర్పించినసజ్జల రామకృష్ణారెడ్డి వరంగల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. హన్మకొండ రెడ్డికాలనీలో శుక్రవారం జరిగిన సుధీర్‌రెడ్డి పెద్దకర్మకు ఆయనతోపాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యూరు. సుధీర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుధీర్‌రెడ్డి తల్లిదండ్రులు అరుణాదేవి, ఎల్లారెడ్డి, అన్న సుమన్‌రెడ్డిని ఓదార్చారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సుధీర్‌రెడ్డి మృతిని వైఎస్సార్ సీపీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. త్వరలోనే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లాకు వచ్చి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు. -
సుధీర్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు
అశ్రునయనాల మధ్య వైఎస్సార్ సీపీ యువజన నేతకు అంత్యక్రియలు ఫోన్లో కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్ నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ రాష్ర్ట నేతలు హాజరైన పలు పార్టీల నాయకులు నయీంనగర్/ఎంజీఎం : వైఎస్సార్ సీపీ యువజన నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డికి అంత్యక్రియలు బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యక ర్తల అశ్రునయనాల మధ్య హన్మకొండ పద్మాక్షి కాలనీలోని శివముక్తిధామ్ స్మశానవాటికలో బుధవారం ముగిశాయి. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా సుధీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఆయన రోడ్డుప్రమాదంలో మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అంతిమయాత్రకు ముందు రెడ్డికాలనీలోని ఆయన నివాసం ఎదుట బంధువు లు, పార్టీ నాయకులు అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నాయకులతో కలిసి వచ్చి సుధీర్‌రెడ్డి మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌కు, ఆయన కుటుం బానికి వీరాభిమాని అయిన సుధీర్‌రెడ్డి దుర్మరణం జిల్లాకే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటన్నారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి వైఎస్సార్ సీపీ బలోపేతానికి ఎంతో కృషి చేశాడని కొని యాడారు. సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లా సూర్యప్రకాష్, కొండా రాఘవరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రమేశ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ముస్తాఫా, రాహుల్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, ఎ.లింగారెడ్డి, జిల్లా నాయకులు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, సేవాదళ్ నాయకుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, నాయకులు మునగాల విలియం, అప్పం కిష న్, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మాతి, కాంగ్రెస్ నేతలు పుల్లా భాస్కర్, ఘంటా నరేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ, వివిధ పార్టీల నాయకులు దయాకర్, సంపత్, బోడ డిన్నా, నాగెల్లి నరేష్, వేణుగోపాల్‌గౌడ్, రజినికాంత్, నమిండ్ల శ్రీనివాస్, వీసం సురేందర్‌రెడ్డి, కుసుమ లక్ష్మీనారాయణ, తోట రమేష్, పిన్నోజు సతీష్‌కుమార్, బుల్లెట్ వెంకన్న, శ్రీనాథ్‌తోపాటు స్థానికులు భారీగా సంఖ్యలో సుధీర్‌రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ.. వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో సుధీర్‌రెడ్డి తల్లి అరుణాదేవి, అన్న సునీల్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. ‘సుధీర్‌రెడ్డి బతికున్నంత కాలం మా కుటుంబం కంటే ఎక్కువగా వైఎస్సార్ కుటుంబం, వైఎస్సార్సీపీ బలోపేతం కోసం శ్రమించాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసినా లొంగకుండా కరుడుగట్టిన కార్యకర్తగా పార్టీ బలోపేతానికి శ్రమించాడు. మీరు కనిపించి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి’ అని వారు జగన్‌ను కోరారు. దీంతో సుధీర్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని, వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని రాష్ట్ర నాయకులు హామీ ఇచ్చారు. శోకసంద్రంగా మారిన ఎంజీఎం మార్చురీ.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ ఎంజీఎం ఆస్పత్రిలో సుధీర్‌రెడ్డి మృతదేహం వద్ద బంధుమిత్రులు, స్నేహితులు రోదించిన తీరు ఆ ప్రాంతమంతా మర్మోగింది. పార్టీలకతీతంగా పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు మార్చురీ వద్దకు తరలివచ్చారు. మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేశ్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నాయకుడు రాజారాపు ప్రతాప్, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు వాసుదేవరెడ్డి, వైఎస్సార్ సీపీ స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్చార్జి విలియమ్స్, వైస్సాఆర్ సీపీ నాయకులు కిషన్, వేణుయాదవ్, కూరబోయిన సాంబయ్య, చింతలపూడి నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, నాయకుడు కోరబోయిన సాంబయ్య, శేఖర్‌గౌడ్, సందర్శించి నివాళులర్పించారు. హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ రాష్ర్ట నాయకుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డికి వైఎస్సార్ సీపీ నివాళి అర్పించింది. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంతాపసభలో సుధీర్‌రెడ్డి మృతికి పార్టీ తీవ్ర సంతాపం తెలియజేసింది. వరంగల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా సుధీర్‌రెడ్డి పార్టీకి అందించిన సేవలు మరవలేనివని పార్టీ నాయకులు గుర్తుచేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ తరఫున సుధీర్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వి. విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, బుగ్గాన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రకాష్‌రెడ్డి, డా.ప్రఫుల్ల, చల్లా మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.