రాజీనామాలు చేసి.. ఎన్నికలకు రండి..
• ఆ ఇద్దరు కలిశారని చెప్పుకోవడం మానండి
• వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదు
• వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం సుధీర్‌రెడ్డి
ఎర్రగుంట్ల: మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆది కలిశారని, ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి బలం ఉందని సమావేశాల్లో చెప్పుకోవడం మానుకోవాలని, ధైర్యం, సత్తా ఉంటే పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు రండి... దానికి మేం కూడా సిద్ధం అనివె వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఎర్రగుంట్లలో పార్టీ కార్యకర్తలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. పదవులకు రాజీనామాలు చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు.
ఆ ఇద్దరు కలిశారని చెప్పుకుంటున్నారని, కానీ గ్రామాల్లో వారి కోసం ప్రాణాలు ఒడ్డి ఇప్పటి వరకు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. , తర్వలోనే వారికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో గుణ పాఠం చెబుతారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాఫీలు హామీలు నెరవేర్చలేదని అన్నారు. జిల్లా స్థారుు నాయకులు గొప్పలు చెప్పడం మానాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదన్నారు. ఎర్రగుంట్లకు ఇంటర్, ఐటీఐ, డిగ్రీ కళాశాలలు మంజూరు చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధికి తేలియదా..? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు.
పర్సెంటేజీల కోసమే ప్రత్యేక ప్యాకేజీ జపం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకుండా పర్సెంటేజీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రత్యేక ప్యాకేజీ జపం చేస్తున్నారని సుధీర్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగలకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరుతున్నారన్నారు. ఇందుకోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి జయరామక్రిష్ణరెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్‌గఫూర్,ఎంపీటీసీ ప్రతాప్‌లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.