సుధీర్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు | completed the farewell to sudhirreddy | Sakshi
Sakshi News home page

సుధీర్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

Published Thu, Dec 25 2014 1:12 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సుధీర్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు - Sakshi

సుధీర్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

అశ్రునయనాల మధ్య వైఎస్సార్ సీపీ యువజన నేతకు అంత్యక్రియలు
ఫోన్‌లో కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్
నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ రాష్ర్ట నేతలు
హాజరైన పలు పార్టీల నాయకులు

 
నయీంనగర్/ఎంజీఎం : వైఎస్సార్ సీపీ యువజన నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డికి అంత్యక్రియలు బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యక ర్తల అశ్రునయనాల మధ్య హన్మకొండ పద్మాక్షి కాలనీలోని శివముక్తిధామ్ స్మశానవాటికలో బుధవారం ముగిశాయి. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా సుధీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఆయన రోడ్డుప్రమాదంలో మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అంతిమయాత్రకు ముందు రెడ్డికాలనీలోని ఆయన నివాసం ఎదుట బంధువు లు, పార్టీ నాయకులు అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నాయకులతో కలిసి వచ్చి సుధీర్‌రెడ్డి మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌కు, ఆయన కుటుం బానికి వీరాభిమాని అయిన సుధీర్‌రెడ్డి దుర్మరణం జిల్లాకే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటన్నారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి వైఎస్సార్ సీపీ బలోపేతానికి ఎంతో కృషి చేశాడని కొని యాడారు. సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.

వైఎస్సార్ సీపీ  యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లా సూర్యప్రకాష్, కొండా రాఘవరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రమేశ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ముస్తాఫా, రాహుల్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, ఎ.లింగారెడ్డి, జిల్లా నాయకులు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నాడెం శాంతికుమార్,  సేవాదళ్ నాయకుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, నాయకులు మునగాల విలియం, అప్పం కిష న్, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మాతి, కాంగ్రెస్ నేతలు పుల్లా భాస్కర్, ఘంటా నరేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ, వివిధ పార్టీల నాయకులు దయాకర్, సంపత్, బోడ డిన్నా, నాగెల్లి నరేష్, వేణుగోపాల్‌గౌడ్, రజినికాంత్, నమిండ్ల శ్రీనివాస్, వీసం సురేందర్‌రెడ్డి, కుసుమ లక్ష్మీనారాయణ, తోట రమేష్, పిన్నోజు సతీష్‌కుమార్, బుల్లెట్ వెంకన్న, శ్రీనాథ్‌తోపాటు స్థానికులు భారీగా సంఖ్యలో సుధీర్‌రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ..

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సుధీర్‌రెడ్డి తల్లి అరుణాదేవి, అన్న సునీల్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. ‘సుధీర్‌రెడ్డి బతికున్నంత కాలం మా కుటుంబం కంటే ఎక్కువగా వైఎస్సార్ కుటుంబం, వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం శ్రమించాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసినా లొంగకుండా కరుడుగట్టిన కార్యకర్తగా పార్టీ బలోపేతానికి శ్రమించాడు. మీరు కనిపించి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి’ అని వారు జగన్‌ను కోరారు. దీంతో సుధీర్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తారని రాష్ట్ర నాయకులు హామీ ఇచ్చారు.

శోకసంద్రంగా మారిన ఎంజీఎం మార్చురీ..

అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ ఎంజీఎం ఆస్పత్రిలో సుధీర్‌రెడ్డి మృతదేహం వద్ద బంధుమిత్రులు, స్నేహితులు రోదించిన తీరు ఆ ప్రాంతమంతా మర్మోగింది. పార్టీలకతీతంగా పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు మార్చురీ వద్దకు తరలివచ్చారు. మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేశ్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నాయకుడు రాజారాపు ప్రతాప్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు వాసుదేవరెడ్డి, వైఎస్సార్ సీపీ స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జి విలియమ్స్, వైస్సాఆర్ సీపీ నాయకులు కిషన్, వేణుయాదవ్, కూరబోయిన సాంబయ్య, చింతలపూడి నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, నాయకుడు కోరబోయిన సాంబయ్య,  శేఖర్‌గౌడ్, సందర్శించి నివాళులర్పించారు.
 
హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ రాష్ర్ట నాయకుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డికి వైఎస్సార్ సీపీ నివాళి అర్పించింది. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంతాపసభలో సుధీర్‌రెడ్డి మృతికి పార్టీ తీవ్ర సంతాపం తెలియజేసింది. వరంగల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా సుధీర్‌రెడ్డి పార్టీకి అందించిన సేవలు మరవలేనివని పార్టీ నాయకులు గుర్తుచేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ తరఫున సుధీర్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వి. విజయసాయిరెడ్డి, పీఎన్‌వీ ప్రసాద్, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, బుగ్గాన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రకాష్‌రెడ్డి, డా.ప్రఫుల్ల, చల్లా మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement