వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు డి.రాజారెడ్డి శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు.
నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు డి.రాజారెడ్డి శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజారెడ్డి ఇవాళ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నేతలు సంతాపం తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం రాజారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజారెడ్డి అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు.