వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బల మృతి | YSR CP Central Committee member Dabbala pases away | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బల మృతి

Published Sat, Jul 2 2016 1:43 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బల మృతి - Sakshi

వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బల మృతి

సూళ్లూరుపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడు దబ్బల రాజారెడ్డి (55) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన రాజారెడ్డి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. దివంగత సీఎం వైఎస్సార్ అభిమాని. ఆయన స్ఫూర్తితో 2006లో కాంగ్రెస్‌లో చేరి మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితుడిగా మారారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం ముందునుంచే ఆయన వెంట నడుస్తున్నారు. రాజారెడ్డికి భార్య సౌదామిని, కుమారుడు శ్రీమంత్‌రెడ్డి ఉన్నారు.

 నేడు సూళ్లూరుపేటకు వైఎస్ జగన్
 సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దబ్బళ రాజారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట వెళ్లనున్నారు.  రాజారెడ్డి మృతి పట్ల  జగన్ సంతాపం వ్యక్తం చేశారు.  ఆయన అంత్యక్రియలు సూళ్లూరుపేటలో శనివారం జరగనున్నాయి. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి  జగన్ శనివారం ఉదయం 9.20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మీదుగా సూళ్లూరుపేటకు వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement