
పరామర్శ యాత్రను విజయవంతం చేయాలి
సుబేదారి : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 8వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నా యకురాలు షర్మిల చేపట్టనున్న పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. ఈనెల 8వ తేదీ ఉదయం 8గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరి బ్రాహ్మణపల్లి, ఇర్వెన్, దేవుని షడ్కల్, వెల్జాల మీదుగా కల్వకుర్తి చేరుకుంటారన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు రోజుల పాటు ఆమె యాత్ర కొనసాగుతుందని, ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాంతరం అమరులైన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. ఈ మేరకు యాత్రను విజయవంతం చేయాలని సుధీర్‌రెడ్డి కోరారు.
ఈ సమావేశంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ అప్పం కిషన్, యువజన విభాగం నగర నాయకుడు జీడికంటి శివతో పాటు నాయకులు నాగవెళ్లి రజనీకాంత్, గుండ్ల రాజేష్‌రెడ్డి, నెమలిపురి రఘు, నాగపూరి దయాకర్, మోడెం రాజేష్, ఆరెపల్లి రాజు, ప్రశాంత్, హరీష్, పోలపల్లి రాజు, మైనార్టీ నాయకుల సయ్యద్ అబ్దుల్ ఖాదర్, మహ్మద్ ముజరుద్దీన్ ఖాన్ , కాయిత కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.