visitation trip
-
ధైర్యంగా ఉండండి..మంచిరోజులు వస్తాయి
జూబ్లీహిల్స్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రకు మూడో రోజు గురువారం అనూహ్య స్పందన లభించింది. మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్‌లోని సత్యనారాయణ నివాసానికి ఉదయం 10.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. పార్టీ వైద్యవిభాగం రాష్ట అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్థానికులు ఆమెను చూడడానికి, కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. ఉదయం 10.30 గంటలు... ముడతా సత్యనారాయణ నివాసం (రహమత్‌నగర్) దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన ముడతా సత్యనారాయణ కుటుంబ సభ్యులను రాజన్న బిడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల గురువారం పరామర్శించారు. ఆమెను చూడగానే సత్యనారాయణ భార్య లక్ష్మి, కుమారుడు క్రాంతి, కుమార్తెలు సుధారాణి, వైష్ణవి కన్నీరుమున్నీరయ్యారు. సుధారాణి, వైష్ణవిలు షర్మిలను ‘అక్కా... జగనన్న, మీ పిల్లలు, విజయమ్మ ఎలా ఉన్నారు?’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు. మహానేత మరణ వార్తతో తీవ్ర వేదనకు గురైన తన భర్తకు గుండెపోటు వచ్చిం దని లక్ష్మి తెలిపారు. ఆస్పత్రికితీసుకెళితే ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెప్పారని... దీంతో సరైన వైద్యం చేయించలేకపోయామని... ఆయన మృతి చెందాడని చెబు తూ లక్ష్మి విల పించారు. ఆమెను ఓదార్చిన షర్మిల... ‘మళ్లీ మంచిరోజులు వస్తాయి. మీ కుటుంబానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు... అండదండలు అందిస్తా’మని భరోసా ఇచ్చారు. ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా పలుకరిస్తూ... వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. క్రాంతికి మంచి ఉద్యోగం ఇప్పించాలని తల్లి లక్ష్మి కోరగా.. తప్పకుండా సాయం చేస్తామని షర్మిల భరోసా ఇచ్చి.. అక్కడి నుంచి కదిలారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్య క్షుడు, పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, రాష్ట్ర సమన్వయ కార్యదర్శి జొన్నలగడ్డ లూర్ధుమేరి, రహమత్‌నగర్ డివిజన్ అధ్యక్షురాలు షమీమ్, నాయకులు మల్లాది సం దీప్, చోటూ, రమేష్, మహేశ్, విజయలక్ష్మి, రాజేంద్రసింగ్, సయ్యద్, తులసీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. పేదరికంలో కుటుంబం సత్యనారాయణ ఆకస్మిక మరణంతో కుటుంబాన్ని నడపడానికి లక్ష్మి హౌస్‌కీపింగ్‌లోనూ... కుమారుడు క్రాంతి పాలిటెక్నిక్ డి ప్లొమా మధ్యలో ఆపేసి... ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. పెద్ద కుమార్తె సుధారాణి ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పని చేస్తుండగా... చిన్న కుమార్తె వైష్ణవికి ఇటీవలే వివాహమైంది. ఖైరతాబాద్ 11.40 గంటలు... శివలాల్ యాదవ్ నివాసం (మారుతీ నగర్, ఖైరతాబాద్) బంజారాహిల్స్: ఖైరతాబాద్ పెద్ద గణేష్ చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో మహిళలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. శివలాల్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆమెను తమ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్, శివలాల్ యాదవ్‌ల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. శివలాల్ భార్య లలితను షర్మిల పరామర్శించారు. వైఎస్సార్‌కు తన భర్త వీరాభిమాని అని... ఆయన మరణ వార్తను టీవీలో చూస్తూ ... ఆవేదనతో కన్నుమూశాడని లలిత వివరించారు. వైఎస్సార్‌లాంటి సీఎంను తాము ఇంత వరకు చూడలేదని అన్నారు. శివలాల్ ముగ్గురు కొడుకులు నరేందర్ యాదవ్, మహేష్ యాదవ్, సురేష్ యాదవ్‌లను కూడా షర్మిల పరామర్శించారు. వారి పిల్లలతో మాట్లాడారు. ఏం చదువుతున్నారని అడిగారు. మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో వైఎస్సార్ అభిమానులు వేల సంఖ్యలో ఉంటారని చెప్పారు. పేదవాడి ఆకలి తెలిసిన గొప్ప నేతని... పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఆయన స్ఫూర్తితో తాను ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వివరించారు. అక్కడి మహిళలంతా మహానేత చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో షర్మిల ఒకింత ఉద్వేగానికి గురై... కంట తడి పెట్టారు. కొద్దిసేపు తండ్రి ఫొటోను చూస్తూ గడిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని షర్మిలను మహేష్ కోరారు. ఖైరతాబాద్‌లో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్‌ను గెలిపించుకొని పెద్ద గణేష్ చౌరస్తాలో వైసీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. అనంతరం పేద వృద్ధ మహిళలకు షర్మిల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు ఎం.సుజాత, ఉషారాణి, వరలక్ష్మి, మేఘన, రమాదేవి, శారద, ప్రశాంత్, రాజు యాదవ్, వెంకట్ మోహన్, చంద్రశేఖర్, సురేందర్ ముదిరాజ్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 12.05 గంటలు. కొండబోయిన లత నివాసం (కట్టమైసమ్మ బస్తీ, రసూల్‌పురా) రసూల్‌పురా: కట్టమైసమ్మ బస్తీలోని లత కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. కుటుంబ పెద్ద గౌరమ్మ, రేణుకలు మహానేత వైఎస్ఆర్ను తలచుకుని కంటతడి పెట్టారు. తాము డ్వాక్రా రుణాలు తీసుకుంటున్నామంటే వైఎస్ చలవేనని పేర్కొన్నారు. తమ కుమార్తె లతకు వైఎస్సార్ అంటే అభిమానమని చెప్పారు. ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి పసిగుడ్డుతో ఇంటికి వచ్చిన లత... వైఎస్సార్ మరణ వార్తలను టీవీలో చూస్తూ కన్ను మూసిందని వివరిస్తూ ఆ కుటుంబం కంటతడి పెట్టడంతో అక్కడి వారి కళ్లు చెమ్మగిల్లాయి. లత కూతురు వైష్ణవిని షర్మిల అక్కున చేర్చుకున్నారు. ఏం చదువుతున్నావు? ఎంత ర్యాంక్ వస్తోంది? అని అడిగారు. బాగా చదువుకోవాలని చెప్పారు. పాఠశాలలోని స్నేహితుల పేర్లు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వైష్ణవికి అన్నివిధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని ఆ కుటుంబ సభ్యులకు సూచించారు. సుమారు 15 నిమిషాల పాటు షర్మిల అక్కడ గడిపారు. బయటికి వచ్చిన అనంతరం బస్తీవాసులు ఆమెతో ఫొటోలు దిగారు. స్థానిక నాయకులు రాములు, ఆంజనేయులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించారు.అక్కడి నుంచి బయలుదేరిన షర్మిలకు బాలంరాయి విమాన నగర్లో మమత హైస్కూల్ విద్యార్థులు స్వాగతం పలికారు, కారు వద్దకు వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఆమెతో కరచాలనం చేశారు. అనంతరం షర్మిల నిజామాబాద్‌కు బయలుదేరారు. ఘన స్వాగతం కట్టమైసమ్మ బస్తీలో పార్టీ నాయకులుఆదం విజయ్ కుమార్, కె.చంద్రశేఖర్రెడ్డిలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, జగదీశ్వర్ గుప్త తదితరులు పాల్గొన్నారు. -
'వైఎస్ఆర్ పథకాలు బతికించుకుందాం'
-
'వైఎస్ఆర్ పథకాలు బతికించుకుందాం'
► రాజన్న రాజ్యం సాధించుకుందాం.. గ్రేటర్ పరామర్శ యాత్రలో షర్మిల ► వైఎస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి ► నగరాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు సాక్షి, హైదరాబాద్: ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన పథకాలను బతికించుకొందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం సాధించుకుందామని పేర్కొన్నారు. వైఎస్ హయాంలోనే హైదరాబాద్ మహానగరం అభివృద్ధి వైపు పరుగులు తీసిందని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, మెట్రోరైలు.. ఇలా అన్నీ ఆ మహానేత చేసినవేనని చెప్పారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను కలిసేందుకు బుధవారం రెండోరోజు షర్మిల గ్రేటర్ హైదరాబాద్‌లో పరామర్శ యాత్ర నిర్వహించారు. ఏడు కుటుంబాలను పరామర్శించారు. రాజన్న బిడ్డను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలి వచ్చారు. బస్తీలు, కాలనీలు. జై జగన్ నినాదాలతో హోరెత్తాయి. ఈ సందర్భంగా దిల్సుఖ్నగర్ కోణార్క్ సెంటర్ వద్ద ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. మహా నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు వైఎస్ అహర్నిశలు శ్రమించారన్నారు. ఆయన హయంలోనే నగరంలో నీటి సరఫరా పరిస్థితి మెరుగైందని, కృష్ణా, గోదావరి జలాలను సిటీకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. జనం నుంచి పుట్టిన నేత వైఎస్సార్ జనం నుంచి పుట్టిన నేత అని, అందుకే ప్రజల బాధలను తన బాధలుగా చూశారని షర్మిల అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేశారని చెప్పారు. ‘‘హైదరాబాద్‌కు ఐటీ రంగాన్ని తెచ్చానంటూ చంద్రబాబు వంటి కొందరు నేతలు గొప్పలు చెప్పుకుంటారు. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి ఐటీ రంగంలో రెండో స్థానంలో ఉన్న ఉమ్మడి ఏపీ.. ఆయన దిగిపోయే సమయానికి ఐదో స్థానానికిపడిపోయింది. కానీ వైఎస్సార్ హయాంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎగుమతులు 9 నుంచి 14 శాతానికి పెరిగాయి. దేశంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఐదేళ్లలో 46 లక్షల పక్కా గృహలు నిర్మిస్తే.. మన రాష్ట్రంలో వైఎస్సార్ ఒక్కరే 46 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఆయన బతికి ఉంటే ప్రతి పేదవాడికి రాజీవ్ గృహకల్ప ద్వారా ఇల్లు వచ్చేది..’’ అని అన్నారు. అన్నదాతలకు రుణమాఫీ, ఆడపడుచులకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు తెచ్చారన్నారు. గత పాలకులు యూజర్ చార్జీలతో వైద్యాన్ని దూరం చేస్తే.. వైఎస్ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని చెప్పారు. నేడు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 కుయ్ కుయ్‌మంటూ వస్తోందంటే అది వైఎస్ కృషేనని తెలిపారు. అడుగడుగునా జన నీరాజనం రాజన్న తనయకు జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. పలుచోట్ల తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. తొలుత లోట్స్పాండ్ బయల్దేరిన షర్మిల.. సికింద్రాబాద్, ఉప్పల్,చర్లపల్లి, నాచారం, చిలుకానగర్, రామంతాపూర్, చర్చి కాలనీ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల మీదుగా 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఏడుగురి కుటుంబాలను కలిశారు. మాణికేశ్వర్‌నగర్ బొడ్రాయివీధిలో బొంత సత్తయ్య, గోదాసు నర్సమ్మ కుటుంబాలను పరామర్శించారు. తర్వాత చర్లపల్లి భరత్‌నగర్‌లో ఇంద్రాల బాలయ్య, ఉప్పల్‌లో కుంట ల క్రిష్ణ, రామంతాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఒగ్గు అంజయ్య, అక్కడే చర్చి కాలనీకి చెందిన నయల పోగుల యాదగిరి, ఎల్బీనగర్లో షాపురి శంకర్ కుటుంబాలను పరామర్శించారు. పరామర్శ యాత్రలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు పార్టీ నగర నేతలు ఆదం విజయ్ కుమార్, జి.సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, బంగి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి నిజామాబాద్‌లో పరామర్శ యాత్ర సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురువారం నుంచి రెండు రోజులు నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో 19 మంది తనువు చాలించారు. వీరిలో మొదటి విడత పరామర్శ యాత్రలో 12 కుటుంబాలను కలిశారు. రెండో విడతలో భాగంగా గురు, శుక్రవారాల్లో మిగిలిన ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. మొదటిరోజు నాలుగు, మరుసటి రోజు మూడు కుటుంబాలను కలుసుకుంటారు. వైఎస్ కోసం అసువులు బాసిన వారి స్మారకార్థం గాంధారి మండలం పోతంగల్ కలాన్ సమీపంలో శుక్రవారం పైలాన్‌ను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మా బిడ్డ నీవని...
షర్మిలకు అడుగడుగునా ఆదరణ తోబుట్టువులా అక్కున చేర్చుకున్న నగరం తొలిరోజు 8 కుటుంబాలకు పరామర్శ రాజన్న బిడ్డ రాకతో బాధితుల కళ్లలో సంతోషం సనత్ నగర్: రాజన్న బిడ్డ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను హైదరాబాద్ నగరం తోబుట్టువులా అక్కున చేర్చుకుంది. అంతులేని ప్రేమాప్యాయతలను పంచింది. పుట్టింటికి వచ్చిన కుమార్తెలా సంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి.. గాజులు వేసి ఆత్మీయతను పంచింది. ‘చిన్నా... అక్క వచ్చిందిరా...ఒక్కసారి చూడరా’ అంటూ రాజన్న మృతిని తట్టుకోలేక అనంత లోకాలకు వె ళ్లిపోయిన తన బిడ్డను తలచుకుంటూ ఓ తల్లి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుంటే... ‘నేనున్నాన’ంటూ షర్మిల అందించిన ఓదార్పు ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ‘తల్లీ బాగా చదవాలి... చదువుపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక్క ఫోన్ చెయ్యి... నేను చూసుకుంటా’నంటూ షర్మిల ఇచ్చిన భరోసా ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థినిలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ‘గ్రామ పంచాయతీలో ఏదైనా కొలువు ఇప్పించండమ్మా...’ అని అడగడమే తరువాయి... అక్కడి సర్పంచ్‌కు ఆ పనిని పురమాయించగానే ‘ఇంటికి పెద్ద దిక్కుగా వచ్చావా తల్లీ...’ అంటూ మరో కుటుంబం మురిసిపోయింది. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక గ్రేటర్ హైదరాబాద్‌లో అశువులు బాసిన కుటుంబాల కోసం ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ యాత్రలో భాగంగా మొదటి రోజు 8 కుటుంబాలను ఆమె పరామర్శించారు. వెళ్లిన చోటల్లా ‘అధైర్య పడవద్దు... రాజన్న కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంద’ని భరోసా ఇచ్చారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో పరామర్శ యాత్ర సాగింది. ఈమార్గాల్లో వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, రాఘవరెడ్డి తదితరులతో కలిసి మొదటి రోజు షర్మిల పరామర్శ యాత్ర కొనసాగింది. -
నేనొస్తున్నా!
నేటి నుంచి గ్రేటర్లో షర్మిల యాత్ర తొలిరోజు కుటుంబాలకు పరామర్శ చందానగర్, షాపూర్ నగర్లలో బహిరంగ సభలు 5, 6, 7 తేదీల్లో 17 కుటుంబాలకు భరోసా సిటీబ్యూరో: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మర ణ వార్తను తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు... బడుగు ప్రజలకు రాజన్న బిడ్డగా ‘నేనున్నాన’ంటూ భరోసా ఇచ్చేందుకు... మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల గ్రేటర్లో తొలిసారిగా మంగళవారం నుంచి పర్యటించబోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పరామర్శ యాత్రకు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు తమ అభిమాన నేత రాజన్న బిడ్డ షర్మిలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. తొలి రోజు ఇలా... ఈ నెల 5న (మంగళవారం) ఉదయం 9 గంటలకు లోటస్ పాండ్ నుంచి షర్మిల బయలుదేరుతారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45, మాదాపూర్ పీఎస్, హైటెక్ సిటీ ఫ్లైవర్ కింద నుంచి కొండాపూర్, మియాపూర్, చందానగర్ల మీదుగా తారానగర్ తుల్జాభవన్ దేవాలయ సమీపంలోని దిగంబరరావు ఇంటికి చేరుకుంటారు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఉదయం 10.30 గంటలకు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుంది. ఉదయం 11.30 గంటలకు కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఫస్ట్ ఫేజ్ చౌరస్తా సమీపంలో ఉన్న సన్నిధి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత 12.30కి కూకట్పల్లి రామాలయం సమీపంలోని టి.రణతేజ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మూసాపేట గాంధీ చౌరస్తా సమీపంలోని నోముల రాజయ్య ఇంటికి చేరుకుంటారు. 2.30 గంటలకు షాపూర్ నగర్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి... అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు. లెఫ్ట్ రోడ్డులో షాపూర్‌నగర్‌లోని దామా నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి... కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 3.30 గంటలకు సుభాష్ నగర్‌లోని వెంకట రమణరాజు ఇంటికి చేరుకుంటారు. ఆ తర్వాత దూలపల్లిలో సురకంటి రమేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా మౌలాలి ఉల్ఫత్ నగర్లో అబ్దుల్ రహమాన్ కుటుంబాన్ని పరామర్శించి లోటస్ పాండ్‌కు చేరుకుంటారు. రెండు, మూడో రోజుల పరామర్శ యాత్ర షెడ్యూల్‌ను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ చెప్పారు. -
నేటి నుంచి మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
►తొలిరోజు ఏడు కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మెతుకుసీమలో పరామర్శకు పయనమవుతున్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. షర్మిల వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు. జిల్లా వ్యాప్తంగా 850 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తారు. తొలి రోజు ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. మొత్తంగా 13 బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుంటారు. ఒక్క పటాన్చెరు నియోజకవర్గం మినహాయించి మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ షర్మిల పర్యటన ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. -
నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
-
రేపటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
- వరంగల్ జిల్లాలో మూడోదశ ములుగు నియోజకవర్గంలో ప్రారంభం - రెండు రోజుల పాటు 11 కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల - అనంతరం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశం సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో మూడోదశ పరామర్శయాత్ర నిర్వహించనున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో రెండో రోజుల పాటు జరిగే యాత్రలో భాగంగా ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని 11 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఆగష్టు 24 నుంచి 28వ తేదీ వరకు, సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు వరంగల్ జిల్లాలో రెండు విడతలుగా షర్మిల పరామర్శ యాత్ర కొనసాగింది. మూడోదశలో భాగంగా షర్మిల సోమవారం తొలిరోజు దోమగండి ముత్తయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ నెల 21న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి షర్మిల బయలుదేరి వెళతారు. ఆ రోజు ములుగు నియోజకవర్గంలో ఆరు కుటుంబాలను, 22న ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం 22వ తేదీ సాయంత్రం పరామర్శయాత్ర కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుందని రాఘవరెడ్డి చెప్పారు. అదేరోజు మంథని నియోజకవర్గంలో ఒక కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారని, జిల్లాలో 23, 24 తేదీల్లో యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి యాత్ర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. -
21న షర్మిల పరామర్శ యాత్ర
వైఎస్సార్సీపీలో పలువురి చేరికలు ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి రాజుపేట(మంగపేట) : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల 3వ విడత పరామర్శ యాత్ర ఈనెల 21న మండలంలోని బండారుగూడెం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహెందర్ రెడ్డి తెలిపారు. ఏర్పాట్లపై మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం సమీక్షించారు. మండలంలోని రమణక్కపేటకు చెందిన ఎక్స్ ఎంపీటీసీ సభ్యుడు బట్ట చందర్రావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన అనుముల రాఘవరెడ్డి, మల్రెడ్డి సుధాకర్‌రెడ్డి, కోడెం రవీందర్, గాదె నర్సింహారావు, మంచర్ల సూర్యం, బట్ట బాబూరావు, పోలె బోయిన రవరాజు, కనుకుంట్ల నాగయ్య వైఎస్సార్సీపీలో చేరారు. మహెందర్‌రెడ్డి వారిని పార్టీ కండువాతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట జిల్లా జాయింట్ జెక్రటరీ ఎండీ కైసర్‌పాషా, ఏటూరునాగారం గ్రామకమిటీ అధ్యక్షుడు యరకట్ల సమ్మయ్య, జిల్లా నాయకులు నరెందర్‌రెడ్డి, సప్పిడి రంజిత్, వీరారెడ్డి ఉన్నారు. ఏటూరునాగారం : మండల కేంద్రానికి 21న షర్మిల రానున్న నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆదివారం రూట్ మ్యాప్ పరిశీలించారు. మండల కేంద్రంలో దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వల్స చిన్నక్క ఇంటిని ఆయన సందర్శించారు. ఏర్పాట్లపై పార్టీ నాయకులతో సమీక్షించారు. ఆయన వెంట నాయకులు సోమ నరేందర్, సప్పిడి రంజిత్, ఖైసర్‌పాషా, విజయభాస్కర్‌రెడ్డి, గద్దెల సాలయ్య, సాబీర్, ఎర్రకట్ల సమ్మయ్య, గౌస్‌పాషా ఉన్నారు. వైఎస్సార్ విగ్రహ పరిశీలన వెంకటాపురం : మండల కేంద్రంలోని తాళ్లపాడ్‌లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈనెల 22న మండలంలో మృతి చెందిన కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. ఈ సందర్భంగా షర్మిల వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి, సప్పిడి రంజిత్, వీరారెడ్డి వెంకటాపురం మండల అధ్యక్షుడు మెట్టు సురేష్ ఉన్నారు. -
రాజన్న ఉంటే పేదలకు భరోసా ఉండేది
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందేది ప్రజానేత వైఎస్‌కు మరణం లేదు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నారు నర్సంపేట పరామర్శ యాత్రలో షర్మిల వరంగల్ జిల్లాలో మూడో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ వరంగల్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ప్రజల కోసం తపించిన గొప్పనాయకుడని వైఎస్సార్ తనయ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ సోదరి షర్మిల అన్నారు. ప్రజల కోసం ఎంత చేసినా తక్కువే అనే భావనతో జనం మెచ్చేలా వైఎస్ పాలన సాగించారన్నారు. వైఎస్ ఉంటే ప్రతి పేద కుటుంబానికీ సొంతిళ్లు ఉండేదని, ప్రతి ఎకరాకూ సాగునీరు అందేదని అన్నారు. వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మూడోరోజు బుధవారం నర్సంపేట నియోజకవర్గంలో ఆరు కుటుంబాలను పరామర్శించారు. నియోజకవర్గ ఇంచార్జి నాడెం శాంతికుమార్ నిర్మించిన వైఎస్సార్ స్మారక గార్డెన్లో వైఎస్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం షర్మిలప్రసంగించారు. ‘ఒక నాయకుడి మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోవడం దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక నాయకుడు చనిపోతే ఇంతమంది అభిమానులు గుండె పగిలి చనిపోవడం వైఎస్ విషయంలోనే జరిగింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారు. రైతులను రాజులను చేశారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. మన రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ర్టంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో కృషి చేశారు. వైఎస్ పాలన కాలంలో దేశం మొత్తం మీద ప్రభుత్వాలు 46 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే వైఎస్ హయాంలోరాష్ట్రంలో 46 లక్షల ఇళ్లను నిర్మించారు. డబ్బులు లేని కారణంగా చదువులు ఆగిపోయే పరిస్థితి ఏ ఒక్క పేదకు రాకూడదని ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. సీఎం పదవిలో ఉన్నవారు ప్రజలను బిడ్డల్లా ప్రేమించాలని రుజువు చేసి చూపారు. అందుకే వైఎస్ ఇప్పటికీ కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. వైఎస్‌కు మరణంలేదు. తెలుగుజాతి బతికి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో రాజన్నగా జీవించి ఉంటారు. వైఎస్ ఆశయాలను మనమే బతికించుకోవాలి. మీరు, నేను, మనమందరం చేయిచేయి కలపాలి. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం’ అని షర్మిల అన్నారు. వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే ప్రక్రియలో భాగంగా షర్మిల బుధవారం నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం వెంకటాపురంలో సూరం ఐలయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి ఇదే మండలంలోని దీక్షకుంట్ల గ్రామానికి వెళ్లారు. ఈ ఊరిలోని బేతం చంద్రయ్య, కొమ్ముల మల్లమ్మ కుటంబాలను పరామర్శించారు. తర్వాత చెన్నారావుపేట మండలం జీజీఆర్పల్లికి సమీపంలోని మామిళ్లపల్లిలో బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పించారు. అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోని కొత్తగూడ మండలం ఓటాయితండాకు వెళ్లారు. వైఎస్ మృతి తట్టుకోలేక చనిపోయిన బానోత్ మంగిళి కుటుంబాన్ని పరామర్శించారు. చివరగా దుగ్గొండి మండలం మహ్మదాపురంలోని మిట్టపెల్లి సంజీవ ఇంటికి వెళ్లారు. సంజీవ తల్లి సారమ్మను పరామర్శించారు. మూడోరోజు ఆరు కుటుంబాలను పరామర్శించిన షర్మిల గురువారం నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గ ట్టు శ్రీకాంత్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, ఆదం విజయ్‌కుమార్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, షర్మిలసంపత్, జి.శివకుమార్ పాల్గొన్నారు. వైఎస్ కలలు నెరవేర్చుదాం: పొంగులేటి వైఎస్ ఆశయాలను పూర్తి చేసేందుకు, ఆయన కలలను నెరవేర్చేందుకు అందరం కలసి కష్టపడదామని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పొంగులేటి ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ పేదల బాంధవుడిగా పని చేశారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టినా ప్రజలే చెబుతున్నారు. అందుకే ఆ నేత మరణించి ఆరేళ్లవుతున్నా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రాజన్న కలలు నెరవేర్చడానికి మనమంతా కలసి కష్టడదాం’ అని పిలుపునిచ్చారు. -
రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం
-
రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం
వరంగల్ జిల్లాలో షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలకు పరామర్శ అటవీ ప్రాంతానికి వెళ్లి గిరిజన కుటుంబానికి భరోసా ప్రజలను వైఎస్సార్ సొంత బిడ్డల్లా చూసుకున్నారు ఆయన కోట్లాది మంది గుండెల్లో బతికే ఉన్నారు రాజన్న ఆశయాలను మనమే బతికించుకుందామన్న జగన్ సోదరి వరంగల్: ప్రజలందరూ మెచ్చేలా పరిపాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ప్రజల మనసులో రాజశేఖరరెడ్డి ఉంటారని... వైఎస్సార్ ప్రజలను సొంతబిడ్డల్లా చూసుకుని పాలన సాగించారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో రెండో దశ మంగళవారం కొనసాగింది. యాత్ర రెండో రోజున షర్మిల మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలను పరామర్శించారు. నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన ఆమె... అక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఏం చేశారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను గుండెల్లో పెట్టుకున్న మీరు ఇక్కడికి వచ్చారు. వైఎస్సార్‌పై మీకు ఉన్న అభిమానానికి ఇదే సాక్ష్యం. ప్రజలను సొంత బిడ్డల్లా భావించి భరోసా కల్పించిన వైఎస్సార్... వారి గుండెల్లో రాజన్నగా నిలిచిపోయారు. అందరి అవసరాలకు తగినట్లుగా పాలన సాగించారు. సీఎం పదవిలో ఉన్నవారు ప్రజలను బిడ్డల్లా ప్రేమించాలని రుజువు చేసి చూపారు. అందుకే ఇప్పటికీ రాజన్న ప్రజల్లో ఉన్నారు. తెలుగుజాతి బతికి ఉన్నంతకాలం కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఆయన జీవించి ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను మనమే బతికించుకోవాలి. మంచి రోజులు మళ్లీ వస్తాయి. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. వైఎస్సార్‌పై అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా..’’ అని షర్మిల పేర్కొన్నారు. మానుకోటలో ఆత్మీయ స్వాగతం వరంగల్ జిల్లా రెండో దశ పరామర్శ యాత్ర రెండో రోజైన మంగళవారం తొలుత మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెంలో కమ్మజెల్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి చిన్ననాగారం చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. సమీపంలోని తార్సింగ్బాయి తండాలో గుగులోత్ బబ్బి కుటుంబాన్ని ఆమె ఓదార్చారు. అక్కడి నుంచి చిన్నముప్పారంలోని కె.వెంకట్రాం నర్సయ్య ఇంటికి వెళ్లిన షర్మిల... వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత పరామర్శ యాత్ర మహబూబాబాద్ పట్టణానికి చేరుకుంది. ఇక్కడ భారీ సంఖ్యలో జనం రహదారులకు ఇరువైపులా నిలబడి షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. షర్మిల వారికి అభివాదం చేస్తూ, కొందరితో కరచాలనం చేస్తూ ముందుకుసాగారు. జనం భారీ సంఖ్యలో రావడంతో మహబూబాబాద్‌లో షర్మిల యాత్ర ఆలస్యంగా జరిగింది. ఇక్కడ అమడగాని కరయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆమె... తర్వాత ఇదే మండలం గాంధీపురంలో షేక్ బికారి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం చేరుకుని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబానికి భరోసా కల్పించారు. సాయంత్రం 6.24 గంటలకు లక్ష్మీపురం నుంచి బయలుదేరి గూడూరు మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఊట్ల గ్రామానికి వెళ్లిన షర్మిల... అక్కడ సబావత్ మంగమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. రాత్రిపూట దట్టమైన అడవిలో ప్రయాణించి మరీ షర్మిల ఊట్ల గ్రామానికి రావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయాల్లోనూ ఏ రాజకీయ నాయకుడు రాని తమ ఊరికి రాత్రిపూట షర్మిల రావడం ఆమె ధైర్యానికి చిహ్నమని చెప్పారు. షర్మిల తమ ఊరికి రావడంతో వైఎస్సార్‌ను మళ్లీ చూసినట్లుగా ఉందని సబావత్ మంగమ్మ కుమారుడ ు కృష్ణ పేర్కొన్నారు. మొత్తంగా రెండోరోజు ఏడు కుటుంబాలను పరామర్శించిన షర్మిల... బుధవారం నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను కలుసుకోనున్నారు. ఈ యాత్రలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్.భాస్కర్‌రెడ్డి, అనిల్‌కుమార్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, ఎం.శంకర్, షర్మిల సంపత్, ఎస్.రాజేశ్, టి.నాగారావు, సాధు రమేశ్‌రెడ్డి కె.పాండురంగాచార్యాలు, కె.అచ్చిరెడ్డి, హైదర్ అలీ, ఎం.దయానంద్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీలో పలువురి చేరిక
కొడకండ్ల : మండలంలోని టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు షర్మిల రెండో విడత పరామర్శ యాత్రలో భాగంగా సోమవారం వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మండల కేంద్రానికి చెందిన టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు గుగులోత్ రాంజీనాయక్, కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కర్ర అశోక్‌రెడ్డి, కొడకండ్లకు చెందిన మిట్ట అశోక్‌రెడ్డి, ముక్కెర సురేష్, వెంకన్న, నరేష్‌ల ఆధ్వర్యంలో 15 మంది వైఎస్సార్ సీపీలో చేరగా వారికి శ్రీనివాసరెడ్డి, మహేందర్‌రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా నాయకుడు కాందాటి అచ్చిరెడ్డి, మండల నాయకులు నీలం లక్ష్మయ్య పాల్గొన్నారు. -
ఓరుగల్లులో జనయాత్ర
వైఎస్ తనయకు ఆత్మీయ స్వాగతం పలికిన వరంగల్ ► మహానేత జ్ఞాపకాలతో ఉద్వేగానికి గురైన జనం ► నాలుగో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించిన షర్మిల ► నేడు జిల్లాలో ముగియనున్న మొదటి దశ యాత్ర సాక్షి ప్రతినిధి, వరంగల్: అదే చిరునవ్వు. అదే ఆప్యాయత. అచ్చం రాజన్నలాగే ధైర్యం చెబుతూ, ఆయన మళ్లీ వచ్చాడా అనిపిస్తూ... ఆయన తనయ షర్మిల పరామర్శ యాత్ర గురువారం నాలుగో రోజు వరంగల్ నగరంలో జనయాత్రలా కొనసాగింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వస్తున్న విషయం తెలుసుకున్న ప్రజలు ఆమెను చూడటానికి బారులు తీరారు. ఆత్మీయంగా స్వాగతం పలికారు. వైఎస్ అకాల మరణంతో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్టే అయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మీ నాయన మాకు చేసిన మేలు మాటల్లో చెప్పలేమమ్మా. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో మాకందరికీ దగ్గరయ్యారు. ఆయన పోయాక అంతా మారిపోయింది’’ అని దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య భార్య రాధ షర్మిలతో అన్నారు. ‘‘మా అత్తకు పింఛను వస్తలేదు. మాకు ప్రభుత్వ ఇండ్లు రాలేదు. వైఎస్ ఉంటే ఇవన్నీ జరిగేవమ్మా. ఇంత దూరం మాకోసం వచ్చిన నిన్ను మరువమమ్మా’ అని భావోద్వేగంతో అన్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం షర్మిల ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఖాజీపేటలోని బాలవికాస ఆవరణ నుంచి పెద్దమ్మగడ్డ, పోచమ్మ మైదాన్, దేశాయిపేట, కాశిబుగ్గ, ఉర్సు, మరియపురం, ఊకల్హవేలీల్లో షర్మిల జరిపిన 68 కిలోమీటర్ల యాత్రకు భారీ స్పందన వచ్చింది. వందలాది మోటారు వాహనాలతో యువకులు స్వాగత ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ షర్మిల ముందుకు సాగారు. వరంగల్ నగరమంతటా భారీ స్పందన రావడంతో షర్మిల యాత్రకు ఎక్కువ సమయం పట్టింది. జిల్లాలో శుక్రవారంతో పరామర్శ యాత్ర తొలి దశ ముగియనుంది. ఓపికతో.. ఓదార్చుతూ.. ‘‘అమ్మా! మీ నాయన ఎప్పుడు చనిపోయారు? అన్నయ్య ఎలా చనిపోయాడు? మీరేం చేస్తున్నారు?’’ అంటూ హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన తీగల చిరంజీవి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. 30 నిమిషాలు వారితో ముచ్చటించారు. చిరంజీవి సోదరుడు అనిల్ ఏడు నెలల కొడుకు మన్విత్‌ను ఒళ్లోకి తీసుకుని లాలించారు. అనంతరం వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ చరిత్రాత్మక పాదయాత్రలో తానూ పాల్గొన్నానని సక్కుబాయి కుమారుడు భాస్కర్ చెప్పారు. అనంతరం కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కొమురయ్య కొడుకు శివకుమార్, కూతుళ్లు భారతి, రాధిక, అనిత, రజనిలను పేరుపేరునా పలకరించి ఓదార్చారు. వారు ఏం చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. కొమురయ్య మనవలు, మనవరాళ్లకు చాక్లెట్లిచ్చారు. అనంతరం కాశిబుగ్గలో నాగవెళ్లి వీరస్వామి కుటుంబీకులను కలుసుకున్నారు. రాజన్న కుటుంబమంతా అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. ‘అవ్వా బాధ పడొద్దు. ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఆయన భార్య సుభాషిణికి ధైర్యం చెప్పారు. అనంతరం ఉర్సులో రామ సుదర్శన్ ఇంటికి వెళ్లారు. ఆయన భార్య భారతిని ఓదార్చారు. వారామెకు ఆప్యాయంగా బొట్టు పెట్టి స్వాగతం పలికారు. తర్వాత మరియపురంలో బిట్ల రాజ్యలక్ష్మి కుటుంబీకులను పరామర్శించారు. ఆమె కోడలు సత్తెమ్మ తదితరులకు ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మతిన్ ముజదాది, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.ప్రసాదరాజు, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, సాదు రమేశ్‌రెడ్డి, పి.ప్రపుల్లారెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్‌రావు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, బి.బ్రహ్మానందరెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, షర్మిల సంపత్, జి.జైపాల్‌రెడ్డి, ఎం.శంకర్, సలీం, కె.వెంకట్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, బి.సంజీవరావు, జి.శివకుమార్, డోరెపల్లి శ్వేత, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, టి.నాగరావు, ఎం.సంతోష్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్న గౌడ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందే వచ్చిన రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగ వరంగల్ జిల్లాలో రెండు రోజుల ముందుగానే వచ్చింది. గురువారం గీసుగొండ మండలం ఊకల్‌హవేలీలో ఓదెల సరస్వతి ఇంటికి షర్మిల వెళ్లారు. సరస్వతి కుమారులు శ్రీకాంత్, రాజ్‌కుమార్ తమకు రాఖీ కట్టాలని షర్మిలను కోరారు. ఆమె వెంటనే రాఖీలు తెప్పించి కట్టడంతో, షర్మిలమ్మ పెద్దక్కలా తమ ఇంటికి వచ్చారంటూ సంబరపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉమారెడ్డి అనే యువకుడు కూడా ‘అక్కా రాఖీ కట్టవా’ అని కోరడంతో అతనికి కూడా షర్మిల రాఖీ కట్టారు. -
పరామర్శకు కదలి వచ్చిన నాయకులు
పోచమ్మమైదాన్: షర్మిల పరామర్శ యాత్రలో నాలుగోరోజు వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యూరు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో గురువారం జరిగిన యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యద ర్శు లు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యతిన్ ముజదాది, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, వ రంగల్ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్, వేవ ుులశేఖర్రెడ్డి, విలియం మునిగాల, జి.రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర సం యుక్త కార్యదర్శులు బి.బ్రహ్మానందరెడ్డి, గూడూరు జైపాల్‌రెడ్డి, షర్మిల సంపత్, నాడెం శాంతికుమార్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్నగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.సంజీవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.శివకుమార్, రాష్ట సంయుక్త కార్యదర్శి ఎండీ సలీం, రాష్ట్ర సెక్రెటరీ కె.వెంకట్‌రెడ్డి, రాష్ట్రసెక్రెటరీ జి.శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బిష్వ రవీందర్, రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రపుల్లా రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎస్.భాస్కర్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్. రాష్ట్ర డాక్టర్స్ విభాగం కార్యదర్శి డోరేపల్లి శ్వేత, గ్రీవెన్స్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, రాష్ట్ర జేఎస్ టి.నాగరావు, రాష్ట్ర సెక్రెటరీ ఎం.శంకర్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి, ఖమ్మం జిల్లా రాష్ట్ర నాయకుడు సాదు రమేష్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు ఎల్.జశ్వంత్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ నాయకులు జితేందర్ తివారి, రమేష్ యాదవ్, వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఎం.కళ్యాణ్‌రాజ్, వరంగల్ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎ.మహిపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, ఎ.కిషన్, జిల్లా సంయుక్త కార్యదర్శి మాధవరెడ్డి, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు కె.రాజ్‌కుమార్ యాదవ్, వరంగల్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కౌటిల్‌రెడ్డి, వరంగల్ సేవాదళ్సిటీ అధ్యక్షుడు చరణ్, వరంగల్ సిటీ యువజన అధ్యక్షుడు దయాకర్, వరంగల్ జిల్లా రైతువిభాగం అధ్యక్షుడు డి.సుదర్శన్‌రెడ్డి, మాజీ డీసీసీబీ డెరైక్టర్ పూజారి సాంబయ్య, జిల్లా నాయకులు సంగాల ఇర్మియ, నల్గొండ జిల్లా యువజన అధ్యక్షుడు పి.వేణుయాదవ్, కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షుడు కె.శివ కుమార్, ఖమ్మం జిల్లా నాయకులు ఎన్.క్రిష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఇమామ్ హుస్సేన్, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ప్రెసిడెంట్ మామిడె శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఓరుగల్లు పులకింత
నగరంలో షర్మిల పరామర్శ యాత్ర గ్రేటర్ వరంగల్‌లో విశేష స్పందన నాలుగో రోజు ఏడు కుటుంబాలకు పరామర్శ నేటితో ముగియనున్న మొదటి దశ యాత్ర వరంగల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్సార్ తనయ షర్మిల పరామర్శ యాత్రతో వరంగల్ నగరం గురువారం సందడిగా మారింది. కాజీపేట నుంచి చౌరస్తా మీదుగా నర్సంపేట రోడ్డువైపు సాగిన పరామర్శ యాత్రను చూసేందుకు నగరంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. అందరికీ అభివాదం చేస్తూ, చేయి ఊపి పలకరిస్తూ షర్మిల పరామర్శ సాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా షర్మిల, వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం వరంగల్ నగరంలో, పరకాల నియోజకవర్గంలో ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఖాజీపేట నుంచి వరంగల్ మీదుగా 68 కిలో మీటర్లు దూరం సాగిన పరామర్శ యాత్ర గీసుగొండ మండలం మరియపురం వరకు చేరింది. అక్కడి ఫాతిమా కాన్వెంట్ ఆవరణలో షర్మిల బస చేశారు. గురువారం ఉదయం నుంచే భారీగా జన స్పందన ఉండడంతో షర్మిల యాత్రకు ఎక్కువ సమయం పట్టింది. అంతా మంచే జరుగుతుంది.. కష్టాలు కొద్ది రోజులే ఉంటాయని, మంచి రోజులు మళ్లీ వస్తాయని ధైర్యం చెప్పారు. హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన తీగల చిరంజీవి కుటంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. అరగంటకుపైగా చిరంజీవి కుటుంబసభ్యులతో ముచ్చటించారు. చిరంజీవి సోదరుడు అనిల్ ఏడు నెలల కుమారుడు మన్విత్‌ను షర్మిల తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించారు. అనంతరం వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్లి షర్మిల వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సక్కుబాయి కుమారుడు భాస్కర్.. వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి అనుభవాలను షర్మిలకు వివరించారు. దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘మా అత్తకు వైఎస్ ఉన్నప్పుడు పింఛన్ వచ్చేది. ఇప్పడు రావడం లేదు’ అని కొమురయ్య భార్య రాధ షర్మిలకు చెప్పారు. ‘కష్టాలు కొద్ది రోజులే ఉంటాయి. మనకు అంతా మంచే జరుగుతుంది’అంటూ కాశిబుగ్గలోని నాగవెళ్లి వీరస్వామి కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. ఉర్సులోని రామ సుదర్శన్ ఇంటికి షర్మిల వెళ్లారు. కన్నీటి పర్యంతమైన రామసుదర్శన్ భార్య భారతను దగ్గరకు తీసుకుని షర్మిల ఓదార్చారు. షర్మిలను రామా సుదర్శన్ ఇంటికి వచ్చే సమయంలో కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఆమెకు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ‘మీకు అండగా మా కుటుంబం ఉంటుంది. ధైర్యంగా ఉండండి’ అని గీసుగొండ మండలం మరియపురంలో బిట్ల సత్తెమ్మను షర్మిల పరామర్శించారు. అనంతరం ఊకల్‌హవేలీలో ఓదెల సరస్వతి ఇంటికి వెళ్లారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక డాబాపై నుంచి దూకి చనిపోయిన ఓదెల స్వామి విషయాన్ని తెలుసుకుని షర్మిల చలించిపోయారు. శుక్రవారం నాలుగు కుటుంబాలకు పరామర్శ జిల్లా మొదటి పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం నాలుగు కుటుంబాలను పరామర్శించనున్నారు. పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ఉదయం పరామర్శిస్తారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్తారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇస్తారు. శుక్రవారం పరామర్శ యాత్ర 67 కిలో మీటర్లు సాగనుంది. -
గురువారం ఏడు కుటుంబాలకు పరామర్శ
పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పెద్దమ్మగడ్డలోని తీగల చిరంజీవి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మమైదాన్‌లో జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్తారు. తర్వాత దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య, కాశిబుగ్గలోని నాగవెల్లి వీరస్వామి, ఉర్సులోని రామ సుదర్శన్ కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని మరిపురంలోని బిట్ల రాజ్యలక్ష్మీ ఇంటికి వెళ్తారు. నాలుగో రోజు చివరగా ఇదే మండలం ఊకల్ హవేలిలోని ఓదెల స్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర 68 కిలో మీటర్లు సాగనుంది. -
అందరూ బాగుండాలి
మూడో రోజు పరామర్శ యాత్రలో షర్మిల వరంగల్ : దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత సోదరి షర్మిల పరామర్శ యాత్రకు జిల్లాలో మంచి స్పందన వచ్చింది. మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా షర్మిల బుధవారం ధర్మసాగర్, హన్మకొండ, వర్ధన్నపేట మండలాల్లోని ఏడు కుటుంబాలను పరామర్శించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం జ్యోతినికేతన్ పాఠశాల నుంచి మడికొండ, సింగారం మీదుగా యాత్ర సాగింది. 82.5 కిలో మీటర్ల దూరం సాగిన అనంతరం ఖాజీపేటలోని బాలవికాస ఆవరణలో షర్మిల బస చేశారు. షర్మిల పరామర్శ జరిగిన అన్ని గ్రామాల్లోనూ స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూశారు. దగ్గరికి వచ్చి చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల పరామర్శ యాత్ర సాగింది. షర్మిల అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధులు, పిల్లలు కనిపించగానే ఆప్యాయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. జ్యోతి నికేతన్ స్కూల్లోని పిల్లలతో మమేకయ్యారు. అందరూ బాగా చదుకోవాలని సూచించారు. సింగారంలో షర్మిలకు బోనాలతో గ్రామస్తులు స్వాగతం పలికారు. అక్కడి మహిళలు షర్మిల వద్దకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడారు. దాదాపు గంట సేపు.. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల ఒక్కో ఇంట్లో దాదాపు గంట సేపు ఉన్నారు. ధర్మసాగర్ మండలం పీచరలోని ఎడపెల్లి వెంకటయ్య భార్య రాజమ్మ, కుమారుడు రవీందర్, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బీటెక్ చదువుతున్న రవీందర్ కుమారైను ‘ఎంత పర్సంటేజ్ వచ్చింది. బాగా చదువుకో’ అని సూచించారు. రాష్ట్రంలో తరుచు పర్యటించాలని వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని వారు షర్మిలతో చెప్పారు. వైఎస్ఆర్ చేసి అభివృద్ధి పనులు ఇప్పటికి కనిపిస్తున్నాయని వారు అన్నారు. అధైర్య పడవద్దని మళ్లీ మంచి రోజులు వస్తాయని షర్మిల వారికి భరోసా కల్పించారు. ధర్మసాగర్ మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మీ కుటుంబాన్ని ఇంటికి వెళ్లారు. ‘నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన వెంట నడిచి ఆ మహనాయకుడి తో షేక్‌హ్యండ్ తీసుకున్నాను. జగనన్న వస్తాడని ఎదురుచూసాం. మీరు రావడం మా కుటుంబానికి ఎంతో దైర్యం ఇచ్చింది’ అని మర్రి లక్ష్మీ భర్త ఐల య్య షర్మిలతో అన్నారు. మడికొండలోని మద్దెల గట్టయ్య భార్య వరలక్ష్మి, కూతురు కొమల, కుమారులు కుమారస్వామి, అశోక్‌కుమార్ వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. ‘అన్న ఎంపని చేస్తున్నారు’ అంటూ వివరాలు అడిగారు. కూలిపని చేసుకుంటున్నట్లు కుమారులు షర్మిలకు తెలిపారు. ‘అవ్వ బాధపడకు. ఆరోగ్యం దెబ్బతింటుంది ఏ క ష్టం వచ్చిన మేమున్నాం’ అని దైర్యం నింపారు. అ నంతరం వస్కుల సుధాకర్ కుటుంబ సభ్యులను ష ర్మిల పరామర్శించారు. ‘పెద్దయ్య మీబిడ్డ దేవుడి ద గ్గర ఉన్నాడు దైర్యంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉందా పెద్దయ్య బాధపడకు. దేవుడు ఉ న్నాడు. గొప్పవాడు’ అని షర్మిల అన్నారు. అనంత రం సింగారంలోని కాకర్ల రాజయ్య ఇంటికి వెళ్లారు. ‘మీ కష్టాలు తెలుసు. మీ జీవితాల్లో వెలుగులు నిం పటానికే మీ దగ్గరికోచ్చా. మీ కష్టాల్లో భాగస్వామిని అవుతా. మనకు మంచిరోజులు వస్తాయమ్మ. మీరు దైర్యంగా ఉండండి. మీకు ఏ కష్టమొచ్చిన నావద్దకు రండి. మీకు ఆండగా ఉంటా’ అని అన్నారు. మా మునూరులోని ఎర్ర భాస్కర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ‘మీ కుటుంబానికి ఆండగా ఉం టా.’ అని భాస్కర్ భార్య లతకు భరోసా ఇచ్చారు. -
మాట తప్పకుండా..
- జిల్లాకు వచ్చిన వైఎస్ షర్మిల - జనగామ నియోజకవర్గంలో పరామర్శ యాత్ర ప్రారంభం - మొదటి రోజు ఏడు కుటుంబాలు పూర్తి - బైరాన్‌పల్లిలో వీరులకు నివాళులు - తొలి రోజు 154 కిలో మీటర్లు సాగిన యాత్ర - నేడు మరో ఏడు కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, వరంగల్ : మాట తప్పని కుటుంబం ఇచ్చిన ఆన నిలబెట్టుకుంది. వైఎస్సార్ కుటుంబం నమ్ముకున్న వారి చెంతకు వచ్చింది. దివంగత మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా కొమురవెల్లి ఆల య ద్వారం మార్గంలో చేర్యాలకు చేరుకున్నారు. చేర్యాల మండల కేంద్రంలోని బస్వగల్ల యాదగిరి కు టుంబాన్ని పరామర్శించారు. మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో కర్ర రాజిరెడ్డి కుటుంబాన్ని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బచ్చన్నపేట మండ లం కట్కూరులో పాశికంటి శోభారాణి కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు. అదే గ్రామంలోని గుంటిపల్లి వెంకటేశ్ కుటుంబాని ధీమా కల్పించారు. బండనాగారంలో మానెపల్లి సిద్ధులు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కేసిరెడ్డిపల్లెలో గాదెపాక సిద్ధులు కుటుంబానికి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలీంపూర్‌లో చాడ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఏడు కుటుంబాల పరామర్శ ముగిసిన తర్వాత బచ్చన్నపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో బస చేశారు. తొలి రోజు 154 కిలో మీటర్ల దూరంలో షర్మిల యాత్ర సాగింది. యూత్ర ఇలా.. మహానేత వైఎస్సార్ తనయ షర్మిల రాక సందర్భంగా చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట మండలాల్లో సందడి నెలకొంది. ప్రతి గ్రామంలోనూ స్థానికులు రోడ్డు మీదకు వచ్చి ఆమె రాకకోసం ఎదురుచూశారు. షర్మిల తన వాహనం దిగి మరీ అందరినీ పలుకరించారు. మద్దూరు మండలం వల్లంపట్ల మీదుగా షర్మిల వెళ్తుండగా మహిళల బృందం అభివాదం చేసింది. తెలంగాణ సాయుధపోరాటంలో చారిత్రక ఉద్యమ కేంద్రంగా ఉన్న వీరబైరాన్‌పల్లిలో అమరవీరులకు షర్మిల నివాళులర్పించారు. అన్ని తెలుసుకుంటూ.. మహానేత వైఎస్సార్ అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల ప్రతి కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరించారు. ఆరోగ్య పరిస్థితులకు ఆరా తీశారు. వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయని అడిగారు. కట్కూరులో పాశికంటి శోభారాణి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో.. శోభారాణి పెద్ద కుమార్తె కల్పనతో మాట్లాడుతూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. పరామర్శ ముగిసి షర్మిల ఇంట్లో నుంచి బయటికి వచ్చే సమయంలో కల్పన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. షర్మిల.. కల్పనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ‘నువ్వు బాధపడవద్దమ్మా... నువ్వు బాధపడితే నాకు బాధ కలుగుతుంది. నీకు నేనున్నానమ్మా’ అని చెమ్మగిలిన కళ్లతో షర్మిల ఓదార్చారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో తొలిరోజు పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గ ట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి వి.శంకరాచారి పాల్గొన్నారు. మంగళవారం మరో ఏడు కుటుంబాలు పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మంగళవారం మరో ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రంలోని గుడిసెల లచ్చవ్వ, అలువాల యాదగిరి కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు. ఇదే మండలంలోని పోచన్నపేటలోని నేలపోగుల యాదగిరి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలోని గాదె శంకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని వల్లాల లక్ష్మయ్య కుటుంబానికి భరోసా ఇస్తారు. ఇదే మండలంలోని తాటికొండలోని ఎడమ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా కిష్టాజిగూడెంలోని జక్కుల కొమురయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. రెండో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల 78 కిలో మీటర్ల దూరం మేరకు యాత్ర సాగుతుంది. -
నేటి నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపడుతున్నారు. ఆగస్టు 24 నుంచి 28 వరకు జిల్లాలో ఐదు రోజుల పాటు ఆమె తొలి దశ పరామర్శ యాత్ర నిర్వహిస్తారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 32 మంది కుటుంబాలను పరామర్శిస్తారు. తొలి దశలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా, పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటన ఉంటుంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న అకాల మరణం పొందడం తెలిసిందే. ఈ ఘోరాన్ని తట్టుకోలేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 77 మంది చనిపోయారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద జననేత వైఎస్ జగన్ ఇచ్చిన మాటను ఆచరణలో చూపేందుకు జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. తొలి రోజు సోమవారం జనగామ నియోజకవర్గం చేర్యాలలో బస్వగల్ల యాదగిరి ఇంటికి వెళ్లి పరామర్శ యాత్రను ప్రారంభిస్తారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి ఆదేశానుసారం పార్టీ రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర ఏర్పాట్ల్లు చేశారు. తొలి రోజు ఏడు కుటుంబాలు: సోమవారం ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గ ంటలకు యాత్రకు బయలుదేరతారు. రాజీవ్ రహదారి మార్గంలో వరంగల్ జిల్లా కొమురవెల్లి మీదుగా 11గంటలకు చేర్యాల చేరుకుంటారు. మండల కేంద్రంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని, అనంతరం మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో కర్ర రాజిరెడ్డి, బచ్చన్నపేట మండలం కట్కూరులో పాశి కంటి శోభారాణి, గుంటిపల్లి వెంకటేశ్, బండనాగారంలో మానెపల్లి సిద్ధులు, కేసిరెడ్డిపల్లెలో గాదెపాక సిద్ధులు, అలీంపూర్‌లో చాడ కిష్టయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. జనం గుండెల్లో వైఎస్ కుటుంబం: రాఘవరెడ్డి కాజీపేట రూరల్: డాక్టర్ వైఎస్ కుటుంబసభ్యులు ప్రజల గుండెల్లో ఉన్నారని, వారినెవరూ వేరు చేయలేరని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. షర్మిల యాత్ర సందర్భంగా హన్మకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు వరంగల్ జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించిన సందర్భంగా అశేష ప్రజాదరణ లభించిందని గుర్తు చేశారు. వైఎస్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలందాయని వైఎస్సార్సీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఎం. విలియం, సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ భేటీలో పాల్గొన్నారు. పర్యటన షెడ్యూల్ ఇదీ... ⇒ 24న జనగామ సెగ్మెంట్లో 7కుటుంబాలకు పరామర్శ ⇒ 25న జనగామ సెగ్మెంట్లో మూడు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 4 కుటుంబాలకు పరామర్శ ⇒ 26న స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్లో రెండు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 5 కుటుంబాలకు పరామర్శ ⇒ 27న వరంగల్ పశ్చిమ ఒకటి, తూర్పు నాలుగు, పరకాల సెగ్మెంట్లో రెండు కుటుంబాలకు పరామర్శ ⇒ 28న పరకాల ఒకటి, వర్ధన్నపేట రెండు, పాలకుర్తి నియోజకవర్గంలో ఒక కుటుంబానికి పరామర్శ -
పరామర్శకు పయనం
నేడు జిల్లాకు రానున్న షర్మిల ‘‘ఇచ్చిన మాట కోసం,నమ్ముకున్న వారి బాగోగుల కోసం నిరం తరం పరితపించే కుటుంబం వారిది. మహానేత వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయా మన్నంత ఆవేదనతో హృదయాలు పగిలి మరణించిన వారెంద రో.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు దాదాపు ఆరేళ్ల క్రితం నల్ల కాల్వ సాక్షిగా జననేత జగన్ మోహన్‌రెడ్డి చేసిన ఓదార్పు ప్రకటనలో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల సోమ వారం నుంచి జిల్లాలో పర్యటిస్తున్నారు..’’ వరంగల్ : నమ్ముకున్న వారిపై ఆ కుటుంబం కనబరిచే వాత్సల్యానికి నిదర్శనం. కాలం కరిగిపోయినా.. వారిపై తమ అభిమానం చెరగదనే పరామర్శ ఇది. ప్రజానేత వైఎస్సార్ అకాల మృతిని తట్టుకోలేక అసువులుబాసిన వారి కుటుంబాలను కలుసుకునేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్వయంగా వస్తున్నారు. వైఎస్సార్ కుటుంబ ప్రతినిధిగా.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు జిల్లాలో పరామర్శ చేపడుతున్నారు. 2009 సెప్టెంబరు 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో 72 మంది వృతిచెందారు. వీరికి అండగా ఉంటానంటూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా నల్ల కాల్వ వద్ద మాట ఇచ్చిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారి స్థితిగతులను తెలుసుకునేందుకు వైఎస్సార్ కుటుంబం తరుఫున షర్మిలమ్మ సోమవారం జిల్లాకు వస్తున్నారు. ఆగస్టు 24 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం వరకు జిల్లాలో షర్మిల తొలి దశ పరామర్శ యాత్ర నిర్వహిస్తారు. ఐదు రోజుల యాత్రలో భాగంగా.. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 32 మంది కుటుంబాలను పరామర్శిస్తారు. పరామర్శ తొలి దశలో భాగంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పూర్తిగా.. పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటన సాగుతుంది. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరామర్శ యాత్రకు అంతా సిద్ధమైంది. తొలి రోజు 154 కిలో మీటర్లు.. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సోమవారం ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శ యాత్రకు బయలుదేరుతారు. రాజీవ్ రహదారి మార్గంలో వరంగల్ జిల్లా కొమురవెల్లి మీదుగా 11 గంటలకు జనగామ నియోజకవర్గం చేర్యాలకు చేరుకుంటారు. చేర్యాల మండల కేంద్రంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో కర్ర రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత బచ్చన్నపేట మండలం కట్కూరులో పాశికంటి శోభారాణి, గుంటిపల్లి వెంకటేశ్ కుటుంబాలను పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలం బండనాగారంలో మానెపల్లి సిద్ధులు కుటుంబాన్ని, కేసిరెడ్డిపల్లెలో గాదెపాక సిద్ధులు కుటుంబాన్ని అలీంపూర్‌లో చాడ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఏడు కుటుంబాల పరామర్శ తర్వాత తొలిరోజు కార్యక్రమాన్ని ముగిస్తారు. బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో రాత్రి బస చేస్తారు. తొలిరోజు 154 కిలో మీటర్ల దూరంలో షర్మిల యాత్ర సాగుతుంది. ఆ కుటుంబానికే సాధ్యం.. ఇచ్చిన మాటపై నిలబడే గొప్ప ధైర్యం, విలువలతో కూడిన రాజకీయాలు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికే సాధ్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వైఎస్సార్ అభిమానుల కుటుంబాలకు ఆరేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి నల్లకాల్వ వద్ద ఇచ్చిన హామీ మేరకు తన సోదరి షర్మిలను పరామర్శ యాత్రకు పంపిస్తున్నారు. షర్మిల పరామర్శ యాత్ర కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. రాజకీయాలకు అతీతంగా అందరు ఈ కార్యక్రమాన్ని స్వాగతించాలి. - జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
24 నుంచి వరంగల్‌లో షర్మిల పరామర్శ యాత్ర
మొదటి విడతలో జిల్లాలో ఐదు రోజులు పర్యటన 32 కుటుంబాలకు పరామర్శ హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 24 నుంచి పరామర్శించనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతగా ఐదురోజుల పాటు ఈ పరామర్శ యాత్ర సాగుతుంది. 32 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. షర్మిల సోమవారం (ఈ నెల 24 వ తేదీ) ఉదయం 8.30 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరి శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా 11 గంటలకు చేర్యాల చేరుకొని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేరోజు మరో ఆరుగురు కుటుంబాలను పరామర్శిస్తారు. మొదటి రోజు 154 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. రెండోరోజు 25న మంగళవారం 78 కి.మీ ప్రయాణించి 7 కుటుంబాలను పరామర్శిస్తారు. 26న 82.5 కి.మీ ప్రయాణించి ఏడు కుటుంబాలను, 27న 68 కి.మీ ప్రయాణించి ఏడు కుటుంబాలను,28 చివరిరోజు 237 కి.మీ ప్రయాణించి నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ మొదటి విడత పరామర్శ యాత్రలో ఐదు నియోజవర్గాలను పూర్తిగా, రెండు నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటించి 32 కుటుంబాలను పరామర్శిస్తారు. ఐదురోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు రాత్రి బచ్చన్న పేట, రెండోరోజు రాత్రి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో, మూడో, నాల్గవ రోజు రాత్రి వరంగల్ టౌన్లో బస చేస్తారు. చివరి రోజు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పరామర్శ యాత్రను పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు బయలుదేరుతారు. రాజన్న బిడ్డకు ఆశీర్వాదాలు వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్రకు వస్తున్న వైఎస్సార్ తనయ షర్మిలకి ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. రాజన్న బిడ్డని మనసారా ఆశీర్వదించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ అభిమానులకు వరంగ ల్ పెట్టిన కోట అని అన్నారు. -
భువనమంత అభిమానం
నల్లగొండ జిల్లాలో మలి విడత పరామర్శయాత్రలో భాగంగా షర్మిల తొలిరోజు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఐదు కుటుంబాలను పరామర్శించారు. ఆమెకు ప్రజలు ‘భువన’మంత అభిమానం చూపారు. ‘మా కుటుంబంపై మీరు చూపుతున్న అభిమానానికి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’ అని షర్మిల వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డుమార్గంలోనూ రాహుల్ పలకరింపులు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 11న రాత్రి నిర్మల్‌లోనే బస... 12న పాదయాత్ర... అదేరోజు రాత్రి ఢిల్లీకి హైదరాబాద్: ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్రంలో పాదయాత్ర తలపెట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నిర్మల్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ మధ్యలో రైతు ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఈనెల 11న సాయంత్రం నాలుగు గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఈ మార్గంలో ఆయన తూప్రాన్, కామారెడ్డి, బాల్కొండ, ఆర్మూరులలో రైతు ప్రతినిధులు, రైతులతో మాట్లాడతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌గాంధీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన గురువారం గాంధీభవన్‌లో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జె.గీతారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయంలోనే రాహుల్ కొద్దిసేపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమవుతారని ఉత్తమ్ వెల్లడించారు. 11న రాత్రి ఆయన నిర్మల్‌లో బసచేస్తారని చెప్పారు. 12న ఉదయం 7 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని వడ్యాల, రాచాపూర్, పొట్టుపల్లి, లక్ష్మణ్‌చాందా, కొరటికల్ గ్రామాలలో పాదయాత్ర చేస్తారని ఉత్తమ్ వివరించారు. పాదయాత్రలో పాల్గొన్నవారిని ఉద్దేశించి కొరటికల్‌లో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తారని చెప్పారు. అదేరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుని, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారని ఆయన వివరించారు. రైతు కుటుంబాలకు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేసే విషయంపై ఇంకా చర్చించలేదని ఉత్తమ్ చెప్పారు. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని సీఎల్పీ నాయకుడు జానారెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇతర ఆర్థిక సర్దుబాటుకోసం రూ. 5 లక్షలను ఇవ్వాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు భరోసా కల్పించడానికి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికే రాహుల్‌గాంధీ పర్యటిస్తున్నారని, 10 జిల్లాల్లోని రైతులంతా భారీగా తరలిరావాలని జానా కోరారు. -
18 నుంచి షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర
నల్లగొండ జిల్లాలో ఐదు రోజుల యాత్ర 17 కుటుంబాలకు పరామర్శ వైఎస్సార్సీపీ నేత శివకుమార్ వెల్లడి 15న పార్టీ తెలంగాణ కార్యాలయం ప్రారంభం హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్రను చేపట్టనున్నారని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. మంగళవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. షర్మిల రెండో విడత యాత్ర ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులు జరుగుతుందని చెప్పారు. ‘‘భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో షర్మిల 509 కిలోమీటర్లు పర్యటిస్తారు. దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని జీర్ణించుకో లేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నల్లకాల్వ సభలో ప్రజలకు మాటివ్వడం తెలిసిందే. ఆ మాట కోసమే షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తున్నారు. రెండో విడత యాత్రలో 17 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు’’ అని శివకుమార్ వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పరామర్శ యాత్ర ఉంటుందా అని ప్రశ్నించగా, నల్లగొండలో రెండో విడత యాత్ర పూర్తయ్యాక దానిపై ఆలోచిస్తామని బదులిచ్చారు. వైఎస్ మృతి పట్ల చలించి హైదరాబాద్‌లో 10 మంది, రంగారెడ్డిలో 20 మంది మరణించారని గుర్తుచేశారు. మరోవైపు, సచివాలయ మార్పును వైసీపీ వ్యతిరేకిస్తుందని శివకుమార్ చెప్పారు. దీనిపై త్వరలో తాము గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు. ఛాతీ ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి మార్చొద్దంటూ వైఎస్సార్సీపీ ధర్నా నిర్వహించిందని గుర్తు చేశారు. 15న పార్టీ కార్యాలయం ప్రారంభం బుధవారం (11వ తేదీన) జరగాల్సిన వైఎస్సార్సీపీ తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవం వైఎస్ జగన్ అందుబాటులో లేని కారణంగా వాయిదా పడిందని శివకుమార్ తెలిపారు. కార్యాలయాన్ని 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్‌లో ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర పార్టీ యంత్రాంగమంతా హాజరవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్నబిడ్డకు జేజేలు
పరామర్శయాత్రలో భాగంగా శుక్రవారం చివరిరోజు రాజన్నబిడ్డ షర్మిలకు జనం జేజే లు పలికారు. మేళతాళాలతో ఎదురెళ్లి ఆత్మీయంగా స్వాగతించారు. మంగళహారతి పట్టి నుదుట కుంకుమబెట్టి సాదరంగా ఆహ్వానించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేక గుండెచెదిరి మృతిచెందిన బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించారు. కుటుంబంలో ఒకరిగా వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యం వద్దు.. అండగా ఉంటామని భరోసాఇచ్చారు. పాలమూరు జిల్లా ప్రజలు ఆమెకు భారంగా వీడ్కోలు పలికారు. -మహబూబ్‌నగర్ -
నీరాజనం
రెండోరోజు షర్మిల పరామర్శ యాత్ర వెళ్లిన ప్రతిచోటా ఆత్మీయ పలకరింపు దారిపొడవునా పూలవర్షంతో కురిపిస్తూ ఘనస్వాగతం రాజన్న కుటుంబం ఉందంటూ భరోసా మహబూబ్‌నగర్: ఏ పల్లెకు వెళ్లినా వైఎస్ షర్మిలకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఆమెను చూసేందుకు, ప్రసంగం వినేందుకు పార్టీలకతీతంగా ముఖ్యకూడళ్ల వద్దకు తరలొస్తున్నారు. మార్గమధ్యంలో పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. రాజన్న బిడ్డగా, జగనన్న చెల్లిగా వచ్చిన ఆమెపై ప్రేమాభిమానాలు చూపుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో గుండెచెదిరి మరణించిన ముగ్గురి కుటుంబాలను వైఎస్ షర్మిల మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రాజన్న కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసాఇచ్చారు. వెళ్లిన ప్రతిచోటా కుటుంబంలో ఒకరిలా కలిసిపోయి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్న తీరుతో ఆయా కుటుంబాల సభ్యుల కళ్లు చెమర్చాయి. కుటుంబ సభ్యుల్లో ప్రతిఒక్కరినీ పలుకరిస్తూ కుటుంబసభ్యులను కోల్పోయిన వారి ఆవేదనను తెలుసుకుంటున్నారు. వైఎస్ కుటుం బంతో వారికి పెనవేసుకున్న మానసికబంధాన్ని చూసి షర్మిల శిరసు వంచి నమస్కరిస్తున్నారు. పరామర్శయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతిచోటా షర్మిలకు స్థానికులు ఘనస్వాగతం పలుకుతున్నారు. వైఎస్ కూతురు, జగన్ సోదరి వస్తుందంటూ మహిళలు, వృ ద్ధులు, గ్రామీణులు పెద్దఎత్తున గుమికూడుతున్నారు. పరామర్శయాత్ర మార్గంలో ఎదురైన వారిని చిరునవ్వుతో పలుకరిస్తూ రెండు చేతు లు జోడించి అభివాదం చేస్తూ షర్మిల ముందుకు కదులుతున్నారు. యాత్ర రెండో రోజు రంగాపూర్‌లో గిరిజనులు, అచ్చంపేట శివారులో గిరిజనులతో షర్మిల ముచ్చటించి వారి అభిమానానికి ముగ్ధులయ్యారు. మార్గమధ్యంలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ యాత్ర ముందుకు సాగింది. మూడు కుటుంబాలకు పరామర్శ పరామర్శ యాత్ర రెండోరోజు షర్మిల మూడు కుటుంబాలను కలుసుకుని వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కల్వకుర్తి నుంచి ఉదయం 9.30 గంట లకు బయలుదేరిన ఆమె డిండి, మన్ననూరు మీదుగా అమ్రాబాద్‌కు చేరుకున్నారు. అమ్రాబాద్‌లో పర్వతనేని రంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అమ్రాబాద్, అచ్చంపేటలో జనాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. నాగర్‌కర్నూల్ మీదుగా కోడేరు మండలం ఎత్తం గ్రామానికి చేరుకున్నారు. వైఎస్ మరణవార్త విని గుండె చెదిరి మరణించిన పుట్టపాగ నర్సింహ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మంగళవారం రాత్రి కొల్లాపూర్ పట్టణానికి చేరుకుని కటికె రామచంద్రయ్య కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. రాజన్న కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆయా కుటుం బాలు గుర్తు చేసుకున్నాయి. ఒక్కో కుటుంబంతో షర్మిల గంటకు పైగా భేటీఅవుతూ వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. జిల్లాలో మరో మూడురోజుల పాటు జరిగే పరామర్శయాత్రలో షర్మిల 15 కుటుంబాలను పరామర్శించనున్నారు. -
నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
-
నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
* మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదురోజుల పాటు సాగనున్న యాత్ర * 13 నియోజకవర్గాల మీదుగా 921 కిలోమీటర్ల పర్యటన సాక్షి, హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి ‘పరామర్శ యాత్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో తొలి విడతలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 21 కుటుంబాలను షర్మిల పరామర్శించి, వారికి జగన్ అండగా ఉన్నారన్న భరోసా ఇవ్వనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్ర జిల్లాలోని 13 నియోజకవర్గాల మీదుగా 921 కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్ర సాగుతుందిలా... సోమవారం ఉదయం 9 గంటలకు లోటస్‌పాండ్‌లోని నివాసంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం షర్మిల.. పరామర్శ యాత్ర ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా కల్వకుర్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో జిల్లా నాయకులు షర్మిలకు స్వాగతం పలుకుతారు. అనంతరం మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ పరిధిలోని రెడ్డిపురంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన జె.రాయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ్నుంచి తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామంలో తుమ్మల నర్సింహ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత అదే మండలంలోని వెల్జాలలో ఎస్.అంజమ్మ కుటుంబాన్ని పరామర్శించి కల్వకుర్తి చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర కొనసాగిస్తారు. 12వ తేదీ వరకు జిల్లాలో పరామర్శ యాత్ర, వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు సాగుతాయి. 12న షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం మల్లాపూర్‌లో పరామర్శతో యాత్ర ముగుస్తుంది. పరామర్శ యాత్రతో పార్టీ పటిష్టం వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ సాక్షి, బళ్లారి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి తెలంగాణలో చేపట్టనున్న పరామర్శ యూత్రతో అక్కడ పార్టీ పుంజుకుంటుందని ఆయన చెప్పారు. ఆమెరాక కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఎంపీ బి.శ్రీరాములును ఆయ న మర్యాదపూర్వకంగా కలుసుకున్న అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. -
పరామర్శ యాత్రను విజయవంతం చేయాలి
సుబేదారి : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 8వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నా యకురాలు షర్మిల చేపట్టనున్న పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. ఈనెల 8వ తేదీ ఉదయం 8గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరి బ్రాహ్మణపల్లి, ఇర్వెన్, దేవుని షడ్కల్, వెల్జాల మీదుగా కల్వకుర్తి చేరుకుంటారన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు రోజుల పాటు ఆమె యాత్ర కొనసాగుతుందని, ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాంతరం అమరులైన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. ఈ మేరకు యాత్రను విజయవంతం చేయాలని సుధీర్‌రెడ్డి కోరారు. ఈ సమావేశంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పం కిషన్, యువజన విభాగం నగర నాయకుడు జీడికంటి శివతో పాటు నాయకులు నాగవెళ్లి రజనీకాంత్, గుండ్ల రాజేష్‌రెడ్డి, నెమలిపురి రఘు, నాగపూరి దయాకర్, మోడెం రాజేష్, ఆరెపల్లి రాజు, ప్రశాంత్, హరీష్, పోలపల్లి రాజు, మైనార్టీ నాయకుల సయ్యద్ అబ్దుల్ ఖాదర్, మహ్మద్ ముజరుద్దీన్ ఖాన్ , కాయిత కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. -
షర్మిల పరామర్శ యాత్రపై ఆసక్తి
దివంగత సీఎం వైఎస్ మరణానంతరం జిల్లాలో 16మంది గుండె ఆగి మరణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని పార్టీ అధినేత జగన్ ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ అనివార్య కారణాలతో గతంలో వాయిదా పడింది. బాధిత కుటుంబాలను ఎట్టి పరిస్థితిల్లోనూ పరామర్శించి తీరాలనే భావన పార్టీలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకురాలు షర్మిల ‘పరామర్శ యాత్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచే ఈ యాత్రకు శ్రీకారం చుట్టనుండటాన్ని రాజకీయ పక్షాలు ఆసక్తితో గమనిస్తున్నాయి. జిల్లాలో సుమారు 300 కిలోమీటర్ల మేర సాగే పరామర్శ యాత్ర పూర్తి షెడ్యూలు ఖరారు కావాల్సి ఉంది. పరామర్శ యాత్ర పార్టీ కేడర్‌కు స్ఫూర్తినిస్తుందని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఎన్నికలు లేనప్పటికీ ప్రజా సమస్యలపై ఉద్యమించడం ద్వారా ప్రజల మనసు చూరగొనాలని పార్టీ భావిస్తోంది. ప్రజల పక్షాన నిలబడతామనే సందేశాన్ని ఇవ్వడం ద్వారా పార్టీ చిత్తశుద్ధిని చాటుతూ బలోపే తం చేస్తామని పార్టీ ముఖ్యుడు వ్యాఖ్యానించారు.