
రాజన్నబిడ్డకు జేజేలు
పరామర్శయాత్రలో భాగంగా శుక్రవారం చివరిరోజు రాజన్నబిడ్డ షర్మిలకు జనం జేజే లు పలికారు. మేళతాళాలతో ఎదురెళ్లి ఆత్మీయంగా స్వాగతించారు. మంగళహారతి పట్టి నుదుట కుంకుమబెట్టి సాదరంగా ఆహ్వానించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేక గుండెచెదిరి మృతిచెందిన బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించారు.
కుటుంబంలో ఒకరిగా వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యం వద్దు.. అండగా ఉంటామని భరోసాఇచ్చారు. పాలమూరు జిల్లా ప్రజలు ఆమెకు భారంగా వీడ్కోలు పలికారు.
-మహబూబ్‌నగర్