విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల అరాచకాలపై సర్వత్రా ఖండనలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఈర్ష్య, అసూయలతో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాల్లేవీ ఉండకూదని పచ్చ మూకలు దాడులకు తెగపడుతోంది. ఈ క్రమంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి.
అయితే ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె ఈ దాడుల్ని ఖండిస్తూ ఓ సందేశం ఉంచారు. ‘‘
రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం.
రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి…
— YS Sharmila (@realyssharmila) June 9, 2024
.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని సందేశం ఉంచారామె.
మరోవైపు.. ఏపీలో టీడీపీ శ్రేణుల దాడుల్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లంరాజు ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారారయన.
Comments
Please login to add a commentAdd a comment