statues
-
అతడిదో ‘చెత్త’ కల(ళ) : గట్టిగా కొట్టాడు సక్సెస్!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇండోర్‌కు చెందిన యువకుడికి చిన్నప్పటినుంచీ ఒక అలవాటు ఉండేది. తన పరిసరాల్లో కనిపించిన పనికి రాని వస్తువుల ద్వారా ఏదో ఒక ఉపయోగపడే వస్తువును తయారు చేసేవాడు. ఆ అలవాటే అతడిని అద్భుత కళకారుడిగా తీర్చిదిద్దింది. స్క్రాప్ మెటల్‌తో తన కలలకు ప్రాణం పోసి, అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నాడు. దేశ విదేశాల్లో అతని కళాఖండాలకు ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఎవరా యువకుడు? అతని కథేంటి తెలుసుకుందాం ఈ కథనంలో.దేశంలో చాలా మంది కళాకారులు మట్టి , రాయి, చెక్క, ఇలా అనేక రకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడం మనకు తెలుసు. ఇండోర్‌లో నివసిస్తున్న ఈ కళాకారుడి విగ్రహాలు మాత్రం చాలా స్పెషల్. ఇండోర్‌కు చెందిన దేవల్ వర్మకు చిన్నప్పటినుంచీ ఫిక్షన్ సినిమాలు, బైక్‌లు అంటే ఇష్టం. చిన్నతనంలో, దేవల్ వారాంతాల్లో తన ఇల్లు ,పాఠశాల చుట్టూ దొరికిన స్క్రాప్‌లను ఉపయోగించి తనకు నచ్చిన విధంగా చిన్న చిన్న వస్తువులను తయారు చేసేవాడు. అదే అతణ్ని గొప్పవాడిగా మలుస్తుందని అస్సలు ఊహింఛలేదు.యువకుడిగా మారిన కొద్దీ, కాస్త విజ్ఞానం అలవడుతున్న కొద్దీ తను చేస్తున్న పనిపై మరింత ఆసక్తి పెరిగింది. కళాశాలకు చేరుకునే సమయానికి, ట్రాన్స్ఫార్మర్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల పట్ల ప్రేమతో ప్రేరణ పొంది స్క్రాప్ మెటల్‌తో క్లిష్టమైన నమూనాలను తయారు చేసేశాడు. దీనికి తోడు ప్రముఖ టీవీ షో M.A.D (సంగీతం, కళ , నృత్యం), దాని హోస్ట్ హరున్ రాబర్ట్ నుంచి మరింత ప్రేరణ లభించింది. అలా వ్యర్థ పదార్థాలతో కార్లు, మోటార్ సైకిళ్ల సూక్ష్మ నమూనాలను తయారు చేస్తూ ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు దేవల్ వర్మ. View this post on Instagram A post shared by Deval Verma (@devalmetalart) ఈ ఆసక్తి తగ్గట్టుగానే దేవల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు,స్థానిక గ్యారేజీలు . ఆటోమోటివ్ ఫ్యాక్టరీల దృష్టిని ఆకర్షించాయి. వారినుంచి మెటల్ స్క్రాప్ సేకరించి హార్లే డేవిడ్సన్ అధికారిక లోగో రూపకల్పన గొప్ప మైలురాయిగా నిలిచింది. వారి షోరూమ్ కోసం ఈ స్క్రాప్ ఇన్‌స్టాలేషన్‌ను ప్రత్యేకంగా రూపొందించాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత దేవల్ క్రియేటివ్ జర్నీ మరింత వేగం పుంజుకోవడమే కాదు, కీలక మలుపు తిరిగింది. తన కళను కరియర్‌గా మలుచుకోవాని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో తల్లిదండ్రుల నుండి ప్రారంభ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, చివరికి కుమారుడికి అండగా నిలిచారు. పూణేలోని MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ప్రోడక్ట్ డిజైన్‌లో కోర్సును అభ్యసించాడు. అలా దుబాయ్‌లో తొలి ప్రదర్శన సక్సెస్ అయింది. మెటల్ స్క్రాప్‌తో రూపొందించిన రెండు గిటార్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకోవడంతో మెటల్ ఆర్టిస్ట్‌గా వృత్తిపరమైన ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.ఈరంగంలో నిపుణుల సలహాలను తీసుకుంటూ మరింత పట్టుదల ఎదిగాడు. కళా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు పొందాడు. మినీ-రోబోట్ ప్లాంటర్ మొదలు అందమైన శిల్పాల వరకు కొలువు దీరాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. సింగపూర్, ఇటలీ, అమెరికాలోని కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి.దేవల్ వర్మ స్టార్టప్2017 నుండి ఒక సొంత స్టార్టప్‌ను నడుపుతున్నాడు. అతను ఇప్పటివరకు అనేక రకాల శిల్పాలు , కళాఖండాలను తయారు చేశాడు. ఏనుగు, నెమలి, చిలుక, గిటార్, డేగ, ఇండియా మ్యాప్, పువ్వులు ఇలా ఒకటేంటి అనేక రకాల జంతువులు, పక్షుల బొమ్మలను రూపొందించాడు. ముఖ్యంగా హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.అద్భుతమై హనుమాన్ విగ్రహంగుజరాత్లోని గోద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా ద్వారా దేవల్ గురించి తెలుసుకుని హనుమంతుని విగ్రహాన్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్న దేవల్ 350 కిలోల స్క్రాప్ ఉపయోగించి, ఏడాది పాటు శ్రమించి హనుమాన్జీ విగ్రహాన్ని రూపొందించాడు. ఇత్తడి స్టీల్ వస్తువులు, గేర్-బేరింగ్‌లతో కండలు తిరిగిన దేహంతో అందమైన హనుమాన్ విగ్రహం చూస్తే ఎవరైనా చేయొత్తి మొక్కాల్సిందే. -
ఇదేం రూల్?.. విశాఖ ఎలక్షన్ కోడ్‌లో అధికారుల ఓవరాక్షన్
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
ఈ తరహా దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఆగ్రహం
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల అరాచకాలపై సర్వత్రా ఖండనలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఈర్ష్య, అసూయలతో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాల్లేవీ ఉండకూదని పచ్చ మూకలు దాడులకు తెగపడుతోంది. ఈ క్రమంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె ఈ దాడుల్ని ఖండిస్తూ ఓ సందేశం ఉంచారు. ‘‘రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం.రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి…— YS Sharmila (@realyssharmila) June 9, 2024.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని సందేశం ఉంచారామె. మరోవైపు.. ఏపీలో టీడీపీ శ్రేణుల దాడుల్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లంరాజు ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారారయన. -
విగ్రహాలకు స్థానచలనం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లోని ఐదో నంబర్ గేట్ దగ్గరి లాన్ వద్దకు మార్చింది. ఈ లాన్లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్‌ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. గుజరాత్లో బీజేపీ ఈసారి క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ప్రశ్నించారు. విమర్శలపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్‌కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది. -
ఇది మాయని ‘మరక’ : లైంగిక వేధింపులపై వినూత్న నిరసన
ప్రపంచవ్యాప్తంగా బాలికలు,మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నం ప్రచారాన్ని చేపట్టింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్సైలెన్స్ ది వయలెన్స్’ అని పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికపై వేధింపుల హింస ఎన్నటికీ మాయని మచ్చ అనే అంశాన్ని విగ్రహాల రూపంలోప్రదర్శించడం విశేషం. మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శన చర్చ నీయాంశంగా నిలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటు న్నారని జర్మన్ మహిళా హక్కుల సంఘం టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. ఈ లైంగిక వేధింపులపై చాలామంది మౌనంగా ఉంటారని, ఈ మౌనమే మరో మహిళ వేధింపులకు దారి తీస్తోందని సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. “ప్రతీ నేరస్థుడు వేలమందికి కారణమవుతున్నాడు ఇకపై మహిళలపై లైంగిక వేధింపులను ఉపేక్షించవద్దు అప్రమత్తంగా ఉందాం. బాధితులకు అండగా నిలుద్దాం. కలిసికట్టుగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం’’ సినా టాన్ టెర్రే డెస్ ఫెమ్మెస్ బాలికలు ,మహిళలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ-నిర్దిష్ట వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతోంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యాలని హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాల్లో పేర్కొన్న మాదిరిగా లైంగిక వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. -
భారతదేశంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాలు
-
హైదరాబాద్ లో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాల తొలగింపు
-
రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్ట
విజయనగరం: రామతీర్థంలో సీతారాముల విగ్రహాలు పున:ప్రతిష్టించారు. రుత్వికులు శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. 4 నెలల్లో ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవుడి పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాముని విగ్రహం ధ్వంసం చేసిన వారికి తప్పకుండ శిక్ష పడుతుందని తెలిపారు. నెలల్లోనే ఆలయం నిర్మించి విగ్రహాలను ప్రతిష్ట చేశామని తెలిపారు. దేవునితో రాజకీయాలు చేయడం మానుకోవాలని, దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని ఆధారాలతో నిరూపించడానికి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆగమ పండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయ ప్రతిష్ట జరిగిందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కార్యక్రమం జరిగిందని చెప్పారు. దీంట్లో రాజకీయ కోణం చూడకూడదని అన్నారు. భద్రాచలం సంప్రదాయాలతోనే రామతీర్థ ఆలయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే శ్రీ రామనవమి రామతీర్థంలో రాష్ట్ర అధికారిక నవమి ఉత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరుతున్నామని చెప్పారు. -
కొలనుపాకలో నాలుగడుగుల జైన పాదం
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది లేదా 9వ శతాబ్దానికి చెందిన జైన తీర్థంకరులలో ఒకరిదని భావిస్తున్న భారీ పాదాన్ని కొలనుపాకలో గుర్తించారు. ఈ పాదం దాదాపు నాలుగు అడుగుల పొడవుంది. అక్కడ గతంలో ధ్వంసమై చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలు, విగ్రహాలను సోమేశ్వరాలయం సమీపంలోని ప్రాంగణానికి చేర్చే పని ప్రస్తుతం జరుగుతోంది. అక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు చూసేందుకు వీలుగా వీటిని ఒకచోట ఉంచబోతున్నారు. ఈక్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు కుమారస్వామి, సోమిరెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శిథిల విగ్రహాల మధ్య ఈ పాదాన్ని గుర్తించారు. జైన తీర్థంకరులలో ఒకరికి సంబంధించిన పాదాల్లో ఎడమ పాదంగా వారు నిర్ధారణకు వచ్చారు. దీన్ని చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా ధ్రువీకరించారని హరగోపాల్ పేర్కొన్నారు. దీన్ని పాదంగా మాత్రమే ఏర్పాటు చేసినదా? లేదా భారీ విగ్రహానికి చెందిన భాగమా? అన్న విషయమై స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా గొల్లత్తగుడి జైన మందిరం వెనక ఆరు అడుగులు, ఐదు అడుగుల పొడవున్న రెండు జతల భారీ జైన పాదాలను గుర్తించారు. నిర్మల్ జిల్లా భైంసాలో కూడా 3 భారీ పాదాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో భారీ జైన పాదాలున్న మూడో ప్రాంతంగా కొలనుపాకను గుర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పాదం మీద నూపురం, కాలివేళ్లకు అలంకారాలు కనిపిస్తున్నట్టు హరగోపాల్ వెల్లడించారు. -
కట్టలు తెగిన ప్రజాగ్రహం.. నేలకూలిన విగ్రహాలు
తమ పిల్లలపై జరిగిన మారణ హోమం పట్ల అక్కడి జనాలు రగిలిపోతున్నారు. సంబురంగా జరపాల్సిన పూర్తి స్వాతంత్రోత్సవ వేడుకల్ని.. నిరసన దినంగా పాటించారు. వలస పాలనతో ఆ మారణహోమాలకు కారకులంటూ రాణుల విగ్రహాలను కూల్చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై యావత్ ప్రపంచం నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒట్టావా: నారింజ దుస్తుల్లో రోడ్డెక్కిన నిరసనకారులు.. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, కూలిన రాణుల విగ్రహాలు.. ఇది కెనడా డే నాడు కనిపించిన దృశ్యాలు. జులై 1న కెనడా డే వేడుకలపై ‘కరోనా’ ప్రభావం కనిపించింది. సంబురాలు భారీగా జరుపలేదు అక్కడి జనం. పైగా ఈ మధ్యకాలంలో స్కూళ్ల నుంచి వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాల అవశేషాలు భారీగా బయటపడడం వాళ్లలో తీవ్ర విషాదం నింపింది. అందుకే నిరసన దినం పాటించారు. అయితే బ్రిటిష్ పాలనలో జరిగిన ఆ మారణహోమాలను గుర్తు చేసుకుంటూ.. కనిపించిన రాణుల విగ్రహాలను కూల్చేశారు. తాళ్లతో లాగేసి మరీ.. కెనడా వ్యాప్తంగా ఆరెంజ్ దుస్తుల్లో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. విన్నిపెగ్‌లో క్వీన్ విక్టోరియా విగ్రహం దగ్గర తొలుత ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిటిష్ రాచరికపు గుర్తులు కెనడా గడ్డపై ఉండకూడదని అరుస్తూ ఆపై విగ్రహాన్ని కూల్చిపడేశారు. విగ్రహంపైకి ఎక్కి బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆపై అక్కడున్న శిలాఫలకంపై ఎర్ర చేతి గుర్తులు వేశారు. ఇక ఆ దగ్గర్లోనే ఉన్న క్వీన్ ఎలిజబెత్ విగ్రహాన్ని కూడా తాళ్లతో లాగి కిందపడేశారు. రాణి కాదు.. రాక్షసి అంటూ అభ్యంతరకర నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఒట్టవాలో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఇక ఈ ఘటనలను బ్రిటన్ ఖండించిది. ‘‘కెనడాలో జరిగిన విషాదాలకు మేం బాధపడుతున్నాం.ఈ వ్యవహారంలో కెనడాతో విచారణకు మేం సహకరిస్తాం. కానీ, విగ్రహాలు కూల్చేయడం సరికాదు’’ అని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆరువేల మందికిపైనే.. బ్రిటీష్ కొలంబియా, సస్కట్చేవాన్ లో క్యాథలిక్ చర్చల ద్వారా నడిచే స్కూళ్లలో భారీగా పిల్లల అస్థిపంజరాలు బయటపడడం తెలిసిందే. కెనడా దాదాపు 165 ఏళ్లపాటు బ్రిటిష్ కాలనీ పాలనలో ఉంది. ఆ టైంలో సంప్రదాయ మారణహోమం పెద్ద ఎత్తున్న జరిగిందని 2015లో ఓ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. బలవంతపు మతమార్పిళ్లు.. వినని వాళ్లపై వేధింపులు జరిగేవని తెలుస్తోంది. సుమారు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడ్డారు. స్కూల్ యాజమాన్యం ఆగడాలతో దాదాపు ఆరువేల మంది పిల్లలు చనిపోగా.. వాళ్లను అక్కడే ఖననం చేశారు. ఆ అస్థిపంజరాలే ఇప్పుడు బయటపడుతున్నాయి. చదవండి: మూసేసిన స్కూల్లో వందల అస్థిపంజరాలు మతం, మాతృభాష ఆ పిల్లల పాలిట శాపం! -
బాలుడి కలలో దేవుడు కనిపించి...
బాగేపల్లి : బాగేపల్లి తాలుకాలోని సీగలపల్లిలో లభించిన విగ్రహాల ఘటన కొత్త మలుపు తిరిగింది. ఈ విగ్రహాలకు ఎలాంటి చరిత్ర లేదని, ఈ విగ్రహాలను ఇటీవల తయారు చేసి పురాతన విగ్రహాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారని అధికారులు తెలిపారు. బాలుడికి కలలో దేవుడు కనిపించి పొలంలో విగ్రహాలు ఉన్నాయని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈమేరకు పొలానికి వెళ్లి చూడగా పంచముఖి అంజనేయ విగ్రహం, చౌడేశ్వరి విగ్రహాలు కనిపించాయి. దీంతో ప్రజలు పూజలు చేసి జాతరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విషయం తహసీల్దార్ దృష్టికి వెళ్లగా ఆయన పురావస్తు శాఖ అధికారులను పంపారు. వారు వచ్చి పరిశీలించగా పురాతన విగ్రహాలు కాదని, ఇటీవల తయారైనట్లు నిర్ధారించారు. అక్కడ ఎలాంటి పూజలు, జాతరలు చేయవద్దని ఆయన సూచించారు. -
దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే!
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు. 2019 ఏప్రిల్ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. గతంలో పాలక మండలి హయాంలోనే.. దుర్గగుడికి గత ఏడాది ఉగాది ఉత్సవాల నాటికి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఉంది. ఆ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్ కవర్‌తో కప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలా సోమినాయుడు సారథ్యంలో పాలకమండలి ఏర్పటైంది. రథం యథావిధిగా ఉందని భావించారే తప్ప రథం మీద ఉన్న సింహం బొమ్మలు మాయం అవుతాయని అనుమానించలేదు. రథాన్ని పరిశీలించలేదు. గతంలో పాలకమండలి సభ్యులకు, దేవాలయ ఈఓలకు మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో వారే ప్రతిదాన్ని వివాదస్పదం చేసుకునేవారు. వారిపై అనుమానాలు.. ఇక దుర్గగుడి పరిసరాల్లో టీడీపీ నేతలు కొంతమంది కొన్నేళ్లుగా పాగా వేశారు. వారు ఇంద్రకీలాద్రిపైనే చిరు వ్యాపారం చేసి తర్వాత రూ.కోట్లకు పడగలెత్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇరకాటంలో పెట్టాలని రథంపై సింహాల ప్రతిమలను మాయం చేసి పాపానికి ఒడికట్టారా.. అనే అనుమానాలు దేవస్థానం సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక సంస్థకు గతంలో సెక్యురిటీ బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది వారి కాంట్రాక్టు పూర్తి కావడంతో తిరిగి వేలం నిర్వహించడంతో మాక్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే గత సంస్థలో పనిచేసిన అనేక మంది సిబ్బంది మాక్స్ సంస్థలో చేరి ఇక్కడే దుర్గగుడిలో పనిచేస్తున్నారు. తమ ప్రతిష్ట దెబ్బతీయడానికి గత సంస్థలో పనిచేసిన వారు ఎవరైనా ఈ తప్పుడు పని చేశారా? అనే అనుమానం మాక్స్ సెక్యురిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే! టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రార్థనా స్థలాలపై ఏ విధమైన భక్తి భావం లేదు. తన హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారు. 2016లో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చి వేయించారు. అప్పట్లో ఈ కూల్చివేతల్లో ఎంపీ కేశినేని నాని, నాటి కలెక్టర్ అహ్మద్ బాబు కీలకపాత్ర పోషించారు. రామవరప్పాడులో ఉన్న మసీదును కూల్చివేయడంతో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను సంతోష పరచడానికే స్థానిక టీడీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడుతున్నారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. రథాన్ని పరిశీలించిన మంత్రి వెలంపల్లి ఇంద్రకీలాద్రికి ఉన్న వెండి రథాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు ఈఓ ఎన్వీఎస్ఎస్ మూర్తిని విచారణాధికారిగా నియమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘గతాన్ని గుర్తు చేస్తున్నాయి.. తొలగించండి’
లండన్: జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ప్రభావం బ్రిటన్ మీద కూడా పడింది. ‘బ్లాక్‌లైవ్స్ మాటర్’ నిరసన సెగ దేశవ్యాప్తంగా ఉన్న బానిస వ్యాపారులు, వలసవాదుల విగ్రహాలకు తాకింది. మంగళవారం ఆందోళనకారులు లండన్ మ్యూజియం బయట ఉన్న 18వ శతాబ్దానికి చెందిన బానిసల వ్యాపారి రాబర్ట్ మిలిగాన్ విగ్రహాన్ని తొలగించారు. ఈ క్రమంలో లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ‘మన నగరం, దేశ సంపద బానిస వ్యాపారం నుంచి ఉద్భవించిది అనేది వాస్తవం. బహిరంగ ప్రదేశాల్లో ఇందుకు సంబంధించిన వేడుకలు జరుపుకోనవసరం లేదు. ఈ విగ్రహాలు, రహదారి పేర్లు, బహిరంగ ప్రదేశాల పేర్లు పూర్వ యుగాన్ని ప్రతిబింబిస్తాయి. వీటి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ ట్వీట్ చేశారు. నిరసనల నేపథ్యంలో లండన్ వ్యాప్తంగా వలసవాదులు, బానిస వ్యాపారుల పేర్ల మీద ఉన్న విగ్రహాలు, వీధుల పేర్లను సమీక్షించేందుకు గాను ఓ కమిటిని నియమించినట్లు సాదిక్ ఖాన్ తెలిపారు. ఆదివారం నిరసనకారులు బ్రిస్టల్‌లోని ఇంగ్లీష్ పోర్టు సిటిలో ఉన్న ఓ బానిసల వ్యాపారి కోల్స్టోన్ విగ్రహాన్ని రేవులో పడేశారు. సోమవారం ఆక్స్‌ఫర్డ్‌లో 1,000 మందికి పైగా ప్రదర్శనకారులు వలసవాది సిసిల్ రోడ్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టవర్ హామ్లెట్స్ మేయర్ జాన్ బిగ్స్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘విగ్రహాలను తొలగించడం మంచి పద్దతి కాదు. కానీ నిరసకారుల ఆందోళన వల్ల ప్రస్తుతం ఈ విగ్రహాలను తొలగించి స్టోర్ రూమ్‌లో భద్రపరిచి.. ఏం చేయాలనే దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. (‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’) ‘ప్రజలు ఇన్నాళ్లు విగ్రహాలు నిలబెట్టిన వ్యక్తులందరిని గొప్ప వ్యాపారవేత్తలుగా భావించారు. వారంతా దేశ ఉన్నతికి తోడ్పడ్డారని అనుకున్నారు. కానీ లోతుగా తరచి చూస్తే తెలిసే వాస్తవం ఏంటంటే వారంతా బానిస వ్యాపారులు. అందుకే ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని తొలగిస్తున్న నిరసనకారులను బ్రిస్టల్ పోలీసులు అడ్డుకోలేదు’ అన్నారు బిగ్స్. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని తొలగించడాన్ని నేరంగా వర్ణించారు. -
‘నన్ను చంపేస్తారు.. అందుకే విగ్రహాలు చేయించా’
కోల్‌కతా : చంపేస్తారనే భయంతో తన విగ్రహాలను తయారు చేయించిపెట్టుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్. తాను చనిపోయిన తర్వాత ప్రజలు తనను మర్చిపోవద్దనే ఉద్దేశంతో విగ్రహాలను తయారు చేయించానని చెబుతున్నారు. సౌత్ 24 పర్గానాస్ జిల్లాలోని గోసాబా నియోజవర్గ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(71) మూడేళ్ల క్రితం కోల్‌కతాలో పేరుగాంచిన శిల్పితో రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. ఫైబర్ గ్లాస్‌తో తయారు చేయించిన ఈ విగ్రహాలను తన ఇంట్లో భద్రంగా దాచుకున్నారు. అయితే ఇటీవల తన నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విగ్రహాల విషయం బహిర్గతమైంది. ఈ విగ్రహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై చనిపోతే.. ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని చెప్పుకొచ్చారు. ‘గతంలో నలుగురు హంతకులు అలిపోర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ పట్టుబట్టారు. వారిని విచారించగా.. నన్ను చంపేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లోకల్ లీడర్లే నన్ను హత్య చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నాకు జిల్లా ఎస్పీ ప్రవీణ్ త్రిపతి చెప్పారు. దీంతో నాకు ‘వై’ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురికావొచ్చు. నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను మర్చిపోవద్దు. అందుకే విగ్రహాలు తయారు చేయించా‘ అని ఎమ్మెల్యే నాస్కర్ అన్నారు. తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారంతం ఇంతకు ముందు ఇతర పార్టీలో ఉండేవారని చెప్పుకొచ్చారు. జయంత్‌కు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. -
ఆయతనం
ఆయతనం అంటే రూపం. ఆయతనం అనే మాటకు ఆలయం, గర్భగృహం అనే పేరు కూడా శాస్త్రంలో ఉంది. ఆయతనం అనే పదంతో మనకు బాగా పరిచయమైన పదం పంచాయతనం. ఆదిశంకరులు షణ్మతాలను స్థాపించి, పంచాయతన పూజను ఆచరించమని ప్రబోధించారు. నేటికీ ఈ పంచాయతన పూజను ఆచరించే వారెందరో ఉన్నారు. శివుడు, నారాయణుడు, గణేశుడు, సూర్యుడు, దేవి. వీరైదుగురు పంచాయతన దేవతలు. వీరిలో ఎవరికి ఇష్టమైన దేవతను మధ్యలో ఉంచి పూజిస్తే అది ఆ దేవతా పంచాయతనం అవుతుంది. ఉదాహరణకు శివుణ్ణి మధ్యలో ఉంచి ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు, నైఋతిలో వినాయకుడు, వాయువ్యంలో దేవి ఉంటే అది శివపంచాయతనం. ఇలా ఈ దేవతలు స్థానమార్పులతో పూజింపబడతారు.ఇది ఆత్మార్థంగా ఎవరికి వారు ఇంటిలో చేసుకునే పూజ. ఇదే పద్ధతిని అవలంబిస్తూ నిర్మించిన ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. వీటిలో గర్భగుడిలో బ్రహ్మస్థానం(మధ్య)లో.. ఆగ్నేయం మొదలైన నాలుగు మూలాల్లో ఆయా దేవతా విగ్రహాలు ఉంటాయి. అందరికీ పరిచయం అయిన పంచాయతనాలు ప్రాసాదమండనం.. మరికొన్ని చోట్ల కనిపిస్తే.. హయశీర్షసంహిత, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర పురాణాలలో పంచాయతన దేవతలు విభిన్నంగా కనిపిస్తారు. బ్రహ్మాయతనం, చండాయతనం, రామపంచాయతనం, కృష్ణపంచాయతనం వంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆంధ్రరాష్ట్రంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రమైన అన్నవరం విష్ణు పంచాయతన దేవాలయం. తమిళనాడు కంచి కామాక్షీదేవి ఆలయం దేవీపంచాయతన ఆలయం. ఒక ఆయతనం(గర్భగుడి) నిర్మిస్తే స్వర్గఫలం, మూడు ఆలయాలతో బ్రహ్మలోకప్రాప్తి, ఐదు ఆలయాలతో శివలోకం, ఎనిమిది ఆలయాలతో విష్ణులోకం, తొమ్మిది, పన్నెండు, పదహారు ఆలయాలను నిర్మిస్తే ఇహంలో సుఖం, పరంలో మోక్షం కలుగుతుందని కపింజల సంహిత చెప్పింది. ఇక్కడ ఆలయం అంటే గర్భగుడి అని అర్థం చేసుకోవాలి. సృష్టికి మూలమైన పంచభూతస్వరూపాలనుండి ఒక్కో అంశాన్ని తీసుకుని నిర్మించిన పంచాయతన దేవతల్నీ.. వారిని ప్రతిష్ఠించిన పంచాయతన దేవాలయాల్ని దర్శించడం..పూజించడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
స్తంభాలు.. సోపానాలు
ఆలయంలో ప్రవేశించిన భక్తునికి ధ్వజస్తంభం మాత్రమే కాకుండా ఇంకా అనేక స్తంభాలు కనిపిస్తాయి. వాటి గురించిన అవగాహన కూడా వారికి ఉండాలి. వాటిలో రాతితో నిర్మించి పైన దీపం ఏర్పాటు చేస్తే దాన్ని దీపస్తంభం అంటారు. ఉత్తరాది ఆలయాల్లో చెట్టుకు కొమ్మలున్నట్లు ఒక స్తంభానికి వందకు పైగా దీపాలను అమర్చే దీపస్తంభం ప్రతీ గుడిలో ఉంటుంది. విశేష పండుగలప్పుడు భక్తులు దీపాల్ని వెలిగిస్తారు. ఒక రాతిస్తంభం పైన చిన్న గూడు చేసి అందులో నంది ఉంచితే దాన్ని నందిస్తంభం అంటారు. ఇది ప్రతి శివాలయంలో ఉంటుంది. అలాగే విష్ణ్వాలయంలో రెండు చేతులూ జోడించి నిలుచున్న గరుడవిగ్రహం పైనగానీ స్తంభం మొదల్లో గానీ ఉంచితే దాన్ని గరుడస్తంభం అంటారు. ఇంకా శూలం వంటి ఆయుధాన్ని నాటి ఏర్పాటు చేసే శూలస్తంభం... పశువుల్ని మొక్కుకుని ఆలయానికి సమర్పించేప్పుడు వాటిని కట్టే యూపస్తంభం... రాజులు, చక్రవర్తులు విజయాన్ని సాధించి, రాజ్యాలను జయించినప్పుడు నాటే విజయస్తంభాలు. కొన్ని ఆలయాల్లో కనిపిస్తాయి. సింహాచలంలో కప్పస్తంభం... హంపిలోని సప్తస్వరస్తంభాలు... తిరుమలలోని వరాహ స్తంభం ఇలా చాలా స్తంభాలు విశేషమైనవి. జైన బసదుల్లో ఉండే స్తంభాన్ని మానస్తంభం అంటారు. అక్కడే ఉండే మరోస్తంభాన్ని బ్రహ్మస్తంభం అని కూడా పిలుస్తారు. ఈ స్తంభాలను దర్శించినా... తాకినా... వీటి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా...మొక్కుకున్నా... అనుకున్న పనులు నెరవేరుతాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సోపానాలు ఆలయం అంటే సాధారణంగా చాలా ఎత్తుగా... లేక ఎత్తైనప్రదేశంలోనే నిర్మిస్తారు. అలాంటి ఆలయాల్లో దైవదర్శనం చేసుకోవాలంటే మనకు మార్గం చూపేవి సోపానాలే. మెట్లే కదా అని మనం అనుకున్నా వాటివెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి ప్రత్యేకంగా పేర్లున్నాయి. ఆలయంలోకి వెళ్లేందుకు చాలా చోట్ల ముఖమండపం,రంగమండపం ద్వారా లోపలికి వెళ్లడానికి రెండువైపుల నుండీ మెట్లు ఉంటాయి. ఆ మెట్లను సోపానమాలా అంటారు. ఇందులో మొదటి మెట్టును అశ్వపాదం అనీ.. చివరి మెట్టును ఫలకం అని పిలుస్తారు. మెట్లకు అటూ ఇటూ పట్టుకోవడానికి ఆలంబనగా ఏనుగుతల.. తొండం.. ఉంటే దాన్ని హస్తిహస్తం అంటారు. రథచక్రాలన్ని అటూ ఇటూ నిర్మిస్తే రథాంగ సోపానమంటారు. మకరముఖాన్ని...లతా మండపాన్ని కూడా నిర్మిస్తారు. ఇలాంటి నిర్మాణాన్ని కుడ్యసోపానం అంటారు.కొన్నిచోట్ల మెట్లు ఉన్నా తడిమి చూస్తే తప్ప అక్కడ మెట్లున్నట్టు మనకు తెలియదు. ఉదాహరణకు అహోబిలం.. మేల్కోట వంటి గుహాలయాల్ని దర్శించినప్పుడు భక్తులు వీటిని గమనించవచ్చు. అక్కడ మెట్లు అంత స్పష్టంగా కనపడవు. వీటిని గుహ్య సోపానాలంటారు. ఇక రెండోరకమైనవి అగుహ్య సోపానాలు. మెట్లను గుర్తుపట్టే విధంగా ఉండే వీటిలో నాలుగు రకాలున్నాయి. ఎదురుగా.. కుడివైపు ఎడమవైపు ఇలా మూడు వైపులా ఎక్కే విధంగా ఉండే దాన్ని త్రిఖండాకార సోపానం అంటారు. పైన వెడల్పుగా ఉండి కిందికి దిగుతుండగా క్రమేపీ చిన్నదవుతూ ఉన్న మెట్లమార్గాన్ని శంఖమండలం అంటారు. సగం సున్నా వంటి మెట్లను అర్ధగోమూత్రం అనీ.. ఓ స్తంభానికి చుట్టూ మెట్లు ఏర్పరచి పైకెళ్లేలా ఉంటే దాన్ని వల్లీమండల సోపానాలంటారు. ఆలయాల్లో నిర్మించే మెట్లు సరిసంఖ్యలో ఉండాలని.. మానవ గృహాలకు మెట్లు బేసిసంఖ్యలో ఉండాలని నియమం. పైగా మెట్లు పిల్లలు.. వృద్ధులు.. మిగిలిన అందరూ ఎక్కి దిగడానికి ఇబ్బంది లేకుండా ఆరంగుళాల ఎత్తు మాత్రమే ఉండాలని శిల్పశాస్త్ర నియమం. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
పట్టువదలని విక్రమార్కుడు
సాక్షి, చెన్నై: పట్టువదలని విక్రమార్కుడిలా విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ప్రత్యేక అధికారి పొన్ మాణిక్య వేల్ ముందుకు సాగుతున్నారు. తనకు అప్పగించిన బాధ్యతల్లో ఏ మాత్రం తగ్గబోనని మరో మారు చాటుకున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న రెండు విగ్రహాలను భారత్‌కు తెప్పించేందుకు సిద్ధం అయ్యారు. తమిళ పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో చాకచక్యంగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆ విగ్రహాలను ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశారు. ‘పొన్ మాణిక్య వేల్’ఈ పేరు వింటే చాలువిగ్రహాల స్మగ్లర్ల గుండెల్లో దడ బయలు దేరుతుంది. విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఐజీగా ఆయన స్మగ్లర్లకు ముచ్చమటలు పట్టించారు. దేశ విదేశాల్లో ఉన్న విగ్రహాలను ఇక్కడికి రప్పించే దిశగా ముందుకు సాగారు. అందుకే పదవీ కాలం ముగిసినా, ఆయన్నే ప్రత్యేక అధికారిగా కోర్టు నియమించింది. ప్రత్యేక అధికారిగా ఆయన నియమితులైనా పాలకుల నుంచి సాయం మాత్రం కరువైంది. అయితే, తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనం తాజాగా, పాలకుల నుంచి సహకారం లేకపోవడంతో ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించి రూ.నాలుగు కోట్లు విలువగల రెండు విగ్రహాలను భారత్‌కు రప్పించడం విశేషం. ఆ్రస్టేలియా నుంచి.. తిరునల్వేలి జిల్లా వీరనల్లూరు సమీపంలో తిరువడై మరుదూర్ గ్రామం ఉంది. ఇక్కడ పాండ్య రాజుల హయంలో (600 ఏళ్ల క్రితం) మూంగీశ్వర ముడయార్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని రెండు ద్వార పాలకుల విగ్రహాలు 1995లో అపహరణకు గురయ్యాయి. ఈ కేసు విషయంలో పోలీసులు చేతులెత్తేయగా, పొన్ మాణిక్య వేల్ రహస్యంగా విచారణ చేపట్టి, ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో గుర్తించారు. స్మగ్లర్లు లక్ష్మి నరసింహన్, అశోకన్లు తన అనుచరుల ద్వారా ఇండో నేపాల్ ఆర్ట్ గ్యాలరీకి తరలించినట్టు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాలోని ఓ ప్రముఖ గ్యాలరీలో ఉంచినట్టు గుర్తించారు. ఈ విగ్రహాల విలువ రూ.4 కోట్ల 98 లక్షలు. ఈ విగ్రహాలు తమిళనాట చోరీ చేసి, ఆ్రస్టేలియాకు తరలించినట్లు ఆ గ్యాలరీకి హెచ్చరికలతో కూడిన లేఖను ఇటీవల పొన్ మాణిక్య వేల్ పంపించారు. ఆ గ్యాలరీ వర్గాలు స్పందించి, భారత్‌కు తీసుకెళ్లాలని సూచించినా, వాటిని ఇక్కడికి తీసుకు రావడంలో పాలకుల సహాకారం అన్నది పొన్ మాణిక్య వేల్కు కరువైంది. దీంతో వ్యూహాత్మకంగా, పట్టువదలని విక్రమార్కుడిలా మాణిక్య వేల్ వ్యవహరించారు. విదేశీ వ్యవహారాల శాఖ సాయంతో... తమిళనాడులో దోపిడికి గురైన విగ్రహాలు ఆ్రస్టేలియాలోని కొన్ని గ్యాలరీల్లో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేమని పేర్కొంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రెండు ద్వార పాలకులతో పాటుగా అక్కడున్న అన్ని విగ్రహాల విలువ, వాటి గురించిన పూర్తి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. ఇందులో రెండు విగ్రహాలను అప్పగించేందుకు సంబంధిత గ్యాలరీ ముందుకు వచ్చినా, ఇక్కడకు తీసుకు రాలేని పరిస్థితి ఉందని, సాయం అందించాలని కోరారు. దీంతో ఆ్రస్టేలియాలోని భారత రాయబార కార్యాలయ వర్గాల ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదింపులు జరిపాయి. దీంతో ఆ విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రధాని ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదికి అప్పగించేందుకు నిర్ణయించారు. జనవరిలో ఆ్రస్టేలియా నుంచి ఈ విగ్రహాలు ఢిల్లీకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించనున్నారు. అనంతరం ఈ విగ్రహాలను పొన్మాణిక్య వేల్ బృందం తిరునల్వేలిలోని ఆలయానికి చేర్చనున్నారు. ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. ఇక, ఆ్రస్టేలియాలో ఉన్న మిగిలిన విగ్రహాలు, సింగపూర్‌లో ఉన్న 16 విగ్రహాలను మరి కొన్ని నెలల్లో ఇక్కడికి తెప్పిస్తానని పొన్ మాణిక్య వేల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ముసుగుకు 8 ఏళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: రాజకీయ కారణాలతో ఆవిష్కరణలకు నోచుకోకుండా ముగ్గురు మహనీయుల విగ్రహాలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిపోయే వారికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పా టు చేసిన విగ్రహాలు ఇంకా అలాగే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, జీహెచ్ఎంసీ ఏర్పాటుతో పాటు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కారకుడైన స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించి విగ్రహాన్ని సిద్ధం చేశారు. అయితే ఆవిష్కరణ జరిగేలోగా రాజకీయ సమీకరణలు మారడంతో ఆవిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. వైఎస్ విగ్రహాన్ని అక్కడ ఉంచరాదనే తలంపుతో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను కూడా రాజకీయానికి వాడుకోవడంతో ముగ్గురు మహనీయుల విగ్రహాలు దిక్కూమొక్కూ లేకుండా,ఎవరికీ పట్టనట్లుగా మిగిలాయి. వివరాల్లోకి వెళితే. పాలకమండలి పట్టుపట్టి.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం గ్రేటర్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అప్పటి కాంగ్రెస్ కార్పొరేటర్లు పట్టుబట్టి విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించారు. 2010 జులైలో వైఎస్సార్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. సెప్టెంబర్‌లో ఆయన వర్థంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించినప్పటికీ ఆలోగా పనులు పూర్తికాక పోవడంతో వీలుపడలేదు. విగ్రహం పూర్తయ్యాక ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతుండగా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఫ్లోర్‌లీడర్ నేతృత్వంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను వైఎస్ విగ్రహం కంటే తక్కువ ఎత్తువి తెచ్చి వైఎస్ విగ్రహానికి దిగువన ఉంచడంతో ఆవిష్కరణలు ఆగిపోయాయి. దీంతో మూడు విగ్రహాలను ముసుగులతో కప్పేశారు. ఆ తర్వాత అప్పటి మేయర్ బండ కార్తీకరెడ్డి వైఎస్ విగ్రహావిష్కరణకు ప్రయత్నించారు. ఎవరి గౌరవానికీ భంగం వాటిల్లకుండా ఉండేందుకు మూడు విగ్రహాలను జీహెచ్ఎంసీ ఆవరణలోనే వేర్వేరు చోట్ల ప్రతిష్టించాలని నిర్ణయించి స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందారు. రోజులు గడిచినా ఆచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత 2011లో వైఎస్సార్సీపీ ఆవిర్భవించడంతో నగరానికి చెందిన అప్పటి కాంగ్రెస్ మంత్రి సైతం అక్కడ విగ్రహం ఏర్పాటు చేయరాదని భావించినట్లు ఆరోపణలొచ్చాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో రాష్ట్రంలో, జీహెచ్ఎంసీ పాలకమండలిలో టీఆర్ఎస్ కొలువుదీరింది. ఈ నెల 2న వైఎస్ పదో వర్థంతి సందర్భంగానైనా ప్రభుత్వం ,జీహెచ్ఎంసీ పాలకమండలి తెరలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. టీడీపీ రాజకీయం.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ప్రవేశద్వారం ఎదుట వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించకుండా ఉండేందుకు అప్పటి టీడీపీ ఫ్లోర్‌లీడర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ల విగ్రహాలను తెప్పించడమే కాకుండా జగ్జీవన్‌రామ్, జ్యోతిరావుపూలే, ఎన్టీఆర్, ఒవైసీలవి కూడా ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఒవైసీ పేరు ప్రతిపాదించడంతో ఎంఐఎం మద్దతిస్తుందని భావించారు. అయితే ‘రాజకీయం’ అర్థం చేసుకున్న ఎంఐఎం నేతలు ఆ ఆలోచనను సున్నితంగానే తిరస్కరించారు. ముసుగు తొలగిస్తాం.. విగ్రహాల ముసుగు తొలగించేందుకు ప్రయత్నిస్తాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, అందరి ఆమోదంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం . –బొంతు రామ్మోహన్, మేయర్ ఇంకా జాప్యం తగదు మహానేతల విగ్రహాలను ఏళ్లతరబడి ఆవిష్కరించకుండా ఉంచడం తగదు. విగ్రహాల ఎత్తు, తదితర కారణాల వల్ల మూడూ ఒకే చోట కాకుండా వేర్వేరుస్థలాల్లో ఉంచి ఆవిష్కరించవచ్చు. – బండ కార్తీకరెడ్డి , మాజీ మేయర్ -
దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు వెనుక..
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల తొలగింపు వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లు బీచ్ రోడ్‌లోని విగ్రహాలను సోమవారం అర్ధరాత్రి సమయంలో తొలగించారన్నారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా ఈ విధంగా చేయడం దారుణమన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఎన్నికల సమయంలో కలవడం, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు ఈ కుట్రకు పూనుకొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొడుకుల మీద కోపంతో వారి తండ్రుల విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. అలాగే రాజన్న రాజ్యం రాబోతోందని, వైఎస్సార్ ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాధాన్యం పెరిగిందని.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను చెప్పానన్నారు. దీంతో చంద్రబాబు తనపైనా కోపం పెట్టుకొన్నాడని.. అందుకే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను కూల్చివేయించాడని మండిపడ్డారు. బీచ్ రోడ్లో సినారే, అల్లు రామలింగయ్య, జాలాది, నేదునూరి కృష్ణమూర్తి, తిరుపతి వేంకట కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ తదితర విగ్రహాలు ఉన్నాయన్నారు. వాటికి కూడా ఎలాంటి అనుమతుల్లేవన్నారు. వాటిలో ఐదు విగ్రహాలను తానే ఏర్పాటు చేశానని చెప్పారు. వాటిన్నిటినీ వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేయాల్సి వచ్చిందో చెప్పాలని యార్లగడ్డ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలన్నారు. కాగా, విగ్రహాల ఏర్పాటుపై న్యాయస్థానం ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చినట్లు యార్లగడ్డ తెలిపారు. -
పాహిమాం సుబ్రహ్మణ్యేశ్వరా
ప్రపంచంలో ఎత్తయిన సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహాలు రెండున్నాయి. వాటిలో మొదటిది మలేషియాలో 140 అడుగుల ఎత్తులో స్వామివారి విగ్రహం రూపుదిద్దుకుంది. మరలా భారతదేశంలో అంతటిస్థాయిలో 60 అడుగుల విగ్రహాన్ని విజయనగరంలోనే నెలకొల్పడం విశేషం. ఈ అద్భుత కట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉత్తరాంధ్ర నుంచే కాక ఒడిశా, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ స్వామివారితోపాటు వినాయకుడు, మహాశివుడు, మానసాదేవి, లక్ష్మీదేవి విగ్రహాలూ కొలువై ఉన్నాయి. ఇటీవలే సరస్వతీదేవీ, రాహుకేతు విగ్రహాలను నెలకొల్పారు.శత్రు, రోగ, రుణబాధ నివారణ కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి. ప్రతి మనిషి ఈ మూడు సమస్యలతోనే ఎక్కువగా సతమతమవుతూ ఉంటాడు. వీటిని ఏకకాలంలో నివారించగలిగే దేవునిగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు కొలుస్తారు. ఆయనకు ముడుపు కట్టి మొక్కితే సకలరోగాలు పటాపంచలై అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం. ఆలయ విశిష్టత... పట్టణశివారు పూల్‌బాగ్ లక్ష్మీగణపతి కాలనీలో శ్రీశ్రీశ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. 1990కి ముందు ఆలయ ప్రదేశంలో పెద్ద పుట్ట ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతమంతా అభివృద్దికి నోచుకోలేదు. కేవలం నాగుల చవితి నాడు మాత్రమే పుట్టకు పూజలు చేసేవారు. అక్కడ పెద్ద నాగసర్పం ఉండేదని పరిసర ప్రాంతవాసులు చెబుతుంటారు. అప్పటి వరకూ కొత్తపేట నీళ్ల ట్యాంక్ వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేసిన కర్రి వెంకటరమణ సిద్ధాంతి కలలో ఈ ప్రాంతమంతా కనిపించింది. అక్కడ తనకు ఆలయం నిర్మించమని స్వామి చెప్పడంతో మరుసటిరోజున అక్కడికి వెళ్లిన సిద్ధాంతికి పెద్ద పుట్ట దర్శనమిచ్చింది. దీంతో ఆ ప్రాంతాన్ని దాతల సహాయంతో కొనుగోలు చేసి పుట్టను పరిశీలించగా అందులో దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. కలలో కనిపించిన స్వామివారి విగ్రహాలు .. పుట్ట మడిలో నుంచి వెలిసిన విగ్రహాలు ఒకటే కావడంతో సిద్దాంతి కొందరి సహాయంతో ఆ ప్రాంతంలో ఆలయాన్ని కట్టించారు. ఆలయంలో నిత్యారాధనలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏడాది జరిగే పూజలు... నిత్యపూజలతోపాటూ ప్రతినెలా మాస శివరాత్రినాడు రుద్రాభిషేకాలు, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జన్మదిన తిథి షష్టి. ప్రతి నెలా రెండు షష్టి తిధులలో స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. జ్యేష్ఠమాసంలో నాగదేవత మానసాదేవికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర షష్టితిథి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఐదురోజుల పాటూ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సకల దోషాలకు నివారణ ... జాతకరీత్యా, కుజ, శని, రాహు, కేతు దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు పరిహారమవుతాయి. ఆలస్యవివాహాలు, కుటుంబ కలతలు, దాంపత్య అనుకూలత లేకపోవడం, సంతానం లేనివారు, ఉన్న సంతానం సక్రమంగా ఉండాలనుకునేవారు, ఉద్యోగం లేనివారు, ఉద్యోగ సంబంధ సమస్యలు, ఉద్యోగ ప్రమోషన్లకు స్వామివారికి మొక్కుతారు. వృత్తి, వ్యాపార వ్యవహార అనుకూలతకు, కుటుంబ వృద్ది, గృహ సౌఖ్యం, రాజకీయ అభివృద్ధికి స్వామివారికి పూజలు చేయిస్తుంటారు. విద్యార్ధులకు విద్యాభివృద్ధికి, శత్రువుల నుంచి రక్షణకు, రుణ విమోచనకు, శరీర అనారోగ్య నివారణ, జాతకరీత్యా, నవగ్రహ దోష నివారణకు స్వామివారి పూజలు నిర్వహించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగిస్తుంటారని భక్తుల ప్రగాడ విశ్వాసం. బోణం గణేష్, విజయనగరం. ఇన్పుట్స్: – కంది గౌరీశంకర్, విజయనగరం టౌన్. స్వామి అనుగ్రహంతోనే... ‘‘ఎందరో భక్తులు తమ కష్టాలను ఇక్కడకు వచ్చి స్వామికి చెప్పుకుంటారు. వారి కష్టాలు తీరిన తర్వాత మరలా ఇక్కడకు వచ్చి విశేషపూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్ల కోసం కృషిచేస్తున్నాం. స్వామి అనుగ్రహంతోనే ఇవన్నీ సాధ్యపడుతున్నాయి.’’కర్రి వెంకటరమణ సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపకులు, స్వామి ఉపాసకులు, వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, విజయనగరం. -
ఈ గైడ్ ఫీజ్ అడగడు
ఈ రోజుల్లో కుర్రాళ్లు సెల్ఫోన్లలో కూరుకుపోయి చాటింగ్‌లలో చతికిలపడుతుంటే పకిడే అరవింద్ మాత్రం తెలంగాణా అంతా చారిత్రక ప్రాంతాలను గాలిస్తూ, వాటి గొప్పతనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. పురావస్తు శాఖకు తెలియని విశేషాలు కూడా అరవింద్‌కు తెలుసు అంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంzచనపల్లికి చెందిన పకిడే అరవింద్ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అరవింద్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కాలేజిలో ఇంటర్ మీడియట్, డిగ్రీ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జర్నలిజం పూర్తి చేశాడు.అరవింద్‌కు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అందులోనూ చరిత్ర పుస్తకాలంటే ప్రాణం. పుస్తకంలో చదివిన ప్రదేశాలకు వెళ్లి, అక్కడి చరిత్రను స్వయంగా తెలుసుకోవాలని కోరిక. తలిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతని కోరికలోని నిజాయితీని గుర్తించి ప్రోత్సహించడం మొదలు పెట్టారు. గూగుల్ మ్యాప్ ద్వారా వివిధ చారిత్రక ప్రదేశాలను గుర్తించి దానిని ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఆరంభించాడు. అంతవరకే అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదేమో, తన పరిశోధనల్లో భాగంగా అరవింద్ ఇటీవల దట్టమైన అడవుల్లో ముళ్లపొదల మధ్య కనుమరుగవుతున్న పురాతన విగ్రహాలను వెలికి తీశాడు. పురావస్తు శాఖ శోధించని అనేక ప్రాంతాలను గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చాడు. అంతేకాదు, వివిధ ప్రదేశాల చారిత్రక అంశాలను డాక్యుమెంటేషన్ చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. దాంతో తాను కనుగొన్న వాటిని సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. కాకతీయుల కట్టడాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు! పరిశోధనలో భాగంగా అరవింద్ అనేక ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించాడు. విలువైన సమాచారాన్ని సేకరించాడు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చరిత్రను తెలుసుకున్నాడు. చరిత్రను సోషల్‌మీడియా ద్వారా తెలియ చెబుతుండటంతో ఇతర దేశాలకు చెందిన చరిత్ర పరిశోధకులు కూడా రావడం మొదలు పెట్టారు. ఇలా దాదాపు 10 దేశాల నుంచి చరిత్ర పరిశోధకులు వచ్చారు. ఈ క్రమంలో అరవింద్‌కు పలువురు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తన పరిశోధనలో భాగంగా అరవింద్ సుమారు 750 పురాతనకట్టడాలు, చారిత్రక ప్రదేశాలను గుర్తించాడు. వాటిలో కాకతీయుల కట్టడలు అధికం. వీటిపై గతంలో వెలువడిన పుస్తకాలను సేకరించాడు. వ్యాసాల ద్వారా వచ్చే డబ్బుతో... తనకు తెలిసిన చరిత్రను అందరికి చాటి చెప్పేందుకు ప్రైవేట్ వెబ్సైట్లు, పత్రికలు, సోషల్ మీడియాను వినియోగించుకున్నాడు. ప్రైవేట్ వెబ్సైట్లకు వ్యాసాలు రాయడం ద్వారా వచ్చే డబ్బును కూడా పురాతన కట్టడాలకు వెళ్ళి పరిశీలించడానికి వెచ్చిస్తున్నాడు. ఫోటో ఎగ్జిబిషన్ అరవింద్ సందర్శించిన పురాతన కట్టడాలు, ఆలయాలను ఫోటోల రూపంలో బంధించారు. ఇప్పటివరకు 30 వేల ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలలో ఎవరికీ తెలియని కట్టడాలు, దేవాలయాల ఫోటోలను ఎంపిక చేసుకున్నాడు. వాటిని ఇటీవల హైదారాబాద్‌లోని రవీంద్ర భారతిలో అన్‌టోల్డ్ తెలంగాణ పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఐదు రోజులపాటు నిర్వహించారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఫోటోలతో పాటు దాని చరిత్రను రాసి బుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్ రూరల్ ఫోటోలు: పెద్దపెల్లి వరప్రసాద్ పురాతన కట్టడాలు, దేవాలయాలు ఎక్కడ ఉన్నా వెళ్ళి దాని చరిత్ర తెలుసుకోవడం ఇష్టం. పుస్తకాలలో ఉన్నవే చరిత్ర కాదు, అంతకు మించిన చరిత్ర తెలంగాణ గడ్డపైన ఉంది. ఒక్క కొత్త విషయం తెలుసుకుని ప్రపంచానికి చాటి చెబితే ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. 32 కిలో మీటర్ల గుట్టను సైతం ఎక్కి అక్కడికి వెళ్ళి చరిత్రను తెలుసుకుని వచ్చాను. రెండు సంవత్సరాలు కష్టపడి కాకతీయుల వంశీయులను సైతం కలిశాను. ప్రభుత్వం సాయం చేస్తే నేను మరింత లోతుగా పరిశోధిస్తాను. – అరవింద్, యువ చరిత్రకారుడు -
సకలాభీష్టాలను తీర్చే పూరీ జగన్నాథస్వామి
భారతదేశంలోని నలువైపులా నెలకొని ఉన్న చతుర్ధామక్షేత్రాలలో ఒరిస్సారాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో గల జగన్నాథస్వామి ఆలయం చాలా విశిష్టమైనది. ఈ స్వామికే పురుషోత్తముడని మరో పేరు. ఇక్కడ స్వామి దారుబింబంగా అంటే కొయ్య విగ్రహరూపంలో బలభద్రుడు, సుభద్ర, సుదర్శన మూర్తులతో కలిసి ఏకపీఠంపై దర్శనమిస్తాడు.ప్రతి పన్నెండు లేక పంతొమ్మిది సంవత్సరాలకోసారి ఈ విగ్రహాలను విడిచిపెట్టి (భూస్థాపన చేసి) నూతన మూర్తులను సిద్ధం చేస్తారు. దీనినే నవకళేబర ఉత్సవం అంటారు. నూతన ప్రతిమలను తయారు చేసేటప్పుడు ఆ కొయ్యలకు ఔషధీగుణాలున్న అనేక లేపనాలు చేస్తారు. చందనం, కర్పూరం, కస్తూరి, ఎర్రచందనం, ఎర్రటి బట్ట మొదలైన వాటిని విగ్రహం చుట్టూ అనేక సార్లు చుట్టటం జరుగుతుంది. గర్భగుడిలో రత్నవేదికపై నాలుగు విగ్రహాలతోపాటు లక్ష్మీదేవి లోహవిగ్రహం జగన్నాథస్వామికి కుడివైపు, విశ్వధాత్రి అని పిలిచే భూదేవి విగ్రహం ఎడమవైపు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాటి రథయాత్ర, జ్యేష్ట పూర్ణిమ నాటి స్నానయాత్ర చాలా విశిష్టమైనవి. జగన్నాథ స్వామి దర్శనం సకల కష్టాలనూ దూరం చేసి సకలాభీష్టాలనూ తీరుస్తుంది. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
అద్భుత శిల్పాల నెలవు
సాక్షి, హైదరాబాద్: అక్కడి శిల్పాలు చరిత్రను కళ్లకు కదలాడేలా చేస్తాయి. నాటి జీవన విధానాన్ని గుర్తుకు తెస్తాయి. శిల్పులు చెక్కిన కళారూపాలు ఔరా! అనిపిస్తాయి. సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఇలా ఎలా చెక్కారబ్బా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఇలాంటి శిల్పాలు చూడాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకకు వెళ్లాల్సిందే. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉన్న జైన దేవాలయానికి కొలనుపాక ప్రసిద్ధి. దక్షిణ భారత్‌లోని ప్రముఖ జైన కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి మ్యూజియంలో అరుదైన 1.5 మీటర్ల ఎత్తున్న మహావీరుడి విగ్రహం ఉంది. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల రెండవ రాజధానిగా కొలనుపాక ఉండేది. ఆ కాలంలో ఈ గ్రామం జైనుల మత కేంద్రంగా వర్ధిల్లింది. ఇక్కడ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పురాతన సంస్కృతి, వారసత్వాన్ని తెలుసుకోవాలని అనుకునే వారికి అద్భుత మ్యూజియం ఇది. వెయ్యి సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న స్మారక శిలలు లేదా వీరగల్లులుగా పిలిచే విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. హిందూ, జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, ఇతర వస్తువులున్నాయి. 6 నుంచి 16వ శతాబ్దాల కాలం నాటి మహావీర, మత్స్యవల్లభ, చాముండి, నంది లాంటి ముఖ్య శిల్పాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ శిల్పాలతో ఒక గ్యాలరీని ఏర్పాటు చేసింది. ఇందులో కొలనుపాకలోని వివిధ చారిత్రక కట్టడాల నుంచి, సమీప గ్రామాల నుంచి సేకరించిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు. చాళుక్య, కాకతీయ శైలికి సంబంధించిన 100కుపైగా శిల్పాలు కనిపిస్తాయి. ముఖ్యమైన విగ్రహాలు... క్రీ.శ.1076–1127 మధ్య కాలంలో కొలనుపాకని పరిపాలించిన త్రిభువనమల్ల రాజు వేయించిన విజయ స్తంభం. దీనికి నాలుగు వైపులా శాసనం ఉండటం విశేషం. చాళుక్యుల కాలం నాటి వినాయక, నటరాజ విగ్రహాలు, కళ్యాణి చాళుక్యుల కాలం నాటి వీరగల్లు, మహిషాసురమర్ధిని విగ్రహాలు, కాకతీయుల కాలం నాటి చాముండి విగ్రహం, నంది, వజ్రపాణి విగ్రహం, విజయ నగర కాలం నాటి కోదండ రామస్వామి విగ్రహం చూడొచ్చు. చాళుక్యుల కాలం నాటి మహావీరుని విగ్రహం యోగముద్రలో ఉంటుంది. ఎలా చేరుకోవాలి? హైదరాబాద్ నుంచి కొలనుపాక 79 కిలో మీటర్లు పర్యాటకులు హైదరాబాద్ నుంచి బస్సు లేదా రైలులో ఆలేరు వరకుచేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. మ్యూజియం ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి శుక్రవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది. ప్రవేశం ఉచితం. -
ఎట్టకేలకు పంచలోహ విగ్రహాలకు విముక్తి
గోపవరం : కారణాలు ఏవైనా గత 40 సంవత్సరాలుగా మాజీ ధర్మకర్త ఇంట్లో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలకు విముక్తి లభించింది. పంచలోహ విగ్రహాలకు సంబంధించి సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మండలంలోని రాచాయపేటలో వెలసి ఉన్న పురాతన సోమేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలైన పార్వతి, ఈశ్వరుడు, నాగపడిగ, ఇతర పూజా సామాగ్రిని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బద్వేలు ఇన్‌ఛార్జి ఈఓ వెంకటరమణారెడ్డి, సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆలయానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలు గత 40 ఏళ్లుగా మాజీ ధర్మకర్త ఇంట్లో ఉన్నట్లు గ్రామస్తులకు గాని సంబం«ధితశాఖ అధికారులకు గాని సమాచారం లేదు. అసలు పంచలోహ విగ్రహాలు ఉన్నాయన్న విషయం కూడా గ్రామస్తులకు తెలియదు. పార్వతి, ఈశ్వరుడు, నాగపడిగ వీటి విలువ రూ.70 లక్షలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. ఇటీవల మాజీ ధర్మకర్త భార్య అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు బీరువా తెరువగా అందులో పంచలోహ విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు ఆశ్చర్యానికి గురై ఆగమేఘాల మీద సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేసి విగ్రహాలను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అయితే ఇంత విలువైన విగ్రహాలు ఆలయానికి ఉన్నట్లు దేవాదాయశాఖ రికార్డుల్లో లేవు. కేవలం భూములు ఉన్నట్లు మాత్రమే రికార్డుల్లో పొందుపరిచారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక అధికారులు విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు వెనకడుగు వేశారు. అయితే విగ్రహాలను స్వాధీనం చేసుకునే అంశంపై స్థానిక అధికారులపై మాజీ ధర్మకర్త కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు దేవాదాయశాఖ కమిషనర్ విగ్రహాలను స్వాధీనం చేసుకుని భద్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో బుధవారం రెవెన్యూ, పోలీసులు, గ్రామస్తుల సమక్షంలో పంచలోహ విగ్రహాలకు పంచనామా నిర్వహించి దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలను బద్వేలు గోవిందయ్యమఠంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో భద్రపరిచారు. విగ్రహాల వివరాలు, పంచనామా నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఈఓ తెలిపారు. పంచనామాలో గోపవరం డిప్యూటీ తహసీల్దారు మధురవాణి, బద్వేలు రూరల్ ఎస్ఐ హేమాద్రి, వీఆర్ఓలు జగదీశ్వర్‌రెడ్డి, నరసింహులు, జెడ్పీటీసీ రమణయ్య, మాజీ ధర్మకర్త రాజగోపాల్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.