
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.
అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment