చైనాలో అరుదైన బౌద్ధ మ్యూజియం | China to Open Museum With Rare Buddhists Statues | Sakshi
Sakshi News home page

చైనాలో అరుదైన బౌద్ధ మ్యూజియం

Published Tue, Sep 22 2015 12:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

చైనాలో అరుదైన బౌద్ధ మ్యూజియం

చైనాలో అరుదైన బౌద్ధ మ్యూజియం

బీజింగ్: అరుదైన బౌద్ధ విగ్రహాలతో వచ్చే నెలలో చైనా ఓ మ్యూజియాన్ని ప్రారంభించనుంది. ఇందులో 1500 ఏళ్లనాటి బౌద్ధ విగ్రహాలు కూడా కొన్ని ఉన్నట్లు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ లియు హైతావో తెలిపారు. హెబీ ప్రావిన్సులోని లిన్‌జాంగ్ కౌంటీలో ప్రారంభించనున్న ఈ మ్యూజియంలో 200కు పైగా విగ్రహాలు ప్రదర్శించనున్నారు.


2012 ప్రారంభంలో 2500 ఏళ్లనాటి చారిత్రక నగరం యెచెంగ్‌లో(ప్రస్తుత లిన్‌జాంగ్) బయల్పడిన మూడు వేల విగ్రహాల్లోనివే ఇవి అని జిన్‌హుమా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నాణ్యతా పరంగా, సంఖ్యా పరంగా ఈ స్థాయిలో వెలుగుచూడడం చాలా అరుదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement