
సాక్షి,హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతిని ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో, గ్రామా ల్లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏర్పా టు చేసిన వైఎస్సార్ విగ్రహాలను పూలమాలతో అలంకరించి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు, అన్న దాన కార్యక్రమాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకలకు పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు, శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment