gattu sreekanth reddy
-
వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించాలి’
సాక్షి,హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతిని ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో, గ్రామా ల్లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏర్పా టు చేసిన వైఎస్సార్ విగ్రహాలను పూలమాలతో అలంకరించి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు, అన్న దాన కార్యక్రమాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకలకు పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు, శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందా: గట్టు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు దందా సాగే విధంగా విద్యను వ్యాపారంగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. యాజమాన్యాల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో ప్రతి ఏడాది 10 శాతం రుసుములు పెంచుకోవచ్చని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతి మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఫీజులు పెంచుకునేలా ఉత్తర్వులున్నాయని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే అడ్డగోలుగా ఉన్న ఫీజుల తగ్గింపునకు చర్యలు తీసుకోని ప్రభుత్వం జోనల్ ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి 10 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని చెబుతోందన్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవటంతో సుమారు 162 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అపరిమితంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఇటీవల కాగ్ వెల్లడించిందని గుర్తు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని నియంత్రించడానికి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. -
దిగ్విజయంగా ‘వాక్ విత్ జగనన్న’
సాక్షి, హైదరాబాద్: అభిమానులు, కార్యకర్తల హర్షాతిరేకాలు... వైఎస్సార్ అమర్ రహే... జగనన్న జిందాబాద్... అన్న నినాదాల మధ్య సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లో ‘వాక్ విత్ జగనన్న’కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వరకు పాదయాత్ర జరిగింది. సోమవారం ఉదయం పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం యాత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా గట్టు మాట్లాడుతూ రైతులు, కర్షకులు, కార్మికులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాల ఆదరణ, అంతులేని ప్రేమతో అలుపెరగకుండా ముందుకు సాగుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర 1,000 కిలోమీటర్ల మైలురాయి దాటడం తెలుగు రాష్ట్రాల్లో ఒక అపురూప ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో అరాచకాలు సాగిస్తున్న చంద్రబాబు పాలనను అంతం చేసే దిశగా సాగుతున్న పాదయాత్రకు జనం నీరాజనం పట్టడం సంతోషదాయకమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతివ్వాలి: వాసిరెడ్డి పద్మ చంద్రబాబు దుష్ట పాలనకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న పార్టీ అధినేత జగనన్నకు సంపూర్ణ మద్దతు అందించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేత మతీన్, గ్రేటర్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కె. విశ్వనాథచారి, నాయకులు అవినాష్ గౌడ్, బత్తుల నాని సహా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రాజకీయ లబ్ధికే పంచాయతీరాజ్ చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ సీఎం కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలను ఉన్నత న్యాయస్థానాలు తప్పుపడుతూనే వస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రాజకీయ లబ్ధి కోసం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొస్తుందన్నారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేసీఆర్ ఎన్నికల సందర్భంగా అనేక సభల్లో తండాలను, గూడేలను పంచాయతీలుగా మారుస్తానని ప్రగల్భాలు పలికారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ హమీని మరచి ప్రజల దృష్టిని మరల్చటానికి పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని హడావుడి చేస్తున్నారని తెలిపారు. కొత్త చట్టంతో సర్పంచ్‌ను పరోక్షంగా ఎన్నుకోవాలనుకోవడం క్యాంపు రాజకీయాలకు, ధన రాజకీయాలకు తెర లేపటమే అవుతుందన్నారు. సర్పంచ్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకుంటేనే బాగుంటుందన్నారు. అదేవిధంగా పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యులను నియమించవద్దని, ఒకవేళ నియమిస్తే వారికి ఓటు హక్కు కల్పించవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తోందని గట్టు తెలిపారు. -
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మరింతగా దృష్టిపెట్టి పనిచేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచిం చారు. బుధవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ కార్యవర్గ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వివిధ రకాల సమస్యలపై బాధపడే రాష్ట్ర ప్రజలకు తామున్నామంటూ ఓ భరోసా ఇవ్వాలని సూచించారు. దివంగత వై.ఎస్. రాజ శేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం, తెలంగాణ ప్రజల మేలు కోసం కృషి చేసే పార్టీగా వైఎస్సార్సీపీకి జనంలో ముద్ర పడేలా చూడాలని కోరారు. తెలంగాణకు వైఎస్ చేసినంతగా మరే నాయకుడు మేలు చేయలేదని గుర్తుచేశారు. వైఎస్ మరణం తట్టుకోలేక వందలాది మంది మరణిస్తే అందులో తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారన్నారు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ ఉండిపోయారని పేర్కొన్నారు. సమస్యలు గుర్తించి జిల్లాల్లో ఎక్కడికక్కడే ప్రజల భాగస్వామ్యంతో పోరా టాలు చేయాలని చెప్పారు. సమస్య పెద్దదైతే రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేయాలని సూచించారు. పార్టీ పరంగా నెలకు రెండు, మూడు ప్రధాన కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలకు సంబంధించి ఒక క్యాలెండర్ రూపొందిం చుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని... స్థానికంగా బలం ఉన్నచోట నేరుగానూ, అటూఇటుగా ఉన్న చోట పొత్తులకు వెళ్లాలని సూచించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీకి దిగాల న్నారు. రాష్ట్రంలో 8 నుంచి 18 శాతం ఓటు బ్యాంక్ వైఎస్సార్సీపీకి ఉందన్నారు. రాబో యే రోజుల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి బం గారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సమావేశంలో తీర్మానాలు.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. భర్తీకాని ఉద్యోగాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగం, అప్పుల ఊబిలో తెలంగాణ అనే అంశాలపై పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ రిజర్వేషన్లపై పార్టీ ప్రధాన కార్యదర్శి మతిన్ ముజాదుద్దీన్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, దళితులకు మూడెకరాల భూ పంపిణీపై రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్, పడకేసిన వైద్యంపై రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, గ్రేటర్ సమస్యలపై పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, మహిళల సంక్షేమం, సాధికారతపై పార్టీ మహిళా విభాగం అధ్యక్షు రాలు కె. అమృతసాగర్, డబుల్ బెడ్రూం ఇళ్లపై పార్టీ రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, పోడు భూములపై పార్టీ ప్రధానకార్యదర్శి జి. మహేందర్‌రెడ్డి తీర్మానాలు ప్రవేశపె ట్టారు. ఎన్నికల పొత్తులకు సంబంధించిన తుది నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు వదిలేస్తూ తీర్మానం చేశారు. -
నేడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, సీఈసీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు పాల్గొంటారని తెలిపారు. -
బాబు వైఫల్యాలు ఎండగట్టేందుకే..
షాద్‌నగర్ రూరల్/జడ్చర్ల టౌన్/అడ్డాకుల: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం నుంచి వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆదివారం గట్టు శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టేందుకే జగన్ పాదయాత్ర చేపట్టారన్నారు. బాబుకు ధైర్యం ఉంటే వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా అడ్డాకులలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ నేతల పాదయాత్ర హసన్‌పర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లాలో పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. హసన్‌పర్తి మండలంలోని ఎర్రగట్టు గుట్ట నుంచి వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానం వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. -
ఎకరానికి రూ. 20 వేల పరిహారం ఇవ్వాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అకాల వర్షంతో పంట నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి రూ. 20 వేల పరిహారం చెల్లించి, పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి రైతులకు ఇస్తామన్న ఎకరానికి రూ. 4 వేలు ఈ సీజన్ నుంచే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్, ఇతర నాయకులతో కలసి శ్రీకాంత్‌రెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్, నుస్తులాపూర్లలో అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు. పంట నష్టం, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ పంటలు వేసి అప్పుల పాలయ్యామని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయి రైతులకు ఎకరానికి రూ. 20 వేల పరిహారం, పత్తికి గిట్టుబాటు ధర క్వింటాల్‌కు రూ.5,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా మార్కెట్ యార్డుకు వెళ్లి పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. పత్తికి మద్దతు ధర లభించడం లేదని, రూ.2,000 నుంచి రూ.3,000 కంటే ఎక్కువ ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులతో కలసి వైఎస్ఆర్సీపీ నేతలు మార్కెట్ అధికారులను నిలదీశారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోగూరి నర్సింçహారెడ్డి ఆందోళన చేస్తున్న రైతులు, నాయకుల వద్దకు రాగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. రైతులను ఆత్మహత్యల దిశగా మళ్లించవద్దని కోరారు. కరీంనగర్ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని తెలిపారు. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన పత్తి కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 200 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు సగం కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మొక్కజొన్న, వరి, సోయా, మిర్చితోపాటు పత్తికి పంటలు దేనికి ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లరెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్.రవి, రాష్ట్ర కార్యదర్శులు బి.బ్రహ్మానందరెడ్డి, వి.గోపాలకృష్ణ, వనమాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రలోభాలతో విజయం సాధించారు
-
'రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి'
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం ఆర్థిక మంద్యం దిశగా పయనిస్తోందన్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంక్ క్యూ లైన్లలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. తక్షణమే కేంద్రం ఉపశమన చర్యలు తీసుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
'రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి'
-
డిసెంబర్ 2న వైఎస్సార్సీపీ మహాధర్నా
సూర్యాపేట : రైతులకు రెండో పంట కోసం నీటిని విడుదల చేయాలంటూ డిసెంబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రకటించారు. సూర్యాపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రైతులు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ఆయకట్టు కింద నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లధనం వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని గట్టు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు
► పార్టీలో చేరిన నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు ► కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మేడిశెట్టి యాదయ్య, ఐతరాజు రాజు, కత్తుల దిలీప్, కాంగ్రెస్ నాయకులు మాచర్ల దశరథ్, మానిర్ల జానీ తదితరులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ జిల్లా పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహ్మద్ ఫయాజ్ ఆధ్వర్యంలో వారంతా వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాయవాది ఫరీద్, ఎండీ అక్బర్, అమృతప్ప, ప్రకాష్, ఎండీ లాల, ఎండీ సిరాజ్ తదితరులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుకుమార్ ఆధ్వర్యంలో వారు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రెడ్డి, ఆ జిల్లా యూత్ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.