వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు | leaders joining in ysrcp in telangana | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు

Published Thu, Aug 4 2016 2:39 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు - Sakshi

వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు

పార్టీలో చేరిన నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు
కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
 
సాక్షి, హైదరాబాద్:
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మేడిశెట్టి యాదయ్య, ఐతరాజు రాజు, కత్తుల దిలీప్, కాంగ్రెస్ నాయకులు మాచర్ల దశరథ్, మానిర్ల జానీ తదితరులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నల్లగొండ జిల్లా పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహ్మద్ ఫయాజ్ ఆధ్వర్యంలో వారంతా వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాయవాది ఫరీద్, ఎండీ అక్బర్, అమృతప్ప, ప్రకాష్, ఎండీ లాల, ఎండీ సిరాజ్ తదితరులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుకుమార్ ఆధ్వర్యంలో వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రెడ్డి, ఆ జిల్లా యూత్ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement