బుధవారం లోటస్‌పాండ్ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌సీపీ తెలంగాణ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి. చిత్రంలో మహేందర్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్, మతీన్, రాంభూపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మరింతగా దృష్టిపెట్టి పనిచేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచిం చారు. బుధవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ కార్యవర్గ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వివిధ రకాల సమస్యలపై బాధపడే రాష్ట్ర ప్రజలకు తామున్నామంటూ ఓ భరోసా ఇవ్వాలని సూచించారు. దివంగత వై.ఎస్. రాజ శేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం, తెలంగాణ ప్రజల మేలు కోసం కృషి చేసే పార్టీగా వైఎస్సార్‌సీపీకి జనంలో ముద్ర పడేలా చూడాలని కోరారు. తెలంగాణకు వైఎస్ చేసినంతగా మరే నాయకుడు మేలు చేయలేదని గుర్తుచేశారు.
వైఎస్ మరణం తట్టుకోలేక వందలాది మంది మరణిస్తే అందులో తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారన్నారు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ ఉండిపోయారని పేర్కొన్నారు. సమస్యలు గుర్తించి జిల్లాల్లో ఎక్కడికక్కడే ప్రజల భాగస్వామ్యంతో పోరా టాలు చేయాలని చెప్పారు. సమస్య పెద్దదైతే రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేయాలని సూచించారు. పార్టీ పరంగా నెలకు రెండు, మూడు ప్రధాన కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలకు సంబంధించి ఒక క్యాలెండర్ రూపొందిం చుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని... స్థానికంగా బలం ఉన్నచోట నేరుగానూ, అటూఇటుగా ఉన్న చోట పొత్తులకు వెళ్లాలని సూచించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీకి దిగాల న్నారు. రాష్ట్రంలో 8 నుంచి 18 శాతం ఓటు బ్యాంక్ వైఎస్సార్‌సీపీకి ఉందన్నారు. రాబో యే రోజుల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి బం గారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
సమావేశంలో తీర్మానాలు..
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. భర్తీకాని ఉద్యోగాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగం, అప్పుల ఊబిలో తెలంగాణ అనే అంశాలపై పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ రిజర్వేషన్లపై పార్టీ ప్రధాన కార్యదర్శి మతిన్ ముజాదుద్దీన్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, దళితులకు మూడెకరాల భూ పంపిణీపై రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్, పడకేసిన వైద్యంపై రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, గ్రేటర్ సమస్యలపై పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, మహిళల సంక్షేమం, సాధికారతపై పార్టీ మహిళా విభాగం అధ్యక్షు రాలు కె. అమృతసాగర్, డబుల్ బెడ్రూం ఇళ్లపై పార్టీ రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, పోడు భూములపై పార్టీ ప్రధానకార్యదర్శి జి. మహేందర్‌రెడ్డి తీర్మానాలు ప్రవేశపె ట్టారు. ఎన్నికల పొత్తులకు సంబంధించిన తుది నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు వదిలేస్తూ తీర్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment