
సాక్షి, తాడేపల్లి: ప్రజల భద్రత కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో నిబంధనలకు లోబడే సభలు జరుపుకోవాలని చెప్పారు. షరతులు ఉల్లంఘిస్తేనే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేదం. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాలు ఇచ్చాము. రోడ్లపై కాకుండా గ్రౌండ్‌లో సభలు జరుపుకోవచ్చు. కేవలం ప్రతిపక్షాలపై పరిమితులు విధించలేదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్సార్‌సీపీ కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చంద్రబాబు సభల్లో జనం చనిపోతున్నారు. కందుకూరు, గుంటూరులో ఏం జరిగిందో చూశాం. చంద్రబాబు అమాయకుల ప్రాణాలు తీశారు' అని సజ్జల మండిపడ్డారు.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది.
చదవండి: (పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలి: మంత్రి అంబటి)
Comments
Please login to add a commentAdd a comment