rallys
-
ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాల్సిందే: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: జీవో నంబర్ వన్‌పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ముందు దాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. పదేపదే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు అసలు ఆ జీవోను ఇప్పటిదాకా చదివాయా అంటూ ప్రశ్నించారు. అందులో రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధమని ఎక్కడుందో చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దని మాత్రమే చెప్పాం. అవసరమైతే అనుమతి తీసుకొని బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. జోవో నంబర్ వన్ అన్ని పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్సార్, జగన్ పాదయాత్రల్లో ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రజల భద్రత కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో నిబంధనలకు లోబడే సభలు జరుపుకోవాలని చెప్పారు. షరతులు ఉల్లంఘిస్తేనే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేదం. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాలు ఇచ్చాము. రోడ్లపై కాకుండా గ్రౌండ్లో సభలు జరుపుకోవచ్చు. కేవలం ప్రతిపక్షాలపై పరిమితులు విధించలేదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్సార్సీపీ కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చంద్రబాబు సభల్లో జనం చనిపోతున్నారు. కందుకూరు, గుంటూరులో ఏం జరిగిందో చూశాం. చంద్రబాబు అమాయకుల ప్రాణాలు తీశారు' అని సజ్జల మండిపడ్డారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. చదవండి: (పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలి: మంత్రి అంబటి) -
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్, అన్ని రంగాల్లోనూ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ 648 పాయింట్లు ఎగిసి 59790 వద్ద, నిఫ్టీ195 పాయింట్లు లాభంతో 17817 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, హిందాల్కో, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ భారీగా లాభపడుతుండగా, గ్రాసిం మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. కాగా వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు సోమవారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సంకేతాలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మంగళవారం ర్యాలీని కంటిన్యూ చేస్తున్నాయి. -
ఆగస్టు 17 నుంచి 23 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ర్యాలీలు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో మెహంగై చౌపాల్(ధరల పెరుగుదల పై చర్చలు) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 17 నుంచి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండీలు, రిటైల్ మార్కెట్లు వంటి తదితర ప్రదేశాల్లో ధరల పెరుగుదల పై ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తెలిపారు. ఈ నిరసన ర్యాలీలు ఆగస్టు 28న ఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్స్‌లో సీనియర్ నాయకులు ధరలపై నోరెత్తండి అనే ప్రసంగంతో ముగిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేరకంగా ఆగస్టు 5న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ప్రజల్లో బలంగా వెళ్లి ప్రతి ధ్వనించాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చట్టబద్ధమైన నిరసనను చేతబడి లేదా క్షద్ర శక్షులుగా చిత్రకరించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తమ ప్రభుత్వ వైఫల్యాల విషయమైన మోదీలో కలుగుతున్న అభద్రత భావాన్ని తేటతెల్లం చేస్తోందంటూ... ఆరోపణలు చేశారు. రానున్న వారాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం పై వరుస నిరసనలతో కాంగ్రెస్ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. మెదీ చేస్తున్న ఆర్థిక దుర్వినియోగాన్ని కూడా బయట పెడతామని అన్నారు. ఈ మేరకు పెరుగు, మజ్జిగ , ఫ్యాకేజ్డ్ ఆహారధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల పై అధిక పన్నుల విధించడం వల్ల ద్రవ్యోల్బణం తీవ్రమవుతోందన్నారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, అగ్నిపథ్ వంటి తప్పుదారి పట్టించే పథకాలను ప్రవేశపెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని జై రాం రమేష్ అన్నారు. (చదవండి: ఈ ఫుడ్‌ని జంతువులు కూడా తినవు ... కానిస్టేబుల్ ఒకటే ఏడుపు) -
స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద కార్మికుల నిరసన..
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద ఎత్తున కార్మికులు అడ్మిన్ భవనం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. స్టీల్ ప్లాంట్‌కు చేరుకునే అన్ని మార్గాలను దిగ్భంధించేందుకు కార్మికులు యత్నించారు. కాగా, భారీవర్షంలోనూ గొడుగులు పట్టుకుని మరీ.. కార్మిక సంఘాల నేతలు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. -
భారీ ఆఫర్: దూసుకుపోయిన ఇన్ఫోసిస్
సాక్షి, ముంబై: 1800 పాయింట్లుకు పైగా కుప్పకూలిన దలాల్ స్ట్రీట్‌లో ఈ సోమవారం బ్లాక్ మండేగా నిలిచింది. స్టాక్మార్కెట్లో 2021లో ఇదే అదిపెద్ద పతనం. అయితే దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం లాభాలతో మురిపించింది. తమ బోర్డు సమావేశంలో వాటాలను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తుందని ఆదివారం ఎక్స్ఛేంజీలకు సమాచారం కంపెనీ వెల్లడించడమే ఇందుకు కారణం. దీంతో ఇన్ఫోసిస్ షేరు ఏకంగా 2.72 శాతం ఎగిసి రూ.1480 తాకింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ బీఎస్ఇలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 6.12 లక్షల కోట్లను తాకింది. అనంతరం లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా నష్టపోతోంది. (మార్కెట్ల క్రాష్: రూ. 7 లక్షల కోట్లు మటాష్) ఏప్రిల్ 14, 2021న బోర్డు సమావేశం ముగిసిన తరువాతఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. ప్రధానంగా క్యూ4 ఫలితాలు, బోర్డ్ మీటింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనుందని అంచనా. దీనికితోడు ఫైనల్ డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించనుందని సీఎల్ఎస్ఏ అంచనాలు వెలువరించింది. దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నరశాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుందనితెలిపింది. ఈ బైబ్యాక్‌ను డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లయితే,రెండేళ్ళలో ఇన్ఫోసిస్ రెండో బై బ్యాక్ ఆఫర్ అవుతుంది. మార్చి 2019న 747 ధర వద్ద 11.05 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లను 8,260 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (బంపర్ ఆఫర్ : ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీ తగ్గింపు) చదవండి : ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త! -
కుళ్లు జోకులు.. వెకిలి పోస్టులు..
సాక్షి,హైదరాబాద్: గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ.. గ్రేటర్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విద్వేషం హద్దులు దాటుతోంది. ప్రత్యర్థులపై అభ్యంతరకర, రాయలేని వ్యాఖ్యలతో చెలరేగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. నాయకుల అలవాట్లు, ఆహార్యంపై సెటైర్లు, కుళ్లుజోకులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ప్రత్యర్థులను చులకన చేసే ప్రయత్నంలో దిగజారుడు పోస్టులు పెడుతున్నారు. రాజకీయ వేడిలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అరాచకమిది. పార్టీలకు అనుకూలంగా వారి సోషల్‌మీడియా విభాగాలు చేసే పోస్టులు పద్ధతిగానే ఉంటున్నాయి. కానీ, కొందరు సానుభూతిపరులు, అతివాదులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ పోస్టులపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి విద్వేషపు పోస్టింగులకు దిగిన వారిపై ఐటీయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కొత్త ఓటర్లు, యువతకు గాలం.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. ఆన్లైన్ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతీ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ ఉంది. ముఖ్యంగా 18 ఏళ్లు దాటి డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల ఓట్లే లక్ష్యంగా ఈ వ్యంగ్యపు, వెకిలి పోస్టులు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగించే యువతలో నూటికి 90 శాతం వినోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, వారి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై కుళ్లుజోకులతో బాడీషేమింగ్‌కు దిగుతున్నారు. చేసిన, చేయబోయే పనులను చెప్పుకొని ఓట్లు అడగటం, ప్రత్యర్థులను విమర్శలతో ప్రశ్నించడం మంచి రాజకీయం. కానీ కొందరు అత్యుత్సాహపరులు తమ ప్రత్యర్థి పార్టీల నాయకులను తాగుబోతు, వదరుబోతు, గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ అంటూ ఆకారం, అలవాట్ల ఆధారంగా కుళ్లుజోకులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై యువత మనసులో విద్వేషపు బీజాలు నాటుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఇలాంటి పోస్టులకు కొదవలేదు. వ్యక్తులను కించపరుస్తూ వీడియోలు, సినిమాల్లోని హాస్యపు బిట్లు, మీమ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కులతో పోస్టులు రూపొందిస్తూ కొత్త ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఇలాంటివారు అరెస్టయినా... పార్టీకి సంబంధం లేదని, స్వచ్ఛందంగానే తాము ఇలా చేశామని పోలీసులకు వివరణ ఇస్తుండటం గమనార్హం. ప్రైవేటు ఆర్మీల పేరుతో.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొందరు సానుభూతిపరులు రాజకీయ పార్టీలతో పరోక్షంగా సంబంధాలు నెరుపుతూ సోషల్‌మీడియా ప్రైవేటు ఆర్మీల పేరిట ప్రత్యేక విభాగాలు నడిపిస్తున్నారు. సాధారణంగా పార్టీ అధికారిక సోషల్‌మీడియా వింగుల్లో ఎలాంటి అసభ్యతకు తావుండదు. కానీ, అభిమానుల ముసుగులో ప్రైవేటు ఆర్మీలు తమ పోస్టింగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని, దాడులకు పురిగొలిపే ప్రమాదముందని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే వీటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. పార్టీల సానుభూతిపరులు అప్పటికపుడు ప్రత్యేకంగా కంటెంట్ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లను నియమించుకున్నారు. కేవలం 20 రోజులకే వీరికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు చెల్లిస్తూ ఇలాంటి పోస్టులను ప్రోత్సహిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్‌లతో పర్యవేక్షణ! విద్వేషపు పోస్టులపై గ్రేటర్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై పునరావృతమైనా సహించేది లేదని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేసేవారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయం ఆదేశాల మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోని సీసీఎస్ డీసీపీలతోపాటు, కొందరు సీనియర్ ఐపీఎస్‌లు ఈ తరహా పోస్టింగులపై నిఘా వేశారు. ప్రజలు, నాయకులు చేసే ఫిర్యాదుల పైనే కాకుండా అవసరమైతే పోలీసులు కూడా స్వచ్ఛందంగా కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
నేడు అమిత్ షా ఇంటికి.. షహీన్‌బాగ్ ర్యాలీ
న్యూఢిల్లీ/కోల్‌కతా/ముంబై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కు తీసుకోవాలంటూ షహీన్‌బాగ్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్‌బాగ్ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్‌షా చెప్పినందుకే ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ర్యాలీ మొదలుకానుంది. ర్యాలీపై తమకు సమాచారం లేదని హోంశాఖ తెలిపింది. సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శనివారం షహీన్‌బాగ్ నిరసనకారులు కొందరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మాట్లాడేందుకు సముఖత వ్యక్తం చేశారు. డబ్బులు, బిర్యానీ కోసమే నిరసనలు.. షహీన్‌బాగ్‌లో నిరసనలు తెలుపుతున్న వారు డబ్బు, బిర్యానీల కోసమే రోజూ వేదిక వద్ద కూర్చుంటున్నారని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్‌ఘోష్ ఆరోపించారు. ‘నిరక్షరాస్యులు, సామాన్యులు, పేదలు, అజ్ఞానులు అక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. నేతలిచ్చే డబ్బు, బిర్యానీల కోసమే నిరసనలు చేస్తున్నారు. పైగా వీరికి పంపే డబ్బంతా విదేశాల నుంచే వస్తోంది. కాంగ్రెస్ నేత చిదంబరం, సీపీఐ నేత బృందా కారత్లాంటి వారి ప్రసంగాలు వినే శ్రోతలు వారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో భారీ ర్యాలీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా శనివారం ముంబైలో భారీ ర్యాలీ జరిగింది. దీనికి వేలాది మంది హాజరు కాగా అందులో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. ఉర్దూ కవి ఫయాజ్ అహ్మద్ ఫయాజ్ రచించిన ‘హమ్ దేఖేంగే’ (మేం చూస్తాం) అంటూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు ముంబైతో పాటు నవీ ముంబై, థానేల నుంచి తరలివచ్చారు. -
దూసుకుపోతున్న మార్కెట్లు
సాక్షి, ముంబై: వరుస నష్టాల నుంచి పుంజుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. గురువారం నాటి పాజిటివ్ ధోరణిని శుక్రవారం 380 పాయింట్లకు పైగా ఎగిసింది. తద్వారా 37700 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 306 పాయింట్లు జంప్‌చేసి 37,699 వద్ద నిఫ్టీ 85 పాయింట్లు ఎగసి 11,343 వద్ద ట్రేడవుతోంది. ఫార్మా తప్ప అన్ని సెక్టార్లులాభాల నార్జిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా, బ్యాంక్ నిఫ్టీ 2-1 శాతం మధ్య లాభపడగా.. ఫార్మా దాదాపు 2 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ 6-5 శాతం చొప్పున జంప్‌చేయగా.. హీరో మోటో, హెచ్‌యూఎల్, జీ, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ 3-1.6 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు సన్ ఫార్మా టాప్ లూజర్‌గా ఉంది. ఐవోసీ, హిందాల్కో, వేదాంతా, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సిప్లా తదితరాలు నష్టపోతున్నాయి. -
నిన్ను నమ్మం బాబు!
-
రాజధానిలో లక్షమందితో
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో విజయమేధ్వేయంగా జాతీయ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీలను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలు, 70 అసెంబ్లీ స్థానాల్లో భారీ ర్యాలీలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ ర్యాలీలో అమిత్ షాతో సహా ప్రధాని మోదీ కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం పాల్గొనే ఈ ర్యాలీలో లక్షమందికి పైగా పార్టీ కార్యకర్తలతో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. 45 శాతం వరకు ఓటింగ్ ప్రభావం గల పూర్వాంచాలీస్‌లో బలపడాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. దానిలో భాగంగానే 2016 భోజ్‌పూరి నటుడు, బీజేపీ నేత మనోజ్ తివారిని ఢిల్లీ యూనిట్ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2017 ఏప్రీల్‌లో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం వెనుక మనోజ్ తివారి కృషి ఎంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్న ఢిల్లీలోని స్లమ్ ఏరియాలో మరింత దృష్టి సారిస్తామని తివారి పేర్కొన్నారు. బీజేపీ ప్రధానంగా పూర్వాంచాలీస్ పైనే ఎక్కువగా దృష్టి సారించింది. వారి ప్రభావం గల 20 అసెంబ్లీ స్థానాలతో సహా, 80 పురపాలక వార్డులు బీజేపీకి ఎంతో కీలకం కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోవడం విశేషం. -
నా దుస్తులు చింపాలని ఆదేశించారు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థులు మార్చి 23న చేపట్టిన ర్యాలీలో ఢిల్లీ పోలీసులు విద్యార్థినులతో వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. 8 మంది విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడిన జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టిన సంగతి తెల్సిందే. ర్యాలీలో పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జేఎన్‌యూ సోషియాలజీ విభాగానికి చెందిన షీనా ఠాకూర్(24) అనే విద్యార్థిని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ర్యాలీని అడ్డుకున్న ఓ మహిళా పోలీస్ అధికారిణి ఆందోళన చేస్తున్న తన దుస్తుల్ని చించేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించిందన్నారు. దీంతో వెంటనే కొందరు తనపై పిడిగుద్దులు కురిపించారని, లోదుస్తుల్ని లాగేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు తమపై వాటర్ కేనన్లను ప్రయోగించారన్నారు. -
‘ర్యాలీలతో రాముడి పేరు చెడగొడుతున్నారు’
సాక్షి, కోల్‌కతా: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ర్యాలీలతో శ్రీరాముడి పేరును చెడగొడుతున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి రోజు ర్యాలీల సందర్భంగా జరిగే మత ఘర్షణలపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయుధాలతో శోభాయాత్రలు జరపాలని దేవుడు ఎవరికైనా చెప్పారా అంటూ ఆమె ప్రశ్నించారు. కొంత మంది అవివేకులు ఆయుధాలతో ర్యాలీలు చేస్తూ దేవుడి పేరు చెడగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. శాంతీయుతమైన ర్యాలీలకు మాత్రమే తాను అనుమతి ఇస్తానని, ఆయుధాలతో ఇతరుల ఇంట్లోకి వెళ్లి హత్యచేసే ర్యాలీలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత పరమైన ర్యాలీలు నిర్వహించినప్పుడు ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, గతేడాది దుర్గ మాత శోభాయాత్ర, మొహర్రం పండుగలు ఒకే రోజున వచ్చినప్పుడు కూడా సీఎం మమతా బెనర్జీ చాకచక్యంగా వ్యవహరించి మత ఘర్షణలు జరగకుండా జగ్రత్తలు తీసుకున్నారు. మన దేశంలో సాధారణంగా సిక్కు మతస్థులు ఆయుధాలతో ర్యాలీలు నిర్వహించడం చూస్తుంటాం. అయితే మత పరమైన ర్యాలీలలో కత్తులు, తుపాకులతో ప్రదర్శనలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. -
33 జిల్లాలు, 33 ర్యాలీలు
-
33 జిల్లాలు, 33 ర్యాలీలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి అధికారం కట్టబెట్టేలా గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల్లో 33 బహిరంగ ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఒక్కో జిల్లాలో 3 నుంచి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రధాని ఎన్నికల షెడ్యూల్ రూపకల్పనపై కసరత్తు సాగుతున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 20 తర్వాత మోదీ గుజరాత్ ప్రచారాన్ని ప్రారంభించే అవకాశముంది. గత అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి విభిన్నంగా మోదీ ప్రచార పర్వం ఉంటుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నిజానికి గత 22 ఏళ్లుగా బీజేపీనే గుజరాత్‌ను పాలిస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై ప్రజా వ్యతిరేకత ప్రభావం పడకుండా రక్షణాత్మక ధోరణితో బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రం కుల సమీకరణాలతో బలమైన కూటమి ఏర్పాటు దిశగా కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కులతత్వాన్ని రెచ్చగొట్టేలా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఇప్పటికే ఆరోపించారు. పటీదార్ వర్గ నేత హార్దిక్‌తోపాటు ఓబీసీ వర్గానికి చెందిన అల్పేశ్ ఠాకూర్, ఎస్పీ వర్గానికి చెందిన జిగ్నేష్ మేవానీల్ని కాంగ్రెస్ ఇప్పటికే తనవైపుకు తిప్పుకుంది. అలాగే జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని కాంగ్రెస్ ఎక్కువగా ప్రచారం చేస్తోంది. జీఎస్టీ శ్లాబుల్లో తాజా మార్పులతో ప్రజల ఆగ్రహాన్ని కొంతైనా చల్లార్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే జీఎస్టీపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మాత్రం మోదీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. గుజరాతీయుల మనసు మార్చే వ్యూహంతో.. గుజరాత్ అభివృద్ధి కోసం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని 2012 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఆరోపించారు. ఈసారి కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ అభివృద్ధిపై ఆ రాష్ట్ర ప్రజల్ని మోదీ ఏ మేరకు నమ్మిస్తారో వేచిచూడాలి. మోదీ ప్రధానిగా ఉన్నప్పటి కంటే సీఎంగా ఉన్నప్పుడే తమ పరిస్థితి బాగుండేదని ఆ రాష్ట్ర ప్రజల్లో బలపడుతున్న ఆలోచనా ధోరణిని ఎదుర్కోవడం ఆయన ముందున్న మరో సవాలు. ఈ ప్రతికూలతల నేపథ్యంలో ఎలాగైనా గుజరాత్ ప్రజల్ని తమ వైపునకు తిప్పుకునేలా మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు భారీ ప్రచార పర్వానికి తెరతీస్తున్నారు. -
ఇలాగైతే...చదువులు సాగేదెలా...!
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, తమకు విద్యేతర పనులతో విద్యకు దూరం చేస్తున్నారని ఓ వైపు విద్యార్థులు, మరోవైపు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాలకులు తమ ప్రచార ఆర్భాటాల కోసం పాఠశాల విద్యార్థులను వినియోగించడం ద్వారా తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని విద్యార్థులే ఆరోపిస్తున్నారు. సాధించేది ఏమీ లేకున్నా...ఏదో ఒక ప్రచారం పేరిట చదువుకు దూరం చేస్తూ తమ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రామభద్రపురం: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని పాలకులు ప్రకటనలు చేస్తూనే మరోవైపు ప్రణాళికాబద్దంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ పాఠశాలలను బలోపేతం చేసే ఆలోచన చేస్తుంది. దీంతో పేద, మధ్యతరగతులకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కంటే ప్రభుత్వ పథకాల ప్రచారానికే ఎక్కువగా ఆర్భాటం చేస్తూ సాధించేదేమి లేకున్నా తమ పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంకోవైపు ఉపాధ్యాయులను పాఠ్యాంశాల బోధనకు దూరం చేస్తూ ఏదో ఒక శిక్షణ పేరిట పాఠశాలలకు దూరం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో 2817 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో దాదాపుగా 2లక్షల 10 వేల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి సుమారుగా 12 వేల మంది టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. జిల్లాలో 740 పాఠశాలలో ఏకోపాధ్యాయులు, 70 శాతం పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏకోపాధ్యాయులు ఉన్నచోట ఒక్క టీచరు ఉండకుండా బోధనేతర పనులకు చేయడం, ఇద్దరు ఉన్న చోట ఒకరు బోధనేతర పనులకు వెళ్తే ఒక్కరే మొత్తం ఐదు తరగతులకు చదువులు చెప్పడం కష్టతరంగా ఉందని ఉపాధ్యాయ వర్గాల భావించగా, సకాలంలో సిలబస్‌లు కాక సామర్ధ్యాలపై ఆ ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రచార పటాటోపం... దోమలపై దండయాత్ర, వనం–మనం, పరిసరాల పరిశుభ్రత ర్యాలీలు, పెద్దవారు ఎవరైనా వచ్చినపుడు, నిరక్షరాస్యత నిర్మూలన చేసేందుకు చిట్టిగురువులు వంటి పలు ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వం విద్యార్థులనే ఉపయోగిస్తుంది. వీటితో తమ చదువులు కుంటుపడుతున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వం విద్యార్థులను ఓడీఎఫ్ భాగస్వా మ్యం చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛభారత్ పేరిట ప్రాజెక్టులు తప్పనిసరి చేసింది. మరోవైపు బయోమెట్రిక్ పేరిట యంత్రాల ముందు గంటల తరబడి నిలబడేలాచేసి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించే యత్నం చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓడీఎఫ్ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థులకు పెర్ఫార్మన్స్ కింద 5 మార్కులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వాటికోసం ఆలోచిస్తే తమ సామర్ధ్యాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అక్షర విజయం ద్వారా వయోజనులకు చదువు నేర్పించే వారని ఇప్పుడు అలాకాకుండా చిట్టి గురువులు కార్యక్రమం పెట్టి 6, 7, 8 తరగతులలో బాగా చదువుతున్న పిల్లలను గుర్తించి వారితో చదువులు చెప్పించడం వల్ల వారు రాత్రి వేళల్లో చదవక విద్యా సామర్ధ్యం దెబ్బతింటుందని, సరిగా విద్యాబోధన లేని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ఎందుకు చేర్పించామా?అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘ప్రభుత్వాల చర్యలు తిప్పికొడదాం’
ఘనంగా మేడే కోటగుమ్మం(రాజమహేంద్రవరం సిటీ) : నగర సీపీఐ ఆధ్వర్యంలో మే డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు జట్లు లేబర్ యూనియన్, కూరగాయల మార్కెట్, పార్టీ శాఖల్లో పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రావుల వెంకయ్య ఎగుర వేశారు. ప్రజా నాట్య మండలి కళాకారులు నృత్య, విప్లవ గీతాలతో మంగళవార పేట నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ తాడితోట మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తిప్పికొట్టాలన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ మతోన్మాద విధానాలతో మోడీ ముందుకు వెళుతున్నారని, దేశాన్ని మత విభజనగా చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమితి సభ్యుడు మీసాల సత్యనారాయణ, నగర కార్యదర్శి నల్లా రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణ, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చిట్టూరి ప్రభాకరచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
కుట్రను తిప్పికొడతాం..
ఈడేపల్లి : మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణలు రైతుల భూములను లాక్కునేందుకు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకే గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టినట్టు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. స్థానిక ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయ భవనంలో శుక్రవారం భూ పరిరక్షణ పోరాట సమితి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేస్తున్న భూ దందాపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలను రైతులకు తెలియజేసేందుకు నవంబరు 1వ తేదీ నుంచి బందరు మండలంలోని గ్రామాల్లో రాత్రింబవళ్లు పాదయాత్రలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పరిశ్రమల పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో 14 నెలలుగా రైతులు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. పోర్టు నిర్మించాలన్న బందరు ప్రజల చిరకాల వాంఛను పరిశ్రమలవైపు మళ్లించి రైతులను దోచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పోర్టులైన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ప్రాంతాల్లో 1800 నుంచి 2000 వేల ఎకరాల్లో నిర్మించారన్నారు. పోర్టు నిర్మించాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్లకు ఉంటే పోర్టు నిర్మాణం జరిగేదన్నారు. కానీ దీనిని పట్టించుకోకుండా పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని రైతులను అనాథలను చేసేందుకే మంత్రి, ఎంపీలు విశ్వప్రయత్నాలు చేస్తూ, అధికారులతో కూడా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. సర్కారీ దందాను వివరిస్తాం... సీపీఐ నేత, భూ పరిరక్షణ పోరాట సమితి సభ్యులు మొదుగుమూడి రామారావు మాట్లాడుతూ వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి రాత్రింబవళ్లు గ్రామాల్లో పాదయాత్రలు చేసి ప్రభుత్వం చేస్తున్న భూదందాపై రైతులకు వివరిస్తామన్నారు. మొదటిరోజు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి రామకృష్ణ హాజరవుతారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి, భూ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కొడాలి శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాలను ప్రభుత్వం దోచుకుని ఇతర దేశాలకు అమ్మకాలు చేస్తుందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షులు షేక్ సిలార్‌దాదా మాట్లాడుతూ పూటకోమాట చెప్పి నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటివరకు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు రైతులు ఇచ్చింది కేవలం 543 ఎకరాలేనని, వాటిల్లో సగానికి పైగా తెలుగు తమ్ముళ్ల బినామీ పేర్లతో పత్రాలను తయారు చేసి, తమ భూములకు ఇచ్చినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత అచ్చేబా, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మతిన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు రామిశెట్టి ప్రసాద్, సీపీఎం నాయకులు సీహెచ్ జయరావు పాల్గొన్నారు. -
జై జవాన్
-
ఆరోగ్యంతోనే అభ్యుదయ సమాజం
సమష్టి ప్రజా ఉద్యమంతోనే అది సాధ్యం ‘దోమలపై దండయాత్ర’లో మంత్రి దేవినేని కాకినాడ : ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతున్న దోమల నిర్మూలనకు ప్రజలంతా సమష్టిగా ఉద్యమించి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రేచర్లపేటలో కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమాల్లో మంత్రి దేవినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేచర్లపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతులైన ప్రజలతో విలసిల్లే సమాజమే అన్ని రంగాల్లో పురోగమిస్తుందని అన్నారు. దోమకాటు వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు ప్రబలి ప్రజలను శారీరకంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నాయన్నారు. దోమల నిర్మూలనకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వపరంగా చేపడుతున్న చర్యలను వివరించారు. శనివారం జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇంటింటి ప్రదర్శన ద్వారా 15 లక్షల కుటుంబాలను కలిసి దోమల నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించారన్నారు. దోమలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు పంపిణీ చేసి వారి ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, కాకినాడ నగరపాలక సంస్థ ప్రచురించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ స్టిక్కర్లు, కరపత్రాలు, బుక్లెట్లు, పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు అందించిన దోమకాటు వల్ల కలిగే రోగాల నివారణకు హోమియో మందును ఆయన పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు దోమలపై దండయాత్ర నినాదాలతో నగరవీధుల నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని మంత్రి దేవినేని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డేగల శేషువెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ డేగల చంద్రశేఖర్ ఉచితంగా పంపిణీ చేయనున్న హోమియోపతి మందు పంపిణీని ప్రారంభించి మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ అరుణ్‌కుమార్, నగర కమిషనర్ ఆలీమ్‌బాషా, అదనపు కమిషనర్ గోవిందస్వామి, ఉప కమిషనర్ సన్యాసిరావు, ఈఈ విజయకుమార్, ఆర్డీవో బీఆర్ అంబేద్కర్, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పండుగలా..
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో గురువారం పండుగలా జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. పలు ప్రాంతాల్లో పార్టీ పాతాకావిష్కరణలు జరిగాయి. ర్యాలీలు, పేదలకు అన్నదానం, వృద్ధులకు, రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను పార్టీ శ్రేణులు నిర్వహించాయి. కర్నూలు నగరంలో కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే గణేశ్‌నగర్‌లోని అమ్మ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు.ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రాజారత్నం, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బుట్టారంగయ్యల ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పలు పంపిణీ చేశారు. నంద్యాలలో కౌన్సిలర్లు శివశంకర్, పాణ్యం విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా విష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదోనిలో పట్టణ అధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి, ఛైర్పర్సన్ సరోజమ్మ, ఆమె భర్త రాముడు, బీసీసెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. డోన్‌లో మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సోమేశ్యాదవ్ ఆధ్వర్యంలో కోట్లవారిపల్లె సర్కిల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆళ్లగడ్డలో పార్టీ నేత బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పతాకావిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆలూరులో జెడ్పీటీసీ సభ్యుడు రామ్భీమ్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు.ఆత్మకూరులో శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బనగానపల్లెలో మహిళా ప్రధాన కార్యదర్శి కాటసాని జ్యోతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కాటసాని రామిరెడ్డి నివాసం వద్ద పతాకావిష్కరణ చేశారు. సంజామలలో ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ చిన్నబాబు ఆధ్వర్యంలో, అవుకు మండలం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.మంత్రాలయంలో సర్పంచ్ చల్లబండ భీమయ్య ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. పార్టీ పతాకావిష్కరణ చేశారు.పత్తికొండలో కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్‌ఛైర్మన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. తుగ్గలిలో నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీశైలం, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. -
బడి పిల్లలు..పని మనుషులు..
బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం చేపట్టింది. పిల్లలు పనిలో కాదు.. పాఠశాలల్లో ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపన్యసించారు. ర్యాలీలు నిర్వహించారు. మరి బడిలో ఏం జరుగుతోంది.. ఉపాధ్యాయులు పిల్లలను పని మనుషులుగా మార్చేస్తున్నారు. అడపాదడపా అయితే సర్దుకుపోవచ్చు.. ఏకంగా టైం టేబుల్ వేసి కసువు కొట్టిస్తున్నారు. ప్యాపిలి మండల పరిధిలోని చిన్నపూదెళ్ల ఉన్నత పాఠశాలలో ఈ తంతు నిత్యకృత్యం. తరగతి గది గోడలకు సాధారణంగా ఏ సమయంలో ఏ సబ్జెక్టు బోధిస్తారో నిర్ణయించిన టైం టేబుల్ అతికిస్తారు. ఇక్కడ మాత్రం ఎప్పుడెప్పుడు ఎవరు కసువు కొట్టాలో తెలిపే చార్టు అతికించడం చూసి తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
కౌంటింగ్ సందర్భంగా నగరంలో ఆంక్షలు
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ అమల్లో ఉంటాయన్నారు. ఇక 17వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ వైన్ షాపులు, క్లబ్బులు మూసివేత కొనసాగుతుందన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం ఎల్బీ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించినట్లు అనురాగ్ శర్మ తెలిపారు. సభలు, విజయోత్సవాలు నిషేధమని, కౌంటింగ్ కేంద్రాల నుండి ఎలాంటి ర్యాలీలకు అనుమతిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నామినేషన్ల జాతర
జిల్లాలో నామినేషన్ల జాతర నడుస్తోంది. ముహూర్తం కలిసి రావడంతో మంచిరోజని భావించి భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు బుధవారం ఒక్కరోజే 1400 నామినేషన్లు దాఖలయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 422 మంది నామినేషన్ వేశారు. రాష్ట్రంలోనే ఇది రికార్డుగా నిలవనుంది. కరీంనగరంలో 276 మంది నామినేషన్ సమర్పించారు. - సాక్షి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: ఎన్నికల వేడి రాజుకుంది. ఓ పక్క మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం... మరో పక్క ప్రచారంతో జిల్లాలోని కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కోలాహలం మొదలైంది. బుధవారం మంచి ముహూర్తం ఉండడం.. గురువారం కార్పొరేషన్ల పరిధిలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు బుధవారమే నామినేషన్లు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా 1400 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు పోటాపోటీ ర్యాలీలు తీసి కోలాహలం మధ్య నామినేషన్లు వేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 276 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి.. మున్సిపల్ మాజీ చైర్మన్ వావిలాల హన్మంతరెడ్డి 34 వ డివిజన్ నుంచి, పీసీసీ కార్యదర్శి సునీల్‌రావు 31వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ 36వ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి 44వ, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్ 32వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. వైఎస్సార్సీపీ నుంచి పల్లె లలిత 41వ డివిజన్, కాసారపు కిరణ్‌కుమార్ 11వ, ముహమ్మద్ సలీం 39వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఎంఐఎం పార్టీ తర పున మాజీ డెప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ 7వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా రికార్డుస్థాయిలో 422 నామినేషన్లు దాఖలయ్యా యి. మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం (టీఆర్ఎస్) 30వ డివిజన్ నుంచి, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం (కాంగ్రెస్) 12వ, అదే డివిజన్ నుంచి డాక్టర్ అనిల్‌కుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. 11వ డివిజన్ నుంచి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున 7వ వార్డు నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ యామ రాజయ్య , వన్నెల గంగారం 16వ, బీజేపీ నుంచి బత్తుల లక్ష్మణ్ 12వ వార్డు నుంచి నామినేషన్లు వేశారు. సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుడ్ల మంజుల (కాంగ్రెస్) 31వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. వేములవాడ నగర పంచాయతీ పరిధిలోని పెరుక శ్రీలతరవి వైఎస్సార్సీపీ తరఫున 19వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి సుద్దాల చంద్రయ్య (టీఆర్ఎస్) 16వ వార్డు, 14వ వార్డు నుంచి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి తిరుమల, 11వ వార్డు నుంచి బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి నామినేషన్ వేశారు. పెద్దపల్లి నగర పంచాయతీలోని 16వ వార్డు నుంచి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు రాజు, 14వ వార్డు నుంచి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, చైర్మన్ అభ్యర్ధి పుట్ట మొండయ్య నామినేషన్ వేశారు.