కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో గురువారం పండుగలా జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. పలు ప్రాంతాల్లో పార్టీ పాతాకావిష్కరణలు జరిగాయి. ర్యాలీలు, పేదలకు అన్నదానం, వృద్ధులకు, రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను పార్టీ శ్రేణులు నిర్వహించాయి.
కర్నూలు నగరంలో కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే గణేశ్‌నగర్‌లోని అమ్మ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు.ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి, పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రాజారత్నం, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బుట్టారంగయ్యల ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పలు పంపిణీ చేశారు.
నంద్యాలలో కౌన్సిలర్లు శివశంకర్, పాణ్యం విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా విష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదోనిలో పట్టణ అధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి, ఛైర్‌పర్సన్ సరోజమ్మ, ఆమె భర్త రాముడు, బీసీసెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు.
డోన్‌లో మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సోమేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో కోట్లవారిపల్లె సర్కిల్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆళ్లగడ్డలో పార్టీ నేత బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ పతాకావిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఆలూరులో జెడ్పీటీసీ సభ్యుడు రామ్‌భీమ్‌నాయుడు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు.ఆత్మకూరులో శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బనగానపల్లెలో మహిళా ప్రధాన కార్యదర్శి కాటసాని జ్యోతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కాటసాని రామిరెడ్డి నివాసం వద్ద పతాకావిష్కరణ చేశారు.
సంజామలలో ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ చిన్నబాబు ఆధ్వర్యంలో, అవుకు మండలం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.మంత్రాలయంలో సర్పంచ్ చల్లబండ భీమయ్య ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. పార్టీ పతాకావిష్కరణ చేశారు.పత్తికొండలో కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్‌ఛైర్మన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. తుగ్గలిలో నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీశైలం, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
పండుగలా..
Published Fri, Mar 13 2015 2:53 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement