బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం చేపట్టింది. పిల్లలు పనిలో కాదు.. పాఠశాలల్లో ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపన్యసించారు.
బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం చేపట్టింది. పిల్లలు పనిలో కాదు.. పాఠశాలల్లో ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపన్యసించారు. ర్యాలీలు నిర్వహించారు. మరి బడిలో ఏం జరుగుతోంది.. ఉపాధ్యాయులు పిల్లలను పని మనుషులుగా మార్చేస్తున్నారు.
అడపాదడపా అయితే సర్దుకుపోవచ్చు.. ఏకంగా టైం టేబుల్ వేసి కసువు కొట్టిస్తున్నారు. ప్యాపిలి మండల పరిధిలోని చిన్నపూదెళ్ల ఉన్నత పాఠశాలలో ఈ తంతు నిత్యకృత్యం. తరగతి గది గోడలకు సాధారణంగా ఏ సమయంలో ఏ సబ్జెక్టు బోధిస్తారో నిర్ణయించిన టైం టేబుల్ అతికిస్తారు. ఇక్కడ మాత్రం ఎప్పుడెప్పుడు ఎవరు కసువు కొట్టాలో తెలిపే చార్టు అతికించడం చూసి తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు.