సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ 648 పాయింట్లు ఎగిసి 59790 వద్ద, నిఫ్టీ195 పాయింట్లు లాభంతో 17817 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, హిందాల్కో, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ భారీగా లాభపడుతుండగా, గ్రాసిం మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. కాగా వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు సోమవారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సంకేతాలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మంగళవారం ర్యాలీని కంటిన్యూ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment