సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్ష లు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. జగన్ ఆరోగ్యం బాగుం డాలంటూ గూడూరులో బత్తిన విజయ్‌కుమార్ నేతృత్వంలో కార్యకర్తలు చిల్లకూరు దోషాహీద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. జగన్‌కు మద్దతుగా నాల్గో రోజు కలువాయిలో దీక్ష కొనసాగిస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా పార్టీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు.
నగరంలో జగన్ దీక్షలకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ రూరల్ నియోజక వర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో గాంధీ బొమ్మ సెంటర్‌లో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. అనంతరం దీపాలతో ప్రదర్శన చేశారు. వెంకటగిరి నియోజక వర్గంలోని కలువాయిలో వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష నాల్గోరోజుకు చేరింది. ఈ నిరాహారదీక్షకు మద్దతుగా పార్టీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లు పాల్గొని సంఘీభావం తెలిపారు. సైదాపురం బస్టాండ్ సెంటర్‌లో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు మహేందర్‌రెడ్డి, జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
మర్లపూడి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు మస్తాన్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఉదయగిరి నియోజక వర్గంలోని జలదంకి బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీనేతలు జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్‌లో నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా క్రిస్టియన్ మైనార్టీలు నిరాహారదీక్ష చేశారు. అడ్డగోలు రాష్ట్ర విభజనకు నిరసగా వైఎస్ జగన్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రభుత్వం, సోనియాగాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుందని నెల్లూరు రూరల్ నియోజక వర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.