సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో హోరెత్తుతోంది. సమైక్యమే శ్వాసగా సింహపురి వాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రోజురోజుకూ ఉద్యమతీవ్రతను పెంచుతున్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన గళం వినిపించిన ఉద్యోగులు శనివారం హైదరాబాద్‌లో జరగనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తరలివెళ్లారు. ఉద్యమానికి మద్దతుగా జర్నలిస్టులు ర్యాలీలు నిర్వహించారు.
మొత్తం మీద జిల్లాలో 38వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది.
నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు లెక్చరర్లు రిలేదీక్షలు చేశారు. వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ కూడలిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాన బస్టాండ్‌లో నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు.
ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 1,500 మంది ఉద్యోగులు 25 బస్సుల్లో హైదరాబాద్‌కు వెళ్లారు. కేంద్ర మంత్రుల ఫొటో మాస్క్‌లు ధరించిన వారికి తెలుగు మహిళ ఆధ్వర్యంలో వీఆర్‌సీ సెంటర్‌లో సీమంతం చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో గంగవరం వా సులు నిరాహారదీక్ష చేశారు. గూడూరులోని పాలిటెక్నిక్, సిరామిక్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకుడు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. టవర్‌క్లాక్ కూడలిలో పండరి భజనతో నిరసన తెలిపారు. జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమైక్య గర్జన జరిగింది.
ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలేదీక్ష జరి గింది. మొదట ఉపాధ్యాయులు జెడ్పీ పాఠశాల మీదుగా సత్రం సెంటర్ వ రకు ర్యాలీ నిర్వహించారు. నాయిబ్రాహ్మణులు పట్టణంలో ర్యాలీ చేశారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభి షేకం చేసిన అనంతరం ర్యాలీగా ము న్సిపల్ బస్టాండ్‌కు చేరుకున్నారు. అం బేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సోమశిల రోడ్డు సెంటర్‌లో మేళతాళాలతో నిరసన తెలిపారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో తుఫాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంతో పాటు పోస్టర్లను దహనంచేశారు. పొదలకూరులో ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. మనుబోలులోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఎంపీడీఓ, తహశీల్దార్, ఉద్యోగు లు రిలే దీక్షలో కూర్చున్నారు.
కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్‌లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గాంధీబొ మ్మ సెంటర్‌లో రిలేదీక్ష చేశారు. 14వ తేదీ నుంచి ఉద్యమంలో పాల్గొంటామని ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, టీ డీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర ప్రకటించారు.
ఉదయగిరిలో పట్టణ వ్యాపారుల సం ఘం ఆధ్వర్యంలో బంద్, ర్యాలీ, రాస్తారోకో, వంటావార్పు జరిగింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వింజమూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో రిలే దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. సీతారామపురంలో ఉద్యోగ జే ఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్ కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహ నం చేశారు. ముస్లింలు ర్యాలీ నిర్వహిం చారు. కలిగిరిలో రోడ్డుపై విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్తులు ఆటాపాటల తో నిరసన తెలిపారు. కొండాపురం త హశీల్దార్ కార్యాలయం ఎదుట రెవె న్యూ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్త లు రిలేదీక్షలు చేశారు.
వరికుంటపాడు బస్టాండ్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. సూళ్ళూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో తుఫాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. బస్టాండు సెంటర్‌లో జేఏసీ ఆ ధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నా యి. వ్యవసాయాధికారుల ఆధ్వర్యం లో రైతులు ట్రాక్టర్లతో తడ తహశీల్దార్ కార్యాలయం నుంచి బజారు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చే శారు. మాంబట్టు వాసులు రిలేదీక్షలు చేపట్టారు. నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నా యి. వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు నీరజమ్మ బస్టాండు సెంటర్‌లో రిలే దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
సమైక్యమే శ్వాసగా
Published Sat, Sep 7 2013 5:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement