sama kyandhra
-
ఎటు వెళ్లాలో..?
ఎటు వెళ్లాలో..? సాక్షి ప్రతినిధి, కర్నూలు ఢిల్లీ పరిణామాలు అధికార కాంగ్రెస్‌కు.. ప్రతిపక్ష టీడీపీకి కంటిమీద కునుకులేకుండా చే స్తున్నాయి. రాష్ట్రవిభజన ప్రక్రియ చివరి అంకానికి చేరడంతో ఈ రెండు పార్టీ నేతల పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేస్తున్నారనే ప్రచారం వస్తోంది. అలాగే కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం పార్టీలోకి వెళ్లాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని భావించిన కొందరు అధికారపార్టీ నేతలకు అక్కడ తలుపులు మూసివేశారు. దీంతో చేసేది లేక ఆ కొందరికి కిరణ్‌పార్టీ ఫ్లాట్‌ఫాం ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. జయాపజయాల మాటెలా ఉన్నా.. తామూ ఓ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామనే చెప్పుకునేందుకు ఉపయోగపడనుందనే భావంతో ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. మునిగే వారెవరు?: మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులు కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే పార్టీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. వీరంతా హైదరాబాద్‌లో సీఎం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఇందులో మంత్రి టీజీ వెంకటేష్ రెండు వైపులా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓపక్క టీడీపీతో మంతనాలు నెరుపుతూనే.. కిరణ్ వర్గంతో సన్నిహితంగా ఉంటున్నారు. అందులో భాగంగానే సోమవారం ఢిల్లీలో ఏపీఎన్జీఓలు చేపట్టిన ధర్నాలో మంత్రి టీజీ హాజరై తానూ సమైక్యవాదినేనని రుజువుచేసే ప్రయత్నం చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే టీడీపీ నుంచి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తానేనని మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కిరణ్ పార్టీలోనే మంత్రి టీజీ చేరుతారనే ప్రచారం కూడా ఉంది. ఇక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విషయానికి వస్తే కిరణ్పార్టీయా? టీడీపీనా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. సమైక్య ముసుగు... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే పార్టీ సమైక్యాంధ్ర పార్టీగా ఇప్పటికే ప్రచారంలో ఉంది. అందులో భాగంగానే కొద్దిరోజుల క్రితమే జిల్లాలో సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రచారానికి తెరతీసిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర ముసుగులోనే కిరణ్ పార్టీ జనంలోకి రావటానికి సిద్ధమవుతోంది. సమైక్యాంధ్ర కోసం 66 రోజుల పాటు జనం గొంతు చించుకుని నినదించినా ఈ పార్టీ నేతలు ఒక్కరూ మద్దతు తెలిపిన పాపాన పోలేదు. ఆందోళనకారులపై అక్రమ కేసులుపెట్టి అరెస్టు చేయించిన విషయాన్ని సమైక్యవాదులు గుర్తుచేస్తున్నారు. ఉద్యమంలో భాగంగా అరెస్టైన వారిని విడిపించే కృషి కూడా చేయలేదని చెబుతున్నారు. అవేమీ చేయని వారికి ఇప్పుడు సమైక్యాంధ్ర గుర్తొంచ్చిందా? అని విమర్శిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ పార్టీ నిర్వరామ కృషి చేస్తుందో తమకు తెలుసని జనం స్పష్టం చేస్తున్నారు. -
ఢిల్లీకి తరలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
ఢిల్లీకి తరలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు గుత్తి, : అనంతపురం జిల్లా గుత్తి రైల్వేస్టేషన్ శనివారం జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జిల్లా నుంచి తరలివచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో 17న చేపట్టనున్న సమైక్య ధర్నాలో పాల్గొనడానికి తాము వెళ్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ పేర్కొన్నారు. గుత్తి నుంచి మూడు బోగీల్లో పార్టీ శ్రేణులు బయలుదేరినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీకి వెళ్లినవారిలో నాయకులు దిలీప్‌కుమార్‌రెడ్డి, పసుల నాగరాజు, వెన్న పూసపల్లి రామచంద్రారెడ్డి, తిప్పేపల్లి ఓబులరెడ్డి, గుత్తి మండల నాయకులు సీవీ రంగారెడ్డి, గురుప్రసాద్ యాదవ్, మామిళ్లచెరువు నాగిరెడ్డి, గాజులపల్లి మనుమంతరెడ్డి, ఎర్రగుడి శంకరరెడ్డి తదితరులు ఉన్నారు. ‘సమైక్య’ కింగ్ జగనే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పునరుద్ఘాటించారు. శనివారం ఆయన గుత్తి రైల్వేస్టేషన్లో సమైక్య ధర్నా (చలో ఢిల్లీ) రైలు ఎక్కడానికి ముందు పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మతో కలసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తప్పా మిగిలిన రాజకీయ పార్టీలు పరోక్షంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి మాత్రం మొదట్నుంచీ సమైక్యాంధ్ర తప్పా మరో మాట అనడం లేదన్నారు. జగన్‌ను స్ఫూర్తిగా తీసుకొని తామంతా సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 17న ఢిల్లీలో చేపడుతున్న ‘సమైక్య ధర్నా’ను కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిర్వహిస్తామన్నారు. -
5 సార్లు వందేమాతరం గీతాలాపన
5 సార్లు వందేమాతరం గీతాలాపన పెదపాడు, : సమైక్యాంధ్ర కోసం ప్రజలు, నాయకులు, ఉద్యోగులు విశేషంగా పోరాడుతున్నా కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు అన్నారు. మండలంలోని జేఎంజే ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం వందేమాతర గీతాన్ని 5సార్లు ఆలపించారు. సుమారు మూడు వేల మంది విద్యార్థులు గీతాన్ని ఆలపించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర కోసం
బాపట్ల, నియోజకవర్గ సమన్వయకర్త కోన రౌ్ఛుుపతి ఆధ్వర్యంలోచేపట్టిన బంద్, ప్రదర్శన, రాస్తారోకోకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, వర్తక, వాణిజ్య సంస్థలు పూర్తిగాసహకరించాయి. కోన మాట్లాడుతూ రాష్ట్రాన్నిముక్కలు చేయడం వలన కేంద్రం నుంచి వచ్చే నిధులవాటాలు భారీగా తగ్గిపోతాయని చెప్ఛు. చిన్నరా్టల్ర జాబితలో చేరితఆంధ్రప్రదేశైఉ తన వాటాకౌఐోని ఆంోళన వ్యక్తంేశార. రా్టన్రి్నాపాడుకునేంుకు వైఎ్ జగనైఉమోహనైఉరెడ్డిత పాటుఆంోళన చేపట్టిన ఎంపలందరికీ సంౌు్ఛభావంతలిపార. స్వచ్ఛంంా వరక, వాణిజ్య సంస్థల మూసివేత సమైక్యాంధ్ర కోసంచేపట్టిన బం్ను విజయవంతంచేయాలని పార్టీ పిలుపు మేరు పట్టణంోస్వచ్ఛంంా వ్యాపారసంస్థలు మూసివేశార. కోనచాంర్లోని పార్టీ ఆీౌ్ఛసు నుం రంబజార, గడియారస్తంం సూరలంకరోడ్డు మీదుగా జాతీయరహదారిపై పాతబస్టాంు, మున్సిపలైఉ కార్యాలయంచీలురోడ్డు సెంర్వరు భారీ ప్రదరన సాగిం.అనంతరంజాతీయ రహదారిపై తవ్వకాలు వద్ద రాస్తారోకో చేపట్టార. పోసాీౌ్ట్ఛసు, ఎ్బీఐ, మున్సిపలైఉహైస్కూలు, ప్రైేటు స్కూలు పూర్తిగా బం్కు సహకరింార. కారక్రమంో పార్టీ పట్టణ,మంల కన్వీనర్ల దగ్గుమల్లి ధర్మారావు, షేక్ హుస్సేనైఉ, మున్సిపలైఉమాజీ చైరనైఉ నరాలశెట్టి ప్రకాశరరావు, ఎస్సీసెలైఉపట్టణ కన్వీనర్ఇనగలూరి మాల్యాద్రి, యూతఉమంల కన్వీనర్ఏడుకొంలరె్డి, మైనార్టీ సెలైఉ పట్టణకన్వీనర్సయ్యద్ పీర్ బీసీసెలైఉ పట్టణ కన్వీనర్శారల ముర, పట్టణ మహిళా కన్వీనర్షేక్ దీలైఉషాద్బేగం కొంారె్డి అనిలైఉకుమార్పాలొన్నార. బార్అసోసియేషనైఉ నిరసన బాపట్లటౌనైఉ :పారమెంైఉ సాక్షగా ఢిల్లీలో సీమాంధ్రఎంపలపై జరిగిన దాడిని తలుగువారందరిపై జరిగినదాడిగా భావిం ప్రతిఒక్కర ఉద్యమంబాట పట్టాలనిబాపట్ల బార్అసోసియేషనైఉ వై్ప్రెసిడెంైఉ ప్రేవైఉుచం్ పిలుపునిచ్చార. సీమాంధ్ర ఎంపల పై జరిగినదాడికి నిరసనగా శుక్రవారంకోర్ట గేటుకు తళాలువేసి నిరసన తలిపార. ఓట్లు, సీట్లు కోసంసోనియాగాందీ ఆడుతున్న డ్రామాలో భాగంగానే దాడులుచేరంనట్లు తలిపార. రాష్ట్డ్రంవిడిపోత సీమాంధ్రఏడారిగా మారతుంని సీమాంధ్ర ప్రాంత ప్రజలుముక్తకంఠంత చెి’ఛీ1నకుంా రా్టన్న్రి చీల్చలనుకోవడంబాధాకరమన్నార. విభజన నిరయాన్నివెనక్కి తీసుకోకపోత మున్ముంు ఉద్యమాలనుఉధృతంచేస్తామని హెచ్చరింార. కారక్రమంోబార్అసోసియేషనైఉ సభ్యులు డి.భాస్కరరావు, లీలాకృష్ణ, లంు సాంయ్య, చలపతిావు, బంిరామ్మూర్తి, శ్యామల తదితరలున్నార. -
ఎంపీలపై దాడి అమానుషం
ఎంపీలపై దాడి అమానుషం సమైక్యాంధ్రను కోరుతూ లోక్‌సభలో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎంపీలపై కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడి అమానుషమని స్థానిక జెడ్పీ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయుడు పెద్దింటి సారంగపాణి అన్నారు. ఎంపీలపై దాడిని నిరసిస్తూ గురువారం సాయంత్రం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ైెహ స్కూలు నుంచి కట్టెల అడితీల సెంటర్‌మీదుగా ఐలాండ్ సెంటర్ చేరుకుని విద్యార్థులతో మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా జరిగిన దాడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఐలాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు సమైక్యాంధ్ర ఆకాంక్షను వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అప్పిరెడ్డి, నాగేశ్వరరావు, మల్లారెడ్డి, అబ్దుల్ రజాక్, ఖాశింపీరా, సాంబశివరావు, శంకరనారాయణ, ప్రసాద నారాయణ పాల్గొన్నారు. విద్యార్థి జేఏసీ ఖండన లోక్‌సభలో గురువారం సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడిని విద్యార్థి జేఏసీ నాయకులు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా విభజన నిర్ణయం తీసుకోవడమే కాకుండా అడిగినవారిపై దాడులకు పాల్పడ డం దారుణమని జేఏసీ నాయకులు ఎండీ అలీం పేర్కొన్నారు. టీ బిల్లు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేవరకు ఆందోళనను ఆపేది లేదన్నారు. ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో జేఏసీ నాయకులు మణిదీప్, కిరణ్, ఫిరోజ్, కరీమ్, నాగుల్, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
బహుముఖ పోరు
ఆవిర్భవించిన అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా జీవనంతో మరింతగా మమేకం కావడానికి విశేషంగా కృషి చేస్తోంది. వ్యవస్థాగతంగా బలపడటం.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ.. ప్రజా సమస్యలపై పోరాటం.. వివిధ అంశాలపై వారితో చైతన్యం ప్రోది చేయడం వంటి బహుముఖ లక్ష్యాలతో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతూ దూసుకుపోతోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ ముందుండి పోరాడుతున్న పార్టీ అదే సమయంలో గడప గడపకు పార్టీ, బూత్ క మిటీల నియామకం వంటి పార్టీ కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళుతోంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమం విషయంలో యువతను చైతన్యపరిచేందుకు కృషి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్మించడంలో ముందున్న వైఎస్ఆర్సీపీ అదే స్ఫూర్తి కొనసాగిస్తోంది. సమైక్య శంఖారావం పూరించిన నాటి నుంచి అలుపెరుగని పోరాటం నిర్వహిస్తోంది. జిల్లాలోని పది నియోకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతల నేతృత్వంలో నిత్యం పలు ప్రాంతాల్లో నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ పిలుపు మేరకు ఈ నెల 10 నుంచి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. మొదటి రోజు యువజన విభాగం ఆధ్వర్యంలో, ఆ తరువాత మహిళలు, అనంతరం రైతులు.. ఇలా ప్రత్యేక కార్యక్రమాలతో అన్ని విభాగాల వారిని పోరాటంలో భాగస్వాములను చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభల నిర్వహణకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు. కొన్ని చోట్ల ఎవరికి వారే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమైక్య ఉద్యమ ఆవస్యకతను చెబుతున్నారు. గడపగడపకూ.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. నియోజకవర్గ సమన్వయకర్తలు ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమా లు, పార్టీ ప్రణాళిక, విధానాల గురించి పూర్తిస్థాయి లో వివరిస్తున్నారు. పార్టీ రూపొందించిన ప్రత్యేక కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలకు జనం నుంచి మంచి స్పందన వస్తున్నట్లు సమన్వయకర్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం దాదాపు 50 శాతం పూర్తయిందని పార్టీ జిల్లా కన్వీనర్ కృష్ణదాస్ తెలిపారు. ఓటర్ల నమోదుపై అవగాహన ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమానికి పార్టీపరంగా సహకరిస్తున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను, ఓటరుగా నమోదు కావలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఎక్కువ మంది ఓటర్లుగా నమోదయ్యేందుకు పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సదస్సుల వద్దకు వ చ్చిన వారికి దరఖాస్తు ఫారాలు కూడా ఇచ్చి, వివరాలు నమోదు చేయించి, అధికారులకు అందజేస్తున్నారు. ఓటు ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడే వారిని ప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశముంటుందని వివరిస్తూ విద్యార్థులు, యువతకు అకర్షిస్తున్నారు. బూత్ కమిటీల ఏర్పాట్లలో నిమగ్నం మరోవైపు అన్ని నియోకవర్గాల్లో బూత్‌స్థాయి పార్టీ కమిటీల ఏర్పాటులో నాయకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 70 శాతం పైగా బూత్ కమిటీల నియామకాన్ని పూర్తిచేసినట్లు సమన్వయకర్తలు తెలిపారు. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి ముఖ్య నాయకులతో మాట్లాడి వారి ద్వారా కమిటీల ఏర్పా టు ప్రక్రియ చేపట్టారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, రాజాం, పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజవర్గాల్లో 70 శాతానికిపైగా ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. 4 రోజుల్లో మొత్తం పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
రోడ్ల దిగ్బంధం విజయవంతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమం విజయవంతమైంది. అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు సమైక్య ఉద్యమానికి తమ సహకారాన్ని అందించారు. నరసన్నపేట వద్ద 16వ నంబరు జాతీయ రహదారిని వైఎస్సార్సీపీ నాయకులు దిగ్బంధించారు. దీంతో ఇరు వైపులా ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, వైఎస్ఆర్సీపీ నాయకుడు కరిమి రాజేశ్వరరావులు పాల్గొన్నారు. టెక్కలిలో జాతీయ రహదారిని నాయకులు దిగ్బంధించారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆద్వర్యంలో జగతిమెట్ట వద్ద వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. ఇచ్ఛాపురంలో పార్టీ నాయకులు జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. రహదారిని దిగ్బంధించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం.వీ కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ అభిమానులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లొద్దబుడ్డి జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బి.హేమమాలినిరెడ్డి, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ, కంచిలి, సోంపేట మండలాలకు చెందిన కన్వీనర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారిపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధించారు. కార్యక్రమంలో నందమూరి లక్ష్మీపార్వతి, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణ సమైక్యాంధ్ర జెఏసీ సభ్యులు పట్టణ వీధుల్లో ర్యాలీ చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పలాస -కొసంగిపురం హైవేపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వజ్జ బాబూరావు నాయకత్వంలో రోడ్డు దిగ్భందం, వంటావార్పు కార్యక్రమం జరిగింది. సాయంత్రం మరో సమన్వయకర్త కణితి విశ్వనాథం ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కలమట వెంకటరమణ నాయకత్వంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాజాంలో నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజె బాబూ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాం- విశాఖ రోడ్డులో బైఠాయించి ధర్నా చేశారు. సుమారు గంట పాటు వాహననాల రాకపోకలను అడ్డుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు శ్రీకాకుళం పట్టణ సమీపంలోని సింహద్వారం వద్ద జాతీయ రహదారి దిగ్బంధించారు. రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విద్యార్థులు, యుకులు మద్దతుగా నిలిచారు. అనంతరం యూపీఏ చైరన్పర్సన్ సోనియాగాంధీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర సాధనకోసం తమ పార్టీ సంపూర్ణంగా కట్టు బడి ఉందని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్రమంత్రి తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వరదు కల్యాణి, ఎచ్చెర్ల వెంకట సూర్యనారాయణ, నేతలు హనుమంతు కిరణ్‌కుమార్, దుప్పల రవీంధ్రబాబు, అందవరపు సూర్యనారాయణ పాల్గొన్నారు.ఎచ్చెర్ల నియోజక వర్గానికి సంబంధించి రణస్థలంలో హైవేని దిగ్బంధించారు. ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కి రణ్‌కుమార్, నాయకులు పిన్నింటి సాయికుమార్, కరిమజ్జి భాస్కరరావు, గొర్లె అప్పల నర్సునాయుడు పాల్గొన్నారు. -
ఎంపీ హర్షకు సమైక్య సెగ
సమైక్యాంధ్ర పరిరక్షణ అంశంపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ వైఖరిని ప్రజలు నిరసించారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరిగిన రచ్చబండలో పాల్గొన్న ఆయనను వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన ఘెరావ్ చేశారు. ‘ఈ రోజు రాష్ట్ర సమైక్యత కోసం నేను చేసిన ప్రకటన గురించి తెలుసుకుంటే మీరు నన్ను ఇలా ఘెరావ్ చెయ్యరు’ అని చెప్పినా సమైక్యవాదులు పట్టించుకోలేదు. మరోపక్క అమలాపురంలో జరిగిన రచ్చబండలో కూడా సమైక్యవాదులు నిరసన తెలిపారు. గొల్లవిల్లి రచ్చబండ అనుభవంతో హర్షకుమార్ అమలాపురం రాకుండా ముఖం చాటేశారు. -
కృపారాణి ఇల్లు ముట్టడికి యత్నం
టెక్కలి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడానికి నిరసనగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం టెక్కలిలోని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో 12 మంది టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు, కె.రామ్మోహన్‌నాయుడుల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. స్థానిక ఆర్టీసి డిపో ఎదురుగా బైఠాయించి బస్సులను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా మంటలు వేసి నిరసన తెలిపారు. కేంద్రమంత్రి ఫ్లెక్సీలను మంటల్లో వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పట్టణంలో ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుతో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రులు దిగ్విజయ్‌సింగ్, చిరంజీవి, పనబాక లక్ష్మీ, కృపారాణి, బొత్స సత్యనారాయణ, పల్లంరాజు, సోనియాగాంధీ తదితర దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్.ఎల్.నాయుడు, హనుమంతు రామకృష్ణ, చాపరా గణపతి, పి.అజయ్‌కుమార్, శేషు, కాళీ, రాము, బి.తవిటయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజనపై ఉద్యమం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:ఆంధ్రప్రదేశ్ విభజనపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో సంఘ సహాధ్యక్షుడు చౌదరి పురుషొత్తమనాయుడు హెచ్చరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద గురువారం దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీమాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్టు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం గతంలో 66 రోజులు సమ్మె చేసి న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. డిసెంబర్ 9న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు తెలుగుజాతి విద్రోహదినంగా భావించి జిల్లాలోని ఉద్యోగులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. కేంద్రప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభింపచేస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ కేవలం ఓటుబ్యాంకు రాజకీయా ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలకు అనుగుణం గా నడుచుకోవాలన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తూ టీ నోట్ పెట్టిన వెంటనే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామన్నారు. విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులేనన్నారు. కార్యక్రమంలోవేదిక కో-కన్వీనర్ కొంక్యాన వేణు, ప్రతినిధులు కిలారి నారాయణరావు, ఎస్.వి.ఎస్.ప్రకాష్ ప్రసంగించారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధు లు దుప్పల వెంకటరావు, కె. దిలీప్, పూజారి జానకిరాం, పి.జయరాం, ఆర్.వేణుగోపాలరావు, వై.ఉమామహేశ్వరరావు, బమ్మిడి నర్సింగరావు, శోభారామకృష్ణ, ఎం.ఆర్.కె.దాస్, అధిక సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ పిలుపు శ్రీకాకుళం : రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల బంద్‌కు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. నేటినుంచి విద్యుత్ జేఏసీ నిరసన రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం నుంచి ఆదివారం వరకూ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతినిధులు నిర్ణయించారు. అలాగే ఏడో తేదీన జేఏసీ ప్రతినిధులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లో 13 జిల్లాల నాయకులు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చరిత్రలో చీకటి రోజు రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం ఘోరం. ఈ రోజు చరిత్రలో చీకటి రోజు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు చివరివరకు పోరాడాలి. - ధర్మాన కృష్ణదాస్, నరసన్నపేట ఎమ్మెల్యే వ్యక్తుల నిర్ణయం వల్లే ఈ దుస్థితి ఎస్ఆర్సీ వంటి వ్యవస్థలు చేయాల్సిన నిర్ణయాల ను వ్యక్తులు తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వ్యక్తులు తీసుకున్న నిర్ణయం వల్లే ఒకేరోజున సీడబ్ల్యూసీ, యూపీఏ మిత్రపక్షాలు, కోర్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఇలాంటివన్నీ జరుగుతాయని ముందుగానే ఊహిం చాం. అందుకనే తొలినుంచి ప్రజలను మభ్యపెట్టే ప్రకటన చేయలేదు. ఈ నిర్ణయానికి పర్యవసానాన్ని ఆ వ్యక్తులు తర్వాత అనుభవిస్తారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా సీమాంధ్ర వాసులు, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వారు అత్యంత దురదృష్టవంతులు. - ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజకీయ నాయకులదే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం దారుణం. దీనికి సీమాంధ్ర రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. ఆరుకోట్ల సీమాంధ్రుల మనోభావాలను కాదని, కేవలం మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోరిక మేరకు విభజన చేయడం సరికాదు. సీమాంధ్రలో సరైన నేత లేకపోవడం మన దురదృష్టం. రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకు రాకుండా ఎవరి ఎజెండాతో వారే వెళ్లినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. -హనుమంతు సాయిరాం, ఏపీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు -
విభజన టెన్షన్.. నేతల అటెన్షన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒకవైపు రాష్ట్ర విభజనపై ఎడతెగని ఉత్కంఠ.. మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికలు.. ఈ రెండూ రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఈ రెండు విషయాలే కీలకాంశాలుగా మారాయి. రాష్ర్ట విభజన నేపథ్యంలో తమ భవిష్యత్ ఎలా ఉంటుం దనే ఆందోళనతోనే ఆయా పార్టీల నేతలు రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం, గడపగడపకూ వైసీపీ, ఓటర్ల నమోదు, బూత్ కమిటీల నియామకం వంటి కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. ప్రజల సమస్యలపై ఆందోళనలు చేయడంలోనూ ఆ పార్టీ నేతలు ముందుంటున్నారు. అన్నివర్గాల ప్రజల్లోనూ ఆ పార్టీకి ఆదరణ ఉండడంతో నాయకుల కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయి. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతల్లో అయోమయం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులైతే తమ భవిష్యత్‌పై తీవ్రస్థాయిలో మదనపడుతున్నారు. విభజన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విలన్‌గా చూస్తుండటంతో వారు నియోజకవర్గాల్లో తిరగడానికే భయపడుతున్నారు. కొందరు నాయకులు మొండిగా తిరుగుతున్నా జనం తమను పట్టించుకోకపోవడం వారికి మింగుడు పడటం లేదు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక ముసుగులో జనం ముందుకు వెళ్లేందుకు వ్యూహ రచనల్లో తలమునకలై ఉన్నారు. కొందరు నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు ఎటూవెళ్లే పరిస్థితి లేక మౌనంగానే ఉండిపోతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి హీనాతిహీనంగా మారింది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు రంగంలో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ఏలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడే లేకుండాపోయాడు. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఏదోఒక పదవిని దక్కించుకునేందుకు రకరకాల రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. దెందులూరు, గోపాలపురం, పోలవరం, కొవ్వూరు తదితర నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని నడిపించే నాయకులు కరువయ్యారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలున్నా అచేతనంగా ఉండిపోయూరు. టీడీపీలో గందరగోళం తెలుగుదేశం పార్టీలోనూ గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన వ్యవహారంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మిగిలిపోయింది. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఉనికిని కాపాడుకునేందుకు ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. ఇదే సమయంలో కొన్నిచోట్ల ఆ పార్టీని నడిపించే నాథులు లేకుండాపోయారు. నరసాపురం, తాడేపల్లిగూడెం, గోపాలపురం, పోలవరం, ఆచంట తదితర నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే వారు కనిపించడంలేదు. మిగిలిన నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఏ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉంటారు, వారి పరిస్థితి ఏమిటనే విషయాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యే పోటీ జరుగుతుందనే వాదనలతోపాటు ఆయా పార్టీల తరఫున ఎవరు పోటీలో ఉండే అవకాశం ఉందనే విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా రాష్ట్ర విభజన, నియోజకవర్గంలో సీట్ల గురించే చర్చోపచర్చలు సాగుతున్నాయి. -
విమానాశ్రయం జనసాగరం
అన్నానగర్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సమైక్యాంధ్ర ఉద్యమ సారథి వైఎస్.జగన్మోహన్రెడ్డికి చెన్నైలో ఘనస్వాగతం లభించింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పట్టారు. బుధవారం ఉదయం 10.15 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయూనికి చేరుకున్నారు. వందలాది వాహనాల్లో వేలాది మంది అభిమానులు ఆయన్ను అనుసరించడం, అందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించడంతో విమానాశ్రయం నుంచి రోడ్డుపైకి చేరుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. పొరుగు రాష్ట్రానికి విచ్చేసిన నేతకు ఇంతటి ఘనస్వాగతమా? ఇన్ని వేల మంది అభిమానులా అంటూ స్థానికులు ఆశ్చర్యపోయారు.10.45గంటలకు కారులో బయలుదేరిన ఆయన ఆళ్వారుపేటలోని సోదరుని ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. సాధారణంగా ఎయిర్‌పోర్టు నుంచి ఆళ్వారుపేట చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. ఎయిర్‌పోర్టు నుంచి గిండీ, కత్తిపార జంక్షన్, నందనం, టీటీకే రోడ్డు వద్ద వేలాదిమంది జగన్మోహన్రెడ్డి అభిమానులు ఆయన కారు నుంచి బయటకు రావాలని పట్టుపట్టారు. అభిమానల కోరిక మేరకు ఆయన వాహనం దిగి వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు.స్వాగతించిన ప్రముఖులు: వైఎస్.అనిల్ రెడ్డి, వైఎస్.సునీల్‌రెడ్డి, ఎంపీ రాజమోహన్‌రెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలశౌరి, పి.అక్కిరెడ్డి, ఆనందకుమార్ రెడ్డి, జేకే రెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, అనిల్‌కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కేతిరెడ్డి జగదీశన్ రెడ్డి, పి.అక్కిరెడ్డి, మేరిగ మురళి, హరిరెడ్డి, నన్నపరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, బి.రాఘవేంద్రరెడ్డి, గౌతం రెడ్డి, తాడి వీరభద్రరావు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిరణ్‌మోహన్, మైసూరారెడ్డి, జి.ప్రతాప్‌రెడ్డి, ఎల్లగిరి గోపాల్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కెన్సెస్ నరసారెడ్డి, పల్లవా సుబ్బారెడ్డి, కొమ్ముల లక్ష్మయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్సీ రాఘవేంద్రరెడ్డి, సతీష్‌రెడ్డి, ప్రతాప్ సి రెడ్డి వంటి ప్రముఖులు ఎయిర్‌పోర్టుకు వచ్చి జగన్‌కు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. విజయేంద్రరాజు, ఆర్.ప్రతాపకుమార్‌రెడ్డి, మణివన్నన్, రాజేంద్రన్, కృష్ణారెడ్డి, బేతిపూడి శేష ప్రసాద్, ప్రవీణ్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, ముంగర మధుసూదనరావు, శశిధర రెడ్డి, హరిరెడ్డి, వి.నర్శింగరెడ్డి, డి.రాజారెడ్డి, జి.సురేష్‌రెడ్డి, కె.శేఖర్ రెడ్డి, కర్రల సుధాకర్, లక్ష్మీపతి రాజు, చక్రపాణి రెడ్డి, రమేష్‌రెడ్డి, యతిసాలరాజు, శేఖర్‌రాజు, గొల్లపల్లి ఇజ్రాయెల్, విజయకుమార్‌రెడ్డి, ఏకే రాజ్, జైపాల్ జగన్‌ను స్వాగతించడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్‌పోర్టులోని విజిటర్స్ లాంజ్ మొత్తం జగన్‌ను స్వాగతించడానికి విచ్చేసిన ప్రముఖులతో క్రిక్కరిసిపోయింది. ఆళ్వార్‌పేటలో బ్రహ్మరథం: నగరంలోని ఆళ్వార్‌పేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. జగన్ సోదరుడు వై.ఎస్.అనిల్‌రెడ్డి నివాసం వద్దకు ఉదయాన్నే జన సందోహం తరలి వచ్చింది. గంటల తరబడి ఓపిగ్గా జననేత కోసం ఎదురు చేశారు. తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జకీర్, శరవణన్ అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖ కాంట్రాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరుతుండడంతో ఆయన మద్దతుదారులు అట్టహాసంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రాంతంలోని రహదారుల్లో జగన్ అభిమానులు బారులు తీరారు. రోడ్లకిరువైపులా కార్లు, వ్యాన్లు నిండిపోయాయి. జగన్ కాన్వాయ్ ఆళ్వారుపేట ప్రాంతానికి చేరుకోగానే వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ టీ షర్టులు ధరించిన కార్యకర్తలు, పోలీ సులు, జగన్మోహన్రెడ్డికి కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సు గమం చేశారు. మహిళలు జగన్ కారుపై పూలవర్షం కురిపిం చారు. కోవూరు మ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు నియోజకవర్గం కో ఆర్డినేటర్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, గూడూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ పాశం సునీల్‌కుమార్, రాజమండ్రి వైఎస్సార్ సీపీ యువజన నేత పి.కిరణ్‌మోహన్‌రెడ్డి విచ్చేశారు. వేలాది మందితో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. -
రేపు జగన్ రాక
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసే ప్రయత్నాలు తమిళనాడులోని తెలుగువారిని సైతం ఎంతగానో బాధిస్తున్నాయి. పెద్ద ఎత్తున నిరసనోద్యమాలను సైతం నిర్వహించారు. విడిపోకుండా తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ దశలో తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజానికెత్తుకోవడం తమిళనాడులోని తెలుగువారందరినీ సంతోషంలో ముంచెత్తుతోంది. జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావానికి మద్దతు ప్రకటించేందుకు వారందరూ సిద్ధమవుతున్నారు సమైక్యాంధ్ర లక్ష్యసాధన కోసం దేశమంతా పర్యటిస్తూ జాతీయ నాయకుల మద్దతు కూడగడుతున్న ఆయన త్వరలో చెన్నైకి చేరుకుంటున్నట్లు సమాచారం అందడంతో వారి అనందానికి అవధులు లేకుండా పోయాయి. నేడో రేపో వస్తారని ప్రచారం జరగడంతోనే నగరమంతా ఫ్లెక్సీలు వెలిశాయి. విమానాశ్రయం నుంచి నగరంవైపు, మౌంట్‌రోడ్డు, టీనగర్, ఆశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏర్పాటు చే సిన వందలాది ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నారుు. విమానాశ్రయంలోనే జగన్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు ప్రారంభించారు. తమ అభిమాన నేతను కళ్లారా చూడాలన్న తాపత్రయంతో రాష్ట్రంలోని అభిమానులు వైఎస్ జగన్ రాకకోసం ఎదురుచూస్తున్నారు.నిర్వహించారు. విడిపోకుండా తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ దశలో తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజానికెత్తుకోవడం తమిళనాడులోని తెలుగువారందరినీ సంతోషంలో ముంచెత్తుతోంది. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఈ సమైక్య శంఖారావానికి మద్దతు ప్రకటించేందుకు తమిళనా డులోని తెలుగువారు సిద్ధమవుతున్నారు సమైక్యాంధ్ర లక్ష్యసాధన కోసం దేశమంతా పర్యటిస్తూ జాతీయ నాయకుల మద్దతు కూడగడుతున్న ఆయన బుధవారం చెన్నైకి చేరుకుంటున్నట్లు సమాచారం అందడంతో వారి అనందానికి అవధులు లేకుండా పోయాయి. బుధవారం ఉదయం 9.30 గంటలకు జగన్ మోహన్‌రెడ్డి చెన్నై విమానా శ్రయం చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు సచివాయంలో సీఎం జయలలితను కలుసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం తెలిపే ఫ్లెక్సీలు నగరమంతా వెలిశాయి. విమానాశ్రయం నుంచి నగరంవైపు, మౌంట్‌రోడ్డు, టీనగర్, ఆశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏర్పాటు చేసిన వందలాది ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నారుు. విమానాశ్రయంలోనే జగన్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు ప్రారంభించారు. రాష్ట్రంలోని వైఎస్ అభిమానులు వైఎస్ జగన్ రాకకోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ సీపీ చెన్నై విభాగం నాయ కులు శరత్‌కుమార్, జాకీర్ హుస్సేన్, శరవణన్, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.రాఘేవేంద్రరెడ్డి తదిత రులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాంగ్రెస్ అధినేతల పొరపాట్లకు సీమాంధ్ర బలి
బొప్పూడి (చిలకలూరిపేట రూరల్), న్యూస్‌లైన్ :కాంగ్రెస్ పార్టీ అధినేతలు చేసిన పొరపాట్లకు కోట్లాది మంది సీమాంధ్ర ప్రజలు బలైపోతున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు. బొప్పూడిలోని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాన్ని శని వారం ఆయన ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సమైక్యాంధ్రను కోరుతూ ఉద్యమాన్ని ఇక్కడ చేస్తే ప్రయోజనం ఉండదని ఢిల్లీని స్తంభింపజేస్తే ఫలితం లభిస్తుందన్నారు. రైతులు సంతోషంగా ఉండి పంటలు పండించుకునేందుకు, భూములు విలు వ పెంపొందేందుకు లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. నాలుగు గ్రామాలకు చెందిన 3153 ఎకరాల వ్యవసాయ భూములకు నీటిని అందించేందుకు రూ 15.87 కోట్లతో దీనిని ఏర్పాటుచేశామన్నారు. లిఫ్ట్‌ను గ్రామ ప్రజలు కాపాడుకుంటూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫుట్ బ్రిడ్జిలను నిర్మించాలి .. పేట ప్రాంతంలోని ఓగేరు, కుప్పగంజి, నల్లమడ పరీవాహక ప్రాంతంలో వాగులు దాటి ప్రయాణించి పంటలు సాగు చేసేందుకు అనుకూలంగా ఫుట్‌బ్రిడ్జిలను నిర్మించాలని రైతు సంఘం కార్యదర్శి బొల్లు శంకరరావు, రైతులు మంత్రి వెంకటేష్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమం అనంతరం ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ సర్పంచి పూసల హరిబాబు గ్రామంలో ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు. వివిధ శాఖల ఉద్యోగులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎత్తిపోతల రైతులకు కల్పవక్షాలు గణపవరం (నాదెండ్ల) : ఎత్తిపోతల పథకాలు రైతులకు కల్పవృక్షాలని మంత్రి టీజీ వెంకటేష్ చెప్పారు. గణపవరం పరిధిలోని ఏపీఎస్ఐడీసీ నిధులతో 7.87 కోట్ల వ్యయంతో 1700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. కావూరు డొంకరోడ్డులో కుప్పగంజివాగుకు అనుసంధానంగా నిర్మించిన పథకానికి మంత్రి స్విచ్ఆన్ చేశారు. గ్రామ ప్రధాన వీధిలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ మూడేళ్ల క్రితం తానే శంకుస్థానన చేసిన పథకాన్ని నేడు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నా రు. మంత్రి కాసు కృష్ణారెడ్డి అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీఎస్ఐడీసీ చైర్మన్ ఘంటా మురళి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు నల్లమోతు నటరాజేశ్వరరావు, ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు వలేటి హిమంతరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏపీఎస్ఐడీసీ ఎస్ఈ షేక్ కాలేషావలి, ఈఈ డీఎల్ నరసింహం, డీఈ ఆదిశేషారావు, ఏఈ కృష్ణమూర్తి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విభజనవాదులను దేశద్రోహులుగా పరిగణించాలి.. విభజనకోరేవారిని దేశద్రోహులుగా పరిగణించే చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య కంపెనీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను సమైక్యవాదినని, సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటానని, రాయలసీమ హక్కుల కోసం పోరాడతానాన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా అనేక ప్రత్యేక డిమాండ్లు తలెత్తుతాయన్నారు. -
రాష్ట్ర సమైక్యతే వైఎస్ఆర్సీపీ ధ్యేయం
పరశురాంపురం(కొమరాడ),న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బేబీనాయన అన్నారు. మండలంలోని పరశురాంపురం గ్రామం లో పలువురు మాజీ ప్రజాప్రతినిధులతోపాటు 230 కుటుంబాల వారు శుక్రవా రం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగతనేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి దేశంలో ఎక్క డా లేనివిధంగా సంక్షేమపథకాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారన్నారు. మరలా ఆ పథకాల అమలు ఒక్క జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 సీట్లకు గానూ 150 గెలుచుకుంటుందని జాతీయ సంస్థల సర్వే తెలుపుతోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణకు మద్దతు తెలిపార ని, ఆయనకు దమ్ముంటే జై సమైక్యాంధ్ర అని చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నా రు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎంతగానో శ్రమిస్తున్నారని తెలిపారు. రాజులకు బ్రహ్మరథం బొబ్బిలి యువరాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బేబీనాయ న, కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజులకు పరశురాంపురం ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు బ్రహ్మరథం పట్టారు. గ్రామం నుం చి పురవీధుల మీదుగా బాణసంచా వెలి గిస్తూ, మేళతాళాల ఊరేగించారు. మహిళలు హారతులు పట్టి, కుంకుమ దిద్ది స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శకుంతలమ్మ, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, ఉదయభాను, పార్వతీ పురం పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు మజ్జి వెంకటేష్, ఆదివాసీ జిల్లా అ ధ్యక్షుడు ఆరిక సింహాచలం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం,జియ్యమ్మవలస, పార్వతీపురం మండల కన్వీనర్లు ద్వారపురెడ్డి జనార్దనరావు, కొయ్యాన గోపి, మూడడ్ల గౌరీశంకర్, చుక్క లక్ష్మునాయుడు, నా యకులు డాక్టర్ మధుసూదనరావు, గం డి భాస్కరరావు, నీరస రామస్వామినాయుడు, హరియాల ఆనందరావు, ఎం. శ్రీరాములు, ఎం. నాగేశ్వరరావు, సీరల సింహాచలం, పొట్నూరు జయంతి, టి. చిరంజీవులు, మజ్జి త్రినాథ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్‌లు రఘుమండల పకీరునాయుడు, మజ్జి చిన్నంనాయుడు, ఆర్.మన్మథరావు, కృష్ణంనాయుడు, చల్లా చిన్నంనాయుడు, ఆర్.సత్యనారాయణ ఉన్నారు. -
రచ్చ రచ్చ!
బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి బయట పడి ప్రజల్లోకి దర్జాగా వెళదామనుకున్న అధికార పార్టీ నాయకులకు ఎక్కడికక్కడే పరాభ ం ఎదురవుతోంది. రెండు నెలలకు పైగా ప్రజలకు దూరంగా ఉన్న ఆ పార్టీ నాయకులు రచ్చబండ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇలా ప్రజాప్రతినిధులను నిలదీస్తుండడంతో వారికి పరాభవం తప్పడం లేదు.. సభలన్నింటిలోనూ అధికారులు, ప్రజాప్రతినిధుల నిలదీత, తోపులాట, ఘర్షణ, కొట్లాట వంటి సంఘటనలు చోటుచేసుకోవడడంతో జిల్లాలో ‘రచ్చబండ’లు రచ్చరచ్చగా మారుతున్నాయి. ఈ నెల 11 నుంచి రచ్చబండ సభలు ప్రారంభమయ్యా యి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు అధికారంలో లేని నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా సభలకు అధికారికంగా హాజరవుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు లేని నియోజకవర్గాల్లో మంత్రి బొత్స ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులకు కమిటీల్లో స్థానం కల్పించారు. ఈ సమావేశాలు రాజకీయ రచ్చబండలుగా మారి పోవడంతో ప్రజల్లోంచి తిరుగుబాటు కూడా అదే విధంగా వస్తోంది. బుధవారం విజయనగరం, చీపురుపల్లి, గరివిడి తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన మున్సిపల్ రచ్చబండలో ప్రజలు మూకుమ్మడిగా ఎంపీ, ఎమ్మెల్సీలను నిలదీశారు. సమస్యలు తీర్చలేని సభలు ఎందుకం టూ దరఖాస్తులను పైకి చూపిస్తూ నిరసన తెలిపారు. గత రచ్చబండ కార్యక్రమాల్లో ఇళ్లపట్టాలు, రేషన్‌కార్డులు, ఫించన్లకు దరఖాస్తులు చేసుకున్నా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. దీంతో ఎంపీ ఝాన్సీలక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. చీపురుపల్లి మండలంలో ఇటకర్లపల్లి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాస్తవాలను ప్రశ్నించినందుకు ఆయనపై కాంగ్రెస్ వర్గీయలు దాడి చేశారు. గరివిడిలోనూ కొట్లాట జరిగింది. ఇలాగే దాదాపు అన్ని చోట్ల అధికారపార్టీ నేతలకు పరాభవాలు ఎదురవుతుండడంతో వారు దాడులకు దిగుతున్నారు. అన్ని చోట్ల అదే తీరు... మూడో విడతలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకూ జరిగిన రచ్చబండ సమావేశాలను పరిశీలిస్తే దాదాపుఇలాగే సాగాయి. పూసపాటిరేగ మండలం రెల్లివలస, చల్లవానితోట గ్రామాల్లోని రచ్చబండలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గుర్ల మండలంలోని చింతలపేట, ఆనందపురం, నడుపూరు, భూపాలపురం, కోటగండ్రేడు, కలవచర్ల గ్రామాల్లోని సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాకాడ రచ్చబండ సభలో రెవెన్యూ అధికారులు రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితా చదువుతుండగా ఆక్కడే ఉన్న వైఎస్ఆర్ సీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లైన పూడి బ్రదర్స్ అధికారుల తీరును నిలదీశారు. ఏకపక్షంగా అధికార పార్టీకి చెందిన వారికే రేషన్‌కార్డులు మంజూరుచేసి అర్హులకు అన్యాయం చేశారని తహశీల్దార్ రమ ణమూర్తిపై మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌కు చెందిన గొట్టాపు రామారావు తదితరులు అధికారులను ప్రశ్నిస్తారా ఆంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారిమధ్య తోపులాట జరిగి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. బాడంగిలో జరిగిన సభలో డీసీసీబీ డెరైక్టరు కిరణ్ , వైఎస్ఆర్ సీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రామభద్రపురం మండలంలోని మామిడివలస గ్రామం లో ఈ నెల 12న నిర్వహించిన రచ్చబండలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. మండ ల కేంద్రంలో ఈనెల 13న నిర్వహించిన రచ్చబండ రచ్చరచ్చగా సాగింది. ఒకానొక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. ఎస్‌కోట నియోజకవర్గంలోని జామి మండలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గజపతినగరం నియెజకవర్గంలోని పెదమానాపురం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ రసాభాసగా సాగింది. -
సీమాంధ్ర మంత్రుల వల్లే దుస్థితి
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రుల అసమర్ధత వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆరోపించారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సోమవారం వర్సిటీలో నిరసన ప్రదర్శన చేశారు. ఆచార్య నాగార్జునుడి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రిలే నిరాహారదీక్షలు చేశారు. ఈ దీక్షలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి రాష్ట్ర విభజన బిల్లు వచ్చినపుడు తాము వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోరుతూ సీమాంధ్రలో 110 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే, కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పదవులకోసం పాకులాడడం నీచమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ జి.రోశయ్య, ఆచార్య పి.వరప్రసాదమూర్తి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జాన్సన్, ఉద్యోగ జేఏసీ నాయకులు కోడూరి కనకరాజు, కన్యాకుమారి, యుగంధర్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వెంకటరమణ, ఏఎన్‌యూ జేఏసీ అధ్యక్షుడు కె. కిషోర్, బి.ఆశిరత్నం, పి.శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షలకు పలువురు సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు మద్దతు పలికారు. దీక్షలను సాయంత్రం ఎమ్మెల్సీ కేఎస్. లక్ష్మణరావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. -
13న జగన్ రాక
కాకినాడ, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న జిల్లాకు రానున్నారు. పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుడి వివాహవేడుకకు ఆయన హాజరు కానున్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన పర్యటనపై చర్చించేందుకు పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నారు. రాజమండ్రి ఉమారామలింగేశ్వర కల్యాణ మండపంలో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం జరుగుతుందని జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. జగన్‌కు స్వాగతం పలకడంతోపాటు ఇతర కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, సీజీసీ సభ్యులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాలు, మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు సమావేశానికి విధిగా హాజరుకావాలని కోరారు. -
రహదారుల దిగ్బంధం సక్సెస్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర సాధనలో భాగంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమం రెండో రోజైన గురువారం శతశాతం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు కదలికదం తొక్కారు. మానవహారాలు, ర్యాలీలు, ధర్నాలతో నిరనస తెలిపారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, ఇచ్ఛాపురం తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్రబాబుతో పాటు పలువురు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నర్సన్నపేట, శ్రీకాకుళం పట్టణాల్లో 79 మంది అరె స్ట్ అయ్యారు. వీరిలో నర్సన్నపేట నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది సర్పంచ్‌లు ఉన్నారు. నర్సన్నపేటలో జరిగిన రహదారి దిగ్బంధంలో ధర్మాన కృష్ణదాస్‌తో పాటు 26 మంది అరెస్ట్ కాగా శ్రీకాకుళంలో పిరియా సాయిరాజ్‌తో పాటు 35 మందిని, టెక్కలిలో 16 మందిని పోలీసులు అరెస్టు చేసి తరువాత విడిచిపెట్టారు. ప్రధానంగా నియోజకవర్గ ఇన్చార్జిల నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రవాణా స్తంభించింది. హైవేపై వాహనాలు వేల సంఖ్యలో ఆగిపోయాయి. శ్రీకాకుళం పట్టణంలో సాయంత్రం వైఎస్ఆర్ కూడలి వద్ద మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలగడంలో సీఐ ఎం.మహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వరుదు కల్యాణి, వైవీ సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పరవీంద్ర, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావు, జిల్లా అడహక్ కమిటీ సభ్యులు అంధవరపు సూరిబాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్, పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, గేదెల పురుషోత్తం, ప్రధాన రాజేంద్ర, కె.వి.వి. సత్యనారాయణను అరెస్టు చేశారు. నరసన్నపేట ఎన్‌హెచ్-16 రహదారిపై ఆ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధనం జరిగింది. రోడ్డుకు రెండువైపులా సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో సీఐ రాఘవరావు సిబ్బందితో వచ్చి కృష్ణదాస్‌తోపాటు అనుచరులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం దాసన్నను పోలీసులు విడిచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హనుమంతు కిరణ్‌కుమార్, ఆరంగి మురళి, కరిమి రాజేశ్వరరావు, కనుజు సీతారాం, యాళ్ల కృష్ణంనాయుడు, ఆర్.అప్పన్న, ఎం.బైరాగినాయుడు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పారిశ్రామిక వాడ వద్ద జరిగిన రహదారులు దిగ్బంధంలో సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస మండలాల నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మో హణరావు, పార్టీ మహిళా విభాగం సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ, జిల్లా కమిటీ సభ్యులు పైడి కృష్ణప్రసాద్, కూన మంగమ్మలు పాల్గొన్నారు. ఆమదాలవలస, శ్రీకాకుళం మధ్య నడిచే బస్‌లు రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు కలిగాయి. సమన్వయకర్త బొడ్డేపల్లి మాధురి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం కొత్తరోడ్ జంక్షన్ వద్ద జరిగింది. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరు గ్రామం వద్ద జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త కలమట వెంకటరమణ పాల్గొన్నారు. ఎల్‌ఎన్‌పేట మండలంలో మండల కన్వీనర్ కొల్ల గోవిందరావు నేతృత్వంలో అలికాం-బత్తిలి రోడ్డులో, పాతపట్నంలో కొండాల అర్జునుడు నేతృత్వంలో నీల మణి దుర్గ అమ్మవారి జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజవర్గంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ కృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు ఇచ్ఛాపురం - బెల్లుపడ జాతీయ రహదారి పై రహదారి దిగ్బం ధనం జరిగింది. సుమారు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసి, రహదారి దిగ్బంధనం ఆపాలని నాయకులను హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయలేదు. పాలకొండ ఆంజనేయసెంటర్లో పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి, నాయకులు కనపాక సూర్యప్రకాశరావు తదితరులు దాదాపు అరగంట సేపు రహదారిని గ్బంధించారు. సీతంపేట మండలంలో పాలకొండ-సీతంపేట ప్రధాన రహదారిలో కుశిమి జంక్షన్ వద్ద పార్టీ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో, భామిని మండలం సతివాడలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకోట ఆంజనేయులు, సతివాడ సర్పంచ్ పాత్రుకొండ రాంబాబు నేతృత్వంలో రాస్తారోకో చేపట్టారు. రాజాం వైఎస్ఆర్ కూడలి వద్ద సమన్వయకర్త పీఎంజేబాబు ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం జరిగింది. మాజీ ఎమెమల్యే కం బాల జోగులు పాల్గొన్నారు. పలాసలో కోసంగిపురం జాతీయ రహదారి కూడలి వద్ద రహదారి దిగ్బంధం కార్యక్రమం విజయవంతమైంది. ఈసందర్భంగా సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం, సమన్వయకర్త వజ్జ బాబూరావు, జిల్లా కమిటీ సభ్యుడు నర్తు ప్రేమ్‌కుమార్, మున్సిపల్ కన్వీనర్ బళ్ల గిరిబాబు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణం సమీపంలోని కుశాలపురం బైపాస్ కూడలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 గంటల రోడ్డు దిగ్భంధం కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచి పోయింది. యూపీఏ దిష్టి బొమ్మను దహనం చేశారు. నియోజక వర్గ సమన్వయ కర్త వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎచ్చెర్ల నియోజక వర్గంలోని రణస్థలం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నియోజక వర్గ సమన్వయ కర్త గొర్లె కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. టెక్కలిలో జగతిమెట్ట హైవేపై రోడ్డు దిగ్బంధన కార్యక్రమం జరిగింది. వాహనాలు నిలిచిపోవడంతో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, సంపతి రావు రాఘవరావు, కోత మురళీధర్, చింతాడ గణపతి, తిర్లంగి జానకిరామయ్య ఉన్నారు. సోనియాగాంధీ వేషధారిణిని శవయాత్ర నిర్వహించారు.నందిగాం మండలం జాతీయ రహదారి వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధన కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ, సీజీసీ సభ్యుడు కణితి విశ్వనాథం పాల్గొన్నారు. -
మంచి పేరు తెచ్చుకోండి
జగ్గంపేట, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలను జగ్గంపేటలో కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌లు మంగళవారంనాటి దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ఉదయం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సందర్శించారు. ఆమె తొలుత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ విజయమ్మకు సర్పంచ్‌లను పరిచయం చేశారు. అనంతరం మహిళా సర్పంచ్ల దీక్షను విజయమ్మ ప్రారంభించారు. గ్రామస్తులకు మెరుగైన పాలన అందిస్తూ మంచి సర్పంచ్‌లుగా పేరు తెచ్చుకోండని ఆమె ఈ సందర్భంగా వారికి సూచించారు. దీక్షలో సర్పంచ్‌లు కొలిపే ప్రసన్నరాణి, దేవరకొండ నాగు, కడారి లక్ష్మి, బండారు వరలక్ష్మి, గొల్లవిల్లి సింగారలక్ష్మి, గంధం గంగాభవాని, వేపల్లి వరలక్ష్మి, కుందేటి అప్పయ్యమ్మ, కొండేపూడి అప్పలకొండ, బత్తిన శ్యామల, సాలాపు పైడమ్మ, బస్వా పద్మావతి, బోయిడి మహాలక్ష్మి, మళ్ల సారద, సాలాపు గంగాభవానీ, చాగంటి పూర్ణ, కేసీనీడి అచ్యుతపద్మ పాల్గొన్నారు. అలాగే సర్పంచ్‌లు కుంచే రాజా, కూండ్రపు సూర్యారావు, పడాల ధర్మరాజు, టేకుమూడి సూర్యచంద్ర, సుంకర సీతారామయ్య, పల్లపు విష్ణుచక్రం తదితరులు పాల్గొన్నారు. -
కేబినెట్ నోట్‌తోనే సంబరపడొద్దు
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర కేబినెట్ నోట్‌తోనే సంబరపడొద్దని జేఏసీ నాయకులు, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి బూర మల్లేశం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల ప్రజలకు సీమాంధ్రుల దోపిడీ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పాత బస్టాండు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 1,376వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందే వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పుల్లూరు మధిర బండచెర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా పొదుపు సంఘం సభ్యులు బూసాని వెంకటలక్ష్మి, బాలమణి, శశికళ, పద్మ, కమల, అరుణ, ప్రమీల, నర్సవ్వ, మల్లవ్వ, రాజవ్వ, రాజమణి, పోశవ్వ, మంగ, వీరమణి తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి పలువురు జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. -
వైసీపీ ఆధ్వర్యంలో రెండో రోజూ బంద్ సంపూర్ణం
‘పశ్చిమ’ వాసులు నిప్పు కణికలయ్యారు. విభజన నిర్ణయంపై నిరసన సెగలు రగిలిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. తెలుగుజాతిని ముక్కలు చేసి తీరుతాం అంటున్న కేంద్ర ప్రభుత్వంపై జనం నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన 72 గంటల బంద్ పిలుపును అందుకుని పోరుబాటలో కదం తొక్కుతున్నారు. తెలుగునేలను పరిరక్షించుకుంటామని నినదిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం శనివారం వీధివీధినా ఉవ్వెత్తున సాగింది. బంద్ కారణంగా సకలం మూతపడటంతో జనజీవనం స్తంభించింది. కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. వైసీపీ రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. కొయ్యల గూడెంలో వైసీపీ నేతలు ర్యాలీ చేసి రోడ్‌పై బైటాయిం చారు. బయ్యనగూడెంలో వైసీపీ ఆధ్వర్యంలో బంద్ పాటించడంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమర ణ నిరాహారదీక్షకు సంఘీభావంగా, రాష్ట్రాన్ని సమైక్యం గానే ఉంచాలని కోరుతూ వైసీపీ నాయకులు పోతన శేషు చండిహోమం ప్రారంభించారు. తొమ్మిది రోజులు హోమం కొనసాగుతుంది. ఉండి మండలంలో బంద్ నిర్వహించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ప్రభు త్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కలిసిపూడి నుంచి ఉండి వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పాదయాత్ర నిర్వహించి పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. చింతలపూడిలో రెండవ రోజు బంద్ సంపూర్ణంగా జరిగింది. నియోజకవర్గ సమన్వకర్త కర్రా రాజారావు పాల్గొన్నారు. లింగపాలెంలో బంద్ కొనసాగింది. ధర్మాజీగూడెం, రంగాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, రోడ్ల దిగ్బంధనం, ములగలంపాడులో రాస్తారోకో చేశారు. కామవరపుకోటలో వైసీపీ నాయకు లు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. జీలుగుమిల్లిలో రాష్ట్ర రహదారిపై టెంట్లు వేసి కోలాట ప్రదర్శన, వివిధ రకాల ఆటలతో, వంటావార్పు చేశారు. టి. నరసాపురం, మక్కినవారిగూడెం, బొర్రంపాలెంలో బంద్ చేశారు. టి.నరసాపురంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధ య్య ఆధ్వర్యంలో రెండోరోజు బంద్ విజయవంతమైం ది. అత్తిలి, ఇరగవరం, మండలాల్లో బంద్ కొనసాగిం ది. తాడేపల్లిగూడెంలో మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు, గణపవరం మండలాల్లో రాస్తారోకో, బంద్ నిర్వహించారు. నారాయణపురం, గొల్లగూడెంలో వంటవార్పు చేశారు. దేవరపల్లిలో ర్యాలీ, వంటావార్పు, ధర్నా చేశారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ నేత బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, సమన్వయకర్తలు తలారి వెంకట్రావ్, బి.సువర్ణరాజు పాల్గొన్నారు.కొనసాగుతున్న దీక్షలు : ఏలూరులో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. శనివారపుపేటకు చెందిన నాయకులు, కార్యకర్తలు దాదాపు 30 మంది మండల కన్వీనర్ మంచెం మైబాబు ఆధ్వర్యంలో రిలేదీక్ష చేశారు. పాలకొల్లులో రిలే నిరాహార దీక్షలు నాల్గోరోజు శనివారం కొనసాగాయి. దీక్షల్లో యలమంచిలి మండలానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకటసత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్ సంఘీభావం ప్రకటించారు. ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో చేబ్రోలులో వైసీ పీ జిల్లా కార్యవర్గ సభ్యులు నౌడు వెంకట రమణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నరసాపురంలో రిలే నిరాహార దీక్షల్లో మొగల్తూరు మం డ లం పాతపాడు సర్పంచ్ కామాని ఉమామహేశ్వరావు తో పాటు 40 మంది దీక్షలు చేశారు. దెందులూలూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో రామారావుగూడెం, శ్రీరామవరం, చల్లచింతలపూడి, గాలాయిగూడెం గ్రామాలకు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఆటో యూనియన్ నాయకులు వైసీ పీ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో పాల్గొన్నారు. కొవ్వూరులో రిలే దీక్షలు నాలుగోరోజు కొనసాగాయి. శనివారం సుమారు 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నా రు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మండల పార్టీ సమన్వయకర్త ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమి హరిచరణ్ పాల్గొన్నా రు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటరులో ఆపార్టీ నాయకులు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. దీక్షలో నియోజకవర్గ సమన్వకర్త కండిబోయిన శ్రీనివాసు, ఆచంట మండల సమన్వయకర్త గుడాల విజయబాబుతో సహా 12 మంది పాల్గొన్నారు. శిబిరాన్ని సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ సందర్శించి సంఘీభావం తెలిపారు. వీరవాసరంలో వైసీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. భీమవరంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకాశంచౌక్‌లో రిలే దీక్షలు చేశారు. ఉండి సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. -
పళ్లంరాజు ఇల్లు ముట్టడికి యత్నం
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు ఇంటి ముట్టడి యత్నం శనివారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక దశలో పోలీసులు లాఠీచార్జిలో పదిమంది జేఏసీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. జేఏసీ నేతలలో 153 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్టుల జేఏసీ సభ్యులు పళ్లంరాజు ఇంటి వద్ద ధర్నా చేసి ఇంట్లోకి చొచ్చు కెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదికఆధ్వర్యంలో వందలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు శనివారం ఎన్జీఓ కార్యాలయానికి చేరుకొని అక్కడ నుంచి పళ్లంరాజు ఇంటివైపు ర్యాలీగా బయల్దేరారు. ఇంటికి వంద అడుగుల దూరంలో బారికేడ్లు, ముళ్ల కంచెలు వేసిన పోలీసులు జేఏసీ నేతలను ఇంటివైపు రాకుండా అడ్డుకున్నారు. 65 రోజులుగా ఎన్నోసార్లు పళ్లంరాజు ఇంటిని ముట్టడించినప్పుడు చిన్నపాటి సంఘటన కూడా చోటుచేసుకోలేదని, అలాంటప్పుడు ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారంటూ జేఏసీ నేతలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ దశలో ఇంటివైపు చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఉద్యోగులు-పోలీసుల మధ్య తీవ్రతోపులాట జరిగింది. ఈ సమయంలో పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఫార్మసిస్ట్ అసోసియేషన్ పసుపులేటి శ్రీనివాస్, సర్వేయర్ ఉద్యోగ సంఘ నాయకులు ఆచారి, ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ కవి శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఉద్యోగులు ఆగ్రహం చెంది ముట్టడికి తీవ్రంగా యత్నించగా పోలీసులు వారిని ప్రతిఘటించారు. జేఏసీ నేతలు బూరిగ ఆశీర్వాదం, కవిశేఖర్, అనీల్ జాన్సన్ డీఎస్పీ విజయభాస్కరరెడ్డిని నిలదీశారు. తాము ఆది నుంచి ఉద్యమాన్ని ప్రశాంత వాతావరణంలోనే నిర్వహిస్తుంటే రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. వారికి మద్దతుగా జర్నలిస్టుల జేఏసీ మిత్రులు కూడా పళ్లంరాజు ఇంటి గేటు వద్ద ధర్నా చేశారు. మరొక వైపు పళ్లంరాజు ఇంటివైపు మళ్లీ దూసుకొస్తున్న జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్, ఏపీఎన్జీఓ కాకినాడ నగర అధ్యక్షుడు అనిల్ జాన్సన్, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎంఏ ఖాన్, ఇందేష్, పీఎన్ మూర్తిలతో పాటు 153 మందిని అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కాగా లాఠీచార్జిలో గాయపడిన జేఏసీ నేతలను కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పరామర్శించారు. -
జై తెలంగాణ
సాక్షి ప్రతిని ధి, నిజామాబాద్ : జూలై 30న సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానాన్ని యథాతథంగా కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించింది. ఈ నిర్ణయం రావడం వెనుక తెలంగాణ వాదుల ఉద్యమ స్ఫూర్తి త క్కువేమి కాదని చెప్పవచ్చును. సత్వరమే పా ర్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ 65 రోజులుగా రాజకీయ జేఏసీతో సహా టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, సీపీఐ, పీడీఎస్‌యూ, ఏబీవీపీ, బీజేపీలు వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాయి. హైదరాబాద్‌లో జరిగి న సకల జనుల భేరి సభను విజయవంతం చేయడంలో కూడా జిల్లా రాజకీయ జేఏసీతో పాటు భాగస్వామ్యపక్షాలు కీలకభూమికను పోషించాయి. 60 ఏళ్లుగా తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్నప్పటికీ పుష్కరకాలంగా ఆ ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. 2009లో కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేయగా అదే బాటలో పలువురు విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. అమరవీరుల త్యాగాల ఫలితానికి తోడు కోట్లాది ప్రజల ఉద్యమ శక్తికి అధికార పక్షం తలవంచి ఈ నిర్ణయం తీసుకుం దని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు. కేబినెట్లో తెలంగాణ నోట్ ఆమోదం పొందినప్పటికీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టేంత వరకు ఉద్యమ స్ఫూర్తితో పోరాట కార్యక్రమా న్ని కొనసాగించాలని రాజకీయ జేఏసీతో పాటు తెలంగాణ వాదులు అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చాయి. హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి వర్గంలో ప్రవేశ పెట్టి న నోట్ ఆమోదానికి నోచుకోవడంపై తెలంగాణ వాదులు అత్యంత ఉత్సాహంతో సంబు రాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్, డిచ్పల్లి తదితర ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ రంగోళిని మరిపించారు. నిజామాబాద్‌లో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నివాసం వద్ద ఆ పార్టీ నేతలు సురేందర్, నగేష్‌రెడ్డి, కేశవేణు, కార్యకర్తలు,మహిళలు స్వీట్లు పంచుతూ టపాకాయలు కాల్చారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బస్వలక్ష్మీనర్సయ్య ఇంటి ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరా లు జరుపుకున్నారు. టీఎన్జీవోఎస్ భవనం వద్ద ఉద్యోగులు, కార్మికులు విద్యార్థులు, జర్నలిస్టులు స్వీట్లు పంచారు. టపాకాయలు కాల్చా రు. జై తెలంగాణ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, నాయకులు, మహిళలు స్వీట్లు పంచి పెట్టారు. టపాకాయలను పేల్చా రు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి కృతజ్ఞత లు తెలుపుతూ జై తెలంగాణ నినాదాలు చేశా రు. బీజేపీ,సీపీఐ, న్యూడెమోక్రసీ మాత్రం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వర కు పోరాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. -
ఎంపీ మాగుంట కార్యాలయం ముట్టడి
ఒంగోలు కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 156 శాఖల ఉద్యోగులు ఉద్యమిస్తుంటే సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయాన్ని ఉద్యోగులు గురువారం ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట కూర్చుని 48 గంటలపాటు ఆందోళన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించకుండా కాంగ్రెస్ అధిష్టానంపై ఎంపీ ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్‌బషీర్ మాట్లాడుతూ విభజన వల్ల వివిధ వర్గాలు, ప్రాంతాల ప్రజలకు వచ్చే కష్టనష్టాలపై ఎటువంటి చర్చ జరగకుండా టీ నోట్‌పై క్షణానికో ప్రకటన చేస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజలను కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. రాష్ట్ర విభజనపై ఢిల్లీస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2014 వరకు రాష్ట్ర విభజన సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాల్సిన అవసరం ఉందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన వారికే భవిష్యత్తులో ఉద్యోగుల మద్దతు ఉంటుందని బషీర్ స్పష్టం చేశారు. ఎన్జీవో అసోసియేషన్ కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ. 25 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర ప్రాంత ప్రజల సొమ్ము, శ్రమ ఉందని పేర్కొన్నారు. విభజన వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు ఒక్క చుక్క కూడా నీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. 64 రోజులుగా ఎన్నో కష్టనష్టాలు భరిస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో భాగమే ప్రత్యేక తెలంగాణ అంశమని శ్రీనివాసరావు విమర్శించారు. ఉద్యోగులు ఎంపీ కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. భోజనాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాసర్ మస్తాన్‌వలి, రెవెన్యూ సంఘం నాయకుడు కేఎల్ నరసింహా రావు, శరత్‌బాబు, రాజ్యలక్ష్మి, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రసాద్, నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ సంఘం నాయకులు నాగేశ్వరరావు, వీరనారాయణ, రమణమూర్తి, అన్నపూర్ణమ్మ, విద్యాసాగర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, వైద్యుల సంఘ నాయకుడు డాక్టర్ ఎం.వెంకయ్య, వ్యవసాయశాఖ జేఏసీ నాయకులు కిషోర్, మున్సిపల్ జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు, రమేశ్, శేఖర్‌బాబు, ప్రసాదరావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
టీ నోట్‌పై భగ్గు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :తెలుగువారి ఐక్యతను దెబ్బతీస్తూ.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బేఖాతరు చేస్తూ.. ప్రజాకాంక్షను విస్మరిస్తూ.. సీమాంధ్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు ఆమోదం తెలపడంపై జిల్లా భగ్గుమంది. ఏదైతే జరగకూడదని జిల్లా ప్రజలు 65 రోజులుగా మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారో అదే జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో గురువారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజలు హతాశులయ్యారు. దాంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం బుధవారం నుంచి నిరాహారదీక్షలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 72 గంటల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక ఉద్యోగ జేఏసీ నేతలు గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమై బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి జిల్లా ఆందోళనలతో అట్టుడకనుంది. గురువారం ఉదయం నుంచే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్, ఉద్యోగ జేఏసీ ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించడంతో జిల్లా మరింతటగా అట్టుడకనుంది. పెల్లుబికిన నిరసన.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోగానే జిల్లా ప్రజలు ఆందోళనలకు దిగారు. సమైక్యాంధ్రకు కట్టుబడిక ఏకైక ప్రధాన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధర్నాకు దిగింది. ఇప్పటికే సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు బుధవారం నుంచి నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం గురువారం వెలువడగానే పార్టీ నేతలు ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు. సమన్వయకర్తలు దీక్షల్లో ఉండగా.. ఇతర ముఖ్య నేతలు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలుగువారి ప్రయోజనాలను విఘాతం కలిగిస్తూ కేవలం ఓట్లు-సీట్ల కోసం సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ ధర్నాలో పార్టీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, వేమూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడులో వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ధర్నా చేశారు. కర్నూలు రహదారిపైకి వందలమంది నేతలు, కార్యకర్తలు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఇందులో పార్టీ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ అమృతపాణి, మండల కన్వీనర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు. చీరాలలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర విభజన నిర్ణయంపై భగ్గుమన్నారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఒంగోలు చర్చి సెంటర్లో ధర్నా చేశారు. టైర్లు కాల్చి రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర ఫ్రంట్ ప్రతినిధులు ఒంగోలు మంగమూరు సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలను కొంతసేపు అడ్డుకున్నారు. విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ నోట్ రానుందని తెలియగానే చీరాలలో జేఏసీ నేతలు గురువారం మధ్యాహ్నమే ఆందోళనకు దిగారు. గుంటూరు మాధవరావు, నారాయణ శేషసాయి అనే ఇద్దరు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్యానికి కూడా పాల్పడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మార్కాపురం, కనిగిరి, అద్దంకి, పర్చూరులలో కూడా జేఏసీ నేతలు, సభ్యులు రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనలు చేశారు. బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపు రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ 72 గంటల పాటు బంద్ పాటించాలని నిర్ణయించింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లాలో కూడా బంద్‌ను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలతో పాటు అన్ని కార్యకలాపాలను స్తంభింపజేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మేరకు జిల్లా పార్టీకి దిశానిర్దేశం చేశారు. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ప్రజలను కోరారు. జిల్లా పార్టీ కన్వీనర్ నూకసాని బాలాజీ బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తున్నారు. అదే విధంగా ఎన్జీవో జేఏసీ కూడా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 48 గంటల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై చర్చించేందుకు జేఏసీ నేతలు ఎన్జీవో భవన్లో గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం రాష్ట్ర విభజన నిర్ణయంపై వెల్లువెత్తే ప్రజావ్యతిరేకతను బలప్రయోగంతో అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం చేపట్టిన ముందస్తు చర్యలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పోలీసు యంత్రాంగానికి గురువారం ఉదయమే సమాచారం అందింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ ప్రమోద్‌కుమార్ ఒంగోలులోని ఎన్జీవో జేఏసీ నేతలను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. కేంద్ర నిర్ణయం వెలువడిన తరువాత కూడా శాంతియుతంగానే నిరసన తెలపాలని సున్నితంగానైనా కచ్చితంగా చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అదే సమయంలో ఎస్పీ ప్రమోద్‌కుమార్ జేఏసీ నేతలను సుతిమెత్తంగా హెచ్చరించారు కూడా. ఆందోళనలు హద్దుమీరితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పీడీ యాక్టు నమోదు చేసేందుకు కూడా వెనుకాడమని చెప్పడం ద్వారా పోలీసు యంత్రాంగం ఉద్దేశాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఉద్యోగులు అనవసరంగా పోలీసు కేసుల్లో ఇరుక్కోవద్దని కూడా హెచ్చరించడం గమనార్హం. అంటే రాష్ట్ర విభజనపై వెల్లువెత్తే ఉద్యమాన్ని పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని కేంద్రం భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. -
వెళ్లాల్సింది ప్రజలు కాదు.. పెట్టుబడిదారులే
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్:తెలంగాణను వదిలిపెట్టి పోవాల్సింది సీమాంధ్ర ప్రజలుకాదని, సీమాంధ్ర ప్రాంతం పెట్టుబడిదారులేనని స్థానిక ఎమ్మెల్యే కేఎల్లార్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని, ఇక పరిపాలన విభజన మాత్రమే జరగాల్సి ఉందన్నారు. ఘట్కేసర్లోని బస్‌టెర్మినల్ ఎదురుగా సర్పంచ్ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఘట్కేసర్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీచేస్తున్న నేపథ్యంలో ఆయన రెండు పార్టీల కండువాలు వేసుకుని ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అబ్బసాని యాదగిరి యాదవ్ విజయానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేసి యాదగిరిని గెలిపించాలన్నారు. క్రమశిక్షణ తప్పినవారు పార్టీ నాయకులే కాదని, పార్టీని ధిక్కరించిన వారికి వది లిపెట్టేది లేదని అన్నారు. టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమల మహేష్‌గౌడ్, నియోజకవర్గం బీ బ్లాకు అధ్యక్షుడు పులుగుల మాధవరెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమం లో సర్పంచ్ అభ్యర్థి అబ్బసాని యాదగి రియాదవ్, రైతు సంఘం డెరైక్టర్ కొం తం అంజిరెడ్డి, నాయకులు భాస్కర్‌యాదవ్, బట్టె లక్ష్మణ్‌రావు, రొడ్డ యాదగిరి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మెట్టు బాల్‌రెడ్డి, ఎల్లస్వామి, సగ్గు శ్రీనివాస్, భానుప్రకా ష్, రాఘవరెడ్డి, అనురాధ, సగ్గు అనిత, లంబ శ్రీను, రాంరెడ్డి పాల్గొన్నారు. -
అసెంబ్లీని సమావేశపరిస్తే దొంగలెవరో తేలుతుంది
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్:అసెంబ్లీని సమావేశపరిస్తే సమైక్యాంధ్ర ఉద్యమంలో దొంగలేవరో తేలుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. స్థానిక నాలుగురోడ్ల కూడలిలో బుధవారం ఆమె సమైక్యాంధ్రకు మద్దతుగా 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు సమైక్యాంధ్ర విషయంలో రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారన్నారు. ఆ రెండు పార్టీల నాయకులను ఉద్యమకారులు బయట తిరగనివ్వకపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కవడం వల్లే బెయిల్ వచ్చిందని చెబుతున్న టీడీపీ నేతల ఆరోపణల్లో పసలేదన్నారు. అది వాస్తవమే అయితే తమ నేత 16 నెలల పాటు జైలులో గడపాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. జగన్మోహన్రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా యూపీఏ ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయంపై పోరాటం సాగిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు కట్టుబడి రాజీనామాలు చేశారని.. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు పదవులను అంటిపెట్టుకుని ఉండటంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలకు వివరించాలన్నారు. సోనియాగాంధీ రాష్ట్ర విభజన ప్రకటనకు ముందే సీఎం కిరణ్‌ను ఢిల్లీకి పిలిపించుకుని విషయం చెప్పినా ఆయన అడ్డుకోలేకపోవడం సీమాంధ్ర ప్రజలను ద్రోహం చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖతోనే విభజనకు శ్రీకారం చుట్టినట్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు బహిరంగంగా చెబుతున్నారని.. అయితే ఆయన మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ టర్న్, ఈ టర్న్ అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. విభజనకు కారణమైన ఆ రెండు పార్టీలే జగన్‌ను విమర్శించడం దొంగే.. దొంగదొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయిన చంద్రబాబు ఇక అధికారం దక్కదనే ఉద్దేశంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. -
విద్యుత్ టవర్ ఎక్కిన సమైక్యవాది
కాణిపాకం, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఐరాల మండలానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఐరాల మండలం పాతపాళెం గ్రామానికి చెందిన ప్రకాష్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్రామ సమీపంలోని 133 కేవీ విద్యుత్ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టవర్‌పై నుంచి ‘జై సమైక్యాంధ్ర.. జైజై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశాడు. కిందకు దిగాలని స్థానికులు బతిమిలాడినా వినిపించు కోలేదు. సమాచారం అందన వెంటనే ఐరాల ఎస్ఐ వాసంతి అక్కడకుచేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మూడు గంటల పాటు అతను కిందకు దిగకపోవడంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు సీఐ శ్రీకాంత్, కాణిపాకం ఎస్ఐ లక్ష్మీకాంత్, గుడిపాల ఎస్ఐ మురళి అక్కడికి చేరుకున్నారు. ప్రకాష్ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, సమైక్య రాష్ట్రం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సహకరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రకాష్ టవర్ నుంచి కిందకు దిగాడు. కాగా ఇతను టవర్ ఎక్కిన విషయం తెలియగానే విద్యుత్ శాఖ అధికారులు మెయిన్ సప్లై నిలిపివేశారు. -
సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు సరికాదు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: ఇటీవల పాలమూరులో జరిగిన సభలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సుష్మాస్వరాజ్ ఏకపక్షంగా మాట్లాడడం సరికాదని అన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఏవిధంగా నష్టపోతుందో ఈనెల 2, 3 తేదీల్లో ఢిల్లీ నాయకులకు వివరిస్తామని చెప్పారు. ఇందుకు అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌ల అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రం విడిపోవడం అనివార్యమైతే హైదరాబాద్ పరిస్థితి, ఆదాయ, వ్యయాలు, జల వనరులు తదితర సమస్యలపై పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలని, అప్పుడే కేంద్రానికి విభజనపై మద్దతునివ్వాలని చెబుతామన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకులు ఢిల్లీ వెళుతున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
సమైక్య సునామీ
కందనవోలు గడ్డ లక్ష్య సాధకులతో పోటెత్తింది. ఉద్యమాల ఖిల్లా.. తెలుగుబిడ్డలతో కదంతొక్కింది. అడుగుల పిడుగులు.. మాటల తూటాలు.. స్ఫూర్తి నింపిన పాటలు.. ఉత్సాహం నింపిన ఆట నడుమ సమైక్య నినాదం మారుమ్రోగింది. ఇసుకేస్తే రాలనంత జనం.. తొణికిసలాడే ఉద్యమ భావం.. ఉప్పొంగే పౌరుషం పోరాట పటిమకు అద్దం పట్టింది. కర్నూలులో దారులన్నీ ఒక్కటి కాగా.. ఉద్యమకారులంతా కలిసి నడవగా.. ఎస్టీబీసీ కళాశాల మైదానం జన సునామీని తలపించింది. పార్టీలకు అతీతంగా.. నేతల ఊసే లేకుండా సాగిన ప్రజాగర్జన జిల్లా చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రజల తోడుగా.. వారే సారథులుగా సాగుతున్న ఉద్యమానికి దిశా నిర్దేశం చేసింది. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:కర్నూలులో నిర్వహించిన సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన బహిరంగ సభ విజయవంతమైంది. సభా వేదిక ఎస్టీబీసీ కళాశాల మైదానంతో పాటు చుట్టుపక్క రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. గతంలో ఇదే మైదానంలో అనేక రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరిగినా.. ఈ స్థాయిలో జనాన్ని చూడలేదనే చర్చ జరిగింది. తద్వారా సమైక్యవాదాన్ని బలంగా చాటగలిగారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో సభ ఆద్యంతం హోరెత్తింది. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఊరేగింపుగా బహిరంగ సభకు తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైన కార్యక్రమం రాత్రి 9:15 గంటలకు ముగిసింది. సభ పూర్తయ్యేంత వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా క్రమశిక్షణ పాటించడం విశేషం. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు మొత్తం 40 మంది ప్రసంగించారు. అశోక్‌బాబు ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు చప్పట్లు, ఈలలు, కేకలతో ప్రోత్సహించారు. నెల్లూరు వాసులు తమిళనాడులో, అనంతపురం ప్రజలు బెంగుళూరులో, విశాఖపట్నం ప్రజలు ఒరిస్సాలో పెట్టుబడులు పెట్టవచ్చని, అయితే అక్కడకు వెళ్లకుండా హైదరాబాదులో ఎందుకు పెట్టుబడులు పెట్టారు... ఇది మన రాజధాని అనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చి అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల అంగీకారం లేనిదే రాష్ట్ర విభజన జరగదని, కాదు కూడదని ముందుకెళ్తే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రుల మెడలు వంచి రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేకపోయినా ముందుకు సాగకుండా అడ్డుకోగలిగామని, ఇది 60 రోజుల ఉద్యమంతో సాధ్యమైందన్నారు. ప్రజాగాయకుడు వంగపండు బృందం ఆటాపాటా సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సమ్మెను కొనసాగిస్తామని, అయితే విధి విధానాలపై ఈనెల 30న అన్ని జేఏసీ నేతలతో చర్చించి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. సీమాంధ్ర జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తీరాల్సిందేనన్నారు. ప్రైవేటు సంస్థలన్నీ యథావిధిగా పనిచేస్తున్నాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అనడం సరికాదని, ఆగస్టు 1 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు నిరంతరం ఉద్యమిస్తున్నాయని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పేర్కొనగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలను యథావిధిగా నడుపుతూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించగా వి.సి.హెచ్.వెంగల్రెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఉపాధ్యాయులు వెనక్కు తగ్గారు. ఇదిలా ఉండగా ఉదయం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకొచ్చి 60 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారని, కేంద్రంలోని మంత్రులు, ఎంపీలు పదవులకు రాజీనామా చేసినట్లయితే విభజన ప్రక్రియ ఎప్పుడో తేలిపోయేదన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రులకు జరిగే అన్యాయంపై రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలే నాయకత్వం వహించి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుండటం శుభపరిణామమన్నారు. తెలంగాణలోనూ సమైక్యాంధ్రకు మద్దతిచ్చే ప్రజలు చాలా మంది ఉన్నారని.. అలాంటి వారిపై తెలంగాణ ముసుగులో దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. రాజకీయ స్వార్థం కోసం తీసుకున్న విభజన నిర్ణయం శిలాశాసనం కాదన్నారు. తెలంగాణ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం మానకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విశాఖలో వచ్చే నెల 3, 4 తేదీల్లో అక్కడి పరిశ్రమల కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. సోమవారం 120 ప్రభుత్వ శాఖల జేఏసీ నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. -
సుష్మా వ్యాఖ్యలపై మండిపాటు
కాకినాడలో సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఎంపీలు పదవులకు రాజీనామా చేయక పోవడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు జెడ్పీ సెంటర్లో గుంజీలు తీసి నిరసన తెలిపారు. సమైక్య ఉద్యమంపై బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేసి, అగ్రనేతల బొమ్మలకు పేడ, మట్టి పూశారు. కార్యాలయంలో ఉన్న బీజేపీ నాయకులు బయటకొచ్చి దుర్భాషలాడడంతో ఆగ్రహంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకొని జేఏసీ జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్, ఉపాధ్యాయ జేఏసీ నేతలు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్ సహా 100 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన అనంతరం సొంత పూచీ కత్తుపై విడిచిపెట్టారు. రాజానగరంలో మహిళలు సుష్మా స్వరాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే సీమాంధ్రలో తిరగనివ్వబోమంటూ అమలాపురంలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. -
సమైక్య ఉద్యమం మరింత ఉద్ధృతం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. బంద్ కారణంగా వ్యాపార సంస్థలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. వాహనాలు తిరగలేదు. జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల ఉద్యోగులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వీధిదీపాలను ఆర్పివేసి నిరసన తెలిపారు. నరసన్నపేట, పోలాకిల్లో ఐకేపీ సిబ్బంది, స్వయంశక్తి సంఘాల మహిళలు మానవహారం నిర్వహిం చారు. ఎచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాల యంలో ప్రొఫెసర్ల, జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రణస్థలంలో రణభేరి కార్యక్రమం విజయవంతమైంది. శ్రీకాకుళంలో సమైక్యవాదులు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి దుకాణాలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు తెరవకుండా, వాహనాలు నడవకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటోలను నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. బంద్ కారణంగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పొట్టిశ్రీరాములు జంక్షన్ వద్ద సమైక్యాంధ్ర జేఏసీ సభ్యులు నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కూడలిలో మ్యాజిక్ షో నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద డీఎంహెచ్‌వో ఉద్యోగులు 101 కొబ్బరికాయలు కొట్టారు. పాలకొండలో భవన నిర్మాణ కార్మికులు మహా ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వేదిక వద్ద డివిజన్ విద్యార్థి జేఏసీ ప్రతినిధులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పాలకొండలో బంద్ విజయవంతమైంది. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్ద సి.ఎల్.నాయుడు పాఠశాల ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. వీరఘట్టంలో ఆర్సీఎం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. తలపై బిందెలు పెట్టుకొని నిరసన తెలిపారు. సీతంపేటలో బంద్ విజయవంతమైంది. ఇక్కడ చిన్నారులు చిన్న సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. భామిని మండలం నేరడి-బిలో ఉద్యమకారులు జలాభిషేకం నిర్వహించారు. బాలేరులో వృద్ధులు ఆందోళనలో పాల్గొన్నారు. నరసన్నపేటలో ఉద్యమకారులు చేపట్టిన 72, 78 గంటల నిరాహార దీక్షలు ముగిశాయి. సమైక్యవాదులు కేంద్రప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. జలుమూరులో స్వయంశక్తి సంఘాల మహిళలు, పీఏసీఎస్ ప్రతినిధి రిలే దీక్షలో పాల్గొన్నారు. తిలారు జంక్షన్ వద్ద పలు విద్యా సంస్థల వారు మానవహారం నిర్వహించారు. పోలాకి మండలంలో స్వయంశక్తి సంఘాల సభ్యులు రిలే దీక్షలో పాల్గొన్నారు. సారవకోటలో పలువురు నాయకుల మాస్క్‌లతో సోనియా గాంధీకి భజన చేశారు. సమైక్య ఉద్యమం ప్రారంభమై 60 రోజులు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు 60 ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. పలాసలో ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 38వ రోజుకు, టీడీపీ రిలే దీక్షలు 34వ రోజుకు, ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు 26వ రోజుకు, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 54వ రోజుకు చేరాయి. దళిత సంఘాల రిలే దీక్షలు 3వ రోజుకు చేరాయి. టెక్కలిపట్నంలో రిలే దీక్షలు 28వ రోజుకు, మందసలో రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. బంటుకొత్తూరులో గ్రామస్తులు వంటావార్పు చేసి నిరసన తెలిపారు.వజ్రపుకొత్తూరు, చినకొత్తూరు, కిడిసింగి, అక్కుపల్లి, చినవంక, కొండవూరు, మంచినీళ్లపేటల్లో ర్యాలీలు నిర్వహించారు. అంబుగాం గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, కుశాలపురం జంక్షన్ వద్ద ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రాజాంలో దేవాంగ కులస్తులు దేవాంగ గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డుపై రాట్నం వడికి చీరలు నేశారు. అరగంటసేపు ట్రాఫిక్‌ను స్థంబింపజేశారు. వివిధ వేషధారణలతో నిరసన గళాన్ని వినిపించారు. ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో వేర్వేరుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆమదాలవలసలో శిష్టకరణాలు ర్యాలీ, మానవహారం చేపట్టారు. పట్టణ జేఏసీ ప్రతినిధులు ధర్నా చేశారు. సరుబుజ్జిలిలో ఉపాధ్యాయులు కవిసమ్మేళనం నిర్వహించారు. టెక్కలి జేఏసీ శిబిరంలో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. దుర్గా మల్లేశ్వర భజన బృందం సభ్యులు సమైక్య గీతాలను ఆలపించారు. ప్రజా చైతన్య కళా సమితి సభ్యుడు రమణారావు హరికథా గానం చేశారు. సంతబొమ్మాళి మండలం గొదలాంలో గ్రామస్తులు ర్యాలీ చేశారు. వీరాంజనేయ వ్యాయామ మండలి సభ్యులు రోడ్డుపైనే వెయిట్ లిప్టింగ్ పోటీలు నిర్వహించి నిరసన తెలిపారు. కోటబొమ్మాళిలో ఎన్జీవో, పాత్రికేయ, జేఏసీ ప్రతినిధులు ర్యాలీ చేపట్టారు. -
వారిది సమైక్య ఆకాంక్ష.. ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి
టెక్కలి, న్యూస్‌లైన్: సాధారణ రోజుల్లోనే అధికారుల కళ్లుగప్పో.. అమ్యామ్యాలు సమర్పించుకునో అక్రమ రవాణా సాగించే వారికి.. సమైక్యాంధ్ర ఉద్యమం ఆయాచిత వరంగా మారింది. అన్ని శాఖలతోపాటు మైన్స్ సిబ్బంది, అధికారులు కూడా సమ్మెలో ఉండటంతో అక్రమ రవాణాదారుల పంట పండింది. తనిఖీలు లేవు.. నిబంధనలు పట్టించుకునేవారూ లేదు. రాజమార్గాల్లో గ్రానైట్, ఇసుక రవాణాకు గేట్లు బార్లా తెరుచుకున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద సరిహద్దు దాటుతుండగా.. లక్షల్లో సర్కారు ఖజానాకు కన్నం పడుతోంది. పోలీసులు సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ వారికి అందాల్సినవి అందిపోతున్నాయి. అతి కీలకమైన హౌరా-చెన్నై జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతోపాటు.. ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో శ్రీకాకుళం జిల్లాలో అతి విలువైన అక్రమ రవాణా జోరు పెరిగింది. మామూలు రోజుల్లోనే రాత్రి వేళల్లో జరిగే ఈ అక్రమ రవాణా ఇప్పుడు పగటిపూట కూడా యథేచ్ఛగా సాగుతోంది. నిరంతర తనిఖీలతో అక్రమ రవాణాను అరికట్టాల్సిన గనుల శాఖ అధికారులు, సిబ్బంది సమ్మెలో ఉండటంతో అక్రమార్కులకు జాతీయ రహదారే రాజమార్గంగా మారింది. శ్రీకాకుళం, పొందూరు, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, మెళియాపుట్టి, నందిగాం, పలాస, కంచిలి తదితర మండలాల నుంచి విలువైన గ్రానైట్ బ్లాకులు ఎటువంటి పర్మిట్లు లేకుండానే ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. వీటి కంటే ఎక్కువ పరిమాణంలో బ్లాకులు క్వారీల నుంచి నేరుగా స్థానిక కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లకు చేరుతున్నాయి. ఈ వ్యవహారాలన్నింటికీ ఖచ్చితంగా మైన్స్ ఏడీ అనుమతులు, పర్మిట్లు అవసరం. కానీ సమ్మె కారణంగా పర్మిట్లు లేకుండానే తరలించేస్తున్నారు. ఈ విధంగా గత నెలన్నర రోజుల్లో సుమారు 5 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ తరలిపోయిందని అంచనా. దీనితోపాటు నిర్మాణాలకు అవసరమైన ఇసుక అక్రమ రవాణా కూడా బాగా పెరిగింది. నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, మెళియాపుట్టి తదితర మండలాల్లో వంశధార నదీలోని ఇసుకను రాత్రి వేళల్లో లారీల్లోకి ఎక్కించి అక్రమంగా తరలిస్తున్నారు. సమ్మెలో లేని పోలీసులు మామూళ్లు దండుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లాలో తయారవుతున్న అల్యూమినియం వస్తువుల అక్రమ రవాణా సైతం జోరుగానే సాగుతోంది. టె క్కలికి చెందిన ఓ వ్యాపారి ఎచ్చెర్ల, టెక్కలిలో ఉన్న తన ఫ్యాక్టరీల నుంచి సరుకులను రాత్రి వేళల్లో ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు సన్న బియ్యాన్ని ఒడిశాలోకి తరలిస్తుండగా.. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమ మద్యం పెద్ద ఎత్తున జిల్లాలోకి తరలివస్తోంది. సమ్మెతో తనిఖీలు నిల్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర జిల్లాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మిన హా మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సుమారు నెలన్నర రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వాణిజ్య పన్నులు, మైన్స్, రవా ణా, రెవెన్యూ, విజిలెన్స్ తదితర శాఖలు కూడా సమ్మెలో ఉండటంతో వాటి అనుమతులు పొందేందు కు అవకాశం లేదు. అయితే రవాణా మాత్రం ఆగడం లేదు. కోట్లాది రూపాయల విలువైన ఖని జాలు, ఇతరత్రా వస్తుసామగ్రి సరిహద్దులు దాటుతూ ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. గ్రానైట్ వ్యాపార కేంద్రంగా ఉన్న టెక్కలిలోనే అత్యధికంగా అక్రమ మైనింగ్‌తో పాటు బ్లాకుల తరలింపు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమచారం. ఒకవైపు ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు పనులు, జీతాల్లేకుండా ఉద్యమాలు చేస్తుంటే.. అక్రమ వ్యాపారులు మాత్రం కాసుల పంట పండించుకుంటున్నారు. -
రణస్థలం రణభేరి విజయవంతం
రణస్థలం, రణస్థలం రూరల్, న్యూస్‌లైన్: రణస్థలంలో శనివారం సమైక్య భేరి మోగింది. సమైక్యాంధ్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, ముస్లింలు, క్రైస్తవులు స్వచ్ఛందగా తరలివచ్చి రణస్థలం రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉదయూన్నే జాతీయరహదారిపై బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు సమైక్య యూగం చేశారు. అనంతరం రణభేరి వేదికపై మండలానికి చెందిన సర్పంచ్‌లు సమైక్య ప్రతిజ్ఞ చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు తహశీల్దార్ పి.రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే ఊపిరిగా పోరాటం సాగిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను విడిచిపెడితే రెండు తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఒకసారి మద్రాస్, మరోసారి కర్నూల్ రాజధానులను వదులుకుని తీవ్రంగా నష్టపోయామన్నారు. జిల్లా జేఏసీ కార్యదర్శి జామి భీమశంకర్ మాట్లాడుతూ ఉద్యమాలకు శ్రీకాకుళం జిల్లా పుట్టినిల్లన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై దిగ్విజయ్‌సింగ్ చేస్తున్న విమర్శలు మానుకోవాలన్నారు. సీనియర్ పాత్రికేయుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉన్న హైదరాబాద్ ను వదులుకుంటే భావితరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ప్రొఫెసర్ విష్ణుమూర్తి, సమైక్యాంధ్ర విద్యార్థి రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు వి.ప్రకాష్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధి దుప్పల వెంకటరావు, సీపీఓ అప్పలనాయుడు, అంబేద్కర్ విశ్వ విద్యాలయం విద్యార్థి జేఏసీ నర్సునాయుడు, బాలి రామినాయుడు తదితరులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర వాదాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించడంలో మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారన్నారు. రాజకీయ నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారని, రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్నార న్నారు. వీరిని రాష్ట్ర ద్రోహులుగా గుర్తించి ప్రజలందరూ సహాయ నిరాకరణ చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సమైక్య సాంస్కతిక ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమానికి హాజరైనవారికి బొంతు అప్పలనాయుడు, నారాయణశెట్టి శ్రీనువాసరావు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గొర్లె కిరణ్‌కుమార్, కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక జేఏసీ సభ్యులు డి.గోవిందరావు, బలివాడ శ్రీనివాసరావు, వేదుల రామకృష్ణ, బోంతు అప్పలనాయుడు, డి.శ్యాంసన్కుమార్, జి.వేణుగోపాలరావు, పున్నాన నరిసింహులునాయు డు, బోడ్డేపల్లి రవికుమార్, జి.చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అలుపెరగని యోధులు
గుంటూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యతో సీమాంధ్ర ఎడారిగా మారనుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు లేక పొలాలు రోడ్లుగా మారతాయని చెబుతూ సమైక్యవాదులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం 60వ రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మంగళగిరిలో ఆదర్శ రైతుల ప్రదర్శన చేసి రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. దుగ్గిరాలలో ఉపాధ్యాయులు ప్రదర్శన చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. నరసరావుపేటలో అధ్యాపకులు వాహనాలు తుడుస్తూ నిరసన తెలిపారు. తెనాలిలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. బాపట్లలో పాత బస్టాండు వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు. యడ్లపాడు మండలం బోయపాలెం డైట్ కళాశాల విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. మాచర్లలో ముదిరాజ్‌సంఘ నాయకుల ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయాలను బంద్ చేయించి, రాస్తారోకో నిర్వహించారు. గుంటూరులో... విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం వద్ద జూనియర్ కళాశాలల అధ్యాపకులు చెవిలో పూలు, కళ్లకు గంతలు కట్టుకుని ఆకులు తింటున్న విధంగా సీమాంధ్ర ఎంపీల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి హిందూకళాశాల సెంటర్ వరకు ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించి, అనంతరం 60 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కలెక్టరేట్ ఎదుట పంచాయతీరాజ్ ఉద్యోగులు వంటావార్పు, సహకార ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. -
సేవలకు సెలవు !
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి దిగడంతో సేవలన్నీ బంద్ అయ్యాయి. విభజన ప్రకటనను నిరసిస్తూ జిల్లా ఆం దోళనలతో అట్టుడుకుతోంది. మంగళవారం జిల్లాలో మెడికల్ జాక్ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యశాలలన్నీ మూతబడడంతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు క్యూకట్టారు. తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద వెద్యం కోసం రోగులు పడికాపులు కాశారు. సమై క్యాంధ్రకు మద్దతుగా చిన్నాపెద్దా, ఊరూవాడా తే డా లేకుండా రైతులు, కార్మికులు, వ్యాపారులు, న్యాయవాదులు, టీచర్లు, వైద్యులు, వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల వారు, మహిళా సం ఘాలు, కళాకారులు, హిజ్రాలు, వికలాంగులు రో డ్డెక్కారు. ఉద్యోగులు జీతాలు వదులుకుంటే.. కార్మికులు రోజు కూలీని, కోట్ల రూపాయల వ్యాపారాలను త్యజించి వ్యాపారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాసేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అభివృద్ధి, పాలనాపరమైన కార్యక్రమాలకు సంబంధించి ఫైళ్లన్నీ పేరుకుపోతున్నాయి. మంగళవారం మెడికల్ జాక్ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యశాలలు మూతబడడంతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు క్యూకట్టారు. అక్కడా వైద్యులు అంతంత మాత్రంగా ఉండడంతో రోగులు ఇబ్బందిపడ్డారు. రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 1,350 ఆర్టీసీ బస్సు సర్వీసులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. తిరుమలకు వెళ్లే బస్సులను కూడా రెండు రోజుల పాటు బంద్ చేశారు. ఫలితంగా ఆర్టీసీ బస్ డిపోలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. 37 రోజులుగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ఇప్పటికి రూ.40 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. బస్సులు తిరక్కపోవడంతో శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనం కరువవుతోంది. ఫలితంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పడిపోతోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు కూడా భక్తులు లేక బోసిపోతున్నాయి. కలెక్టరేట్ ఖాళీ.. ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటున్నారు. ఫలితంగా కలెక్టరేట్, జేసీ, ఏజేసీ, పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. అధికారులెవరూ కార్యాలయాలకు రాకపోవడంతో గ్రీవెన్స్ సెల్ వెలవెలబోతోంది. ప్రజాప్రతినిధులు సహా ఎవరూ కలెక్టర్ కార్యాలయం ముఖం చూడడం లేదు. ట్రెజరీ, సంక్షేమ శాఖ కార్యాలయాలు, డీఆర్డీఏ, డ్వామా, సమాచార శాఖ కార్యాలయాల్లో సేవలన్నీ స్తంభించాయి. జ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. జిల్లా పరిషత్ ప్రాంగణానికి తాళాలు వేయడంతో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పీఐయూ, సబ్ డివిజన్ కార్యాలయాలు, జెడ్పీ కార్యాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం బోసిపోయి కనిపిస్తోంది. పాలన పడకేసింది పల్లె పాలనా వ్యవహారాలను చూసే మండల పరిషత్ కార్యాలయాలన్నీ బోసిపోవడంతో పల్లెల్లో సమస్యలు పేరుకుపోయాయి. అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేసేందుకు కూడా ఎవరూ రావడం లేదు. పంచాయతీ కార్యాలయాలు, పశు వైద్యశాలలకు తాళాలు వేశారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి మున్సిపల్ సిబ్బంది కూడా నిరవధిక సమ్మెలో ఉన్నారు. 29 సేవలకు సంబంధించిన 3,500 మంది ఉద్యోగులు ఆయా కార్యాలయాల ముందు బైఠాయించి సమైక్య గళం వినిపిస్తున్నారు. పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణ కార్మికులు విధుల్లో ఉన్నప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ‘మీ-సేవ’ ద్వారా అందించే సేవలకూ ఆటంకం ఏర్పడింది. ఇబ్బందులు తప్పకున్నా, ప్రజలంతా సమైక్యాంధ్రే తమ ధ్యేయమని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. -
మంత్రిగారూ.. ఇంత చాటేలా!
నరసాపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయంపై స్పష్టమైన సమాధానం చెప్పలేక ప్రజాప్రతినిధులు ప్రజల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఒకవేళ పనిమీద పట్టణానికి వచ్చినా హడావిడి లేకుండా సెలైంట్‌గా వచ్చి పని ముగించుకుని చల్లగా జారుకుంటున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ శనివారం నరసాపురానికి చాటుగా వచ్చి.. సమైక్యవాదులకు కనిపించకుండా సెలైంట్‌గా వెళ్లిపోయారు. పట్టణంలోని పొన్నపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ వల్లభూని లక్ష్మణరావు ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మంత్రి పట్టణానికి వచ్చారు. ఎప్పుడూ అంబేద్కర్ సెంటర్ నుంచి పట్టణానికి వచ్చే ఆయన అక్కడ సమైక్యవాదులు అడ్డుకుంటారేమోనని, చుట్టూతిరిగి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా అదే మార్గంలో వెళ్లిపోయారు. బుగ్గకారు సెరైన్ గాని, ఇతర హడావిడి గానీ లేకుండా పితాని జాగ్రత్తపడ్డారు. మంత్రి రాక విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా బయటకు పొక్కనీయలేదు. మంత్రి తీరుపై సమైక్య వాదులు మండిపడుతున్నారు. ప్రజలకు దొరక్కుండా ఇంకెంత కాలం ఇలా తిరగగలరని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. -
ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న ఆటోవాలాలు
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాకుగా చేసుకుని ఆటోవాలాలు, ప్రైవేటు వాహనాల నిర్వాహకులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సుమారు నెల రోజుల నుంచి డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికుల జేబులకు కత్తెరపడుతోంది. ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు చార్జీలను పెంచేశారు. దూరంతో సంబంధం లేకుండా రెండు, మూడు రెట్ల చార్జీలు వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసర పనులపై ప్రయాణం తప్పనిసరైన వారికి చేతిచమురు వదులుతోంది. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదారులు ఆడింది ఆటగా పాడింది పాటగా మారింది. పోటీపడి వాహనాలను అతివేగంగా నడపడమే కాకుండా, వాహనాల్లో ప్రయాణికులను కూరుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు రూ.41 కాగా, ఆటోవాలాలు రూ.60 నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు ముందు ఏలూరు వైపు నుంచి జంగారెడ్డిగూడెం వైపు ఆటోలు తిరిగేవి కావు. ఇప్పుడు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వరకూ ఆటోలు నడుపుతూ రూ.80 వసూలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆటోవాలాలు రూ.60 వసూలు చేస్తున్నారు. దీంతో జంగారెడ్డిగూడెంవైపు నుంచి ఏలూరువైపు ఆటోలు రాకుండా ఏలూరుకు చెందిన ఆటోవాలాలు అడ్డుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కామవరపుకోట ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు రూ.11, తడికలపూడికి రూ.22 కాగా, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు రూ.25, రూ.45 వసూలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేటకు బస్సు చార్జీ రూ.21 కాగా, ఆటోవాలాలు రూ.60 నుంచి రూ.80 వసూలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రికి రూ.80 చెల్లించాల్సి వస్తోంది. లోకల్ చార్జీలు, పరిసర గ్రామాలకు కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. గతంలో కనీసం చార్జి రూ.7కాగా, ఇప్పుడు రూ.15కు చేరింది. ప్రైవేట్ బస్సులు, స్టేజ్ క్యారియర్లు ప్రయాణికులను భారీగా దోచుకుంటున్నాయి. జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్‌కు హైటెక్ బస్సుకు రూ.340 కాగా, ప్రైవేట్ బస్సులకు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. రద్దీగా ఉన్న రో జుల్లో ఈ చార్జీ ఇంకా ఎక్కువగా ఉంటోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు వాహనదారుల ఇష్టారాజ్యంగా మారింది. -
బీజేపీపై ఒత్తిడి పెంచి విభజనను అడ్డుకోవచ్చు
తణుకు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే విభజన ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందని, సమైక్యవాదులు ఆ పార్టీపై ఈమేరకు ఒత్తిడి తీసుకురావటం ద్వారానే అది సాధ్యమవుతుందని సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు అన్నారు. శనివారం ఆయన తణుకులో విలేకరులతో మాట్లాడారు. 42 పార్లమెంటు స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఏమాత్రం మద్దతు లేకుండా నరేంద్ర మోడి 2014లో ఎలా ప్రధాని కాగలరో ఆ పార్టీ నాయకులు, కొత్తనాయకత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలు సంతోషంగా ఉంటేనే బిల్లును ఆమోదిస్తామని బీజేపీ చెప్పటంద్వారా విభజన ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. తెలంగాణ విభజనకు బీజేపీ మొగ్గుచూపినా పోత్తులు లేకుండా ఆ పార్టీకి రాష్ట్రంలో కలిసోచ్చే అంశమేమి లేదన్నారు. తాగునీటి ఇక్కట్లు నిత్యకృత్యం రాష్ట్రం రెండుగా విడిపోతే గోదావరి జిల్లాలు ఎడారిగా మారుతాయని పెంటపాటి పుల్లారావు ఆందోళన వ్యక్తం చేశారు. 854 కిలోమీటర్లు గల గోదావరి మన ప్రాంతానికి వచ్చేసరికి 40 కిలో మీటర్ల మేరే ప్రవహిస్తోందన్నారు. ఇక్కడ గోదావరికి అదనంగా నీరుతెచ్చే ఉపనదులు ఏమీ లేనందున, జలాలు స్టోరేజి చేసే సదుపాయాలు లేకపోవటంతో ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా మారిపోతుందన్నారు. 1948 వరకు కలిసున్న భద్రాచలం ప్రాంతాన్ని 1960లో ఖమ్మంలో కలిపారని దీనివల్ల 30కిలో మీటర్లు పరిధిలోని గోదావరిని కోల్పోయామన్నారు. తెలంగాణ విభజన జరిగితే చుక్కనీరుకూడా మనకు రాదని అందువల్ల తాగునీటి ఇక్కట్లు గోదావరి వాసులకు నిత్యకృత్యమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల ఉద్యమంగా సాగుతున్నదని దీనికి అన్నివర్గాలు సహకరించి ఉధృతం చేయటంద్వారానే విభజన ప్రక్రియ నిలుస్తుందని తెలిపారు. సమావేశంలో వంటెద్దు సోమసుందర్రావు, రాజా, గట్టెం మాణిక్యాలరావు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకోం
మార్టూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఉద్యోగులు, విద్యార్థులు హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మార్టూరులో గురువారం మహాగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్టూరు తహ సీల్దార్ సుధాక ర్‌బాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్రలో ఉన్న ప్రజలందరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె.వెంకట్రావు మాట్లాడుతూ సీమాంధ్ర రాజకీయ నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పదవులకు రాజీనామా చేయకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఏపీ ఎన్జీవో సభకు హెదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేసినా సీమాంధ్ర రాజకీయ నాయకులు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారిపై భారీ ర్యాలీ మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తొలుత సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆకారంగా ఏర్పడ్డారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. జై సమైక్యాంధ్ర.. నినాదంతో జాతీయ రహదారి మార్మోగింది. గన్నవరం సెంటర్ నుంచి నాగరాజుపల్లి సెంటర్ వరకు వర్షంలో ర్యాలీ కొనసాగింది. తర్వాత గన్నవరం సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం కళాకారులు కోలాటం ప్రదర్శించారు. ఎన్సీసీ విద్యార్థులు సమైక్యాంధ్ర కోసం రోడ్డుపై కవాతు చేశారు. మూతపడిన దుకాణాలు మార్టూరు మహాధర్నా కారణంగా దుకాణాలన్నీ మూతపడ్డాయి. సుమారు గంటపాటు జాతీయ రహదారిపై ధ ర్నా జరగటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కార్యక్రమంలో మార్టూరు, బల్లికురవ ఎంఈవోలు కిషోర్‌బాబు, నాగేశ్వరరావు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు గోపి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు, వ్యవసాయశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సాయి చిహ్నిత, హర్షిణి, రాయల్ కాలేజీ, రాయల్ స్కూల్, శ్రీనివాస స్కూల్, కాకతీయ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. -
విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి నుంచి జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులందరూ సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటికే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు, సమైక్య రాష్ట్రంపై కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో 72 గంటల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు. తమ సిమ్‌కార్డులు సైతం అధికారులకు అందించారు. ఈ మేరకు బుధవారం స్థానిక కర్నూలు రోడ్డులోని సబ్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులంతా సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి పలు ఆందోళనలు నిర్వహించామని, అలాగే సమ్మెలోకి వెళ్తామని పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చామని తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించని కారణంగానే నేటి నుంచి 72 గంటల సమ్మెలోకి వెళ్తున్నట్లు చెప్పారు. జేఎల్ఎం స్థాయి ఉద్యోగి నుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ సమ్మెలోకి వస్తారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1500 మంది డిపార్టుమెంట్ ఉద్యోగులు, 1200 కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి మొత్తం 2700 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగుల సమ్మె వల్ల విద్యుత్ సరఫరాకు కలిగే అంతరాయాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలన్నదే తమ ఏకైక నినాదం అని వివరించారు. గత 60 ఏళ్లలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేసిన సందర్భాలు లేవని, ప్రస్తుత సమ్మెకు పూర్తిగా ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. నెల రోజులుగా జీతాలు లేకుండా సమ్మె చేస్తున్న ఉద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని చెప్పారు. అలాగే నేటి నుంచి స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఎన్ జయాకరరావు, కన్వీనర్ టి సాంబశివరావు, స్టాలిన్‌కుమార్, శివప్రసాద్, నరశింహారావు, ఉదయ్‌కుమార్, బీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల కోసం రౌండ్ ది క్లాక్ సేవలు సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో డిస్కం పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై.దొర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆయా జిల్లాల పరిధిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లోడ్ మోనటరింగ్ సెల్ (ఎల్ఎంసి)కు ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలోని విద్యుత్ వినియోగదారులు 9440817491 నంబర్‌కు ఫోన్ చేయవ చ్చని వెల్లడించారు. కార్పొరేట్ ఆఫీసులో ఉన్న 9440814319కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. -
విభజనతో రాష్ట్రం అల్లకల్లోలం
మార్కాపురం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ఆర్ జీవించే ఉంటే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర మంగళవారం రాత్రి మార్కాపురం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని వైఎస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ మరణంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిం దన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై జననేత జగన్మోహన్రెడ్డిని జైళ్లో పెట్టించి విభజనకు కుట్రలు పన్నాయని విమర్శించారు. మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించే హక్కు కాంగ్రెస్, టీడీపీలకు ఎవరిచ్చారని ప్రశ్నించా రు. టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు తక్షణమే రాజీనా మా చేసి ఉద్యమంలోకి రావాలని కోరారు. వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. విభజనతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు అందక సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర మంత్రులు వెంటనే రాజీనామా చేస్తే కేంద్రంపై వత్తిడి పెరిగి విభజన ప్రక్రియ ఆగిపోతుందని స్పష్టం చేశారు. ఉడుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ చేస్తున్న పోరాటాలకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంత ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాజీనామా డ్రామాలాడుతూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సహకరించిన చంద్రబాబు.. ఇప్పుడు సీమాంధ్రులను మోసం చేసేందుకు యాత్ర పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ విభజన ప్రకటన వచ్చిన తర్వాత ఏపీ ఎన్జీఓలు సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబును కోరితే హామీ ఇవ్వకుండా..కొత్త రాష్ట్రంతో రాజధానికి రూ. 4 లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేసి, ఇప్పుడు యాత్రల పేరుతో ఎలా తిరుగుతున్నాడని ప్రశ్నించారు. మరో సమన్వయకర్త వై.వెంకటేశ్వరావు మాట్లాడుతూ విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సోనియా, చంద్రబాబులు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి కపట నాటకాలు ఆడుతున్నారన్నారు. అందరు ఐక్యంగా సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ సీపీ చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అంధించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఓదార్పుయాత్రలో జగన్‌పై చూపిన ప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కాటం అరుణమ్మ, మాజీ ఎమ్మెల్యేలు గరటయ్య, దారా సాంబయ్య, నాయకులు ఉడుముల లక్ష్మీనారాయణరెడ్డి, వైఎస్ఆర్ సీపీ యూత్ జిల్లా కన్వీనర్ కె.వి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒకే మాట.. ఒకటే బాట
కాంగ్రెస్ పార్టీ రేపిన రాష్ట్ర విభజన జ్వాల 40 రోజులు కావస్తున్నా ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ‘పశ్చిమ’ ప్రజలు హస్తిన పెద్దలపై కళ్లెర్రజేస్తున్నారు. ఎన్జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లినా జిల్లాలో ఉద్యమ వేడి ఏ మాత్రం తగ్గలేదు. అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మార్మోగించారు. ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో ఎవరిని కదిపినా ‘సమైక్యాంధ్ర’ అంటున్నారు. ఉద్యమ పథమే తమ బాట అని ఘంటాపథంగా చెబుతున్నారు. లక్ష్యాన్ని సాధిం చేందుకు కడవరకూ పోరాడతామని విస్పష్టంగా చెబుతున్నారు. 39వ రోజైన శనివారం కూడా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున సాగారుు. వేలాది ఉద్యోగులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు తరలివెళ్లినా ఆందోళన కార్యక్రమాల్లో ఆ లోటు ఎక్కడా కని పించలేదు. ఏపీ ఎన్జీవోల ఉద్యమానికి మద్దతుగా తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు పట్టణాలతోపాటు దేవరపల్లి, సిద్ధాం తం, గుమ్ములూరు గ్రామాల్లో శనివా రం చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. ఏలూరు శ్రీశ్రీ విద్యార్థులు ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించి ‘జై సమైకాంధ్ర’ అక్షర రూపంలో కూర్చున్నారు. తూర్పుకాపు విద్యా, విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంట ర్లో మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో స్వర్ణకారులు, బం గారు వ్యాపారులు త్రివర్ణ బెలూన్లు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ముస్లింలు రిలే దీక్షలో పాల్గొన్నారు. అక్కడే నమాజు చేశారు. తణుకు మండలం దువ్వలో రైతులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అత్తిలిలో ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. ఇరగవరం, తూర్పువిప్పర్రులో నిరాహార దీక్షలు కొనసాగాయి. భీమవ రం కాకతీయ స్కూల్ విద్యార్థులు ప్రకా శం చౌక్‌లో మానవహారం నిర్మించారు. జీవీఐటీ ఇంజినీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రిక్షాలు తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆదిత్య స్కూల్ ఉపాధ్యాయులు ఏసుక్రీస్తు, అల్లా, బ్రహ్మ, వివేకానంద, పుట్టపర్తి సాయిబాబా వేషధారణలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వీరవాసరంలో ఉపాధ్యాయులు మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు మానవహారం నిర్మించారు. పాలకొల్లులో న్యాయవాదులు మౌన ప్రదర్శన చేశారు. బ్రాహ్మణగూడెం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జంగారె డ్డిగూడెంలో రైతులు రాస్తారోకో చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సుకు తెలంగాణ వాదులు ఆటంకం కల్గిస్తే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటామని నరసాపురంలో ఆరుగురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మునిసిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కడంతో ఉత్కంఠ ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నాలుగు గంటల అనంతరం వారు దిగివచ్చారు. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామస్తులు ఉదయం 6నుంచి సాయంత్రం వరకు రాస్తారోకో చేశారు. బుట్టాయగూడెంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఒంటికాలితో జపం చేశారు. పెనుగొండలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేశారు. మార్టేరు వరి పరిశోధనా సంస్థకు చెం దిన 25 మంది శాస్త్రవేత్తలు సామూహిక సెలవు పెట్టి నిరసన తెలిపారు. కొవ్వూరు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో స్వర్ణాంధ్ర కళాశాల విద్యార్థులు కూర్చున్నారు. ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి, రోడ్డుపై ఆటలు ఆడారు. వైఎస్ కుటుంబం స్ఫూర్తితో... నరసాపురం బస్టాండ్ సెంటర్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మ దీక్షల స్ఫూర్తితో సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు 17వ రోజుకు చేరారుు. వీరవాసరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దెందులూరు మండలం గాలాయగూడెంలో వైఎస్సార్ సీపీ నాయకుడు ముసునూరి సీతారామయ్య ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగించారు. తాడేపల్లిగూడెం పోలీ స్ ఐలండ్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన పార్టీ కార్యకర్తలు శనివారం రిలే దీక్షలో పాల్గొన్నారు. -
సమైక్యమే శ్వాసగా
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో హోరెత్తుతోంది. సమైక్యమే శ్వాసగా సింహపురి వాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రోజురోజుకూ ఉద్యమతీవ్రతను పెంచుతున్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన గళం వినిపించిన ఉద్యోగులు శనివారం హైదరాబాద్‌లో జరగనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తరలివెళ్లారు. ఉద్యమానికి మద్దతుగా జర్నలిస్టులు ర్యాలీలు నిర్వహించారు. మొత్తం మీద జిల్లాలో 38వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు లెక్చరర్లు రిలేదీక్షలు చేశారు. వీఎస్‌యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాన బస్టాండ్‌లో నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 1,500 మంది ఉద్యోగులు 25 బస్సుల్లో హైదరాబాద్‌కు వెళ్లారు. కేంద్ర మంత్రుల ఫొటో మాస్క్‌లు ధరించిన వారికి తెలుగు మహిళ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్లో సీమంతం చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో గంగవరం వా సులు నిరాహారదీక్ష చేశారు. గూడూరులోని పాలిటెక్నిక్, సిరామిక్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకుడు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. టవర్‌క్లాక్ కూడలిలో పండరి భజనతో నిరసన తెలిపారు. జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమైక్య గర్జన జరిగింది. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలేదీక్ష జరి గింది. మొదట ఉపాధ్యాయులు జెడ్పీ పాఠశాల మీదుగా సత్రం సెంటర్ వ రకు ర్యాలీ నిర్వహించారు. నాయిబ్రాహ్మణులు పట్టణంలో ర్యాలీ చేశారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభి షేకం చేసిన అనంతరం ర్యాలీగా ము న్సిపల్ బస్టాండ్‌కు చేరుకున్నారు. అం బేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సోమశిల రోడ్డు సెంటర్లో మేళతాళాలతో నిరసన తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తుఫాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంతో పాటు పోస్టర్లను దహనంచేశారు. పొదలకూరులో ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. మనుబోలులోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఎంపీడీఓ, తహశీల్దార్, ఉద్యోగు లు రిలే దీక్షలో కూర్చున్నారు. కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గాంధీబొ మ్మ సెంటర్లో రిలేదీక్ష చేశారు. 14వ తేదీ నుంచి ఉద్యమంలో పాల్గొంటామని ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, టీ డీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర ప్రకటించారు. ఉదయగిరిలో పట్టణ వ్యాపారుల సం ఘం ఆధ్వర్యంలో బంద్, ర్యాలీ, రాస్తారోకో, వంటావార్పు జరిగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వింజమూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో రిలే దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. సీతారామపురంలో ఉద్యోగ జే ఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్ కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహ నం చేశారు. ముస్లింలు ర్యాలీ నిర్వహిం చారు. కలిగిరిలో రోడ్డుపై విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్తులు ఆటాపాటల తో నిరసన తెలిపారు. కొండాపురం త హశీల్దార్ కార్యాలయం ఎదుట రెవె న్యూ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్త లు రిలేదీక్షలు చేశారు. వరికుంటపాడు బస్టాండ్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. సూళ్ళూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో తుఫాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. బస్టాండు సెంటర్లో జేఏసీ ఆ ధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నా యి. వ్యవసాయాధికారుల ఆధ్వర్యం లో రైతులు ట్రాక్టర్లతో తడ తహశీల్దార్ కార్యాలయం నుంచి బజారు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చే శారు. మాంబట్టు వాసులు రిలేదీక్షలు చేపట్టారు. నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నా యి. వైఎస్ఆర్సీపీ నాయకురాలు నీరజమ్మ బస్టాండు సెంటర్లో రిలే దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. -
విభజన జరిగితే నెల్లూరు ఎడారే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సమైక్యాంధ్ర నినాదాలతో నెల్లూరు నగరం హోరెత్తింది. నగరంలోకి ప్రవేశించే అన్ని దారులు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం వైపే కదిలాయి. ఉరకలేసిన ఉత్సాహంతో సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని గొంతుగొంతూ కలుపుతూ నినాదాలు చేసుకుంటూ జనం తండోపతండాలుగా తరలివచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, కళాకారులు.. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లువీళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం సింహాలై గర్జించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైన జన సందోహం ఒక్కో మార్గం నుంచి ప్రదర్శనగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి పోటెత్తింది. సమైక్య సింహగర్జన సభ ముగిసిన తర్వాత కూడా వేలాది మంది స్వచ్ఛందంగా రావడం కనిపించింది. పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, వీధులు జనంతో కిటకిటలాటాయి. ఎటువైపు చూసినా జనంతో నిండిపోయాయి. సమైక్య పరిరక్షణ వేదిక పేరుతో జిల్లా అధికారుల సంఘం గురువారం నిర్వహించిన ‘ సమైక్య సింహగర్జన ’ జిల్లా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక అపురూప ఘట్టంగా నిలిచిపోనుంది. సింహగర్జన సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. సభకు లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ స్వయంగా పర్యవేక్షించారు. సింహగర్జన సభకు విస్తృత ప్రచారం కల్పించడంతో నగరంలోని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా మూసివేశారు. సభా ప్రాంగణం పరిసరాలు మినహా మిగిలిన ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి. ఎటుచూసినా కోలాహలం : సింహగర్జన సభకు హాజరయ్యేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది నగరానికి తరలి వచ్చారు. ట్రాక్టర్లు, లారీలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో జనం పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందుగానే వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అక్కడ నుంచి ఆయా బృందాలు ప్రదర్శనగా సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. తెలుగుతల్లి, జాతీయ నేతల వేషధారణలతో పాటు పలు రకాల విచిత్ర వేషధార ణలతో ప్రదర్శనగా రావడంతో కోలాహలం చోటు చేసుకుంది. అక్కడక్కడా డప్పు వాయిద్యాలతో సమైక్యవాదులు చిందులు తొక్కుతూ నినదించారు. నగరం నుంచి సభకు హాజరయ్యే వారి కోసం 15 కేంద్రాలను ఎంపిక చేసి అక్కడ నుంచే బయలుదేరే ఏర్పాట్లు చేశారు. దీంతో కలెక్టరేట్, ఆత్మకూరు బస్టాండ్, వీఆర్సీ సెంటర్, అయ్యప్పగుడి సెంటర్, మినీబైపాస్ రోడ్డు, ములుముడి బస్టాండ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వివిధ ఉద్యోగ సంఘాల సిబ్బంది, ప్రజాసంఘాలు ర్యాలీగా స్టేడియం చేరుకున్నాయి. ఈ ర్యాలీల్లోనూ విచిత్ర వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నృత్యాలు, నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం : సింహగర్జన సభా ప్రాంగణం సమైక్యవాదుల నృత్యాలు, నినాదాలతో దద్దరిల్లింది. సమైక్యాంధ్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ కళాకారులు పాడిన పాటలు సభకు హాజరైన వారిని ఉరకలెత్తించాయి. ‘ఆంధ్ర రాష్ట్రమా, సమైక్య రాష్ట్రమా ..నిన్నే ముక్కలు చేస్తే తల్లడిల్లిపోతాం’ అంటూ కళాంజలి ఆర్కెస్ట్రా అధినేత శ్రీనివాస చక్రవర్తి పాడిన పాట అందరి హృదయాలను దోచుకుంది. సభికుల విజ్ఞప్తి మేరకు ఇదే పాటను పలుమార్లు పాడారు. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా డ్యాన్సులు చేశారు. సభ నిర్వాహకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసిన సమయంలో హాజరైన వారు కూడా నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. వక్తల ప్రసంగాల సమయంలోనూ సమైక్యాంధ్ర ప్రాధాన్యతను వివరించినప్పుడు జనం నుంచి విశేష స్పందన కనిపించింది. వేదికపైన జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు డి. రామిరెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత మధుసూదన్‌రావు ఉన్నారు. వీరితో పాటు కళాకారులకు మాత్రమే వేదికపైన అవకాశం కల్పించారు. జాతీయ గీతాలాపనతో ముగింపు: లక్షలాదిగా హాజరైన సింగహగర్జన సభను జాతీయ గీతాలాపనతో ముగించారు. ఉదయం తొమ్మిది గం టల నుంచి జనం సభాప్రాంగణానికి చేరుకోవడం మొదలైంది. నిర్ణీత సమయానికి మైదానం మొత్తం జనంతో నిండిపోయింది. ఎండ ఎక్కువగా ఉండటంతో ప్రసంగాలకు ముందే వెళ్లిపోవడం కనిపించింది. ఒంటిగంట వరకు జరగాల్సిన సభను ముందుగానే ముగించారు. సభ ముగిసే సమయానికి కూడా వేలాదిమంది రావడం కనిపించింది. -
రగులుతున్న సెగ
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకి హోరెత్తుతోంది. 37వ రోజు గురువారం కూడా ఉద్యమ జోరు కొనసాగింది. తాడిపత్రిలో నిర్వహించిన లక్ష జన గళ ఘోషకు జనం పోటెత్తారు. సమైక్య నినాదంతో తాడిపత్రి మార్మోగింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఉపాధ్యాయులు దీక్ష శిబిరాల్లోనూ, రోడ్లపైనా వినూత్న రీతిలో నిర్వహించారు. ఈనెల 7న హైదరాబాద్‌లో తలపెట్టిన ఏపీ ఎన్జీవోల సమైక్య సభకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్లడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా సమైక్యవాదులు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 37 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమం కాగా.. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరచుకోలేదు. పాలన అస్తవ్యస్తమైనా పట్టువీడకుండా సమరంలో మమేకమవుతున్నారు. అనంతపురం నగరంలో పంచాయతీరాజ్ జేఏసీ, ఎన్జీవో, ఉపాధ్యాయ జాక్టో, అధ్యాపకుల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ, వాణిజ్యపన్నుల శాఖ, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సహకారశాఖ, రాజీవ్ విద్యామిషన్, మీసేవ ఉద్యోగులు గురువారం ర్యాలీలు నిర్వహించారు. న్యాయవాదులు బైక్ ర్యాలీ చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై దాడికి నిరసనగా ‘మనమంతా ఒక్కటే’ అని జిల్లా పశుసంవర్ధకశాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ తెలంగాణకు చెందిన డాక్టర్ శ్యాంమోహన్రావు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. శింగనమలలో నిర్వహించిన సమైక్యాంధ్ర సింహ గర్జనకు వేలాది మంది తరలివచ్చారు. సమరోత్సాహం నింపిన షర్మిల పామిడిలో గురువారం సకల జనుల సమైక్య గర్జనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమ వీరులకు అభినందనలు తెలిపిన షర్మిల.. ఉద్యమంలో కదంతొక్కే సమైక్యవాదులందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం సమైక్యవాదుల్లో సమరోత్సాహాన్ని నింపింది. పెద్దవడుగూరులో ముస్లింలు ప్రార్థనలు చేసి ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లులో సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యోగ జేఏసీ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. కదిరిలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గంలో న్యాయవాదులు పంచెకట్టుతో నిరసన ర్యాలీ చేశారు. సీమాంధ్ర మంత్రులకు సిగ్గు ఎగ్గు వుంటే పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తిప్పేస్వామి అన్నారు. ఐదు మండలాల నుంచి మాదిగ దండోరా నాయకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మడకశిరలో సమైక్యాంధ్ర నినాదం మారుమోగింది. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధాకర్‌కు సమైక్యవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజీనామా ఆమోదింపజేసుకుని ఉద్యమంలోకి రావాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశానని లేఖను చూపించినా వారు వినలేదు. అమరాపురంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఓడీచెరువులో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన, వంటావార్పు నిర్వహించారు. అమడగూరులో సర్పంచులు రిలే దీక్ష చేపట్టారు. పెనుకొండలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామస్తులు సామూహిక రిలే దీక్ష చేశారు. గోరంట్లలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో యాదవసంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా... వినాయక సర్కిల్లో హిజ్రాలు నృత్యం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో రిలే దీక్ష చేపట్టారు. ఆత్మకూరులో కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలకు దిగారు. ఉరవకొండలో ఉపాధ్యాయులు రోడ్డుపైనే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు. ధర్మవరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆటోవాలాలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో ఆర్టీసీ కార్మికులు, ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించారు. బాలయేసు కళాశాల విద్యార్థులు 500 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. హిందూపురంలో ఆర్డీఓ సమావేశాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్య ప్రకటన వెలువడేదాకా ఉద్యమం ఆగదని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు స్పష్టం చేశారు. హిందూపురం శివారు మోతుకపల్లి గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో ఎస్సీలు సమైక్య ర్యాలీ చేశారు. లేపాక్షిలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ర్యాలీ చేయగా, ఏపీఆర్ఎస్ విద్యార్థులు రోడ్డుపైనే ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. -
పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టాలి
జడ్చర్ల, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటకు సంబంధించిన పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జడ్చర్లలో ఎమ్మార్సీ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారన్న సాకుతో తెలంగాణ బిల్లులో జాప్యం చేయవద్దని కోరారు. బిల్లు ఆమోదంలో ఆలస్యం జరిగితే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వారవుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వోత్తమ్రెడ్డిలతో కూడిన పీఆర్టీయూ బృందం సోమవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. తెలంగాణ బిల్లును ఆలస్యం చేయకుండా పార్లమెంట్లో త్వరగా ప్రవేశపెట్టే విధంగా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, ఆంటోని, దిగ్విజయ్‌సింగ్, ప్రతి పక్ష నేత సుష్మాస్వరాజ్‌లను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ఇదివరకే 32రోజలు సమ్మె చేశామని, బిల్లును ఆలస్యం చేస్తే వంద రోజుల సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నా రు. ప్రత్యేక రాష్ట్రం వల్ల 1.50 లక్షల మంది ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌లో మార్పు జరుగుతుందని, విద్యావ్యవస్థ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులకు పదో పీఆర్సీ ని ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, జీపీఎఫ్‌కు సంబంధించి 40 జీఓను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాంమ్మోహన్,తదితరులు పాల్గొన్నారు. -
5న ప్రొద్దుటూరులో పొలికేక
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈనెల 5వ తేదీన ప్రొద్దుటూరులోని అనీబీసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ‘ప్రొద్దుటూరు పొలికేక’ నిర్వహించాలని జేఏసీ తీర్మానించింది. ఇందులో భాగంగా లక్షమందితో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, అర్బన్ సీఐ బాలిరెడ్డి నిర్వాహకులతో చర్చించారు. ఏర్పాట్ల గురించి తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి, ఎన్జీఓ అసోషియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ లక్ష్మిప్రసన్న, ప్రైవేటు విద్యా సంస్థల జిల్లా గౌరవాధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మాజీ కౌన్సిలర్ పోరెడ్డి నరసింహారెడ్డి, నాగేంద్రారెడ్డి, జేఏసీ నాయకులు రషీద్‌ఖాన్, రావుల సుధాకర్‌రెడ్డి, ఎన్జీఓ అసోషియేషన్ కోశాధికారి రఘురామిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఏర్పాట్లపై చర్చించారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ పొలికేకకు సాంస్కృతిక కార్యక్రమాలు, నీటి సరఫరా, ఆరోగ్యం, ప్రచార కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, స్టేజీ ఏర్పాట్లకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 15 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడ్వైజరీ కమిటీలో తనతోపాటు మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, ఎంఈఓ ఉన్నారన్నారు.