
5 సార్లు వందేమాతరం గీతాలాపన
5 సార్లు వందేమాతరం గీతాలాపన
పెదపాడు, : సమైక్యాంధ్ర కోసం ప్రజలు, నాయకులు, ఉద్యోగులు విశేషంగా పోరాడుతున్నా కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు అన్నారు.
మండలంలోని జేఎంజే ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం వందేమాతర గీతాన్ని 5సార్లు ఆలపించారు. సుమారు మూడు వేల మంది విద్యార్థులు గీతాన్ని ఆలపించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.