కేబినెట్ నోట్‌తోనే సంబరపడొద్దు
Published Fri, Oct 11 2013 1:10 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర కేబినెట్ నోట్‌తోనే సంబరపడొద్దని జేఏసీ నాయకులు, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి బూర మల్లేశం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల ప్రజలకు సీమాంధ్రుల దోపిడీ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పాత బస్టాండు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 1,376వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందే వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పుల్లూరు మధిర బండచెర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా పొదుపు సంఘం సభ్యులు బూసాని వెంకటలక్ష్మి, బాలమణి, శశికళ, పద్మ, కమల, అరుణ, ప్రమీల, నర్సవ్వ, మల్లవ్వ, రాజవ్వ, రాజమణి, పోశవ్వ, మంగ, వీరమణి తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి పలువురు జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
Advertisement
Advertisement