వెళ్లాల్సింది ప్రజలు కాదు.. పెట్టుబడిదారులే
Published Thu, Oct 3 2013 11:47 PM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్:తెలంగాణను వదిలిపెట్టి పోవాల్సింది సీమాంధ్ర ప్రజలుకాదని, సీమాంధ్ర ప్రాంతం పెట్టుబడిదారులేనని స్థానిక ఎమ్మెల్యే కేఎల్లార్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని, ఇక పరిపాలన విభజన మాత్రమే జరగాల్సి ఉందన్నారు. ఘట్‌కేసర్‌లోని బస్‌టెర్మినల్ ఎదురుగా సర్పంచ్ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఘట్‌కేసర్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీచేస్తున్న నేపథ్యంలో ఆయన రెండు పార్టీల కండువాలు వేసుకుని ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అబ్బసాని యాదగిరి యాదవ్ విజయానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేసి యాదగిరిని గెలిపించాలన్నారు. క్రమశిక్షణ తప్పినవారు పార్టీ నాయకులే కాదని, పార్టీని ధిక్కరించిన వారికి వది లిపెట్టేది లేదని అన్నారు. టీఆర్‌ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమల మహేష్‌గౌడ్, నియోజకవర్గం బీ బ్లాకు అధ్యక్షుడు పులుగుల మాధవరెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమం లో సర్పంచ్ అభ్యర్థి అబ్బసాని యాదగి రియాదవ్, రైతు సంఘం డెరైక్టర్ కొం తం అంజిరెడ్డి, నాయకులు భాస్కర్‌యాదవ్, బట్టె లక్ష్మణ్‌రావు, రొడ్డ యాదగిరి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మెట్టు బాల్‌రెడ్డి, ఎల్లస్వామి, సగ్గు శ్రీనివాస్, భానుప్రకా ష్, రాఘవరెడ్డి, అనురాధ, సగ్గు అనిత, లంబ శ్రీను, రాంరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement