Cabinet note
-
చట్ట సవరణకు కేబినెట్ నోట్లు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: పునర్విభజన చట్ట ప్రకారం ఏపీ, తెలంగాణలలో వివిధ విద్యా, పరిశోధన సంస్థల ఏర్పాటుకు చేయాల్సిన చట్ట సవరణకు కేబినెట్ నోట్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. విభజన హామీల అమలు పై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో ఆ శాఖ కౌంటర్ దాఖలు చేసింది. చట్ట ప్రకారం ఏపీలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యాసంస్థలు, ప్రస్తుతం వాటి పరిస్థితి వివరాలను అఫిడవిట్లో పొందుపరిచింది. ఏపీ, తెలంగాణల్లో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో కేంద్రీ య వర్సిటీల ఏర్పాటుకు సెంట్రల్ యూనివర్సిటీ యాక్ట్–2009, సవరణ బిల్లు–2016 సవరణకు సం బంధించి కేబినెట్ నోట్లు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. అనంతపురం జిల్లా జంతలూరులో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం–2009ని సవరించే వరకు అనంతపురం సెంట్రల్ వర్సిటీకి చట్టపరమైన హోదా కల్పించేందుకు సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్–1860 కింద సొసైటీ ఏర్పాటు చేసి తాత్కాలిక తరగతుల ప్రారంభానికి ఆమోదం తెలిపిందని పేర్కొంది. విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ మొదటిదశ నిర్మాణానికి రూ.420 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారని పేర్కొంది. తిరుపతి ఐఐటీని 2015–16 విద్యాసంవత్సరంతో రేణిగుంటలోని చదలవాడ వెంకట సుబ్బ య్య ఇంజనీరింగ్ కాలేజీలో తాత్కాలిక తరగతుల్లో ప్రారంభించామని, తిరుపతికి సమీపంలోని మేర్లపాకలో శాశ్వత ప్రాంగణం నిర్మాణానికి రూ.1,074 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ అంగీకరించిందని తెలిపింది. తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సంస్థను తాత్కాలికంగా శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభించి రూ.109 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. నిట్ తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని, రెగ్యులర్ డైరెక్టర్ నియామకంతోపాటు 2015లో వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక తరగతులు ప్రారంభించామని, శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.460 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపింది. విశాఖ ఐఐఎంను ఆంధ్ర వర్సిటీలో తాత్కాలికంగా ప్రారంభించామని తెలిపింది. కర్నూలు జిల్లా జగన్నాథగట్టు దిన్నెదేవరపాడులో రూ.297 కోట్ల నిధులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మానుఫ్యాక్చరింగ్ సంస్థ శాశ్వత భవనాల నిర్మాణానికి ఆర్థిక వ్యయ కమిటీ ఆమోదించిందని, కేబినెట్ ఆమోదానికి ముసాయిదా బిల్లు ప్రస్తుతం న్యాయ శాఖ పరిశీలనలో ఉందని తెలిపింది. -
హెచ్ఎంటీ వాచెస్ మూసివేతకు కేబినెట్ నోట్!
నీతి ఆయోగ్ కసరత్తు... న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఖాయిలా పడిన మరో 7 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయాలని నీతి ఆయోగ్ తాజాగా కేబినెట్ నోట్‌ను సిద్ధం చేస్తోందని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. హెచ్ఎంటీ వాచెస్, హిందుస్తాన్ కేబుల్, టైర్ కార్పొరేషన్, బర్డ్స్ జ్యూట్ అండ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, సెంట్రల్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్)మూసేయాలని ఆమోదించిన సీపీఎస్ఈలకు ఈ జాబితా అదనమని ఆయన వివరించారు. కాగా డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.45,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకూ రూ.30,000 కోట్లు మాత్రమే సాధించగలిగింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.72,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
కరెంటు కష్టాలకు తాత్కాలిక ‘విరామం’
సాక్షి, మచిలీపట్నం : విద్యుత్ ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు పడుతున్న కరెంటు కష్టాలకు విరామమిచ్చినట్లు అయ్యింది. ఫైలిన్ తుఫాన్, దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని సమ్మెను వాయిదా వేస్తున్నామని, ఇది తాత్కాలికమేమనని, కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మళ్లీ సమ్మెబాట పడతామని వారు ఘాటుగానే ప్రకటించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నోట్‌ను ఆమోదించడంతో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో సుమారు 30వేల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ట్రాన్స్‌కో ఉద్యోగులు సుమారు మూడు వేల మంది, జెన్కో ఉద్యోగులు సుమారు 5వేల మంది ఐదు రోజులుగా సమ్మెలో పాల్గొన్నారు. వీరి సమ్మెతో ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జిల్లాతోపాటు పొరుగు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాపై తీవ్రప్రభావం పడింది. క్రమంగా విద్యుత్ కొరత తీవ్రం కావడంతో జిల్లాలో ఆరు గంటల నుంచి 12గంటలకు విద్యుత్ కోతలు పెరిగాయి. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతూనే ప్రజలు ఉద్యమస్ఫూర్తితో సహకరించారు. జిల్లాలో 970గ్రామాలకు గానూ దాదాపు 600గ్రామాలకు పైగా మంచినీటి సరఫరాపై విద్యుత్ కోతలు తీవ్ర ప్రభావం చూపించాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అరకొరగానే మంచినీటి సరఫరా చేసి సరిపెట్టారు. వీధిలైట్లు సైతం వెలగలేదు. జిల్లాలో అంతంతమాత్రంగా పనిచేస్తున్న సుమారు 571రైస్‌మిల్లులతోపాటు, 59ఐస్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో సుమారు 5వేల చిన్న, పెద్ద పరిశ్రమలకు విద్యుత్ కోతలు నష్టాల వాత పెట్టాయి. చిరువ్యాపారులు కరెంటు కోతలతో ఇబ్బంది పడ్డారు. సీమాంధ్రలో కోతలు.. తెలంగాణాలో వెలుగులు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో కొత్త కోణం వెలుగు చూసింది. పాలకుల పక్షపాతం బయటపడింది. అసలు సంగతేమిటంటే విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర లో విద్యుత్ కోతలు విధించిన ప్రభుత్వం తెలంగాణా ప్రాంతంలో మాత్రం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. గతంలో తెలంగాణా రాష్ట్రం కోసం ఆ ప్రాంతం లో పెద్ద ఎత్తున జరిగిన సకల జనుల సమ్మెలో అక్కడ విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో అక్కడ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి తెలంగాణాలో కరెంటు కోతలు అమలు చేయాల్సి రావడంతో మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన కరెంటును అక్కడ సరఫరా చేసి అప్పుడు కూడా సీమాంధ్రలోనే కోతలు పెట్టారు. ఇప్పుడు జరిగిన సమ్మె తో ప్రభుత్వం తెలంగాణాకు కరెంటు కోతలు లేకుండా, సీమాంధ్రలోనే కోతలు అమలు చేసింది. తెలంగాణాలో సమ్మె జరిగినా, సీమాంధ్రలో ఉద్యమం జరిగినా కరెంటు కోతలు మాత్రం సీమాంధ్ర వాసులే భరించాల్సి రావడం శోచనీయమని ప్రజలు పేర్కొంటున్నారు. కరెంటు కోతలు తగ్గేనా.. విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి విధుల్లోకి చేరనున్నారు. దీంతో సరఫరా దారిలోకి వస్తుందని అంటున్నారు. కాగా, వీటీపీఎస్ ఉత్పత్తి దారిలో పడటానికి మరో రోజు పడుతుందని చెబుతున్నారు. కరెంటు ఉత్పత్తి జరగడం, జిల్లాలో పలు సబ్స్టేషన్ల పరిధిలో సరఫరాకు గల అంతరాయాలు తొలగించాల్సి ఉంది. ఉద్యోగులు విధుల్లోకి చేరితే కరెంటు కోతలు ఒకటి రోజులు నామమాత్రంగానే అమలు చేసి, తరువాత పూర్తిస్థాయిలో కోతలు ఎత్తివేస్తారని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. -
కేబినెట్ నోట్‌తోనే సంబరపడొద్దు
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర కేబినెట్ నోట్‌తోనే సంబరపడొద్దని జేఏసీ నాయకులు, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి బూర మల్లేశం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల ప్రజలకు సీమాంధ్రుల దోపిడీ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పాత బస్టాండు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 1,376వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందే వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పుల్లూరు మధిర బండచెర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా పొదుపు సంఘం సభ్యులు బూసాని వెంకటలక్ష్మి, బాలమణి, శశికళ, పద్మ, కమల, అరుణ, ప్రమీల, నర్సవ్వ, మల్లవ్వ, రాజవ్వ, రాజమణి, పోశవ్వ, మంగ, వీరమణి తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి పలువురు జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. -
ఇప్పటికైనా కలసి రండి: కొణతాల రామకృష్ణ
* రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుదాం * రాజకీయ పక్షాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు * రాష్ట్రానికి రాబోయే మంత్రుల బృందానికి ‘గో బ్యాక్’ చెప్పాలి * కిరణ్ రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలి * కేంద్ర, రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభంతోనే విభజనను అడ్డుకోగలం * తక్షణమే అసెంబ్లీ భేటీ పెట్టి సమైక్య తీర్మానం చేద్దాం * తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ రాజీనామా చేయాలి * పొరపాటున కూడా తాను సమైక్య దీక్ష చేస్తున్నానని బాబు చెప్పడం లేదు సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలన్నీ తమ సొంత ఎజెండాలను పక్కనబెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కలసికట్టుగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని సూచించింది. వైఎస్సార్సీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇపుడున్న పరిస్థితుల్లో అందరూ కలసి పోరాడితే తప్ప రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోదని చెప్పారన్నారు. అందుకే తమ పార్టీ తరఫున సమైక్య రాష్ట్రం కోసం అందరూ కలసి రావాలని కోరుతున్నామన్నారు. ‘సైమన్ గోబ్యాక్’ ఉద్యమం తరహాలో.. విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) రాష్ట్రానికి రానుందని, స్వాతంత్రోద్యమంలో ప్రకాశం పంతులు నడిపిన ‘సైమన్ గోబ్యాక్’ ఉద్యమం మాదిరిగా మంత్రుల బృందానికి కూడా ‘గోబ్యాక్’ చెప్పాలని కొణతాల పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ స్వార్థంతో, క్షుద్ర రాజకీయాలతో రాష్ట్రాన్ని నిలువునా కోసేందుకు కేంద్రం ఒడిగట్టిందని, అలాంటి విభజనను ఆపాలంటే రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం ఒక్కటే పరిష్కారమని ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే కేంద్ర మంత్రివర్గానికి కేబినెట్ నోట్ వస్తుందని తొలుత నమ్మించిన కేంద్రం ఒక్కసారిగా అదేమీ లేకుండా దూకుడుగా నోట్‌ను ఆమోదించిందని కొణతాల విమర్శించారు. గతంలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కలసినపుడు మంత్రు ల కమిటీ వేస్తామని ప్రధాని చెప్పారని, కానీ అదేమీ లేకుండా నోట్‌ను ఆమోదించారని ఆయన అన్నారు. నోట్ రావడానికి ముందు మంత్రుల కమిటీ వేయకుండా ఇపుడు నోట్‌ను ఆమోదించి విభజన ప్రక్రియ కోసం మంత్రుల బృందాన్ని (జీఓఎం)ను నియమించడం దారుణమని ఆయన అన్నారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా తక్షణం రాష్ట్ర శాసనసభను ప్రత్యేకంగా సమావేశపర్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని కొణతాల గట్టిగా డిమాండ్ చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని అన్నారు. అదే విధంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచి లోక్‌సభలో ఉన్న 25 మంది సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించాలని అపుడు ఈ విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం రావణకాష్టం కావడానికి కిరణ్‌దే పూర్తి బాధ్యత అని కొణతాల ధ్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రం 2011లో భావించినపుడే సీఎం స్పందించి ఉంటే బాగుండేదన్నారు. లేఖ వెనక్కి తీసుకో బాబూ: ఢిల్లీ దీక్షలో ఒక్క రోజుకే నీరసపడిపోయారంటున్న చంద్రబాబు తన జీవితం ప్రజలకు అంకితం చేస్తానని చెబుతున్నారని, అయితే అంత అవసరం లేదని, రాష్ట్ర విభజనకు తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే చాలని, అపుడు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని కొణతాల అన్నారు. చంద్రబాబు తాను సమైక్యం కోసం దీక్ష చేస్తానని అంటారేమోనని తామంతా భావించామని, కానీ దురదృష్టవశాత్తూ పొరబాటున కూడా ఎక్కడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒక్క మాట కూడా ఆయన అనడం లేదని విమర్శించారు. బాబు చాలా జాగ్రత్తగా, పొందిగ్గా ఇపుడు రెండు కళ్ల సిద్ధాంతానికి బదులు ఇద్దరు కొడుకుల సిద్ధాంతాన్ని వల్లె వేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు కొడుకులకు ఆస్తి ఎలా పంచాలనే విషయమే మాట్లాడుతున్నారు తప్ప సమైక్యంగా ఉండాలని చెప్పడం లేదన్నారు. అప్పుడేమయ్యారు దిగ్విజయ్..? దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు చాలా ఆప్తుడనీ, జగన్ తనకు కుమారుడిలాంటి వాడని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని కొణతాల విమర్శించారు. వైఎస్ పేరును సీబీఐ చార్జిషీటులో పెట్టినపుడు, ఆయన కుమారుడు జగన్‌పై కేసులు పెట్టి జైల్లో నిర్బంధించినపుడు దిగ్విజయ్ ఏమయ్యారని కొణతాల సూటిగా ప్రశ్నించారు. కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేసిందని కొణతాల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోతుందని, అలాగే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరగదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించడానికిగానీ, కలిపి ఉంచడానికిగాని కేంద్రానికి అధికారం ఉందంటే దానర్థం విభజించవచ్చనే కాదు కదా? రాష్ట్రాన్ని కలిపి ఉంచవచ్చు కూడా కదా అని కొణతాల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
జీవోఎం నివేదికకు కాలవ్యవధి లేదు
కేబినెట్ నోట్లోని ‘ఆరు వారాల’ గడువు మాయం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజన నిర్ణయం అమలులో భాగంగా పరిష్కరించాల్సిన అంశాలపై దృష్టి సారించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి ఎలాంటి కాలవ్యవధినీ నిర్ణయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. విభజనతో ముడివడి ఉన్న అనేక కీలకాంశాల పరిష్కారంపై దృష్టి సారించి విధి విధానాలను సిఫార్సు చేయాల్సి ఉన్న జీవోఎంకు కాల పరిమితిని నిర్ణయించకపోవడం ఎన్నో సందేహాలకు ఆస్కారమిస్తోంది. తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులుగా జీవోఎం ఏర్పాటు చేయాలని గత గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం తీర్మానించడం, ఆరు వారాల్లో అది నివేదికను సమర్పించాలని కూడా నిర్దేశించడం తెలిసిందే. తాజాగా మంగళవారం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ చేసిన జీవోఎం ఏర్పాటు ప్రకటనలోమంత్రుల సంఖ్యను ఏడుకు కుదించడంతో పాటు కాల వ్యవధిని తొలగించారు! మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర మంత్రుల కమిటీ పరిశీలనాంశాల జాబితా నుంచి కేవలం నివేదిక సమర్పణకు నిర్ణయించిన ఆరు వారాల గడువును మాత్రమే తొలగించడం విశేషం. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, అధికార ప్రతినిధి పి.సి.చాకో బుధవారం పరస్పరం విరుద్ధంగా మాట్లాడటం విభజన ప్రక్రియపై తీవ్ర గందరగోళానికి తెర తీసింది. విభజన ప్రక్రియలో ఎలాంటి జాప్యమూ జరగదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న దిగ్విజయ్ పునరుద్ధాటించారు. చాకో మాత్రం... ‘సార్వత్రిక ఎన్నికల్లోగానే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలన్న అభిప్రాయంతో ఉన్నప్పటికీ, ఈ సందర్భంగా పరిష్కరించాల్సి ఉన్న అనేక సున్నితమైన అంశాలు తెరపైకి వస్తున్న నేపధ్యంలో అది సాధ్యపడకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం, పార్టీ ఉన్నప్పటికీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎలాంటి గడువును నిర్దేశించుకోలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అనేక సంక్లిష్టమైన, సున్నితమైన అంశాలపై ఆరు వారాలలోగా జీవోఎం సంప్రదింపులు పూర్తి చేయడం సాధ్యపడకపోవచ్చనే అభిప్రాయంతోనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆరు వారాల కాల వ్యవధిని తొలగించిందని కూడా చాకో వెల్లడించారు. నివేదిక సమర్పణకు గడువేమీ విధించకపోయినా సాధ్యమైనంత త్వరగా విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.మరోవైపు దిగ్విజయ్ మాత్రం, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, పార్టీలన్నింటి అభిప్రాయాలను సేకరించి తీసుకున్న తెలంగాణ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునే సమస్యే లేదని కుండబద్దలు కొట్టారు. కాకపోతే, ‘జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు సహకరిస్తే వచ్చే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోగా విభజన ప్రక్రియను పూర్తి చేస్తాం’’ అంటూ మెలిక పెట్టారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన రెండుసార్లు అసెంబ్లీ పరిశీలనకు వెళ్తుందని కూడా ఆయన చెప్పారు. ‘‘తొలుత తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వెళ్తుంది. తర్వాత మరోసారి తెలంగాణ బిల్లును కూడా శాసనసభ చర్చిస్తుంది’’ అని పునరుద్ఘాటించారు. సంబంధిత మంత్రులకు స్థానం లేని వైనం ఏఐసీసీ పెద్దల విరుద్ధ ప్రకటనలకు తోడు, విభజనతో ముడివడ్డ పలు కీలకాంశాలను పరిష్కరించాల్సి ఉన్న జీఓఎం నుంచి సరిగ్గా సీమాంధ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశాలకు సంబంధించిన మంత్రులనే తొలగించిన వైనం అయోమయాన్ని మరింతగా పెంచుతోంది. నదీజలాలు, విద్యుచ్ఛక్తి పంపిణీ, విద్య, ఉపాధి అవకాశాల వంటి ప్రధాన సమస్యలపై దృష్టి సారించాల్సిన జీవోఎం నుంచి ఆ శాఖల మంత్రులను తొలగించడం తెలిసిందే. ఇది పార్టీపరంగా కాంగ్రెస్ తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప ప్రభుత్వం తీసుకున్నది కాదనేందుకు ఈ చర్య మరో తార్కాణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా తగిన కసరత్తు చేయకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారంటూ ఇప్పటికే విమర్శల సుడిలో చిక్కిన యూపీఏ సర్కారు, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై మరింత అనాలోచితంగా, సంక్లిష్టమైన సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధిని ప్రదర్శించకుండా ముందుకు సాగదలిచిందా, లేక మరిన్ని చిక్కుముడులకు ఆసరా ఇచ్చి విభజన ప్రక్రియను నాన్చదలచుకుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన హోం శాఖ నోట్లో జీవోఎం సభ్యులుగా పేర్కొన్న వారి నుంచి కేంద్ర జలవనరుల మంత్రి హరీశ్ రావత్, విద్యుత్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పట్టణాభివద్ధి మంత్రి కమల్‌నాథ్, మానవ వనరుల మంత్రి ఎం.ఎం.పల్లంరాజు, ఉపరితల రవాణా మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్, న్యాయ మంత్రి కపిల్ సిబల్‌లతో పాటు కేబినెట్ హోదా ఉన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను మంగళవారం తొలగించడం తెలిసిందే. రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్‌లకు స్థానం కల్పించారు. కీలక అంశాలకు సంబంధించిన మంత్రులకు బదులుగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలతో ఏదో ఒక రూపంలో సంబంధాలున్న మంత్రులతోనే జీవోఎంను నింపారు! అధిష్టానం నిర్ణయాన్ని మరింత అడ్డగోలుగా, సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికే ఇలా చేశారని కొందరు, విభజనను జాప్యం చేసేందుకే కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆంటోనీ ఇప్పటికే విభజనతో సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలపై సంప్రదింపుల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి సారథిగా ఉన్నారు. మొయిలీ, ఆజాద్ గతంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జిలుగా వ్యవహరించారు. జైరాం పదేళ్లుగా రాజ్యసభలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా కేబినెట్ నోట్‌ను ఆమోదించిన గత గురువారం నాటి కేంద్ర మంత్రివర్గ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను ఆయన గట్టిగా సమర్థించారు! జీవోఎంతో చర్చలకు రావాలి: చాకో జీవోఎం నివేదిక సిద్ధం కావడానికి ఆరు వారాల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చునన్న స్పష్టమైన సంకేతాలిచ్చిన చాకో కూడా, విభజన నిర్ణయం మాత్రం తిరుగు లేనిదని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడికిపోతున్న కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మన్మోహన్సింగ్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ప్రకటించారు. సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు తదితరుల నిరవధిక సమ్మెలను విరమింపజేసేందుకు అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టాన్ని (ఎస్మా) ప్రయోగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ముందుకు రాకపోతే కేంద్రమే ఆ పని చేయవచ్చునని సూచనప్రాయంగా వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్ ప్రతిపత్తి విషయంలో సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనల్లో వాస్తవముందని చాకో అంగీకరించారు. కీలకమైన, సున్నితమైన అంశాలన్నింటిపైనా సంబంధిత భాగస్వాములందరితో కేంద్రం విసృ్తతంగా సంప్రదిస్తుందని హామీ ఇచ్చారు. ‘ఆందోళనలు, ఉద్యమాలను విరమించండి. హింసాకాండకు పాల్పడకండి. అన్ని సమస్యలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించండి. కేంద్ర మంత్రుల బందంతో చర్చలకు రండి’ అని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. నా చర్మం మొద్దుబారింది: దిగ్విజయ్ తెలంగాణ ప్రక్రియ వేగాన్ని తగ్గించడం లేదని, సాధ్యమైనంత త్వరగా జీవోఎం నివేదిక రాష్ట్రపతికి చేరుతుందని దిగ్విజయ్ అన్నారు. ‘‘అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేయడం రాష్ట్ర ఇన్చార్జిగా నా బాధ్యత. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో నా చర్మం మొద్దుబారింది. ఎలాంటి విమర్శలూ నాపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ చూపబోవు’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇన్చార్జిగా తాను శాశ్వతం కాదన్న కిరణ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘అది నిజమే. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నేను శాశ్వతంగా ఉండను. అలాగే ఆ పదవిలో ఎవరూ శాశ్వతంగా ఉండరు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన ఉందా, కిరణ్ నాయకత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా అన్న ప్రశ్నకు సూటిగా బదులివ్వలేదు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభమూ తలెత్తలేదు’’ అని చెప్పారు. ఇవీ జీవోఎం విధి విధానాలు... రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందానికి నిర్దేశించిన విధి విధానాలు ఇలా ఉన్నాయి: (1) కొత్తగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ రాష్ట్రానికి, విభజన అనంతరం మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (అసెంబ్లీ, లోక్‌సభ) నియోజకవర్గాలు, న్యాయ, చట్టపరమైన సంస్థలు తదితర పాలనా విభాగాలన్నింటికీ వర్తించేలా సరిహద్దులను నిర్ణయించడం (2) హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా సమర్థంగా పని చేసేలా చూసేందుకు అవసరమైన న్యాయ, పాలనాపరమైన చర్యలను పరిశీలించడం (3) విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమయ్యే న్యాయ, ఆర్థిక, పాలనాపరమైనచర్యలను పరిశీలించడం (4) రెండు రాష్ట్రాల్లోనూ వెనకబడ్డ ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవసరాలపై దృష్టి సారించడంతో పాటు (వాటి అభివృద్ధికి) అవసరమైన చర్యలను చేపట్టడం (5) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటుతో తలెత్తగల శాంతిభద్రతలు తదితర అంశాలతో పాటు ప్రజలందరి భద్రత, రక్షణ వంటివాటిపై దృష్టి సారించడం. అన్ని ప్రాంతాల్లోనూ శాంతి, సామరస్యాలు కొనసాగేలా చూడటం. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల అంతర్గత భద్రతకు సంబంధించి తలెత్తగల దీర్ఘకాలిక పరిణామాలను పరిశీలించి, (వాటి పరిష్కారానికి) సరైన సిఫార్సులు చేయడం (6) నదీజలాలు, సాగునీటి వనరులు, ఇతర సహజ వనరుల (ముఖ్యంగా బొగ్గు, నీరు, చమురు, సహజవాయువు)ను రెండు రాష్ట్రాల మధ్య పంచే ప్రక్రియను చేపట్టడం. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం కూడా దీనిలో భాగంగానే ఉంటుంది. (7) రెండు రాష్ట్రాల మధ్య తలెత్తగల విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంబంధిత అంశాలపై దృష్టి సారించడం (8) రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు, అప్పులు తదితరాల పంపకాల వల్ల తలెత్తే అంశాలను పరిశీలించడం (9) ఆలిండియా, సబార్డినేట్ సర్వీసుల ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య పంచడంలో తలెత్తే అంశాలను పరిశీలించడం (10) రాజ్యాంగంలోని 371డి అధికరణం కింద జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల భవితవ్యాన్ని రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిశీలించడం (11) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా తలెత్తగల మరే ఇతర అంశాన్నయినా పరిశీలించడం, సరైన సిఫార్సులు చేయడం -
రాష్ట్ర విభజనపై హైకోర్టులో వాదనలు పూర్తి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. విభజనకు ఉద్దేశించి రాజ్యాంగంలోని 3వ అధికరణ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉందని, ఈ కారణంతో దాన్ని కొట్టివేయాలని పిటిషినర్ పీవీ కృష్ణయ్య హైకోర్టు ముందు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 371(డి) అధికరణ అమల్లో ఉండగా 3వ అధికరణకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. -
కాంగ్రెస్ ఎంపీలుగా ఎందుకున్నామా అని బాధపడుతున్నాం?
ఒంగోలు : కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో పార్టీ అనుసరించిన విధానం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఎందుకు ఉన్నామా అని....ఇప్పుడు బాధపడుతున్నామన్నారు. తెలంగాణపై కేబినెట్ నోట్ రహస్యంగా ఉంచి టేబుల్ అజెండాగా తీసుకు రావటం అధిష్టానం దుర్మర్గమైన చర్య అని మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె కారణంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం అత్యవసరంగా సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రుల్లో ఇద్దరు హాజరు కాగా, మరో ఇద్దరు గైర్హాజరు అయ్యారు. -
కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించండి: ధర్మాన
హైదరాబాద్ : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ....మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాలు ఉపయోగించి.... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించాలని ధర్మాన ఈ సందర్భంగా తన లేఖలో విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రెండు నెలల క్రితమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి కూడా సమర్పించారు. క్విడ్ ప్రోకో కేసులో ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
దీక్షాస్ధలి వద్ద ఏర్పాట్లు పూర్తి
-
టీ నోట్ పై రగులుతున్న సీమాంధ్ర
-
అనంతపురంలో కొనసాగుతున్న బంద్
-
తిరుపతిలో 72 గంటల పాటు బంద్
-
గుంటూరు నగరంలో బంద్ సంపూర్ణం
-
'విషాదకర ప్రకటనకు వారే సాక్షులు'
సీమాంద్ర చరిత్రలో ఓ విషాదకర ప్రకటనకు వారు సాక్షులుగా మిగిలిపోయారు. తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే సందర్భంగా జరిగిన చర్చలోనూ పాల్గొన్నారు. కానీ తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం చెప్పకుండా ఆపలేకపోయారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇద్దరు మంత్రులు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. వారే కావూరి సాంబశివరావు, పల్లంరాజు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరి సాక్షిగానే తెలంగాణపై కేబినెట్ నోట్ కు ఆమోద ముద్ర పడిపోయింది. సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా... సమైక్యవాదులు రాజీనామాలు చేయండంటూ ఎంత డిమాండ్ చేసినా రాజీనామాలతో ఏం లాభం. పదవుల్లోనే ఉండి ఢిల్లీలో తెలంగాణను అడ్డుకుంటామంటూ ఎన్నో ప్రకటనలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టనివ్వమన్నారు. ఎంతమంది రాజీనామాలు చేయమన్నా పదవులను పట్టుకుని వేలాడారు. కానీ చివరికి జరిగిందేంటీ..? కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్‌పై సాగిన చర్చలో కావూరి, పల్లంరాజులు పాల్గొన్నారు. నోట్‌ను వ్యతిరేకించలేక, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రమంత్రి మండలి ముందు ఉంచడంలో ఘోరాతిఘోరంగా విఫలమయ్యారు. అధిష్టానం ఆదేశాలతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. విభజన పాపాన్ని మూటగట్టుకున్నారు. తెలంగాణ నోట్‌పై కేబినెట్ నిర్ణయం తీసుకోవటంతో .....ఇక ప్రజలు తమమీద తిరగబడతారనుకున్నారో ఏమో మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. భేటీ తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. పదవుల్లో కొనసాగలేమని చెప్పారు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని ప్రధాని నచ్చజెప్పారు. దీంతో రాజీనామాలపై వారెలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారు ఈరోజు తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
బంద్‌లో స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజలు
-
శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు: జైపాల్‌రెడ్డి
హైదరాబాద్ తెలంగాణలో భాగమే: జైపాల్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం తెలంగాణ ప్రజల విజయమని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని, పార్లమెంటులో దానికి ఆమోదం కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది చారిత్రాత్మక దినం. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ప్రగాఢ కాంక్ష ఈ రోజు నెరవేరింది. కేబినెట్ నిర్ణయం తెలంగాణ ప్రజలందరి విజయం. తెలంగాణపై ఏం చర్చించారన్న దానికన్నా... తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది ముఖ్యం. కేబినెట్ భేటీలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాను. సీమాంధ్ర మంత్రులు వారి ప్రాంత మనోభావాలు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం కేబినెట్ నోట్ ద్వారా రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతం తెలిపిందని చెప్పే సువర్ణావకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం అంతా సమష్టిగా కృషి చేయాలి’’ అని జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటుపై నియమించే మంత్రుల బృందం తెలంగాణ బిల్లును తయారు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో భాగంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో రెండు ప్రభుత్వాలు సవ్యంగా నడిచేందుకు చట్టపరమైన, విధానపరమైన అంశాలను... విద్యుత్, గ్యాస్ వంటి అంశాల్లో ఎలా న్యాయం చేయాలన్నదానిపై మంత్రుల బృందం చర్చిస్తుందన్నారు. తర్వాత ఈ బిల్లు కేబినెట్ ముందుకు వస్తుందని, పార్లమెంటు ఆమోదం అనంతరం రాష్టప్రతికి పంపిస్తారని తెలిపారు. -
తెలంగాణ నోట్‌పై సంతకం చేయలేదు: షిండే
ఢిల్లీ: కేబినెట్ నోట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేబినెట్ నోట్ చర్చకు రానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాత్రం మీడియాలో వస్తున్న కథనాలు ఊహాగానాలేనన్నారు. తెలంగాణ నోట్‌పై తానింకా సంతకం చేయలేదని తెలిపారు. సోనియా గాంధీ అనుమతి కోసం వేచి చూస్తున్నామని షిండే పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేయటం.... నోట్‌పై తాను సంతకం చేయలేదనటంతో.... సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్‌పై చర్చ జరుగుతుందా....లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. -
తెలంగాణ నోట్ సిద్ధం.. మధ్యాహ్నమే మంత్రుల చేతికి!
తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు దీన్ని కేంద్ర మంత్రులకు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. వాస్తవానికి బుధవారం రాత్రే నోట్ సిద్ధమైందని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, సీమాంధ్రకు రాజధానిగా ఏ నగరం ఉండాలన్న అంశాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వదిలేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ నేషనల్ మీడియా పేర్కొంది. ఇవాళ్టి సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తెలంగాణపై నోట్‌ను ఆమోదిస్తారని సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ నోట్‌పై చర్చించడంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని నియమిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నదీ జలాలు, ఇతర సమస్యలను మంత్రుల బృందం పరిశీలిస్తుందని ఆ వర్గాలు వివరించాయి. ఇందుకు సంబంధించి కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని నేషనల్ మీడియా విశ్లేషిస్తోంది. కేబినెట్లో ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తారని, ఆ తర్వాత వారం, పది రోజుల్లో అసెంబ్లీకి పంపించే దిశగా కసరత్తు సాగుతోందని నేషనల్ ఛానెల్‌లు పేర్కొంటున్నాయి. తెలంగాణ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. -
నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదు: దిగ్విజయ్
-
నేటి కేబినెట్ భేటీలో ‘టీ’ లేదు - రేపటి సమావేశంలోనూ రాదు!
విభజన నిర్ణయంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ లబ్ధికోసం తమ నాటకాన్ని రక్తికట్టిస్తోంది. కాంగ్రెస్ దిగ్గజాలే రోజుకో మాట మాట్లాడుతూ.. కేబినెట్ నోట్ ఇదిగో అదిగో అంటూ కావాలనే గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంమీద రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారేంతవరకు రాష్ట్రాన్ని ఇదే విధంగా అయోమయంలో కొనసాగించడమే ఎజెండాగా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ రూపొందించే కేబినెట్ నోట్ కేంద్ర మంత్రిమండలి ముందుకు రాబోతోందంటూ గత కొద్ది రోజులుగా హైడ్రామా నడుపుతున్నారు. ఇంతగా ప్రచారం చేస్తూవచ్చినప్పటికీ బుధ, గురువారాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ తెలంగాణ నోట్ అనేది అసలు ఎజెండాలో చేర్చలేదు. ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా మంత్రిమండలి సమావేశం ఉంటుందని ప్రచారం చేశారు. తీరా మంత్రివర్గం సమావేశం కాబోతోందన్న కొద్ది గంటల ముందు.. ‘ఇప్పుడే అలాంటి నోట్ అంటూ ఏమీ లేద’ని కేంద్ర హోంశాఖ తేల్చేసింది. కేంద్ర హోంశాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన కథనం మేరకు బుధ, గురువారాల్లో జరిగే కేబినెట్ సమావేశంలో టీ-నోట్ ప్రస్తావన ఉండదని తేలిపోయింది. అసలు నోటే సిద్ధంకానప్పుడు కేబినెట్ ముందుకు ఎలా వస్తుందని కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. కొద్ది రోజుల కిందటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమైందని స్వయంగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటన చేశారు. దాన్ని తానింకా పరిశీలించలేదని, త్వరలోనే పరిశీలిస్తానని కూడా తెలిపారు. గతంలో దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలను రోడ్‌మ్యాప్‌లు తయారు చేయమనడం, అంతే వేగంగా కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం, ఆ తర్వాత కొద్ది రోజులకు యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీ, వెను వెంటనే సీడబ్ల్యూసీ తీర్మానం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటన్నట్టు కాంగ్రెస్ త్వరత్వరగా నిర్ణయాలు చేసింది. అప్పుడు ఎంతో వేగంగా వ్యవహారాలు నడిపించి రాష్ట్రాన్ని అయోమయంలో పడేసిన కాంగ్రెస్ నాయకత్వం తాజా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ప్రతిష్టంభనను తొలగించడానికి గానీ అనిశ్చితికి తెరదించేందుకు గానీ ఏమాత్రం ప్రయత్నాలు చేయకపోగా.. పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెడుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేబినెట్ ఎజెండాలో టీ-నోట్ లేదు... కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఆంటోనీ కమిటీని తెరమీదకు తెచ్చి ఆ కమిటీ సిఫారసుల కోసమంటూ కొత్త వాదన ముందుపెట్టి పరిష్కారం చూపకుండా సాగదీస్తోంది. అయితే.. ఆంటోనీ కమిటీకి కేంద్ర హోంశాఖ రూపొందించి నివేదించే కేబినెట్ నోట్‌కు అసలు సంబంధమే లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ దిగ్విజయ్‌సింగ్ రెండు రోజుల కిందటే చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినేట్ నోట్ రావడం ఖాయమని భావించారు. మంత్రిమండలి సమావేశం కావడానికి సరిగ్గా 24 గంటల సమయం కూడా లేకముందు మంత్రిమండలి ఎజెండాలో నోట్ ముసాయిదా ప్రస్తావన లేదని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ లీకులు బయటకొచ్చాయి. ఏమంటే కేబినెట్ నోట్ ముసాయిదాలో అనేక మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం ఉందని, అవి పూర్తయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మో„హన్ సింగ్‌ల పరిశీలనకు పంపిస్తారని, ఆ తర్వాత కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు వెళుతుందని, ఆ తర్వాతే మంత్రిమండలి ముందుకొస్తుందని ఇప్పుడు తాజాగా ప్రచారంలో పెట్టిన కథ. బుధవారం సాయంత్రం జరుగనున్న కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం ఎజెండాలో.. కేవలం శిక్షపడిన ప్రజాప్రతినిధుల చట్టసభల సభ్యత్వం తక్షణం రద్దు కాకుండా అడ్డుకొనేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స పునఃపరిశీలన మినహా మరే ఇతర అంశాలను పొందుపరచలేదని.. గురువారం నాటి మంత్రివర్గ సమావేశం ఎజెండాలో కూడా తెలంగాణ అంశాన్ని చేర్చలేదని తెలియవచ్చింది. పొంతనలేని షిండే, దిగ్విజయ్ వ్యాఖ్యలు... నోట్‌పై షిండే, దిగ్విజయ్‌లు ఇప్పటివరకూ తమ నోటితోనే చెప్పిన విషయాలకూ.. తాజా పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకపోవటం గమనార్హం. ఇదంతా నాటకంలో భాగమేనని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి విశ్వసనీయ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. కేబినెట్ నోట్ దాదాపు సిద్ధమైందని, దాన్ని త్వరలోనే కేబినెట్ భేటీలో చర్చకు పెట్టి ఆమోదిస్తారని దిగ్విజయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆంటోనీ కమిటీ ఇచ్చే సిఫారసులను తెలంగాణ బిల్లులోనే చేరుస్తారు తప్పించి కేబినెట్ నోట్లో కాదని కూడా ఆయన మొన్నటికి మొన్న స్పష్టంచేశారు. నోట్ ముసాయిదా సిద్ధమైందని స్వయంగా హోంమంత్రి షిండే కనీసం రెండు సందర్భాల్లో వెల్లడించారు. కానీ.. ఇప్పుడు నోట్ అసలు సిద్ధం కాలేదని, ఆంటోనీ కమిటీ సిఫారసుల కోసం నిరీక్షిస్తున్నామని, అవి వచ్చాక ముసాయిదా నోట్లో మార్పులు చేయాలని, దానికి తొలుత రాజకీయ ఆమోదం, తర్వాత న్యాయశాఖ ఆమోదం కావాలని తాజాగా షిండే నేతృత్వంలోని హోంశాఖ అధికార వర్గాల పేరుతో లీకులు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ నాటకంలో భాగమేనని విశ్వసనీయ వర్గాల కథనం. అంతా ఆ నాటకంలోని అంకాలే... సీమాంధ్రలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని నేతలు ఏకరువు పెట్టడంతో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఒకవైపు సీఎం కిరణ్ ద్వారా సొంత పార్టీపైనా తిరుగుబాటు చేస్తున్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేయించడం.. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో సమావేశాలను నిర్వహింపచేయడం, పీసీసీ అధ్యక్షుడు బొత్సతో రాజీనామాకు సిద్ధమంటూ లీకులు ఇప్పించడం.. ఇవన్నీ అధిష్టానం రచించిన డ్రామాలోని అంకాలేనని ఆ వర్గాలంటున్నాయి. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ సీఎం బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినా పార్టీ పెద్దలెవరూ దీనిపై గట్టిగా స్పందించకపోవడాన్ని, దిగ్విజయ్ తాజాగా దీనిపై స్పందనకు నిరాకరించడాన్ని బట్టి ఇదంతా హైకమాండ్‌కు తెలిసే జరుగుతోందన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. కాగా, నవంబర్‌లోగానీ తెలంగాణ అంశం ఒక కొలిక్కి రాదంటూ ఏఐసీసీ వర్గాలు కొత్త లీకును ప్రచారంలోకి తెస్తుండటం మరో విశేషం. -
'అక్టోబర్ 7 తర్వాత కిరణ్ పదవిలో ఉండరు'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై టీఆర్ఎస్ మరోసారి మండిపడింది. గత సకల జనభేరీ సభలో కిరణ్ పై విమర్శలకు దిగిన టీఆర్ఎస్ మరోసారి ఎదురుదాడికి దిగింది. అక్టోబర్ 7వ తేదీలోగా కిరణ్ కు సీఎం పదవి పోవడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సగం మంది మంత్రులు వైఎస్సార్ సీపీలోకి వెళ్లడం ఖాయమని తెలిపాయి. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపం. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. అక్టోబరు 6 దాటడు. స్విచ్ఛాఫ్ అయితది. కిరణం బొగ్గు అయితది. డీజీపీ దినేశ్‌రెడ్డికి కోర్టు కట్ చేసింది. కిరణ్‌కు కూడా ప్లగ్‌ను పీకేస్తరు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నవంబర్ రెండో వారంలో కేంద్రం తెలంగాణపై రూపొందించిన కేబినెట్ నోట్ కు రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నాయి. అనంతరం తెలంగాణ ఏర్పాటు పక్కాగా జరుగుతుందని ధీమాను వ్యక్తం చేశాయి. త్వరలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. -
గవర్నర్‌తో జగన్ భేటీ
‘సమైక్య తీర్మానం’ కోసం తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి మెజారిటీ ప్రజలు విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం కేబినెట్ నోట్‌పై ముందుకెళుతుండటంపై ఆందోళన పార్టీ ప్రతినిధి బృందంతో కలసి నరసింహన్‌కు వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నోట్ సిద్ధం చేసి ప్రక్రియను ముందుకు తీసుకెళుతోందని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయటానికి తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం పార్టీ ప్రతినిధి బృందంతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్.. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), యూపీఏ భాగస్వామ్య పార్టీలు విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. విభజన ప్రక్రియకు సంబంధించిన కేబినెట్ నోట్ రూపకల్పనలో ముందుకు పోతుండటం ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కోస్తా, రాయలసీమల్లో దాదాపు ప్రజలందరూ 60 రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ఆయనకు తెలియజేశారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డి, కె.శ్రీనివాసులు, గుర్నాథ్రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, భూమన కరుణాకర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అమరనాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, సి.నారాయణరెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రహమాన్ తదితరులు జగన్మోహన్రెడ్డితో పాటు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు. -
సమైక్య తీర్మానం చేద్దాం : వైఎస్ జగన్
' నోట్‌కు ముందు అప్రమత్తమైతేనే విభజన ఆగుతుంది: వైఎస్ జగన్ ' వైఎస్ జగన్కేబినెట్ నోట్ అసెంబ్లీకి వచ్చాక చేసేదేమీ ఉండదు ' వైఎస్ జగన్అక్టోబర్ 15 నుంచి 20 తేదీల మధ్య హైదరాబాద్‌లో ‘సమైక్య శంఖారావం’ సభ ' వైఎస్ జగన్కాంగ్రెస్తో డీల్ కుదిరితే 16 నెలల పాటు జైలులో ఎందుకుంటాను? ' వైఎస్ జగన్వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి కట్టుబడి ఉన్నాయి ' సమైక్యం కోసం లేఖ తీసుకువస్తే నేను తొలి సంతకం పెట్టటానికి సిద్ధంగా ఉన్నా ' అన్ని పార్టీల అధ్యక్షుల చేత పెట్టిస్తే.. మూడు పార్టీలు నాలుగూ, ఐదూ అవుతాయి ' ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ విభజిస్తోంటే.. ఓట్లు, సీట్లు పోతాయని టీడీపీ మౌనంగా ఉంది ' రాష్ట్రాన్ని విభజిస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్లు ఎలా వస్తాయి? ' హైదరాబాద్ మీదికాదు పొమ్మంటే.. చదువుకున్న ప్రతి పిల్లవాడి భవిష్యత్ ఏంకావాలి? ' సమైక్యం అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ మూడు ప్రాంతాలూ కావాలి ' ప్రతి తెలంగాణ సోదరుడ్నీ అభివృద్ధి వైపు నడిపిస్తానని నేను గట్టిగా హామీ ఇవ్వగలను ' 60% మంది రోడ్లెక్కి ఆందోళన చేస్తోంటే.. అందరికీ ఆమోదయోగ్యమని ఎలా చెప్తారు? ' మీడియా సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ తయారు కాకముందే రాజకీయ పార్టీలు అప్రమత్తం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. కేబినెట్ నోట్ సిద్ధమై అసెంబ్లీకి వచ్చిన తర్వాత చేసేదేమీ ఉండదని.. ముందుగానే అప్రమత్తమై తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని.. అలాగైతేనే విభజనను నిలువరించగలమని పేర్కొన్నారు. జగన్ సోమవారం పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను కలిశారు. అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం ఆమోదించాలని కోరుతూ గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 16 నెలల జైలు నిర్బంధం తర్వాత కొద్ది రోజుల కిందట బెయిల్‌పై విడుదలైన తర్వాత జగన్ తొలిసారిగా మీడియా ముందుకు రావటంతో దాదాపుగా రాష్ట్ర, జాతీయ మీడియా అంతా హాజరైంది. జగన్ విలేకరుల సమావేశానికి విస్తృత ప్రాముఖ్యతనిచ్చింది. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, ఇతర అంశాలను జగన్ ఈ సందర్భంగా సుదీర్ఘంగా వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జరుగుతున్న ఉద్యమం, ఆందోళనలు, కుమ్మక్కు రాజకీయాలు, జాతీయ రాజకీయాంశాల గురించి మాట్లాడారు. హోంశాఖ కేబినెట్ నోట్ తయారుకాకముందే అప్రమత్తమై అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పుడే విభజనను ఆపగలమని జగన్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఇదే అంశంపై పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో అక్టోబర్ 15 నుంచి 20 తేదీ మధ్యలో హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జగన్ ప్రకటించారు. సమైక్య రాష్ట్రం కోసం జేఏసీ లేఖ తీసుకొస్తే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తొలి సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ.. తామేదో కుమ్మక్కయినట్టు వేలు తమవైపు చూపటాన్ని ఆయన ఆక్షేపించారు. కేసు నమోదైనప్పుడు దర్యాప్తు పూర్తి కాని పక్షంలో 90 రోజుల్లోగా బెయిల్ రావాలని రాజ్యాంగం చెప్తోందని.. కానీ తనకు ఆ హక్కును నిరాకరించారని.. కాంగ్రెస్‌తో డీల్ కుదిరితే తాను 16 నెలల పాటు జైలులో ఎందుకుంటానని జగన్ సూటిగా ప్రశ్నించారు. ముందే తీర్మానం చేస్తే.. ‘‘అడ్డగోలుగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం తప్పు. అసలు కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయండని కోరడానికి ఒక కారణముంది. కేబినెట్ నోట్ రూపొందాక కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటై, బిల్లు ముసాయిదా అయిపోయాక చివరిగా అది అసెంబ్లీకి వస్తే అపుడు మనం తీర్మానం ద్వారా వ్యతిరేకించినా దానికి ప్రాధాన్యత ఉండదు. అలా కాకుండా ఇపుడే అసెంబ్లీని సమావేశ పరచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే అపుడు కేంద్రంలోని పెద్దలు, దేశంలోని అందరూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తారు. అది చూసి కాస్తో కూస్తో వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుందనే ఆశతోనే గవర్నర్‌ను కూడా కలిశాం’’ అని జగన్ వివరించారు. విభజన విషయంలో పలు పార్టీల తీరును తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎంలు... ఈ మూడు పార్టీలే మనసా వాచా సమైక్యానికి కట్టుబడి ఉన్నాయని, మిగిలిన పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు ఈ వ్యవస్థలో కనిపించడం లేదన్నారు. సమస్యపై ఒక తండ్రిలా ఆలోచించాల్సిన పరిస్థితి కాకుండా మున్ముందు పిల్లలు కొట్టుకునే పరిస్థితి రానివ్వడం బాధ కలిగిస్తుందన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తుంటే.. అడగాల్సిన ధర్మం, బాధ్యత ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని అడక్కుండానే విభజన జరగనిస్తోందని దుయ్యబట్టారు. రోజూ నీటి కోసం కొట్టుకునే పరిస్థితికి నెడుతున్నారు... ‘‘నేను ఒక్క మాట అడుగుతున్నా... ఇవాళ రాష్ట్రాన్ని విభజించే వాళ్లు ఏమైనా ఆలోచన చేశారా..? రాష్ట్రాన్ని ఒక్కసారి తిరిగి చూడండి. రాష్ట్రం సమష్టిగా ఉన్నప్పుడే మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తరువాత, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్ డ్యాంలు నిండిన తరువాత కృష్ణా నదిలో కిందికి నీళ్లు రాని పరిస్థితి, వదలని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలంకు నీళ్లెలా వస్తాయి..? నాగార్జునసాగర్‌కు నీళ్లెలా వస్తాయి..? ఈ పెద్దలను అడుగుతున్నా. ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాను అంటే.. ట్రిబ్యునళ్లు ఏం చెప్పినా... కోర్టులు ఏం చెప్పినా... ప్రధానమంత్రులు ఏం చెప్పినా కూడా రాష్ట్రం ఒకటిగా ఉన్నపుడే ఈ పరిస్థితి ఉంటే.. ఇక మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్లు తప్ప మంచినీళ్లు కూడా ఎక్కడా దొరకని పరిస్థితుల్లోకి ఇవాళ ఈ కేంద్ర పెద్దలు, ఈ రాష్ట్ర పెద్దలు రాష్ట్రాన్ని తీసుకెళుతున్నారు. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలే కాదు.. ప్రకాశం, నెల్లూరే కాదు.. కృష్ణా, గుంటూరే కాదు.. పశ్చిమగోదావరిలోని సగం ప్రాంతాలే కాదు.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్.. మొత్తం ఈ మూడు జిల్లాలతో పాటు ఈ ఎనిమిదిన్నర జిల్లాలు కూడా మొత్తం ప్రతి రోజూ నీటి కోసం కొట్టుకుని తన్నుకునే పరిస్థితి నెలకొంటుంది. మరో విషయం.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు చిట్ట చివరన వస్తుంది. రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్లెక్కడి నుంచి ఇస్తారు..? కేంద్ర పెద్దలను, రాష్ట్ర పెద్దలను అడిగాం. లేఖలు రాశాం. రాష్ట్రం ఎడారి అవుతుందని కూడా నిలదీశాం’’ అని అన్నారు. హైదరాబాద్ మీది కాదు పొమ్మంటారా? అడ్డగోలుగా విభజన చేసి హైదరాబాద్ వదిలిపెట్టి పొమ్మని చెప్పటం ఎంతవరకు న్యాయమని జగన్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి 50 శాతం ఆదాయం 50 శాతం బడ్జెట్ హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని గుర్తుచేశారు. ‘‘మీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కాదు పొమ్మంటే, పదేళ్లలో హైదరాబాద్‌ను వదిలి వేరే చోట రాజధాని నగరాన్ని కట్టుకోమంటే... ఏంటి పరిస్థితి? అప్పుడు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు సంక్షేమ పథకాలన్నీ కూడా నడిరోడ్డున ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్న పిల్లవాడైనా తన చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరంవైపు చూస్తున్నారు.. అలాంటప్పుడు వారి భవిష్యత్తేంకావాలి?’’ అని నిలదీశారు. సమైక్యం అంటే మూడు ప్రాంతాలూ... రాయలసీమ, కోస్తా, తెలంగాణతో కూడిన సమైక్య రాష్ట్రం మాకు కావాలని జగన్ విస్పష్టంగా చెప్పారు. ‘‘సమైక్యం అంటే అది ఒక్క రాయలసీమనే కాదు, కోస్తాంధ్రనే కాదు, తెలంగాణ కూడా కలిపి అంటున్నాను. మాకు తెలంగాణ కావాలి.. మాకు రాయలసీమ కావాలి.. మాకు కోస్తాంధ్ర కూడా కావాలి. అదే సమైక్యం అంటే. ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ సోదరుడికి గట్టిగా ఒక్క మాట చెప్పగలుగుతా.. ప్రతి తెలంగాణ సోదరుడినీ అభివృద్ధి వైపు నేను నడిపిస్తానని గట్టిగా హామీ ఇవ్వగలుగుతాను. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు అన్నది గతంలో ఎవ్వరూ కూడా ఆలోచన చేయలేదు. ఆలోచన చేసిందల్లా వె .ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ఈ ప్రాజెక్టును ఆయన చనిపోయాక పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడగొట్టడమనేది పరిష్కారం కాదు’’ అని స్పష్టంచేశారు. నాటి మా లేఖను ఒక్కసారి పరిశీలించండి... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరితే తమ వ్యతిరేకులు అనేక విమర్శలు చేస్తున్నారని.. తామేదో యూ టర్న తీసుకున్నామని అంటున్నారని జగన్ తప్పుపట్టారు. తమ పార్టీ తరఫున కేంద్ర హోంమంత్రికి ఇచ్చిన లేఖలోని అంశాలను ఒక్కసారి పరిశీలించాలని కోరారు. ‘‘రకరకాల మాటలపై జైల్లో ఉన్నపుడు స్పందించలేకపోయా... కానీ మనసుకు బాధ కలిగింది. నేను ప్లీనరీ సమావేశాల్లో చెప్పిన మాటలను ఒక్కసారి తిరగేయండి. మా పార్టీ హోంమంత్రికి లేఖ ఇచ్చినపుడు ఆ లేఖలో రాసిన అంశాలను ఒక్కసారి చూడండి.. అని ప్రతి ఒక్కరినీ అడుగుతున్నా. ఎవరికీ అన్యాయం జరుక్కుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని ఆ లేఖలో స్పష్టంగా రాశాం. ఇవాళ 60 శాతం ప్రజలు రోడ్లెక్కారు, 60 రోజుల నుంచి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. రోడ్లమీదకు వచ్చి బంద్‌లు చేస్తున్నారు. 60 శాతం మంది ప్రజలు రోడ్లెక్కి ‘అన్యాయం జరుగుతా ఉంది’ అనంటే.. ఇది అన్యాయంగా మీకు కనపడ్డం లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇన్ని ధర్నాలు, సమ్మెలు జరుగుతూ ఉంటే మీరెలా చెప్పగలరు.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని..?’’ అని ఘాటుగా విమర్శించారు. ప్రజల మనసుల్లో సమైక్య భావనను తీసేయలేరు... ‘‘ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు రావాలి. ఈ వ్యవస్థల్లో నిజాయితీ రావాలి. ఒక్కటే చెప్తున్నా.. చంద్రబాబు గారికి ఏం నష్టం జరుగుతుందో నాకూ అదే నష్టం జరిగేది. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఓట్లు సీట్లు పోతాయని చంద్రబాబు మాట్లాడలేదు. నేను జైలులో ఉన్నందున మాట్లాడలేని, స్పందించలేని పరిస్థితిలో ఉన్నాను’’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్ నగరం నుంచి బయటకు పోకుండా ననై్నతే కట్టడి చేస్తున్నారు గాని ప్రజల మనసుల్లో కలసి ఉండాలన్న భావనను ఎవరూ కూడా తీసేయలేరు. అందుకే సమైక్య ఉద్యమంలో భాగంగా సమైక్య శంఖారావం పేరుతో హైదరాబాద్‌లో అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఒక భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నాం. ఈ విషయం మీద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ.. అందరూ కూడా ఆ సభకు విచ్చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరగాలి... సమైక్యానికి కట్టుబడుతూ జేఏసీ తమ ఇష్టమొచ్చిన లేఖను తీసుకొచ్చినా ఒక పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటి సంతకం తాను పెడతానని జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ‘‘ఇవాళ మూడు పార్టీల నుంచి నాలుగు పార్టీలు ఆ తరువాత ఐదు పార్టీలు అవుతాయి. చంద్రబాబుగారు ఏమో లేఖ వెనక్కి తీసుకోరు. సమైక్యానికి కట్టుబడి ఉన్నట్లుగా తాను లేఖ ఇవ్వరు. తాను రాజీనామా చేయరు. కానీ బయటేమో ప్రజల వ్యతిరేకత ఎక్కడ వస్తుందోనని చెప్పి నియోజకవర్గాల్లో మాత్రం చంద్రబాబుకు సంబంధించిన నేతలు నిస్సిగ్గుగా జేఏసీ మీటింగ్‌లలో పాలు పంచుకుంటారు. నేను కోరేదేమంటే ప్రజలందరూ ఒక్కటై ప్రతి రాజకీయ పార్టీనీ ప్రశ్నించాలి. చంద్రబాబు గారితో మొదలు పెట్టి అందరినీ అడగాలి. ‘అయ్యా... నువ్వు సమైక్యానికి మద్దతుగా లేఖ ఇవ్వనపుడు.. ఎందుకు మీ పార్టీ వాళ్లు జేఏసీకి వస్తున్నారు?’ అని ప్రశ్నించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అపుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. పార్టీ పెద్దలు లేఖల మీద సంతకాలు పెట్టాలి. అపుడు తేటతెల్లంగా మూడు పార్టీలు కాస్తా నాలుగూ ఐదూ అవుతాయి. అప్పుడు విభజనకు అనుకూలంగా నాలుగు, వ్యతిరేకంగా నాలుగు పార్టీలవుతాయి. లేకపోతే సమైక్యానికి ఐదు, విభజనకు మూడు పార్టీలు కూడా అవుతాయి. అపుడే ఈ రాష్ట్రం విడిపోకుండా ఆపగలుగుతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు. -
మా ఒత్తిడి వల్లే ముందుకు వెళ్లని తెలంగాణ: పురంధేశ్వరి
ఢిల్లీ: తమ ఒత్తిడి వల్లే తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదని కేంద్రమంత్రి పురంధేశ్వరి చెప్పారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివరిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణపై కేబినెట్ నోట్‌కు ఇంకా తుది మెరుగులు దిద్దలేదని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ సిఫారసులు కూడా కేబినెట్ నోట్లో ఉంచాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. -
కార్యాచరణ కోసం త్వరలో నేతలు భేటీ
-
నవంబరు13న పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు : బలరాంనాయక్
దుగ్గొండి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లు నవంబర్ 13న పార్లమెంట్‌కు వస్తుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ తెలిపారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ఆదివారం ‘ఇంటింటికీ కాంగ్రెస్ జెండా-సోనియా అండ’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రకటన చేశాం. కేబినేట్ నోట్ రెడీ అయింది. ఇక రాష్ట్ర ఏర్పాటే తరువాయి అని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగిన సుదీర్ఘ నిర్విరామ పోరాటాలకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తగిన ప్రతిఫలాన్ని ఇచ్చారన్నారు. -
ఇప్పుడెందుకు చెప్పినట్టు ?
నోట్ సిద్ధమయ్యాక నోరు విప్పడంలో ఆంతర్యమేంటి? సీఎం కిరణ్ వ్యాఖ్యలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో అనుమానాలు ముందే చెబితే ‘డిసెంబర్ 23’ పునరావృతమయ్యేదని వ్యాఖ్య సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగిన రెండు నెలలకు సందేహాలా? నిర్ణయం ముందే తెలిసినప్పుడు నిమ్మకు నీరెత్తిన సీఎం తుది ఘట్టంలో సమస్యల ఏకరువు ఎందుకు? అంతా అధిష్టానం డెరైక్షన్లోనే జరుగుతోందా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసిన 60 రోజుల తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్టుండి శుక్రవారం మీడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా పెదవి విప్పడంపై కాంగ్రెస్ నేతల్లో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం పార్టీ నేతలను బుజ్జగిస్తూ వచ్చిన కిరణ్, తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమై త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ముందుకు రానున్న తరుణంలో... ‘సమస్యలున్నాయి’ అంటూ ఏకరువు పెట్టడంలో ఆంతర్యమేంటన్న దానిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే బాధ్యతను కిరణ్ నెత్తికెత్తుకున్నారని, పార్టీ అధిష్టానం వ్యూహంలో భాగంగానే తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. తెలంగాణపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని గత జూన్ నుంచీ అధిష్టానం పెద్దలు చెబుతూనే వస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా జూలై 30న యూపీఏ, సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఇంత ప్రక్రియ నడిచినా, విభజనతో సమస్యలు తలెత్తుతాయని ఎప్పుడూ చెప్పని కిరణ్, తాజాగా ఇలా తెర ముందుకు రావడం వెనుక పెద్ద మతలబే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ విభజన ప్రక్రియ పూర్తయ్యేదాకా సీఎంగా కొనసాగాల్సిందేనని ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అధిష్టానం పెద్దలు ఆదేశించగా సరేనని తిరిగొచ్చిన కిరణ్ తాజా వ్యాఖ్యల వెనుక కూడా పెద్దల ఆదేశాలే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు చెప్పిన విషయాలనే కోర్‌కమిటీ ముందు హాజరైనప్పుడు గానీ, సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడు గానీ కిరణ్ బహిరంగంగా చెప్పి ఉంటే నేడు సీమాంధ్రలో ఉద్యమం చేయాల్సిన అవసరమే ఉండేది కాదంటున్నారు. కనీసం కోర్‌కమిటీ భేటీకి ముందుగానీ, భేటీలోగానీ ఇదే వాదనను ఆయనెందుకు గట్టిగా వినిపించలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేనంటున్నారు. రాష్ట్ర విభజన దిశగా 2009 డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేసినప్పుడు కిరణ్ అసెం బ్లీ స్పీకర్‌గా ఉన్నారని, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు సమర్పించడంతో కేంద్రం ఒక్కసారిగా వెనక్కు తగ్గుతూ డిసెంబర్ 23న మరో ప్రకటన చేసిందని నేతలు గుర్తుచేస్తున్నారు. కిరణ్ది నిజంగా సమైక్యవాదమే అయితే ఇన్ని రోజులపాటు ఎందుకు మౌనం దాల్చారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేయాలని దిగ్విజయ్‌సింగ్ ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితుడయ్యాక తొలిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కిరణ్‌తో పాటు డిప్యూటీ సీఎం దామోదర, పీసీసీ చీఫ్ బొత్సలను ఆదేశించారు. అంతేగాక దానిపై పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా నేతలంతా కట్టుబడి ఉండాలని చెప్పారు. వారు ముగ్గురూ అందుకు సరేనన్నారు. తర్వాత జూలై 12న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర హోం శాఖ కార్యాచరణ ప్రణాళికను అందజేసింది. అంతేగాక తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని కూడా సంకేతాలిచ్చారు. అప్పటి నుంచి సీడబ్ల్యూసీ తీర్మానం దాకా కిరణ్ మూడు దఫాలు ఢిల్లీ వెళ్లారు. సోనియాతోపాటు రాహుల్‌నూ రెండుసార్లు కలిశారు. మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, చిదంబరం, దిగ్విజయ్‌సింగ్ వంటి పార్టీ పెద్దలతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. వాటన్నిం ట్లోనూ కిరణ్‌కు వారు చెప్పిన మాటల సారాంశం ఒక్కటే... తెలంగాణకు నిర్ణయం జరిగిపోయిందనే! అయినా ఏ రోజూ కిరణ్ తన వైఖరేంటో బహిరంగంగా చెప్పలేదు. పైగా విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలకు సిద్ధపడ్డ సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కూడా, ‘ఇంకా నిర్ణయం కాలేదు, తొందరపడొద్దు’ అని వారిస్తూ వచ్చారు. అలాగాక అధిష్టానం నిర్ణయం కిరణ్‌కు తెలియగానే దాన్ని రాష్ట్ర నేతలకు చేరవేస్తే అంతా మూకుమ్మడిగా పార్టీపై ఒత్తిడి తెచ్చేవారమని, లేదంటే అందరమూ రాజీనామా చేసి సంక్షోభం సృష్టిస్తే అసలు విభజన నిర్ణయమే జరిగేది కాదని సీమాంధ్ర నేతలు వాపోతున్నారు. అలాగాక ఉన్నట్టుండి, ‘సమస్యలు’ అంటూ కిరణ్ ఈ రోజు కొత్తగా మాట్లాడుతుండటం వింతగా ఉందని సీమాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరన్నారు. ‘‘గత 50 రోజులుగా సీమాంధ్రలో తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్నా సీఎం హోదాలో కిరణ్ స్పందించను కూడా లేదు. రాష్ట్రం అతలాకుతలమవుతున్నా కనీసం క్యాంపు ఆఫీసు నుంచి బయటకు రాలేదు’’ అని గుర్తు చేశారు. సమైక్యోద్యమాన్ని పక్కదారి పట్టించడానికో, అధిష్టానం ఆదేశాల మేరకో కిరణ్ ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేస్తున్నట్టు గతంలో ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా వార్తలు రాగా తీవ్రంగా ఖండించడం తెలిసిందే. పైగా అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు! -
సడలని సంకల్పం
సాక్షి, కడప: సమైక్య ఉద్యమం ఊహించని విధంగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 31న జిల్లా వాసులు బిగించిన పిడికిలి 60రోజులైనా సడలలేదు. 60రోజుల ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలు తలెత్తాయి. ఓ వైపు సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే..మరో వైపు కేంద్రం తెలంగాణపై కేబినేట్ నోట్ సిద్ధం చేస్తోందని... ఈ పరిస్థితుల్లో ఉద్యమం అవసరమా? అని కొందరు తడబడ్డారు. ఆర్థిక సమస్యలతో ఉద్యమాన్ని నడపడం కష్టమవుతోందని మరికొందరు నీరసించారు. అయితే సమైక్య ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న వారు మాత్రం ఏ దశలోనూ పట్టువీడలేదు. లక్ష్యంపై నమ్మకాన్ని కోల్పోలేదు. సమైక్యసాధన కోసం ఎప్పటికప్పుడు భవిష్యత్ కార్యాచరణ రచిస్తూ, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ‘సీమ’ నష్టంపైనే ప్రధానంగా ఫోకస్: ఉద్యమం మొదలైనప్పుడు సమైక్యంగా ఉండాలని అందరూ మాట్లాడారు. చాలామంది ప్రజలు కూడా ఇదే పెద్ద సమస్య అని భావించారు. అయితే ఉద్యమకాలంలో సమైక్యనేతల గళం కూడా మారుతోంది. విడిపోతే సీమకు ముఖ్యంగా జిల్లాకు వాటిల్లే నష్టాలను ఏకరువు పెడుతున్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదని, విడిపోతే మరిన్ని కష్టాలు తప్పవని వివరిస్తున్నారు. మొన్నటి వరకూ జల కేటాయింపులంటే ఏమిటో చాలామందికి తెలియదు. ఉద్యమ ప్రభావంతో అధికశాతం మంది విడిపోతే ఏ ప్రాజెక్టు ఏమవుతుందో, ఏ ప్రాంతం ఎడారిగా మారుతుందో ఇట్టే చేప్పే అవగాహన తెచ్చుకున్నారు. విడిపోతే తలెత్తే నష్టాలపై ఇప్పుడే ఉద్యమించాలని సంకల్పించారు. సమష్టిగా ఉద్యమిస్తున్నారు. అందుకే ఉద్యమం రోజురోజుకూ బలోపేతం అవుతోంది. ఓవైపు ఆర్థికంగా నష్టపోతున్నా ఉద్యమానికి ప్రజలు, వ్యాపారుల నుంచి మద్దతు లభిస్తోంది. విజయవంతగా సాగుతోంది. పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడినా: దాదాపు రెన్నెళ్లుగా పిల్లల చదువులు ఆగిపోయాయి. ఉద్యమంతో పిల్లల చదువుకు నష్టం వాటిల్లుతోందని, తరగతులకు వెళదామని కొందరు టీచర్లు ఆలోచిస్తున్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌పై అధికంగా ఆధారపడుతున్నామని, విడిపోతే అది శాశ్వతంగా దూరమవుతుందని విద్యావంతులు విద్యార్థులకు వివరిస్తున్నారు. మీ భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెబుతున్నారు. దీంతో విద్యార్థులూ సమైక్యరాష్ట్రంలో భాగస్వాములవుతున్నారు. జీతాలు లేక ఇబ్బందులతో..: ఉద్యమంలో ఆర్టీసీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగులూ సమ్మెలో ఉండటంతో సెప్టెంబరు 1న జీతాలు అందలేదు. అక్టోబరు 1న కూడా అందే పరిస్థితి లేదు. దీంతో అటెండర్లు, చిన్నస్థాయి ఉద్యోగులతో పాటు చాలామంది ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరిలో ఉద్యమంతో ఇబ్బంది పడుతున్నామనే బాధ లేదు. విడిపోతే తలెత్తే కారణాలు తెలుసుకుని బాసటగా నిలుస్తున్నారు. జిల్లాలోని 26వేలమంది ఉద్యోగులకు ఇప్పటికే 80 కోట్ల రూపాయల వేతనాలు నిలిచిపోయాయి. ఉద్యమంతో జిల్లాకు దాదాపు 1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయినప్పటికీ తెలంగాణలోని సకల జనుల సమ్మెను సీమాంధ్ర సకలజనుల సమ్మె దాటిపోయింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 2011 సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకూ సకలజనుల సమ్మె కొనసాగింది. ప్రస్తుతం సమైక్యరాష్ట్రం కోసం ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యమం సాగుతోంది. ఇప్పటికి సకజనుల సమ్మె మొదలై 45 రోజులు పూర్తయింది. వైఎస్సార్సీపీ ప్రకటనపై ఉద్యోగుల్లో చర్చ: అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తీర్మానం చేయాలని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగుల్లో మద్దతు లభిస్తోంది. -
‘నోట్’పై నాటకం
-
నిర్ణయం మారదు!
* అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ నోట్ * కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వెల్లడి * సీడబ్ల్యూసీ నిర్ణయంపై కాంగ్రెస్ వెనక్కి వెళ్లదని పునరుద్ఘాటన * ఆంటోనీ కమిటీ పరిశీలనలు తెలంగాణ నోట్లో చేర్చరు.. బిల్లులో చేరుస్తారని స్పష్టీకరణ * రాష్ట్ర విభజన జరిగే వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పునరుద్ఘాటించారు. తెలంగాణపై హోం శాఖ రూపొందిస్తున్న కేబినెట్ నోట్ వచ్చే నెల మొదటి వారంలో జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకొచ్చే అవకాశాలున్నాయని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయాలను ప్రాంతీయ పార్టీల మాదిరిగా తరచుగా మార్చుకోదని స్పష్టం చేశారు. ఆయన గురువారంనాడిక్కడ తనను కలిసిన విలేకరులతో చెప్పారు. సుదీర్ఘ కాలం సాగిన విస్తృతస్థాయి సంప్రదింపుల అనంతరమే, అత్యధిక రాజకీయ పార్టీల అభిమతానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకొందని వెల్లడించారు. నిర్ణయం వెలువడిన తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ అభిప్రాయాలను మార్చుకొన్నంత సులువుగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మార్చుకోవడం సాధ్యపడదని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోగానే మంత్రివర్గ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ పరిశీలనకు పంపుతామని దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. సీమాంధ్రులు ప్రస్తావిస్తున్న హైదరాబాద్ నగరం, నదీజలాల పంపిణీ వంటి కీలక అంశాలపై ఆంటోనీ కమిటీ చేయనున్న సిఫార్సుల ఆధారంగానే పార్లమెంట్ ఆమోదానికి సమర్పించనున్న తెలంగాణ బిల్లు రూపొందుతుందని ఆయన వెల్లడించారు. ఆంటోనీ కమిటీ నివేదిక వెలువడడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదిస్తూ హోం శాఖ కేంద్ర మంత్రివర్గానికి సమర్పించనున్న కేబినెట్ నోట్‌కు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ నిర్ణయానంతరం తెలంగాణ బిల్లును సిద్ధం చేసే దశలోనే ప్రభుత్వం ఆంటోనీ కమిటీతో చర్చలు జరుపవచ్చునన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పార్టీలు, ప్రభుత్వాల నిర్ణయాలు ఉండి తీరాలంటూ తాను రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నానన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు దిగ్విజయ్నిరాకరించారు. అయితే, రాజకీయ పార్టీల వైఖరులు, విధానాల కంటే ప్రజాభిప్రాయమే గొప్పదన్న ఆయన అభిప్రాయంలో తప్పేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్న పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తానని విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఆఖరి బంతి వరకు ఆట ముగియదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను గుర్తుచేయగా, ఆ వ్యాఖ్య లలిత్మోడీది అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. అధిష్టానాన్ని ధిక్కరించే ధోరణిలో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్ర విభజన జరిగేంతవరకూ కిరణ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. అయితే, ఆయన ఏ ఒక్క ప్రాంతానికో కాకుండా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. హోంమంత్రి షిండేతో చర్చలు అంతకుముందు, దిగ్విజయ్‌సింగ్ నార్తబ్లాక్లోని హోం శాఖ కార్యాలయానికి వెళ్లి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి తెలంగాణపై కేబినెట్ నోట్ గురించి చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యేవరకూ కేబినెట్ నోట్‌తో ప్రభుత్వం ముందుకు వెళ్లరాదంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్ హోం మంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. హోం మంత్రితో చర్చల అనంతరమే హైదరాబాద్ నగర ప్రతిపత్తి, నదీజలాల పంపిణీ వంటి కీలకాంశాలపై తెలంగాణ బిల్లును రూపొం దించే సమయంలో మాత్రమే ఆంటోనీ కమిటీతో ప్రభుత్వం సంప్రదిస్తుందని ఆయన ప్రకటించడం గమనార్హం. సోనియాతో పల్లంరాజు భేటీ ఇదిలా ఉండగా, సీమాంధ్రకు చెందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు గురువారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకొని తెలంగాణ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను, దాదాపు రెండు మాసాలుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను వివరించినట్లు తెలియవచ్చింది. ఆంటోనీ కమిటీ నివేదిక రాకుండా, విభజనతో తలెత్తే సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు కనుగొనకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ముందుకెళ్లరాదని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. విభజనను అడ్డుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన సీమాంధ్ర నేతలు చివరి ప్రయత్నంగా పార్టీ అధ్యక్షురాలిని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకొనేందుకు వారం రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ అపాయింట్మెంట్ దొరకలేదు. పళ్లంరాజుకు మాత్రమే సోనియా అపాయింట్మెంట్ దొరకడం గమనార్హం. సోనియాతో భేటీకి ముందు, పల్లంరాజు, మరో కేంద్ర మంత్రి జె.డి.శీలంతో పాటు దిగ్విజయ్‌ని కలసి చర్చించారు. -
‘నోట్’పై నాటకం
కేబినెట్ నోట్లోని కీలకాంశాలన్నీ రాష్ట్ర ముఖ్యులకు ముందే తెలుసు వారికి పూర్తిగా వివరించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు విభజన ప్రక్రియను సాఫీగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కిరణ్‌కే అందుకే... రాజీనామాలొద్దంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు ‘హితవు’ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు విభజనకు అనుకూలంగానే ఓటేయనున్న బొత్స వర్గీయులు, మరికొందరు! పలువురు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో ఈ దిశగా కిరణ్ తదితరుల మంతనాలు అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోసంగతంలోనే తీర్మానించిన వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోం శాఖ రూపొందిస్తున్న కేబినెట్ నోట్లో పొందుపరిచిన కీలకాంశాలన్నీ రాష్ట్ర ముఖ్య నేతలకు ముందే తెలుసు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారికి ఇప్పటికే పూర్తి సమాచారం ఇచ్చారు. అయినా రాష్ట్ర నేతలంతా తమకేమీ తెలియదన్నట్టుగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. పైగా విభజన ప్రక్రియలో అధిష్టానానికి పూర్తిగా సహకరిస్తున్నారు! ప్రక్రియను సాఫీగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను పెద్దలు కిరణ్ భుజస్కంధాలపైనే పెట్టారు. అందుకే... విభజన ప్రక్రియ అసెంబ్లీ తీర్మానం వరకూ వచ్చేదాకా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా ఎలాగోలా నిలువరించడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమైందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కొద్దిరోజుల కిందట ప్రకటించడం తెలిసిందే. అందులోని అంశాలన్నింటినీ రాష్ట్ర ముఖ్యులకు ఇప్పటికే తెలియజేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అంతేగాక సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతతో పాటు, ‘విభజన ప్రక్రియను మీరే ముందుకు తీసుకెళ్లాలి’ అన్న అధిష్టానం ఆదేశాల వల్లే సదరు నేతలు తమకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అంతేగాక, తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు పీసీసీ చీఫ్ బొత్స వర్గీయులు పలువురు విభజనకు అనుకూలంగానే ఓటేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరికొందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలను కూడా అందుకు ఒప్పించేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం! తెలంగాణ అంశంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జూలై 7న రోడ్‌మ్యాప్‌లతో ఢిల్లీకి వెళ్లడం, సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కోర్‌కమిటీ భేటీలో పాల్గొనడం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర హోం శాఖ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆ ముగ్గురు నేతలకు అదే రోజున పెద్దలు అందజేశారని తెలుస్తోంది. అనంతరం జూలై 30 వ తేదీన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తూ తీర్మానం చేసింది. తర్వాత కొత్త రాష్ట్ర ఏర్పాటు కోసం తీసుకోవలసిన చర్యలకు సంబంధించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో కేంద్ర హోం శాఖ కొన్ని మార్పులు చేసి మొత్తం ప్రక్రియకు పట్టే గడువును కుదించింది. కొత్త గడువుతో రూపొందించిన ప్రణాళిక కూడా అప్పట్లో మీడియాలో విస్తృతంగా రావడం తెలిసిందే. ‘‘తెలంగాణ విషయంలో తీసుకుంటూ వచ్చిన నిర్ణయాలన్నింటినీ మొదటి నుంచీ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని ముఖ్య నేతలకు చెబుతూ వస్తున్నాం. తెలంగాణపై అధిష్టానం వైఖరేమిటి, ఎలాంటి నిర్ణయాలు చేయబోతున్నాం, విభజన ప్రక్రియ ఎప్పట్లోగా ముగుస్తుంది వంటి అన్ని వివరాలనూ అధిష్టానం పెద్దలు వారికి ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు’’ అని ఏఐసీసీలోని అత్యున్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఏ నిర్ణయానికైనా కట్ట్టుబడి ఉంటామని అప్పుడు వారంతా చెప్పారు. వారే గనుక ఆ రోజే వద్దని చెప్పి ఉంటే విభజన నిర్ణయం జరిగేదే కాదు. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు తలెత్తాయని ఇప్పుడు పార్టీ పెద్దలను నిందించి ప్రయోజనం లేదు’’ అని పేర్కొన్నాయి. తీర్మానాన్ని అడ్డుకుంటామంటూ... నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందాలన్న నిబంధనేమీ లేదు. ఈ నేపథ్యంలో తీర్మానం వీగేలా చేద్దామన్న కాంగ్రెస్ ముఖ్యుల మాటలన్నీ కాలయాపన ఎత్తుగడలేనన్న వాదన పార్టీలోనే గట్టిగా విన్పిస్తోంది. సరిగ్గా దీన్నే సాకుగా చూపుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా కిరణ్ ఇంతకాలంగా వారిస్తూ వస్తున్నారు. వారు రాజీనామాలు చేస్తే మొత్తం వ్యవహారం గందరగోళంలో పడటంతో పాటు రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుందని, సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలా జరిగితే కాంగ్రెస్ ప్రతిష్ట జాతీయ స్థాయిలో దెబ్బ తింటుందని, సీడబ్ల్యూసీ తీర్మానానికి ఆ పార్టీ నేతలే కట్టుబడిలేరన్న అప్రతిష్ట వస్తుందని, దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని ఏఐసీసీ పెద్దల్లో ఆందోళన నెలకొంది. అందుకే విభజనపై అసెంబ్లీ అభిప్రాయ సేకరణ ప్రక్రియను సాఫీగా కొనసాగించాల్సిన బాధ్యతను వారు కిరణ్‌పైనే పెట్టారు. ఆయన మొదట్లో కొంత బెట్టు చేసినా తర్వాత అందుకు అంగీకరించినట్టు సమాచారం. కేబినెట్ నోట్ రూపొందకముందే సమైక్య రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ విసృ్తత స్థాయి సమావేశం గత శుక్రవారం (20వ తేదీ) తీర్మానాన్ని కూడా ఆమోదించడం తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా అధిష్టానం గేమ్ ప్లాన్‌కు అనుగుణంగా నడుస్తున్న కారణంగానే దానిపై వారెవరూ స్పందించలేదు. 3వ అధికరణ ఏం చెబుతోందంటే... కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల్లో ప్రాంతాల, సరిహద్దు, పేర్ల మార్పు చేయాలంటే పార్లమెంట్ చట్టం ద్వారానే చేయాలి... ఎ. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం, ఉన్న రెండు, మూడు రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని చేయడం, రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. బి. రాష్ట్రం విస్తీర్ణం పెంచడం సి. రాష్ట్రం విస్తీర్ణం తగ్గించడం డి. రాష్ట్రం సరిహద్దులు మార్చడం ఈ. రాష్ట్రం పేరు మార్చడం చేయాలంటే... రాష్ట్రపతి సిఫార్సు ఆధారంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. బిల్లు ప్రభావం రాష్ట్రాల్లోని ఏదైనా ప్రాంతం, సరిహద్దులు, పేరు మార్పులపై ఉంటే బిల్లును ఆ రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి పంపి, నిర్దిష్ట గడువు లోపు అభిప్రాయాలు కోరవచ్చు. సదరు గడువును రాష్ట్రపతి పొడిగించవచ్చు. నోట్‌పై నోరు మెదపని నేతలు విభజనపై కేబినెట్ ముసాయిదా నోట్లోని కీలకాంశాలన్నీ రాష్ట్ర ముఖ్యులు పలువురికి తెలిసినా మౌనం పాటిస్తుండటానికి పలు కారణాలున్నాయి. తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయడం, అందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయడం, ప్రజాప్రతినిధులెవరూ రాజీనామా చేసి ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివన్నీ అందులో భాగం. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తే ప్రక్రియను ముందుకు తీసుకుపోవడంలో ఆటంకాలు కలుగుతాయన్న ఆలోచనతో అధిష్టానం ఆదేశాలను వారు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేశాక రాష్ట్రపతి దాన్ని అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపుతారు. అయితే అభిప్రాయం కోరడమే తప్ప తీర్మానం ఆమోదం పొందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాకపోతే దానికి వ్యతిరేకంగానో, అనుకూలంగానో అసెంబ్లీ అభిప్రాయం మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అలా అసెంబ్లీ అభిప్రాయం కోరిన సమయంలో అసలు అసెంబ్లీయే లేని పరిస్థితి (కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోతుంది గనుక) ఉంటే మొత్తం పరిస్థితి మొదటికొస్తుంది. కాబట్టి ఎలాగైనా విభజన ప్రక్రియను సాఫీగా ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యమని రాష్ట్ర ముఖ్యులకు అధిష్టానం స్పష్టంగా చెప్పింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలతోనూ ‘తెలంగానం’! మరోవైపు తెలంగాణపై అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ సమయంలో విభజనకు అనుకూలంగా ఉండేలా కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కిరణ్, ఇతర పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అనుసరించి విభజన ప్రక్రియను సాఫీగా కొనసాగించాల్సిన బాధ్యతను అధిష్టానం తనపై పెట్టినందున కిరణ్ ఆ దిశగా ముందుకు కదులుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ సాఫీగా సాగేట్టు చూస్తే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయనకు చెప్పినట్టు కూడా కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. ‘‘విభజనకు అనుగుణంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం వైపు నిల్చేలా సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కిరణ్ తదితరులు చర్చలు సాగిస్తుండటం నిజమే. బొత్స ఇప్పటికే తాను విభజనకు అనుకూలమని ప్రకటించారు. ఆయన వర్గంగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు విభజనకే ఓటు వేస్తారు. వారితో పాటు మరికొందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలను కూడా ఆ దిశగా పార్టీ నేతలు అంగీకరింపజేస్తున్నారు. దాదాపు 30 మంది దాకా విభజన కు అనుకూలంగా ఉండనున్నారు’’అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు జిల్లాలవారీగా విశ్లేషణ చేస్తూ వివరించారు! -
ప్రత్యేక తెలంగాణ నోట్ తయారవుతుంది:దిగ్విజయ్
-
ఎవరి వాదన వారిదే
-
కాంగ్రెస్‌కు ఇది సూసైడ్ నోట్
పుత్తూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ నోట్ ప్రకటిస్తే అది ఆ పార్టీకి సూసైడ్ నోట్ అవుతుందని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. సోమవారం పుత్తూరులో నిర్వహించిన సమైక్య రైతు శంఖారావంలో ఆమె మాట్లాడారు. విభజన అంశంపై సీమాంధ్ర ఉద్యమకారులు ఏదైనా చెప్పుకోవాలంటే ఆంటోని కమిటీ పరిశీలిస్తుందని తెలిపిన కాంగ్రెస్ పెద్దలు ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే తెలంగాణా పై నోట్‌ను ఎందుకు వేగవంతం చేస్తున్నారని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై కొందరు హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం పేద ప్రజల రెక్కల్లోనించి వచ్చిందన్నారు. జీతాల కన్నా జీవితాలే ముఖ్యమంటూ ఉద్యోగులు సైతం ముందుకొస్తున్నారన్నారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తును ఫణంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ఉద్యమాన్ని ఎవరైనా హేళన చేసి మాట్లాడితే వారికి పుట్టగతులుండవన్నారు. సీమాంధ్ర ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు అధిష్టానంతో ఎందుకు గట్టిగా మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు. వారంతా తమ పదవులు కాపాడుకునేందుకే ఢిల్లీ వదలి రావడం లేదని, ఒకవేళ వస్తే ఆ యా నియోజకవర్గాల్లో ప్రజలు కొడతారనే భయం వారిని వెంటాడుతోందన్నారు. ట్రాక్లర్ల ర్యాలీ సమైక్య రైతు శంఖారావంలో భాగంగా సోమవారం పుత్తూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆర్కే. రోజా ట్రాక్టర్ నడిపి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా స్థానిక ఆరేటమ్మ ఆలయం నుంచి ర్యాలీ ప్రారంభమై కాపు వీది, బజారు వీధి నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా గేట్ పుత్తూరు, ఆర్డీఎం సర్కిల్ వరకు సాగింది. అనంతరం రోజా ఎండ్ల బండిపై ఎక్కి ప్రదర్శనగా అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి విభజన అంశం రద్దు చేసేవిధంగా కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ముందుగా ట్రాక్టర్ ర్యాలీని జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ప్రా రంభించారు. సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, జెడ్పీటీసీ మాజీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఎం. సురేంద్రరాజు, నగరి, పుత్తూరు, నిండ్ర, వడమాలపే ట, విజయపురం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘టీ నోట్’ ముసాయిదా మాత్రమే సిద్ధమైంది: షిండే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి కేబినెట్ ముందుంచాల్సిన నోట్‌ను ఇంకా ఖరారు చేయలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. దాని తాలూకు ముసాయిదా మాత్రమే సిద్ధమైందని సోమవారం వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం చోటుచేసుకోలేదన్నారు. దాంతో ఈ భేటీలో నోట్ ప్రస్తావన గానీ, దానిపై చర్చ గానీ ఉండబోవని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ విదేశీ పర్యటన తర్వాత అక్టోబర్‌లో మాత్రమే తెలంగాణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. సాధారణంగా కేంద్ర కేబినెట్ ప్రతి గురువారం సమావేశమవుతుంది. అయితే ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని బుధవారం న్యూయార్క్ బయల్దేరుతున్నందున దాన్ని ముందుగానే నిర్వహిస్తున్నారు. మరోవైపు... ఎజెండాలో లేకపోయినా తెలంగాణ నోట్ ముసాయిదాను మంగళవారం నాటి భేటీలోనే మంత్రులందరికీ పంచుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దానిపై చర్చ కూడా జరుగుతుందని కాంగ్రెస్ నేతల్లో మరికొందరు అంటున్నారు. ఇప్పటికే తయారైన 6, 7 పేజీల ముసాయిదాను వీలైనంతగా సంక్షిప్తీకరించి కేబినెట్ ముందు పెడతారని వారు చెబుతున్నారు. ఈ ముసాయిదానే కేంద్ర హోం మంత్రి సంతకంతో తుది నోట్ రూపంలో బహుశా అక్టోబర్ 3న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుంచుతారన్నది వారు చెబుతున్న మాట. ‘‘రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఎంతటి వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. నోట్ కేబినెట్ ముందుకు వెళ్తే తక్షణం రాజీనామా చేసేందుకు కనీసం అరడజను మంది సీమాంధ్ర ఎంపీలతో పాటు ఆ ప్రాంతాలకు చెందిన పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో... అలాంటి పరిణామానికి కూడా అధిష్టానం సిద్ధంగానే ఉంది’’ అని ఏఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ సదరు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ మంగళవారం సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ భేటీపైనే నెలకొంది. -
టీ-నోట్ తయారు కాలేదు..
షిండే మాతో చెప్పారు: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ రూపొందించాల్సిన కేబినెట్ నోట్ ఇంకా తయారు కాలేదని సుశీల్‌కుమార్ షిండే తమకు చెప్పినట్లు సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను తెలుసుకుని, పరిష్కారాలు చూపేందుకు ఏర్పాటైన ఆంటోనీ నేతృత్వంలోని కమిటీతో అన్ని అంశాలను చర్చించాకే నోట్ తయారవుతుందని షిండే తమకు హామీ ఇచ్చారని వారు శనివారం మీడియాకు చెప్పారు. సీమాంధ్రప్రాంత కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాయపాటి సాంబశివరావు, కె.వి.పి.రామచంద్రరావులు శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. 40 నిమిషాలపాటు భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రతినిధులు లేవనెత్తిన అన్ని అంశాలపై దృష్టిపెడతాం. అక్కడి ప్రజల మనోభావాలు, సమస్యలను తెలుసుకుంటున్న ఆంటోనీ కమిటీతో నేనూ చర్చిస్తా. కమిటీతో చర్చించాకే కేబినెట్ నోట్ తయారవుతుంది. ఇప్పటివరకు కేబినెట్ నోట్ తయారు కాలేదు. ఇరు ప్రాంతాల బాగోగులు కోరుకుంటున్నాం. ఆ దిశగానే ముందుకు వెళతాం అని షిండే మాతో చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట షిండే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. విభజనపై కేబినెట్ నోట్ సిద్ధమైందని, దాన్ని తానింకా చూడలేదని పేర్కొ నడం తెలిసిందే. నోట్ సిద్ధమైందని షిండే స్పష్టంచేయగా.. శనివారం ఆయన్ను కలిసిన అనంతరం సీమాంధ్ర నేతలు నోట్ ఇంకా సిద్ధం కాలేదని షిండే తమకు చెప్పారంటూ మీడియాతో పేర్కొనటం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజనమీద కాంగ్రెస్ నిర్ణయంపై సీమాంధ్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పార్టీ ప్రతినిధులను ఎక్కడికక్కడ గట్టిగా నిలదీస్తున్నారని షిండేకు సీమాంధ్ర నేతలు వివరించినట్లు తెలిసింది. ఫలితంగా తాము సొంత నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయన్నట్టు సమాచారం. కాగా కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ సాయిప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ టీ-నోట్ ఇంకా తయారు కాలేదని, ఆంటోనీ కమిటీతో అన్ని అంశాలపై చర్చించాకే నోట్ తయారవుతుందని షిండే తమకు తెలిపారన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలోని ప్రజల మనోభావాల్ని షిండేకి వివరించామని కిల్లి కృపారాణి చెప్పారు. -
తెలంగాణ నోట్ రెడీ: షిండే
నేను ఇంకా ఆ ముసాయిదాను పరిశీలించలేదు.. వీలైతే శుక్రవారం హోంశాఖ అధికారులతో చర్చిస్తా హైదరాబాద్ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నోట్ రూపొందించినా.. అది నేటి కేబినెట్ భేటీ ముందుకు రాకపోవచ్చంటున్న అధికారులు సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్‌కు హోంశాఖ సమర్పించాల్సిన ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. అయితే ఆ ముసాయిదా ప్రతిని తాను ఇంకా పరిశీలించలేదని చెప్పారు. వైద్య పరీక్షలు, గణపతి నిమజ్జనోత్సవాల కోసం వారం రోజులకు పైగా ముంబైలో గడిపిన అనంతరం గురువారం ఢిల్లీ తిరిగి వచ్చిన షిండే నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అధికారులు నోట్ సిద్ధం చేశారు. అయితే నేను ఇంకా చూడలేదు. వీలైతే నోట్‌పై రేపు (శుక్రవారం) హోంశాఖ అధికారులతో చర్చిస్తా..’’ అని చెప్పారు. హైదరాబాద్ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం ఆంటోనీ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లతో చర్చలు జరిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకాంశాలన్నింటిపై ఏకాభిప్రాయం వచ్చే వరకు ప్రభుత్వపరంగా తెలంగాణ ప్రక్రియ ముందుకెళ్లడం సాధ్యపడకపోవచ్చని వారు కూడా అభిప్రాయపడ్డారు. ఆ మరుసటి రోజే ముసాయిదా నోట్ సిద్ధమైందని హోంమంత్రి ప్రకటించడం గమనార్హం. అత్యున్నత స్థాయిలో చర్చ తర్వాతే కేబినెట్ ముందుకు.. హోం శాఖ తెలంగాణపై ముసాయిదా నోట్ రూపొందించినప్పటికీ శుక్రవారం ఉదయం ప్రధాని నివాసంలో జరగబోయే కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై అత్యున్నత స్థాయిలో లోతైన చర్చ జరిగిన తర్వాత, వివాదాస్పద అంశాలపై రాజకీయ నిర్ణయం జరిగిన తర్వాత మాత్రమే నోట్‌కు తుది రూపమివ్వడం సాధ్యమని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోట్ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు వెళ్తుందని చెబుతున్నారు. వాస్తవానికి గురువారం సాయంత్రమే మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ప్రధాని అందుబాటులో లేని కారణంగా రేపటికి వాయిదా పడింది. ఇప్పటికే కేంద్ర మంత్రులకు సర్కులేట్ చేసిన సమావేశ అజెండాలో తెలంగాణ అంశం లేకపోయినప్పటికీ.. చివరి నిమిషంలో అనుబంధ చర్చనీయాంశాల జాబితాలో లేదా టేబుల్ ఐటమ్‌గా దీన్ని మంత్రివర్గం ముందుంచే అవకాశం లేకపోలేదని కూడా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. హోంశాఖ సమర్పించే ప్రాథమిక నివేదికను పరిగ ణనలోకి తీసుకున్న తర్వాత.. విభజన విషయంలో లోతైన అధ్యయనం, సంప్రదింపుల కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్‌పై మూడు ప్రత్యామ్నాయాలు? హైదరాబాద్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న షిండే వెల్లడించిన నేపథ్యంలో.. హోంశాఖ రూపొందించిన ముసాయిదా నోట్లో ఏముందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. గతంలోనే షిండే ప్రకటించిన మూడు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఇందులో పొందుపరిచి ఉంటారని, దీనిపై రాజకీయ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సూచించినట్లుగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చండీగఢ్ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలా లేదా ఢిల్లీ మాదిరిగా రాజధానిలో శాంతి భద్రతలు, రెవెన్యూ, పన్ను వసూళ్లను కేంద్రం అధీనంలో ఉంచాలా లేదా హైదరాబాద్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించి దేశానికి రెండో రాజధాని చేయాలా అన్న ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వెలువడడం తెలిసిందే. -
రేపు కేబినెట్లో తెలంగాణపై చర్చ లేదు
శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. తన మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన కేబినెట్ నోట్ ముసాయిదా పరిశీలనకు తనకు సమయం లేదని, కేబినెట్ నోట్ ముసాయిదా మాత్రం సిద్ధమైందని ఆయన చెప్పారు. రేపు నోట్ ముసాయిదాను చూస్తానని వెల్లడించారు. అలాగే, తెలంగాణ నోట్‌ను కేంద్ర న్యాయశాఖకు కూడా పంపిస్తానని చెప్పారు. ఆంటోనీ కమిటీ నివేదికను కూడా కేబినెట్ సీరియస్‌గానే పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. కేబినెట్ నోట్‌ను సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌ల ఆమోదం కోసం షిండే వారివద్ద ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ చాలా సమయం పడుతుంది కాబట్టి, శుక్రవారం నాటి సమావేశంలో తెలంగాణపై చర్చ ఉండకపోవచ్చని తెలుస్తోంది. -
‘టీ’ నోట్ వచ్చేనా!?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం గురువారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుందా, లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశ అజెండాలో ఈసారి కూడా తెలంగాణ అంశానికి చోటు లభించలేదు గనుక అదేమీ చర్చకు రాకపోవచ్చని అధికార వర్గాలంటున్నాయి. మంత్రివర్గ పరిశీలనకు కేంద్ర హోం శాఖ సమర్పించాల్సిన కేబినెట్ నోట్ ఇంకా సిద్ధం కాకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. హైద్రాబాద్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పాటు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వైద్య పరీక్షల కోసం ఐదారు రోజులుగా ముంబైలో ఉండటం వల్ల నోట్ ఇంతవరకూ ఖరారు కాలేదని ఆ వర్గాలు తెలిపాయి. అంతేగాక సీమాంధ్రుల సందేహాలు, ఆందోళనను ఆలకించేందుకు కాంగ్రెస్ వేసిన కమిటీ చైర్మన్, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ ప్రొస్టేట్ గ్రంథి శస్త్ర చికిత్స చేయించుకోవడం తెలిసిందే. ఆయన మరో రెండు మూడు రోజుల దాకా విధులకు హాజరయ్యే అవకాశం లేదు. దాంతో రాజధాని వివాదం కూడా ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కన్పించడం లేదు. గత శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణపై కొంత చర్చ జరిగినా దానికి షిండే హాజరవకపోవడం, ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ పూర్తవకపోవడమే గాక హైద్రాబాద్ ప్రతిపత్తి, నదీజలాలు, విద్యుత్, ఆదాయ పంపిణీ వంటి కీలక సమస్యలపై తుది నిర్ణయమేదీ తీసుకోలేకపోయారని చెబుతున్నారు. మరో డ్రామా!: మరోవైపు, ప్రకటనే తప్ప రాష్ట్ర ఏర్పాటుపై పురోగతేమీ లేని వైనంపై తెలంగాణవాదులు, ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్న వైనం కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరుస్తున్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన సోనియాగాంధీ తిరిగి రాగానే విభజన ప్రక్రియ ఊపందుకుంటుందంటూ ఊదరగొట్టినా, అదంతా ఉత్తదేనని తేలిపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. అలాగని సీమాంధ్రలో నానాటికీ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూస్తూ చూస్తూ ఎలాంటి ముందడుగూ వేయలేని సందిగ్ధావస్థలో కాంగ్రెస్ పెద్దలు కొట్టుమిట్టాడుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఏర్పాటు దిశగా ఏదో ఒక ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నాలకు కూడా కాంగ్రెస్ తెర తీస్తోందని వినిపిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. అయితే అందుకు కేబినెట్‌కు నోట్ తప్పనిసరి గనుక గురువారం మంత్రివర్గ భేటీలో ఆ నోట్‌ను సమర్పిస్తారని కూడా హస్తినలో ప్రచారం జరుగుతోంది. కాకపోతే వివాదాస్పద అంశాల్లో వేటి జోలికీ పోకుండా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానానికే నోట్ పరిమితం కావచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. తర్వాత విభజనకు సంబంధించిన అన్ని సమస్యలనూ జీఓఎం భుజాలపైకి నెట్టి చేతులు దులుపుకోవాలన్నదే ఏఐసీసీ వ్యూహకర్తల ఆంతర్యమని భావిస్తున్నారు! కాకపోతే ఎలాంటి కసరత్తూ లేకుండా ఉన్నపళంగా మంత్రివర్గానికి గురువారమే నోట్ సమర్పించడం ఏ మేరకు సాధ్యమన్న అనుమానాలు కూడా ప్రబలంగానే వ్యక్తమవుతున్నాయి. నోట్ రూపకల్పనలో పలు దశలుంటాయి. ముందుగా అన్ని వివరాలతో నోట్ ముసాయిదాను కేంద్ర హోం శాఖ రూపొందించాల్సి ఉంటుంది. తర్వాత న్యాయ తదితర శాఖల వద్దకు వెళ్తుంది. వాటి అభిప్రాయాలు, సూచనలను కూడా పొందుపరిచాక కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌కు వెళ్లాలి. అప్పుడు దాన్ని తదుపరి మంత్రివర్గ అజెండాలో చేరుస్తారు. ఇవేమీ లేకుండానే తెలంగాణ నోట్‌ను నేరుగా గురువారం నాటి భేటీలో ఉంచడం ఏ మేరకు సాధ్యమని కాంగ్రెస్ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతానికి నాన్చుడే... విభజనలో ఇమిడి ఉన్న సంక్లిష్ట, వివాదాస్పద అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పట్లో ఎలాంటి నిర్ణయమూ తీసుకునే అవకాశాలు లేవంటున్నారు. కనీసం అక్టోబర్ద్వితీయార్ధం దాకా దీన్నిలాగే సాగదీస్తారని ఆ పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్సింగ్ సెప్టెంబర్ 26న అమెరికా వెళ్తున్నారు. నెలాఖరులో ఆయన తిరిగి రానున్నారు. అక్టోబర్ ప్రథమార్ధంలో కూడా ప్రధాని మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. కాబట్టి ఎలా చూసినాఅక్టోబర్ 15-20 తేదీల దాకా సమస్యను ఇలాగే నానబెడతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీమాంధ్ర నేతల ఎదురుచూపులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల అపాయింట్మెంట్ కోసం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు హస్తినలో ఎదురుతెన్నులతో కాలం గడుపుతున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి పల్లంరాజు ద్వారా వారు పంపిన అభ్యర్థనలకు మంగళవారం సాయంత్రం దాకా ఏ స్పందనా రాలేదని తెలియవచ్చింది. ఆలోగా ఆంటోనీ కమిటీ సభ్యులను కూడా కలవాలనుకున్నా ఆయనింకా ఆస్పత్రిలోనే ఉండటంతో సాధ్యపడలేదని సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా ఢిల్లీలో లేరు. -
మరోసారి హస్తిన బాట పట్టనున్న కిరణ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ సిద్ధమవుతుండడం, 19న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానానికి మరోసారి అన్ని అంశాలు వివరించాలని భావిస్తున్న ఆయన ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయితే నేడు ....లేనిపక్షంలో బుధవారం తప్పనిసరిగా హస్తినకు వెళ్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితం విదేశీయానాన్ని ముగించుకున్న సోనియాగాంధీ ఢిల్లీకి వచ్చారు. ఆమె ఆమోదాన్ని తీసుకున్న తరువాతే తెలంగాణ నోట్‌ను కేబినెట్‌కు పంపించాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే సోనియాను కలిసి తెలంగాణపై నిర్ణయం ఆపాలంటూ కోరాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇదే సమయంలో సమైక్యం కోసం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులపై కూడా దాడులు జరుగుతున్న విషయాన్ని సోనియాకు, ఇతర కేంద్ర నాయకులకు వివరించాలని కిరణ్ భావిస్తున్నారు. మరోవైపు నిన్న హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే. -
'అక్టోబర్‌లోగా కేబినెట్ నోట్ తయారీ అనుమానమే'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన విషయంలో అక్టోబర్‌లోగా కేబినెట్ నోట్ తయారీ అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు వాసుదేవ దీక్షితులు అన్నారు. ఆయన శనివారం ఓ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతు విభజన విషయంలో కాంగ్రెస్‌కు స్పష్టత లేదన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలన్నారు. నిర్బయ కేసులో దోషులకు శిక్ష సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోటానికి నరేంద్ర మోడీ వద్ద ఎటువంటి పథకాలు ఉన్నాయో తెలియాలని వాసుదేవ దీక్షితులు అన్నారు. ఇదే కార్యక్రమంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీపై దేశంలో యువతకు మోజు ఉందన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇంకా కార్యచరణపై నిర్ణయం తీసుకోలేదన్నారు. -
ఢిల్లీ చేరుకున్న సోనియాగాంధీ
-
‘టీ-నోట్’ రెడీ!
* ‘తెలంగాణ’ ఏర్పాటుపై కేబినెట్ నోట్ సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ * సోనియా ఆమోదం కోసం నిరీక్షణ * మరో వారంలో అమెరికా నుంచి తిరిగిరానున్న కాంగ్రెస్ అధినేత్రి * ఆమె రాజకీయ అనుమతి ఇచ్చాకే న్యాయశాఖకు నోట్ * అనంతరం కేబినెట్ ముందుకు.. తర్వాత జీఓఎం ఏర్పాటు * మంత్రుల బృందం ఎజెండాకు ఈ కేబినెట్ నోటే ప్రాతిపదిక * ‘సీమాంధ్రుల భద్రత’ అంశంపై దృష్టి కేంద్రీకరించిన నోట్ * హైదరాబాద్‌లో పదేళ్ల పాటు ఢిల్లీ తరహా పోలీసింగ్‌కు సూచన? * ఉమ్మడి రాజధాని కాలంలో శాంతిభద్రతలు హోంశాఖ పరిధిలో! * హైదరాబాద్ కమిషనరేట్ వరకేనా? లేక జీహెచ్ఎంసీ మొత్తమా? అనే అంశంపై మంత్రుల బృందానిదే నిర్ణయమంటూ పీటీఐ కథనం * పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ లీకులంటున్న రాజకీయ విశ్లేషకులు సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రహోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధమయిందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత దానికి రాజకీయంగా ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర మంత్రివర్గానికి సమర్పిస్తామని ఆయన చెప్పినట్లు ‘పీటీఐ’ వార్తాసంస్థ తెలిపింది. ‘హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నిర్దేశాల ప్రకారం.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అధికారులు కేబినెట్ నోట్‌ను రూపొందించారు. మేం నోట్‌తో సిద్ధంగా ఉన్నాం. దానికి రాజకీయ అనుమతి కోసం నిరీక్షిస్తున్నాం’ అని సదరు అధికారి వివరించినట్లు ఆ కథనంలో పేర్కొంది. సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం ఈ నెల 2వ తేదీన అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె వారం రోజుల్లో ఢిల్లీ తిరిగివస్తారని భావిస్తున్నారు. తెలంగాణపై హోంశాఖ సిద్ధం చేసిన కేబినెట్ నోట్‌ను ఆమె పరిశీలించి రాజకీయంగా అనుమతి ఇచ్చిన తర్వాతే.. దానిని న్యాయశాఖకు పంపిస్తారు. ఆ తర్వాత ఈ నోట్ కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళుతుంది. దీనిని పరిశీలించి తెలంగాణ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ విభజనపై తలెత్తే అంశాలను పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను) ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒక తీర్మానాన్ని పంపిస్తారు. లీకులతో అయోమయం.. అయితే ఇదంతా కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌లో భాగమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘విభజన విషయంలో ఎలాంటి హోంవర్క్ చేయని కాంగ్రెస్.. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో.. ఇదిగో విభజించేస్తున్నామంటూ ప్రకటించేసింది. తీరా ప్రకటన చేశాక తలెత్తిన సమస్యలు చూసి.. తన గేమ్ ప్లాన్‌ను కొనసాగిస్తోంది. సీమాంధ్రకు చెందిన నేతలు వస్తే వారికి ఏదో ఒక భరోసా ఇచ్చి నచ్చజెప్పడం, తెలంగాణ ప్రాంత నేతలు వస్తే వారికి అనుకూలంగా మాట్లాడ్డం చేస్తోంది. ఏదోవిధంగా పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ పెద్దలు అధికారికంగా ఒక మాట, అనధికారికంగా మరో మాట మాట్లాడుతున్నారు. తాము అనధికారికంగా చెప్పదలుచుకున్నఅంశాలను ఏదో ఒక వార్తా సంస్థ ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు. వీటిలో ఏది వాస్తవమో.. ఏది అవాస్తవమో తెలియకుండా చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు’ అని ఢిల్లీలోని రాజకీయ విజ్ఞులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర హోంశాఖ నియంత్రణలోకి హైదరాబాద్ పోలీసింగ్? మంత్రుల బృందం ఎజెండాకు ప్రాతిపదిక కానున్న ఈ కేబినెట్ నోట్లో.. భద్రతపై సీమాంధ్ర ప్రజల ఆందోళనలపై దృష్టి పెట్టిందని.. అయితే అది పరిమిత స్థాయిలో మాత్రమే ఉండబోతోందని ఉన్నతస్థాయి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ‘హైదరాబాద్ ఒక్కటే వివాదాస్పద అంశం అయినందున.. ఆ నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయవచ్చని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ.. భద్రత విషయాల్లో సీమాంధ్ర ప్రజలను ఒప్పించటంలో ఇది విఫలమైనట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై నోట్లో దృష్టి కేంద్రీకరించాం’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఉమ్మడి రాజధాని కాలం’లో హైదరాబాద్‌లో ఢిల్లీ తరహాలోనే శాంతిభద్రతల ఇన్చార్జ్గా గవర్నర్‌ను నియమించి, కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో పోలీసింగ్ చేపట్టే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఈ నోట్ కేంద్ర కేబినెట్‌కు సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) హోదా ప్రతిపాదనను సీమాంధ్రలోని కాంగ్రెస్ సొంత నాయకత్వంతో సహా పలు వర్గాలు వ్యతిరేకిస్తుండటంతో.. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో పోలీసింగ్ నిర్వహించటం ఒక పరిష్కారం కాగలదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. హైదరాబాద్ కమిషనరేట్ వరకూ మాత్రమే ఈ ఏర్పాటు చేయాలా? లేక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధినంతటినీ చేర్చాలా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్న నేపధ్యంలో.. దీనిపై మంత్రుల బృందం కసరత్తు చేస్తుందని చెప్తున్నారు. అదేసమయంలో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ చుట్టుపక్కల.. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గల పలు మునిసిపాలిటీలు కూడా ఉండటం మరో వివాదానికి కారణమవుతోంది. కేంద్ర హోంశాఖ పోలీసింగ్ పరిధిలోకి జీహెచ్ఎంసీ మొత్తాన్నీ తీసుకువచ్చే ప్రతిపాదనను టీఆర్ఎస్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ ప్రాంతాన్ని కేంద్ర హోంశాఖ నియంత్రణలోకి తెచ్చే ప్రతిపాదనను టీఆర్ఎస్ నాయకత్వం వ్యతిరేకించటం లేదని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. కానీ.. సీమాంధ్ర ప్రజానీకంలో అత్యధికులు జీహెచ్ఎంసీ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నందున.. టీఆర్ఎస్ ముందుకు తెచ్చిన ప్రతిపాదనను వారు అంగీకరించకపోవచ్చని కూడా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. -
'సోనియా రాగానే మంత్రి వర్గం ముందుకు కేబినేట్ నోట్'
-
'సోనియా రాగానే మంత్రి వర్గం ముందుకు కేబినేట్ నోట్'
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినేట్ నోట్ ప్రక్రియ పూర్తి అయిందని.. అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాగానే కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదేశాలకు అనుగుణంగా హోంశాఖ కార్యాలయ అధికారులు కేబినేట్ నోట్ ను సిద్ధం చేశారని తెలిపారు. కేబినేట్ నోట్ తో తాము సిద్ధంగా ఉన్నామని.. సోనియాగాంధీ రాగానే రాజకీయ పార్టీల ఆమోదానికి పంపుతామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం సెప్టెంబర్ 2 తేదిన సోనియాగాంధీ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ మరో వారం రోజుల్లో భారత్ చేరుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల ఆమోదం లభించిన తర్వాత కేబినేట్ నోట్ ను కేంద్ర న్యాయశాఖకు పంపుతామని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హోంశాఖ కేబినేట్ నోట్ ను ప్రిపేర్ చేస్తోందని.. త్వరలోనే మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని ఇటీవల షిండే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
వారంలో కేబినేట్ నోట్.. త్వరలో అసెంబ్లీలో తీర్మానం: షబ్బీర్ ఆలీ
'సేవ్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీఎన్జీఓలపై మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మండిపడ్డారు. సభా వేదికపై పలువురు నాయకులు ఫోటోలు పెట్టుకున్నవారు హైదరాబాద్ నగరానికి పునాది వేసిన నాయకులను ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. నిజాం, కుతుబ్ షాహీలను ఏపీఎన్జీఓలు ఎలా మరిచిపోతారని నిలదీశారు. ఏపీఎన్జీఓ నాయకులు ఎంత రెచ్చగొట్టినా.. తెలంగాణవాదులు రెచ్చిపోనందుకు నా సలాం అని షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ లో రక్షణ లేనిది సీమాంధ్రలుకు కాదు.. తెలంగాణ వాదులకేనని ఆయన అన్నారు. ఎపీఎన్జీఓలు ఎంత రెచ్చగొట్టినా.. తెలంగాణప్రాంత ప్రజలు సంయమనంతో వ్యవహరించినందుకు సలాం అని అన్నారు. హైదరాబాద్ లో సభలెన్ని పెట్టుకున్నా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని షబ్బీర్ తెలిపారు. వారం రోజుల్లో కేబినేట్ నోట్ ప్రవేశపెడుతారని..త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కేంద్రానికి తాము సూచించామని మీడియా సమావేశంలో వెల్లడించారు. -
కేబినేట్ నోట్ ను ఎలా ప్రవేశపెడుతారు: లగడపాటి
హైదరాబాద్: ఉద్యోగులు సభ పెట్టుకుంటే బెదిరిపోయే వాళ్లు ఉద్యమాలు ఏం చేస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించిన లగడపాటి.. టీఆర్ఎస్ నేతలు, జేఏసీ నేతలపై నిప్పులు చెరిగారు. పలు ఆంక్షలు పెట్టినా.. అడ్డుకున్నా ఎపీఎన్జీఓల సభ విజయవంతమైంది అని ఆయన అన్నారు. సభ ద్వారా సమైక్యవాదం వినిపిస్తారనే భయం టీఆర్ఎస్ నేతల్లో నెలకొని ఉందని అన్నారు. సభ పెట్టుకున్న ఎపీఎన్జీఓలకు పూలు పండ్లు ఇస్తానన్నవారు.. తిరిగి వెళ్తున్నవారిపై దాడుల చేయడం సమంజసమా లగడపాటి అని ప్రశ్నించారు. విభజన ప్రక్రియ పూర్తికాకుండా కేబినేట్ నోట్ ను ఎలా ప్రవేశపెడుతారని అన్నారు. ఏపీఎన్జీఓల సభను ఆసరా చేసుకుని కొంతమంది విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నించారు. అయినా ఏపీఎన్జీఓలు సోదరభావంతో శాంతియుతంగా సభను నిర్వహించారు. ఏపీఎన్జీఓలు సభ పెట్టిన రోజే శాంతి ర్యాలీ, బంద్ లు ప్రకటించడం కోదండరాం సంకుచితభావానికి నిదర్శనమని లగడపాటి అన్నారు. నిజాం కాలేజిలో టీఆర్ఎస్సీవీ నాయకులకు ఏమి పని అని ఆయన నిలదీశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. సమైక్యవాదులకు 240పైగా సీట్లు వస్తాయన్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్ల తీర్చినట్టు హైదరాబాద్ ను కేంద్రం తన్నుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. -
హైదరాబాద్‌పై రెండు మూడు ఆలోచనలు: షిండే
హైదరాబాద్ విషయమై తమ వద్ద రెండు మూడు ప్రతిపాదనలున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోకపోతే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించినా.. సీమాంధ్ర 38 రోజులుగా ఉద్యమాల జోరుతో హోరెత్తుతున్నా.. కేంద్ర హోం మంత్రి షిండే మాత్రం మళ్లీ పాత పాటే పాడారు. న్యూఢిల్లీలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోం శాఖ కేబినెట్ నోట్ తయారు చేస్తోందన్నారు. త్వరలోనే ఈ నోట్ పూర్తవుతుందని తెలిపారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన కారణంగానే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నామని షిండే తెలిపారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసిందని అన్నారు. సీడబ్ల్యుసీ కూడా తెలంగాణకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆంటోనీ కమిటీ చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. ఆంద్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తి లేదని, ప్రస్తుతానికి అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణపై కేబినెట్ నోట్ తయారైతే అన్ని అంశాలూ పరిష్కారం అవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వదంతులన్నీ అబద్ధమేనని షిండే స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాలకోసం చాలా డిమాండ్లు ఉన్నాయి గానీ, వాటన్నింటినీ అంగీకరించలేమని హోం మంత్రి షిండే తెలిపారు. గూర్ఖాలాండ్, విదర్భ సహా అనేక కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పలు విజ్ఞప్తులున్నాయని, కానీ వాటిని ఇప్పట్లో పరిశీలించలేమని షిండే అన్నారు. అవసరమైనప్పుడు వాటిని కూడా పరిశీలిస్తామన్నపారు. అసోంలో బోడోలు, కుచ్-రాజ్బంగ్షీలు, కర్బీలు, దిమసాలు చాలాకాలంగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గూర్ఖా జనముక్తి మోర్చాకు చెందిన ఓ బృందం తనవద్దకు రావడంతో తాను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించినా అది కుదరలేదన్నారు. -
కేబినోట్ నోట్ తయారవుతోంది.. సకాలంలో పూర్తవుతుంది: షిండే
రాష్ట్రంల ఉద్యమాలతో ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో తెలంగాణ అంశంపై హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మళ్లీ స్పందించారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన కారణంగానే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నామని షిండే తెలిపారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది అని షిండే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేస్తోందన్నారు. త్వరలోనే కేబినేట్ నోట్ పూర్తి అవుతుందని షిండే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
20 రోజుల్లో కేబినెట్‌కు నోట్
-
20 రోజుల్లో కేబినెట్‌కు నోట్ - తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై షిండే
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నెల రోజులుగా సమైక్యోద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోం శాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నట్టు సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో తనను కలసిన విలేకరులకు ఆయన స్పష్టం చేశారు. అది మరో 20 రోజుల్లో మంత్రివర్గం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామన్నారు. ‘‘మంత్రివర్గ ఆమోదం కోసం నోట్ తయారవుతోంది. సిద్ధమయ్యాక దాన్ని కేంద్ర న్యాయ శాఖ ఆమోదానికి పంపిస్తాం. న్యాయ శాఖ ఆమోదించాక 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పిస్తాం’’ అని తెలియజేశారు. నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యమూ జరగడం లేదని ఒక ప్రశ్నకు బదులుగా షిండే చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీల నిర్ణయాన్ని అమలు చేయడానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నోట్‌ను రూపొందించడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ దృష్టితోనే హోం శాఖ ఆచితూచి వ్యవహరిస్తోందని వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కొనసాగింపుగా రాష్ట్రంలోని పార్టీలతో, ప్రజాసంఘాల ప్రతినిధులతో జరిపిన విసృ్తత సంప్రదింపులు, పార్టీల లిఖితపూర్వక అభిప్రాయాల ప్రాతిపదికన రాష్ట్ర విభజనను సూచిస్తూ హోం శాఖ నివేదిక సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ‘‘ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం తీర్మానించనుంది. ఆ వెంటనే రాష్ట్ర విభజనతో ఉత్పన్నం కాగల కీలక సమస్యల అధ్యయనానికి కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని (జీఓఎం) ఏర్పాటు చేస్తూ, విభజనపై చర్చించి అభిప్రాయాలు తెలపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదిస్తుంది’’ అని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. విభ జనపై అసెంబ్లీ నిర్ణయం, అభిప్రాయం ఎలా ఉన్నా కేంద్రం మాత్రం తన నిర్ణయంతో ముందుకెళ్తుందని స్పష్టం చేశాయి. విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలించి, సీమాంధ్రుల భయాందోళనలను తొలగించేందుకు ఏర్పాటైన కాంగ్రెస్ కమిటీ సారథి ఏకే ఆంటోనీయే కేంద్ర మంత్రుల ఉప సంఘానికీ చైర్మన్‌గా ఉండవచ్చని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీతో పాటు షిండే, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, మానవ వనరుల మంత్రి పళ్లంరాజు (రాజీనామా చేయకపోతే) కూడా ప్రభుత్వ కమిటీలో ఉండవచ్చని అధికార వర్గాల సమాచారం. సీమాంధ్ర ప్రజలను సంతృప్తిపరిచే ప్రయత్నంలో భాగంగా విభ జన సమస్యల పరిశీలనకు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ వేస్తామన్న ప్రభుత్వ కమిటీ ఇదే కావచ్చంటున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామా వ్యూహం తమ అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేస్తుండడంతో తీవ్ర నిరాశ, నిసృ్పహలకు లోనవుతున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కూడా విభజన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిన మరుక్షణమే మంత్రివర్గం నుండి వైదొలగాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. సోమవారం షిండే ప్రకటన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారంతా సమావేశమయ్యారు. పదవులను త్యజించాల్సిన ముహూర్తంపైనే చ ర్చించినట్టు సమాచారం. మంగళవారం ఆంటోనీ కమిటీతో భేటీలో ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఆగస్టు 5న అవి ప్రారంభమైనప్పటి నుంచీ సీమాంధ్ర ఎంపీలు స్తంభింపజేస్తుండటం, ఇప్పటికే ఐదేసి రోజుల చొప్పున రెండుసార్లు సస్పెన్షన్‌కు గురవడం తెలిసిందే. కిరణ్, బొత్సలకూ పిలుపు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలను మంగళవారం రాత్రి ఏడింటికి గురుద్వారా రకబ్గంజ్ రోడ్‌లోని కాంగ్రెస్ వార్ రూమ్‌లో సమావేశానికి ఆంటోనీ కమిటీ ఆహ్వానించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో కూడా రేపే కమిటీ విడిగా భేటీ కానుంది. ఆదివారం రాత్రి హస్తిన చేరిన బొత్స కూడా దీన్ని ధ్రువీకరించారు. -
20 రోజుల్లో తెలంగాణ తీర్మానం: షిండే
-
20 రోజుల్లో తెలంగాణ తీర్మానం: షిండే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులోగా భాగంగా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకొస్తామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ‘కేబినెట్ నోట్’ రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే.. ఈ ముసాయిదా నోట్ రూపకల్పనకు ఎలాంటి తుది గడువూ లేదని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నందున కొంత సమయం పడుతుందని పేర్కొన్నాయి. కేబినెట్ ముసాయిదా నోట్‌ను ఒక పత్రంగా వ్యవహరిస్తూ.. ‘అత్యంత రహస్యం (టాప్ సీక్రెట్)’ గా వర్గీకరించటం జరుగుతుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. -
ఉభయసభల్లోనూ సీమాంధ్ర ఎంపీల ఆందోళనలు