'సోనియా రాగానే మంత్రి వర్గం ముందుకు కేబినేట్ నోట్'
'సోనియా రాగానే మంత్రి వర్గం ముందుకు కేబినేట్ నోట్'
Published Sun, Sep 8 2013 6:54 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినేట్ నోట్ ప్రక్రియ పూర్తి అయిందని.. అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాగానే కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదేశాలకు అనుగుణంగా హోంశాఖ కార్యాలయ అధికారులు కేబినేట్ నోట్ ను సిద్ధం చేశారని తెలిపారు.
కేబినేట్ నోట్ తో తాము సిద్ధంగా ఉన్నామని.. సోనియాగాంధీ రాగానే రాజకీయ పార్టీల ఆమోదానికి పంపుతామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం సెప్టెంబర్ 2 తేదిన సోనియాగాంధీ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ మరో వారం రోజుల్లో భారత్ చేరుకునే అవకాశం ఉంది.
రాజకీయ పార్టీల ఆమోదం లభించిన తర్వాత కేబినేట్ నోట్ ను కేంద్ర న్యాయశాఖకు పంపుతామని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హోంశాఖ కేబినేట్ నోట్ ను ప్రిపేర్ చేస్తోందని.. త్వరలోనే మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని ఇటీవల షిండే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement