Susheel kumar Shinde
-
బాబూజీ నా రోల్‌మోడల్!
జవహర్లాల్ దర్డా (1923–1997) లేదా ‘బాబూజీ’ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు కానీ... ఆయన ఆలోచనలు నిత్యం మన వెంటే ఉంటాయి. రాజకీయాల్లో అత్యంత మేధతో ఆయన పనిచేశారు. జీవితాంతం మహాత్మాగాంధీ ఆలోచనలతోనే గడిపారు. ఆ కాలంలో ఇంకా చాలామంది నేతలు చురుకుగానే వ్యవహరించారు కానీ... బాబూజీ మాత్రం మహారాష్ట్రలో అజాతశత్రువుగా ఉండిపోయారు. మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. మహారాష్ట్ర రాష్ట్రంలో వార్తా పత్రికల ద్వారా సామాజిక సేవ చేయాలన్స్నది బాబూజీ ఎంచుకున్స్న మార్గం! అచార్య వినోభా భావేను కలిసేందుకు నేను ఒకానొక సందర్భంలో విదర్భ వెళ్లాను. ఆ పర్యటన నాకు బాగా గుర్తుంది. బాబూజీ ఆలోచనలు బోలెడన్స్ని నన్స్ను చుట్టుముట్టాయి. బాబూజీ కలం మహాత్మగాంధీ, వినోభా భావేల ఆలోచనలతోనే రచనలు చేస్తుందని అప్పుడే గుర్తించాను. వాస్తవానికి నేను రాజకీయాల్లోకి రాకముందే బాబూజీని కలిశాను. ఓ హౌసింగ్ సొసైటీ మరమ్మతుల విషయమై ఆయన్స్ని కలవాల్సి వచ్చింది. హౌసింగ్ ఫైనాన్స్ కు ఛైర్మన్స్ గా వ్యవహరిస్తూండేవారు ఆయన అప్పట్లో. తొలి సమావేశంలోనే ఆయన నన్స్ను ఆకట్టుకున్స్నారు. స్వభావం కూడా బాగా నచ్చింది. భిన్స్నమైన వ్యక్తిత్వమని అర్థమైంది. హౌసింగ్ సొసైటీ సమస్యలను ఏకరవు పెట్టినప్పుడు ఆయన వాటిని వెంటనే అర్థం చేసుకోగలిగారు. సొసైటీ పేదవారికి చెందినదని తెలుసుకున్స్న తరువాత వెంటనే సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఆ సొసైటీ ఇప్పుడు ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో ఉంది. 1974లో నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్స్నికయ్యాను. ఆ తరువాత బాబూజీని వేర్వేరు సందర్భాల్లో రకరకాల అంశాల విషయంలో కలిశాను. అంతేకాదు, రాజకీయాల్లో బాబూజీని (మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు) నా రోల్‌మోడల్‌గా ఎంచుకున్స్నాను కూడా. ఇష్టమైన విషయాలపై ఎంత లోతుగా తెలుసుకోవాలి, ఎంతగా ఆనందించాలి? ఇష్టం లేని విషయాలను కూడా ఎంత మేరకు పట్టించుకోవాలో నేను బాబూజీ ప్రవర్తన ద్వారా అర్థం చేసుకోగలిగాను. అందుకే ఆయన రాజకీయాల్లో ఓ ఆదర్శ వ్యక్తి అని నేను భావిస్తాను. రాజకీయాలకు అతీతంగా కూడా ఆనందం ఉందని మాకు బాగా తెలుసు. ఆ జీవితాన్స్ని కూడా అనుభవించాలి, ఆనందించాలి. అయితే ఈ విషయంలో బాబూజీ నాకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందుండేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకంటూ ఓ సిద్ధాంతం కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. బాబూజీ ఎప్పుడూ సైద్ధాంతిక, వ్యక్తిగత సంబంధాల మధ్య అంతరాన్స్ని స్పష్టంగా గుర్తించేవారు. బాబూజీకి వసంతరావ్ నాయక్ అతిదగ్గరి మిత్రుల్లో ఒకరు. అయితే రాజకీయపరమైన, సైద్ధాంతిక పరమైన విషయాల్లో వసంతరావ్ నాయక్‌కు (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి) దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అయితే ఎంతటి విభేదాలున్స్నా వ్యక్తిగత మైత్రిని మాత్రం వదులుకోలేదు. బారిస్టర్ ఎ.ఆర్.అంతులే విషయంలోనూ ఇంతే. బాబూజీకి ఆయనతో మంచి సంబంధాలుండేవి. కానీ అంతులే కాంగ్రెస్‌ను వదిలేశారు. బాబూజీ మాత్రం కాంగ్రెస్‌ను, రాజీవ్‌జీని (మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) మాత్రం వదల్లేదు. నేను రాజకీయాల్లోకి రావడానికి శరద్ పవార్ (అనంతరం, ఎన్స్సీపీ వ్యవస్థాపకుడు) కారణం. అయితే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మాత్రం ఇందిరాజీ, రాజీవ్‌జీ, పీవీ నరసింహరావుజీ, కాంగ్రెస్ పార్టీలకు నేను దూరం కాలేదు. ప్రస్తుతం దేశం అలివికానీ సమస్యలు ఎదుర్కొంటోంది. విషయం రాజ్యాంగానికి సంబంధించినది. మహానేతలు మనకు అందించిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశాన్స్ని నడిపేందుకు మనం ప్రయత్నిస్తున్స్నాం. ఈ సమయంలో జవహర్లాల్ నెహ్రూ నమ్మిన ఆలోచనలు, సిద్ధాంతాలు చాలా ముఖ్యం. ఈ సిద్ధాంతాలు, ఆలోచన ధోరణితో ముందుకెళితేనే దేశంలో శాంతి సాధ్యం. బాబూజీ బతికి ఉన్స్నంత కాలం మహాత్మాగాంధీ సిద్ధాంతాలనే నమ్మారు, ఆచరించారు. గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడి నట్లుగానే తన వార్తా పత్రికకు(లోక్మత్) ఆయన విశ్వాసంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారులు విజయ్జీ దర్డా, రాజేంద్రజీ దర్డా బాబూజీ ఆశయాలను, జాతీయత స్ఫూర్తిని కొనసా గించే ప్రయత్నం చేస్తున్స్నారు. బాబూజీ మహారాష్ట్ర ముద్దుబిడ్డ మాత్రమే కాదు, ఈ దేశానికి సంబంధించిన ముఖ్య నేత కూడా. ఆయనకు నా మనఃపూర్వక శ్రద్ధాంజలి. సుశీల్ కుమార్ శిందే వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్;కేంద్ర మాజీ హోంమంత్రి (నేడు జవహర్లాల్ దర్డా శతజయంతి) -
చాయ్‌వాలా వ్యాఖ్యలపై షిండే ఫైర్
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ తరచూ తనకు తాను చాయ్‌వాలాగా చెప్పుకోవడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆక్షేపించారు. మోదీ ప్రధాని కావడం మన దేశ రాజ్యాంగం ఘనతేనని స్పష్టం చేశారు. తాను గతంలో షోలాపూర్ జిల్లా కోర్టులో ప్యూన్‌గా పనిచేశానని, తాను అత్యున్నత స్ధానానికి ఎదగడం మన రాజ్యాంగం చలవేనని నమ్ముతానని చెప్పుకొచ్చారు. తాను ఉన్నత స్థితికి చేరుకోవడంలో తన ఘనతేమీ లేదనే తాను భావిస్తుంటానన్నారు. పార్టీ తనకు అప్పగించిన అత్యున్నత పదవులను చేపట్టడం తన బాధ్యతగా భావించానన్నారు. ప్రజాస్వామ్యంలో పరిణితితో వ్యవహరించడం అవసరమని, సొంతడబ్బా కొట్టుకోవడం తగదని మహారాష్ట్ర సీఎంగా కూడా వ్యవహరించిన షిండే హితవు పలికారు. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు నాలుగు తరాల పాటు దేశాన్ని పాలించిన అనంతరం ఓ చాయ్‌వాలా దేశ ప్రధానిగా ఎలా అయ్యాడని వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ఏ వృత్తీ చిన్నది కాదని, ప్రధాని తరచూ చాయ్‌వాలా అంటూ వారిని తక్కువగా చూసే సంకేతాలు పంపడం సరైంది కాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. -
మాజీ కేంద్ర మంత్రులకు అరెస్టు వారెంట్లు జారీ
అనంతపురం:యూపీఏ ప్రభుత్వం హయాంలో పనిచేసిన ముగ్గురు మాజీ కేంద్ర మంత్రులకు అనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. -
విభజన ప్రక్రియపై జీవోఎం సమీక్ష
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నేడిక్కడ సమావేశమయింది. జీవోఎం సభ్యులు సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేష్ ఈ భేటీకి హాజరయ్యారు. విభజన ప్రక్రియ, ఆస్తులు, అప్పులు, వనరులు, ఉద్యోగుల పంపిణీపై సమీక్ష జరపనున్నారు. సీమాంధ్ర రాజధాని ఎంపికకు ఏర్పాటు చేయాల్సిన నిపుణుల కమిటీపై చర్చించే అవకాశముంది. గవర్నర్ నరసింహన్‌కు సలహాదారులను నియమించే విషయంపై కూడా జీవోఎం సభ్యులు దృష్టిసారించనున్నారని సమాచారం. హైదరాబాద్‌లో పర్యటించి వచ్చిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సమర్పించే నివేదికపై కూడా జీవోఎం సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. -
మీడియా కాదు.. సోషల్ మీడియా అంటూ షిండే యూటర్న్!
ఎలక్ట్రానిక్ మీడియాను మట్టుబెట్టాలంటూ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. తాను ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను సోషల్ మీడియా దృష్టిలో ఉంచుకొని మాత్రమే వ్యాఖ్యలు చేశానని షిండే వివరణ ఇచ్చారు. తన స్వంత పట్టణంలోని ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నారని షిండే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల షోలాపూర్ లోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలకు కారణం ఎలక్ట్రానికి మీడియా అని తాను అనలేదని షిండే మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే ఉద్రిక్తతకు దారి తీసిందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో స్థిరపడిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందనే నేపథ్యంగా తాను వ్యాఖ్యలు చేశానన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేస్తుందని, మోడీ ప్రభజంనంలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి పాలు కావడం తథ్యం అని పోల్ సర్వేలకు మీడియా ప్రాధాన్యమిస్తోందని షిండే మండిపడ్డారని ఆ ప్రాంతానికి చెందిన విలేకరి స్పష్టం చేశారు. -
కొత్త సీఎం ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది: షిండే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా అనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే కొత్త సీఎం ఎవరు అనే అంశాన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని షిండే తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని, తుది నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్‌దే అని షిండే ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. విభజన ప్రక్రియ పూర్తి కావడానికి మరో 3 నెలల సమయముంది షిండే తెలిపారు. -
రెండు రాష్ట్రాలకూ న్యాయం జరిగింది: షిండే
రాష్ట్ర ఏర్పాటు.. తెలంగాణ ప్రజలకు పెద్ద కానుక సీమాంధ్రకు ప్యాకేజీ, పోలవరం, ఇతర ప్రాజెక్టులు దక్కాయి ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. తెలంగాణ ప్రజల చిరకాల డిమాండ్. వారికి ఈ రోజు పెద్ద కానుక లభించింది. తెలంగాణ సాకారం కాగా.. సీమాంధ్రకు ప్యాకేజీ, పోలవరం, ఇతర ప్రాజెక్టులు లభించాయి. రెండు రాష్ట్రాలకూ న్యాయం జరిగిందని నేను భావిస్తున్నా. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినప్పుడు బీజేపీ, ఇతర పార్టీలు దానికి మద్దతు ఇచ్చాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందుతున్నపుడు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సభలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడాలని, సీమాంధ్రకు న్యాయం జరగాలని, తగిన ప్యాకేజీ లభించాలని ఆమె, కాంగ్రెస్ పార్టీ అభిలషించారు. ఈ రోజు (గురువారం) రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కూడా జోక్యం చేసుకుని.. సీమాంధ్రకు ప్యాకేజీ ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిందని భావించవద్దు. కొన్ని పార్టీలు చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కావటంతో ఆయా పార్టీల సభ్యులు కొందరు బిల్లును వ్యతిరేకించినప్పటికీ.. బీజేపీ, బీఎస్పీ, ఎల్జేపీ తదితర పార్టీలు సహా చాలా పార్టీలు దానికి మద్దతిచ్చాయి.’’ -
టి.బిల్లుపై చర్చను ప్రారంభించిన షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రారంభించారు. సీమాంధ్ర సభ్యుల నిరసనల మధ్య 45 సెకన్లపాటు షిండే మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. 1960 దశకంలో రెండు ప్రాంతాల్లోనూ ఉద్ధృతంగా ఉద్యమాలు జరిగాయన్నారు. చర్చలు, సంప్రదింపులతో తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించుకున్నారని గుర్తు చేశారు. గడచిన కొన్నేళ్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆకాంక్షల కోసం ప్రజలు ఉద్యమించారని తెలిపారు. పునర్విభజన ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ బిల్లు తీరుస్తుందని షిండే చెప్పారు. సీమాంధ్ర సభ్యుల ఆందోళన కొనసాగడంతో లోక్‌సభను స్పీకర్ 3 గంటల వరకు వాయిదా వేశారు. -
తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
-
ఏం జరుగుతుందో చూద్దాం: షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మధ్య కమల్‌నాథ్ తెలిపారు. లోక్‌సభలో బిల్లుపై చర్చకు ఆటంకాలను తొలగించడంపై స్పీకర్ దృష్టిపెడతారని చెప్పారు. బిల్లుకు మద్దతు తెలిపేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తంచేయొచ్చన్నారు. ఓటింగ్ ఉంటుందా, లేదా అన్నది సభలోనే తేలుతుందని కమల్‌నాథ్ అన్నారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఉంది, ఏం జరుగుతుందో చూద్దామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. కాగా, ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమైన కమల్‌నాథ్, షిండే... తెలంగాణ బిల్లుపై చర్చలు జరిపారు. -
పార్లమెంటులో తెలంగాణ బిల్లు?
-
పార్లమెంటులో తెలంగాణ బిల్లు?
15లోగా బిల్లుకు ఆమోదం లభించేలా కేంద్రం చర్యలు 4న జీవోఎం భేటీ.. బిల్లులో సవరణలు ప్రతిపాదించే అవకాశం 6న కేంద్ర కేబినెట్‌కు బిల్లు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై తుది అంకానికి కేంద్రం సిద్ధమవుతోంది. తెలంగాణ బిల్లును వచ్చే నెల 10వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టి, 15వ తేదీకల్లా ఆమోదింపజేసుకొనే ఏర్పాట్లలో ఉంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఇప్పటికే ప్రకటించారు. వచ్చే నెల 5 నుంచి 21 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. యూపీఏ-2 ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. అందువల్ల రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి మండలి డిసెంబర్ 5న చేసిన తీర్మానం మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. బిల్లుకు తుది రూపం ఇవ్వడానికి చర్యలు చేపడుతోంది. బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తెలిపేందుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుంది. మరోవైపు తెలంగాణ ఏర్పాటుపై షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం (జీవోఎం) వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. వచ్చే నెల 3లోగా శాసనసభ అభిప్రాయం కేంద్ర హోంశాఖకు చేరుతుందని, 4న జరిగే జీవోఎంలో అసెంబ్లీ ప్రతిపాదించిన ప్రధాన సవరణలను బిల్లులో చేర్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. బిల్లుపై కేంద్రం తన వైఖరిని చెబుతూ తదుపరి ప్రక్రియను చేపట్టాల్సిందిగా రాష్ట్రపతిని కోరేందుకు వచ్చే నెల 6న కేంద్ర మంత్రి మండలి భేటీ అవనుంది. అనంతరం వచ్చేనెల 10న బిల్లు పార్లమెంటు చేరే అవకాశం ఉంది. వచ్చేనెల 15కల్లా బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకుని, 17వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. ఒకవేళ బిల్లు ఆమోదం పొందడంలో ఆలస్యం జరిగితే సమావేశాలను మరో నాలుగు రోజులు పొడిగించే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. సవరణలపై కసరత్తు రాష్ట్ర విభజన బిల్లులో అసెంబ్లీలో జరిగిన చర్చ తీరుపై కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోంది. ఇప్పటికే దాదాపు 9 వేల సవరణలకు ప్రతిపాదనలు వ చ్చాయని, వీటిలో ప్రధానంగా దాదాపు 10 సవరణలను బిల్లులో చేర్చే అవకాశం ఉందని తెలిసింది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు, పార్టీలు ప్రతిపాదిస్తున్న రీతిలో పోలవరం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడం, నదీ జలాల పంపకం, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలతోపాటు తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలపై పలు సవరణలు చేయవచ్చని సమాచారం. వీటికి సంబంధించిన సమాచారం కోసం కేంద్ర హోంశాఖ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
'అనూహ్య' హంతకులను పట్టుకోండి
-
'అనూహ్య' హంతకులను పట్టుకోండి
న్యూఢిల్లీ: తన కూతురిని హత్య చేసిన హంతకులను పట్టుకుని శిక్షించాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్ కోరారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. షిండేను ఈ ఉదయం ఆయన ఢిల్లీలో కలిశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఈ నెల 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను ముంబై పోలీసులు పట్టుకున్నట్టు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తర్వాత తెలిసింది. -
కేజ్రీవాల్ పిచ్చి ముఖ్యమంత్రి: షిండే
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన పేరు ప్రస్తావించకుండా విమర్శనాస్త్రాలు సంధించారు. పిచ్చి ముఖ్యమంత్రి(మ్యాడ్ చీఫ్ మినిస్టర్) అంటూ ఎద్దేవా చేశారు. పిచ్చి సీఎం కారణంగానే పోలీసు అధికారుల సెలవులు రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'నేను పోలీస్‌గా పనిచేసినప్పుడు అల్లర్ల కారణంగా నా పెళ్లికి పెట్టుకున్న సెలవు రద్దయింది. ఇప్పుడు ఒక పిచ్చి ముఖ్యమంత్రి కారణంగా పోలీసుల సెలువులు రద్దు చేయాల్సి వచ్చింది' అని షిండే వ్యాఖ్యానించారు. అయితే ఆయన కేజ్రీవాల్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. షిండే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి స్పందన రాలేదు. -
అసెంబ్లీ నుంచి రాగానే పార్లమెంటుకు
టీ-బిల్లుపై కేంద్ర హోంమంత్రి షిండే వెల్లడి వచ్చే సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు పెడతాం టీ-బిల్లు ఆమోదంపై మేం పూర్తి విశ్వాసంతో ఉన్నాం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉందని.. బిల్లు అసెంబ్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదంపై కేంద్రం పూర్తి విశ్వాసంతో ఉన్నదన్నారు. హోంశాఖ నెలవారీ నివేదిక విడుదలకు శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న షిండే.. తెలంగాణ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చా రు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయంతో బిల్లును పంపడానికి రాష్ట్రపతి జనవరి 23వ తేదీ వరకు గడువు ఇచ్చారని.. అసెంబ్లీ నుంచి బిల్లు తిరిగిరావాలని తాను కోరుకుంటున్నానని, అది వచ్చాక పార్లమెంటులో పెడతామని చెప్పా రు. రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెడతామని స్పష్టంచేశారు. ‘లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా.. మరి బిల్లును ఆమోదించి రెండు రాష్ట్రాలు చేయటం కుదురుతుందా?’ అని అడగగా.. ‘‘ముందు బిల్లు అసెంబ్లీ నుంచి ఇక్కడికి రానివ్వండి.. మేమైతే బిల్లును పార్లమెంటులో పెడతాం.. దానిని పాసవ్వనివ్వండి. బిల్లు ఆమోదంపై మేం చాలా విశ్వాసంతో ఉన్నాం. నేను, ప్రభుత్వం, సోనియాగాంధీ అందరం విశ్వాసంతో ఉన్నాం’’ అని షిండే బదులిచ్చారు. మావోయిస్టు నాయకులు ఉసెండిని అనుసరించాలి మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు వెంకట కృష్ణ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని.. గతంలో దండకారణ్య ప్రాంతానికి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఉసెండి లొంగుబాటును తాను స్వాగతిస్తున్నానని షిండే పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలోని ఇతర సీనియర్ నాయకులూ ఉసెండి బాటనే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. నెలాఖరు వరకు ఏపీలో కేంద్ర బలగాలు... ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మోహరించివున్న 95 కంపెనీల కేంద్ర బలగాలను జనవరి నెలాఖరు వరకు కొనసాగిస్తున్నట్లు షిండే తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించాక 4 ఆర్ఏఎఫ్, 50 సీఆర్పీఎఫ్, 33 బీఎస్ఎఫ్, 8 సీఐఎస్ఎఫ్ కంపెనీల బలగాలను అక్కడే ఉంచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. భద్రతా సంబంధిత వ్యయం పథకం కింద నక్సల్స్ ఏరివేత కార్యకలాపాలపై రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తంలో రూ.153.40 లక్షల నిధులను గత డిసెంబర్ 2న రాష్ట్రానికి రీయింబర్స్మెంట్ రూపంలో ఇచ్చినట్టు షిండే నివేదికలో పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు: షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రపతి నుంచి బిల్లు తమకు చేరిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతామని తెలిపారు. సమయం సరిపోతుందా అన్న ప్రశ్నకు చూద్దామంటూ ఆయన సమాధానం దాటవేశారు. మొదట బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామన్నారు. తెలంగాణ బిల్లు పంపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రపతి జనవరి 23వరకు సమయం ఇచ్చారని గుర్తు చేశారు. తమకున్న సమాచారం ప్రకారం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని షిండే తెలిపారు. విచారణ ఎదుర్కొకోకుండా కేసులు ఎదుర్కొంటున్న వారి విషయంతో రాష్ట్రాలు సమీక్ష కమిటీలు వేయాలని సూచించారు. తొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్నారు. -
ఫిబ్రవరిలో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు: షిండే
-
3 రోజుల్లో టీ బిల్లు ఖరారు
-
3 రోజుల్లో టీ బిల్లు ఖరారు
ముగిసిన జీవోఎం చర్చలు 3 రోజుల్లో టీ బిల్లు ఖరారు తెలంగాణ, సీమాంధ్ర కేంద్రమంత్రులు, సీఎంతో జీవోఎం భేటీలు రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తామని సీమాంధ్ర కేంద్రమంత్రుల హామీ హైదరాబాద్ యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని వినతి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇవ్వాలన్న టీ కేంద్రమంత్రులు లేకుంటే బిల్లుకు బీజేపీ మద్దతివ్వదని, కాంగ్రెస్‌కు తీవ్ర నష్టమని నివేదన విభజిస్తే నక్సలిజం, ఉగ్రవాదం, మతకలహాలు చెలరేగుతాయన్న ముఖ్యమంత్రి {పహసనంగా జీవోఎం భేటీలు.. ముగ్గురు సభ్యుల గైర్హాజరే నిదర్శనం సంప్రదింపులు ముగిశాయి.. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు: షిండే, దిగ్విజయ్ న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనకు సంబంధించి తుది విడత చర్చల ప్రక్రియ ముగిసిపోయింది. విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం సోమవారం ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో వేర్వేరుగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలనూ వినటంతో.. చర్చల ప్రక్రియను పూర్తిచేసినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ముసాయిదా బిల్లుకు తుది రూపం ఇవ్వటమే మిగిలింది. ఈ పనిలో నిమగ్నమైన జీవోఎం మరో మూడు రోజుల్లో దానిని కూడా పూర్తిచేయనుంది. ఈ నెల 20, 21 తేదీల్లో (బుధ, గురువారాల్లో) జీవోఎం సమావేశమై బిల్లును ఖరారు చేయనుంది. ఆ బిల్లును 21వ తేదీ సాయంత్రం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రవేశపెట్టేందుకు సంసిద్ధమవుతోంది. బిల్లును కేబినెట్ ఆమోదించిన వెంటనే రాష్ట్రపతికి పంపించేందుకు, అటునుంచి రాష్ట్ర శాసనసభకు పంపేందుకు కూడా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజనకు సంబంధించి సంప్రదింపులు పూర్తయ్యాయని జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో పాటు, జీవోఎం సభ్యుడు, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌లు కూడా ప్రకటించారు. జీవోఎం తన నివేదికను సాధ్యమైనంత త్వరలో కేబినెట్‌కు పంపుతుందని.. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు టీ బిల్లు వెళ్తుందని వారు ఉద్ఘాటించారు. మూడు భేటీలతో మమ... నిన్నటివరకు సమైక్య రాష్ట్రమే తమ ఏకైక ఎజెండా అని పదేపదే ప్రకటించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు.. రాష్ట్ర విభజన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జీవోఎంకు స్పష్టంచేశారు. విభజన ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. అయితే.. హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే అంశాన్ని విభజన బిల్లులో పొందుపరిస్తే సీమాంధ్రలోని 80 శాతం ప్రజలు సంతృప్తి చెందుతారని సలహా ఇచ్చారు. దీంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన మేరకు ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. కొత్త రాజధాని ఎక్కడనే దానిపై తమలోనే బేధాభిప్రాయాలున్న నేపథ్యంలో నిపుణుల కమిటీని వేసి ఎంపిక చేయాలని కోరారు. కిషోర్ చంద్రదేవ్ మినహా సీమాంధ్ర కేంద్రమంత్రులంతా ముక్తకంఠంతో జీవోఎంకు ఇదే విషయాన్ని చెప్పారు. కిషోర్ మాత్రం విభజన జరిగితే ఉమ్మడి రాజధాని అవసరం లేదని, విశాఖలో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అదే సమయంలో రాయలసీమను సైతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, సాధ్యంకాని పక్షంలో తెలంగాణలోనే కలపాలే తప్ప సీమను విభజించటం ఏమాత్రం సహేతుకం కాదని సూచించారు. తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు మాత్రం.. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన పరిపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జీవోఎంకు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చే అవకాశం లేదని.. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం టీ-నేతలు మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఖాయమనే ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్ నుంచి రెండు బ్యాగ్‌ల నిండా ఫైళ్లతో జీవోఎం ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. గంటన్నర పాటు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం, టైజంతో పాటు మతక లహాలు పెచ్చరిల్లే ప్రమాదముందని జీవోఎంకు స్పష్టం చేశానని ఆ తర్వాత మీడియాతో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి సాగునీరు, విద్య వంటి రంగాల అభివృద్ధికి తగిన ఆర్థిక సాయం చేయాలని కూడా సూచించినట్లు తెలిపారు. ఇక విభజన జరుగుతుందో లేదో వేచి చూడాలని ముక్తాయించారు. జీవోఎం మాత్రం ఈ సంప్రదింపుల ప్రక్రియనంతా తూతూ మంత్రంగా ముగించింది. చివరకు సొంత పార్టీ నాయకులు, రెండు ప్రాంతాల కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన భేటీని సైతం తేలికగా తీసుకుంది. సోమవారం జరిగిన కీలక సమావేశాలకు సీనియర్ మంత్రులైన ఎ.కె.ఆంటోని, చిదంబరం, గులాంనబీఆజాద్లు గైర్హాజరవటమే ఇందుకు నిదర్శనం. హాజరైన నలుగురు సభ్యుల్లోనూ వీరప్పమొయిలీ తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రుల భేటీకి రాలేదు. ఇక బిల్లుకు తుది రూపంపై కసరత్తు... అందరి అభిప్రాయాలు వినడానికే పరిమితమైన జీవోఎం సభ్యులు సమావేశాల తర్వాత సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని ప్రకటించారు. తెలంగాణ బిల్లుకు తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అందుకోసం ఈ నెల 20, 21 తేదీల్లో ఉదయం 10.30 గంటలకు మరోసారి సమావేశమై తెలంగాణ బిల్లును ఖరారు చేసి, 21న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరులో విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపటంతో పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని షిండే పునరుద్ఘాటించారు. విభజనను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ చేసిన వాదనను దిగ్విజయ్ తోసిపుచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ నిర్ణయమే ఫైనల్ అని, సీఎం సహా ఎవరైనా శిరసావహించాల్సిందేనని స్పష్టంచేశారు. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వెళ్తుందంటూ.. తెలంగాణ ప్రజలకు, యూపీఏ సర్కారుకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇక జీవోఎం నివేదికను ఖరారు చేస్తాం ‘‘ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ఇతరులతో చర్చల ప్రక్రియను మేం పూర్తిచేశాం. ఇప్పుడు జీవోఎం సభ్యులు సమావేశమై కేబినెట్‌కు సమర్పించాల్సిన నివేదికను ఖరారు చేయటంపై చర్చిస్తారు. సాధ్యమైనంత త్వరగా ఈ నివేదికను సమర్పిస్తాం. తెలంగాణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతాం.’’ - సుశీల్‌కుమార్‌షిండే, కేంద్ర హోంమంత్రి, జీవోఎం సారథి సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తాం ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జీవోఎం సంప్రదింపులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలకూ జీవోఎం పరిష్కారం చూపుతుంది. సీమాంధ్ర అభివృద్ధిపై ఆ ప్రాంతం నేతల డిమాండ్లు సరైనవే. సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తాం. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వెళ్తుంది. తెంగాణ ప్రజలకు, యూపీఏకు శుభాకాంక్షలు.’’ - దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అన్ని ప్రాంతాల అభిప్రాయాలూ పరిగణనలోకి... ‘‘రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా ఈ నెల 21న జీవోఎం మరోసారి భేటీ అవుతుంది. జీవోఎం తుది నివేదిక ఈ నెలాఖరులోగా పూర్తవుతుంది. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. విభజన అంశాన్ని పెండింగ్‌లో పెట్టబోం. సీఎం కిరణ్ తన వాదనను వినిపించారు.’’ - వీరప్పమొయిలీ, కేంద్ర పెట్రోలియం మంత్రి, జీవోఎం సభ్యుడు జరగనున్న క్రమమిదీ... ఈ నెల 20, 21 తేదీల్లో జీవోఎం చివరిసారిగా సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లుకు తుదిరూపం కల్పిస్తుంది. 21వ తేదీన జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశం ముందుకు ఆ ముసాయిదా బిల్లు వచ్చే అవకాశముంది. కేంద్ర మంత్రిమండలి దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తుంది. దానిపై రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరతారు. దీనికి ఇంత సమయంలో జరగాలని కాలపరిమితి అంటూ లేదు. డిసెంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉన్నాయి. ఆ లోగానే రాష్ట్రపతి తెలంగాణ బిల్లుపై అభిప్రాయం చెప్పాలని అసెంబ్లీకి నిర్దేశించవచ్చు. రాష్ట్రపతి అలా కోరిన పక్షంలో మూడు రోజుల్లో రాష్ట్ర శాసనసభను సమావేశపరచడానికి అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ప్రోరోగ్ కానందున మూడు రోజుల కాలపరిమితిలో సమావేశాలను పెట్టడానికి వీలుంది. ఆ లెక్కన నెలాఖరులోగా అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవడానికి వీలు ఉంది. అది రాష్ట్రపతి బిల్లును అసెంబ్లీకి పంపే గడువును బట్టి ఆధారపడి ఉంది. అసెంబ్లీ అభిప్రాయం తీసుకున్న తర్వాత బిల్లును రాష్ట్రపతి మరోసారి పరిశీలించి పార్లమెంటుకు పంపిస్తారు. శీతాకాల సమావేశాల్లో బిల్లును పార్లమెంటు ముందు పెట్టే అవకాశముంది. -
త్వరలోనే తెలంగాణ బిల్లు: షిండే
-
షిండే నేతృత్వంలో జీవోఎం భేటి ప్రారంభం
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తోపాటు కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శలతో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం ఉదయం సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా జీవోఎంతో సమావేశమయ్యేందుకు పలు పార్టీలు సిద్ధమయ్యాయి. బీజీపీ, సీపీఎంల నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ నుంచి ముగ్గురు ప్రతినిధులు ఢిల్లీ వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పార్టీ సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి హాజరవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కేవీపీ రామచంద్రరావు, మంత్రుల కన్నా లక్ష్మినారాయణ, వట్టి వసంతకుమార్‌లు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీమాంధ్ర నుంచి డాక్టర్ కె.హరిబాబును ఈ నెల 12న ఈ సమావేశానికి పంపాలని బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ నిర్ణయించింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ పార్టీల ప్రతినిధులు జీవోఎంతో భేటీ అవుతారు. -
పయ్యావుల కేశవ్ ను సస్పెండ్ చేయాలి: ఎర్రబెల్లి
టీడీపీని ఇరుకున పెట్టేందుకే మళ్లీ అఖిల పక్షం నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఉంటుందన్న వార్తలపై టీడీపీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు కోసం టీడీపీని ఒప్పించాం అని అన్నారు. అఖిలపక్షానికి టీడీపీ వెళ్లాల్సిన అవసరం లేదు అని అన్నారు. అఖిల పక్షానికి ఇరు పార్టీల జేఏసీలు వెళితే సరిపోతుంది ఆయన సూచించారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. అఖిల పక్షం భేటి, తాజా రాజకీయాలపై చర్చ చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిని ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పయ్యావుల కేశవ్ ను సస్పెండ్ చేయాలి అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా... వ్యక్తిగతంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను అని పయ్యావుల కేశవ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్ 7వ తేదీన మలివిడత సమావేశం కానున్న నేపథ్యంలో.. జీఓఎం భేటీకి ముందే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని బుధవారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. -
విభజన నేపధ్యంలో మరో అఖిలపక్ష భేటీ
-
తెలంగాణపై త్వరలో అఖిలపక్ష సమావేశం: షిండే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. మంత్రుల బృందం సమావేశాని కంటే ముందే.. నవంబర్ 7 తేది లోపే అఖిలపక్ష సమావేశం ఉంటుంది ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. అఖిలపక్ష భేటిలో మంత్రుల బృందం(జీఓఎం) విధివిధానాలపై చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అఖిలపక్ష సమావేశానికి రావాలని లేఖలు రాస్తామని షిండే తెలిపారు. రాష్ట్ర విభజనపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా బుధవారం మధ్నాహ్నం సమావేశమైంది. ఈ సమావేశానికి షిండే, సోనియా, చిదంబరం, ఆంటోనిలు హాజరయ్యారు. -
విభజనపై కాంగ్రెస్ కోర్ కమిటి అత్యవసర భేటి
రాష్ట్ర విభజన ప్రధాన ఎజెండాగా ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటి సమావేశమైంది. ఈ సమాశవంలో చిదంబరం, ఆంటోని, షిండే, ఆహ్మద్ పటేల్, సోనియా గాంధీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రెండు గంటలపాటు సాగింది. 371డి సవరణ, అఖిల పక్ష భేటి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర సమస్యలపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ కోర్ కమిటి భేటి సమావేశానికి ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కలువడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. -
రాష్ట్ర విభజన విధివిధానాలపై చర్చించాం: షిండే
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలపై చర్చించినట్లు కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం) కీలక సమావేశం గంటగన్నరపాటు జరిగింది. సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా శాఖల కార్యదర్శులు సమాచారాన్ని పంపారని తెలిపారు. ఇప్పటి వరకు 2000 ఇమెయిల్స్ వచ్చాయని చెప్పారు. వాటన్నిటినీ శాఖల వారీగా వర్గీకరించి ప్రభుత్వ కార్యదర్శులకు పంపుతామన్నారు. నవంబర్ 7 మరోసారి సమావేశమవుతామని చెప్పారు. సమావేశానికి ఆంటోనీ హాజరు కాలేదన్నారు. ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండేతోపాటు కేంద్ర మంత్రులు గులామ్ నబీ ఆజాద్, వీరప్పమొయిలీ, జైరాం రమేష్, చిదంబరం, నారాయణస్వామి హాజరయ్యారు. -
మూడు వారాల ముందే తెలంగాణ నోట్ సిద్ధం!
కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చిన తెలంగాణ నోట్ రూపకల్పన వెనక దాదాపుగా మూడు వారాల కసరత్తు దాగుందని సమాచారం. కాకపోతే సెప్టెంబర్ 25 నాటికి అది తమకు చేరని కారణంగా దాన్ని గురువారం నాటి కేబినెట్ భేటీ అజెండాలో చేర్చలేకపోయినట్టు కేబినెట్ సచివాలయంలోని అత్యున్నత వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఎజెండా వారం రోజుల ముందే ఖరారవుతుందని, ఒక రోజు ముందు దాన్ని విడుదల చేస్తామని గుర్తు చేశాయి. నిజానికి దాన్ని ప్రధాని కార్యాలయంతో పాటు కేబినెట్ సచివాలయానికి కూడా రెండు వారాల ముందే కేంద్ర హోం శాఖ పంపినట్టు తెలుస్తోంది. కానీ ప్రధాని కార్యాలయ అభిప్రాయాల కోసం అది వారం పాటు పీఎంఓలోనే ఉండిపోయిందని సమాచారం. అంటే, విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని ఏ మాత్రమూ ఖాతరు చేయకుండా మూడు వారాలుగా తెలంగాణ నోట్ తయారీలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు తలమునకలైందన్నమాట! -
నేటి కేబినెట్ భేటీలో ‘టీ’ లేదు - రేపటి సమావేశంలోనూ రాదు!
విభజన నిర్ణయంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ లబ్ధికోసం తమ నాటకాన్ని రక్తికట్టిస్తోంది. కాంగ్రెస్ దిగ్గజాలే రోజుకో మాట మాట్లాడుతూ.. కేబినెట్ నోట్ ఇదిగో అదిగో అంటూ కావాలనే గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంమీద రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారేంతవరకు రాష్ట్రాన్ని ఇదే విధంగా అయోమయంలో కొనసాగించడమే ఎజెండాగా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ రూపొందించే కేబినెట్ నోట్ కేంద్ర మంత్రిమండలి ముందుకు రాబోతోందంటూ గత కొద్ది రోజులుగా హైడ్రామా నడుపుతున్నారు. ఇంతగా ప్రచారం చేస్తూవచ్చినప్పటికీ బుధ, గురువారాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ తెలంగాణ నోట్ అనేది అసలు ఎజెండాలో చేర్చలేదు. ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా మంత్రిమండలి సమావేశం ఉంటుందని ప్రచారం చేశారు. తీరా మంత్రివర్గం సమావేశం కాబోతోందన్న కొద్ది గంటల ముందు.. ‘ఇప్పుడే అలాంటి నోట్ అంటూ ఏమీ లేద’ని కేంద్ర హోంశాఖ తేల్చేసింది. కేంద్ర హోంశాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన కథనం మేరకు బుధ, గురువారాల్లో జరిగే కేబినెట్ సమావేశంలో టీ-నోట్ ప్రస్తావన ఉండదని తేలిపోయింది. అసలు నోటే సిద్ధంకానప్పుడు కేబినెట్ ముందుకు ఎలా వస్తుందని కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. కొద్ది రోజుల కిందటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ నోట్ ముసాయిదా సిద్ధమైందని స్వయంగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటన చేశారు. దాన్ని తానింకా పరిశీలించలేదని, త్వరలోనే పరిశీలిస్తానని కూడా తెలిపారు. గతంలో దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలను రోడ్‌మ్యాప్‌లు తయారు చేయమనడం, అంతే వేగంగా కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం, ఆ తర్వాత కొద్ది రోజులకు యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీ, వెను వెంటనే సీడబ్ల్యూసీ తీర్మానం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటన్నట్టు కాంగ్రెస్ త్వరత్వరగా నిర్ణయాలు చేసింది. అప్పుడు ఎంతో వేగంగా వ్యవహారాలు నడిపించి రాష్ట్రాన్ని అయోమయంలో పడేసిన కాంగ్రెస్ నాయకత్వం తాజా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ప్రతిష్టంభనను తొలగించడానికి గానీ అనిశ్చితికి తెరదించేందుకు గానీ ఏమాత్రం ప్రయత్నాలు చేయకపోగా.. పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెడుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేబినెట్ ఎజెండాలో టీ-నోట్ లేదు... కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఆంటోనీ కమిటీని తెరమీదకు తెచ్చి ఆ కమిటీ సిఫారసుల కోసమంటూ కొత్త వాదన ముందుపెట్టి పరిష్కారం చూపకుండా సాగదీస్తోంది. అయితే.. ఆంటోనీ కమిటీకి కేంద్ర హోంశాఖ రూపొందించి నివేదించే కేబినెట్ నోట్‌కు అసలు సంబంధమే లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ దిగ్విజయ్‌సింగ్ రెండు రోజుల కిందటే చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినేట్ నోట్ రావడం ఖాయమని భావించారు. మంత్రిమండలి సమావేశం కావడానికి సరిగ్గా 24 గంటల సమయం కూడా లేకముందు మంత్రిమండలి ఎజెండాలో నోట్ ముసాయిదా ప్రస్తావన లేదని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ లీకులు బయటకొచ్చాయి. ఏమంటే కేబినెట్ నోట్ ముసాయిదాలో అనేక మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం ఉందని, అవి పూర్తయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మో„హన్ సింగ్‌ల పరిశీలనకు పంపిస్తారని, ఆ తర్వాత కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు వెళుతుందని, ఆ తర్వాతే మంత్రిమండలి ముందుకొస్తుందని ఇప్పుడు తాజాగా ప్రచారంలో పెట్టిన కథ. బుధవారం సాయంత్రం జరుగనున్న కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం ఎజెండాలో.. కేవలం శిక్షపడిన ప్రజాప్రతినిధుల చట్టసభల సభ్యత్వం తక్షణం రద్దు కాకుండా అడ్డుకొనేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స పునఃపరిశీలన మినహా మరే ఇతర అంశాలను పొందుపరచలేదని.. గురువారం నాటి మంత్రివర్గ సమావేశం ఎజెండాలో కూడా తెలంగాణ అంశాన్ని చేర్చలేదని తెలియవచ్చింది. పొంతనలేని షిండే, దిగ్విజయ్ వ్యాఖ్యలు... నోట్‌పై షిండే, దిగ్విజయ్‌లు ఇప్పటివరకూ తమ నోటితోనే చెప్పిన విషయాలకూ.. తాజా పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకపోవటం గమనార్హం. ఇదంతా నాటకంలో భాగమేనని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి విశ్వసనీయ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. కేబినెట్ నోట్ దాదాపు సిద్ధమైందని, దాన్ని త్వరలోనే కేబినెట్ భేటీలో చర్చకు పెట్టి ఆమోదిస్తారని దిగ్విజయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆంటోనీ కమిటీ ఇచ్చే సిఫారసులను తెలంగాణ బిల్లులోనే చేరుస్తారు తప్పించి కేబినెట్ నోట్లో కాదని కూడా ఆయన మొన్నటికి మొన్న స్పష్టంచేశారు. నోట్ ముసాయిదా సిద్ధమైందని స్వయంగా హోంమంత్రి షిండే కనీసం రెండు సందర్భాల్లో వెల్లడించారు. కానీ.. ఇప్పుడు నోట్ అసలు సిద్ధం కాలేదని, ఆంటోనీ కమిటీ సిఫారసుల కోసం నిరీక్షిస్తున్నామని, అవి వచ్చాక ముసాయిదా నోట్లో మార్పులు చేయాలని, దానికి తొలుత రాజకీయ ఆమోదం, తర్వాత న్యాయశాఖ ఆమోదం కావాలని తాజాగా షిండే నేతృత్వంలోని హోంశాఖ అధికార వర్గాల పేరుతో లీకులు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ నాటకంలో భాగమేనని విశ్వసనీయ వర్గాల కథనం. అంతా ఆ నాటకంలోని అంకాలే... సీమాంధ్రలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని నేతలు ఏకరువు పెట్టడంతో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఒకవైపు సీఎం కిరణ్ ద్వారా సొంత పార్టీపైనా తిరుగుబాటు చేస్తున్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేయించడం.. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో సమావేశాలను నిర్వహింపచేయడం, పీసీసీ అధ్యక్షుడు బొత్సతో రాజీనామాకు సిద్ధమంటూ లీకులు ఇప్పించడం.. ఇవన్నీ అధిష్టానం రచించిన డ్రామాలోని అంకాలేనని ఆ వర్గాలంటున్నాయి. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ సీఎం బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినా పార్టీ పెద్దలెవరూ దీనిపై గట్టిగా స్పందించకపోవడాన్ని, దిగ్విజయ్ తాజాగా దీనిపై స్పందనకు నిరాకరించడాన్ని బట్టి ఇదంతా హైకమాండ్‌కు తెలిసే జరుగుతోందన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. కాగా, నవంబర్‌లోగానీ తెలంగాణ అంశం ఒక కొలిక్కి రాదంటూ ఏఐసీసీ వర్గాలు కొత్త లీకును ప్రచారంలోకి తెస్తుండటం మరో విశేషం. -
అఖిలపక్షంలో నాడు ఎవరేమన్నారంటే..?
తెలంగాణ అంశంపై కిందటేడాది డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు రాష్ట్రంలోని ఎనిమిది పార్టీల నుంచి ఇద్దరేసి ప్రతినిధుల చొప్పున పాల్గొన్నారు. ఈ భేటీలో అధికార కాంగ్రెస్ రెండు వాదనలు వినిపించింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించిందని కేఆర్ సురేశ్‌రెడ్డి చెప్పగా.. విభజనకు అనుకూలమని కాంగ్రెస్ ఏనాడూ చెప్పలేదని గాదె వెంకట్‌రెడ్డి చెప్పారు. అయితే సురేశ్‌రెడ్డి వాదననే కాంగ్రెస్ నిర్ణయంగా కేంద్రానికి నివేదిస్తానని షిండే స్పష్టంచేశారు. ఆయా పార్టీలు సమావేశంలో ఏమన్నాయంటే.. కాంగ్రెస్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది(సురేశ్‌రెడ్డి). నేను సమైక్యవాదిని. విభజనకు అనుకూలమని కాంగ్రెస్ ఏనాడూ చెప్పలేదు(గాదె) టీడీపీ..: 2008లో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖలోనే తెలంగాణపై మా అభిప్రాయం చెప్పాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయాన్ని సీల్డ కవర్లో ఇస్తున్నాం. టీఆర్ఎస్..: వీలైంనంత త్వరగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. కాలయాపన చేయకుండా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఎంతకాలం నాన్చుతారు? తెలంగాణ ఇస్తరా, ఇవ్వరా? తేల్చిచెప్పండి. వైఎస్సార్సీపీ..: ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా కేంద్రానివే సర్వాధికారాలు.. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా.. ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి. సీపీఎం..: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. దీనిపై ముందు కాంగ్రెస్ వైఖరి తెలియజేయాలి. సీపీఐ..: విశాలాంధ్ర కోసం గతంలో పోరాడాం.. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మజ్లిస్..: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. విభజించాల్సి వస్తే రాయలసీమ, తెలంగాణ కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి. కేంద్రం: తెలంగాణపై ఇదే ఆఖరు సమావేశం. కొందరికి బాధ కలుగుతుందని మౌనంగా ఉండం. గరిష్టంగా నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. నిజాయతీ నిరూపించుకున్నామన్న బాబు.. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగిన రోజున.. ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో మాట్లాడారు. అఖిలపక్ష భేటీలో తమ వైఖరిని స్పష్టంగా చెప్పామని, టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. ‘‘తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని మొదట్నుంచీ చెబుతున్నా.. మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నింది. 2008లో టీడీపీ తీసుకున్న నిర్ణయం కేంద్రం వద్దే లేఖలో ఉంది. ప్రణబ్ కమిటీకి ఇచ్చిన ఆ లేఖను వాపసు తీసుకోలేదు. ఆ లేఖ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అఖిలపంలో చెప్పాం’’ అని అన్నారు. -
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు సీబీఐ క్లీన్ చిట్!
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కు పెద్ద ఊరట లభించింది. ఈకేసులో షిండేకు దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి తప్పిదాలు చేయలేదని హైకోర్టుకు సీబీఐ ఓ అఫిడవిట్ ఇచ్చింది. సీబీఐ చేస్తున్న దర్యాప్తులో సుశీల్ కుమార్ షిండే పేరును ఉంచాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. పీఎన్ హరిదాస్, జస్టిస్ పీఎన్ దేశ్ ముఖ్ లతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 26 తేదికి వాయిదా వేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో వివాదస్పద 31 అంతస్తుల టవర్ లో షిండే బినామీ పేరుతో ఫ్లాట్లను కొనుగోలు చేసాడంటూ సామాజిక కార్యకర్త ప్రవీణ్ వాటేగావంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టారు. -
సమైక్యాంధ్ర తప్ప ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించేది లేదు: లగడపాటి
తెలంగాణపై ముందుకెళ్లితే సీమాంధ్ర ఎంపీలందరం సామూహిక రాజీనామాలు సమర్పిస్తామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. అంటోని కమిటీ ముందుకు వెళ్లకుండా తెలంగాణపై ఎలా నిర్ణయం తీసుకుంటారు అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర తప్ప యూటీ సహా ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమైక్యతను కాపాడేందుకు దేనికైనా సిద్ధమే చేస్తామన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదానికే మద్దతు తెలుపుతున్నారని లగడపాటి అన్నారు. సీమాంధ్ర ఎంపీలకు తెలియకుండా తెరవెనుక చర్యలను అంగీకరించం అని ఆయన స్సష్టం చేశారు. సెప్టెంబర్ 24 తేదిన స్పీకర్ మీరా కుమార్ తో భేటి అవుతామని.. రాజీనామాలను అంగీకరింప చేసుకునేందుకు ప్రయత్నిస్తామని ఎంపీలు తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీల వాదనలు పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఎంపీల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే డ్రాఫ్ట్ కు సీమాంధ్ర ఎంపీలు సవాల్ విసిరారు. ద్రాఫ్ట్ రూపొందిస్తే రాజీనామాలేనని హెచ్చరించారు. జాగో బాగో, వెళ్లిపోవాలంటూ చేస్తూ అంటూ తెలుగు జాతిని సర్వనాశనం చేసింది ఆయనే అని కేసీఆర్ తీరు ను విమర్శించారు. అంతిమ విజయం సమైక్య వాదానిదే అని లగడపాటి ధీమా వ్యక్తం చేశారు. -
ఢిల్లీ చేరుకున్న సోనియాగాంధీ
-
'సోనియా రాగానే మంత్రి వర్గం ముందుకు కేబినేట్ నోట్'
-
'సోనియా రాగానే మంత్రి వర్గం ముందుకు కేబినేట్ నోట్'
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినేట్ నోట్ ప్రక్రియ పూర్తి అయిందని.. అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాగానే కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదేశాలకు అనుగుణంగా హోంశాఖ కార్యాలయ అధికారులు కేబినేట్ నోట్ ను సిద్ధం చేశారని తెలిపారు. కేబినేట్ నోట్ తో తాము సిద్ధంగా ఉన్నామని.. సోనియాగాంధీ రాగానే రాజకీయ పార్టీల ఆమోదానికి పంపుతామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం సెప్టెంబర్ 2 తేదిన సోనియాగాంధీ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ మరో వారం రోజుల్లో భారత్ చేరుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల ఆమోదం లభించిన తర్వాత కేబినేట్ నోట్ ను కేంద్ర న్యాయశాఖకు పంపుతామని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హోంశాఖ కేబినేట్ నోట్ ను ప్రిపేర్ చేస్తోందని.. త్వరలోనే మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని ఇటీవల షిండే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌పై రెండు మూడు ఆలోచనలు: షిండే
హైదరాబాద్ విషయమై తమ వద్ద రెండు మూడు ప్రతిపాదనలున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోకపోతే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించినా.. సీమాంధ్ర 38 రోజులుగా ఉద్యమాల జోరుతో హోరెత్తుతున్నా.. కేంద్ర హోం మంత్రి షిండే మాత్రం మళ్లీ పాత పాటే పాడారు. న్యూఢిల్లీలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోం శాఖ కేబినెట్ నోట్ తయారు చేస్తోందన్నారు. త్వరలోనే ఈ నోట్ పూర్తవుతుందని తెలిపారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన కారణంగానే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నామని షిండే తెలిపారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసిందని అన్నారు. సీడబ్ల్యుసీ కూడా తెలంగాణకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆంటోనీ కమిటీ చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. ఆంద్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తి లేదని, ప్రస్తుతానికి అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణపై కేబినెట్ నోట్ తయారైతే అన్ని అంశాలూ పరిష్కారం అవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వదంతులన్నీ అబద్ధమేనని షిండే స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాలకోసం చాలా డిమాండ్లు ఉన్నాయి గానీ, వాటన్నింటినీ అంగీకరించలేమని హోం మంత్రి షిండే తెలిపారు. గూర్ఖాలాండ్, విదర్భ సహా అనేక కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పలు విజ్ఞప్తులున్నాయని, కానీ వాటిని ఇప్పట్లో పరిశీలించలేమని షిండే అన్నారు. అవసరమైనప్పుడు వాటిని కూడా పరిశీలిస్తామన్నపారు. అసోంలో బోడోలు, కుచ్-రాజ్బంగ్షీలు, కర్బీలు, దిమసాలు చాలాకాలంగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గూర్ఖా జనముక్తి మోర్చాకు చెందిన ఓ బృందం తనవద్దకు రావడంతో తాను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించినా అది కుదరలేదన్నారు. -
కేబినోట్ నోట్ తయారవుతోంది.. సకాలంలో పూర్తవుతుంది: షిండే
రాష్ట్రంల ఉద్యమాలతో ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో తెలంగాణ అంశంపై హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మళ్లీ స్పందించారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన కారణంగానే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నామని షిండే తెలిపారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది అని షిండే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేస్తోందన్నారు. త్వరలోనే కేబినేట్ నోట్ పూర్తి అవుతుందని షిండే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
విభజనపై ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పే!
-
విభజనపై ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పే!
విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఎంత ముందుకెళ్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు అంత నష్టం తప్పదని కేంద్ర పెద్దలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో కిరణ్ బుధవారం భేటీ అయ్యారు. సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి వేసిన ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేదాకా విభజన ప్రక్రియను పూర్తిగా నిలిపేయాలని షిండేను ఆయన కోరినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు ముగిసే దాకా విభజనను పక్కన పెట్టాలని సూచించారంటున్నారు. అయితే అన్ని పార్టీల వైఖరులూ తెలుసుకున్నాకే కాంగ్రెస్ ముందడుగు వేసిందని, పార్టీ తీర్మానం మేరకు ప్రభుత్వం తన పని చేసుకుపోతోందని కిరణ్‌కు షిండే చెప్పారని తెలిసింది. దిగ్విజయ్ నుంచి కూడా ఆయనకు అలాంటి స్పందనే ఎదురైంది. ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్‌గాంధీలను కలవాలని భావించిన కిరణ్, వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో హైదరాబాద్ పయనమయ్యారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలు, క్షేత్రస్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న సంఘర్షణ తదితరాలపై షిండే, దిగ్విజయ్‌లతో కిరణ్ విడి విడిగా చర్చించారు. ‘‘విభజన నిర్ణయం అనంతరం ప్రజానీకమంతా కాంగ్రెస్‌నే దోషిగా చూస్తోందని, విపక్షాలు కూడా కాంగ్రెస్‌నే లక్ష్యం చేసి ప్రజల్లోకి వెళ్తున్నాయి. మంత్రులు, ఎంపీలని కూడా చూడకుండా జనం నిలదీస్తున్నారు. రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు ఇప్పటికే రోడ్డెక్కారు. రైతులూ అదే బాట పడితే ఉద్యమం మహోధృతమవుతుంది. నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగాలు, పరిశ్రమలు, హైదరాబాద్ తదితరాలపై స్పష్టత ఇవ్వకుండా విభజనపై ముందుకెళ్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు’’ అని చెప్పారంటున్నారు. దిగ్విజయ్, షిండేలతో భేటీకి ముందు ఏపీభవన్‌లో కేంద్ర మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, వట్టి వసంత్‌కుమార్, పితాని సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో కిరణ్ సమావేశమయ్యారు. రాష్ట్రపతితో భేటీ కిరణ్ హైదరాబాద్ పయనమయే ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. విభజన సహా పలు అంశాలపై ఆయనతో పావుగంట చర్చించారు. నవంబర్ 1న అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాలకు ప్రణబ్‌ను ఆహ్వానించినట్టు సమాచారం. మారిన దిగ్విజయ్ మాటతీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నుంచి వెనక్కు మళ్లే ప్రసక్తే లేదని నిత్యం చెబుతూ వస్తున్న దిగ్విజయ్‌సింగ్ మాటతీరులో బుధవారం కాస్త మార్పు కన్పించింది. రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు తాము ప్రాధాన్యమిస్తామని వ్యాఖ్యానించారు. కిరణ్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సీమాంధ్రలో ప్రజాందోళనలు తగ్గడం లేదుగా అని ప్రశ్నించగా పై విధంగా బదులిచ్చారు. ‘‘రాష్ట్రంలో ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం మాకు తెలుసు. ప్రజలు రెండుమార్లు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. వారి అభిప్రాయాలకు కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. కేంద్రంలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారకులైన వారికి ఎలా అన్యాయం చేస్తాం? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి, అందరి ప్రయోజనాలను కాపాడే విధంగా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం’’ అని బదులిచ్చారు. -
విభజనపై ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పే!
విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఎంత ముందుకెళ్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు అంత నష్టం తప్పదని కేంద్ర పెద్దలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో కిరణ్ బుధవారం భేటీ అయ్యారు. సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి వేసిన ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేదాకా విభజన ప్రక్రియను పూర్తిగా నిలిపేయాలని షిండేను ఆయన కోరినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు ముగిసే దాకా విభజనను పక్కన పెట్టాలని సూచించారంటున్నారు. అయితే అన్ని పార్టీల వైఖరులూ తెలుసుకున్నాకే కాంగ్రెస్ ముందడుగు వేసిందని, పార్టీ తీర్మానం మేరకు ప్రభుత్వం తన పని చేసుకుపోతోందని కిరణ్‌కు షిండే చెప్పారని తెలిసింది. దిగ్విజయ్ నుంచి కూడా ఆయనకు అలాంటి స్పందనే ఎదురైంది. ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్‌గాంధీలను కలవాలని భావించిన కిరణ్, వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో హైదరాబాద్ పయనమయ్యారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలు, క్షేత్రస్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న సంఘర్షణ తదితరాలపై షిండే, దిగ్విజయ్‌లతో కిరణ్ విడి విడిగా చర్చించారు. ‘‘విభజన నిర్ణయం అనంతరం ప్రజానీకమంతా కాంగ్రెస్‌నే దోషిగా చూస్తోందని, విపక్షాలు కూడా కాంగ్రెస్‌నే లక్ష్యం చేసి ప్రజల్లోకి వెళ్తున్నాయి. మంత్రులు, ఎంపీలని కూడా చూడకుండా జనం నిలదీస్తున్నారు. రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు ఇప్పటికే రోడ్డెక్కారు. రైతులూ అదే బాట పడితే ఉద్యమం మహోధృతమవుతుంది. నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగాలు, పరిశ్రమలు, హైదరాబాద్ తదితరాలపై స్పష్టత ఇవ్వకుండా విభజనపై ముందుకెళ్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు’’ అని చెప్పారంటున్నారు. దిగ్విజయ్, షిండేలతో భేటీకి ముందు ఏపీభవన్‌లో కేంద్ర మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, వట్టి వసంత్‌కుమార్, పితాని సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో కిరణ్ సమావేశమయ్యారు. రాష్ట్రపతితో భేటీ కిరణ్ హైదరాబాద్ పయనమయే ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. విభజన సహా పలు అంశాలపై ఆయనతో పావుగంట చర్చించారు. నవంబర్ 1న అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాలకు ప్రణబ్‌ను ఆహ్వానించినట్టు సమాచారం. మారిన దిగ్విజయ్ మాటతీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నుంచి వెనక్కు మళ్లే ప్రసక్తే లేదని నిత్యం చెబుతూ వస్తున్న దిగ్విజయ్‌సింగ్ మాటతీరులో బుధవారం కాస్త మార్పు కన్పించింది. రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు తాము ప్రాధాన్యమిస్తామని వ్యాఖ్యానించారు. కిరణ్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సీమాంధ్రలో ప్రజాందోళనలు తగ్గడం లేదుగా అని ప్రశ్నించగా పై విధంగా బదులిచ్చారు. ‘‘రాష్ట్రంలో ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం మాకు తెలుసు. ప్రజలు రెండుమార్లు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. వారి అభిప్రాయాలకు కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. కేంద్రంలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారకులైన వారికి ఎలా అన్యాయం చేస్తాం? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి, అందరి ప్రయోజనాలను కాపాడే విధంగా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం’’ అని బదులిచ్చారు. -
20 రోజుల్లో తెలంగాణ తీర్మానం: షిండే
-
బీహార్ పోలీసుల అదుపులో భత్కల్: షిండే
ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టును కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు. ఉత్తర బీహార్‌లో బీహార్-నేపాల్ సరిహద్దు వద్ద అతడిని ఇంటెలిజెన్స్ బలగాలు గతరాత్రి అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. పార్లమెంట్ హౌస్ వెలుపల షిండే విలేకరులతో మాట్లాడారు. యాసిన్ భత్కల్ ప్రస్తుతం బీహార్ పోలీసుల అదుపులో ఉన్నాడని వెల్లడించారు. అతడిని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇటీవల పట్టుబడ్డ అబ్దుల్ కరీం టుండా ఇచ్చిన సమాచారం ఆధారంగా యాసీన్ భత్కల్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడయిన టుండాను ఈనెల 16 భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ముంబై మారణహోమ సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన టుండా.. బాంబుల తయారీలో దిట్ట. చాలాకాలంపాటు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు బాంబులు తయారు చేసిపెట్టాడు. 30 ఏళ్ల యాసిన్ భత్కల్ దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లకు సూత్రధారి. అహ్మదాబాద్, బెంగళూరు, పుణె, సూరత్, ఢిల్లీ, హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో అతడి కోసం భద్రతా దళాలు వెతుకుతున్నాయి. సోదరుడు రియాజ్‌తో కలిసి 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2010లో ఈ సంస్థను ప్రభుత్వం నిషేధించింది. మరుసటి ఏడాదే అమెరికా కూడా విదేశీ తీవ్రవాద సంస్థల జాబితాలో దీన్ని చేర్చింది. -
షిండే అలా మాట్లాడటం దౌర్భాగ్యం: మైసూరారెడ్డి
రాష్ట్ర విభజనకు తాము అనుకూలంగా లేఖ ఇచ్చి, తర్వాత మాట మార్చామంటూ బురద చల్లుతున్నారని, ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యమైనవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి అన్నారు. గుంటూరులో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు. అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తాము షిండేకు చెప్పామని, కానీ దాన్ని పక్కన పెట్టి, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఈవిధంగా మాట్లాడటం దౌర్భాగ్యమని మైసూరారెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ తరఫున తాము చెప్పిన విషయాలన్నింటినీ షిండే పూర్తిగా పక్కనపెట్టి, తన నోటికి వచ్చినది చెప్పేస్తున్నారన్నారు. -
షిండే క్షేమం.. మూడు రోజుల్లో డిశ్చార్జి
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, మరికొంత కోలుకున్న తర్వాత ఆయనను మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని షిండే కుమార్తె ప్రీతి షిండే తెలిపారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్మే అయిన ప్రీతి.. తన తండ్రి ఆరోగ్యం గురించి విలేకరులకు వివరించారు. 72 సంవత్సరాల వయసున్న సుశీల్ కుమార్ షిండేకు ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో ఈనెల నాలుగో తేదీన ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స జరిగింది. ఊపిరితిత్తుల్లో చిన్న కణితి లాంటిది పెరగడంతో ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు. శస్త్రచికిత్స చిన్నదే కాబట్టి, మంత్రి త్వరలోనే కోలుకుంటారని, కొన్ని రోజుల్లోనే మళ్లీ తన రోజువారీ కార్యకలాపాలకు హాజరవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.