తెలంగాణపై త్వరలో అఖిలపక్ష సమావేశం: షిండే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. మంత్రుల బృందం సమావేశాని కంటే ముందే.. నవంబర్ 7 తేది లోపే అఖిలపక్ష సమావేశం ఉంటుంది ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. అఖిలపక్ష భేటిలో మంత్రుల బృందం(జీఓఎం) విధివిధానాలపై చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అఖిలపక్ష సమావేశానికి రావాలని లేఖలు రాస్తామని షిండే తెలిపారు.
రాష్ట్ర విభజనపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా బుధవారం మధ్నాహ్నం సమావేశమైంది. ఈ సమావేశానికి షిండే, సోనియా, చిదంబరం, ఆంటోనిలు హాజరయ్యారు.