
రాష్ట్ర విభజన విధివిధానాలపై చర్చించాం: షిండే
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలపై చర్చించినట్లు కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం) కీలక సమావేశం గంటగన్నరపాటు జరిగింది. సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా శాఖల కార్యదర్శులు సమాచారాన్ని పంపారని తెలిపారు. ఇప్పటి వరకు 2000 ఇమెయిల్స్ వచ్చాయని చెప్పారు. వాటన్నిటినీ శాఖల వారీగా వర్గీకరించి ప్రభుత్వ కార్యదర్శులకు పంపుతామన్నారు.
నవంబర్ 7 మరోసారి సమావేశమవుతామని చెప్పారు. సమావేశానికి ఆంటోనీ హాజరు కాలేదన్నారు. ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండేతోపాటు కేంద్ర మంత్రులు గులామ్ నబీ ఆజాద్, వీరప్పమొయిలీ, జైరాం రమేష్, చిదంబరం, నారాయణస్వామి హాజరయ్యారు.