షిండే నేతృత్వంలో జీవోఎం భేటి ప్రారంభం
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తోపాటు కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శలతో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం ఉదయం సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా జీవోఎంతో సమావేశమయ్యేందుకు పలు పార్టీలు సిద్ధమయ్యాయి. బీజీపీ, సీపీఎంల నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ నుంచి ముగ్గురు ప్రతినిధులు ఢిల్లీ వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పార్టీ సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి హాజరవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కేవీపీ రామచంద్రరావు, మంత్రుల కన్నా లక్ష్మినారాయణ, వట్టి వసంతకుమార్లు ఢిల్లీకి వెళ్లనున్నారు.
బీజేపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీమాంధ్ర నుంచి డాక్టర్ కె.హరిబాబును ఈ నెల 12న ఈ సమావేశానికి పంపాలని బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ నిర్ణయించింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ పార్టీల ప్రతినిధులు జీవోఎంతో భేటీ అవుతారు.