
'అనూహ్య' హంతకులను పట్టుకోండి
న్యూఢిల్లీ: తన కూతురిని హత్య చేసిన హంతకులను పట్టుకుని శిక్షించాలని కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్ కోరారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. షిండేను ఈ ఉదయం ఆయన ఢిల్లీలో కలిశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఈ నెల 4న విజయవాడలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను ముంబై పోలీసులు పట్టుకున్నట్టు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తర్వాత తెలిసింది.