మీడియా కాదు.. సోషల్ మీడియా అంటూ షిండే యూటర్న్!
ఎలక్ట్రానిక్ మీడియాను మట్టుబెట్టాలంటూ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. తాను ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను సోషల్ మీడియా దృష్టిలో ఉంచుకొని మాత్రమే వ్యాఖ్యలు చేశానని షిండే వివరణ ఇచ్చారు. తన స్వంత పట్టణంలోని ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఉద్దేశ పూర్వకంగానే కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నారని షిండే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల షోలాపూర్ లోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలకు కారణం ఎలక్ట్రానికి మీడియా అని తాను అనలేదని షిండే మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే ఉద్రిక్తతకు దారి తీసిందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో స్థిరపడిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందనే నేపథ్యంగా తాను వ్యాఖ్యలు చేశానన్నారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేస్తుందని, మోడీ ప్రభజంనంలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి పాలు కావడం తథ్యం అని పోల్ సర్వేలకు మీడియా ప్రాధాన్యమిస్తోందని షిండే మండిపడ్డారని ఆ ప్రాంతానికి చెందిన విలేకరి స్పష్టం చేశారు.