అనంతపురం:యూపీఏ ప్రభుత్వం హయాంలో పనిచేసిన ముగ్గురు మాజీ కేంద్ర మంత్రులకు అనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.