Ghulam Nabi Azad
-
గులాం నబీ అజాద్‌కు షాక్.. కాంగ్రెస్ గూటికి తాజ్ మొహియుద్దీన్!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం గులాం నబీ ఆజాద్.. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. ఈ పార్టికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. ‘‘కొన్ని రోజుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను. ఆజాద్ సాబ్ నాకు పార్టీలో చాలా గౌరవం ఇచ్చారు. ఆజాద్ కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను పూర్తి స్థాయిలో సంతోషంగా ఉంటాను. నాకు కాంగ్రెస్ పార్టీతో సుమారు 45 ఏళ్ల అనుబంధం ఉంది. నేను మళ్లీ నా సోంత గూటికి చేరుకోబోతున్నా. అయితే నేను నా కార్యకర్తల అభిప్రాయాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నా. వారంతా నేను కాంగ్రెస్‌లో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అందుకే నేను మళ్లీ కాంగ్రెస్‌తో చేరనున్నాను’’ అని అన్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ అసెంబ్లీ సెగ్మెంట్ మాజీ ఎమ్మెల్యే అయిన మొహియుద్దీన్ 2022 ఆగస్టులో ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం ఆజాద్ పెట్టిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీలో చేరారు.గులాం నబీ ఆజాద్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏఈప) కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. శనివారం తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్ చేరనున్నట్లు ప్రకటించటంతో ఊహాగానాలు మరింతి ఎకక్కువ అయ్యాయి. అయితే ప్రచారానన్ని డీపీఏపీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఖండించారు.గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినప్పటి నుంచి ఆయనకు ఏ కాంగ్రెస్ నాయకుడు నేరుగా లేదా టెలిఫోన్ ద్వారా సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధం మాత్రమే అని అన్నారు. గందరగోళాన్ని సృష్టించి తమ పార్టీని విచ్ఛిన్నం చేయడాని ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఈ ట్రాప్‌లో పార్టీ నాయకులు కార్యకర్తలు చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు.ఇక.. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్-డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. -
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ కీలక కామెంట్స్
-
ఉమ్మడి పౌరస్మృతి ఆలోచనే వద్దు: ఆజాద్
శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ.. కశ్మీరీ సీనియర్ నేత.. డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ చైర్మన్ గులాంనబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆలోచనే చేయొద్దంటూ కేంద్రంలోని బీజేపీకి సూచించారాయన. యూసీసీ అనేది చాలా సంక్లిష్టమైన అంశం. ఆర్టికల్ 370(జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించి..) రద్దు చేసినంతలా సులువు కాదు. ఎందుకంటే.. ఇది కేవలం ముస్లింలతో ముడిపడిన అంశం కాదు. క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, గిరిజనులు.. ఇలా అందరితో ముడిపడి ఉంది. అన్ని మతాలకు, వర్గాలకు ఆగ్రహం తెప్పించే అంశం ఇది. ఏ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. అలాగే కేంద్రంలోని బీజేపీకి కూడా. కాబట్టి.. అసలు ఉమ్మడి పౌర స్మృతి ముందడుగు వద్దని.. అసలు ఆ ఆలోచనే వద్దని కేంద్రానికి సూచించారాయన. ఆపై దేశంలో తాజా రాజకీయ పరిణామాలపైనా ఆయన స్పందిస్తూ.. ముఖ్యంగా ఎన్సీపీ సంక్షోభం తనను బాధించిందని చెప్పారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో యాభై ఏళ్ల కాంగ్రెస్‌తో అనుబంధాన్ని తెంచుకుని.. సొంత పార్టీ ద్వారా కశ్మీర్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు ఆజాద్. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా! -
'సెంట్రల్ విస్టాపై ప్రతిపక్షాలది తప్పుడు చర్య.'
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ఖండించారు. తక్కువ సమయంలోనే ఇంత మంచి పార్లమెంట్‌ను దేశానికి నిర్మించినందుకు బీజేపీ ప్రభుత్వాన్ని కొనియాడాల్సిన తరుణమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరవ్వాల్సి ఉండే.. కాని ఇతర ఫంక్షన్ కారణంగా రాలేకపోయానని ఆజాద్ తెలిపారు. ప్రతిపక్ష ఈ చర్యకు తాను పూర్తి వ్యతిరేకినని అన్నారు. ఆ కల నెరవేరింది 'నూతన పార్లమెంట్ భవన నిర్మాణం.. 30-35 ఏళ్ల క్రితం నేను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పటి కల. దివంగత పీఎం నరసింహారావు, శివరాజ్ పాటిల్, నేను ఈ ప్రాజెక్టు గురించి చర్చించాము. కానీ అప్పట్లో ఇది చేయలేకపోయాము. ఈనాటికి పూర్తయింది. విమర్శించుకోవాల్సిన సమయం కాదు ఇది'అని ఆజాద్ అన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరిగిందనేది అనవసరమైన విషయమని ఆజాద్ అన్నారు. రాష్ట్రపతి ముర్ముకు మద్దతుగా నిలిచేవారైతే.. ఎన్నికల్లో ఎందుకు ముర్ముపై మరో అభ్యర్థిని నిల్చోబెట్టారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించ్రారు. ఇది చదవండి: పార్లమెంటు భవన ప్రారంభోత్సవ బహిష్కరణ నిర్ణయం... -
ఆ విషయాల్లో మోదీని విడిచిపెట్టలేదు! ఐనా రివేంజ్ తీర్చుకోలేదు!
కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ అజాద్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు జల్లు కురింపించారు. తన పట్ల మోదీ చాలా ఉదారంగా ప్రవర్తించారని తనపై ఎలాంటి రివేంజ్ తీర్చుకోలేదని అన్నారు. అలా అని ఒక ప్రతిపక్ష నేతగా ఆర్టికల్ 370తో సహ హిజాబ్ వంటి పలు విషయాల్లో ఆయన్ను వ్యతిరేకించడమే కాకుండా నిలదీయకుండా విడిచిపెట్ట లేదన్నారు అజాద్. తాను మోదీతో కొన్ని బిల్లులు విషయంలో విభేదించనినప్పటికీ ఆయన తనపై ఏవిధంగానూ రివేంజ్ తీర్చుకునే యత్నం చేయలేదు పైగా ఒక రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించారు. అందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెప్పారు అజాద్. అదే సమయంలో మోదీపై విమర్శలు చేస్తున్న వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వారి మనసులు కలుషితమైపోయాయని, అందుకే ఆయనపై అలాంటి విమర్శలకు దిగుతున్నారని అన్నారు ఆయనపై ఆరోపణలు చేసేకంటే ముందుగా వారంతా పాలిటిక్స్ అంటే ఏంటో ఓనమాలు నుంచి నేర్చుకోవాలంటూ అజాద్ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 2021లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అజాద్ పదవీకాలం ముగియడంతో వీడ్కోలు సందర్భంగా ప్రదాని మోదీ అజాద్‌పై ప్రశంసలు కురింపించారు. ఆయనతో తనకు గలు రాజకీయ అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన రాజకీయపరంగానే కాకుండా దేశం గురించి కూడా ఆలోచిస్తాడని అందువల్ల అలాంటి వ్యక్తికి వీడ్కోలు పలకాలంటే బాధగానే ఉంటుందంటూ.. మోదీ భావోద్వేగం మాట్లాడారు. (చదవండి: 'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ) -
డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ
జమ్మూ: కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం తన కొత్త పార్టీని ప్రకటించారు. దానికి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టారు. కశ్మీర్లో ఏ క్షణమైన ఎన్నికలు రానున్నందున పార్టీ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామన్నారు. 50 శాతం టిక్కెట్లను యువత, మహిళలకే కేటాయిస్తామని చెప్పారు. గాంధీ ఆలోచనలు, ఆశయాలే తమ పార్టీ సిద్ధాంతాలన్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిని బలోపేతం చేయడం, సాధారణ పరిస్థితులను నెలకొల్పడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు. ఆర్టికల్ 370 విషయంలో పీడీపీ సహా ఇతర పార్టీలు తనపై చేస్తున్న విమర్శలను ఆజాద్ తిప్పికొట్టారు. ‘‘దాని పునరుద్ధరణ అసాధ్యమని నేనెప్పుడూ చెప్పలేదు. ప్రధాని మోదీని ఒప్పించలేకపోయాననే చెప్పా. ఆర్టికల్ 370పై మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఎవరైనా ఒప్పించాలనుకుంటే స్వాగతిస్తా. వారివద్ద నాకంత పలుకుబడి లేదు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా నిర్ణయంపై అక్టోబర్ 10 సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుండడం మంచి పరిణామం’’ అని అన్నారు. -
గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ
-
కొత్త పార్టీపై ఆజాద్ కీలక ప్రకటన.. నా వెనుక వారున్నారు!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్.. అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ తీరు, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఆజాద్ ఇప్పటికే.. కశ్మీర్లో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, కొత్త పార్టీపై ఆజాద్ తాజాగా మరిన్ని విషయాలు వెల్లడించారు. జమ్మూలో ఆదివారం ఆజాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆజాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత.. తనకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగినట్టు స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుంగా తనకు సపోర్టు నిలిచారని అన్నారు. మరోవైపు.. తాను రాజీనామా చేసి కశ్మీర్‌కు వచ్చిన తర్వాత జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు వెల్లడించారు. అలాగే, కశ్మీర్ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆజాద్ రాజీనామా చేసిన అనంతరం.. కశ్మీర్లో దాదాపు 1500 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. Former Congress leader Ghulam Nabi Azad said that he would announce a new political party within 10 days. https://t.co/6b2YLXcW4n — Financial Express (@FinancialXpress) September 11, 2022 -
సోనియాకు బిగ్ పంచ్.. ‘ఆమె’ నాకు తల్లిలాంటిది: ఆజాద్
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన రాజీనామా తర్వాత ఆజాద్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని ధారపోశానని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కాంగ్రెస్‌పై ఆజాద్ విరుచుకుపడ్డారు. కశ్మీర్లో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాపై క్షిపణులు ప్రయోగించింది. నేను వాటిని రైఫిల్‌తో నాశనం చేశాను. ఒక వేళ నేను బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉంటే వారు అదృశ్యమయ్యేవారంటూ పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను 303 రైఫిల్‌తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను అంటూ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే తాను.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. మరోవైపు.. తాను 52 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్నానని అన్నారు. ఈ క్రమంలో ఇందిరా గాంధీని తల్లిగా, రాజీవ్ గాంధీని సోదరుడిగా భావించినట్లు ఆజాద్ చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం.. ఆజాద్ సొంత పార్టీని పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. Ghulam Nabi Azad Says “Congress Fired Missiles At Me, I Only Retaliated With Rifle” https://t.co/3QxAW5TzoT — ZOKR (@zokrofficial) September 9, 2022 -
కశ్మీర్‌కు రాష్ట్ర హోదానే ఎజెండా
జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా తమ కొత్త పార్టీ ఎజెండాలో ప్రధానంగా ఉంటుందని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లోని అన్ని వర్గాలను కలుపుకుని పోతామని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆయన ఇటీవల రాజీనామా చేయడం తెలిసిందే. జమ్మూ శివారులోని సైనిక్ కాలనీలో ఆదివారం మొట్టమొదటి ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం, నివాసితులకు భూ, ఉద్యోగ హక్కుల కల్పన వంటివి కూడా తమ ఎజెండాలో ఉంటాయన్నారు. కొత్త పార్టీ పేరు, జెండా వంటి వాటిని ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. ఉగ్రవాదుల టార్గెట్ కిల్లింగ్స్‌పై ఆయన మాట్లాడుతూ ఇటువంటి వాటిని ఇకపై ఆపేయాలన్నారు. లోయకు తిరిగి రావాలనుకునే వారికి భద్రత, వసతులు కల్పిస్తామని చెప్పారు. ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆప్‌ని పార్టీ, పీడీపీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మునగడంలో క్రియాశీలక పాత్ర గులాం నబీ ఆజాద్‌దేనా?
ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఆయన తిరుగులేని నేత. ఏ రాష్ట్రానికి ఇన్‌చార్జీగా వెళితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం. పార్టీలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని బెదిరించే పనిలో కూడా ఉండేవారు. అయినా వినకుండా సొంతంగా పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టించడంలో క్రియాశీలక పాత్ర. కానీ ఇప్పుడు అదే నేత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఏభై ఏళ్లపాటు కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి, పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో పడవ నుంచి జంప్ చేసేశారు. ఆయనే కేంద్ర మాజీ మంత్రి, జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నారు. చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమని అనడానికి ఇది కూడా నిదర్శనమే అవుతుంది. గతంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అత్యంత విధేయుడుగా ఆజాద్ పేరొందారు. అలాంటి వ్యక్తి పార్టీకి ఎందుకు దూరం అయ్యారంటే రకరకాల విశ్లేషణలు వస్తాయి. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అసమర్దతా? లేక వారిలో ప్రజాకర్షణ కొరవడిపోయిందన్న భావనా? అజాద్ రాజకీయ స్వార్థ చింతనా? తనకు మళ్లీ రాజ్యసభ ఇవ్వలేదన్న ఆక్రోశమా? బీజేపీ విసిరిన గాలమా?.. ఇలా రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. ఇవన్ని వాస్తవాలే కావచ్చు. అజాద్ చిన్నవయసులోనే పార్టీలో యాక్టివ్ అయ్యారు. దానికి తగినట్లే పదవులు కూడా వచ్చాయి. పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షనేత హోదాను అనుభవించారు. కానీ గతసారి ఆయనకు మళ్లీ ఆ పదవి ఇవ్వలేదు. కర్ణాటకకు చెందిన మరో సీనియర్ నేత మల్లిఖార్జున్‌కు అవకాశం ఇచ్చారు. అలాగే తమిళనాడు కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రాజ్యసభ సీటును రెన్యూ చేశారు. ఇవన్ని ఆయనకు అవమానంగా మారాయి. మరో వైపు కాంగ్రెస్‌లో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలలో ఈయన ప్రముఖుడు, అప్పటి నుంచే తేడా వచ్చిందన్న సంగతి అర్ధం అయింది. పుండు మీద కారం చల్లినట్లు రాజ్యసభలో అజాద్ రిటైర్ అయిన రోజున ప్రధాని మోదీ ఈయన పట్ల చూపిన జాలి కాంగ్రెస్ వారికే ఆశ్చర్యం కలిగించింది. ఆజాద్‌ను మోదీ ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అజాద్ బీజేపీలోకి వెళతారని, ఉప రాష్ట్రపతి అభ్యర్థి అవుతారని ఊహాగానాలు వచ్చాయి. అది జరగలేదు. మళ్లీ ఈ మధ్య కాంగ్రెస్‌లో కాస్త యాక్టివ్ అయ్యారు. ఈ తరుణంలో సడన్‌గా పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా, నాలుగు పేజీల లేఖ రాసి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. బాడీగార్డులు, పిఏలతోనే రాహుల్ సంప్రదిస్తారని, పిల్ల చేష్టలతో పరువు తీస్తుంటారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో కొన్ని వాస్తవాలు లేకపోలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక కోర్టు తీర్పును పూర్వపక్షం చేయడం కోసం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చింది. ఆ తీర్పులో రెండేళ్ల శిక్ష పడితే ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి పోతుందని ఉంది. దానిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ప్రెస్‌క్లబ్‌లో మీటింగ్ పెట్టి మరీ చించివేశారు. దాంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం బాగా డామేజీ అయింది. దానినే ఇప్పుడు అజాద్ కోట్ చేస్తున్నారు. అది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పటివరకు ఎందుకు అజాద్ ప్రశ్నించలేదంటే, అదే రాజకీయం. తన పదవి పోకుండా ఉండడం కోసం అజాద్ మాట్లాడలేదన్నమాట. కాంగ్రెస్‌ను వీడడమే కాకుండా కశ్మీర్లో ప్రాంతీయ పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. ఈయనకు మద్దతుగా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుంటే అధిష్టానానికి ఆగ్రహం వచ్చింది. దాంతో ప్రత్యర్ది పార్టీ అయిన తెలుగుదేశంతో కలిసి జగన్ పై కేసులు పెట్టింది. ఆ ప్రక్రియలో న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడంలో అజాద్ ది కూడా కీలకపాత్రే అన్న అభిప్రాయం ఉంది. ఆ ఒక్క పరిణామంతో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు.. తెలంగాణ ఏర్పాటు హామీ ఇవ్వడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించారు. 2004లో ఏపీలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికిగాను తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, జి.వెంకటస్వామి వంటివారు పట్టుబట్టారు. ఆ టైమ్‌లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్య నేత వైఎస్ రాజశేఖరరెడ్డి టీఆర్ఎస్తో పొత్తును వ్యతిరేకించారు. అయినా అజాద్ టి.కాంగ్రెస్ నేతల డిమాండ్ మేరకు కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. అవన్ని వెరసి కాంగ్రెస్ పతనానికి దారి తీశాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలలోకి వెళ్లిపోయారు. వారిలో డి.శ్రీనివాస్ కూడా ఒకరు. నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో అజాద్ ఒక విషయం బహిరంగంగానే చెప్పారు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని, పార్టీని వీడటం వల్ల కష్టాలు పడతారని హెచ్చరించారు. నిజంగానే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా తగ్గించాలన్న తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్టానం జగన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించి జైలులో పెట్టించిందన్న అభిప్రాయం ప్రజలలో ప్రబలింది. జగన్ ఫ్యాక్టర్, తెలంగాణ అంశం కలిసి ఏపీలో కాంగ్రెస్ సర్వనాశనం అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ను విలీనం చేసుకోవడంలో విఫలం అయి, కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించుకోలేకపోయింది. కేసీఆర్ వ్యూహరచన, స్పీడ్ ముందు కాంగ్రెస్ విలవిలలాడింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఇలా ఒక్కో పరిణామం తర్వాత మరో పరిణామం సంభవించడం ద్వారా కాంగ్రెస్ కునారిల్లే పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో శరద్ పవార్, మమత బెనర్జీ, మూపనార్,.. ఇలా అనేకమందిని కోల్పోతూ ఇప్పుడు గులాం నబీ అజాద్‌ను కూడా కాంగ్రెస్ పోగొట్టుకుంది. దీని ప్రభావం సహజంగానే దేశ స్థాయిలో కాంగ్రెస్‌పై పడుతుంది. కశ్మీర్లో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, తదుపరి బీజేపీతో పొత్తు పెట్టుకుని అజాద్ మళ్లీ రాజకీయాలలో కీలకమైన వ్యక్తి అవుతారా? లేదా అన్నది కాలమే తేల్చుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఏం రాహుల్.. ఏం మాట్లాడుతున్నావ్.!
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చిన తర్వాత సీనియర్ పొలిటీషియన్ గులాం నబీ ఆజాద్ మాటల తుటాలు పేలుస్తున్నారు. రాజ్య సభ సీటు దక్కనందుకు, సౌత్ ఎవెన్యూలోని బంగ్లా ఆయన చేజారినందుకు ఫ్రస్టేషన్లోనే ప్రేలాపనలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, ఆజాద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ఈ తరుణంలో.. ఇవాళ కాంగ్రెస్‌కు రాజీనామా తర్వాత తొలిసారిగా మీడియా ఎదుటకు వచ్చారు ఆజాద్. ‘‘కాంగ్రెస్‌లో ఇప్పుడున్న 90 శాతం మంది కాంగ్రెస్సీలు కారు. కొందరు కాలేజీల నుంచి వచ్చారు.. మరికొందరు సీఎంల దగ్గర అటెండర్ పనులు చేసుకునేవాళ్లు. వాళ్ల వాళ్ల చరిత్ర గురించే సరిగా తెలియనివాళ్లతో నేనేం వాదించాలి. విమర్శలకు ఏం సమాధానం ఇవ్వాలి. జీ-23 గ్రూప్ అనేది ఏర్పడక ముందు.. ప్రతిపక్ష నేతగా ఉన్న సోనియాగాంధీకి లేఖ రాశాను. అప్పుడేం చేశారు?.. కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడుకోమని నాకు చెప్పారు. నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న టైంలో.. ఆయన(వేణుగోపాల్‌ను ఉద్దేశిస్తూ..) స్కూల్‌కు వెళ్లే వాడు.. ఓ బచ్చా అని చెప్పా. అప్పుడు ఆ కుటుంబం నుంచి ఓ వ్యక్తి రణ్‌దీప్ సూర్జేవాలాతో మాట్లాడమని సలహా ఇచ్చాడు. నేను జనరల్ సెక్రటరీగా ఉన్న టైంలో.. రణ్‌దీప్ తండ్రి పీసీసీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన నా కింద పని చేశారు. అలాంటి వ్యక్తి కొడుకుతో చర్చించాలా? ఏమయ్యా రాహుల్ గాంధీ.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ రాహుల్‌పై మండిపడ్డాను అని నాటి ఘటనను ఆజాద్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో.. రాహుల్ గాంధీపై ఆజాద్ ఒకింత తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడా? ఒకవేళ అతను కాకుంటే.. ఇంకెవరు కాంగ్రెస్ అధ్యక్షుడైనా సరే ఆ వ్యక్తి కచ్చితంగా రాహుల్ గాంధీకి బానిస కావాల్సిందే.. అతని ఫైల్స్ మోయాల్సిందే అంటూ ఆగ్రహం వెల్లగక్కారు ఆజాద్. ఈ వయసులోనూ పార్టీ కోసం రోజులో 20 గంటలపాటు పని చేసినా.. ప్రయోజనం లేకుండా పోయిందని ఆజాద్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలో.. సీనియర్ల మీద ఆరోపణలు గుప్పించాడు. తనకెవరూ మద్దతు ఇవ్వడం లేదంటూ పేర్కొన్నాడు. ఏ విషయంలో మద్దతు ఇవ్వాలి?. ‘చౌకీదార్ చోర్ హై’ అనడంలోనా?.. ఓరోజు రాహుల్ నన్ను.. ‘బీజేపీపై, మోదీపై తీవ్ర విమర్శలు ఎందుకు చేయలేద’ని ప్రశ్నించాడు. దానికి నేను ‘‘అది నీ భాష. నాది కాదు. ఇందిరా గాంధీ, వాజ్పేయిపైన ఏనాడూ ఇలాంటి ఆరోపణలు చేయాలని మాకు చెప్పలేదు. రాజీవ్ గాంధీ సైతం ప్రతిపక్షాల ఇళ్లకు వెళ్లమని చెప్పేవారు. అలాంటి సంస్కారం వాళ్లు నేర్పించారు. ఆ బాటలో ఉన్న మేం.. నువ్వు చెప్పే విమర్శలు చేయలేనని ఖుల్లాగా చెప్పాను’’ అని రాహుల్‌తో జరిగిన గత సంభాషణలను మీడియాతో పంచుకున్నారు ఆజాద్. కాంగ్రెస్ నిండా అధ్యక్ష ఎన్నికలతో విషం నిండుతోందని, ‘గాంధీ’ కుటుంబం పట్ల అయిష్టత పేరుకుపోతున్నా.. సల్మాన్ ఖుర్షీద్, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు రాహుల్‌నే అధ్యక్షుడిగా కోరుకోవడం దురదృష్టకరమని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ..రాహుల్‌ను మించినోళ్లు లేరు! -
కాంగ్రెస్ పార్టీపై గులాం నబీ అజాద్ ఫైర్
-
14 రోజుల్లో ఆజాద్ కొత్త పార్టీ ప్రారంభం... ఊహించని ఝలక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అన్ని సభ్యుత్వాలకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిగంటల్లోనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆజాద్ 14 రోజుల్లోనే కొత్త పార్టీ తొలి యునిట్‌ను జమ్ము కశ్మీర్ ఏర్పాటు చేయుబోతున్నారని ఆయన సన్నిహితుడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీఎం సరూరి తెలిపారు. సైద్ధాంతికంగా లౌకికవాది అయిన ఆజాద్ ఆదేశానుసారం పనిచేసే ప్రశ్నే లేదని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ మాజీ నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో వందలాది మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పంచాయతీ రాజ్ సంస్థల సభ్యులు, ప్రముఖులు కూడా తమ రాజనామాను సమర్పిచినట్లు పేర్కొన్నారు. అంతేకాద మా కొత్త పార్టీని ప్రారంభించేందుకు సెప్టెంబర్ 4న అజాద్ జమ్మ కశ్మీర్‌కి వస్తున్నారని అన్నారు. అదీగాక ఆజాద్ కూడా తాను కొత్త జాతీయ పార్టీని ప్రారంభించే తొందరలో లేనని, జమ్ము కశ్మీర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఐతే సరూరి జమ్ముకశ్మీర్‌కి అజాద్ తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన జమ్ముకశ్మీర్‌లో నవంబర్ 2, 2005 నుంచి జూలై11, 2008 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు, పైగా ఆయన పాలనను ప్రజలు స్వర్ణయుగంగా చూస్తారని చెప్పారు. తమ కొత్తపార్టీ ఆగస్టు 5, 2019కి ముందు ఉన్న జమ్ము కశ్మర్ పూర్వవైభవాన్ని పునరుద్ధరించడం కోసమే పోరాడుతుందని చెప్పారు. అలాగే ఆజాద్‌కి మద్దతుగా పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులతో సహా డజనుకు పైగా నాయకులు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేశారని తెలిపారు. అంతేగాక మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ వంటి పలువురు ఈ రోజు ఢిల్లీలో ఆజాద్‌తో సమావేశమై రాజీనామ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. (చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్ గుడ్‌బై) -
అలా జరిగి ఉంటే ఆజాద్ వీడేవారు కాదేమో!
ఢిల్లీ: గులాం నబీ ఆజాద్ నిష్క్రమణ తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతల ప్రకటనల పర్వం కొనసాగుతోంది. మరికొందరు సైతం పార్టీని వీడబోతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. అయితే.. యాభై ఏళ్ల బంధం, మిగతా వాళ్లను కాదని ఏరికోరి పదవులు కట్టబెట్టినా కూడా ఆజాద్.. తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడడంపై చర్చ కూడా అదేస్థాయిలోనే కాంగ్రెస్‌లో జరుగుతోంది. అయితే.. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణాలేంటో విశ్లేషించారు కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ. దేశానికి, కాంగ్రెస్‌కు మధ్య సమన్వయ లోపం కారణంగానే పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని శనివారం ఉదయం ఢిల్లీలో మీడియా మాట్లాడుతూ ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘రెండేళ్ల కిందట మాలోని(కాంగ్రెస్ సీనియర్లను ఉద్దేశించి) 23 మంది పార్టీ పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ.. పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇక్కడి నుంచే దేశానికి, కాంగ్రెస్‌కు మధ్య గ్యాప్ మొలైంది. 1885 జాతీయ కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి.. కాంగ్రెస్, దేశంతో పాటే నడిచింది. కానీ, పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాబట్టి.. పార్టీకి ఇప్పటికైనా ఆత్మపరిశీలన అవసరం. డిసెంబరు 20, 2020న సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను భావిస్తున్నాను. అదే జరిగి ఉంటే.. ఆజాద్ ఈనాడు కాంగ్రెస్‌ను వీడేవారు కాదేమో! అని మనీశ్ తివారీ తన అభిప్రాయం తెలిపారు. డిసెంబరు 20, 2020న సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో.. సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్‌లో సీనియర్లకు గౌరవం ఉంటుందని, వాళ్ల సలహాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఆ హామీ గాలికి పోయిందన్నది కాంగ్రెస్ జీ-23 నేతల ఆరోపణ. #WATCH | Congress MP M Tewari says, "Don't want to go into merits of Mr Azad's letter, he'd be in best position to explain...But strange that people who don't have capacity to fight a ward poll, were "chaprasis" of Congress leaders when give "gyaan" about party it's laughable..." pic.twitter.com/9dKLO2y2S8 — ANI (@ANI) August 27, 2022 ఆజాద్ లేఖ మీద చర్చోపచర్చలు అనవసరం. ఎందుకంటే ఆయన వివరణ ఎప్పుడూ సమర్థవంతంగానే ఉంటుంది. కానీ, కాంగ్రెస్ నుంచి కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వాళ్లు కూడా.. ఇవాళ పార్టీకి జ్ఞానం పంచాలని చూడడం నవ్వు తెప్పిస్తోందని మనీశ్ తివారీ అన్నారు. శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన తన రాజీనామా లేఖలో.. దేశం కోసం పోరాడే సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని ఎత్తిపొడిచారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. చిన్న స్థాయి నేతల సూచనల మేరకు పార్టీ నడుస్తోందని ఆయన లేఖలో ఆరోపించారు. భారత్ జోడో యాత్రకు బదులు.. కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలంటూ సూచిస్తూనే.. పార్టీలో రాహుల్ పాత్రను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇదీ చదవండి: గులాం నబీ ఆజాద్.. విధేయుని అసమ్మతి -
విధేయుని అసమ్మతి
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడటం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన కొంతకాలంగా పార్టీపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా దశాబ్దాల పాటు ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులు అనుభవించారు. ఏ సంక్షోభాన్నయినా సులువుగా పరిష్కరిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఏ రాష్ట్రంలోనైనా పార్టీలో చీలికలొచ్చినా, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్నా అధిష్టానానికి మొదట గుర్తుకొచ్చే పేరు ఆజాదే. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇన్చార్జ్గా అంతర్గత సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించారు. నాయకత్వంపై బహిరంగ విమర్శలు 1970లో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచీ అర్ధ శతాబ్దం పాటు గాంధీల కుటుంబానికి వీరవిధేయుడిగా ఆజాద్‌కు పేరుంది. అలాంటి నేత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో పార్టీకి కాయకల్ప చికిత్స జరగాలనే డిమాండ్‌తో 2020లో ఏర్పాటైన జీ23 సభ్యుల గ్రూప్‌లో ఆజాద్ కీలకంగా వ్యవహరించడం ఆందరినీ విస్మయానికి లోను చేసింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీ మునిగిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో కలకలం రేపాయి. నాటినుంచీ పలు సందర్భాల్లో పార్టీ నాయకులపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా ఓటముల నేపథ్యంలో పార్టీలోని ఫైవ్ స్టార్ కల్చర్‌ను ఏకిపారేశారు. ‘టికెట్ రాగానే మా నాయకులు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ బుక్ చేస్తారు. ఏసీ కారులేకుండా బయటకు అడుగు కూడా వేయరు. ఈ సంస్కృతి మారనిదే ఎవరూ గెలవలేరు‘‘ అన్నారు. మోదీపై ‘వీడ్కోలు’ పొగడ్తలు ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అప్పుడే ఆయన బీజేపీలో చేరతారన్న విశ్లేషణలు వినిపించాయి. దాన్ని ఆయన స్వీకరించరని పార్టీ ఆశించింది. కానీ ఆజాద్ మౌనమే వహించారు. ఎనిమిదిసార్లు రాజ్యసభ ఎంపీగా చేసిన ఆయన, తాజాగా ఫిబ్రవరిలో పదవీ కాలం ముగిసిన సందర్భంగా చేసిన వీడ్కోలు ప్రసంగం కూడా కలకలం రేపింది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ప్రధాని మోదీని కూడా ఆకాశానికెత్తారు. ‘‘మోదీపై నేనెన్నోసార్లు మాటల దాడి చేశా. అయినా ఆయనెప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. అందుకు ధన్యవాదాలు. ఆయనకు కృతజ్ఞుడినై ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి చేపట్టడానికి ఆజాద్ నిరాకరించారు. సొంత కుంపటే! బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికైతే ఆజాద్ తెరదించారు. ‘‘కశ్మీర్లో ఎన్నికలున్నందున సొంత పార్టీ పెట్టి బరిలో దిగుతా. అక్కడ గెలిచాక జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తా’’ అని ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ పార్టీ వెనక బీజేపీ హస్తమే ఉందంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌కు ఆజాద్ గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో నీరసించిన కాంగ్రెస్‌కు మరో భారీ షాక్. గాంధీల కుటుంబానికి విధేయుడైన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ (73) కాంగ్రెస్‌ను వీడారు. పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాహుల్‌గాంధీపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ఇప్పటిదాకా పార్టీ వీడిన ఏ నాయకుడూ చేయని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్‌వి పిల్ల చేష్టలు. సీనియర్లను గౌరవించని తత్వం’’ అంటూ దుయ్యబట్టారు. అలాంటి అపరిపక్వ వ్యక్తి నాయకత్వంలో పనిచేయలేనంటూ అధినేత్రి సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ పూర్తిగా కుప్పకూల్చారు. ప్రశ్నించిన సీనియర్లపై కోటరీతో వ్యక్తిగత దాడి చేయించారు. శవయాత్రలు చేయించారు. పార్టీని అన్నివిధాలుగా పతనావస్థకు చేర్చారు. ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అలాంటి వ్యక్తికే పగ్గాలిచ్చేందుకు నాయకత్వం ఎనిమిదేళ్లుగా విఫలయత్నం చేస్తూ వచ్చింది. తద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చేజేతులారా అందలమెక్కించింది’’ అని ఆరోపించారు. అందుకే బరువెక్కిన హృదయంతో పార్టీతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించడానికి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అంటూ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలతో కూడిన జీ23 గ్రూప్‌లో ఆజాద్ కీలక నేతగా వ్యవహరించడం, పార్టీ తీరును కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉండటం తెలిసిందే. ఆయన రాజీనామాను దురదృష్టకరంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. బీజేపీతో పోరు కీలక దశకు చేరిన సమయంలో ఇలా చేయడం దారుణమంటూ వాపోయింది. ఆజాద్ డీఎన్ఏ ‘మోడీ’ఫై అయిందంటూ దుయ్యబట్టింది. ఏడాది కాలంలో దాదాపు15 మంది దాకా నేతలు కాంగ్రెస్‌ను వీడారు! రాహుల్ రాకతో సర్వం నాశనం సోనియాకు రాసిన లేఖలో రాహుల్ తీరును ఆజాద్ తూర్పారబట్టారు. ‘‘పార్టీ అధినేత్రిగా కేంద్రంలో యూపీఏ1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. సీనియర్ల సలహాలను పాటించడం, వారి తీర్పును విశ్వసించడం, వారికి అధికారాలప్పగించడం అందుకు ప్రధాన కారణాలు. దురదృష్టవశాత్తు 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్నే కుప్పకూల్చారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కన పెట్టారు. ఏ అనుభవమూ లేని కొత్త కోటరీయే పార్టీ వ్యవహారాలను నడుపుతోంది. కాంగ్రెస్ కోర్ గ్రూప్‌లో పొందుపరిచి, కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించి, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ మీడియా ముందు చించిపారేశారు. ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన వల్లే 2014లో అధికారానికి దూరమయ్యాం. ముందు సోనియా, తర్వాత రాహుల్ నాయకత్వంలో 2014–22 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలకు గాను ఏకంగా 39సార్లు ఘోరంగా ఓడిపోయాం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యాం. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యవర్గ సభ్యునిగా నేనిచ్చిన ప్రతిపాదనలన్నీ స్టోర్ రూమ్‌కే పరిమితమయ్యాయి. 2013 జైపూర్ చింతన్‌శిబిర్‌లో పార్టీ పునరుజ్జీవం కోసం చేసిన సిఫార్సులదీ తొమ్మిదేళ్లుగా అదే గతి! రాహుల్‌కు వ్యక్తిగతంగా పదేపదే గుర్తు చేసినా వాటిని పట్టించుకోలేదు. పార్టీని గాడిలో పెట్టేందుకు 23మంది సీనియర్లం లేఖలు రాస్తే రాహుల్ కోటరీ నేతలు మాపై వ్యక్తిగత దాడి చేసి అవమానించారు. కోటరీ ఆదేశాల మేరకు జమ్మూలో నా శవయాత్ర చేశారు. ఇంకో సీనియర్ ఇంటిపైకి గూండాలను పంపారు. వారిని రాహుల్ వ్యక్తిగతంగా సన్మానించారు’’ అని ఆరోపించారు. రిమోట్ కంట్రోల్ మోడల్ ద్వారా యూపీఏ ప్రభుత్వ సమగ్రతను కుప్పకూల్చారంటూ సోనియాపైనా ఆజాద్ విమర్శలు గుప్పించారు. ‘‘మన ఓటమికి కారణమైన అదే మోడల్‌ను పార్టీకీ వర్తింపజేసి రాహుల్ సర్వనాశనం చేశారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రహసనం, బూటకం. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ స్ధాయిలోనూ ఎన్నికలు జరగలేదు. ఏఐసీసీ కార్యాలయంలో కూర్చున్న కోటరీ తయారు చేసిన కమిటీ జాబితాలపై సంతకం చేయాల్సిందిగా బలవంతపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. కోటరీ గుప్పెట్లో బందీ కోటరీ గుప్పెట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బందీ అయిందని ఆజాద్ ఆరోపించారు. ‘‘తద్వారా పోరాట పటిమను, కాంక్షను పూర్తిగా కోల్పోయింది. పుంజుకునే అవకాశమే లేనంతగా పతనావస్థకు చేరింది. ఇప్పుడు కూడా అసమర్థులకు పగ్గాలు అప్పగించే ఫార్సు మొదలవబోతోంది’’ అని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఉద్దేశించి ఆరోపించారు. ‘‘ఇదీ విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మళ్లీ ఓ కీలుబొమ్మనే గద్దెనెక్కిస్తారు’’ అన్నారు. స్వాతంత్య్రం అమృతోత్సవాల వేళ పార్టీకి ఇంతటి దురవస్థ ఎందుకు ప్రాప్తించిందో ఏఐసీసీ నాయకత్వం తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. తను, తన సహచరులం జీవితాంతం నమ్మిన విలువల కోసం కృషి చేస్తామని చెప్పారు. కపిల్ సిబల్, అశ్వనీకుమార్ తదితర నేతలు కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే. రాహుల్‌పై ఆజాద్ ఆరోపణలు... ► రాహుల్ ఏ మాత్రం పరిపక్వత లేని వ్యక్తి. అన్నీ పిల్లచేష్టలే. ఆయన రంగప్రవేశంతో, ముఖ్యంగా 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ సర్వనాశనమైంది. ► అనుభవజ్ఞులైన సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారు. తొత్తులతో కూడిన కోటరీ ద్వారా పార్టీని నడుపుతూ భ్రష్టు పట్టించారు. ► సోనియా పేరుకే పార్టీ చీఫ్. ముఖ్య నిర్ణయాలన్నీ రాహుల్‌వే. కొన్నిసార్లు ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలూ నిర్ణయాలు తీసేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది! ► ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను మీడియా సాక్షిగా చించేయడం రాహుల్ అపరిపకత్వకు పరాకాష్ట. ప్రధాని అధికారాన్ని పూర్తిగా పార్టీ ముందు మోకరిల్లేలా చేసిన ఈ పిల్లచేష్టే 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఘోర ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ► కాంగ్రెస్‌ను పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకునే క్రమంలో రాహుల్ నేతృత్వంలోని చెంచాల బృందం పార్టీకి చెప్పలేనంత ద్రోహం తలపెట్టింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన పార్టీ వారివల్లే ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే ముందు పార్టీ కోసం జీవితాలను ధారపోసిన సీనియర్ నాయకులందరినీ వర్కింగ్ కమిటీ భేటీలోనే రాహుల్ తీవ్రంగా అవమానించారు. ఆజాద్ నైజం బయటపడింది: కాంగ్రెస్ దశాబ్దాల పాటు అన్ని పదవులూ అనుభవించి కీలక సమయంలో పార్టీని వీడటం ద్వారా ఆజాద్ తన అసలు నైజం బయట పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. పదవి లేకుండా ఆజాద్ క్షణం కూడా ఉండలేరంటూ ఏఐసీసీ మీడియా హెడ్ పవన్ ఖేరా చురకలు వేశారు. ‘‘అందుకే రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగియగానే పార్టీ వీడారు. పార్టీని బలహీనపరిచేందుకు నిత్యం ప్రయత్నించారు. ఇప్పుడేమో పార్టీ బలహీనపడిందని విమర్శలు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. రాహుల్‌పై ఆజాద్ విమర్శలను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కొట్టిపారేశారు. ‘‘మోదీని పార్లమెంటులోనే ఆజాద్ ఆకాశానికెత్తారు. పద్మభూషణ్ స్వీకరించారు. ఆయన రిమోట్ మోదీ చేతిలో ఉందనేందుకు ఇవన్నీ నిదర్శనాలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆజాద్‌కు కాంగ్రెస్ అన్నీ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. రాహుల్‌పై ఆయనా చేసిన విమర్శలు దారుణమన్నారు. పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడిలాంటి విమర్శలు చేయడం ఆజాద్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. -
Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ దారెటు?
జమ్ము కశ్మీర్ గడ్డపై నల్ల మంచు కురిసిన వేళ.. తాను బీజేపీలో చేరతానంటూ గతంలో బీజేపీలో చేరిక మీడియా ఊహాగానాలపై వ్యంగ్యం ప్రదర్శించారు గులాం నబీ ఆజాద్. ఈ తరుణంలో మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన మనసు మార్చుకుంటారా? లేదంటే మరో పార్టీలో చేరతారా? సొంత కుంపటి పెట్టబోతున్నారా? అసలు ఆయన తర్వాతి అడుగు ఏంటన్న దానిపై చర్చ మొదలైంది ఇప్పుడు.. కాంగ్రెస్ కీలక నేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, పెద్దల సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారు. గత రెండు మూడేళ్లుగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శిస్తున్న ఆయన.. తాజా పరిణామాలకు మాత్రం తీవ్రంగా నొచ్చుకున్నారు. అయితే.. ఆయన పార్టీని వీడతారని మాత్రం అధిష్ఠానం ఊహించలేదు. పైగా పార్టీని వీడుతూ.. ఆయన విడుదల చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ► 1973లో 22 ఏళ్ల వయసులో భలెస్సా బ్లాక్‌కు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఆజాద్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ పనితనానికి మెచ్చి.. రెండేళ్లకే జమ్ము కశ్మీర్ యూత్ ప్రెసిడెంట్‌ను చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. మరో ఐదేళ్లకు అంటే 1980లో ఏకంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయ్యాడు ఆయన. ఆపై మహారాష్ట్ర వాసిం లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు, అటుపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ► పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే.. పార్లమెంటరీ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖలు చేపట్టారు ఆజాద్. ఆపైనా రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కొనసాగినా.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అవకాశం రావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ► పీపుల్స్ డెమొక్రటిక్‌పార్టీ కూటమి మద్దతు ఉపసంహరణతో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం పదవికి విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారాయన. ► ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ నలుగురి ప్రధానుల హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవశాలి గులాం నబీ ఆజాద్. తేడా వ్యాఖ్యలు! ► ప్రతిపక్ష నేతగా, సభ్యుడిగా బీజేపీ-ఎన్డీయేపై ఆయన ప్రత్యక్ష విమర్శలు గుప్పించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ► మోదీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పురస్కారం అందుకున్నారాయన. ఆ సందర్భంలో.. కనీసం ఎవరో ఒకరు తన పనిని గుర్తించారంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ► కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిందంటూ బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా ప్రశంసలు గుప్పించారు గులాం నబీ ఆజాద్. ఆ సందర్భంలో.. బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను స్వాగతించారు. ► కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్‌ని అవమానిస్తోందని ఆరోపిస్తూ.. ఆయన మేనల్లుడు ముబషర్ ఆజాద్ బీజేపీలో చేరారు. ► కాంగ్రెస్ గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ.. ఏర్పడ్డ జీ 23 కూటమిలో గులాం నబీ ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల(పంజాబ్‌లో అయితే ఏకంగా అధికారం కోల్పోవడం) ఆధారంగా.. సంస్థాగత మార్పుపై తీవ్రస్థాయిలో అధిష్ఠానంపై గళమెత్తారు. ► ఆ సమయంలోనే ఆయన పార్టీని వీడతారేమో అనే చర్చ నడిచింది. అయితే సోనియా గాంధీ పిలిపించుకుని వ్యక్తిగతంగా మాట్లాడడంతో ఆయన ఆ సమయానికి మెత్తబడ్డారు. "పోస్టులు వస్తాయి... పెద్ద పెద్ద ఆఫీసులు వస్తాయి... అధికారం వస్తుంది... కానీ వాటిని ఎలా నడపాలి అనేది ఎవరైనా సరే... గులామ్ నబీ ఆజాద్ జీ నుంచి నేర్చుకోవాలి. నా దృష్టిలో ఆయన నిజమైన స్నేహితుడు" అని మోదీ భావోద్వేగం చెందారు. "నేను మిమ్మల్ని రిటైర్ కానివ్వను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. నా డోర్లు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయి" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆజాద్ వీడ్కోలు సందర్భంగా రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్నారు. #WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT — ANI (@ANI) February 9, 2021 ► ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్.. బీజేపీ గూటికి చేరతారంటూ పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలే అని అప్పుడు కొట్టిపారేశారాయన ► కాంగ్రెస్‌లో తన ప్రాబల్యాన్ని తగ్గించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన్ని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమిస్తే, అది ప్రమోషన్ కాదని.. డిమోషన్ అని పేర్కొంటూ ఆ పదవికి రాజీనామా చేసి సోనియాగాంధీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. ఈ నిర్ణయం ప్రకటించి వారం తిరగక ముందే.. ► తాజాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపిన లేఖలో.. పార్టీ ఎన్నికలను బూటకమని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలే గుప్పించారు. ► బీజేపీ కాకుంటే.. బీజేపీలో చేరేది ఊహాగానాలే అంటూ గతంలో ప్రకటించారు గులాం నబీ ఆజాద్. కానీ, బీజేపీతో ఆయన అనుబంధం మాత్రం చాలా ఏళ్లుగా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు.. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరవచ్చని ఒకవర్గం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో చేరినా.. సలహాదారుగా మాత్రమే ఆయన వ్యవహరించవచ్చనే భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీలో గనుక చేరుకుంటే.. ఆయన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ‘స్థానిక’ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్టీ నిర్ణయం తీసుకోవచ్చని, లేదంటే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: రాహుల్‌కు ఆ హోదా లేకున్నా.. కాంగ్రెస్‌కు ఆజాద్ రాజీనామా, లేఖ కలకలం -
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కూలిపోవడం చూస్తుంటే బాధగా, భయంగా ఉంది
శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ సభ్యుత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా భారత్‌లోని ఒక ప్రముఖ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కూలిపోడం చూస్తుంటే బాధగానూ, భయంగానూ ఉందని ఆవేదనగా అన్నారు. గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్‌కి రాజీనామా చేయడం పార్టీకి అతి పెద్ద శరాఘాతంగా ఆయన అభివర్ణించారు. గత కొంతకాలంగా ఆజాద్ రాజీనామ చేస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఇలాంటి రాజీనామాలు కాంగ్రెస్‌కి కొత్తేం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలోని అతి సీనియర్ నాయకుడైన గులామ్ నబీ ఆజాద్ రాజీనామ చేయడం మాత్రం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. అంతేకాదు పార్టీ నుంచి వైదొలగిన అత్యంత సీనియర్ నాయకుడు గులామ్ నబీ అజాద్ రాజీనామా లేఖ చదవడం చాలా బాధకరం అని ఆయన ట్వీట్ చేశారు. Long rumoured to be in the offing but a body blow to the Congress none the less. Perhaps the senior most leader to quit the party in recent times, his resignation letter makes for very painful reading. It’s sad, and quite scary, to see the grand old party of India implode. https://t.co/Z6gj9AophE — Omar Abdullah (@OmarAbdullah) August 26, 2022 (చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్) -
Sakshi Cartoon: పార్టీ శ్రేయస్సు కోరి రిటైర్ అవడం లేదనుకుంటా సార్!
పార్టీ శ్రేయస్సు కోరి రిటైర్ అవడం లేదనుకుంటా సార్! -
‘జీ–23’ ప్రతిపాదనలు సోనియా దృష్టికి: ఆజాద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోని జీ–23 గ్రూప్ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు జీ–23 నేతలు చేసిన ప్రతిపాదనలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు అనంతరం మీడియాకు చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులపై పోరాటానికి కాంగ్రెస్ ఎలా సన్నద్ధం కావాలన్న అంశంపై చర్చించాననని తెలిపారు. మీడియాకు ఇదొక పెద్ద వార్త కావొచ్చేమోగానీ తమకు మాత్రం మామూలు సమావేశమేనన్నారు. తమ అధినేత సోనియా గాంధీ పార్టీ నేతలతో తరచుగా సమావేశమవుతూనే ఉంటారని, పార్టీ వ్యవహారాలపై చర్చిస్తుంటారని ఆజాద్ ఉద్ఘాటించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు ఉన్నాయన్నారు. తమ అభిప్రాయాలను సోనియాకు వివరించానని చెప్పారు. పార్టీ పటిష్టత కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేశారని ప్రశ్నించగా, అవన్నీ గుర్తుంచుకొని రికార్డు చేయడం సాధ్యం కాదని ఆజాద్ బదులిచ్చారు. -
సోనియానే మా లీడర్: గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా పార్టీ క్రియాశీలక వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సీనియర్లు.. మళ్లీ అధిష్టానానికి దగ్గరవుతున్నారు. శుక్రవారం సాయంత్ర జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. జీ-23గా పిల్చుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ రెబల్స్ నేతలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల చేదు ఫలితాలపై గరం గరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆపై వరుస భేటీలతో హీట్ పెంచిన సీనియర్లు ఎట్టకేలకు చల్లబడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం 10, జనపథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీతో భేటీ సంతృప్తికరంగా సాగిందని వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై అభిప్రాయాల్ని పంచుకునేందుకే ఆమెతో భేటీ అయినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని, ప్రతిపక్షాలను ఓడించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆయన అన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలంతా సోనియా గాంధీ నేతృత్వంలో ముందుకు సాగేందుకు సుముఖంగా ఉన్నారని, కొన్ని సలహాలు మాత్రం ఆమెతో పంచుకున్నామని’’ ఆజాద్ వెల్లడించారు. The meeting with Sonia Gandhi was good. All members of the Congress party decided unanimously that she should continue as the president, we just had some suggestions that were shared: Congress leader Ghulam Nabi Azad after meeting party president Sonia Gandhi pic.twitter.com/OSSsZqekqw — ANI (@ANI) March 18, 2022 ఇదిలా ఉండగా.. బుధ, గురువారాల్లో ఆజాద్ నివాసంలో కాంగ్రెస్ రెబల్స్ జీ-23 భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో అందరినీ కలుపుకుని పోవాలని, భావసారుప్యత ఉన్న పార్టీలతో చర్చించాలని హైకమాండ్‌కు సీనియర్లు సూచించినట్లు సమాచారం. మరోవైపు గాంధీలు తప్పుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. -
అదొక్కటే ముందున్న మార్గం.. కాంగ్రెస్‌కు జీ–23 నేతల కీలక సూచన
న్యూఢిల్లీ: నాయకులందరినీ అందరినీ కలుపుకుని ముందుకు సాగడమే కాంగ్రెస్ ముందున్న మార్గమని సీనియర్ల బృందం (జీ–23) అభిప్రాయపడింది. అన్ని స్థాయిల్లోనూ నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేయాలని సూచించింది. 24 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సమర్థమైన ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసేందుకు భావసారూప్యత ఉన్న శక్తులతో చర్చలు జరపాలని బుధవారం ఒక ప్రకటనలో కోరింది. గులాం నబీ ఆజాద్ నివాసంలో జీ–23 నేతలు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, పృథ్వీరాజ్ చవాన్, మనీశ్ తివారీ, శశిథరూర్, భూపీందర్ సింగ్ హుడా, వివేక్ టంకా, రాజ్ బబ్బర్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సందీప్ దీక్షిత్ తదితరులు సమావేశమయ్యారు. కొత్తగా పటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్, గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్ వఘేలా, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్, పీజే కురియన్, కుల్దీప్ శర్మ కూడా హాజరవడం విశేషం! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయాలు, భేటీ జరిగిన తీరు తదితరాలను సీడబ్ల్యూసీ సభ్యులైన ఆజాద్, ఆనంద్ శర్మ నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. జీ–23 నేతలు పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. వాళ్లు 100 సమావేశాలు జరిపినా పార్టీ సోనియా వెంటే ఉంటుందన్నారు. In order to oppose BJP, it is necessary to strengthen the Congress party. We demand the Congress party to initiate dialogue with other likeminded forces to create a platform to pave way for a credible alternative for 2024: Joint statement of Congress' G 23 leaders pic.twitter.com/AsVO1Hm5II — ANI (@ANI) March 16, 2022 ఓటమిపై కాంగ్రెస్ కమిటీ న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మదింపుకు ఐదుగురు లీడర్లతో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కమిటీ వేశారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీలో చేపట్టాల్సిన వ్యవస్థాగతమైన మార్పులను సూచించాల్సిందిగా కోరారు. జితేంద్రసింగ్ (యూపీ), అజయ్ మాకెన్ (పంజాబ్), అవినాశ్ పాండే (ఉత్తరాఖండ్), రజనీ పాటిల్ (గోవా), జైరాం రమేశ్ (మణిపూర్)కు బాధ్యతలు అప్పగించారు. -
కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్
న్యూఢిల్లీ: దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత తన ట్విటర్ ప్రొఫైల్ మార్చినట్టు వచ్చినట్టు వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని.. తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘గందరగోళం సృష్టించేందుకు కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. నా ట్విటర్ ప్రొఫైల్ నుంచి ఎటువంటి సమాచారం తీసివేయలేదు. అలాగే కొత్తగా ఎటువంటివి జోడించలేదు. నా ట్విటర్ ప్రొఫైల్ మునుపటిలానే ఉంద'ని గులాం నబీ ఆజాద్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అసంతృప్త నేతల బృందమైన జీ –23లో కీలక నాయకుడిగా ఉన్న ఆజాద్ అధికార బీజేపీతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా ఆజాద్ పదవీ విరమణ సమయంలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆజాద్ పరస్పరం ప్రశంసించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌కు పద్మభూషణ్ పురస్కారం దక్కడంపై కాంగ్రెస్ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమమైంది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు స్పందించకుండా మౌనంగా ఉంది. కపిల్ సిబల్, శశి థరూర్, రాజ్‌బబ్బర్ వంటి నాయకులు ఆజాద్‌కు అభినందనలు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ మాత్రం భిన్నంగా స్పందించారు. పద్మ పురస్కారాన్ని తిరస్కరించాలనే అర్థం వచ్చేట్టుగా వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు) -
గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్.. ‘ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు’
న్యూఢిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సహచరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మేరకు లోక్‌సభ ఎంపీ శశిథరూర్ మాత్రం అజాద్‌కు అభినందనలు తెలిపారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ అవార్డును తిరస్కరించారనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అతను అజాద్‌గా ఉండాలనుకుంటున్నాడు గులాం అవ్వాలను కోవట్లేదంటూ గులాం నబీ ఆజాద్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. అంతేకాదు మాజీ బ్యూరోక్రాట్ పీఎన్ హస్కర్ పద్మ అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు 1973లో మన దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వోద్యోగి హస్కర్ పీఎంఓ నుండి నిష్క్రమించినప్పుడు అతనికి పద్మవిభూషణ్‌ను అందజేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దానిని ఆయన తిరస్కరించారు. హస్కర్ పుస్తకంలోని ఆ భాగం అత్యత్తుమమైనది, అనుకరణ అర్హమైనది అనే క్యాప్షన్ జోడించి మరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అయితే పద్మ అవార్డులను బహిరంగంగా తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే అవార్డు గ్రహీతలకు అవార్డు గురించి ముందుగానే తెలియజేయడమే కాక వారు అంగీకరించిన తర్వాత మాత్రమే జాబితాను ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్‌పై నిర్ణయాన్ని భట్టాచార్య భార్యకు తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కానీ, బుద్ధదేవ్ మాత్రం తనకు పద్మభూషణ్ గురించి ఏమి తెలియదని ఒకవేళ వారు పద్మభూషణ్ ఇచ్చినట్లయితే తిరస్కరిస్తున్నాను అని అన్నారు. In Jan 1973, the most powerful civil servant of our country was told he was being offered the Padma Vibhushan on his leaving the PMO. Here is PN Haksar's response to it. It is a classic, and worthy of emulation. pic.twitter.com/H1JVTvTyxe — Jairam Ramesh (@Jairam_Ramesh) January 25, 2022 (చదవండి: యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్) -
గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పరిస్థితి కనిపించటం లేదు
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ ఓ వైపు నాయకత్వలేమి సమస్యలు ఎదుర్కొంటోంది. మరోవైపు సీనియర్ నాయకుల సంచలన వ్యాఖ్యలతో సతమతమవుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం జమ్మూ కశ్మీర్లో మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు గెలిచే పరిస్థితి కనిపించడం లేదన్నారు. చదవండి: మా మద్దతు లేకుండా బీజేపీని ఓడించలేరు అదే విధంగా జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి అర్టికల్ 370 పునరుద్ధరణ విషయంతో తమ వాగ్దానాలను నెరవేర్చే స్థితిలో లేవమని పేర్కొన్నారు. అర్టికల్ 370 కోర్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం తమ చేతిలో ఏం లేదని తెలిపారు. అయితే ఎవరైనా దానికి కోసం పోరాడితే అది బాధ్యతయుతమైన ముందడుగు అవుతుందని అన్నారు. చదవండి: వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం కేసీఆర్ భేటీ? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 300 ఎంపీ స్థానాలు లేవని, వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామన్న పరిస్థితి కనిపంచడం లేదన్నారు. అందుకే తాను సత్యదూరమైన వాగ్దానాలు చేయలేనని స్పష్టం చేశారు. ఇక, జీ-23 కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ అజాద్ ప్రముఖ నేత అన్న సంగతి తెలిసిందే. -
మోదీపై ఆజాద్ ప్రశంసలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ తన గతం గురించి మొహమాటం లేకుండా నిజాలు చెప్పారని పేర్కొన్నారు. చిన్న గ్రామం నుంచి వచ్చానని, రైల్వే స్టేషన్లో టీ అమ్మానని మోదీ గతంలో పలుమార్లు చెప్పిన విషయాన్ని ఆజాద్ గుర్తు చేశారు. ఎవరైనా సరే.. తన మూలాల విషయంలో గర్వపడాలన్నారు. జమ్మూలో గుజ్జర్ దేశ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆజాద్ పాల్గొన్నారు. ‘కొందరు నాయకులను నేను అభిమానిస్తాను. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఆ విషయం నాకు గర్వకారణం. అలాగే, దేశంలోనే పెద్ద నాయకుడైన ప్రధాని మోదీ కూడా చిన్న గ్రామం నుంచి వచ్చానని, రైల్వే స్టేషన్లో టీ అమ్మానని చెప్పుకున్నారు. అది వారి గొప్పతనం’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎంపీగా ఆజాద్ పదవీవిరమణ సమయంలో రాజ్యసభలో ప్రధాని మోదీ, ఆజాద్ పరస్పరం ప్రశంసలతో ముంచెత్తుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్ అసంతృప్త నేతల బృందమైన జీ –23లో ఆజాద్ కీలక నేత. జీ 23 నాయకులు శనివారం జమ్మూలో సమావేశమై, కాంగ్రెస్ భవితవ్యంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై స్పందిస్తూ.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నుంచి ఆయన హోదాను తొలగించి సామాన్య కానిస్టేబుల్‌గా మార్చినట్లు ఉందని ఆజాద్ వ్యాఖ్యానించారు. కశ్మీర్లో అభివృద్ధి జరుగుతోందన్న వార్తలు అసత్యాలన్నారు. -
మోదీపై గులామ్ నబీ ఆజాద్ ప్రశంసలు
శ్రీనగర్ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబి ఆజాద్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నరేంద్ర మోదీ నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దేశ ప్రధాని స్థాయికి ఎదిగినా ఆయన తన మూలాలు మర్చిపోలేదు. తననో చాయ్‌వాలాగా గర్వంగా చెప్పుకుంటారు’’ అని అన్నారు. తనకు, మోదీకి రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నప్పటికి, వ్యక్తిగతంగా ఆయన ఉన్నతుడన్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం గులామ్ నబి ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేస్తూ.. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సొంత పార్టీ ప్రయోజనాలతో పాటు రాజ్యసభ, భారతదేశ ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. కరోనా సమయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆజాద్ తనను కోరారని, దాంతో వెంటనే అఖిలపక్ష భేటీ పెట్టానని గుర్తు చేశారు. తాను గుజరాత్ సీఎంగా, కశ్మీర్ సీఎంగా ఆజద్ ఉన్నపుడు తాము మాట్లాడుకునేవారమన్నారు. కశ్మీర్లో గుజరాత్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సమయంలో తనకు మొదట ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది ఆజాదేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి గురైన ప్రధాని కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. ‘అధికారం వస్తుంది. పోతుంది. కొందరికే ఆ అధికారాన్ని సరిగ్గా వినియోగించడం తెలుస్తుంది. అది ఆజాద్‌కు తెలుసు’అని అన్నారు. చదవండి : 'ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలు' -
ఆజాద్ వీడ్కోలు: ఎన్డీయే ఆఫర్..!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌పై బీజేపీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన రాజ్యసభ పదవీ కాలం ఈనెల 15న ముగియనుంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు ఆజాద్ సేవలను కొనియాడారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనదైన మార్కును చూపించారని గుర్తుచేశారు. ఎల్లప్పుడూ ప్రజా సేవకోసమే పరితమించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్‌దాస్ అంథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనపై పట్టు కలిగిన ఆజాద్ లాంటి సభ్యులు చట్ట సభల్లో ఉండటం చాలా అవసరమన్నారు. మరో వారంరోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తోందని, మరోసారి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆజాద్‌ను రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. తాము (ఎన్డీయే) నామినేట్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి నేతలు సభలో ఉండటం పార్లమెంట్‌కు గర్వకారణమన్నారు. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ.. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. పార్లమెంట్లో తీవ్రమైన ఉద్వేగానికి గురై కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. కాగా తొలిసారి 1984లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆజాద్ సుమారు 40 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు. 2005లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై 2008 వరకు కొనసాగారు. ఆ తరువాత యూపీయే (2009-2014) ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వస్తున్నారు. అయితే 71 ఏళ్ల ఆజాద్‌ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేయడంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నుంచి ఇప్పట్లో ఆయన ఎన్నికైయ్యే అవకాశం కూడా లేదు. దీంతో ఇదే ఆయనకు చివరి అవకాశంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాము నామినేట్ చేస్తామంటూ అథవాలే ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆజాద్ వీడ్కోలు.. మోదీ కన్నీరు -
ఆజాద్ వీడ్కోలు.. మోదీ కన్నీరు
న్యూఢిల్లీ: భారతీయ ముస్లిం కావడాన్ని తాను గర్వంగా భావిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. వచ్చేవారం పదవీ విరమణ చేయనున్న ఆజాద్ మంగళవారం రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా ఎంతోమంది నాయకుల నుంచి ఎన్నో నేర్చుకున్నానని ఆజాద్ వ్యాఖ్యానించారు. ప్రజాసేవలో ఆజాద్ చేసిన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆజాద్‌తో పాటు జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో ముగ్గురు సభ్యులు, నాజిర్ అహ్మద్, శంషేర్ సింగ్ మన్హాస్, మీర్ మొహ్మద్ ఫయాజ్‌ల రాజ్యసభ పదవీకాలం 15న ముగియనుంది. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సొంత పార్టీ ప్రయోజనాలతో పాటు రాజ్యసభ, భారతదేశ ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. కరోనా సమయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆజాద్ తనను కోరారని, దాంతో వెంటనే అఖిలపక్ష భేటీ పెట్టానని గుర్తు చేశారు. తాను గుజరాత్ సీఎంగా, కశ్మీర్ సీఎంగా ఆజద్ ఉన్నపుడు తాము మాట్లాడుకునేవారమన్నారు. కశ్మీర్లో గుజరాత్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సమయంలో తనకు మొదట ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది ఆజాదేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి గురైన ప్రధాని కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. ‘అధికా రం వస్తుంది. పోతుంది. కొందరికే ఆ అధికారాన్ని సరిగ్గా వినియోగించడం తెలుస్తుంది. అది ఆజాద్‌కు తెలుసు’అని అన్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య మాట్లాడుతూ.. ప్రజాజీవితంలో ఆజాద్‌ది నిష్పక్షపాత గళమని, ప్రతిపక్షంలోనూ, అధికార పక్షంలోనూ విలువైన సేవలందించారన్నా. పాకిస్తాన్‌కు వెళ్లని అదృష్టవంతుడిని పాకిస్తాన్‌కు ఎన్నడూ వెళ్లని కొద్దిమంది అదృష్టవంతుల్లో తాను కూడా ఒకడినని ఆజాద్ వ్యాఖ్యానించారు. ‘పాకిస్తాన్లో పరిస్థితుల గురించి తెలుసుకుంటుంటే.. భారతీయ ముస్లింను అయినందుకు గర్వంగా ఉంటుంది. పొరుగుదేశాల్లోని దుష్ట శక్తులకు దూరంగా ఉన్నందుకు భారత్‌లోని ముస్లింలు గర్వపడాలి’అన్నారు. సీఎంగా తొలి బహిరంగ సభను సమస్యాత్మక సోపోర్ జిల్లాలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ అది చాలామందికి అసాధ్యమైన విషయమని వ్యాఖ్యానించారు. ఇందిర, సంజయ్‌ల వల్లనే.. జమ్మూకశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతుందని, కశ్మీరీ పండిట్లు తిరిగి స్వస్థలాలకు తిరిగి వస్తారని ఆశిస్తున్నానని తన ప్రసంగంలో ఆజాద్ పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. విద్యార్థిగా ఉండగానే రాజకీయాల్లో చేరానని, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్‌ల గురించి చదువుకుని దేశభక్తుడిగా మారానని ఆజాద్ వెల్లడించారు. ప్రజాప్రతినిధిగా 41 ఏళ్ల అనుభవం తనదన్నారు. కశ్మీర్లో తాను కాలేజ్ విద్యార్థిగా ఉన్న సమయంలో.. ఆగస్ట్ 14, ఆగస్ట్ 15.. ఈ రెండు తేదీల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగేవన్నారు. మెజారిటీ ప్రజలు ఆగస్ట్ 14వ తేదీన ఉత్సవాలు జరుపుకుంటే, తనతో పాటు మరికొందరు మాత్రం ఆగస్ట్ 15న జెండా పండుగ చేసేవారమన్నారు. రాజకీయంగా తాను ఈ స్థాయికి రావడానికి దివంగత నేతలు ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ కారణమని ఆజాద్ తెలిపారు. దాదాపు నలుగురైదుగురు ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశానని, పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరించానని, ఈ అనుభవాలు తనకెన్నో విషయాలు నేర్పించాయని వివరించారు. ఇతర రాజకీయ పార్టీల్లోని గొప్ప నేతలైన జ్యోతిబసు, కరుణానిధి, జయలలిత, చంద్ర శేఖర్, ములాయం సింగ్ యాదవ్, ప్రకాశ్‌సింగ్ బాదల్, జీకే మూపనార్, ఫారూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ మొహ్మద్ సయీద్ తదితరులతో కలిసి పనిచేశానన్నారు. అటల్ నుంచి నేర్చుకున్నా బీజేపీ దివంగత అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పేయితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆజాద్ తెలిపారు. ‘అటల్‌జీని తరచూ కలుçస్తూ ఉండమని ఇందిరాజీ నాకు, ఆమె రాజకీయ కార్యదర్శి ఎంఎల్ ఫోతేదార్‌కు చెప్పేవారు’అని గుర్తు చేసుకున్నారు. 1991 నుంచి 1996 వరకు ఉన్న మైనారిటీ ప్రభుత్వంలో తాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉండగా, వాజ్‌పేయిజీ విపక్ష నేతగా ఉన్నారని, ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నానని వినమ్రంగా తెలిపారు. ‘ప్రభుత్వం, ప్రతిపక్షాలు.. రెండూ అంగీకరించేలా సమస్యకు పరిష్కారం ఎలా సాధ్యమో ఆ సమయంలో నేను నేర్చుకున్నాను’అన్నారు. ఐదు సార్లే ఏడ్చాను జీవితంలో 5సార్లే ఏడ్చానని ఆజాద్ చెప్పారు. సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల మరణాలప్పుడు, సునామీ వేళ, జమ్మూకశ్మీర్ సీఎంగా తాను ఉండగా కశ్మీర్లో ఉగ్రదాడిలో గుజరాత్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఏడ్చానన్నారు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా కళ్లలోకి నీళ్లు వచ్చాయి కానీ ఏడవలేదన్నారు. ఈ దేశంలో ఉగ్రవాదం అంతమవ్వాలని ఇప్పుడు దేవుడిని కోరుకుంటున్నానన్నారు. కాలేజ్ యూనియన్ ఎన్నికల్లో తనకు ఎంతోమంది కశ్మీరీ పండిట్లు మద్దతిచ్చారని గుర్తు చేశారు. -
కరోనా బారిన కాంగ్రెస్ సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ, తనతో సన్నిహితంగా మెలిగినవారిని అప్రమత్తం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సిందిగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని ట్వీట్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసుల నమోదు కాస్త తగ్గినప్పటికీ ఉధృతి కొనసాగుతోంది. వైరస్ కేసుల సంఖ్య 73 లక్షలను దాటేసిన సంగతి తెలిసిందే. I have tested positive for COVID-19. I am in home quarantine. Those who came in contact with me in last few days may kindly follow the protocol. — Ghulam Nabi Azad (@ghulamnazad) October 16, 2020 -
కాంగ్రెస్‌పై తేల్చిపడేసిన గులాం నబీ ఆజాద్
-
కాంగ్రెస్ విషయం తేల్చిపడేసిన ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత విభేదాలతో ఇబ్బందుల్లో పడిన కురువృద్ధ పార్టీ కాంగ్రెస్‌లో మార్పులు జరగాల్సిందేనని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకుంటే మరో 50 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన కమిటీలే లేవని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరగాలని ఈ సందర్భంగా ఆజాద్ స్పష్టం చేశారు. కాగా, పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఇది దురదృష్టకరం: కపిల్ సిబల్) వీరిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ల లేఖపై రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి వారు రాహుల్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ భేటీ దాదాపు ఏడు గంటలపాటు సాగింది. చివరకు అందరు నేతలు ఒకేమాటపైకి రావడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. దాంతో ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. (చదవండి: గాంధీలదే కాంగ్రెస్..!) -
‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు’
న్యూఢిల్లీ/భోపాల్: రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచాలన్న ఆత్రుత బీజేపీలో ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. అందుకే మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 14 ఎమ్మెల్యేలను వలలో వేసుకునేందుకు యత్నించిందని ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నేతలు కుట్రతో మా ఎమ్మెల్యేలను హరియాణా రాష్ట్రం మనేసర్‌లోని ఓ హోటల్లో నిర్బంధించారు. అయితే, ఆ ఎమ్మెల్యేలందరూ వారంతట వారే వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరిగి మద్దతు పలికారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా బీజేపీ దాడులు, బెదిరింపులకు పాల్పడుతోంది. బీజేపీలో చేర్చుకోవడం లేదా అనుకూలంగా మార్చుకోవడం ద్వారా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది’ అని ఆరోపించారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచాలన్న తొందర కాషాయ నేతల్లో ఎక్కువైందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీన పరిచేందుకు కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని గతంలో 15 ఏళ్లపాటు వ్యవహారాలు నడిపిన మాఫియా ముఠా ఇంకా క్రియాశీలకంగానే ఉంది. ఆ ముఠాయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు కుట్ర పన్నుతోంది. ఎమ్మెల్యేలను తరలించేందుకు చార్టర్ విమానాన్ని ఎవరు పంపారు? స్టార్ హోటళ్లలో బసకు డబ్బు ఎవరు చెల్లించారు? అని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు తమ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘వీరి కుతంత్రాలు సఫలం కావు. మా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, బీజేపీకి తాము అమ్ముడుపోయామని, తమను నిర్బంధించారంటూ వచ్చిన వార్తలు అబద్ధమని మధ్యప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు రామ్ బాయి, సంజీవ్ సింగ్ కుష్వాహా, రాజేశ్ శుక్లా భోపాల్‌లో అన్నారు. (చదవండి: మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్ కమలం?) -
రిజర్వేషన్ల ఆంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవట్లేదు
-
కేసీఆర్ స్పందించకపోవడం దారుణం
-
గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్ నేతల గలాటా
సాక్షి, హైదరాబాద్: గులాం నబీ ఆజాద్ రాష్ట్ర పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గాంధీభవన్ వేదికగా ఆజాద్ సమక్షంలోనే పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ సీనియర్ నేతలంతా శవాలతో సమానమని షబ్బీర్ ఎలా అంటారని వీహెచ్ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన షబ్బీర్ తానెప్పుడు అలా అన్నానో చెప్పాలని వీహెచ్‌ను నిలదీశారు. ‘నేను ఎవరితో మాట్లాడలేదు. మీడియాతో అసలే మాట్లాడలేదు. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు’అంటూ వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆజాద్ కల్పించుకుని ఇద్దరికీ సర్దిచెప్పాల్సి వచ్చింది. టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వండి: కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ మంగళవారం గాంధీభవన్ హోరెత్తిపోయింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆజాద్‌ను కలిసిన కోమటిరెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుపై కొంత చర్చ జరిగింది. కొందరు వీలైనంత త్వరగా పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కోరగా, మరికొందరు మున్సిపల్ ఎన్నికల తర్వాత మార్చాలని కోరారు. దీంతో ఆజాద్ స్పందిస్తూ.. ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఆజాద్‌తో సమావేశం ముగిసిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని ఆజాద్‌ను కోరినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని ఆయన వెల్లడించారు. -
ఆర్‌సెప్‌పై మోదీ తగ్గడం మా విజయమే
సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సెప్)పై సంతకం చేయకుండా ప్రధాని మోదీ వెనక్కు తగ్గడం కాంగ్రెస్ విజయమని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఈ ఒప్పందం కారణంగా దేశానికి జరిగే ఆర్థిక నష్టాలపై ఇతర ప్రతిపక్షాలతో కలసి కాంగ్రెస్ చేసిన పోరాటం కారణంగానే వైదొలిగారని, దీనిపై సంతకం చేసి ఉంటే మరణశాసనం అయ్యే దన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన ఆజాద్ గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత జానారెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా తదితరులతో కలసి మాట్లాడారు. ఆర్‌సెప్‌పై సంతకం చేసి ఉంటే చైనా వ్యాపారానికి భారత్ డంపింగ్ గ్రౌండ్‌గా మారేదన్నారు. నిరుద్యోగం, సాగు ఖర్చులు పెరిగాయి.. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని ఎన్ఎస్ఎస్వో ఇచ్చిన నివేదిక లోక్‌సభ ఎన్ని కల ముందే వచ్చిందని, కానీ ఎన్నికల సమయంలో యువతను మోసం చేసేందుకు ఆ నివేదికను దాచిపెట్టారని ఆజాద్ విమర్శించారు. నిరుద్యోగం విషయంలో ప్రపంచ సగటు కన్నా భారత్‌లో రెండింతలు ఉందని చెప్పారు. దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని, వ్యవ సాయ అనుబంధ అంశాలైన ఫెర్టిలైజర్స్‌పై 5 శాతం, ట్రాక్టర్లపై 12 శాతం, పెస్టిసైడ్లపై 18 శాతం జీఎస్టీ విధించారని, డీజిల్ ధరలు, విద్యుత్ ధరలు పెంచడంతో వ్యవసాయ ఖర్చులు రెండింతలు పెరిగాయన్నారు. సాగు ఖర్చులు పెరిగి కనీస మద్దతు ధర రాకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోక ఏమవుతారని ప్రశ్నించారు. అప్పటివరకు కశ్మీరీలకు ఆజాదీ లేనట్టే.. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని విలేకరులు ఆజాద్‌ను ప్రశ్నించగా.. ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీగా, మాజీ ముఖ్యమంత్రిగా తననే రాష్ట్రంలోకి వెళ్లేందుకు అనుమతించని పరిస్థితులున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కశ్మీర్ ప్రజలకు ఆజాదీ లేనట్టే అని అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య దారుణమన్న గులాంనబీ ఇలాంటి ఘటనలు అధికారాల్లో మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
నినాదాలు కాదు.. ఆచరణ ఎక్కడ..? : ఆజాద్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరిందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వైఫల్యం మీద దేశంలో 650 కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాము. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగింది. 2014లో అధికారంలోకి రాగానే 10కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ సమస్య రెట్టింపు అయ్యింది. ఆర్థిక మాంద్యంతో దేశాన్ని వెనక్కి నెట్టారు. నల్లధనం బయటకు తెచ్చి ప్రతి పేదవారికి 15 లక్షల రూపాయల వారి అకౌంట్స్ లో వేస్తామని చెప్పింది. బీజేపీ ప్రభుత్వంలో 25 వేల బ్యాంక్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. దీని ద్వారా రూ. 3లక్షల కోట్లు దుర్వినియోగం అయ్యింది. కశ్మీర్‌కి వెళ్లాలంటే సుప్రీంకోర్టు అనుమతితో వెలసిన దుస్థితి నెలకొంది. జమ్మూలో పరిస్థితుల అధ్యయనం కోసం వెళ్తే అక్కడ 5 గంటలు వెయిట్ చేయించి ఢిల్లీకి సీపీఎం నేతలతో పాటూ బలవంతంగా నన్ను వెనక్కి పంపారు. కశ్మీర్‌కి ఆ రాష్ట్ర నేతలను, ప్రజాప్రతినిధులు, మీడియాను వెళ్లేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే నినాదానికే పరిమితమైందని, ఆచరణలో మాత్రం అందనంత ఎత్తులో ఉందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనంత పెరిగిందని ఆజాద్ అన్నారు. ఉద్యోగ కల్పన మాట అటుంచి ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు పసిగడతారని ఆజాద్ పేర్కొన్నారు. బాబ్రీ మజీద్, భోఫోర్స్ అంశం బీజేపీకి ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తొస్తాయి. వాళ్లు ముందుగా ఎన్నికల్లో నిరుద్యోగులకు, దేశ ప్రజలకి ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలని అన్నారు. -
కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మందగమనం, ఆర్సెప్ ఒప్పందం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు వంటి వాటిపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోమవారం ఈ అంశంపై సీనియర్ ప్రతిపక్ష నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఆజాద్, అహ్మద్ పటేల్, సుర్జేవాలా, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నుంచి టీకే రంగరాజన్తోపాటు ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, ఆర్ఎల్డీ నేతలు హాజరయ్యారు. ఇది మా విజయమే: కాంగ్రెస్ ఆర్సీఈపీలో చేరబోవడం లేదని భారత్ ప్రకటించడం తమ విజయమేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ వ్యతిరేకించినందువల్లనే ప్రభుత్వం ఆ విషయంలో వెనకడుగు వేసిందని తెలిపింది. ఈ ఒప్పందం కుదిరితే రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయేవారని సూర్జేవాలా అన్నారు. -
ఎలా ఉన్నారు?
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం ఆగస్టు 21వ తేదీన నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో తీహార్ జైల్లో ఉన్న చిదంబరాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ బుధవారం కలిశారు. వారివెంట చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఉన్నారు. తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన కాంగ్రెస్ నేతలు ఆయనతో దాదాపు అర్ధగంట సేపు ముచ్చటించారు. రాజకీయ అంశాలు ముఖ్యంగా కశ్మీర్ గురించి, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి వీరి మధ్య చర్చ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జైల్లో ఉన్న చిదంబరం సోమవారం 74వ పుట్టినరోజును జరుపుకున్నారు. జైలు వర్గాల ప్రకారంచ ప్రస్తుతం చిదంబరం ఆరోగ్యంగా ఉన్నారు. -
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఆజాద్‌కు చుక్కెదురు
శ్రీనగర్: కశ్మీర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు చుక్కెదురైంది. ఆజాద్‌తోపాటు జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మీర్‌ను శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ నుంచి వారు గురువారం శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా వారిని పోలీసులు నిలువరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరంలోకి అనుమతించేది లేదంటూ ఆయనను తిరిగి ఢిల్లీ పంపించారు. కాగా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఓట్ల కోసం ఇటువంటి చర్యలను చేపడితే సహించబోమని రాజ్యసభలో కేంద్రాన్ని ఆజాద్ హెచ్చరించారు. -
పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్ లోయలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి దోవల్ స్వయంగా పర్యటించారు. ఈ సందర్భంగా షోపియన్ జిల్లాలో స్థానికులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్థానికుల్లో విశ్వాసం కల్పించేలా స్థానికులతో మాటా-మంతి కలిపారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయని దోవల్ వారిని ప్రశ్నించగా.. అంతా బాగుందని వారు బదులిచ్చారు. ‘ఔను. అంతా కుదురుకుంటుంది. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించే రోజులు వస్తాయి. ఆ భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మీ భద్రత, సంక్షేమం కోసం మేం తపిస్తున్నాం. రానున్న తరాల అభివృద్ధి సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నాం’ అని దోవల్ వారితో తెలిపారు. మీ పిల్లలకు మంచి విద్య అందించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారిలో దోవల్ భరోసా నింపారు. ఈ మేరకు షోపియన్ జిల్లాలో స్థానికులతో దోవల్ భోజనం చేస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రం నిర్ణయాలను స్థానికులు స్వాగతిస్తున్నారని, లోయలో పరిస్థితులు అంతా సవ్యంగా ఉన్నాయని దోవల్ ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, షోపియన్‌లో స్థానికులతో దోవల్ భోజనం చేసిన వీడియోపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జమ్మూకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ పెదవి విరిచారు. పైసాలిస్తే ఎవరైనా మీతో కలిసివస్తారంటూ ఆయన ఎద్దేవా పూర్వకంగా వ్యాఖ్యలు చేశారు. -
జమ్మూకశ్మీర్‌ను తుక్‌డాలు.. తుక్‌డాలు చేసింది
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్య ద్రోహపూరితమైనదని, ప్రభుత్వ చర్య దేశం తలను నరికేసేలా ఉందని ధ్వజమెత్తారు. కేవలం ఓట్ల కోసం చేపట్టిన ఈ చర్యతో జమ్మూకశ్మీర్ చరిత్ర, సంస్కృతి ధ్వంసమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ను, జమ్మూకశ్మీర్‌ను కలిపే వంతెన ఆర్టికల్ 370 అని, దీనిని రద్దు చేయడం ద్వారా బీజేపీ సర్కారు భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆజాద్ మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌ను విభజించడం ద్వారా దేశం తలను నరికేయడమే కాకుండా.. రాష్ట్రాన్ని బీజేపీ ‘తుక్‌డ తుక్డా’ లు (ముక్కలు ముక్కలు) చేసిందని మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. చైనాతో, పాకిస్థాన్‌తో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సరిహద్దులు కలిగిన రాష్ట్ర ప్రజలతో ఇలాంటి ఆటలు ఆడటం ప్రమాదకరమని, ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం దేశద్రోహం లాంటిదేనని ఆజాద్ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను రద్దు చేసి.. రాష్ట్రానికి బలగాలను పంపించి.. మాసీ సీఎంలైన మెహబుబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహనిర్బంధంలో ఉంచి కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని, జమ్మూకశ్మీర్ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ సర్కారు వమ్ము చేసిందని తప్పుబట్టారు. -
‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తారు. ఈ బిల్లుతో ముస్లిం కుటుంబాలకు మేలు జరగకపోగా.. అవి విచ్ఛిన్నయ్యే అవకాశాలే అధికంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ బిల్లును తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యభర్తలు చెరో లాయర్‌ను మాట్లాడుకుని.. ఉన్న కాస్తోకూస్తో ఆస్తిని కోర్టు వ్యవహారాలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని అన్నారు. మైనారిటీ సోదరసోదరీమణుల మధ్య ట్రిపుల్ తలాక్ చిచ్చుపెడుతుందని హెచ్చరించారు. ఎట్టకేలకు కోర్టు తీర్పు అనంతరం ఆ కుటుంబం దివాళా తీయాల్సిందేనా అని ప్రశ్నించారు. అప్పటికే ఆర్థికంగా నష్టాలపాలు కావడంతో జైలు పాలైన వ్యక్తి జీవితం దుర్భరంగా మారుతుందని చెప్పారు. వారిని ఆత్మహత్య చేసుకునేందుకు.. లేక బందిపోటుగా మారేందుకు ఈ బిల్లు పురిగొల్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘ప్రధాని పదవి దక్కకున్నా బాధ లేదు’
పట్నా : దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని తెర మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీని గద్దే దించడమే తమ లక్ష్యమని ఈ కూటమి చెప్పుకుంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రానీ పక్షంలో.. విపక్షాలన్ని కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నాయకులంతా ప్రధాని పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి దక్కకపోయినా ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. బుధవారం పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆజాద్.. ‘మా స్టాండ్ ఏంటో ఇప్పటికే స్పష్టం చేశాం. కాంగ్రెస్‌కు మద్దతుగా అన్ని పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పాడితే.. ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ప్రధాని పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కకపోయినా పెద్దగా బాధ పడం. ఎందుకంటే బీజేపీని గద్దే దించడమే మా ప్రధాన ధ్యేయం. అందుకోసం అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాం. మిగతా పార్టీలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుంది. ఈ అంశంలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూస్తాం’ అని ఆజాద్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బదులుగా ఆజాద్ ఇలా వివరణ ఇచ్చారు. -
నియంతపాలనను అంతమొందించాలి
సాక్షి, వికారాబాద్: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నియంతలుగా మారారని, ఇద్దరూ బడా డిక్టేటర్, చోటా డిక్టేటర్‌గా పాలన సాగిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లాలోని మిర్జాపూర్‌లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ను ఓడించి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబం ఎంతో గౌరవప్రదమైనదని తెలిపారు. ప్రజలకు సేవచేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రెండు లక్షల ఓట్ల మెజార్టీతో కొండాను గెలిపించాలని కోరారు. కేంద్రంలోని మోదీ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీ రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తోందని చెప్పారు. తన ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై మోదీ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్, వివిధ పార్టీల అధ్యక్షులు శరద్‌పవార్, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్ తదితరులపై ప్రధాని ఈడీ, ఐటీ, సీబీఐ కేసులను బనాయిస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను ఇలా ఎప్పుడూ వేధింపులకు గురిచేయలేదని తెలి పారు. మోదీ ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ ఓట్ల దొంగతనం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల యూపీఏ పాలనలో పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేశామని తెలిపారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం దారుణమని ఆయన మండిపడ్డారు. విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించండి: కుంతియా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఓటర్లను కోరారు. బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, విశ్వేశ్వర్‌రెడ్డి గెలిస్తే కేంద్రంలో పదవి లభిస్తుందని తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని తెలిపారు. సభను విజయవంతం చేసినందుకు ప్రజలు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణలో మరో పార్టీని బతకనివ్వడం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ప్రలోభాలకు గురై ఓటు వేయవద్దని కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ దొర పాలనకు అంతం పలకాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్, మోదీలు ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రతినెలా పేదల ఖాతాల్లో రూ.6 వేలు జమచేసే ఆర్థిక భరోసా పథకం అమలు చేస్తామని చెప్పారు. ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీకి స్థానిక నేతలు ఎవ్వరూ దొరకలేదని, స్థానికేతరుడిని పోటీకి దింపారని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా గెలిస్తే చేవెళ్ల పార్లమెంట్‌ను అభివృద్ధి చేయటంతోపాటు సాగునీరు, తాగునీటి కష్టాలు తీరుస్తానని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు కరణం రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. -
మలివిడత ప్రచారానికి రాహుల్, సోనియా దూరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మలివిడత ప్రచారానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి మన్నెగూడలో ఈ నెల 8న జరగనున్న భారీ బహిరంగ సభను 7వ తేదీకి మార్చారు. ఈ సభకు సోనియా ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆమె తెలంగాణకు రావడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు జాతీయ నాయకులు గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్లు హాజరుకానున్నారని పేర్కొన్నాయి. ఇప్పటికే తొలివిడత ప్రచారంలో పాల్గొన్న రాహుల్ కూడా మలివిడత రావడం లేదని తెలిపాయి. -
రాజ్యసభలో జైట్లీ,అజాద్ మధ్య మాటల యుద్ధం
-
దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం కేసీఆర్
-
కేసీఆర్, ఎంఐఎం, బీజేపీలు ఒక్కటే
నల్లగొండ: కేసీఆర్, ఎంఐఎం, బీజేపీలు మూడు వేరుకాదని, మూడూ ఒక్కటేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రజా ఫ్రంట్ నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం బైపాస్ నుంచి గడియారం సెంటర్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ నేతలు రాత్రి పూట కలసి ఉంటారని, పొద్దున్నే తిట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు దేశ, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ మద్దుతు పలికారని గుర్తుచేశారు. ఎంఐఎంకు ఆర్థిక లాభా లు చేకూర్చి తన గుప్పిట పెట్టుకున్నారని ఆరోపించారు. నిజాంకు రూ.200 కోట్ల బిల్డింగ్ ఉంటే కేసీఆర్‌కు రూ.300 కోట్ల బిల్డింగ్ ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, దీంతో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నష్టపోయిందని, అయినా ప్రజలకు మేలు జరగకపోవడం బాధాకరమన్నారు. ప్రజాఫ్రంట్ మద్దతు పలికిన కోమటిరెడ్డిని గెలిపించాలని కోరారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెర వెనుక ఉండి కృషి చేసిన వ్యక్తి గులాం నబీ ఆజాద్ అని అన్నారు. కేసీఆర్‌కు ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే ముందే రద్దు చేసుకొని ఎన్నికలకు పోవడం ఎంతవరకు సమంజసమన్నారు. సమస్యల విషయంలో ప్రజలు కేసీఆర్ దగ్గరికు వెళ్లాలంటే ఆయన సెక్రటేరియట్‌కు రారని, ఆయన ఇంటికేమో ప్రజలను రానీయరని పేర్కొన్నారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ప్రజాపాలన కొనసాగుతుందన్నా రు. కోమటిరెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి జైలులో పెట్టిస్తామన్నారు. -
‘మజ్లిస్‌ను బతికించి తప్పు చేశాం’
సాక్షి,హైదరాబాద్ : ‘‘మజ్లిస్ పార్టీని బతికించి తప్పు చేశాం.. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను సైతం పోటీకి పెట్టకుండా దాన్ని ప్రోత్సహించిన తప్పిదాన్ని అంగీకరిస్తున్నాం... ఇందులో తాను భాగస్వామి అయినందుకు చింతిస్తున్నా’’అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్ పశ్చాత్తాప పడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ పేదరికం, అభివృద్ధి మజ్లిస్‌కు అవస రం లేదని, కావాల్సిందల్లా భూ కబ్జాల్లో పోలీసుల సహకారమని, ఇందుకోసమే కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో గల పార్టీలతో జతకట్టి వాడుకుంటోందని ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో అజాద్ మాట్లాడారు. బీజేపీ,టీఆర్ఎస్, ఎంఐఎంలు మూడు ఒకటే అని ఆరోపించారు. ఢిల్లీలో ఆ మూడు పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకుడని అభివర్ణించారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పగలు తిట్టుకుంటాయని, రాత్రయితే ఒప్పందాలు చేసుకుంటాయని విమర్శించారు. అబద్ధాల్లో ఇద్దరూ ఇద్దరే ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం, అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్‌లిద్దరూ కవలలని గులాం నబీ అజాద్ అభివర్ణించారు. భేటీ బచావో.. భేటీ పడావో అన్నారు.. కానీ మహిళలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.కేసీఆర్ దళితుడ్ని సీఎం చేస్తా.. వారికి మూడెకరాల భూమి ఇస్తా.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానన్నారనీ.. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆయన విద్యా వ్యతిరేకి అని, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వక పోవడంతో ఇంజనీరింగ్ కళాశాలలు మూత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సచివాలయానికి రాని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడేవారిని ప్రజలు కూడా ఇంట్లోనే కూర్చోపెట్టడం ఖాయమన్నారు. ఐదు రాష్ట్రాల్లో విజయం తథ్యం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తాయని అజాద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజా కూటమి ప్రభుత్వం గెలుపు తథ్యమన్నా రు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను, జాతులను, ధర్మాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీతో కలిసి వెళ్లడం ఖాయమని చెప్పారు. వైఎస్సార్ పుణ్యమే 4 శాతం రిజర్వేషన్.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు అని గులాం నబీ అజాద్ స్పష్టం చేశారు. వైఎస్సార్ మన మధ్యలో లేకున్నా రిజర్వేషన్ అమలు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 2004లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా తాను చేపట్టిన బస్సు యాత్రలో ఎవరిని అడగకుండా అధికారంలోకి వస్తే ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తామని ప్రకటించానని, వెంటనే అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పగా అందుకు ఆయన అంగీకరించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దానిని అమలు చేశారని చెప్పారు. కోర్టు నాలుగు శాతానికే రిజర్వేషన్ పరిమితం చేసిందన్నారు. 5% శాతం పెంపునకే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు 12% అమలు ఎలా సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీ అమలు చేయడమే కాకుండా అవసరమైతే అదనపు వాగ్దానాలను సైతం అమలు చేసి చూపిస్తుందన్నారు. -
ఆజాద్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
న్యూఢిల్లీ: తనను ఎన్నికల ప్రచారానికి పిలిచే హిందువుల సంఖ్య తగ్గిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష పార్టీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారిస్తుందని విమర్శించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఆజాద్‌ను తక్కువ మంది ప్రచారానికి పిలువడానికి.. ఆయన హిందూ, ముస్లింలను వేరుగా చూడటమే కారణమని ఆరోపించారు. బీజేపీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. కాగా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆజాద్ మాట్లాడుతూ.. ‘ నేను యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఉన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాను. గతంలో నన్ను 95 శాతం హిందూ సోదరులు, 5శాతం ముస్లిం సోదరులు ప్రచారానికి పిలిచేవారు. కానీ గత నాలుగేళ్లలో నన్ను ప్రచారానికి పిలిచే హిందూ సోదరుల సంఖ్య 20 శాతం పడిపోయింది. నేను వారి తరఫున ప్రచారం చేస్తే ఓట్లు రావాని వారు భయపడుతున్నారు. అందుకే నన్ను పిలవడానికి ఇష్టపడటంలేద’ని అన్నారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆజాద్ పలు విమర్శలు చేశారు. -
తెలంగాణ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ స్వతహాగా తెలంగాణ వ్యతిరేక పార్టీ అని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలం గాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర సూది మొనంత కూడా లేదన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆజాద్ వ్యాఖ్యలపై తెలంగాణ, ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే కాం గ్రెస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత ఈద శంకర్‌రెడ్డితో కలసి వినోద్ తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో గులాంనబీ ఆజాద్ పాత్ర ఏమిటో నాకు తెలుసు. ఎన్నికల్లో గెలవలేమన్న భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకుంది. తెలంగాణ గురించి ఆజాద్‌కు ఏమీ తెలియదు. తెలంగాణ బిల్లు మాకు తెలియకుండా సిద్ధం చేశారా.. అనేక అంశాలపై మేం సవరణలు అడిగినం. ఏపీలో కలిపిన ఏడు మండలాలు కూడా మాకే కావాలన్నాం. ముందు సరే అని చెప్పి చం ద్రబాబుకు లొంగి ఏడు మం డలాలు వాళ్ళకే ఇచ్చారు. తెలంగాణ ఊరికే ఇవ్వలేదు. ఉద్యమంతో సాధించుకున్నం’ అని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా నీడలోనే తెలంగాణ బిడ్డ.. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ పరిస్థితి బాగాలేనప్పుడు టీఆర్ఎస్తో పొత్తు కోసం ఆజాద్ కేసీఆర్ ఇంటికి వచ్చారని వినోద్ గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఆ రోజు టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుందని.. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటును విస్మరించిందని ఆరోపించారు. ‘కొత్తగా పుట్టిన తెలంగాణ బిడ్డ తల్లి దగ్గరే ఉండాలని ప్రజలు మా చేతుల్లో పెట్టారు. గులాబీ జెండా నీడలోనే బిడ్డ పెరుగుతుంది. కేసీఆర్ ఆమరణదీక్షతో యావత్ తెలంగాణ ఒక్కటైంది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్న ట్లు ప్రకటించి ఆంధ్రా నేతలకు లొంగి ప్రకటనను వెనక్కి తీసుకోలేదా. అప్పుడు ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ రాజీనామా చేశారా. ఉద్యమ తీవ్రతకు భయపడే కాంగ్రెస్ నేతలు తెలంగాణ గురించి మాట్లాఛ్ఛిరు. ఉద్యమాన్ని అణచేసేందుకు కాంగ్రెస్ ఎన్నో సార్లు ప్రయత్నించింది. ఇవన్నీ గుర్తు పెట్టుకునే తెలంగాణ ప్రజలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు’ అని వినోద్ చెప్పారు. -
‘టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు’
సాక్షి, నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర సూదిమొనంత కూడా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. శుక్రవారం స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించకుంటే ప్రత్యేక తెలంగాణ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత టీపీసీసీ సీనియర్ నేతలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించినవారేనని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర సూదిమొనంత -
వారానికో దేశ్‌కీ నేత!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్న కాంగ్రెస్, షెడ్యూల్‌కు ముందే అగ్ర నాయకత్వాన్నంతా రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళిక వేస్తోంది. దీనిలో భాగంగా ఇకపై ప్రతివారం ఒక జాతీయ స్థాయి నేతను హైదరాబాద్ పంపాలని యోచిస్తోంది. తెలంగాణ ఏర్పాటు దశలో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ నేతలందరినీ ప్రచారంలోకి దించి కాంగ్రెస్ గెలుపు అవకాశాలను సులభం చేసే దిశగా వ్యూహాలు రచిస్తోంది. వారందరినీ ప్రచార సమరంలోకి దింపితే పార్టీకి బహుళ ప్రయోజనం ఉంటుందన్న నేపథ్యంలోనే జాతీయ స్థాయి నేతలందరినీ తెలంగాణ పర్యటనకు పంపి వారితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ రాష్ట్రంలో రెండ్రోజులపాటు పర్యటించి కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఏఐసీసీ లీగల్ సెల్ చైర్మన్ వివేక్ థంకా సైతం కొద్దిరోజుల కిందటే వచ్చి ఓటర్ల జాబితాలో తప్పులపై కేసులు వేసే దిశగా సూచనలు చేశారు. ఈ వారం రోజుల్లో ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి. ఇక సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని షిండే, మీరాకుమార్లను ఎస్సీ నియోజకవర్గాల్లో పర్యటింప చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇక తెలంగాణ బిల్లు సమయంలో పొందుపరిచిన అనేక అంశాల్లో కీలకంగా ఉన్న జైరాం రమేశ్, నారాయణస్వామిలను ముందుపెట్టి, హైకోర్టు విభజన, ముంపు మండలాల విలీనం అంశాల్లో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో తెలంగాణ సాధ్యం కాలేదన్న అంశాన్ని బలంగా చెప్పించేందుకు కమల్‌నాథ్, వీరప్ప మొయిలీవంటి నేతలను రంగంలోకి దించుతున్నారు. ఇక పార్లమెంట్ సాక్షిగా అనేక అంశాల్లో బీజేపీతో టీఆర్ఎస్ అంటకాగుతోందన్న అంశాలను లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేతో ప్రచారం చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వీలైనంత ఎక్కువ మంది ఏఐసీసీ నేతలను రాష్ట్ర పర్యటనకు పంపి, అటు టీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు, ఇటు పార్టీకి బూస్టింగ్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. -
ముస్లింలకు రిజర్వేషన్ల ఆలోచన వైఎస్ఆర్దే
-
‘5 శాతం కుదరనపుడు.. 12 శాతం ఎలా ఇస్తావ్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్ అన్నారు. తొలుత ముస్లిం సోదరులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని వైఎస్సార్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. అయితే, సుప్రీం కోర్టు ఒప్పుకోకపోవడంతో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆజాద్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ముస్లింలను మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్ ప్రతిపాదించిన 5 శాతం రిజర్వేషన్లనే కోర్టు అనుమతించనపుడు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ముస్లింలకు కేసీఆర్ ఎలా హామీనిచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్ కృషితో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. -
ఆజాద్‌ను చుట్టుముట్టిన ఆశావహులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే టీఆర్ఎస్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాలు విసరడంతో.. కాంగ్రెస్ కూడా వేగంగా పావులు కదుపుతోంది. కానీ కాంగ్రెస్‌లో ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండటం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పర్యటిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్‌ను గురువారం గాంధీభవన్ వద్ద ఆశావహులు చుట్టుముట్టారు. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆజాద్.. టికెట్ల విషయం తర్వాత అని.. ముందు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇంత ముందుగా టికెట్లు ఇవ్వడం కుదరదని అన్నారు. టికెట్ల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగటం కాదని.. నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారు. సీనియర్లు అయి, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తే.. పార్టీనే పనితీరు గుర్తించి టికెట్లు ఇస్తుందని తెలిపారు. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు పార్క్ హయత్‌లో బస చేసిన ఆజాద్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు భేటీ అయ్యారు. బుధవారం ప్రకటించిన ప్రచార కమిటీ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రచార కమిటీ చైర్మన్ వస్తుందని ఆశించానని వీహెచ్ తెలిపారు. 1989లో ప్రచార కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన సమర్ధుడినని అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోవర్టులున్నారని.. తనకు పదవి ఇస్తే కేసీఆర్‌ను ఓడిస్తానని కోవర్టులు భయపడుతున్నారని ఆరోపించారు. కోవర్టులే తనకు పదవి రాకుండా చేశారని విమర్శించిన ఆయన.. త్వరలో వారి పేర్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు చెబుతానని అన్నారు. కాగా నిన్న ప్రకటించిన కమిటీల్లో.. పార్టీ వ్యూహరచన, ప్రణాళిక రూపకల్పన కమిటీ చైర్మన్ బాధ్యతలను వీహెచ్‌కు అప్పగించారు మరోవైపు టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలిసి మహా కూటమిగా ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్న కాంగ్రెస్ పొత్తుల తర్వాతే టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న కొందరు నేతలు కూటమి వల్ల తమకు టికెట్ దక్కకుండా పోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఈ శతాబ్దపు అతి పెద్ద స్కాం’
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చేసుకున్న రాఫెల్ ఒప్పందం 21వ శతాబ్దపు అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ జాతీయ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో చర్చించకుండా, కనీసం రక్షణ శాఖ మంత్రికి కూడా తెలియకుండా తన ఇష్టానుసారంగా రాఫెల్ డీల్ చేశారని ఆరోపించారు. రాఫెల్ డీల్ గురించి అజాద్ చెప్పిన పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నోరు మెదపని ప్రధాని ‘దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కేంద్రప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రశ్నిస్తున్నా రాఫెల్ పై సమాదానం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఎక్కడైనా నో అన్సర్. గతంలో ఏ ప్రధానియైనా ఆరోపణలు వస్తే వాటిపై స్పందించారు. కానీ తొలిసారి ఈ ప్రధాని మాత్రం నోరు మెదపటం లేదు. హైదరబాద్ నా రెండవ ఇళ్లు. అందుకే ఇక్కడ మీడియాతో రాఫెల్ ఒప్పందం గురించి పూర్తి వివరాలు వివరిస్తున్నా. చైనా బలపడుతోంది, పాకిస్తాన్ మరింత వైరుధ్యం పెంచుకొంటోంది. ఈ రెండు ప్రమాదమే అందుకే యూపీఏ హయాంలో డిఫెన్స్ కౌన్సిల్ ఆయుదాలకొనుగోలు చేయాలని తెలిపింది. అందులో 126 యుద్ద విమానాల అవసరం అని తెలపగా టెండర్లకు 6 కంపెనీలు పాల్గొన్నాయి. 8 రెడీ గా ఉన్నవి, 108 మన దేశంలో తయారుచేసేలా ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందం జరిగింది. మేము ఒక్కో విమానానికి 523 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. 108 యుద్ద విమానాలు మన దేశంలో తయారు చేసేలా హిందుస్తాన్ ఏరో నాట్స్, ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఒప్పందం కూడా జరిగి పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఏప్రిల్ 2015 లో మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ మీడియాతో విమానాల కొనుగోళ్లపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే తర్వాత తేలిందేంటంటే పాత అగ్రీమెంట్ రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. అది డిఫెన్స్ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి ఇతరులెవరికీ తెలియదు. కేవలం మన ప్రధాని ఫ్రాన్స్ ప్రభుత్వానికి తప్ప ఎవరికి తెలియదు. మేం 523 కోట్లకు చేసిన డీల్ సేమ్ అదే విమానానికి 1670 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. హిందుస్తాన్ ఏయిర్ క్రాఫ్ట్ తో ఉన్న అగ్రిమెంట్ సైతం రద్దు చేసి మరో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. యూపీఏ హయాంలో లక్ష రూపాయలు అవినీతి జరిగినా పెద్ద అంశమే.. డిఫెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన 127 విమానాల కొనుగోలును అప్పుటి మన్మోహన్ ప్రభుత్వం అంగీకరిస్తే.. ఎవరినీ సంప్రదించకుండా మోడీ ఎలా వాటిని 36 చాలు అని నిర్ణయిస్తారు. కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు.. కనీసం ప్రకటించేంత వరకు దానిపై ప్రధాని సంతకం కూడా జరగలేదు. 36 యుద్దవిమానాలకు అధనంగా 41 వేల కోట్లు చెల్లించారు. 21 వ శతాబ్దంలో ఇది అత్యంత పెద్ద స్కాం. 4060 పైగా విమానాలు తయారు చేసిన ప్రభుత్వ సంస్థను కాదని, హెచ్ఈఎల్ కంపెనీని కాదని కనీసం రిజిస్ట్రేషన్ కూడా జరగని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. టెండర్ దక్కిన తర్వాతే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది. యూపీఏ హయాంలో లక్ష రూపాయాల అవినీతి చాలా పెద్ద అంశం.. అదే ఎన్డీఏ ప్రభుత్వంలో 25 వేల కోట్ల పై కూడా లెక్క లేకుండా పోయింది. వాళ్ల పొట్టలు పెద్దవి అందుకే బాగా తింటున్నారు’అంటూ నరేంద్ర మోదీ నియంతృత్వ ధోరణిపై ఆజాద్ నిప్పులు చెరిగారు. -
ఆజాద్ రాష్ట్ర పర్యటన వాయిదా
సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ప్రమాద నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలంగాణ పర్యటన వాయిదా పడిందని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చి, సాయంత్రం సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం రాత్రి హైదరాబాద్‌లోనే బసచేసి గురువారం ఉదయ్‌పూర్ వెళ్లాల్సి ఉంది. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగి 57 మంది మృతి చెందడంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభ మాత్రం యథావిధిగా జరగనుంది. ఇక ఈ నెల 18న ఆజాద్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నేడు కొండగట్టుకు టీపీసీసీ బృందం కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ బృందం బుధవారం కరీంనగర్ జిల్లాకు వెళ్లనుంది. -
కాంగ్రెస్-టీడీపీ మధ్య డీల్ ఏమైనా కుదిరిందా?
-
కశ్మీర్‌పై సంచలన ప్రకటన
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌పై ఉగ్రసంస్థ లష్కరే తాయిబా సంచలన ప్రకటన చేసింది. కశ్మీర్లో గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ గురువారం ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల మూలంగా కశ్మీర్లో నరమేధం జరిగే అవకాశం ఉందని అభిప్రాయడింది. లష్కరే చీఫ్ మహ్మద్ షా పేరిట గురువారం ఓ మెయిల్ భారత మీడియా ఛానెళ్లకు చేరింది. (ముష్కరుల ఏరివేత కోసం...) ఇది నరమేధమే... ‘మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్ సహా మిగతా నేతలు అభిప్రాయాలతో మేం ఏకీభవిస్తున్నాం. ఇకపై అమాయకులైన కశ్మీరీలు పెద్ద సంఖ్యలో మరణిస్తారు. వారిని ఊచకోత కోసేందుకే గవర్నర్ పాలన విధించారు. మళ్లీ జగ్మోహన్ (1990లో కశ్మీర్ మాజీ గవర్నర్) రోజులను గుర్తుకు తెస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనిక చర్య దిగుతోంది. ఆపరేషన్ ఆల్అవుట్ పేరిట కశ్మీరీలను చంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 8 లక్షల మంది సైనికులు జమ్ములో అరాచకాలకు పాల్పడుతున్నారు. కశ్మీర్ లోయలో ప్రజలు బానిసలుగా బతుకుతున్నారు. జర్నలిస్ట్ బుఖారీ భారత దళాల ప్రధాన అజెండాలను బయటపెట్టేందుకు యత్నించారు. ఆరెస్సెస్ ఎజెండాను తీసికెళ్లడంలో పీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన వంతు ప్రయత్నం చేశారు. కశ్మీర్‌పై ఐరాస మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదిక ప్రత్యేకం, ఆలస్యమైన ఐరాస అసలు విషయాన్ని గమనించింది. అయితే అక్కడి దుస్థితిని వివరించేందుకు ఈ ఒక్క నివేదిక సరిపోదు’’అని మీడియా సంస్థలకు పంపిన ఈమెయిల్లో దుయ్యబట్టారు. ఈ పరిణామం రాజకీయంగా వివాదాన్ని రేపుతోంది. కాంగ్రెస్‌కు లష్కరే లాంటి ఉగ్రవాదసంస్థలు కొమ్ముకాస్తున్నాయని బీజేపీ ధ్వజమెత్తింది. ఆజాద్ ఏమన్నారంటే... ‘ఉద్ధృతమైన మిలటరీ ఆపరేషన్ అంటే అమాయకుల ఊచకోతే. ఎందుకంటే ఉగ్రవాదుల కంటే ప్రజలనే ఎక్కువ సంఖ్యలో సైనిక, పారా మిలటరీ దళాలు చంపుతున్నాయి. సగటున నలుగురు టెర్రరిస్టులకు 20 మంది ప్రజలను హతమారుస్తున్నారు. పుల్వామాలో ఒక్క ఉగ్రవాదిని చంపడానికి 13 మంది ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. ఆర్మీ బలగాల చర్యలు సామాన్యుల పాలిటే వ్యతిరేకంగా ఉన్నాయి. ‘ఆలౌట్ ఆపరేషన్’ అంటూ బీజేపీ ఉపయోగిస్తున్న భాష నరమేధం దిశగా ఆ పార్టీ నేతల ప్రణాళికను సూచిస్తోంది. ’’ అని వ్యాఖ్యానించి గులాంనబీ అజాద్ దుమారం రేపారు. -
కర్ణాటక రాజకీయం: అజాద్ ఎత్తుగడలు
-
ఇది వారి విజయమే.. ధన్యవాదాలు: ఆజాద్
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. ప్రచారం నుంచి మొదలు పెడితే ఫలితాలు, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం వరకు గంటకో మలుపు తిరిగాయి. శనివారం ఎట్టకేలకు వాటికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి యడ్డీ అవిస్వాస తీర్మానానికి ముందుగానే రాజీనామా చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. అధికారం దక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సామభేదదండోపాయాలను ప్రయోగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ సభ్యులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వందల కోట్లు, పదవులను బీజీపీ ఎరగా వేసినా.. తమ పార్టీల ఎమ్మెల్యేలు 117 మంది ఒకేతాటిపై ఉన్నారని ఆజాద్ తెలియచేశారు. 15 రోజుల నుంచి రెండు రోజులకు బలనిరూపణ వ్యవధి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండు వారాల సమయంలో బీజేపీ నేతలు ఫిరాయింపులను ప్రోత్సహించేవారిని ఆరోపించారు. బీజేపీకి బలం లేని కారణంగానే గవర్నర్ రెండు వారాల గడువు ఇచ్చారని విమర్శించారు. ప్రస్తుతం ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగం, సుప్రీంకోర్టు విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గవర్నర్ నుంచి కుమారస్వామి పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని, గవర్నర్ ముందున్న కర్తవ్యం అదేనని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల విజయమని అని చెప్పిన ఆజాద్, వారికి సోనియా, రాహుల్ గాంధీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
ఇది కన్నడ ప్రజల విజయం
-
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమానం నిలిపివేత
సాక్షి, బెంగళూరు: కర్టాటక కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రయాణించాల్సిన విమానాన్ని గంటలపాటు నిలిపివేసిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని శిబిరానికి వచ్చేందుకుగానూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, ఆరుగురు తాజా ఎమ్మెల్యేలు కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆసీనులయ్యారు. కానీ.. విమానం టేకాఫ్ అయ్యేందుకు అధికారులు అనుమతించలేదు. దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యేలు, నేతలు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో కలవరం పెరిగిపోయింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే విమానాన్ని నిలిపివేశారేమోనన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అందుకే బస్సుల్లో వచ్చారు..: కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం రాత్రి కూడా సరిగ్గా ఇలానే జరిగింది. ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలనుకున్నా, అందుకు ఎయిర్‌పోర్టు అధికారులు నిరాకరించడంతో చివరికి బస్సుల్లో తరలించారు. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి నేతలు శుక్రవారం బయలుదేరారు. గంటల నిరీక్షణ అనంతరం.. విమానానికి అనుమతి దొరకడంతో నేతలు హైదరాబాద్ వైపునకు ఎగిరివెళ్లారు. తాజ్‌కృష్ణలో సీఎల్పీ భేటీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శనివారం కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో సీఎల్పీ సమావేశం జరుగనుంది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరమైన హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్లోనే సాయంత్రం 5గంటలకు సీఎల్పీ భేటీ జరగనుంది. రేపటి బలపరీక్షలో సభ్యులు అనుసరించాల్సిన విధానంపై సీనియర్లు సూచనలు చేయనున్నారు. -
బీజేపీని ఆహ్వానిస్తే.. ప్రలోభాలకు తెరతీసినట్లే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక గవర్నర్ ఒకవేళ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆయన రాజకీయ ప్రలోభాలకు, బేరసారాలకు, అవినీతికి, పార్టీల ఫిరాయింపులకు బహిరంగంగా తెరతీసినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన మెజారిటీ కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఉందని తెలిపారు. గవర్నర్ వజూభాయి వాలాతో మంగళవారం భేటీఅయిన తర్వాత ఆజాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించరాదన్నారు. ఏకైక అతిపెద్ద పార్టీ అయినంత మాత్రాన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం కుదరదని గోవా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. చిన్నపార్టీల సాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మద్దతు తమకు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేడీఎస్ గవర్నర్ వజూభాయి వాలాకు లేఖ రాసింది. గవర్నర్‌కు మరో మార్గంలేదు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు జేడీఎస్–కాంగ్రెస్ కూటమిని ఆహ్వానించటం తప్ప గవర్నర్ వజూభాయి వాలాకు మరోమార్గం లేదని కాంగ్రెస్ పేర్కొంది. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తిప్పికొట్టారు. మొత్తం 222కు గాను 115 సభ్యుల బలమున్న ఈ కూటమికి ప్రభుత్వ ఏర్పాటులో అవకాశమివ్వటం రాజ్యాంగ, న్యాయసూత్రాల ప్రకారం సరైందేనన్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ అధికారం చేపట్టలేదన్నారు. 1998లో పార్లమెంట్లో సంఖ్యాపరంగా ఎక్కువ బలమున్న అటల్ బిహారీ వాజ్‌పేయి కూటమికే అప్పటి రాష్ట్రపతి నారాయణన్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించి, మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారని గుర్తు చేశారు. -
మోదీ ‘శునక’ వ్యాఖ్యలు.. ఆజాద్ పొగడ్తలు
శివమొగ్గ: రసవత్తరంగా సాగుతోన్న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నేతలు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒకదిక్కు ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్‌పై, సోనియా, రాహుల్ గాంధీలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తే... ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ నేతలు మాత్రం బీజేపీ మాజీలను పొడగ్తలతో ముంచెత్తారు. నాటి నేతలతో పోల్చుతూ నేటి మోదీ దేశంపై విషం చిమ్ముతున్న తీరును వివరించారు. ఆదివారం శివమొగ్గలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష గులాం నబీ ఆజాద్.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని ఆకాశానికెత్తేశారు. ‘‘వాజపేయి పాలనలో విద్వేషపు దాడులుగానీ, దళితులపై అకృత్యాలుగానీ లేకుండేవి. అందరి కిచెన్లలోకి చొరబడటంగానీ, తినే ఆహారంపై దాడులు చేయడంగానీ జరిగేవికావు. నిజంగా ఆ రోజులే వేరు. కానీ ఇప్పటి ప్రధాని అలా కాదు. విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు’’ అని ఆజాద్ పేర్కొన్నారు. ఆదివారం హుబ్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. భారతీయ సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటకకు చెందిన ముధోల్ శునకాల నుంచైనా కాంగ్రెస్ పార్టీ దేశభక్తి నేర్చుకోవాలంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆ శునకాల నుంచైనా నేర్చుకోండి!) -
భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు విపక్షాల డిమాండ్
-
సీజేఐపై అభిశంసన; సంచలన పరిణామాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన వ్యవహారంలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విపక్షాలు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఏడు పార్టీలకు చెందిన సుమారు 71 మంది ఎంపీలు అభిసంశన నోటీసులపై సంతకాలు చేశారు. సదరు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. జస్టిస్ లోయా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నట్లైంది. పిటిషన్లను కొట్టేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ దుర్దినంగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. సీజేఐ దీపక్ మిశ్రాపై నలుగురు సీనియర్ జడ్జిలు తిరుగుబావుటా ఎగరేసిన సందర్భంలోనే అభిశంసన అంశం తెరపైకి వచ్చినా, విపక్షాల్లో ఏకాభిప్రాయం కొరవడటంతో అది ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు ఒక్కతాటిపైకి రావడంతో తీర్మానానికి బలంపెరిగినట్లైంది. అభిశంసన వార్తలపై నిషేధం!: చీఫ్ జస్టిస్‌పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిశంసన గురించి సమాజంలో చర్చ జరుగడం దురదృష్టకరమని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో సదాభిప్రాయం సన్నగిల్లే ప్రమాదం ఉందని, కాబట్టి అభిశంసనకు సంబంధించిన అన్ని వార్తలను నిషేధించడమే ఉత్తమమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రభుత్వ న్యాయాధికారుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని భావిస్తున్నది. అది జరిగేపని కాదు: కాగా, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన జరిగేపని కాదని మాజీ అటార్నీ జనరల్ సొలి సొరబ్జీ అన్నారు. ‘చెప్పిన తీర్పుల ఆధారంగా ఒక న్యాయమూర్తిపై అభిశంసన పెట్టడం కుదరదు. ఆ జడ్జి అనుచితంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దానిపై రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారు’ అని సొరబ్జీ పేర్కొన్నారు. -
‘రాజకీయ నాయకులు రిటైర్మెంట్ కోరుకోరు’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు రిటైర్మెంట్ కోరుకోరని కాంగ్రెస్ సీనియర్ నేత గులాబ్ నబి ఆజాద్ అన్నారు. ఆయన బుధవారం సభలో మాట్లాడుతూ.. రాజ్యసభ కాల పరిమితి ముగిసిన ఎంపీలను గురించి పై విధంగా వ్యాఖ్యానించారు. పదవీ కాలం ముగిసిన రాజ్యసభ సభ్యులను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కలుస్తూనే ఉంటామని తెలిపారు. రిటైర్ అవుతున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కే.పరసరన్, దిలీప్ కుమార్ టిర్కీ, సచిన్ టెండూల్కర్, కురియన్ల పదవీ కాలం నేటితో ముగియనున్నది. -
పది పార్టీలు పోరాడుతున్నా పట్టించుకోరా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు జరుగుతున్న ఆందోళనలను మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ విమర్శించారు. రాజ్యసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ... పది పార్టీలు ఒకే అంశంపై పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తక్షణం చర్చ చేపట్టి ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆజాద్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. తమను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఎదురుదాడి చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా ఇప్పుడు తమను అడుగుతారా అని ప్రశ్నించారు. కాగా, ప్రత్యేక హోదా అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. -
రాహుల్ కోసం 80 మంది
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఉన్నత శిఖరాలకు చేరుతుందని సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ రాహుల్ తన నాయకత్వ పటిమను ఇప్పటికే నిరూపించుకున్నారన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఒక్క రాహుల్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహా 80 మంది మంత్రులు ప్రచారం చేస్తున్నారని ఏద్దేవా చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ సోమవారం ప్రకటన చేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా డిసెంబర్ 16 న బాధ్యతలు చేపట్టనున్నారు. -
టెలివిజన్ ప్రధాని.. మోదీపై విసుర్లు!
సాక్షి, మీరట్ : నరేంద్ర మోదీ కేవలం టీవీల్లో కనిపించే ప్రధానమంత్రి అని సీనియర్ కాంగ్రెస్ లీడర్ గులాంనబీ ఆజాద్ తీవ్రంగా విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 100వ జయంతి ఉత్సవాల నిర్వహణ సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రధాని మోదీ పదేపదే ప్రశ్నిస్తున్నారు.. అసలు ఆయనకు చరిత్ర తెలుసా? అని నేను ప్రశ్నిస్తున్నాను అని ఆజాద్ అన్నారు. 1940లో దేశ జనాభా కేవలం 20 కోట్లు.. ఆ సమయంలో వచ్చిన కరువు కాటకాలతో ఒక్క బెంగాల్లోనే 10 లక్షల మంది చనిపోయారు.. ఇది స్వతంత్రం రాకముందు దేశం పరిస్థితి.. ఈ 70 ఏళ్లలో కరువును అధిగమించి.. దేశానికి ఆహారం అందించే స్థాయినుంచి ఎగుమతులు చేసే స్థాయికి కాంగ్రెస్ ప్రధానులు చేర్చారు.. అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తానని మోదీ హమీ ఇచ్చారు.. ఆయన అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల 15 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని ఆజాద్ విమర్శించారు. నరేంద్రమోదీ టీవీల్లో కనిపించే ప్రధానమంత్రి మాత్రమే.. కానీ కాంగ్రెస ప్రధానులు ప్రజల మధ్య తిరిగే వారు.. అందుకే ప్రజావసరాలు తీర్చారు అని ఆజాద్ చెప్పారు. నాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన హరిత విప్లవమే.. నేడు దేశానికి అన్నం పెడుతోందని ఆజాద్ అన్నారు. -
రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటనపై అసహనం
- రామ్‌నాథ్‌కు మద్దతుపై ఇప్పుడే చెప్పలేం: కాంగ్రెస్ నేత ఆజాద్ న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చేది లేనిది ఇప్పుడే చెప్పబోమని ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రామ్‌నాథ్ అభ్యర్థిత్వంపై తక్షణమే స్పందించబోమని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ తన అభ్యర్థి పేరును ప్రకటించిన తీరుపై ఒకింత అసహనం వెళ్లగక్కారు. ‘రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించడానికి ముందు మమ్మల్ని(విపక్షాన్ని) సంప్రదిస్తామని బీజేపీ చెప్పింది. సోనియా గాంధీతో బీజేపీ త్రిసభ్య కమిటీ భేటీ జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ చెప్పినదానికి విరుద్ధంగా.. ఏకపక్షంగా పేరును వెల్లడించారు’ అని గులాం నబీ ఆజాద్ చెప్పారు. రామ్‌నాథ్ కోవింద్‌కు పోటీగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి నిలపాలా లేదా అనే దానిపై రెండు రోజుల్లో జరగనున్న సమావేశంలో విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రస్తుత బిహార్ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత అయిన రామ్‌నాథ్ కోవింద్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవింద్ స్వస్థలం యూపీలోని కాన్పూర్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు -
తలాక్‌పై రాజకీయాలు చేయొద్దు
ముస్లిం సమాజాన్ని జాగృతం చేయటం ద్వారానే మార్పు ► ఇస్లాంలోని మేధావులు ఈ దిశగా ప్రయత్నించాలి ► బసవ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పిలుపు ► 700ఏళ్ల క్రితమే సామాజిక దురాచారాలపై బసవన్న పోరాడారని ప్రశంస న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం మానేయాలని ముస్లింలను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ముస్లిం సమాజాన్ని జాగృతం చేయటం ద్వారానే ట్రిపుల్ తలాక్‌కు చరమగీతం పాడొచ్చని అభిప్రాయపడ్డారు. కన్నడ తత్వవేత్త బసవేశ్వర జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ట్రిపుల్ తలాక్ కూడా అలాంటిదే. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని మిమ్మల్ని (ముస్లింలను) కోరుతున్నాను. దీనికో పరిష్కారం కోసం ఆలోచించండి. తరతరాలు మిమ్మల్ని గుర్తుంచుకునేలా ఈ పరిష్కారం చాలా గొప్పగా ఉండాలి’ అని కోరారు. సమాజంలో కాలదోషం పట్టిన విధానాలను నిర్మూలించి సరికొత్త నూతన వ్యవస్థను నెలకొల్పటం ద్వారానే ప్రభావవంతమైన వ్యక్తులు పుట్టుకొస్తారని ప్రధాని అన్నారు. భారతీయ ముస్లింలు కేవలం మన దేశానికే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఆధునిక మార్గాన్ని చూపించేందుకు ముందుండి నడవాలన్నారు. ‘ఈ దేశం మనకిచ్చే అద్భుతమైన శక్తి సామర్థ్యాలు అవే’ అని మోదీ అన్నారు. ఆనాడే సమానత్వంపై.. బసవేశ్వరుడు మహిళా సాధికారత, సమానత్వం, సుపరిపాలన వంటి మహోన్నత ఆదర్శాలను పాటించారని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. ‘ముస్లిం సమాజం నుంచి కూడా మేధావులు, గొప్ప వ్యక్తులు బయటకొచ్చి ట్రిపుల్ తలాక్‌కు చరమగీతం పాడతారని నేను నమ్ముతున్నాను. ముస్లిం సోదరీమణులు, తల్లులకు ఈ కష్టం నుంచి విముక్తి కల్పిస్తారని భావిస్తున్నాను. మార్పు కోరుకునే ముస్లింలే ఈ బాధ్యతను తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. బసవేశ్వరుడు చేసిన 2500 ధార్మిక ప్రవచనాలను ‘వచన్’ పేరుతో ముద్రించిన గ్రంథాన్ని ప్రధాని విడుదల చేశారు. ఈ వచన్ను 23 భాషల్లో తర్జుమా చేశారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బలమైన లింగాయత్ సామాజిక వర్గం ఐకాన్ అయిన బసవ జయంతి కార్యక్రమానికి మోదీ హాజరవటం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సబ్ కా సాథ్, సబ్కా వికాస్’ నినాదం ద్వారా ఎవరిపైనా వివక్ష లేకుండా అందరినీ అభివృద్ధి చేస్తామని మోదీ పునరుద్ఘాటించారు. చరిత్రను విస్మరిస్తున్న యువత: దాదాపు 40 నిమిషాలసేపు ప్రసంగించిన మోదీ.. నేటి యువత భక్తి ఉద్యమం నడిపిన గొప్ప వ్యక్తులను విస్మరిస్తోందన్నారు. ‘మన విద్యావ్యవస్థలోని లోపమో లేక మన వారసత్వాన్ని మరిచిపోయే స్వభావమో తెలియదు కానీ.. బసవన్న వంటి సంఘ సంస్కర్త 700 ఏళ్ల క్రితం చెప్పిన మహిళా సాధికారతకు మద్దతు పలికిన విషయాన్ని నేటి యువత తెలుసుకోలేకపోతోంది’ అని ప్రధాని తెలిపారు. మన దేశం మహా పురుషులు, గొప్ప సంఘ సంస్కర్తలతోనే పరివర్తన చెందిందన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ‘మహామహులైన విదేశీయులను ఓడించిన దేశంగానే కాదని, సుపరిపాలన, అహింస, సత్యాగ్రహం వంటి గొప్ప సందేశాలను భారత్ ప్రపంచానికి ఇచ్చింది’ అని అన్నారు. 1964లో బసవ సమాజాన్ని స్థాపించిన మాజీ ఉపరాష్ట్రపతి బీడీ జట్టికి ఈ సందర్భంగా మోదీ నివాళులర్పించారు. హత్యకు గురైన కన్నడ రచయిత, హేతువాది కల్బుర్గి కుటుంబ సభ్యులను కలిశారు. మీరే రాజకీయం చేస్తున్నారు: విపక్షాలు న్యూఢిల్లీ: ప్రధాని ట్రిపుల్ తలాక్‌పై చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. మోదీ, బీజేపీలే ఎన్నికల్లో లాభం కోసం ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై మోదీ మాట్లాడాలని ఎస్పీ నేత ఆజంఖాన్ అన్నారు. గోరక్ష దళాల దాడుల్లో భర్తలను కోల్పోతున్న ముస్లిం మహిళల ఆందోళనను పట్టించుకోవాలన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడకూడదని జేడీయూ నేత శరద్‌యాదవ్ అన్నారు. -
ప్రియాంక.. చాలానే చేశారు!
ఐదు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం ముగిసింది. ఇక రెండు రోజుల్లో జాతకాలు కూడా బయటపడతాయి. ఇప్పటివరకు ప్రచారంతో పాటు ఎన్నికల మంత్రాంగంలో తలమునకలుగా ఉన్న నాయకులంతా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు తమ మనసులో మాటలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల కంటే ఈసారి ఉత్తరప్రదేశ్ మీదే ఎక్కువ మంది దృష్టి సారించారు. ఏడు దశల్లో జరిగిన యూపీ ఎన్నికల్లో అధికార పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కేవలం అమేథీ, రాయ్బరేలీలకే పరిమితం కాకుండా యావత్ యూపీలో ప్రచారం చేయాలని ముందునుంచి డిమాండ్లు వచ్చాయి. కానీ ఆమె చాలా తక్కువగా మాత్రమే కనిపించారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించిన ప్రియాంక.. ప్రచారంలో మాత్రం అంతగా కనిపించలేదు. అయితే.. ఆమె కేవలం భౌతికంగా వచ్చి ప్రచారం చేయడం మాత్రమే కాదని.. ఇంకా చాలా చేశారని పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అంటున్నారు. ఆమె ఎన్నికల మేనేజ్మెంట్, పర్యవేక్షణ లాంటి ప్రధానమైన కార్యక్రమాలు చూసుకున్నారని తెలిపారు. దాంతో పాటు నాయకులను సమన్వయం చేసుకోవడం, రాష్ట్రవ్యాప్తంగా వాళ్లతో పనిచేయించడం లాంటివన్నీ ఆమే చూశారట. ఇవన్నీ ఢిల్లీ నాయకత్వం పర్యవేక్షణలోనే జరిగాయని.. ప్రియాంక యూపీ ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొన్నారని గులాం నబీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర బీజేపీ నాయకులు కులమతాల ఆధారంగా ఓటర్లను చీల్చేందుకు శాయశక్తులా ప్రయత్నించినా అది వారికి సాధ్యం కాలేదని విమర్శించారు. తాను యూపీలో పలువురు హిందువులతో మాట్లాడానని, వాళ్లంతా కూడా మోదీ వ్యాఖ్యలను ఖండించారని చెప్పారు. ఒకప్పుడు బద్ధశత్రువులైన సమాజ్‌వాదీ, కాంగ్రెస్ ఇప్పుడు ఎలా కలిసి పనిచేశాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తుల కన్నా చాలా మెరుగ్గా ఉందని ఆజాద్ సమాధానమిచ్చారు. తమ కూటమి విజయం సాధించడం ఖాయమని.. 2014 నాటి సంగతి వేరు, ఇప్పటి సంగతి వేరని చెప్పారు. -
‘సోనియాకు ఏంకాలేదు.. అంత సీరియస్ కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ ప్రచారం ఉండబోదంట. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. మంగళవారం బెనారస్‌లో మీడియాతో ఆజాద్.. పార్టీ తరుపున మొత్తం ఎన్నికల నిర్వహణ బాధ్యతలు ప్రియాంకనే చూసుకుంటున్నారని, అందువల్ల ఆమెకు ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని అన్నారు. సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ప్రచారం చేయబోరని చెప్పారు. సోనియాకు ఏమైంది అని ప్రశ్నించగా అంతపెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తీవ్ర సమస్యేం కాదని సమాధానం దాట వేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్, రాహుల్ ఇద్దరూ సమానమేనని, రాహుల్ రెండో నేత కాదని స్పష్టం చేశారు. వారు ఎక్కడికి వెళ్లినా ఉమ్మడిగానే వెళుతున్నారని, కలిసి పనిచేస్తూ తమ కూటమి గెలుపుకోసం కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తాము అనుకోలేదని, ప్లేయర్ల మాదిరిగానే ఉండాలని బరిలోకి దిగినట్లు చెప్పారు. -
2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ఎస్పీ దోస్తీ: ఆజాద్
కాన్పూర్: కాంగ్రెస్, ఎస్పీల కూటమి 2019 ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, ఇతర లౌకిక పార్టీలు కూడా ఇందులో చేరతాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు. బీఎస్పీ కూడా ఈ మహా కూటమిలో చేరుతుందా? అని అడిగినపుడు.. బీజేపీతో పోరాడటానికి తమతో కలిసిరావాలని అన్ని లౌకిక పార్టీలను కోరుతున్నట్లు తెలిపారు. యూపీలో లౌకిక పునాదులు బలోపేతం కావాలంటే కలసిసాగాలని కాంగ్రెస్, ఎస్పీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి పోటీచేస్తే బీజేపీ 10–15 సీట్లకే పరిమితమవుతుందని చెప్పారు. మోదీ ప్రధాని అయినా కూడా ఆ హోదాకు తగిన పరిపక్వత ఆయనలో లోపించిందని ఆరోపించారు. బహుశా అందు వల్లే ఆయన ప్రసంగాలు దిగజారుతున్నాయని తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–ఎస్పీ కూటమికి తిరుగులేదని, ఇప్పటి వరకు పోలింగ్ జరిగిన చోట్లలో తొలిస్థానంలో ఉందని పేర్కొన్నారు. చివరికి కనీసం 275 సీట్లు గెలిచి అఖిలేశ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
నోట్లరద్దు ప్రభుత్వ వైఫల్యమన్న ఆజాద్ ► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చ న్యూఢిల్లీ: నల్లధనంపై పోరాటం కోసం కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం పూర్తి వైఫల్యమని, దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని రాజ్యసభలో విపక్షాలు విమర్శించాయి. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి నోట్లరద్దును మెచ్చుకున్నారు. కానీ.. దేశంలో అవినీతి, నల్లధనం, ఉగ్రవాదాన్ని ఆపటంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. మోదీ సర్కారు దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది. 2016 సంవత్సరం ప్రజలకు మానసిక ఒత్తిడిని, మాంద్యాన్ని, వెనుకబాటుతనాన్ని, కుంగుబాటును మిగిల్చింది’ అని విమర్శించారు. నోట్లరద్దు అమలుకోసం 135 సర్క్యులర్లు విడుదల చేసినా.. ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం కలిగించేలా మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ‘నవంబర్ 8న మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేనా రైతు సంక్షేమమంటే?’ అని ఆజాద్ ప్రశ్నించారు. ‘మేం సర్జికల్ దాడులను సమర్థిస్తాం. ప్రభుత్వం మరిన్ని సర్జికల్ దాడులు చేసినా మా మద్దతుంటుంది. కానీ ఈ దాడుల్లో ఎంతమంది పోయారని ప్రశ్నిస్తే మమ్మల్ని దేశద్రోహులంటున్నారు’ అని తెలిపారు. అటు సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు పలు పక్షాలు కూడా నోట్లరద్దు విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అంతకుముందు న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. యూపీఏ అవినీతినుంచి భారత్ రూపాంతరం చెందుతోందన్నారు. -
ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఆజాద్!
-
ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఆజాద్!
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుకు ఇంకా సమయముందంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆచితూచి స్పందిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మౌనాన్ని వీడింది. యూపీలో ఎస్పీతో పొత్తు పెట్టుకోబోతున్నామని విస్పష్టంగా తెలిపింది. ఎస్పీలో కుటుంబ తగాదాకు తెరపడి.. అఖిలేశ్ వర్గానికి సైకిల్ గుర్తు కేటాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ప్రకటన చేసింది. ’రానున్న యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీ పొత్తు పెట్టుకోనున్నాయి’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఈ పొత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో కాంగ్రెస్-ఎస్పీ కూటమి ఎన్నికలను ఎదుర్కొంటుందని, కూటమి నాయకుడైన అఖిలేశ్ సీఎం అభ్యర్థిగా ఉంటారని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే, ఈ కూటమిలో మరిన్ని చిన్న పార్టీలను చేర్చుకునే విషయమై ఆయన ఏమీ చెప్పలేకపోయారు. మహాకూటమి ఏర్పాటు గురించి మున్ముందు ఆలోచిస్తామని, ప్రస్తుతానికి కాంగ్రెస్-ఎస్పీ పొత్తు కుదిరిందని ఆయన అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షితను ప్రకటించినప్పటికీ.. సీఎం అభ్యర్థిగా తప్పుకొనేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఒక్క కుటుంబమే బాగుపడుతోంది
తెలంగాణలో అభివృద్ధి లేదు: గులాంనబీ ఆజాద్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అభివృద్ధి జర గట్లేదని, ఒక్క కుటుంబమే బాగుపడుతోం దని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ సారథ్య సంఘం ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మది న వేడుకలు జరిగారుు. ఈ సందర్భంగా పేద లు, రైతులు, మహిళలు, కార్మికుల అభివృద్ధి జరగట్లేదని ఆజాద్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర లేదన్నారు. ‘కాం గ్రెసే తెలంగాణను ఏర్పాటు చేసింది. అరుు నా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని మేం నెరవేర్చాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని ఆజాద్ అన్నారు. ‘సోనియా పుట్టినరోజు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు విశేష పండు గ. తెలంగాణ తల్లిగా ఆమె గౌరవాన్ని వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాం’ అని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, మోతీలాల్ వోరాతో పాటు వంద మంది తెలంగాణ మానిటరింగ్ గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సోనియా ని వాసానికి వెళ్లి తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేత లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజీవ్‌జ్యోతి సద్భావన కమిటీ చైర్మన్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోనియాగాంధీని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. -
రాష్ట్రంలో ఒక్క కుటంబంలోనే అభివృద్ధి
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేవలం ఒక్క కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ప్రజల డిమాండ్ అర్థం చేసుకుని కాంగ్రెస్ అధిస్టానం తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని, అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినా కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోవడం దురదృష్టకరమని ఆజాద్ పేర్కొన్నారు. -
‘మన నిబంధనలతో మనమే దాడిచేశాం’
ముంబై: పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను శివసేన సమర్థిచింది. ఆజాద్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన నిజాలు మారిపోతాయా అని శివసేన అధికారిక పత్రిక సామ్న ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది. ఉడీ ఘటనలో 20 మంది జవాన్లు మృతి చెందితే.. నోట్ల రద్దుతో క్యూల కారణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారని సామ్న వెల్లడించింది. ఉడీలో జవాన్లపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేస్తే.. దేశంలోని సామన్యులపై మన నిబంధనలతో మనమే దాడులు చేశామని శివసేన పేర్కొంది. ఉడీ ఉగ్రవాద దాడి మృతులకన్నా నోట్ల రద్దు మృతులే ఎక్కువని గురువారం రాజ్యసభలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఆజాద్ వ్యాఖ్యలు ‘దేశ వ్యతిరేకం’అని బీజేపీ పేర్కొంది. ఆజాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. -
మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
రెండో రోజూ అదే తీరు - నోట్ల రద్దుపై స్తంభించిన ఉభయ సభలు - ఆగని విపక్షాల ఆందోళన..అధికార పక్షం ఎదురుదాడి న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై వరుసగా రెండోరోజు పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. విపక్షాల వారుుదా తీర్మానంపై చర్చ, ఓటింగ్‌కోసం లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభలో నోట్ల రద్దు చర్చలో ప్రధాని పాల్గొనాలని కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆందోళన చేయటంతో.. ఉభయ సభలు శుక్రవారం ఎలాంటి చర్చ జరగకుండానే వారుుదా పడ్డాయి. లోక్‌సభలో వారుుదాకు పట్టు శుక్రవారం సభ ప్రారంభమైనప్పటినుంచీ విపక్ష సభ్యులు పోడియం చుట్టూ మూగారు. వివిధ పక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అన్ని సభాకార్యక్రమాలను రద్దుచేసి చర్చ, ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే నోట్లరద్దుపై రూల్ 56 కింద చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. ప్రభుత్వం సూచించిన రూల్ 193 కింద చర్చ (స్వల్పకాలిక) వద్దని స్పీకర్‌ను కోరారు. విపక్షాల వారుుదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. చర్చకు సిద్ధమేనని తెలిపారు. అరుునా విపక్షాల ఆందోళన తగ్గలేదు. ఈ అంశంపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని.. వారుుదా తీర్మానాల అవసరం లేదని పార్లమెంటు వ్యవహారాల మంత్రి అనంత కుమార్ స్పష్టం చేశారు. అరుునా విపక్షాలు శాంతించకపోవటంతో సభను స్పీకర్ వారుుదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే విపక్షాలు పోడియంను చుట్టుముట్టారుు. దీనిపై అనంత్ కుమార్ స్పందిస్తూ.. ‘చర్చకు సహకరించండి. నోట్ల రద్దుపై చర్చ నుంచి విపక్షం తప్పించుకోవాలని చూస్తోంద’న్నారు. రాజ్యసభకు ప్రధాని రావాలి: విపక్షాలు ఎగువ సభ ప్రారంభం నుంచే.. అధికార విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు వెల్‌లోకి చొచ్చుకుపోరుు.. ‘ఉడీ’ వ్యాఖ్యలపై ఆజాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు కూడా సభకు ప్రధాని హాజరుకావాలంటూ నినాదాలు చేశారుు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారుు. కావేరీ జలాల విడుదలపై అన్నాడీఎంకే సభ్యులు కూడా వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో సభను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వారుుదా వేశారు. మళ్లీ సమావేశం కాగానే.. ‘ఆజాద్ ప్రకటనతో ఉగ్రవాదులపై కాంగ్రె స్ సానుభూతితో ఉందనే విషయం దేశానికి అర్థమైంది. అందుకే నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న నోట్ల రద్దుపై ఆందోళన చేస్తోంది’ అని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి నఖ్వీ అన్నారు. మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ‘ఉడీ’ఘటన అమరులను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలంటున్న బీజేపీ తీరుపై కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత గులాంనబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు పెట్టే నిర్ణయం తీసుకున్నందుకు, దేశాన్ని వెనక్కు నెట్టినందుకు 125కోట్ల మందికి బీజేపీయే క్షమాపణ చెప్పాలన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీలో మూడు ప్రాంతాల్లో (మీరట్, లక్నో, వారణాసి), పంజాబ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించాలని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ నిర్ణరుుంచారు. -
కాంగ్రెస్ స్పందన కావాలంటున్న వెంకయ్య
-
కాంగ్రెస్ స్పందన కావాలంటున్న వెంకయ్య
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నానని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నోట్ల కష్టాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ చర్చ జరగడం ప్రతిపక్షానికి ఇష్టం లేనట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. పాత పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ సరైన సమయంలో వివరణ ఇస్తారని తెలిపారు. ఉడీ ఉగ్రవాద దాడి మృతులకన్నా నోట్ల రద్దు మృతులే ఎక్కువని గురువారం రాజ్యసభలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఆజాద్ వ్యాఖ్యలు ‘దేశ వ్యతిరేకం’అని బీజేపీ పేర్కొంది. ఆజాద్ క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేసింది. తాను క్షమాపణ చెప్పబోనని ఆజాద్ స్పష్టం చేశారు. -
ఉడీ కన్నా నోట్ల మృతులే ఎక్కువ!
-
'అందంగా ఉంటుందనే ప్రేమించొద్దు'
న్యూఢిల్లీ: 'అందంగా ఉంటుందని మాత్రమే కశ్మీర్ ను ప్రేమించకండి.. అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయినవారినికి కూడా ప్రేమను పంచండి' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కశ్మీరీ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. గడిచిన 32 రోజులుగా కశ్మీర్ లో అట్టుడుకుతున్న ఆందోళనలపై బుధవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన.. మిగతా భారతీయులలాగే కశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ) '32 రోజుల తర్వాతైన కశ్మీర్ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చను అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాధాలు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలిసిపోయామా?లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కశ్మీరీ కుటుంబం ఉగ్రవాద పీడను అనుభవించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. 32 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహావేశాలకు కారణం ఏదైనా కావచ్చు.. దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడైనా కశ్మీరీలకు సంఘీభావం తెలపండి. అఖిలపక్షాన్ని పంపి, పరిస్థితులు చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే.. కశ్మీరీలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతాం'అని గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీకి వినబడుతుందా? దళితులపై దాడులు, కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ సమస్యలపై పార్లమెంట్ లో కాకుండా బయటి సభల్లో స్పందించడమేమిటని ఆజాద్ ప్రశ్నించారు. 'తెలంగాణలో జరిగిన సమావేశంలో మీరు(ప్రధాని) దళితులపై దాడులను ఖండించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదు. ఆ ప్రకటనేదో ఇక్కడి నుంచే చేస్తే సబబుగా ఉండేది'అని ఆజాద్ వ్యాఖ్యానించారు. -
ప్రజలూ మీ దృష్టిలో మిలిటెంట్లేనా?
న్యూఢిల్లీ: అశాంతితో అట్టుడుకుతున్న కశ్మీర్ అంశం రాజ్యసభను కుదిపేసింది. ఈ అంశంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ కశ్మీరీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘పౌరులనూ మిలిటెంట్ల మాదిరిగా చూస్తారా’ అంటూ ఆయన ప్రశ్నించారు. ‘పౌరులను మిలిటెంట్ల మాదిరిగా చూస్తూ.. వారికి మరో ప్రత్యామ్నాయం లేకుండా చేయకండి. వ్యాలీలోని ప్రజల పట్ల అనుచితమైన బలప్రయోగాన్ని చూపకండి’ అంటూ ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల పట్ల కూడా జవాన్లు తూటాలు, పెల్లెట్లు ఉపయోగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆజాద్ తాను ఎంతో బాధాతప్తుడినై ఈ సభ ముందు ఉన్నానని చెప్పారు. ‘మిలిటెన్సీని అంతం చేయడంలో మేం ప్రభుత్వానికి అండగా ఉంటాం. కానీ పౌరుల పట్ల ఇలా ప్రవర్తించడాన్ని మాత్రం సమర్థించం’ అని ఆయన పేర్కొన్నారు. మిలిటెంట్ బుర్హన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్ లో కొనసాగుతున్న ఈ అశాంతిపై రాజ్యసభలో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో మొదట ఆజాద్ మాట్లాడారు. -
ఇఫ్తార్ విందును రద్దుచేసిన కాంగ్రెస్ పార్టీ
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) ప్రతియేటా నిర్వహించే ఇఫ్తార్ విందును రద్దుచేసింది. ఈ మేరకు సోమవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇలా ఇఫ్తార్‌ను రద్దుచేయడం ఇదే మొదటిసారి. ఇందుకు కారణం ఏంటో అధికారికంగా చెప్పకపోయినా.. జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇక్కడ కూడా చేశారని అంటున్నారు. జూలై 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి కొత్తగా నియమితుడైన పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ హాజరు కావల్సి ఉంది. అయితే.. ఇలా ఇఫ్తార్ విందును రద్దు చేయడం వల్ల మైనారిటీలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇప్పటివరకు అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీకి వాళ్ల ఓట్లే పడుతున్నాయని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ప్రశాంత కిషోర్ నేతృత్వంలోని బృందం రావడం వల్ల ఇప్పటికే పార్టీ బ్రాహ్మణ రంగు పులుముకున్నట్లు అయిందని, వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో ఇలా చేయడం వల్ల మరింత నష్టం తప్ప లాభం ఏమీ ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇఫ్తార్ విందుకు పెట్టదలచిన మొత్తాన్ని ముస్లిం పిల్లల సంక్షేమం కోసం ఖర్చుపెడతామని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. -
'ఎన్నికలకు ముందే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. పార్టీ సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటిస్తామని కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. 'ఎన్నికలకు ముందు మా వ్యూహాన్ని, అభ్యర్థిని ప్రకటిస్తాం' అని పార్టీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో చెప్పారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జిగా ఆజాద్ ను హైకమాండ్ నియమించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
యూపీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది యూపీ, పంజాబ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా.. పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్‌కు యూపీ, కమల్‌నాథ్‌కు పంజాబ్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించింది. యూపీలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతోపాటు బీఎస్పీతో సత్సంబంధాలున్నందున పొత్తుకు ఒప్పించేందుకే ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న ఆజాద్.. అంతకుముందు రెండుసార్లు యూపీ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో హరియాణా కాంగ్రెస్ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే తప్పుచేశారన్న వార్తల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సరిదిద్దటంతోపాటు, పంజాబ్‌లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రాష్ట్రాల బాధ్యతలను కమల్‌నాథ్‌కు అప్పగించారు. -
'సమస్య అంతా ఆయన వల్లే'
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారం వరుసగా రెండో రోజూ రాజ్యసభను కుదిపేసింది. రెండు రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామిపై విపక్ష నేత గులాంనబీ ఆజాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డరారు. 'పార్లమెంట్ లో ఆయనకు ఇది రెండో రోజు మాత్రమే. ఈ రెండు రోజులుగా ఆయన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా చేస్తారు? ఆయనకు వయసు పెరిగింది కానీ వీధి మాటలకు, పార్లమెంట్ మాటలకు తేడా తెలియడం లేద'ని ఆజాద్ అన్నారు. తలకు రంగేసుకోగానే సరిపోదని, విజ్ఞత అలవరుచుకోవాలని చురకలు అంటించారు. దీంతో జీరో అవర్ లో గందరగోళం రేగింది. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభ్యుల ఆందోళనతో జీరో అవర్ తుడిచిపెట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యంతా బీజేపీ కొత్త కానుక(బీజేపీ న్యూ గిఫ్ట్) వల్లే అంటూ పరోక్షంగా సుబ్రమణ్యంస్వామిని ఆజాద్ విమర్శించారు. సోనియా గాంధీపై సుబ్రమణ్యంస్వామి చేసిన విమర్శలను రికార్డుల నుంచి తొలగించారు. సభలో లేని వారి గురించి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు. -
సీట్లకు కమిటీ
డీఎంకేతో సీట్ల పందేరానికి కమిటీని రంగంలోకి దించేందుకు ఏఐసీసీ నిర్ణయించింది. సీనియర్లు గులాంనబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్లతోపాటు రాష్ట్రానికి చెందిన నాయకులతో ఈ కమిటీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా కుష్బు, నగ్మాలను రంగంలోకి దించనున్నారు. సాక్షి, చెన్నై: డీఎంకేతో కలసి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమైన విషయం తెలిసిందే. పాత స్నేహం మళ్లీ వికసించడంతో ఈ సారి డీఎంకేకు అధికార పగ్గాలు దక్కేందుకుగాను కాంగ్రెస్ చెమటోడ్చేందుకు సిద్ధం అవుతోంది. కాంగ్రెస్‌కు డీఎంకే యాభై సీట్లు ఇస్తున్నట్టు, ముప్పై సీట్ల్లిస్తున్నట్టుగా వస్తున్న సంకేతాలకు కల్లెం వేయడానికి టీఎన్‌సీసీ సిద్ధమైంది. సీట్ల పంపకాల్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు కమిటీని ప్రకటించాలని ఏఐసీసీ దృష్టికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తీసుకెళ్లి ఉన్నారు. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ సైతం కాంగ్రెస్ కమిటీ రాకతో పొత్తు పందేరాలను కొలిక్కి తెచ్చి తదుపరి అధినేత కరుణానిధి మేనిఫెస్టోను ప్రకటిస్తారని వ్యాఖ్యానించిన విషయాన్ని ఢిల్లీకి ఈవీకేఎస్ చేర వేసి ఉన్నారు. దీంతో కమిటీని చెన్నైకు పంపించేందుకు ఏఐసీసీ పెద్దలు నిర్ణయించి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కమిటీ మరో రెండు మూడు రోజుల్లో ఇక్కడికి వచ్చి కరుణానిధితో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కమిటీలో సీనియర్లు గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ పర్యవేక్షణలో రాష్ట్ర పార్టీకి చెందిన పలువురు నాయకులు నియమించే అవకాశాలు ఉన్నట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాధ్యతల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్‌తో పాటు, నటి, పార్టీ మహిళా నేతలు కుష్బు, నగ్మాలకు అప్పగించేందుకు ఏఐసీసీ నిర్ణయించింది. ఈ నెల చివరి నుంచి నగ్మా పూర్తిగా తమిళనాడు మీద తన దృష్టిని పెట్టబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఇద్దరు మహిళా స్టార్లు డీఎంకే, కాంగ్రెస్ ప్రచారాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం అని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. -
అజాద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్.. ఆర్ఎస్ఎస్ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. అజాద్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో అజాద్‌కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. అజాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అజాద్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని బీజేపీ పరిశీలిస్తోందని ఆ పార్టీ నేత ముక్తర్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. కాగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన అజాద్ మాట్లాడుతూ.. తాను తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. బీజేపీ సభ్యులు ఆ సీడీ చూడాలని విజ్ఞప్తి చేశారు. -
పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా?
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై మరోసారి రాజ్యసభలో దద్దరిల్లింది. ప్రతిపక్షాల తీరుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ లబ్దికి వాడుకుంటున్నాయని విమర్శించారు. ''పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా.. చర్చ పెట్టండి అన్నీ తెలుస్తాయి'' అని మండిపడ్డారు. రోహిత్ వేముల ఆత్మహత్యతో ప్రభుత్వానికి, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఏఐసీసీ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. రోహిత్ మృతిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. -
'స్వామి వెనుక బీజేపీ, మోదీ ఉన్నారు'
కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి ఎలా కేసులు ఎలా పెడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దీని వెనక ఉన్నారని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాటియాల కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఈరోజు అందరూ పేపర్లు చదివే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సుబ్రమణ్యం స్వామికి జడ్ కేటగిరీ భద్రత కల్పించింది. స్వామి పార్లమెంటు సభ్యుడు కాదు. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా లేరు. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు, వాళ్లను ఏమీ అనలేదు, ఉగ్రవాదులను ఆయన చంపలేదు. కేవలం కాంగ్రెస్ నాయకత్వాన్ని కోర్టుకు లాగినందుకు బహుమతిగానే ఆయనకు జడ్ కేటగిరీ భద్రత, ప్రభుత్వ క్వార్టర్స్ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోంది. ఇలా ఇంతకుముందెన్నడూ లేదు. గత ఏడాది కాలంగా గుజరాత్ ప్రతిపక్ష నేత గానీ, హిమాచల్ సీఎం గానీ, ఇప్పుడు పార్లమెంటు మొదలై వారం రోజులు కూడా గడవలేదు, అరుణాచల్ ప్రదేశ్‌లో గవర్నర్‌తో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. కోర్టు అడ్డుపడటంతో ఆగింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ దాడులు చేస్తున్నారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే కుట్రలు చేస్తున్నారు. మొదట్లో తాము కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే వ్యతిరేకం అన్నారు. ఇప్పుడు మరే ఇతర పార్టీ అన్నది లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్లతో కూడా పోరాడింది' అని అజాద్ అన్నారు. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రా సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజాద్ ఇంటికి వెళ్లారు. సోనియా, రాహుల్ కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో తదుపరి పర్యవసానాల గురించి చర్చించారు. -
పార్లమెంటులో విపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంఓ కార్యాలయంపై సీబీఐ దాడులు చేయటం.. సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడి అంటూ ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పార్లమెంటులో మండిపడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ దాడుల అంశాన్ని ప్రస్తావించింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించారంటూ విపక్షాలు సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. రాజ్యసభలో విపక్షాల ఆగ్రహం, ఆందోళనలతో సభ మూడుసార్లు వాయిదా పడింది. ‘‘ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. దేశంలో సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన అంశం’’ అని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ ఆయనతో గళం కలుపుతూ.. ప్రభుత్వం రాజ్యాంగాన్ని హత్య చేస్తోందని ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీలు, జేడీయూ సభ్యులు కూడా తమ స్థానాల్లో నిల్చుని సర్కారుపై నిరసన వ్యక్తంచేశారు. విపక్షాల ఆందోళనకు ఉభయసభల్లోనూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇచ్చారు. ఢిల్లీ సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు చేయలేదన్నారు. ఓ సీనియర్ అధికారి అవినీతి కేసులో ఉన్నారని.. ఆయన కార్యాలయంలో మాత్రమే దాడులు జరుగుతున్నాయన్నారు. -
'మోదీ సర్కార్‌ను నడిపేది సుబ్రహ్మణ్యమే'
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తమ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్డీయే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై ముప్పేట దాడికి దిగారు. బుధవారం రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోదీపై విరుచుపడుతూ మోదీ సర్కార్‌ను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నడుపుతున్నారని అన్నారు. ఆగస్టులోనే ఈడీ ఈ కేసును మూసివేసిందని, కావాలనే కొత్త డైరెక్టర్ ను నియమించుకొని బీజేపీ తమపై కక్షకు దిగిందని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని నలిపేసిందని, వదించిందని, ఖూనీ చేసిందంటూ పరుష పదాలను ఉపయోగించారు. -
వీకే సింగ్‌ను తొలగించాల్సిందే...
న్యూఢిల్లీ: దళిత చిన్నారుల సజీవదహనం ఉదంతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వి.కె.సింగ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంటు భవనం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు ఉభయసభల భేటీకి ముందు.. రాహుల్‌గాంధీ సారథ్యంలో జరిగిన ఈ నిరసనలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఒక కేంద్రమంత్రి ఒక నిర్దిష్ట వర్గానికి-ఆ మాటకొస్తే భారతీయులకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును బట్టే ఈ అంశా న్ని లేవనెత్తుతున్నామని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఆ అంశంపై ఈ నెల 2వ తేదీన లోక్‌సభలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను రికార్డుల్లో చేర్చలేదంటూ ఖర్గే జీరో అవర్‌లో స్పీకర్‌కు ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. దళిత చిన్నారుల సజీవదహనం సందర్భంగా వీకే సింగ్ చేసిన ‘కుక్క’ వ్యాఖ్యల్లో నేరపూరిత ఉద్దేశ్యం లేదని స్పష్టంచేస్తూ.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలంటూ వచ్చిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆయన మాటల్లో దళితులను కించపరిచే వ్యాఖ్యలు లేవని, కేంద్రప్రభుత్వం బాధ్యత లేదు అని చెప్పేందుకే ‘కుక్క’ వ్యాఖ్యలుచేశారని సోమవారం విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. -
అక్కడ హిట్లర్.. ఇక్కడ ఇందిర!
న్యూఢిల్లీ: అసహనంపై విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు కేంద్రం హిట్లర్‌ను రంగంలోకి దింపింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో శుక్రవారం చర్చను ప్రారంభించిన కేంద్ర మంత్రి జైట్లీ.. కాంగ్రెస్ హయాం నాటి ఎమర్జెన్సీని 1930లలో జర్మనీలో హిట్లర్ చేపట్టిన చర్యలతో పోలుస్తూ ఎదురుదాడి చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగాన్ని బలహీనపర్చారని, స్వేచ్ఛాహక్కు, జీవించే హక్కులను కాలరాచారని ధ్వజమెత్తారు. ‘చరిత్రలో రాజ్యాంగాన్ని బలహీన పర్చేందుకు రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకున్న సందర్భాలున్నాయి. 1933లో జర్మనీలో హిట్లర్ హయాంలో జరిగిందదే. జర్మనీ పార్లమెంటును తగలబెడ్తామన్న హెచ్చరిక ను సాకుగా చూపుతూ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రతిపక్షాన్ని జైల్లోపెట్టి, పార్లమెంట్లో మెజారిటీ సంపాదించి, రాజ్యాంగాన్ని సవరించారు. ప్రెస్పై ఆంక్షలు పెట్టి, 25 పాయింట్ల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఏ కోర్టు కూడా ప్రశ్నించకుండా చట్టం తీసుకువచ్చారు’ అని అన్యాపదేశంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన నాటి ఘటనలను పోల్చారు. ‘ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా’ అనే నినాదం గుర్తొచ్చేలా.. ‘జర్మనీ అంటే అడాల్ఫ్ హిట్లర్.. హిట్లర్ అంటే జర్మనీ’ అన్న హిట్లర్ ముఖ్య సలహాదారు రుడాల్ఫ్ హెస్ నినాదాన్ని గుర్తు చేశారు. ‘ఆ తరువాత జర్మనీ చర్యలను ఆధారంగా చేసుకుని ఇతర దేశాలు చేపట్టిన చర్యలపై జర్మనీ కాపీరైట్ తీసుకోలేదు’ ఇండియాలో ఎమర్జెన్సీని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. జీవించేహక్కును కల్పించే రాజ్యాంగ అధికరణ 21ను రద్దు చేయడం ఇకపై కుదరదంటూ ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత రాజ్యాంగాన్ని సవరించుకున్నామని గుర్తు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి అమలుకు సంబంధించిన రాజ్యాంగ అధికరణ 44, గోవధ నిషేధాన్ని సమర్ధించే ఆర్టికల్ 48 అమలుకు మద్దతుగా 1949 నవంబర్‌లో అంబేద్కర్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇప్పుడు ఈ సభలో ఆ ప్రసంగం ఆయన ఇచ్చి ఉంటే విపక్షం ఎలా స్పందించేదో!?’ అని వ్యాఖ్యానించారు. ఈ స్వాతంత్య్రాన్ని దేశం కాపాడుకోగలుగుతుందా? అనే అనుమానాన్ని ఆ సందర్భంగా అంబేద్కర్ వ్యక్త పరిచారన్నారు. టైజంపై.. ‘ప్రపంచదేశాల రాజ్యాంగ వ్యవస్థలకు ఉగ్రవాదం పెను సవాలుగా మారింది. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబించడం కాకుండా ఆ మహమ్మారిపై ఐక్యంగా పోరు సాగించాలి’ అన్నారు. ఈ సందర్భంగా 2001 పార్లమెంటపై దాడి, 1993 ముంబై పేలుళ్లు తదితర ఘటనలను ప్రస్తావించారు. ముంబై పేలుళ్ల దోషి ఉగ్రవాది యాకూబ్ మెమన్ను ఉరితీసిన తరువాత.. ఆయనను అమరుడిగా కీర్తించిన పరిస్థితి నెలకొందని, ఇలాంటి వాటికి అంబేద్కర్ ఎలా స్పందించేవారోనని వ్యాఖ్యా నించారు. న్యాయవ్యవస్థపై.. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత కచ్చితంగా అత్యవసరం. అయితే, ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం సంప్రదింపుల ద్వారానే జరగాలి. అంబేద్కర్ ఆలోచనలకు భిన్నంగా నేడు జరుగుతోంది. ఇతర జడ్జీలనందరినీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే నియమించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దీన్ని సమర్ధించడం ఏ చట్టానికీ సాధ్యం కాదు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సంబంధించి.. లక్ష్మణ రేఖను జ్యుడీషియరీ దాటకూడదన్న వాదన కూడా ఉంది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతుల్యత సాధించాలి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తప్పుడు విధానాలు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యలకు దారితీశాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తన వ్యాఖ్యలపై శుక్రవారం విచారం వ్యక్తం చేశారు. విభజన శక్తులపై చర్యలు లేవు: విపక్షం విభజన శక్తులపై చర్యలు తీసుకోవడం లేదని రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దేశంలో నెలకొన్న అసహన వాతావరణం, వెనకబడిన వర్గాల పరిస్థితి, సమాఖ్య విధానం బలహీనపడటం.. తదితరాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో అసహన వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు. అంటే జవహర్లాల్ నెహ్రూను ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై స్పందిస్తూ.. ‘రాజ్యాంగ ప్రవేశికకకు కారణమైన వ్యక్తిని మీరు గుర్తించరు. రాజ్యాంగ నిర్మాణంలో ఆ వ్యక్తి కృషిని ప్రశంసించరు. దాన్నే అసహనం అంటారు’ అని విమర్శించారు. కనీసం ఒక్కసారి కూడా పండిట్ నెహ్రూను గుర్తు చేసుకోం. నెహ్రూను ప్రస్తావించకుండా రాజ్యాంగం గురించి మాట్లాడటం ఎలా సాధ్యం? నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ జీవించి లేకున్నా.. వారిని ఒకరిపై ఒకరికి పోటీ పెట్టారు. బీజేపీ నేతలు స్వాతంత్య్ర సమర యోధులను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. దీన్నే అసహనం అంటారు. గత సంవత్సరన్నరగా భారత్‌లో నెలకొన్న వాతావరణం రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకమైనది.’ అని ఆజాద్ మండిపడ్డారు. తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు జైట్లీ ప్రయత్నించడంతో.. ‘మీరు మీ ప్రసంగంలో హిట్లర్‌ను ప్రస్తావించవచ్చు కానీ.. నేను మన తొలి ప్రధాని గురించి మాట్లాడకూడదా? దీన్నే అసహనం అంటారు’ అని ఎదురుదాడి చేశారు. హైదరాబాద్, మాలేగావ్, సంరతా పేలుళ్ల కారకులపై చర్యలు తీసుకోవాలి’ అన్నారు. ‘ఎస్సీ, ఎస్టీల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంపీ స్థాయిలో ఉన్నా.. పార్టీలో ఒత్తిళ్లతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేని పరిస్థితి ఆ వర్గ ఎంపీల్లో ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26న అయితే, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఏంటని సీపీఎం నేత యేచూరి పేర్కొన్నారు. అసహనంపై స్పందన లేదు! లోక్‌సభలో విపక్షాల ధ్వజం ‘అసహనం’పై ప్రజల్లో భయాందోళనలను తొలగించే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లోక్‌సభలో విపక్షాలు ధ్వజమెత్తాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో గురువారం ప్రారంభమైన చర్చ శుక్రవారం కొనసాగింది. రాజ్యాంగంలోని లౌకికత అనే పదం ప్రభుత్వంలోని వారికి ఇబ్బందికరంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య వ్యాఖ్యానించారు. ‘ఇద్దరు దళిత చిన్నారులను తగలబెడ్తే.. ఒక కేంద్రమంత్రి కుక్క ఉదాహరణ చెప్తారు. కళాకారులు తమ అవార్డులను తిరిగిస్తుంటే.. ఓ ఎంపీ వారిని ఉగ్రవాది తో పోలుస్తారు. ఇవన్నీ వేటికి సంకేతం’ అంటూ మండిపడ్డారు. అంబేద్కర్ దిష్టిబొమ్మలను గతంలో ఆరెస్సెస్ తగలబెట్టిన విషయాన్ని సింధియా ప్రస్తావించారు. ముస్లింల స్వప్నాలు ఎంతవరకు నిజమయ్యాయని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. జీవించే హక్కు రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కు అన్న ఓవైసీ.. ముస్లింల జీవించే హక్కును కాపాడాలన్నారు. ఎన్నో సందర్భాల్లో ముస్లింల జీవించే హక్కును కాలరాచారన్నారు. ‘మోదీ ఈ దేశంలోని ముస్లింలకు ప్రధాని కారా?’ అని ప్రశ్నించారు. -
పార్టీ ఓటమితో సోనియా బాధపడ్డారు
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడితోనే యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీఎం ఆస్పత్రి చౌరస్తా వరకు నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ‘‘తెలంగాణ కోసం యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి తెలంగాణ బిల్లు తెచ్చేందుకు సోనియా కృషి చేశారు. ఆమె ఆదేశాల మేరకే సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్లో తీర్మానం ఆమోదింపజేశాం. దీనిపై ఆంధ్రాలో వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ఆంధ్రా నాయకులు, సీఎంలు వ్యతిరేకించినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు న్యాయం చేశారు. అయినా 2014లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం సోనియాను బాధపెట్టింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని కోరారు.ప్రజల ఆకాంక్ష మేరకే 2009లో జరిగిన ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఏర్పాటు అంశాన్ని యూపీఏ ఉమ్మడి అజెండాలో పెట్టామన్నారు. తమ పార్టీ ఎంపీలు నిత్యం పార్లమెంట్‌ను స్తంభింపజేయడం, ఒత్తిడి తేవడంతో సోనియా తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. టీఆర్ఎస్కు ఉన్న ఇద్దరు ఎంపీలతో ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. మాఫీపై మోసంతోనే ఆత్మహత్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆజాద్ పేర్కొన్నారు. రుణమాఫీపై మోసం చేయడం వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.70 వేల కోట్ల మేరకు రుణాలు మాఫీ చేసిందని చెప్పారు. టీఆర్ఎస్ కేవలం 25 శాతం రుణాన్నే మాఫీ చేయడంతో రైతులకు మళ్లీ అప్పులు పుట్టడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుంటే ఉద్యమాలు చేస్తామని స్పష్టంచేశారు. మోదీ ప్రభుత్వానికి బిహార్‌లో పతనం మొదలైందని, టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం వరంగల్ ఉప ఎన్నికతో ప్రారంభం కావాలని అన్నారు. రోడ్‌షోలో ఎంపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి సారయ్య, మాజీ ఎంపీ వివేక్, డీసీసీ అధ్యక్షుడు నారుుని రాజేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద పాల్గొన్నారు. -
'దేశ ప్రజలంతా సెక్యులర్లే'
హైదరాబాద్:భారతదేశంలో ఉన్న ప్రజలంతా సెక్యులర్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. వారిని మతవాదులుగా చేసే ప్రయత్నం జరుగుతోందంటూ ఆయన విమర్శించారు. దేశంలో మెజారిటీ ఉన్న హిందువులు సెక్యులర్లుగా ఉన్ననాళ్ళూ.. మైనారిటీల భద్రతకు ముప్పేమి లేదని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. సోమవారం చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావన రజతోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది రాజీవ్ సద్భావన అవార్డును గులాంనబీ ఆజాద్ కు ఆయన అందజేశారు. -
తెలంగాణలో దిగ్విజయ్ పర్యటన
వరంగల్, నారాయణ్ ఖేడ్ ఉపెఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారుచేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ లోజరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ఆయన.. సాయంత్రం వరంగల్‌లో జిల్లా నేతలతో భేటీ కానున్నారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎంపికపై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం గాంధీ భవన్ లో మెదక్ జిల్లా నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేస్తారు.కాగా..సోమవారం చార్మినార్ వద్ద జరిగే రాజీవ్ సద్భావన రజతోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ ఏడాది రాజీవ్ సద్భావనా అవార్డు గులాంనబీ ఆజాద్ కు ఇవ్వనుట్లు నిర్వాహకులు తెలిపారు. -
'తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి'
ఢిల్లీ: కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరవు నెలకొన్న తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్(జీఎస్టీ బిల్లు) ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని ఆజాద్ పేర్కొన్నారు. -
'కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది'
న్యూఢిల్లీ: బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. విపక్షాలు లేవనెత్తిన డిమాండ్ల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ మంత్రులతో రాజీనామా చేయించకుండా అవసరం లేని అంశాలను బీజేపీ తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సుష్మా స్వరాజ్, వసుంధ రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టీకరించారు. ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తోందని ఆజాద్ ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని అన్నారు. -
మన అభ్యర్థిని గెలిపించుకుందాం
టీ కాంగ్రెస్ నేతలతో ఆజాద్ 22 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని, అంకితభావంతో వ్యవహరిద్దామని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సూచించారు. మండలి ఎన్నికల నేపథ్యంలో ఆజాద్, వయలార్ రవి, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు, విడివిడిగా మంతనాలు కూడా జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రత్యర్థి పార్టీలు అనుసరిస్తున్న వ్యూహం, కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు తదితర అంశాలపై మాట్లాడారు. ఒక మహిళకు పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించామని, గెలిపించి అంకితభావాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని ఆజాద్ వారికి చెప్పారు. గురువారం 10 మంది ఎమ్మెల్యేలతో భేటీకాగా.. శుక్రవారం మరో ఏడుగురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీ ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, కె.జానారెడ్డి ఇతర ముఖ్యనేతలు కూడా ఆజాద్‌తో సమావేశమయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేకు పార్టీ విప్ సంపత్‌కుమార్ శుక్రవారం విప్‌ను జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకుల లలితకు ఓటేయాలని ఆదేశించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, యాదయ్య, కోరం కనకయ్య, విఠల్ రెడ్డికి కూడా విప్‌ను అందించనున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేతలకు దానం విందు కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ తన నివాసంలో ఆజాద్, వయలార్ రవి, కుంతియాలకు విందు ఇచ్చారు. వారితో పాటు ఉత్తమ్, భట్టి, జానా, షబ్బీర్ అలీ తదితరులు దీనికి హాజరయ్యారు. అయితే పార్టీ మారడానికి దానం సిద్ధమైనట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ విందు ప్రాధాన్యం సంతరించుకుంది. -
'మంత్రి వివరణ సంతృప్తికరంగా లేదు'
న్యూఢిల్లీ: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. అందుకే పార్లమెంట్ నుంచి తాము వాకౌట్ చేసినట్టు ఆయన వెల్లడించారు. బ్లాక్ మనీ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ లో మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు సహకరిస్తామని ఆజాద్ అన్నారు. కాగా, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువైతే పదవుల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని గడ్కరీ ప్రకటించారు. -
గులాంనబీ ఆజాద్‌కు మాతృవియోగం
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి బసా బేగం (93)మృతి చెందారు. జమ్ము కశ్మీర్‌లోని గుజ్జర్ నగర్లో ఆమె శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించారు. బసా బేగం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. బసా బేగం అంత్యక్రియలు నేడు గుజ్జర్ నగర్లో నిర్వహించనున్నారు. కాగా పలువురు నేతలు ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్‌కు సంతాపం తెలిపారు. -
మాజీ కేంద్ర మంత్రులకు అరెస్టు వారెంట్లు జారీ
అనంతపురం:యూపీఏ ప్రభుత్వం హయాంలో పనిచేసిన ముగ్గురు మాజీ కేంద్ర మంత్రులకు అనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. -
మేము జీరో.. మీరు హీరో!
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని కాంగ్రెస్ మండిపడింది. ఆ బడ్జెట్ ను గత యూపీఏ ప్రభుత్వం నుంచి కాపీ చేసి మాత్రమే ప్రవేశపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. ఈ రోజు రాజ్యసభలో రైల్వే బడ్జెట్ పై ప్రసంగించిన ఆజాద్.. ఆ పాత బడ్జెట్ నే తాజాగా మూటగట్టి తిరిగి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇదేనా 'యూపీఏ జీరో.. ఎన్డీఏ హీరో' అని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్రాలను పాలించిన అనుభవం ఉన్నా దేశంలో సమాఖ్య వ్యవస్థను సవ్యంగా నడపాలంటే అది ఏమాత్రం సులభ సాధ్యమైన అంశం కాదని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల ఆచరణలో పెట్టడం సాధ్యం కాదని ఆజాద్ తెలిపారు. గత యూపీఏ పాలనలో ప్రభుత్వ పనితీరును వెనుకేసుకొచ్చిన ఆజాద్.. దేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పది సంవత్సరాలు పాటు పాలించినా యూపీఏ సాధించిన ప్రగతిని చేరుకోలేదన్నారు. -
కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కటీఫ్!
బీహార్‌లోనూ కాంగ్రెస్ ఒంటరి పోరు మహారాష్ట్రలో ఎన్సీపీతో జోడీ కొనసాగింపు సొంతంగా బరిలోకి ఐఎన్ఎల్డీ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలను ప్రకటించిన పార్టీలు శ్రీనగర్/పాట్నా/న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి ఆదివారం పరస్పరం కటీఫ్ చెప్పుకొన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్సీతో ముందస్తు పొత్తు ఉండబోదని తొలుత కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అంబికా సోనీ, సైఫుద్దీన్ సోజ్‌లు జమ్మూలో వెల్లడించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని మొత్తం 87 సీట్లలో సొంతంగానే తమ అభ్యర్థులను బరిలోకి దించుతామన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీల ఓట్లు పరస్పరం బదిలీ కాలేదని, ఫలితంగా అన్ని (6) సీట్లనూ ప్రతిపక్ష పీడీపీ, బీజేపీలే సొంతం చేసుకున్నాయని, అందువల్ల ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నామన్నారు. అయితే దీనిపై ఎన్సీ అధ్యక్షుడు, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘ పది రోజుల క్రితమే కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిశాను. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు వద్దని, అందుకు కారణాలనూ వివరించాను. అవకాశవాదిని అనిపించుకోలేకే దీనిపై బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం వాస్తవాలను వక్రీకరించారు. అది సరికాదు’ అని పేర్కొన్నారు. అలాగే బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీతో జట్టుకట్టి ఘోరంగా చతికిలపడిపోయిన కాంగ్రెస్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. బీహార్‌లో మతతత్వ శక్తులను దూరం పెట్టేందుకు 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్నట్లు ఆర్జేడీ, జేడీయూలు ప్రకటించాయి. బీహార్‌లో ఆగస్టు 21న ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసే బరిలోకి దిగనున్నట్లు ఆదివారం నాసిక్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన సీట్ల సర్దుబాటుతో సహా పొత్తుకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించేందుకు ఓ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ను కోరినట్లు తెలిపారు. మరోవైపు త్వరలో జరగనున్న హార్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) కూడా ప్రకటించింది. -
పోలవరం బిల్లుకు మద్దతు ఇవ్వండి: ఆజాద్
ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ముంపు మండలాల విలీనం బిల్లుపై చర్చ జరిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ మాట ఇచ్చినందున బిల్లుకు మద్దతు ఇవ్వాలని గులాం నబీ ఆజాద్ ....సభ్యులకు సూచించారు. కాగా సోమవారం పోలవరం బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. బిజెపితో పోల్చుకుంటే రాజ్యసభలో కాంగ్రెస్‌కు బలం ఎక్కువగా ఉంది. దాంతో కాంగ్రెస్ సభ్యులు కనుక బిల్లుపై ఎదురు తిరిగితే ఆమోదముద్ర పడే అవకాశం లేదు. కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పోలవరం బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బిల్లును అడ్డుకుంటామని ఇప్పటికే వారు వ్యాఖ్యానించినఈ నేపథ్యంలోపోలవరం బిల్లును ఆమోదం తెలపాలని ఆజాద్...పార్టీ ఎంపీలను కోరారు. -
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆజాద్!
ఉప నేతగా ఆనంద్శర్మల ఎంపిక పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వివేది వెల్లడి న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేత కావడం లాంఛనమే. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఆజాద్ ఎంపిక విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఆదివారమిక్కడ ప్రకటించారు. యూపీఏ-2 హయాంలో మంత్రిగా పనిచేసిన ఆనంద్‌శర్మ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉప నేతగా నియమితులైనట్టు తెలిపారు. ఆజాద్, ఆనంద్శర్మలిద్దరినీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ పదవులకు నామినేట్ చేశారని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవి పొందేందుకు అవసరమైన సభ్యుల సంఖ్య కాంగ్రెస్‌కు ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్‌కు 65 మంది సభ్యులున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత పదవి పొందేందుకు సభలోని మొత్తం సభ్యుల్లో పదిశాతం ఉంటే చాలు. ఆ మేరకు ఆజాద్ ప్రతిపక్ష నేత పదవి పొందడం ఖాయమైంది. ఇప్పటికే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కర్ణాటకు చెందిన దళిత నేత మల్లికార్జున ఖర్గేను, ఉప నాయకుడిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌ను నియమించడం తెలిసిందే. -
'వెండి పతకం వద్దు... గెలుపే ముద్దు'
వారణాసి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వారణాసి ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ దీమా వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం తమ పార్టీ అభ్యర్థే గెలుస్తాడని ఆయన చెప్పారు. గెలుపు కోసం తాము ప్రయత్నిస్తున్నామని, వెండి పతకం కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థులు ఎంతటి బలవంతులైనా తాము భయపడబోమని తేల్చిచెప్పారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే ప్రచారం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షోలో ఆజాద్ పాల్గొన్నారు. -
జై కొట్టేదెవరికి
- రేపే పోలింగ్ పార్టీలకు అగ్ని పరీక్ష - అతిరథుల దృష్టి ఇక్కడే - అన్ని చోట్ల ఉత్కంఠ పోరు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రధాన పార్టీలన్నీ తెలంగాణ అభివృద్ధి.. రాష్ట్ర వికాసమే ఏకైక ఎజెండాగా ఎంచుకోవటంతో జిల్లా ఓటర్లు ఎవరిని విశ్వసిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే సంక్షేమ పథకాలు తమ మేనిఫెస్టోలో పొందుపరిచాయి. అన్ని పార్టీల అతిరథ నేతలు ప్రచారంలో భాగంగా తొలి అడుగు ఇక్కడే వేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యమ ఖిల్లాగా పేరొందిన జిల్లాలో ఫలితమెలా ఉంటుందనేది రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఘనత తమదేనని.. వికాసం కూడా తమ వల్లనే సాధ్యమవుతుందని ప్రచారం హోరెత్తించింది. స్వయానా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జిల్లా వేదికగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. ఆ పార్టీ తరఫున కేంద్రమంత్రులు జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్ రోడ్‌షోలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఛాంపియన్షిప్ తమదేనని.. ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ఆశలన్నీ నెరవేరాలంటే తమకే పట్టం కట్టాలని టీఆర్ఎస్ ప్రచారంలో ముందంజ వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో ప్రచారసభలు నిర్వహించారు. తమ మద్దతుతోనేతెలంగాణ వచ్చిందని.. అభివృద్ధి చేసే బాధ్యతను తమకే అప్పగించాలని బీజేపీ సైతం ప్రచారంలో దూసుకెళ్లింది. ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భారత విజయయాత్రలో భాగంగా కరీంనగర్ సభలో పాల్గొన్నారు. జనసేన పార్టీ నేత పవన్‌కల్యాణ్ హుస్నాబాద్, కోరుట్లలో మిత్రపక్షాల తరఫున ప్రచారం చేపట్టారు.ఊగిసలాట అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు జగిత్యాల నియోజకవర్గంలో ప్రచారసభలో పాల్గొన్నారు. ఎండలు లెక్క చేయకుండా.. అన్ని పార్టీల అతిరథ నేతలు జిల్లాకు తరలిరావటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హోరెత్తిన ప్రచారం ప్రధానపార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తించారు. సకుటుంబ సపరివారంగా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. గతంతో పోలిస్తే ఎన్నికల ఖర్చులోనూ అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో ప్రధాన పార్టీల అతిరథ నేతల సభలకు జనం భారీగా తరలిరావటం... పల్లెపల్లెనా అభ్యర్థుల ప్రచారానికి స్పందన కనిపించింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగింది. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. కరీంనగర్ ఎంపీ సీటుకు పాత కాపును.. పెద్దపల్లిలో విద్యార్థి ఉద్యమ నేతను ప్రయోగించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం అన్నిచోట్ల పోటీకి నిలిచింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు సామాజిక న్యాయం ఎజెండాగా టిక్కెట్లు పంపిణీ చేసింది. ఫలితంగా ఎక్కువ చోట్ల బలహీనమైన అభ్యర్థులు పోటీకి దిగారు. రామగుండం, కోరుట్లలో టిక్కెట్లు రాని అభ్యర్థులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. రెండు ఎంపీ స్థానాల్లోనూ బలంగా ఉన్న సిట్టింగ్‌లకు కాంగ్రెస్ అవకాశమిచ్చింది. పొత్తు విషయంలోనే మల్లగుల్లాలు పడ్డ టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు జిల్లాలో 12 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపాయి. చెరిసమంగా ఆరు స్థానాల్లో బీజేపీ, ఆరుచోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. కేడర్ లేకపోవటం టీడీపీని వెంటాడుతుండగా.. కొత్త జోష్ బీజేపీ అభ్యర్థులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. నామినేషన్ల పర్వంలో దొర్లిన తప్పుతో హుస్నాబాద్‌లో మిత్రపక్షాలు పోటీకి దూరమయ్యాయి. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు, కరీంనగర్ ఎంపీ సీటుకు పోటీ పడుతోంది. మంథని, రామగుండం మినహా అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మహానేత వైఎస్ అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారులు.. ఆయన అభిమానులు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఉన్న జనాదరణను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రచారం హోరెత్తించారు. పొత్తులు.. సీట్ల సర్దుబాటులో భంగపడటంతో జిల్లాలో సీపీఐ పోటీకి దూరమైంది. కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించింది. ఎంఐఎం స్థానికంగా ఉన్న అవగాహన మేరకు అభ్యర్థులకు మద్దతు ప్రకటించి రెండు ఓట్ల విధానానికి తెరలేపింది. -
దానం, గులాం నబీ ఆజాద్‌లపై కేసు
హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్, రాష్ట్ర మాజీ మంత్రి దానం నాగేందర్లపై పంజగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా అజాద్, దానం నాగేందర్‌లు పంజగుట్ట పీఎస్ పరిధిలోని ఎంఎస్ మస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. -
మోడీని ప్రజలు విశ్వసించడంలేదు
జహీరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో ప్రజలు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఓటు వేసి గెలిపించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్‌లోని సుభాష్ గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని కావాలని కలలు కంటున్న బీజేపీ నేత నరేంద్రమోడీని ప్రజలు ఏ మాత్రం విశ్వసించడం లేదన్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశాన్ని ఏలాలని చూస్తున్న ఆయనను ప్రజలు ఏ మాత్రం సమర్థించరన్నారు. మత తత్వ పార్టీ అయిన బీజేపీని ప్రజలు దూరం పెట్టాలని కోరారు. తమ పార్టీ పేదల పక్షాన ఉంటే బీజేపీ పెట్టుబడీ దారులకు అండగా ఉంటోందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం తమ పార్టీ ప్రధాన మంత్రులుగా పని చేసిన వారు ఎంతో పాటు పడ్డారన్నారు. పేదలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దళితులు, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా పాటు పడుతోందన్నారు. మోడీకి విశ్వసనీయత లేదు నరేంద్ర మోడీకి ఏమాత్రం విశ్వసనీయలేదని ఆజాద్ పేర్కొన్నారు. తన గురువు అద్వానీని అణగదొక్కారని, మురళీ మనోహర్ జోషీ ఎంపీ సీటును లాక్కున్నారని, జశ్వంత్‌సింగ్‌ను పార్టీ నుంచే సాగనంపారన్నారు. చివరకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా కట్టడి చే శారన్నారు. విభజనను అడ్డుకున్న కిరణ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమ పార్టీ అధినేత సోనియా గాంధీకే దక్కిందన్నారు. రాష్ట్ర విభజనను మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకున్నా ఇచ్చి తీరామన్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్రస్సును ప్రస్తుతం వెతుక్కుంటున్నారన్నారు. ఆయన తనకు తాను బలవంతుడనుకొని భ్రమపడ్డారన్నారు. పార్టీ ముందు అంతా తక్కువేనన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీగా మారిందని గులాం నబీ అజాద్ విమర్శించారు. అధికారం వారి చేతికి వస్తే రాష్ట్రం దోపిడీకి గురవుతుందన్నారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ అభివృద్ధి కాదన్నారు. టీడీపీని నమ్మవద్దు బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీని ఏమాత్రం నమ్మవద్దని ఆజాద్ పేర్కొన్నారు. ఆ పార్టీ గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చి సెక్యులరిజాన్ని తుంగలో తొక్కిందన్నారు. ఇప్పుడు తిరిగి అదే పార్టీతో జతకట్టినందున దూరం పెట్టాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చెర్మైన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఆత్మ చెర్మైన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వసంత్, మంకాల్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కే అధికారం సిద్దిపేట జోన్: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని గులాంనబీ ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సోనియాగాంధీ జాతీయ పార్టీలను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రాబల్యం నామమాత్రమేనన్నారు. దేశంలో నరేంద్రమోడీ హవా కొనసాగుతున్నట్లు జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియా సృష్టిగా ఆయన అభివర్ణించారు. మోడీ గాలి కేవలం అకాశంలోనే నడుస్తోంది తప్ప భూమిమీద కాదని చమత్కరించారు. -
రేపే పోలింగ్
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకుల హోరు మూగబోయింది. మండు టెండల్లో అభ్యర్థుల చల్లని పలకరింపులకు బ్రేక్ పడింది. మద్యం దుకాణాలు మూతబడ్డాయి. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్‌కు ఒకే రోజు మిగిలి ఉండడంతో ఓటర్లకు ప్రలోభాలు మిన్నంటాయి. అభ్యర్థులు గెలుపు కోసం ఆఖరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రలో భాలు ఓ వంతు అయితే, చివరి 24 గంటల్లో అంతకు మించి ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గీయుల ద్వారా ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకలను చకచక ఓటర్లకు చేరవేస్తున్నారు. ఎన్నికల నిఘా అధికారుల కళ్లు గప్పి ఈ తంతు సాఫీగా సాగిపోతోంది. గోల్డెన్ అవర్స్.. ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీల నేతలు తమ గెలుపోటములపై ‘లెక్కలు’ వేసుకుంటున్నారు. తమ గెలుపునకు గండికొట్టే ఓటర్లను బుట్టలో వేసుకునేందకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా వివిధ కారణాలతో దూరమైన పలు వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమిపై అనుమానాలు కలిగిస్తున్న సమూహాలపై దృష్టి పెట్టి నోట్ల కట్టలు, లిక్కర్‌తో తమవైపు మరల్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓట్ల సంఖ్యను బట్టి ఒక్కో ఓటుకు గరిష్టంగా రూ.వెయ్యి లెక్కన లక్షల రూపాయల ప్యాకేజీలను అంటగడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా పోగుచేసిన ధనం, మద్యాన్ని రహస్య ప్రదేశాల నుంచి బయటకు తీసుకొచ్చి విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. సోమ, మంగళవారం రాత్రి వేళల్లో ఓటర్లకు నోట్లు చేర వేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. పెరిగిన దూకుడు ప్రధాన పార్టీల అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో దూకుడు పెరిగింది. చివరి ఘడియలే కీలకం కావడంతో హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ముఖ్యనేతలు గులాం నబీ ఆజాద్, జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబుల సుడిగాలి పర్యటనలతో జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దీంతో కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి లోక్‌సభ సభ్యుడిగా, తొలి శాసనసభ్యుడిగా చరిత్రకెక్కడానికి ఆయా పార్టీల అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
- తెలంగాణ క్రెడిట్ మాదే - ఫామ్‌హౌజ్‌లో కూర్చునేవారికి అధికారమా? - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారు. జాతీయపార్టీ, లౌకికత్వానికి మారుపేరైన కాంగ్రెస్‌తోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రాంతీయపార్టీలతో తెలంగాణ అభివృద్ధి అసాధ్యమన్నారు. ఫాంహౌజ్‌లో కూర్చుని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు పంపిణీ చేసే వ్యక్తుల చేతికి అధికారం అప్పగిస్తే... తర్వాత ఈ ప్రాంతానికి మంజూరయ్యే పరిశ్రమలు.. పవర్ ప్రాజెక్టులు.. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ మళ్లీ ఆయన కుటుంబసభ్యులకే దక్కుతాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే పురుడు పోసుకుందని, చంటిపిల్ల లాంటి ఈ తెలంగాణను ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని అన్నారు. బీజేపీది విభజించి పాలించే తీరు ప్రస్తుత ఎన్నికలు లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య పోరు అని ఆజాద్ అన్నారు. బీజేపీ మత రాజకీయాలను ప్రేరేపిస్తూ.. విభజించి పాలించే పాలసీతో పని చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ఉన్న అన్ని కులాలు.. మతాలు.. వర్గాలను సంఘటితంగా ఉంచి.. వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం కాంగ్రెస్ సిద్ధాంతమని వెల్లడించారు. బీజేపీది నాధూరాంగాడ్సే మార్గమని.. కాంగ్రెస్‌ది అహింసామార్గమని అన్నారు. బీజేపీ ముసుగులో ఆర్ఎస్ఎస్ అధికారంలో వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హయాంలో 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు అందరికీ తెలిసిన విషయమేనని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. -
తెలంగాణ బిడ్డకు కాంగ్రెస్ తల్లి కావాలి
బాన్సువాడ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే పుట్టిన బిడ్డ లాంటిదని, పెంచి పోషించాలంటే అమ్మలాంటి కాంగ్రెస్‌పార్టీయే అధికారం చేపట్టాలని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు చేసిన ఉద్యమమే కీలకమన్నా రు. పార్టీ ఎంపీలు తెచ్చిన ఒత్తిడితోనే తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం సైతం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడలో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడారు. తెలంగాణ సాధనకు ఎంపీ సురేశ్ షెట్కార్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆజాద్ వివరించారు. కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రభుత్వం రావాలంటే ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టాలన్నారు. బాన్సువాడ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్‌తో పాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులందరినీ గెలిపిస్తేనే తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ హిందువులు, ముస్లిం ల మధ్య చిచ్చు పెడుతోందని, దీన్ని తిప్పికొట్టాల న్నారు. ఆజాద్‌కు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆజాద్ రెండున్నర గంటలు ఆలస్యంగా రావడంతో సభకు హాజరైనవారు ఇబ్బం దులు పడ్డారు. సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువినయ్‌కుమార్, అలీబిన్ అబ్దుల్లా, మాసాని శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కిషో ర్ యాదవ్, ఖాలిఖ్, మీరా నసీముద్దీన్, అసద్‌బిన్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10.30 గంటలకు రా వాల్సిన ఆజాద్ బాన్సువాడకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. దీంతో పట్టణంలో నిర్వహించాల్సి న రోడ్ షోను రద్దు చేశారు. అనంతరం ఆయన నిజామాబాద్ నగరంలో జరిగిన మరో సభలో ఆజాద్ ప్రసంగించారు. బీజేపీకి ధనిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు సహకరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని మతాలను సమానంగా చూస్తుం దన్నారు. హిందువులు, ముస్లింలు రెండు కళ్లలాంటి వారని ఆయన పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం
సీఎం పదవి ఇవ్వనందుకే కేసీఆర్ పార్టీని విలీనం చేయలేదు: ఆజాద్ హైదరాబాద్/ సంగారెడ్ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నగరంలోని కూకట్పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో, అలాగే మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, మరోసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని నిరాకరించినందుకే కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు నిరాకరించారని విమర్శించారు. పదవులపై ఎటువంటి వ్యామోహం లేదని చెప్పిన కేసీఆర్.. రాష్ర్టం ఏర్పాటు అవుతుందన్న విశ్వాసం కలిగాక తన పిల్లల్ని అమెరికా నుంచి రప్పించి రాజకీయాల్లోకి దింపారని దుయ్యబట్టారు. దళితుడిని ముఖ్యమంత్రి, మైనార్టీని ఉపముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఆయనకు రాష్ర్టం ఏర్పాటు కాగానే పదవీకాంక్ష కలిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా కేవలం కాంగ్రెస్‌కే ఉందన్నారు. దళితులు, మైనార్టీలు, బడుగుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిన ఘనత యూపీఏ-2కు దక్కిందన్నారు. తెలంగాణను తామే తెచ్చామని చెబుతున్న ఇతర పార్టీల నేతల మాటలను నమ్మొద్దని కోరారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఓటు వేస్తే ప్రమాదమని, ముస్లింలు కాంగ్రెస్‌కే ఓటు వేయాలని ఆజాద్ కోరారు. కాగా, నగరంలో నిర్వహించిన రోడ్‌షోలో మల్కాజ్గిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, కూకట్పల్లి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ముద్దం నర్సింహయాదవ్, సికింద్రాబాద్ రోడ్‌షోలో లోక్‌సభ అభ్యర్థి అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి జయసుధ, సంగారెడ్డి రోడ్‌షోలో మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్‌కుమార్ రెడ్డి, సంగారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ ముగ్గురూ ఇక్కడే..
కీలక ఎన్నికల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో అనుబంధం ఉన్న ముగ్గురు ఏఐసీసీ నేతలను తెలంగాణకు తరలించింది. దిగ్విజయ్, వయలార్ రవి, గులాంనబీ అజాద్ హైదరాబాద్‌లో మకాంవేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆజాద్ రోజుకు నాలుగు లేదా ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. శనివారం పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించేం దుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జహీరాబాద్ సభలో కూడా పాల్గొంటానని నాయకులకు సూచించారు. 27న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, వనపర్తి, షాద్‌నగర్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. అలాగే దిగ్విజయ్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. శనివారం ప్రధాని మన్మోహన్ హాజరుకానున్న భువనగిరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. వయలార్ రవి మాత్రం హైదరాబాద్‌లో ఉండి ఎన్నికలప్రచార సరళి, అభ్యర్థుల వ్యవహారాలు, పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
ఐడీ కార్డు లేకపోతే ఆజాద్ అయినా...
ఓటర్ గైడ్: ఓటర్ జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డు కాని, ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్స్ లాంటి ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కానీ లేకుండా ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించరు. గుర్తింపు కార్డు లేకుండా వెళ్లిన కేంద్ర మంత్రి ఆజాద్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. జమ్ము పార్లమెంటు స్థానానికి గురువారం(ఏప్రెల్10) జరిగిన పోలింగ్‌లో కేంద్ర మంత్రి గులాబ్ నబీ ఆజాద్ ఓటువేయడానికి వెళ్లారు. అయితే ఆయన తన ఓటరు గుర్తింపు కార్డును తీసుకెళ్లడం మరచి పోయారు. మీరు కేంద్ర మంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా ఓటరుగా వచ్చినప్పుడు గుర్తింపు కార్డు చూపాల్సిందే అని పోలింగ్ అధికారి పట్టుబట్టారు. చివరకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు అజాద్ గుర్తింపుకు పూచీ వహించడంతో చివరకు ఎలాగోలా అజాద్ ఓటు వేయగలిగారు. కాబట్టి ఓటేసేందుకు వెళ్లేటప్పుడు ఓటరు గుర్తింపు కార్డు, అది లేకపోతే ఇతర ఏవైనా గుర్తింపు కార్డులు తీసుకెళ్లడం మరచిపోకండి. -
'ఆజాద్.. మీ ఐడీ కార్డు చూపించండి'
ఆయనో కేంద్ర మంత్రి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయినా కూడా.. పోలింగ్ కేంద్రం వద్ద ఆయనను గుర్తింపుకార్డు చూపించాలని సిబ్బంది గట్టిగా అడిగారు. జమ్ము లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఈ సంఘటన జరిగింది. జోగిగేట్ ప్రాంతంలో గల డీపీఎస్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి కేంద్ర మంత్రి, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ వెళ్లారు. కానీ, ఆయన తన గుర్తింపుకార్డు తీసుకెళ్లకపోవడంతో అక్కడి ప్రిసైడింగ్ అధికారి ఆజాద్‌ను ఓటు వేయనివ్వలేదు. ఓటర్ల జాబితాలో పేరున్నా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు లేనిదే ఓటు వేయడానికి వీల్లేదన్న విషయం తెలిసిందే. అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకుడొకరు ఆజాద్ గుర్తింపునకు తాను ష్యూరిటీగా ఉంటానని ముందుకు రావడంతో ఎలాగోలా ఆజాద్ ఓటు వేగలిగారు. కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ జమ్ము జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారని, జాతీయ స్థాయిలో సీనియర్ నాయకుడని చెప్పారు. బీజేపీ నేతలు కూడా అదే విషయం తెలిపారు. ఉధంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న ఆజాద్‌కు.. జమ్ములో ఓటుహక్కుంది. -
కాశ్మీర్ లో ఎన్నికలపై దాడి చేసే కుట్ర భగ్నం
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలను భగ్నం చేసేందుకు, వోటు వేయాలనుకున్న ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతాదళాలు విఫలం చేశాయి. జమ్మూ ప్రాంతంలోని డోడా జిల్లాలోని పూనేజా-భదర్వాహ్ ఏరియాలోని రంట్ సాకా అడవుల్లో ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆయుధాలను పోలీసులు చేజిక్కించుకున్నారు. పోలీసులు రంట్ సాకా అడవుల్లోని కొండకోనల్లో భదానీ నాలా పక్కన దాదాపు 48 గంటల పాటు వెతికి, 8 కిలోల ఆర్డ డీ ఎక్స్, ఆరు ఆధునిక ఆయుధాలను, ఏడు గ్రెనేడ్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని, కమ్యూనికేషన్ పరికరాలు,పాకిస్తానీ కరెన్సీ, రెండు డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఉగ్రవాదుల సాయంతో విదేశీ ఉగ్రవాదులు ఈ స్థావరాన్ని నిర్మించారు. ఈ స్థావరం నుంచి ఉగ్రవాదులు ఎన్నికలను భగ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం లభించిన తరువాత భద్రతాదళాలు ఈ ఏరియాలో సోదాలు జరిపాయి. భదర్వాహ్ - డోడా ఉధమ్ పూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ పోటీలో ఉన్నారు. -
సీమాంధ్ర ఎంపీలవి తప్పుడు హామీలు: ఆజాద్
తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు తప్పుడు హామీలు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏసీసీసీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలంతా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పారని, కానీ తాము నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్లు వెనక్కి తగ్గారని ఆయన అన్నారు. తెలుగు దేశం పార్టీ రాతపూర్వకంగా తాము విభజనకు అనుకూలమని చెప్పిందని, తమ పార్టీ వాళ్లు మాత్రం సహకరించలేదని ఆయన అన్నారు. -
నేడు ఢిల్లీలో ఎన్ఐఎన్ కిట్ల ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఆహారం, నీళ్లలో జరిగే కల్తీని అరికట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తమ సంస్థ రూపొందించిన కిట్లను గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఆవిష్కరిస్తున్నట్టు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఒక ప్రకటనలో తెలిపింది. బయో సర్వ్ బయో టెక్నాలజీ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని కిట్లను రూపొందించామని, ఆహారం, నీళ్లలో ఉన్న వివిధ రకాల బ్యాక్టీరియాను ఈ కిట్ల ద్వారా తెలుసుకోవచ్చునని, తక్కువ ధరకే ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. అంతేకాకుండా రక్త సేకరణ, నిల్వ, రవాణా సంబంధిత ఖర్చులను భారీగా తగ్గించే మరొక రక్త పరీక్షా కిట్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు ఎన్ఐఎన్ తెలిపింది. దీనిద్వారా రక్తంలో విటమిన్ ‘ఎ’ స్థితి సులభంగా తెలుసుకోవచ్చు. డెంగీ జ్వర నిర్ధరణకు చేసే ఎలీసా రక్త పరీక్షా విధానంలోని సీరమ్‌లోని ఇనుము శాతాన్ని కనుగొనే విధానాన్ని కూడా అభివృద్ధి చేశామని, ఈ కిట్ల వల్ల తక్కువ ఖర్చుతో ఫలితాలను తెలుసుకోవచ్చునని వివరించింది. -
ఎంబీబీఎస్ పొడిగింపు లేదు: ఆజాద్
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితిని పెంచే విషయంలో తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ కాలపరిమితిని 5.5 ఏళ్ల నుంచి 6.5 ఏళ్లకు పెంచనున్నారన్న ఊహాగానాలు రావడంతో వైద్యవిద్యార్థులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు వివరణ ఇచ్చారు. పీజీ కోర్సులో చేరే ఎంబీబీఎస్ విద్యార్థులు ఒక ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించి ఉండాలన్న నిబంధనతో భారత వైద్య మండలి (ఎంసీఐ) జారీ చేసిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎంబీబీఎస్ కాలపరిమితి పెంపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థుల ప్రతినిధులతో గురువారమిక్కడ ఆజాద్ మాట్లాడారు. కోర్సు కాలపరిమితిని పెంచే ప్రతి పాదన లేదని చెప్పారు. 2015-16వ సంవత్సరంలో పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారికి గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది వైద్య సేవల నిబంధన తప్పనిసరి కాబోదని కూడా ఆజాద్ భరోసా ఇచ్చారు. -
సురక్షితంగా ఇంటికి..
ప్రసవానంతరం ఉచిత రవాణా సదుపాయం మాతా శిశువును ఇంటికి చేర్చేందుకు నూతన అంబులెన్సలు నగు-మగు పథకాన్ని ప్రారంభించిన గులామ్ నబీ ఆజాద్, సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : ప్రసవానంతరం మాతా, శిశు మరణాలను తగ్గించే చర్యల్లో భాగంగా ‘నగు-మగు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక అంబులెన్స్‌లను ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకున్న తర్వాత తల్లి బిడ్డలను ఉచితంగా ఇంటికి చేర్చడం కోసం ఈ వాహనాలను ఉపయోగిస్తారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ జాతీయ పట్టణ ఆరోగ్య అభియాన్ (నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్-ఎన్యూహెచ్ఎం)ను నగరంలోని ఫ్రీడం పార్కులో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్‌తో కలిసి ఈ వాహనాలను ఆరోగ్య శాఖకు అప్పగించారు. అనంతరం ఖాదర్ మాట్లాడుతూ... జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) కింద ఇప్పటి వరకూ గర్భిణులను ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చేవారన్నారు. ప్రసవించిన తర్వాత సొంత ఖర్చులతో బిడ్డతో పాటు తల్లిఇంటికి చేరుకునే వారని తెలిపారు. సరైన వాహన సదుపాయం లేకపోవడం వల్ల కొంత మంది తల్లులు, శిశువులు అనారోగ్యానికి గురికావడమే కాకుండా, కొన్ని సార్లు మృ్యు వాత పడుతున్నారని చెప్పారు. ఇలాంటి వాటిని నివారించడానికి అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన ‘నగు-మగు’ వాహనాలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. వాహనాల్లో నైపుణ్యం గల సిబ్బంది ఉంటారన్నారు. బాల స్వస్థ కార్యక్రమం (ఆర్బీఎస్కే) పథకం కింద 0-18 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి వీలుగా రాష్ట్రంలో తాలూకాకు రెండు చొప్పున వైద్య బృదాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో బృదంలో డాక్టరు, నర్సు, కంటి వైద్యుడు ఉంటారని వివరించారు. అంగన్వాడీలు సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సందర్శించి ఈ బృదాలు రోజుకు కనీసం 150 మంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీరు రెఫర్ చేసిన పిల్లలకు శస్త్ర చికిత్స సహా అవసరమైన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించడం కోసం వైద్య రంగానికి ఎక్కువ నిధులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. -
ఆజాద్ రాక..ఆగమేఘాలపై మారిన సీను
-
సాధారణ ఎన్నికల్లోగా తెలంగాణ
-
తెలంగాణలో పార్టీ పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంతో తెలంగాణలో పార్టీ పుంజుకుందా?, ప్రజల్లో స్పందన ఎలా ఉంది?, అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా?.. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ప్రయత్నించారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. సుమారు గంటకు పైగా గాంధీభవన్‌లో గడిపారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, సురేష్‌షెట్కార్, పొన్నం ప్రభాకర్, వీహెచ్, ఎంఏ ఖాన్, మాజీమంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఫరీదుద్దీన్తోపాటు పలువురు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఆజాద్‌ను కలిశారు. జానారెడ్డి, డీఎస్, తర్వాత డిప్యూటీ సీఎం ఆజాద్‌తో ముఖాముఖి సమావేశమై తెలంగాణలో పార్టీ పరిస్థితిని వివరించారు. వీరు వేర్వేరుగా ఆజాద్‌తో మాట్లాడే సమయంలో బొత్స కూడా బయటే ఉన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిని ఆరా తీసిన ఆజాద్‌తో ఆ ప్రాంత నేతలు.. గతంలో తాము తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉండేదని, విభజనపై నిర్ణయం తీసుకున్న తరువాత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకం తమకు ఏర్పడిందన్నారు. ఎంపీ సీట్ల విషయానికొస్తే అంజన్‌కుమార్ 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పగా... షెట్కార్ మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా మిగిలిన 16 స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. అంతకుముందు డీఎల్ రవీంద్రారెడ్డి సైతం ఆజాద్‌ని కలిసివెళ్లారు. పార్టీ పరిస్థితి, సీఎం కిరణ్ వల్ల పార్టీకి జరుగుతున్న నష్టంపై డీఎల్ ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే మస్తాన్‌వలీ కూడా ఆజాద్‌ను కలిశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు హైకమాండ్ దగ్గర గట్టి వ్యూహం ఉందని వారితో ఆజాద్ చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క కూడా ఆజాద్‌తో విడిగా సమావేశమయ్యారు. విభజన విషయంలో అసెంబ్లీలో ఏయే పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయన్న వివరాలను ఆజాద్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర పగ్గాలు మళ్లీ ఆజాద్‌కే? కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలను మళ్లీ కేంద్రమంత్రి ఆజాద్‌కే అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు విషయంలో ఆజాద్ క్రియాశీల పాత్ర పోషించారు. ఇప్పుడు రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం లేదా పొత్తు కుదుర్చుకునే అంశాల్లో ఆజాద్ చొరవ ఉపకరిస్తుందనే ఉద్దేశంతో మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పగించే ఆలోచన హైకమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు మధ్యప్రదేశ్ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. 17న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశాల తర్వాత ఈ మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. -
ఏ ముఖంతో మళ్లీ వచ్చావ్?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన నువ్వు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఇక్కడికి వచ్చావ్?’’ కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌ను నిలదీస్తూ పీసీసీ కార్యదర్శి టి.నిరంజన్ చేసిన వ్యాఖ్యలివి. బుధవారం గాంధీభవన్‌కు వచ్చిన నిరంజన్.. ఆజాద్‌ను చూడగానే ఆవేశానికి లోనై ‘‘మీ వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమవుతోంది. మాబోటి కార్యకర్తలను పట్టించుకోవడమే మానేశారు. పదేళ్లుగా నామినేటెడ్ పదవులిస్తామని ఆశ చూపుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఆ పనిచేయలేదు. ఈ లోపు నువ్వు రెండుసార్లు రాష్ట్ర ఇన్చార్జ్గా ఎంజాయ్ చేసి పోయావ్ ’’ అని మండిపడ్డారు. ఈ పరిణామంతో ఆజాద్ తెల్లమొహం వేయగా, అక్కడున్న వాళ్లంతా విస్తుబోయారు. ‘‘రాష్ట్ర ఇన్చార్జ్గా ఉన్నంత కాలం నువ్వు (ఆజాద్‌ను ఉద్దేశించి) పీసీసీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉన్నావ్ కదా! నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని సీఎంను ఎందుకు ఆదేశించలేకపోయావ్? ఇక కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తదనే ఆశ కూడా చచ్చిపోయింది. మేం ఇప్పుడు ముసలోళ్లమైపోతిమి. రాహుల్ ఏమో యువకులకే పెద్దపీట వేస్తున్నామని చెబుతుంటే రేపు మాకు పదవులిచ్చేదెవరు? మీకంటే బొత్సనే చాలా నయం. తన చేతిలో ఉన్నంత మేరకు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పదవులన్నీ నాయకులకు ఇచ్చిండు. మీ సీఎం కనీసం విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను కూడా భర్తీ చేయలేని దౌర్భాగ్యుడిగా మారాడు’’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. -
సాధారణ ఎన్నికల్లోగా తెలంగాణ
కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ రాజ్యాంగం ప్రకారం విభజన ప్రక్రియ సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ కార్యాలయంలో జరిగిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై వెనకడుగు వేయబోదని స్పష్టం చేశారు. నెలరోజులు గడిచినా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగలేదన్నారు. విభజన ముసాయిదా బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని ఆయన సూచించారు. ఈ నెల 23లోగా బిల్లుపై చర్చించి అసెంబ్లీ నిర్ణయాన్ని పార్లమెంట్‌కు పంపగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీ నిర్ణయం అనుకూలంగా ఉన్నా.. వ్యతిరేకంగా ఉన్నా రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ విభజన ప్రక్రియను పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. కిరణ్ కాంగ్రెస్ సీఎంగా ఉన్నారని, ఆయన కొత్త పార్టీ ఎందుకు పెడతారని ఆయన ప్రశ్నించారు. పీవీ గొప్ప మేధావి: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజకీయ మేధావి, సంస్కరణవాది అని గులాంనబీ ఆజాద్ కొనియాడారు. సుస్థిర పాలన, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆయన చలువేనని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. కాగా, ఈ ఏడాదితో భారతదేశం పోలియోరహిత దేశంగా మారుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రచురించిన బాపూజీ డైరీ-2014, ఆచార్య వినోభాబావే టేబుల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దానం నాగేందర్, సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి డెడ్ లైన్ కు అసెంబ్లీ కట్టుబడి ఉంటుంది: ఆజాద్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ధేశించిన గడువులోపే తెలంగాణ ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పంపుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాబ్ నబీ ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మరోసారి ఆజాద్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన 40 రోజుల గడువు సమీపిస్తోందని.. ఆ గడువులోపే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పాస్ చేయాల్సివుంటుందన్నారు. భారత ప్రభుత్వం, రాష్ట్రపతి పెట్టిన డెడ్ లైన్ లోపే బిల్లును అసెంబ్లీ పాస్ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2013ను జనవరి 23 తేదిలోపు తిరిగి పంపాలని రాష్ట్రపతి సూచించిన సంగతి తెలిసిందే. మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ అభిప్రాయాన్ని కేంద్ర పరిగణనలోకి తీసుకుంటుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ..పార్లమెంట్ తగిన నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు. -
లింగ నిర్ధారణ నియంత్రణలో ‘మహా’ మేటి!
ముంబై: స్త్రీ,పురుష నిష్పత్తిలో పెరుగుతున్న వ్యత్యానికి ప్రధాన కారణమైన లింగ నిర్ధారణ పరీక్షలను అడ్డుకోవడంలో మహారాష్ట్ర, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ విషయంలో రాష్ట్రం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్రమంత్రి గులామ్ నబీ ఆజాద్ పార్లమెంట్లో కొనియాడారు. లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం-1994ను మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఈ చట్టాన్ని అతిక్రమించి, లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినవారిని మహారాష్ట్ర ప్రభుత్వం దోషులుగా ప్రకటించడమేగాకుండా సంబంధిత వ్యక్తుల లెసైన్సులను రద్దు చేస్తూ, పరీక్షలు జరిపే యంత్రాలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఇటువంటి చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆజాద్ వెల్లడించిన గణాంకాల ప్రకారం... గర్భ నిర్ధారణ నియంత్రణ చట్టం-1994 ప్రకారం దేశవ్యాప్తంగా 1,833 కేసులు నమోదైతే ఒక్క మహారాష్ట్రలోనే 527 మందిపై రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 143 మందిని దోషులుగా నిర్ధారిస్తే కేవలం మహారాష్ట్రలోనే 52 మందిని దోషులుగా నిర్ధారించారు. దేశంలోని వివిధ రాష్ట్రాన్నింటిలో కలిపి 65 మంది లెసైన్సులను రద్దు చేస్తే మహారాష్ట్రలోనే 37 మంది లెసైన్సులు రద్దు చేశారు. ఇక స్వాధీనం చేసుకున్న యంత్రాలలో కూడా.. మహారాష్ట్ర ముందుంది. దేశవ్యాప్తంగా 1,242 యంత్రాలను స్వాధీనం చేసుకోగా రాష్ట్రంలో 662 లింగ నిర్ధారణ జరిపే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
దూకుడు పెంచండి: బీజేపీ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై దాడి చేయడంలో, వారి ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వడంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని బీజేపీ అగ్రనాయకత్వం పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా విభాగానికి సూచిం చింది. అయితే.. అదే సమయంలో హుందాగా వ్యవహరించాలని, ప్రతిపక్షాలపై చేసే విమర్శల్లో ఔచిత్యాన్ని ప్రదర్శించాలని ఆదేశించింది. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ, రాష్ట్ర శాఖల అధికార ప్రతినిధులు, మీడియా విభాగాల సిబ్బందితో ఆ పార్టీ ఒక వర్క్‌షాపును నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో, విపక్షాలతో వ్యవహరించాల్సిన పద్ధతులపై సీనియర్లు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ ప్రసంగించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలు చేసేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సుష్మాస్వరాజ్ సూచించారు. ఆయా అంశాలపై పార్టీ నేతల వ్యాఖ్యల్లో వైరుధ్యం ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. అవినీతి, దేశ ఆర్థిక పరిస్థితి, కుంటుపడిన పాలన తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు. మోడీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగం అనంతరం ఆయనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు సరిగా తిప్పికొట్టలేకపోయారని అరుణ్‌జైట్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్‌షాప్ అనంతరం బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. సల్మాన్ ఖుర్షీద్, ఆజాద్ వంటి కాంగ్రెస్ నేతలు అభ్యంతరకరమైన భాషతో మోడీని ఇతర బీజేపీ నేతలను విమర్శిస్తున్నారని, కానీ తాము అలా వ్యవహరించదలచుకోలేదని వ్యాఖ్యానించారు. -
ప్రజలే జగన్‌ను బయటికి తెచ్చుకుంటారు