![Rahul And Sonia not Coming to the Public Meeting on 8th this month - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/7/gandhi.jpg.webp?itok=9mQa_s_P)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మలివిడత ప్రచారానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి మన్నెగూడలో ఈ నెల 8న జరగనున్న భారీ బహిరంగ సభను 7వ తేదీకి మార్చారు. ఈ సభకు సోనియా ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆమె తెలంగాణకు రావడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు జాతీయ నాయకులు గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్‌లు హాజరుకానున్నారని పేర్కొన్నాయి. ఇప్పటికే తొలివిడత ప్రచారంలో పాల్గొన్న రాహుల్ కూడా మలివిడత రావడం లేదని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment