కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన రాజీనామా తర్వాత ఆజాద్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని ధారపోశానని అన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కాంగ్రెస్‌పై ఆజాద్ విరుచుకుపడ్డారు. కశ్మీర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాపై క్షిపణులు ప్రయోగించింది. నేను వాటిని రైఫిల్‌తో నాశనం చేశాను. ఒక వేళ నేను బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉంటే వారు అదృశ్యమయ్యేవారంటూ పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను 303 రైఫిల్‌తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను అంటూ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే తాను.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు.
మరోవైపు.. తాను 52 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్నానని అన్నారు. ఈ క్రమంలో ఇందిరా గాంధీని తల్లిగా, రాజీవ్ గాంధీని సోదరుడిగా భావించినట్లు ఆజాద్ చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం.. ఆజాద్ సొంత పార్టీని పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
Ghulam Nabi Azad Says “Congress Fired Missiles At Me, I Only Retaliated With Rifle” https://t.co/3QxAW5TzoT
— ZOKR (@zokrofficial) September 9, 2022
Comments
Please login to add a commentAdd a comment