![Rahul Gandhi Asked About Life Partner Says Would Prefer Woman Who - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/28/Rahul-gandhi1.jpg.webp?itok=mWnBGsfX)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహం విషయం చాలా సార్లు చర్చకు వచ్చినా ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఐదు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉండిపోయారు. అయితే, తాజాగా తనకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన రాహుల్.. పెళ్లిపై పలు విషయాలు పంచుకున్నారు.
యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్నించగా.. తన తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ ఇరువురి గుణాలు కలగలిసిన భాగస్వామితో జీవితంలో స్థిరపడేందుకు ఇష్టపడతానని తెలిపారు. నాయనమ్మ ఇందిరా గాంధీని తన రెండో తల్లిగా అభివర్ణించారు రాహుల్. ఈ క్రమంలో ఆమె లాంటి మహిళ దొరికితే జీవితంలో స్థిరపడతారా అని అడగగా ‘ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అలాంటి లక్షణాలు ఉన్న మహిళకు ప్రాధాన్యం ఇస్తాను(నా ఆలోచనల్లో లేదు). కానీ, నా తల్లి, నాయనమ్మల గుణాలు కలగలిసి ఉంటే మంచిది.’ అని సమాధానమిచ్చారు రాహుల్.
ఈ సందర్భంగా మోటర్ సైకిల్, సైకిల్ నడపడానికి తాను ఎక్కువ ఇష్టపడతానని తెలిపారు రాహుల్. ఎలక్ట్రిక్ బైకులు తయారు చేసే చైనా సంస్థను గుర్తు చేసుకున్నారు. తన ఇంటర్వ్యూను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాహుల్ తనకు కారు కూడా లేదని వెల్లడించారు. తన వద్ద ఉన్న సీఆర్-వీ కారు తన తల్లిదని స్పష్టం చేశారు. కార్లు, బైకుల అంటే తనకు ఇష్టం లేదని, కానీ, రైడ్‌కు వెళ్లడమంటే ఇష్టమని చెప్పారు.
ఇదీ చూడండి: రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్!
Comments
Please login to add a commentAdd a comment