rajeev gandhi
-
గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్టుంది : కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా (సీఎం రేవంత్) రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ‘దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు. నీఆలోచనల్లో కుసంస్కారం.. నీ మాటలు అష్ట వికారం. తెలంగాణతల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రేస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా?. .. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం.తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం’ అని కేటీఆర్ అన్నారు.సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది.... దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు.... నీఆలోచనల్లో కుసంస్కారం ... నీ మాటలు అష్ట వికారం ..... తెలంగాణతల్లి…— KTR (@KTRBRS) August 28, 2024ఇదిలా ఉండగా.. తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఇక, డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. -
TG: ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పంపిణీ చేశారు. సివిల్స్‌లో ప్రిలిమ్స్ పాసై మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న 135 మందికి ఆర్థికసాయం అందించారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. 90 రోజుల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని, మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో తెలంగాణ యువత రాణించాలని, అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదలకు మంచి విద్యను అందిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్దిలో పనిచేస్తున్నాం. సివిల్స్ విద్యార్ధులకు ఆత్మస్తైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నం. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నాం. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలి. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తాంగతంలో సచివాలయంలోరి రానివ్వని పరిస్థితి ఉండేది. సచివాలయంలోకి వెళ్తే అరెస్ట్ చేయించారు. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. పరిశ్రమలు పెట్టే వాళ్లంతా వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ల కోసం వెతుతుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడాకారులకు శిక్షణ ఇస్తాం. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. పేద పిల్లలకు న్యాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. వచ్చే 10, 15 రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తాం. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. ’ అని తెలిపారు. ‘డిప్యూటీ సీఎం భట్టి కమెంట్స్..‘సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించి తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. సివిల్స్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి కొంతైనా ఉపశమనం లభిస్తుంది. మన రాష్ట్రం నుంచి ఐఎఎస్ అయిన వారు ఏ రాష్ట్రంలో పనిచేసినా.. మనకు గర్వకారణమే.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను 5 వేల కోట్ల తో ఏర్పాటు చేస్తున్నాం. మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకుంటున్న వారిలో ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 21 మంది. ఓబీసీ కేటగిరిలో 62 మంది. ఎస్సీ కేటగిరిలో 19 మంది.. ఎస్టీ కేటగిరీలు 33 మంది. ఎస్టీ కేటగిరిలో 33 మందిలో 22 మంది మహిళా అభ్యర్థులు ఉండడం స్ఫూర్తిదాయకం. దేశంలో ఈ తరహా పథకం అమలు ఇదే తొలిసారి.’ అని తెలిపారు. -
రేవంత్.. నా మాటలను గుర్తు పెట్టుకో: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన రోజునే తొలగిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చీప్ మినిస్టర్ రేవంత్ నా మాటలను గుర్తు పెట్టుకో అని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం. బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నీచమైన ఆలోచన విధానాన్ని చూపుతుంది. మీరు మానసిక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’అని కేటీఆర్ అన్నారు.Mark my words Cheap Minister RevanthWe will clear out the trash from the surroundings of Dr. B. R. Ambedkar secretariat the very same day we are back in officeCan’t expect a Delhi Ghulam like you to ever understand self-respect & pride of Telangana Using filthy language in…— KTR (@KTRBRS) August 20, 2024ఇదిలా ఉండగా.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే.. కొంతమంది తొలగిస్తామంటున్నారు. ఎవరికైనా చేతనైతే విగ్రహాన్ని ముట్టుకోండి.. వాళ్లను కొట్టి తీరతామంటూ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన. ఆ బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తామని అన్నారాయన. రాజీవ్ విగ్రహం స్థానంలో కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. -
టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది- కొండా రాజీవ్
-
ప్రధాని పదవికి వయసు అడ్డంకి కాదేమో!
భారతదేశం సహా అనేక ప్రజాస్వామ్య దేశాల్లో చట్టసభల సభ్యత్వం పొందడానికి రాజకీయ నాయకులకు ఎలాంటి వయోపరిమితి లేదు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు చేపట్టడానికి కూడా ఇంత వయసు దాటిన నేతలు అనర్హులు అనే నిబంధన ఏదీ లేదు. రాజ్యాంగ, రాజకీయ పదవులకు గరిష్ఠ వయోపరిమితి లేకపోవడం సబబేనని, మానసిక సామర్ధ్యం ఉన్న నాయకులు ఎంత వయసువారైనా పదవుల చేపట్టడంలో తప్పేమీ లేదని ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజ్యాంగ నిపుణులూ, ప్రజాతంత్రవాదులూ అభిప్రాయపడుతున్నారు. 81 ఏళ్లకు ప్రధానిగా మొరార్జీ దేశాయి నిజమే, శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నంత వరకూ ప్రజలు ఎన్నుకున్నంత కాలం ఏ వయసు నాయకులైనా పదవులు అధిష్ఠించడం సక్రమమేనని రాజనీతి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇండియాలో 1977 మార్చి లోక్ సభ ఎన్నికల అనంతరం తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత మొరార్జీ దేశాయి వయసు 81 సంవత్సరాలు. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మాజీ కేంద్ర మంత్రి అయిన మొరార్జీ భాయ్ ఇంత పెద్ద వయసులో ప్రధాని పదవికి ఎన్నికకావడమేమిటని కొందరు వ్యాఖ్యానించారు. చరిత్రకెక్కిన రాజీవ్ గాంధీ మంకు పట్టుదల ఉన్న నేతగా అప్పటికే పేరున్న గాంధీయవాది మొరార్జీ 2 ఏళ్ల 4 మాసాలు ప్రధానిగా కొనసాగారు. 1896 ఫిబ్రవరి 29న జన్మించిన దేశాయి జీ 99 ఏళ్లు జీవించారు. ఆ తర్వాత మళ్లీ దేశ ప్రధాని అయిన ఏ నాయకుడి వయసు గురించీ చర్చ అంతగా జరగలేదు. 1984 చివరిలో తల్లి మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టిన రాజీవ్ గాంధీ వయసు 40 ఏళ్లు. ఇండియాలో అత్యంత పిన్నవయస్కుడైన ప్రధానిగా ఆయన చరిత్రకెక్కారు. అనంతరం 1997లో 77 ఏళ్ల వయసులో ప్రధాని అయిన ఇందర్ కుమార్ గుజ్రాల్ గురించి కూడా అప్పట్లో పెద్దగా చర్చ జరగలేదు. ఆయన దాదాపు 11 నెలలు పదవిలో కొనసాగారు. పదేళ్లపాటు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ గుజ్రాల్ తర్వాత 1996 మార్చిలో బీజేపీ తరఫున తొలి ప్రధాని అయిన అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి 73 ఏళ్లు దాటాక అత్యున్నత పదవిని అధిష్ఠించారు. మళ్లీ వరసగా 1998, 1999లో ప్రధాని పదవి చేపట్టి 6 ఏళ్ల 2 మాసాలు కొనసాగిన వాజపేయి 79 సంవత్సరాల వయసులో పదవి నుంచి దిగిపోయారు. 2004 పార్లమెంటు ఎన్నికల తర్వాత తొలి యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ వయసు అప్పటికి 71 ఏళ్లు. పదేళ్లు ప్రధానమంత్రిగా కొనసాగాక 2014 మే నెలలో పదవి నుంచి దిగిపోయినప్పుడు మన్మోహన్ జీ వయసు 81 సంవత్సరాలు. 16వ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో 2014 మేలో 63 సంవత్సరాల వయసులో తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేశారు నరేంద్ర మోదీ. వచ్చే ఏడాది ఎన్నికల్లో ప్రధానిగా మోదీ ఎన్నికైతే.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ జీ ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థిగా పోటీపడి మూడోసారి ప్రధాని అయ్యే పక్షంలో ఆయన 78 ఏళ్ల ఆరు నెలల వయసులో 2029 మే నెలలో ఉన్నత పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన ప్రముఖుల వయసు గురించి ఇప్పుడు రాజకీయ పరిశీలకులు ప్రస్తావించడానికి కారణాలు లేకపోలేదు. అధ్యక్షుడి హోదాలో బైడెన్ 80వ పుట్టిన రోజు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ (జో) బైడెన్ పదవిలో ఉండగా 80వ పుట్టినరోజు జరుపుకున్న మొదటి దేశాధినేతగా చరిత్రకెక్కారు.అంతేగాక, ఈ వయసులో ఆయన కొద్ది నెలల క్రితం తాను రెండోసారి అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అధ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్టు ప్రకటించారు. ఒకవేళ బైడెన్ పార్టీ టికెట్ సంపాదించి 2024 నవంబర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే–81 సంవత్సరాల వయసులో 2025 జనవరి 20న దేశాధ్యక్షునిగా ప్రమాణం చేసే తొలి నాయకుడిగా కొత్త రికార్డు నెలకొల్పుతారు. 1951లో పూర్తి చేసిన రాజ్యాంగ సవరణ ఫలితంగా అమెరికా అధ్యక్ష పదవిని రెండుసార్లు మించి నిర్వహించకూడదనే నిబంధన అమలులోకి వచ్చింది. అంతేగాని, దేశాధ్యక్ష పదవికి పోటీపడడానికి అమెరికాలో గరిష్ఠ వయోపరిమితి లేదు. అంతేగాక, అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు, గవర్నర్ పదవులు సహా అన్ని చట్టసభల పదవులుకు పోటీచేయడానికి ఎలాంటి వయోపరిమితి లేదు. ఇండియాలో ఏ పదవి కోసమైనా ఎన్నిసార్లయినా లేదా ఏ వయసులోనైనా పోటీచేయడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. పదవులకు పోటీపడే నాయకుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటే నేతల వయసుపై జనం పెద్దగా చర్చించరు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
బాబు వదిలి వెళ్లిపోయిన రూ.3 వేల కోట్ల బకాయిలను తీర్చిన జగన్ ప్రభుత్వం
-
సోనియాకు బిగ్ పంచ్.. ‘ఆమె’ నాకు తల్లిలాంటిది: ఆజాద్
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన రాజీనామా తర్వాత ఆజాద్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని ధారపోశానని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కాంగ్రెస్‌పై ఆజాద్ విరుచుకుపడ్డారు. కశ్మీర్లో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాపై క్షిపణులు ప్రయోగించింది. నేను వాటిని రైఫిల్‌తో నాశనం చేశాను. ఒక వేళ నేను బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉంటే వారు అదృశ్యమయ్యేవారంటూ పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను 303 రైఫిల్‌తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను అంటూ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే తాను.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. మరోవైపు.. తాను 52 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్నానని అన్నారు. ఈ క్రమంలో ఇందిరా గాంధీని తల్లిగా, రాజీవ్ గాంధీని సోదరుడిగా భావించినట్లు ఆజాద్ చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం.. ఆజాద్ సొంత పార్టీని పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. Ghulam Nabi Azad Says “Congress Fired Missiles At Me, I Only Retaliated With Rifle” https://t.co/3QxAW5TzoT — ZOKR (@zokrofficial) September 9, 2022 -
అతని రిలీజ్ సంగతి మమ్మల్నే తేల్చమంటారా?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి పేరరివాలన్ విడుదల విషయంలో కేంద్రం, తమిళనాడు గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరరివాలన్ విడుదల విషయంలో ఈ నెల పదో తేదీ లోగా తేల్చాలని, లేదంటే అవసరమైన ఆదేశాలను తామే జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఇక ఈ విషయంలో తదుపరి వాదనలేవీ లేవని కనుక కేంద్రం భావిస్తే పేరరివాలన్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, రాజ్యాంగ ధర్మాసనం, ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంగానే దీనిని భావిస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. ఈ నెల 10లోగా ఏదో ఒక విషయం చెప్పాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. రాజీవ్‌గాంధీ హత్యకేసులో ముద్దాయిలుగా ఉన్న పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు శాసనసభ ఆమోదించింది. అయితే, ఈ బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేశారు. దీంతో పేరరివాలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని, కాబట్టి ఆయన నిర్ణయంతో సంబంధం లేకుండా తమను విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ పీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. తదుపరి వాదనలేవీ లేవని కేంద్రం కనుక స్పష్టంగా చెప్పేస్తే పేరరివాలన్ విడుదలపై ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. మెరిట్ల ఆధారంగా కేసును వాదించడానికి మీరు సిద్ధంగా లేనందున మేము అతనిని జైలు నుండి విడుదల చేయమని ఉత్తర్వు జారీ చేస్తామ. కేంద్రం ఆదేశానుసారం తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తే గనుక అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానికి మేము కళ్ళు మూసుకోలేము. అధికారానికి పరిమితులు ఉండొచ్చు. కానీ, రాజ్యాంగం మాత్రం ఆగిపోకూడదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
కేంద్ర బడ్జెట్ 2022: మీకు ఈ విషయాలు తెలుసా..
మళ్లీ కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కేంద్రం ఎవరెవరికి ఉపశమనం కలిగిస్తుంది, ఎవరిపై భారం పెరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడేకాదు ఏటా బడ్జెట్ వచ్చిందంటే ఉత్కంఠగానే ఉంటుంది. అయితే బడ్జెట్లో లెక్కలే కాకుండా.. మరెన్నో విశేషాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? నెహ్రూ.. ఇందిర.. రాజీవ్ 1958లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్‌ను సమర్పించి అలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987–88లో ఆర్థికమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. తెల్లారింది లేవండోయ్.. 2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. రైల్వేను కలిపేశారు.. 2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్‌ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైటీ తొలి ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొదటి బడ్జెట్‌కు 162 ఏళ్లు.. మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్‌నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. -
తండ్రి హత్యపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
పుదుచ్చేరి: అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో ప్రమాదంలో పడిన ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కొందరు రాజీవ్‌గాంధీ హత్య, హంతకులపై మీ అభిప్రాయం చెప్పండి అని రాహుల్‌ను అడిగారు. దీంతో రాహుల్ గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. మా నాన్న హత్య చేసిన వారిని క్షమిస్తున్నా అని ప్రకటించారు. వారిపై (హంతకులు) తనకేం కోపం లేదని స్పష్టం చేశారు. ‘నా తండ్రిని కోల్పోయాను. అది అత్యంత కఠిన కాలం. కాకపోతే నాకు ఎవరిపై కోపం లేదు. మీకు ఎవరైనా గుండెకోత కలిగిస్తారో.. నాకు అంతకంటే ఎక్కువగా బాధ ఉంది. అయినా కూడా నాకు ఎవరిపై కోపం లేదు. వారిని క్షమిస్తున్నా. నా తండ్రి నాలో ఉన్నాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పాల్గొన్నారు. అనంతరం పుదుచ్చేరిలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, అకస్మాత్తుగా రాత్రికి రాత్రి గవర్నర్ మార్పు అంశాలపై స్పందించారు. అనంతరం తమిళనాడులో కూడా రాహుల్ పర్యటించారు. తమిళ రాజకీయాలపై స్పందించారు. -
మరో పవర్ఫుల్ పాత్ర: ఇందిరాగాంధీగా కంగనా
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్లో సత్తా చాటుతున్న నటి కంగనా రనౌత్. ఇప్పటికే పలు సినిమాలు చేసి హీరోలకు గట్టి పోటీనిచ్చిన కంగనా ఇప్పుడు మరో పవర్ఫుల్ పాత్రలో కనపించనుంది. దేశ తొలి మహిళా ప్రధానమంత్రి.. ఉక్కు మహిళ (ఐరన్ లేడీ)గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించనుంది. దానికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే కంగనాపై ఫొటోషూట్ చేశారు. ఇందిరాగాంధీ లుక్‌లో కంగనా మెరిశారు. ఇందిరాగాంధీ మాదిరి హెయిర్ స్టైల్, వస్త్రధారణ కంగనాకు సెట్టయ్యింది. ఆమె జీవితంలో ఉన్న ప్రధాన అంశం ఇతివృత్తంగా సినిమా రూపుదిద్దుకుంటుందని మీడియాలో వార్తలను నిజం చేస్తూ కంగనా ప్రకటించింది. తన స్నేహితుడు సాయి కబీర్‌తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కంగనా సంతోషం వ్యక్తం చేసింది. మణికర్ణిక తీసిన బృందమే ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది జీవిత చరిత్ర కాదని.. ఇందిరాగాంధీ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ కూడా పూర్తయ్యింది. ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్‌బహదూర్ శాస్త్రిలు కూడా కనిపించనున్నారు. మరి వారి పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారో ఇంకా తెలియదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించి మెప్పించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. జయలిలత పాత్రకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా నటించి మెప్పించింది. Kangana will essay the role of former Prime Minister Indira Gandhi in an upcoming political drama. "The script is in final stages. It is not a biopic but it is a grand period film that will help my generation to understand (the) socio-political landscape of current India." pic.twitter.com/0Ln3Pwtwa0 — Kangana Ranaut Daily (@KanganaDaily) January 29, 2021 -
నాన్నకు ప్రేమతో.. రాహుల్ గాంధీ
నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తండ్రి జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీకి భవిష్యత్తు మీద ఉన్న విజన్ చాలా గొప్పది. అంతకంటే ఆయన ఓ గొప్ప మనసున్న వ్యక్తి.. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి నా తండ్రి అయినందుకు, అలాంటి వ్యక్తికి కుమారుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను చాలా లక్కీ. ఈరోజు, ప్రతిరోజు మిమ్మల్ని మిస్సవుతున్నాం. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (ఇంకెంత కాలం జాప్యం..!) Rajiv Gandhi was a man with a tremendous vision, far ahead of his times. But above all else, he was a compassionate and loving human being. I am incredibly lucky and proud to have him as my father. We miss him today and everyday. pic.twitter.com/jWUUZQklTi — Rahul Gandhi (@RahulGandhi) August 20, 2020 అలాగే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఇక 1944 ఆగష్టు 20న ముంబైలో జన్మించిన రాజీవ్ గాంధీ 1984లో 6వ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు... అతి చిన్న వయసులోనే(40) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 1989 డిసెంబర్ 2 వరకు ప్రధానిగా రాజీవ్ గాంధీ పని చేశారు. ఆ తర్వాత మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) జరిపిన ఎన్నికల ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజును 'సద్భావన దివాస్' గా జరుపుతున్న విషయం తెలిసిందే. (గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు) On his birth anniversary, tributes to former Prime Minister Shri Rajiv Gandhi Ji. — Narendra Modi (@narendramodi) August 20, 2020 -
ఇంకెంత కాలం జాప్యం..!
సాక్షి, చెన్నై: ఇంకెంత కాలం జాప్యం చేస్తారు..? తీర్మానంపై నిర్ణయం వెలువడేదెప్పుడో? అని రాజీవ్ హత్యకేసు నిందితుల విడుదల వ్యవహారంలో రాజ్‌భవన్ తీరుపై మద్రాసు హైకోర్టు అసంతప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోకుండా రాష్ట్రగవర్నర్ చేస్తున్న జాప్యంపై హైకోర్టు బుధవారం స్పందించడం గమనార్హం. రాజీవ్ హత్యకేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్‌తో సహా ఏడుగురి ఉరి శిక్ష యావజ్జీవంగా మారిన విషయం తెలిసిందే. ఆ శిక్షా కాలం ముగిసినా తాము జైలుకే పరిమితం కావడంతో విడుదల చేయాలని కోరుతూ నింథితులు కోర్టుల్ని ఆశ్రయిస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. వీరి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా, అది రాజ్ భవన్‌కే పరిమితం అయింది. దీంతో తమను విడుదల చేసే రీతిలో గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని మళ్లీ కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం శూన్యం. చివరకు బంతి రాజ్ భవన్ కోర్టులో పడింది. ఈ వ్యవహారంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఇచ్చే నివేదిక మీద విడుదల ఆధార పడి ఉన్నది. అదే సమయంలో శిక్షాకాలం ముగిసినా, జైలులోనే జీవితాలు మగ్గుతున్నాయంటూ నళిని దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సమయంలో అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ కోర్టుకు ఇచ్చిన వివరణ సర్వత్రా షాక్‌కు గురి చేసింది. తమిళనాడు ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడో తిరస్కరించినట్టు వివరిస్తూ, దీని విలువను ‘సున్న’ గా పరిగణించాలని వాదించడం చర్చకు దారి తీసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ తీర్మానం గురించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు పలు మార్లు సిఫారసు చేస్తూ వస్తున్నా, స్పందన అన్నది కరువే. ఈ తీర్మానం చేసి రెండేళ్లు కావస్తున్నా, ఇంత వరకు రాజ్ భవన్ నుంచి తీర్మానం ఆమోదం లేదా తిరస్కరణ అన్న నిర్ణయం కూడా వెలువడ లేదు. మనస్తానికి లోనైన నళిని జైలులో ఆత్మహత్యాయత్నం కూడా చేయక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో జాప్యంపై హైకోర్టు సైతం అసంతప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. జాప్యంపై అసంతప్తి.. రాజీవ్ కేసు నిందితుల్లో ఒకడైన పేరరివాలన్‌కు 90 రోజులు పరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తల్లి అర్బుదమ్మాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు కపాకరణ్, వేలుమణి బెంచ్‌ముందు విచారణకు వచ్చింది. ఇప్పటికే 2017, 2019లో పేరరివాలన్‌కు పెరల్ మంజూరు చేసి ఉన్నట్టు, ప్రస్తుతం చేసుకున్న విజ్ఞప్తి పరిశీలనలో ఉన్నట్టు ప్రభుత్వం తరపున వాదన కోర్టుకు చేరింది. ఈసందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ, రాజీవ్ కేసు నింథితుల విడుదల తీర్మానం ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ తీర్మానం మీద నిర్ణయంలో జాప్యం ఎందుకో అని ప్రశ్నించారు. ఇంకెంత కాలం జాప్యం చేస్తారోనని పేర్కొంటూ, అసంతప్తిని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. ఈ తీర్మానం మీద ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోకుండా తుంగలో తొక్కి పెట్టి ఉండటం మీద అసహనం వ్యక్తంచేస్తున్నట్టు పేర్కొన్నారు.ప్రభుత్వం, మంత్రి వర్గం తీర్మానం మీద ఏదో ఒక నిర్ణయం ప్రకటించడంలో ఇంకెంత కాలం జాప్యం చేస్తారో? అని ప్రశ్నించారు. రాజకీయ శాసనాల మేరకు కీలక పదవిలో ఉన్న వారి మీద ఉన్న నమ్మకంతో నిర్ణయానికి గడువు అన్నది విధించ లేదని, దీనిని ఆసరగా చేసుకుని జాప్యం చేయడం శోచనీయమని అసంతప్తిని వ్యక్తం చేశారు. ఆ తీర్మానం ఎంత వరకు వచ్చిందో అన్న అంశంతో పాటుగా పెరోల్ విషయంగా వారంలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 29వ తేదికి వాయిదా వేశారు. కాగా, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ తీర్మానం ఆమోదం లేదా, తిరస్కరణ విషయంలో గవర్నర్ స్పందించేనా, రాజ్ భవన్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చేనో అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
‘నాన్న నాకు ఇచ్చిన బహుమతులు ఇవే’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా నివాళులర్పించారు. ‘నాన్నతో నా చివరి ఫోటో’ అంటూ తండ్రితో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. తన 19వ ఏట రాజీవ్ గాంధీతో కలిసి ఈ ఫోటో దిగారు ప్రియాంక. ‘మీ మీద దయ లేని వారి పట్ల కూడా మీరు దయతో ఉండండి. జీవితం అన్యాయంగా ఉంటుందని మీరు ఊహించుకున్నప్పటికి.. అది చాలా న్యాయంగానే ఉంటుంది. కటిక చీకటిలో, ఉరములు మెరుపులలో కూడా మీ ప్రయాణం కొనసాగిస్తూనే ఉండండి. ఎంతటి కష్టం అయినా రానివ్వండి.. మీ హృదయాన్ని మాత్రం ప్రేమతో బలంగా తయారు చేసుకొండి. నా తండ్రి జీవితం నాకిచ్చిన బహుమతులు ఇవే’ అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. To be kind to those who are unkind to you; to know that life is fair, no matter how unfair you imagine it to be; to keep walking, no matter how dark the skies or fearsome the storm; .. 1/2 pic.twitter.com/pQpwFfTqIE — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 21, 2020 కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించింది. రాజీవ్‌కు సంబంధించిన ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది. ‘యువ భారతం నాడీ తెలిసి వ్యక్తి. మనల్ని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు నడిపించిన వ్యక్తి. యువత, వృద్ధుల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తి.. అంతేకాకుండా అందరిచేత ప్రేమించబడ్డ వ్యక్తి’ అని పేర్కొంది. మరోవైపు రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నాయి. (‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం) -
తండ్రిని స్మరిస్తూ.. ప్రియాంక భావోద్వేగం
న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ ఓ భావోద్వేగపూరిత సందేశాన్ని ట్వీట్ చేశారు. ‘మా నాన్న నాకు ఎప్పుడు ఒకటే చెప్పేవారు. మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే.. జనాల కష్టాలు తెలుసుకుంటూ చిరునవ్వుతో ముందుకు సాగిపో’ అంటూ తండ్రితో కలిసి ఉన్న ఫోటోతో పాటు ఓ కవితను కూడా ట్వీట్ చేశారు. ప్రియాంక చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. From my father, I learned how to listen to people’s stories and find a place in my heart for them no matter how contrary to mine they might be. From him, I learned how to keep smiling and keep walking no matter how difficult the path might be.#RajivGandhi75 #SadbhavanaDiwas pic.twitter.com/O4W8d9cUL5 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 20, 2019 రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రియాంక. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నా తండ్రి నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇతరుల కష్టాలను విని హృదయంతో స్పందిచడం.. ఎంత కష్టమైనప్పటికి నచ్చిన మార్గంలో పయనించడం వంటి లక్షణాలను నా తండ్రి నుంచే అలవర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ తన తండ్రిని ఉద్దేశిస్తూ.. ‘గొప్ప వీరుడు మాత్రమే కాక గొప్పగా ప్రేమించే తండ్రి’ అంటూ ట్వీట్ చేశారు. -
రాజీవ్‌కు ప్రధాని మోదీ, సోనియా నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్‌భూమిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్ వేదికగా ఆయనను స్మరించుకున్నారు. దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో రాజీవ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు గాంధీ భవన్లో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమజిగూడలో ఆయన విగ్రహానికి పూలవేసి నివాళులు అర్పిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు -
రాజీవ్ గాంధీపై వివాదాస్పద ట్వీట్
సాక్షి, బెంగళూరు: మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ నాథూరం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏడో విడత ఎన్నికల్లో అవే వ్యాఖ్యలను ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా చేసుకుని.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. గాడ్సే స్వతంత్ర దేశంలో తొలి హిందూ తీవ్రవాదిగా కమల్ వ్యాఖ్యానించగా.. గాంధీని హత్యచేసిన గాడ్సే దేశ భక్తుడని భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని గాడ్సేతో పోల్చుతూ కర్ణాటక బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కాటిల్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘‘నాథూరాం గాడ్సే కేవలం మహాత్మ గాంధీని మాత్రమే హత్య చేశాడు. ఉగ్రవాది అజ్మల్ కసబ్ ముంబై దాడుల్లో 72 మృతికి కారణమైయ్యాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 17000 మందిని హత్య చేశారు. వీరిలో ఎవరు ప్రజల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించారో అర్థమవుతోంది’ అని ట్వీట్ చేశారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కుల ఊచకోతలో మూడు రోజుల్లో 3000 మంది అమాయక సిక్కులను హతమార్చినట్లు నళీన్ అభిప్రాయపడ్డారు. కాగా రెండు ఎంపీగా విజయం సాధించిన కాటిల్ ఈసారి దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే తీవ్ర విమర్శలు రావడంతో ట్విటర్ ఖాతానుంచి తొలిగించారు. -
‘మోదీకి కుటుంబం లేకనే ఎక్కడికీ వెళ్లట్లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరణంలో నేతల మాటలు తూటల్లా పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శల వరకు హద్దులు మీరుతున్నాయి. 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఘాటైన వ్యాఖ్యలతో స్పందించారు. ‘ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లడం సర్వసాధారణం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఆయన భార్య సోనియా గాంధీతో కలిసి వెళ్లారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం (భార్య) లేదు కాబట్టి ఎక్కడికీ వెళ్లడంలేదు. కేవలం ఆయనొక్కరే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు.’’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని చేసన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాజీవ్ కోసం ప్రత్యేకంగా విరాట్‌ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. #WATCH Anand Sharma, Congress on PM Modi's comment on INS Viraat: Any PM would do so but this PM has no family,if he had family then he would also be going there, but he goes alone because he has no connect with a family or any respect for family values. (09/05/2019) pic.twitter.com/N9sKN7iQ2D — ANI (@ANI) May 10, 2019 -
రాజీవ్ గాంధీ ప్రస్తావన ఎందుకో!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో తరచు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన కుమారుడు రాహుల్ గాంధీ పదే పదే రఫేల్ యుద్ధ విమానాల స్కామ్ గురించి ప్రస్తావిస్తున్నందుకు ప్రతిగా రాజీవ్ గాంధీ గురించి ప్రస్తావిస్తున్నారా ? అదే నిజమైతే ‘బోఫోర్స్’ ముడుపుల స్కామ్‌కు మాత్రమే పరిమితం కావాలి? ఆ స్కామ్ కారణంగానే ఆయన ప్రధాని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ నరేంద్ర మోదీ తాజాగా ఆరోపించారు. నాడు రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా వెంటనే నాటి మేటి పార్లమెంట్ సభ్యులు అటల్ బిహారి వాజపేయి, భూపేశ్ గుప్తా, జైపాల్ రెడ్డి, ఇంద్రజిత్ గుప్తాలు ఎండగట్టేవాళ్లు. వాళ్లే కాకుండా నాడు బీజేపీ కూడా ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకలో ఎందుకు వెళ్లారని రాజీవ్ గాంధీని ప్రశ్నించలేదు. కాకపోతే అందులో లక్ష్యదీవులకు వెళితే ఎవరిని అతిథులుగా తీసుకెళ్లారంటూ అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి కష్ణలాల్ శర్మ ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్‌ను తీసుకెళ్లారంటూ ఆయనే ఆ తర్వాత పేరు వెల్లడించారు. రాజీవ్ గాంధీ 1987, డిసెంబర్ నెలలో లక్షదీవుల్లో జరిగిన ‘ఐలాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ’ అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆయనతోపాటు ఆయన భార్య సోనియా గాంధీ కూడా వెళ్లారు. నాడు ఆయన కోసం ప్రత్యేకంగా విరాట్‌ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ కూడా ఇచ్చారు. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. నాడు నౌకలోఉన్న పలువురు నౌకాదళం అధికారులు కూడా మోదీ ఆరోపణలను ఖండించారు. రాజీవ్ తన అధికార పర్యటనలకు సోనియా గాంధీని వెంట తీసుకెళ్లేవారు. ఇక విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఆయన తన పిల్లలలోపాటు అజితాబచ్చన్, అమితాబ్‌బచ్చన్, వారి పిల్లలకు ఎక్కువగా తీసుకెళ్లేవారు. వారంతా ఎక్కువగా ఇటలీకే వెళ్లేవారు. మెర్సిడెస్ బెంచీ లాంటి లగ్జరీ కార్లను నడుపుకుంటే తిరిగే అలవాటున్న రాజీవ్ వ్యక్తిగత పర్యటనలకు ప్రత్యేక విమానాలనుగానీ, నౌకలనుగానీ ఏనాడు ఉపయోగించలేదు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం మంచి చెడుల ప్రస్తావన పక్కన పెడితే ఆయన కృషి కారణంగానే దేశానికి కంప్యూటర్లు, సెల్ఫోన్లు వచ్చాయి. అదే కంప్యూటర్ను ఉపయోగించి నాడు రాజీవ్ గాంధీ లక్షదీవులకు విహార యాత్రకు వెళ్లారా, లేదా ? అన్న విషయాన్ని నేడు సులువుగానే తెలుసుకోవచ్చు. నేడు దేశాన్ని కరువు, కాటకాలు, మంచినీటి సమస్య, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న అంతర్జాతీయ చమురు ధరలు, పర్యావరణం లాంటి ఎన్నో సమస్యలు పీడిస్తుండగా రాజకీయ నేతలు వ్యక్తిగత, కుటుంబ దూషణలకు దిగడం ఏమిటో !? -
‘ఇంత పిరికి ప్రధానిని ఎన్నడూ చూడలేదు’
ప్రతాపగఢ్/జౌన్పూర్: నరేంద్ర మోదీ కన్నా పిరికి, బలహీన ప్రధానిని తానెప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్, జౌన్పూర్ల్లో ప్రియాంక గురువారం ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఈయన (మోదీ) కన్నా ఎక్కువగా భయపడే, బలహీన ప్రధానిని నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక అన్నారు. మాజీ ప్రధాని, ప్రియాంక తండ్రి దివంగత రాజీవ్ గాంధీపై మోదీ ఇటీవల పలు ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. బుధవారం మోదీ మాట్లాడుతూ యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ తన వ్యక్తిగత ట్యాక్సీలా ఉపయోగించుకుని అందులో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారని మోదీ అన్నారు. ఆ మరుసటిరోజే ప్రియాంక మాట్లాడుతూ ‘నెరవేర్చని హామీలపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. విపరీత ప్రచారం, ప్రముఖ టీవీ కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లో బలం రాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతం. ఆ ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించే శక్తి ఉండాలి. ప్రతిపక్షం ఏం చెబుతుందో వినే శక్తి ఉండాలి. మరి ఈ ప్రధాని మన మాటలు చెవికెక్కించుకోవడం అటుంచితే, ఆయనకు సరిగ్గా సమాధానం చెప్పడం కూడా రాదు’ అని ప్రియాంక అన్నారు. తన ప్రచారాలతో మోదీ వాస్తవాలను కప్పిపుచ్చి, అంతా బ్రహ్మాండం, అద్భుతమని నమ్మిస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. -
అది సరే.. రఫేల్ సంగతేంటి?
సిర్సా(హరియాణా)/బినా(మధ్యప్రదేశ్)/ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని అవినీతిపరుడంటూ విమర్శలు చేస్తున్న ప్రధాని మోదీ రఫేల్ ఒప్పందంలో ఏం చేసిందీ ప్రజలకు వెల్లడించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీ, హరియాణాలోని సిర్సా, మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘మీరు నా గురించి, రాజీవ్ గురించి నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు. కానీ, ముందుగా రఫేల్ ఒప్పందం, యువతకు 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ చేసిన హామీ అమలు విషయం ఏం చేశారో చెప్పండి’ అని మోదీని నిలదీశారు. ‘రైతులకు మద్దతు ధర ఇచ్చారా? ప్రజల బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున జమ చేశారా?’ అంటూ గత ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలను రాహుల్ గుర్తు చేశారు. ‘తనకు 56 అంగుళాల ఛాతీ ఉందంటూ గొప్పలు చెప్పుకునే మోదీ రైతులు, నిరుద్యోగ యువత గురించి ఈ ఎన్నికల్లో మాట్లాడటం లేదు’ అని దెప్పిపొడిచారు. ‘గత ఐదేళ్లలో మీరు ఏం చేశారు? దేశానికి మీరు ఏమిచ్చారో మోదీ చెప్పాలి’అని అన్నారు. తన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఏమీలేకనే గతంలో జరిగిన విషయాలపై మోదీ మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘మీరు ఏం చేశారు? ఏం చేయగలరు? అనేది తెలుసుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ప్రధానిగా ఎన్నుకున్నారు తప్ప ఇతరులు ఏం చేశారో మీరు చెబుతారని కాదు’ అని పేర్కొన్నారు. పకోడీలను అమ్ముకోవడం కూడా మంచి ఉద్యోగమేనన్న ప్రధాని వ్యాఖ్యలపై ఆయన.. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల గురించి మాట్లాడే మోదీ పకోడీలతో ముగిస్తారు’ అంటూ ఎద్దేవా చేశారు. హరియాణా, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్.. ఇలా మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో విద్వేషం నూరిపోస్తుంటారని రాహుల్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో రైతులకు అమలు చేసిన రుణమాఫీ ద్వారా బీజేపీ నేతలు కూడా లబ్ధిపొందారని చెప్పారు. బీజేపీకి, మోదీకి వీడ్కోలు చెప్పాల్సిన సమయం దగ్గరపడిందని తెలిపారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు కనీసం ఆదాయం కల్పించే న్యాయ్ పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం నిధుల్లో ఒక్క నయా పైసా కూడా మధ్యతరగతి, లేదా ఇతరుల నుంచి వసూలు చేయబోం. మోదీ హయాంలో అతిగా లాభపడిన పారిశ్రామిక వేత్తల నుంచి ఈ పథకానికి అవసరమైన నిధులను రాబడతాం’ అని అన్నారు. కాగా, ఢిల్లీలో మోదీని ఓడించే సత్తా ఆప్‌కు లేదని, కాంగ్రెస్‌కే అది సాధ్యమవుతుందని ఢిల్లీలో ప్రచారసభలో రాహుల్ అన్నారు. -
రాజీవ్ ఆదేశాలతోనే సిక్కుల ఊచకోత
న్యూఢిల్లీ: 1984లో సిక్కులను ఊచకోత కోయాలని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నపుడు ప్రధాని కార్యాలయం(పీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చాయని బీజేపీ గురువారం సంచలన ఆరోపణ చేసింది. ఈ విషయం నానావతి కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపింది. అయితే నానావతి కమిషన్ రిపోర్టు మాత్రం బీజేపీ ఆరోపణలకు భిన్నంగా ఉండటం గమనార్హం. ప్రధాని ఇందిరాగాంధీని 1984 అక్టోబర్ 31న ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చిచంపడంతో ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దాదాపు 3,000 మంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ‘నానావతి’ రిపోర్టులో ఏముంది? సిక్కుల ఊచకోతపై 2000లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జీటీ నానావతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 2005లో సమర్పించిన ఈ నివేదికలో నానావతి కమిషన్ స్పందిస్తూ.. ‘సిక్కులకు గుణపాఠం చెప్పాలని రాజీవ్ అన్నట్లు వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యం లేదు. ఢిల్లీలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాజీవ్ కృషి చేశారు. ఇందిర హత్య అనంతరం ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు’ అని తెలిపింది. దమ్ముంటే ప్రజాసమస్యలపై పోరాడండి: కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రస్తుతం 2019 ఎన్నికలు జరుగుతున్నాయే తప్ప 1951, 1966, 1984 లోక్‌సభ ఎన్నికలు జరగడం లేదు. దమ్ముంటే నిజమైన ప్రజా సమస్యలపై పోరాడండి. మోదీ పెద్ద అబద్దాలకోరుగా మారిపోయారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషిగా తేలిన కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు గతేడాది డిసెంబర్లో యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
మోదీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిలో నంబర్ వన్ (భ్రష్టాచారి నెంబర్ వన్) అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కాగా తాజాగా సొంత పార్టీ నుంచి కూడా మోదీకి విమర్శలు ఎదురవుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ ఖండించారు. రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా చనిపోలేదని, ఎల్టీటీఈ ఆత్మహుతి దాడిలో చనిపోయారని, ఈ విషయం దేశ ప్రజలందరికి తెలుసని శ్రీనివాస్ అన్నారు. బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస ప్రసాద్ ‘రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ చంపేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. ఇటువంటి ఆరోపణలను ఎవరూ నమ్మరు. చివరికి నేను కూడా నమ్మను. మోదీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. రాజీవ్ చాలా చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారంటూ వాజ్‌పేయి లాంటి గొప్ప నాయకులే పొగిడారని శ్రీనివాస్ గుర్తు చేశారు.శ్రీనివాస ప్రసాద్ 6 సార్లు ఎంపీగా, వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా,ఒకసారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. -
ఢిల్లీ అమ్మాయిగా సవాల్ చేస్తున్నా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుని చివరి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలంటూ ప్రధాని మోదీ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజీవ్ కూతురు ప్రియాంక ప్రతిసవాల్ విసిరారు. ‘ఢిల్లీ అమ్మాయిగా సవాల్ చేస్తున్నా. జీఎస్టీ, నోట్లరద్దు, మహిళా భద్రత, యువతకిచ్చిన హామీలపై ప్రచారం చేస్తూ ఓట్లు అడగండి’ అని అన్నారు. ఢిల్లీలో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొని, ఈశాన్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు షీలా దీక్షిత్, బాక్సర్ విజేందర్ సింగ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాను చిన్నప్పటి నుంచి ఢిల్లీలో పుట్టిపెరిగిన దాన్ననీ, ఇక్కడి ప్రతి వీధీ తనకు తెలుసని, మోదీ కేవలం గత ఐదేళ్లుగా మాత్రమే ఢిల్లీలో ఉంటున్నారని ప్రియాంక అన్నారు. ‘నేను ఇదే నగరంలో పుట్టిపెరిగాను. మోదీ తన అధికారిక నివాసం దాటి ఢిల్లీలో ఇంకెక్కడా తిరగరు. నేను ప్రజలను అగౌరవించలేను. మేం బీజేపీలా పొగరుబోతులం కాదు. ఈ ప్రజల వల్లే మేం ఈనాడు ఈ స్థాయిలో ఉన్నాం’ అని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ నంబర్ 1 అవినీతిపరుడిగా మిగిలిపోయారనీ, ఆయన ప్రధానిగా ఉండగానే పలు కుంభకోణాలు జరిగాయంటూ మోదీ ఇటీవల ప్రచారంలో ప్రస్తావించడం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయగా, అవినీతిపరుడిని అలా అంటే తప్పేంటనీ, దమ్ముంటే ఆయన పేరు చెప్పుకుని కాంగ్రెస్ ఓట్లు అడగాలని మోదీ సవాల్ విసరడం తెలిసిందే. మతంతో వ్యవస్థల నాశనం.. ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ మోదీ అన్ని ప్రభుత్వ వ్యవస్థలను, సంస్థలను నాశనం చేస్తున్నారనీ, మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ హోంవర్క్ చేయడంలో విఫలమైన విద్యార్థి లాంటివారని చురకలంటించారు. పైగా పండిట్ నెహ్రూ జవాబు పత్రం తీసుకున్నారని, ఇందిరాగాంధీ కాగితపు పడవ చేశారు లాంటి సాకులు చెబుతారని అన్నారు. ‘జాతీయవాదం గురించి బీజేపీ, మోదీ మాట్లాడతారు. ఈ దేశ యువతకు మంచి భవిష్యత్తును ఇవ్వడం జాతీయవాదం కాదా?’ అని ప్రశ్నించారు. ప్రచారం సందర్భంగా మాట్లాడుతున్న ప్రియాంక -
‘మోదీ ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’
కోల్కత్తా : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కాలంచెల్లిపోయిన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ మాతృభూమి కోసం తన జీవితాన్ని అంకితం చేయడమే కాదు, దేశం కోసం నేలకొరిగారు, అలాంటి వ్యక్తిపై ప్రధాని ఉపయోగించిన భాషను ఖండిస్తున్నానన్నారు. చదవండి : మోదీజీ మీ కర్మ ఫలితం దగ్గరలోనే ఉంది కాగా ఎన్నికల ప్రచారలంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ర్యాలీలో‘ రాజీవ్ గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ’ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మోదీ వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.