
కోల్‌కత్తా : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కాలంచెల్లిపోయిన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ మాతృభూమి కోసం తన జీవితాన్ని అంకితం చేయడమే కాదు, దేశం కోసం నేలకొరిగారు, అలాంటి వ్యక్తిపై ప్రధాని ఉపయోగించిన భాషను ఖండిస్తున్నానన్నారు.
చదవండి : మోదీజీ మీ కర్మ ఫలితం దగ్గరలోనే ఉంది
కాగా ఎన్నికల ప్రచారలంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ర్యాలీలో‘ రాజీవ్ గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ’ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మోదీ వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment