న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా నివాళులర్పించారు. ‘నాన్నతో నా చివరి ఫోటో’ అంటూ తండ్రితో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. తన 19వ ఏట రాజీవ్ గాంధీతో కలిసి ఈ ఫోటో దిగారు ప్రియాంక. ‘మీ మీద దయ లేని వారి పట్ల కూడా మీరు దయతో ఉండండి. జీవితం అన్యాయంగా ఉంటుందని మీరు ఊహించుకున్నప్పటికి.. అది చాలా న్యాయంగానే ఉంటుంది. కటిక చీకటిలో, ఉరములు మెరుపులలో కూడా మీ ప్రయాణం కొనసాగిస్తూనే ఉండండి. ఎంతటి కష్టం అయినా రానివ్వండి.. మీ హృదయాన్ని మాత్రం ప్రేమతో బలంగా తయారు చేసుకొండి. నా తండ్రి జీవితం నాకిచ్చిన బహుమతులు ఇవే’ అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ.
To be kind to those who are unkind to you; to know that life is fair, no matter how unfair you imagine it to be; to keep walking, no matter how dark the skies or fearsome the storm; .. 1/2 pic.twitter.com/pQpwFfTqIE
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 21, 2020
కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించింది. రాజీవ్‌కు సంబంధించిన ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది. ‘యువ భారతం నాడీ తెలిసి వ్యక్తి. మనల్ని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు నడిపించిన వ్యక్తి. యువత, వృద్ధుల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తి.. అంతేకాకుండా అందరిచేత ప్రేమించబడ్డ వ్యక్తి’ అని పేర్కొంది. మరోవైపు రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నాయి. (‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం)
Comments
Please login to add a commentAdd a comment