
ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
(ఇది చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం)
అయితే.. గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది.