Comedian Geeta Singh's Son Died In a Road Accident - Sakshi
Sakshi News home page

Geeta Singh: కితకితలు హీరోయిన్‌ గీతాసింగ్‌ కుమారుడు మృతి!

Published Sat, Feb 18 2023 8:23 AM | Last Updated on Sat, Feb 18 2023 10:27 AM

Comedian Geeta Singh Son Died In Road Accident - Sakshi

ప్రముఖ లేడీ కమెడియన్‌, కితకితలు హీరోయిన్‌ గీతాసింగ్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 'దయచేసి కారులో అయినా, బైక్‌పై అయినా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కమెడియన్‌ గీతాసింగ్‌ అబ్బాయి యాక్సిడెంట్‌ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఓ శాంతి' అని కల్యాణి ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొంది. ఈ పోస్టుపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ నటి కుమారుడి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా గీతాసింగ్‌ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటోంది.

చదవండి: కథ వెనుక కథ టీజర్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement