లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న నటి కంగనా రనౌత్. ఇప్పటికే పలు సినిమాలు చేసి హీరోలకు గట్టి పోటీనిచ్చిన కంగనా ఇప్పుడు మరో పవర్‌ఫుల్ పాత్రలో కనపించనుంది. దేశ తొలి మహిళా ప్రధానమంత్రి.. ఉక్కు మహిళ (ఐరన్ లేడీ)గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించనుంది. దానికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే కంగనాపై ఫొటోషూట్ చేశారు. ఇందిరాగాంధీ లుక్‌లో కంగనా మెరిశారు. ఇందిరాగాంధీ మాదిరి హెయిర్ స్టైల్, వస్త్రధారణ కంగనాకు సెట్టయ్యింది.
ఆమె జీవితంలో ఉన్న ప్రధాన అంశం ఇతివృత్తంగా సినిమా రూపుదిద్దుకుంటుందని మీడియాలో వార్తలను నిజం చేస్తూ కంగనా ప్రకటించింది. తన స్నేహితుడు సాయి కబీర్‌తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కంగనా సంతోషం వ్యక్తం చేసింది. మణికర్ణిక తీసిన బృందమే ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది జీవిత చరిత్ర కాదని.. ఇందిరాగాంధీ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ కూడా పూర్తయ్యింది.
ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్‌బహదూర్ శాస్త్రిలు కూడా కనిపించనున్నారు. మరి వారి పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారో ఇంకా తెలియదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించి మెప్పించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. జయలిలత పాత్రకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా నటించి మెప్పించింది.
Kangana will essay the role of former Prime Minister Indira Gandhi in an upcoming political drama.
— Kangana Ranaut Daily (@KanganaDaily) January 29, 2021
"The script is in final stages. It is not a biopic but it is a grand period film that will help my generation to understand (the) socio-political landscape of current India." pic.twitter.com/0Ln3Pwtwa0
Comments
Please login to add a commentAdd a comment