Watch: Kangana Ranaut Emergency Movie Official Teaser Out Now, Video Inside - Sakshi
Sakshi News home page

Emergency Teaser: ఇందిరాగాంధీ పాత్రలో కంగన..‘ఎమర్జెన్సీ’ టీజర్‌ చూశారా?

Published Sat, Jun 24 2023 3:49 PM | Last Updated on Sat, Jun 24 2023 4:25 PM

Kangana Ranaut Emergency Movie Teaser Out Now - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో కంగన .. ఇందిరా గాంధీ పాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తూ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25, 1975 తేదీతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇందిరా ఈజ్ ఇండియా..ఇండియా ఈజ్‌ ఇందిరా అనే డైలాగ్‌లో టీజర్‌ ముగుస్తుంది.  

(చదవండి: 48 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కమెడియన్‌)

1975 నుంచి 1977 వరకు దేశంలో విధించిన ‘అత్యవసర పరిస్థితి’ నేపథ్యంలో ఎమర్జెనీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్‌ని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘రక్షకుడా లేక నియత? మన దేశ లీడర్ తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన రోజు చరిత్రలోనే చీకటి రోజుగా ఉంది’అని రాసుకొచ్చింది. కాగా ఈ సినిమా నవంబర్ 24న థియేటర్స్‌లో విడుదల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement