'ఆ రోజే ఎమర్జన్సీ'.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది! | Kangana Ranaut Starrer Emergency Will Be Release On This Date | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: కంగనా రనౌత్‌ 'ఎమర్జన్సీ'.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Tue, Jan 23 2024 3:29 PM | Last Updated on Tue, Jan 23 2024 4:14 PM

kangana Ranaut Lead Role Movie Emergency Will Be Release On This Date - Sakshi

గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌. ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‍కంగనా దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించనున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు కంగనా రనౌత్ ట్వీట్‌ చేసింది. ఆమె ట్విటర్‌లో రాస్తూ.. 'ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ఎమర్జెన్సీ రిలీజ్‌ అవుతుంది. చరిత్ర మరోసారి కళ్ల ముందుకురానుంది' ట్వీట్‌లో రాసుకొచ్చింది.  కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement